1, ఫిబ్రవరి 2021, సోమవారం

సప్తపది

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                      *సప్తపది!*

                     ➖➖➖✍️


మూడు ముళ్ల బంధానికి, ఏడు అడుగులకు ఉన్న సంబంధమేంటి ?


సాధారణంగా హిందు వివాహ సాంప్రదాయంలో వివాహ సమయంలో దంపతుల చేత ఏడు అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ ఏడు అడుగులనే సప్తపది అంటారు. సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక్కో అర్థముందంటారు మన పెద్దలు.

ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటిగా చేస్తుంది వివాహం. పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పురోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి , తమ కన్నబిడ్డను ధర్మార్ధ, కామ, మోక్షాలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు. వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి , పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది.


వివాహ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వధువరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికిన వేలును వరుడు పట్టుకునీ అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్నే సప్తపది అంటారు. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. 

పురోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.


"సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం!"


ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం. అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు. మరి ఏడు అడుగుల వెనుక దాగున్న పరమార్థాలేంటో తెలుసుకుందాం...


మొదటి అడుగు:

*"ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు"*


ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక!"


రెండవ అడుగు..

*"ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు"*


ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక


మూడవ అడుగు:

*త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.


నాలుగవ అడుగు:

*"చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.


ఐదవ అడుగు:

*"పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.


ఆరవ అడుగు:

*"షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు"* 

ఈ ఆరవ అడుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.


ఏడవ అడుగు:

*"సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక. 

మొత్తం జీవితానికి అవసరమయిన అంశాలన్నింటిని ఈ ఏడు అడుగుల్లోకి ఇమిడ్చి ప్రామాణికంగా రూపొందించడాన్నే సప్తపది అని అంటారు.✍️


                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

చిట్టికథ

 ✍️...నేటి చిట్టికథ




చిన్నపాటి అవసరం కోసం ఎంతటి మహావృక్షాన్నయినా కొట్టిపారేసే స్వార్థం మనిషిది.

 ఆ స్వార్థంతోనే పచ్చటి పుడమి కాస్తా ఎడారిగా మారిపోతోంది.


 రుతువులు సైతం గతి తప్పేలా భూమి సెగలు కక్కుతోంది. అందుకనే ‘భూమి కాపాడండి బాబులూ’ అంటూ స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.


 కానీ వేల ఏళ్ల క్రితమే మహాభారతంలో పర్యావరణం విలువని గుర్తుచేసే కథ కనిపిస్తుంది.


 ఆ కథ ప్రకారం...


అనగనగా కాశీరాజ్యంలో ఓ వేటగాడు ఉండేవాడు. అతను తన బాణాలకి విషం రాసి వాటితో జంతువులను వేటాడేవాడు. అలా ఓ రోజు వేటగాడు యథావిధిగా సమీపంలోని అడవికి చేరుకున్నాడు. అడవిలోపల అడుగుపెట్టగానే అతనికి లేళ్ల గుంపు కనిపించింది. వెంటనే వాటికి గురిచూసి బాణాలు వదిలాడు. వేటగాడి దురదృష్టమో, లేళ్ల అదృష్టమో కానీ అతని బాణాలన్నీ గురితప్పాయి. వాటిలో ఒక బాణం పోయి పోయి నేరుగా ఒక చెట్టులోకి దిగబడిపోయింది.


బాణం కొసకి విషం ఉండటం వల్ల చెట్టు మాడిపోవడం మొదలుపెట్టింది. చెట్టుకి ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి, పండ్లు చెట్టు మీదనే కుళ్లిపోయాయి, కాండం యావత్తూ ఎండిపోయింది


. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక నివాసం ఉంటోంది. తన చిన్నప్పటి నుంచీ ఆ చిలుక ఆ చెట్టులోనే ఉంటోంది. దానికి ఆ చెట్టంటే చాలా అభిమానం. దాంతో ఆ చెట్టుని వీడి పోయేందుకు దానికి మనసు ఒప్పలేదు. నిద్రాహారాలు లేకుండా ఆ తొర్రలోనే బాధపడుతూ కాలం గడపసాగింది చిలుక.


ఒకో రోజూ గడవసాగింది. కానీ చిలుక మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఆకలిదప్పులతో అలాగే కాలాన్ని వెళ్లదీస్తోంది. తన సుఖదుఖాలలో భాగమైన చెట్టు అలా మోడువారిపోవడం చూసి దానికి ఆకలే వేయడం లేదు. చెట్టు పట్ల చిలుకకి ఉన్న అభిమానం ఇంద్రుడి వరకూ పాకింది. దాంతో స్వయంగా ఆయనే మానవరూపాన్ని ధరించి చెట్టు దగ్గరకు వచ్చాడు.


‘నీకు నీడనిచ్చిన చెట్టు పట్ల చూపిస్తున్న విశ్వాసం అనితర సాధ్యం. కానీ మోడువారిన చెట్టునే ఆశ్రయించి పచ్చటి నీ జీవితాన్ని ఎందుకు పాడుచేసుకుంటావు. ఈ చెట్టు మీద ఉంటే నీకు పండ్లు కాదు కదా, ఆకులు కూడా దక్కవు. ఈ విశాలమైన అడవిలో నువ్వు జీవనం సాగించేందుకు మరో చెట్టే దొరకలేదా! నా మాట విని అందవిహీనంగా మారిన ఈ చెట్టుని వీడి మరో చోటు చూసుకో’ అని సూచించాడు.

 

తన దగ్గరకి మనిషిరూపంలో ఉన్నవాడు ఇంద్రుడని చిలుక గ్రహించింది. దాని ఆత్మసౌందర్యం స్వచ్ఛమైంది కదా! అందుకే- ‘అయ్యా! మీరు ఇంద్రుడన్న విషయం నాకు తెలుసు. కానీ నేను ఈ చెట్టుని వీడే ప్రసక్తే లేదు. ఈ చెట్టు మీదనే నేను పుట్టాను, దీని మీదే నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఈ చెట్టు నన్ను కన్నబిడ్డలా, కంటికిరెప్పలా కాపాడుకుంది. ఎండావానల నుంచి, ఆకలిదప్పుల నుంచి, శత్రువుల చూపు నుంచి నన్ను రక్షించింది. ఇలాంటి చెట్టుని కష్టకాలంలో వీడి నేను ఎక్కడికి పోగలను. మనుషులు సంశయంలో ఉంటే దేవతలు వారిని సమాధానపరుస్తారు. కానీ మీరు దేవతలై ఉండి కూడా నా నిశ్చయాన్ని మార్చాలని ఎందుకు చూస్తున్నారు!’ అని చెప్పుకొచ్చింది.

 


చిలుక నిబద్ధతకి, విశ్వాసానికీ ఇంద్రుడికి నోటమాటరాలేదు. ‘నీలాంటి చిన్న జీవికి కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. నీ నేస్తం పట్ల విశ్వాసానికి మెచ్చాను. ఏదన్నా వరాన్ని కోరుకో!’ అంటూ అభయమిచ్చాడు.

‘అయ్యా! దయచేసి నన్నూ ఈ చెట్టునీ వేరుచేయకండి. మీరు నిజంగా ఏదన్నా వరాన్ని ప్రసాదించాలనుకుంటే... ఈ చెట్టు మళ్లీ చిగురించేలా... పండ్లు, పుష్పాలతో కళకళలాడేలా దీవించండి,’ అంటూ వేడుకొంది.


చిలుక మాటలకి మురిసిన ఇంద్రుడు ఓ నాలుగు చుక్కల అమృతాన్ని ఆ చెట్టు మీద చిలకరించగానే... అది మళ్లీ జీవం పోసుకొంది. 



ఒక చెట్టుని ఆశ్రయించి బతికే చిలుకకే ఇంత విశ్వాసం ఉంటే.... భూమిలోని అణువణువు మీదా ఆధారపడే మనిషికి ఇంకెంత విశ్వాసం ఉండాలి ..



🍁🍁🍁🍁🍁

త్రిజట

 *📖 మన ఇతిహాసాలు 📓*



*త్రిజట*



*రామాయణం*


వాల్మీకి రాసిన అసలు రామాయణంలో, త్రిజను రెండు సంఘటనలలో ఎక్కువగా కనిపించే వృద్ధ రాక్షసి (దెయ్యం) గా అభివర్ణించారు. మొదటిది ఇతిహాసం యొక్క ఐదవ భాగమైన సుందర కాండ జరుగుతుంది. అపహరణకు గురైన యువరాణి సీతను లంకలోని అశోక వాటిక లో ఉంచారు . లంక యొక్క రాక్షస-రాజు,రావణుడు ,తన భర్త రాముడికి నమ్మకంగా ఉంటూ తనని మొండిగా కాదంటున్న సీతకు కాపలాగా ఉండే రాక్షసనులకి ఎలాగైనా సీతను తనతో పెళ్ళికి ఒప్పించమని ఆఆజ్ఞాపించాడు . రావణుడు వెళ్లిన తరువాత, ఎలాగైనా సీత నిర్ణయాన్ని మార్చుకోమని రాక్షసులు సీతను వేధించడం మొదలుపెడతారు. వృద్ధురాలైన త్రిజట జోక్యం చేసుకుని, రావణుని మరణాన్ని మరియు రాముడి విజయాన్ని చూపిన తన కల గురించి వివరించింది . 


తన కలలో, త్రిజట రాముడు మరియు అతని సోదరుడులక్ష్మణుడు ఖగోళ ఏనుగుఐరావతం పైన సీత వైపు స్వారీ చేయడాన్ని చూస్తాడు. రాముడు సీతను తన ఒడిలో తీసుకొని ఆకాశం అంత ఎత్తుకు పైకి లేచి, సీతను సూర్యుడిని, చంద్రుడిని తాకడానికి అనుమతిస్తాడు. అప్పుడు ముగ్గురూ లంకకు ప్రయాణించి,పుష్పక విమానము (రావణ వైమానిక రథం) లో ఉత్తరం వైపు ఎగరడాన్నీ మరియు ఆ సమయంలో రావణుడు నూనెలో తడిసి, ఎర్రటి రంగుతో నేలమీద పడుకున్నాడు. రావణుడు అప్పుడు గాడిదపై దక్షిణం వైపుకు వెళ్లి పేడ గొయ్యిలో పడతాడు. ఎర్ర చీరలో ఉన్న ఒక నల్లజాతి స్త్రీ అతన్ని దక్షిణానికి లాగుతుంది. రావణ కుటుంబంలోని ఇతర సభ్యులు, అతని సోదరుడు కుంభకర్ణుడు, కుమారుడు ఇంద్రజిత్తు వంటి వారు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొంటారు. రావణ సోదరుడు విభీషణుడు పుష్పక మానం దగ్గర నాలుగు దంతాల ఏనుగును నడుపుతూ ఠీవిగా తెల్లని వస్త్రాలలో కనిపిస్తాడు. లంక నగరం సముద్రంలో మునిగిపోతుంది మరియు రాముడి యొక్క ఒక కోతి ( వానరమ్ ) దూత నగరాన్ని కాల్చేస్తుంది.  త్రిజట రాక్షసులకు సీతను ఆశ్రయించాలని మరియు ఆమెకు క్షమాపణ చెప్పమని సలహా ఇస్తుంది ; త్రిజట కల నెరవేరితే, ఆమె తన రక్షా కాపలాదారులను రక్షిస్తుందని సీత వాగ్దానం చేసింది. 


రెండవ సంఘటన ఆరవ పుస్తకం యుద్ధ కాండ లో కనుగొనబడింది. రాముడు మరియు అతని సోదరుడు లక్ష్మణుడు వానర సైన్యంతో సీతను రాక్షస-రాజు బారి నుండి కాపాడటానికి వస్తారు. యుద్ధం యొక్క మొదటి రోజు, రావణ కుమారుడు ఇంద్రజిత్ నాగపాశం (పాము- నూస్ ) అనే ఆయుధంతో సోదరులను బంధిస్తాడు మరియు సోదరులు స్పృహ కోల్పోతారు. రావణుడు యుద్ధభూమిని చూడటానికి త్రిజట తో సీతను పంపుతాడు. తన భర్త చనిపోయాడని అనుకుంటూ, సీత విలపిస్తుంది, కాని త్రిజట రమా లక్ష్మణ సోదరులు ఇంకా బతికే ఉన్నారని భరోసా ఇస్తుంది . త్రిజట సీతపై తన ప్రేమను వ్యక్తం చేస్తుంది మరియు బందీగా ఉన్న సీత యొక్క "నైతిక స్వభావం మరియు సున్నితమైన స్వభావం" ఆమెను ప్రేమించమని బలవంతం చేసిందని చెబుతుంది. 



*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

Vitamin D

 Vitamin D is made by the body with sunlight.


Sesame seeds (til) have the highest calcium (975mg per 100g). Milk has 125mg only.


The body is capable of storing vitamin D up to a year, and use the reserves.


Lastly, the body is capable of getting its vitamin D reserves full with 3 full days of sunlight.


The best quality of sunlight is end of winter & beginning of summer.


Now join the dots, and see how wise our sages were in ancient India.


They created a festival of flying kites where by our kids get excited to go in the open, under direct sunlight, throughout the day starting from early morning. And their mothers feed them homemade TIL ladoos.


Are we not a fantastic culture 😊?


Makar Sankranti - the kite flying festival in India is on January 14th this year.

ప్రయాణం



ఒక వ్యక్తి  ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఓడ ప్రమాదానికి గురి అయింది. ఆ  ప్రమాదం నుంచి తప్పించుకుని  ఒక ద్వీపం దగ్గరకి చేరాడు.రోజూ భగవంతుడిని  ప్రార్థించుకుంటూ ఎవరైనా సహాయానికి కనబడతారేమో అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అతి కష్టంతో ఒక చిన్న గుడిసె కట్టుకున్నాడు. ఒక రోజు తినడానికి ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతూ  బయటికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్ళి చూస్తే కష్టపడి కట్టుకున్న చిన్న గుడిసెకి చితిమంట అంటుకుంది. పొగ ఆకాశం వైపు వెళుతోంది. చాలా  నిరుత్సాహంతో,కోపంతో ఏడుస్తూ  “ఎందుకు ఇలా చేసావు” అని భగవంతుడిని అడిగాడు.మర్నాడు పొద్దున్నే ఓడ హారన్ వినిపించింది. ఇక్కడ నేను ఉన్నట్టు ఎలా తెలిసింది అని ఓడలోని  వ్యక్తులను అడిగాడు. “ఆకాశం లో పొగని చూసి, ఇక్కడ ఎవరో ఉన్నారు అని వచ్చాము అన్నారు వాళ్ళు.  ఆ ఓడలో ప్రయాణం చేసి ఆ వ్యక్తి తన ఇంటికి చేరుకున్నాడు. 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *నీతి :* 

మనము అనుకున్నవి జరగనప్పుడు నిరుత్సాహ పడడం సహజం. మనం కష్టకాలంలో కూడా భగవంతుడిని నమ్ముకుని పూర్తి శరణాగతితో ఉంటే మనకి కావాల్సిన ధైర్యం, ఆలోచనా శక్తి , బలం అన్నీ  భగవంతుడు మనకి ఇస్తాడు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️☀️☀️☀️☀️☀️☀️☀️☀️🌼🌼🌼🌼🌼🌼🌼🌼

సులోచన

 *సులోచన సంసారం..*


ఒక శనివారం నాటి సాయంత్రం ఐదు గంటల వేళ.."పల్లకీసేవ ఏడు గంటలకు ప్రారంభం అవుతుందని మైక్ లో చెపుతున్నారు..అందులో ఆడవాళ్లు పాల్గొనవచ్చా?" అంటూ ఒక యువతి నన్ను అడిగింది.."పూజ వరకూ పాల్గొనవచ్చు..పల్లకీ మాత్రం ఆడవాళ్ళ చేత మోయనియ్యరు.." అని చెప్పాను.."ఓహో అలాగా..! " అని..ఒక్కక్షణం ఆలోచించుకుని.."నేనొక్కదానినే వచ్చానండీ..పల్లకీవద్ద పూజ చేయించుకుంటాను..నాకొక టికెట్ ఇప్పించండి.." అన్నది.."సరే నమ్మా.." అని చెప్పి..మా సిబ్బంది వద్దకు వెళ్లి టికెట్ తీసుకోమని చెప్పాను..


ఆరోజు సాయంత్రం ఏడు గంటలకు పల్లకీసేవ లో ఆ యువతి పాల్గొన్నది..పూజారి గారికి తన గోత్రము..భర్తపేరు, తన పేరు..తన అత్త మామల పేర్లు తెలిపి అర్చన చేయించుకున్నది..పల్లకీసేవ వద్ద జరిగే పూజా కార్యక్రమాలు శ్రద్ధగా చూస్తూ..మధ్య మధ్య లో స్వామివారి ఉత్సవ మూర్తికి నమస్కారం చేసుకుంటూ ఉన్నది..పూజ అనంతరం పల్లకీ ని భక్తులు పల్లకీని మోసుకొని ఆలయం వెలుపల మూడు ప్రదక్షిణాలు చేసేటప్పుడు..పల్లకీ వెనకాల దత్తనామం స్మరిస్తూ..తానుకూడా ప్రదక్షిణాలు చేసింది..మొత్తం పల్లకీసేవ లో  అత్యంత భక్తిగా పాల్గొన్నది..


ప్రక్కరోజు ఆదివారం ఉదయం ప్రభాతసేవ ను కూడా మంటపం లో కూర్చుని భక్తిగా చూసింది..శ్రీ స్వామివారి సమాధికి అర్చకస్వాములు ఇచ్చే నక్షత్ర హారతి ని కళ్లకద్దుకొని..ఇవతలకు వచ్చేసింది..మరో గంట తరువాత..మా దంపతులము కూర్చుని ఉన్న చోటుకి వచ్చి నిలబడి.."మీతో కొద్దిగా మాట్లాడాలి..మీకెప్పుడు తీరిక అవుతుందో చెపుతారా..?" అని అడిగింది..మరో గంట వేచి ఉండమని చెప్పాను..మేము కూర్చున్న కుర్చీలకు వెనకాలే కొద్దీ దూరంలో నేల మీద పద్మాసనం వేసుకొని కూర్చుంది..


ఒక గంట తరువాత..స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల తాకిడి తగ్గిన తరువాత..ఆ యువతిని పిలిచాను..దగ్గరకు వచ్చింది.."అమ్మా..ఏదో మాట్లాడాలి అన్నావు కదా..ఇప్పుడు చెప్పుతల్లీ.." అన్నాను..


"మీ ఇద్దరినీ చూస్తుంటే..మా అమ్మానాన్న గుర్తుకొస్తున్నారు.." అని చెప్పి.."నాపేరు సులోచన..మాది నెల్లూరు..నాకు పెళ్లై ఏడేళ్లు అయింది..మా అత్తగారిది కూడా మంచి కుటుంబం..వాళ్లకూ మంచి పేరుంది..అది చూసే..మా నాన్నగారు ఈ సంబంధాన్ని ఒప్పుకున్నారు..అన్నీ బాగున్నాయి కానీ..మా వారికి తాగుడు వ్యసనం ఉంది...మనిషి మంచివాడే..నన్నూ బాగా చూసుకుంటాడు..వ్యాపారం కూడా బాగా చేస్తాడు..కానీ ఏం లాభం..రోజూ రాత్రికి తాగి ఇంటికొస్తాడు..మా పుట్టింట్లో కానీ..అత్తగారింట్లో కానీ..డబ్బుకు కొదవలేదు..అన్ని సౌకర్యాలూ ఉన్నాయి..కానీ ఈయన కున్న ఈ వ్యసనం తో నాకు మనఃశాంతి లేదు..ఇంతవరకూ సంతానం మాకు సంతానం లేదు..అందరు దేవుళ్లకూ మొక్కుకున్నాను..ఈమధ్య ఈ స్వామివారి గురించి విన్నాను..ఎందుకనో ఆశ కలిగింది..ఒక్కసారి ఇక్కడికొచ్చి మొక్కుకొని వెళదామని అనుకున్నాను..మా అత్తగారు కూడా.."నువ్వెళ్ళి స్వామిని వేసుకొని రా..మా వాడు బాగు పడితే..మనమందరం వెళ్లి ఆ స్వామివారి వద్ద మొక్కు చెల్లించుకుందాము.."అన్నది..శనివారం నాడు పల్లకీసేవ అని చదివాను..అందుకే నిన్న వచ్చి, ఆ సేవలో పాల్గొన్నాను..ఇప్పుడు స్వామివారి సమాధికి మొక్కుకుంటాను..నన్ను మీరు కూడా ఆశీర్వదించండి.." అన్నది..


"ముందుగా స్వామివారిని దర్శించుకో.." అని మా ఆవిడ ఆ అమ్మాయికి చెప్పింది..సరే అని చెప్పి..స్వామివారి సమాధి ని దర్శించుకొని..తన బాధ చెప్పుకొని ఇవతలికి వచ్చింది..శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద అర్చన చేయించుకొని..మళ్లీ మా వద్దకు వచ్చింది.."స్వామివారికి గట్టిగా నా గోడు చెప్పుకున్నాను..ఎందుకనో స్వామివారు నన్ను మరో నాలుగు వారాలు రమ్మన్నట్లు గా అనిపించింది..మొత్తం ఐదు వారాలు అవుతాయి..అదికూడా మనసులో అనుకున్నాను..ఇది ఆయన ఆదేశం అనిపించింది..తప్పకుండా నాలుగు వారాలు వస్తాను..ఆపై ఆయన దయ చూపితే..నా సంసారం ఒక గాడిన పడుతుంది..ఇదే చివరి ఆశ.." అని కన్నీళ్లు పెట్టుకున్నది..కొద్దిసేపటి తరువాత తేరుకొని.."వెళ్ళొస్తానండీ.." అని మా ఇద్దరికీ చెప్పి..చటుక్కున మా పాదాలకు నమస్కారం చేసి..వెళ్ళిపోయింది..అనుకున్న ప్రకారమే ఐదు వారాల పాటు సులోచన మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చి..ప్రతివారం పల్లకీసేవ లో అర్చన చేయించుకొని..ఆ రాత్రికి మంటపం లో నిద్రచేసి..తెల్లవారి ఆదివారం స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..తిరిగి వాళ్ళ ఊరెళ్ళింది..ఆఖరివారం లో మళ్లీ మా దంపతుల వద్దకు వచ్చి.."దత్తాత్రేయుడి దయ ఉంటే..మళ్లీ వస్తాను.." అని చెప్పి వెళ్లింది..


ఈ సంఘటన జరిగిన పద్దెనిమిది నెలల తరువాత..పోయిన జూలై నెలలో ఒక శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయం లో రెండు కార్లు వచ్చి స్వామివారి మందిరం ముందు ఆగాయి..అందులోంచి ముందుగా సులోచన..ఆతరువాత సుమారు ఆరుమంది వ్యక్తులూ దిగారు..మాదంపతుల దగ్గరకు వచ్చి.."నేను గుర్తున్నానా..నెల్లూరు నుంచి సులోచనను..ఈయన మా వారు ప్రభాకర్..ఆమె మా అత్తగారు, మా మామగారు..మా అమ్మానాన్న..అందరం వచ్చాము..స్వామివారి దయవల్ల మా సమస్య తీరిపోయింది..ఆయన పూర్తిగా మారిపోయారు.."అని పట్టరాని ఆనందం తో చెప్పింది..పైగాతాను మూడోనెల గర్భవతిని అనికూడా చెప్పింది..


సులోచన సమస్య ఒక్కరాత్రిలో తీరిపోలేదు..సంవత్సరం పట్టింది..కానీ ఆ అమ్మాయి ఓపిక గా స్వామివారినే నమ్ముకొన్నది..స్వామివారు భక్త సులభుడు కదా..అందుకే సులోచన సంసారం చక్కబడింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కథ"

 #"తప్పక చదవాల్సిన కథ"#


ఒక తల్లి తన నిత్యపూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తను

 ఖాళీగా ఉన్నాడా లేదా అని కనుక్కుని వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు మన కోసం.🙏


తల్లి, నాయనా! పూజా పునస్కారాలు ఐనాయా?


కుమారుడు ఇలా చెప్పారు.

అమ్మా!నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా  అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి  అన్వేషణ(రీసెర్చ్) చేస్తున్నాను. మీరు డార్విన్ 

జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు. అలాంటి నేను పూజలు చేస్తూ కూర్చుంటే ఏం బాగోదు.


తల్లి మందహాసంతో కన్నా! నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా. కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవే కదా నాన్నా  అన్నది.


కుమారుడు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలీదే అని అన్నాడు. అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది.


నీకు మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా.


కుమారుడు ఆసక్తిగా అవును తెలుసు దానికి ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం అని ప్రశ్నించాడు.

 

అప్పుడు ఆ తల్లి సంబంధం ఉంది. ఇంకా నువ్వు,  నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను.


1 మత్స్య అవతారం: అది నీటిలో ఉంటుంది. అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది. 

ఇది నిజమా కాదా. కొడుకు కొంచెం అలెర్ట్ గా వింటున్నాడు.


2 కూర్మ అవతారం: అంటే తాబేలు. దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా 

గమనించాలి. అంటే ఉభయచర జీవులు లాగా. తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.


3 వరాహ అవతారం: అంటే పంది. ఇది అడవి జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్లని గుర్తుకు తెస్తుంది.

 

4 నృసింహ అవతారం: అంటే సగం మనిషి, సగం జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి 

జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది. 


5 వామన అవతారం: అంటే పొట్టివాడు అయినా ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు. నీకు తెలుసుకదా మానవులు మొదట హోమో erectes మరియు హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో 

హోమో సేపియన్స్ మనుషులు  గా వికాసం చెందారు.  


కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.


6 పరశురామ అవతారం: ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని 

పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఏం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు 

తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు, గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.


7 రామావతారం: మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు . సమస్త కుటుంబ బంధుత్వానికి ఆది పురుషుడు.


 8 కృష్ణ పరమాత్మ అవతారము. రాజనీతిజ్ఞుడు, పాలకుడు, ప్రేమించే స్వభావి. అతడు సమాజ  నియమాలను 

ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజములో వుంటూ సుఖ దుఃఖ లాభ నష్టాలు అన్ని నేర్పినవాడు.


కొడుకు ఆశ్చర్యం, విస్మయంతో వింటున్నాడు. ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ


9 బుద్ధ అవతారం:  ఆయన నృసింహ అవతారం నుండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన  సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటూ చేసే ఆవిష్కరణలకు మూలం. 


10కల్కి అవతారం:  అతను నీవు  ఏ మానవునికై  వేతుకుతున్నావో  అతనే ఇతను. అతను ఇప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తిగా వెలుగొందుతాడు.


కుమారుడు తన తల్లివంక అవాక్కయి చూస్తున్నాడు. అప్పుడు ఆ కుమారుడు ఆనంద భాష్పాలతో అమ్మా! 

హిందు ధర్మం ఎంతో అర్థవంతమైన  నిజమైన ధర్మం. అని అన్నాడు,


ఆత్మీయులారా!

మన వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇత్యాది అన్నీ ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం 

చూసే దృష్టి కోణం మారాలి. మీరు ఎలా అనుకొంటే అలా వైజ్ఞానికమైనవి కావచ్చు. లేదా ధర్మ పరమైనవి

 కావచ్చు. శాస్త్రీయతతో కూడిన ధర్మాన్ని నేడు మూఢాచారాలు పేరిట మన సంస్కృతిని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం. 


ఇకనైనా మేలుకోండి. ఋషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.🙏


అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏

మనసెరిగిన మాధవుడు

 మనసెరిగిన మాధవుడు.. 


         గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. 

              ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో  తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరూ?

              నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది. 

             మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్ళతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటినుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు.


                 ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి?  దాదాపు ముప్పయి ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీ కృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయ్యింది. ఎవ్వరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెపుతారు. 


                  అయితే కాలానికి అందరూ తలవంచ వలసిందే కదా!. పూజారికి వృద్ధాప్యంవల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపొతున్నాడు. అందుకే కమిటీ వారు  అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరిరోజు!. అదీ అతని వ్యధకు కారణం!!.

                   ఓ కృష్ణా! ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ళకాలంలో నా వల్ల తెలిసిగాని, తెలియక గాని, అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను. నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయున్ని!! నన్ను మన్నించు కృష్ణా! అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి  ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు.చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు. 


                తెల్లారింది!. కుమారుడు ఆలయానికి వెళ్లాడు. అప్పుడు జరిగింది అద్భుతం! నిజంగానే అద్భుతమే జరిగింది!!!.


               కుమారుడు బిగ్గరగా అరుస్తూ," నాన్నగారూ ! అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది!" అని నోట మాటరాక ఆయాసపడుతున్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ,ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చోని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చోని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 


                     తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్ధమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి  విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు.


                      భక్తి అంటే అదే కదా! తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్చించుకోగలగడమే కదా!. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది!.


                     ఇది పూరి జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన.

                     ఓం మాధవాయ నమః

ఋష్యశృంగుడు

 మన మహర్షులు- 10

ఋష్యశృంగుడు

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷


ఋష్యశృంగ మహర్షి గురించి రామాయణము లోని బాల కాండము లో వివరించబడింది.


 దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు


.కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి పుత్రుడే మన ఋష్యశృంగ మహర్షి. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, 

విబాండక మహర్షి నేర్పుతాడు.


 ఋష్యశృంగుడు బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెరిగాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.


అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టి తో క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా, వారు ఋష్యశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములో వర్షాలు పడాతాయి అని మంత్రులు సలహా చెబుతారు.


రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, విషయ సుఖాలంటే తెలియవని, అందువలన ఋష్యశృంగుని రప్పించటం దుర్భేద్యమైన కార్యమని, దానికి తరుణోపాయంగా అందమైన స్త్రీలను ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు.


 ఆ స్త్రీలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋష్యశృంగుడిని చూసి విభండక మహర్షి ఆశ్రమములో లేడని తెలుసుకొని ఋష్యశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని , స్త్రీపురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వారికి ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. 


వారితో చెలిమి ఏర్పడి  వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.


కపటనాటకము ద్వారా ఋష్యశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రి అయిన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు.


 రోమపాదుడు తన కూతురైన శాంత ను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు


ఋష్యశృంగుడు దశరథుడికి పుత్రసంతానం  కోసం అశ్వమేధయాగం, పుత్రకామేష్టి చేయించాడు. కులగురువయిన వసిష్ఠ మహర్షి సహాయంతో పుత్రకామేష్టి శాస్త్రోక్తంగా చేయించాడు ఋష్యశృంగుడు. ఆ అగ్నిహోత్రంలోంచి ఒక దివ్య పురుషుడు వచ్చి ఒక బంగారు పాత్రలో పాయసాన్ని ఇచ్చి దశరథుణ్ణి ఈ పాయసం నీ భార్యలకు ఇస్తే సంతానం కలుగుతుందని చెప్పాడు. పాయసాన్ని నలుగురు భార్యలకు తినిపించి శ్రీరామ భరత లక్షణ శత్రుఘ్నులనే నలుగురు కొడుకుల్ని పొందాడు దశరథుడు. పరమపవిత్రమైన యాగాన్ని పూర్తిచేయించి ఋష్యశృంగుడు భార్య శాంతను తీసుకుని తన తండ్రి విభాండకుడి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు


 తర్వాత ఋష్యశృంగుడు ద్వాదశ వార్షిక యజ్ఞం చేశాడు.


ఋష్యశృంగుడు రాసిన గ్రంథం “ఋష్యశృంగ స్మృతి" అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. దానిలో ఆచారం, శౌచం, శ్రాద్ధం, ప్రాయశ్చిత్తం మొదలయిన వాటి గురించి రాయబడి ఉంది. 


ఋష్యశృంగుడి దేవాలయము ఇప్పటి శృంగేరి కి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో ఉంది. ఈ ఆలయం లో శివలింగానికి శృంగం ఉండడం గమనించవచ్చు..ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.ఇప్పటికి తీవ్ర క్షామం అనుభవిస్తున్న ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి జగద్గురువుల ఆదేశాల మేరకు పూజలు చేస్తూవుంటారు...వారి ప్రాంతాలు చక్కగా వానలు పడి సుభిక్షమవుతాయి...


🌸జై శ్రీమన్నారాయణ🌸


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

31, జనవరి 2021, ఆదివారం

దేవాలయం

 🙏💐👏👍😊🤝🙏


*మీరు నూతన దేవాలయం నిర్మించదలచినప్పుడు దయచేసి ఈ ముఖ్య  విషయాలని గుర్తుపెట్టుకోండి.*


🤔🙏 *హిందువులకి ఇది పూర్తిగా చదివితేనే అర్థమవుతుంది. చదవడానికి మీకు తీరిక‌ ఓపిక ఉంటే, చదివి ఇంకా ఏం చేయాలో అందరికీ చెప్పండి.* 😊💐


మొట్టమొదట దేవాలయం పేరుతో ఒక ట్రస్టును రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తరువాత కరంట్ ఎకౌంట్ ని ఏదోఒక బ్యాంకు లో ఓపెన్ చేయండి. 


మీ ట్రస్టులోకి వీరందరినీ సగౌరవంగా ఆహ్వానించండి.....

ఇంట్రస్ట్ గా ఉన్నవారిని + మీకు సపోర్టుగా ఉన్నవారిని + మీ వార్డు, గ్రామ, టౌను, పట్టణంలోని ప్రముఖులని  + ప్రతి కులం నుంచి ఒక్కరు లేదా ఇద్దరిని +  వీలయితే  ఎన్నారైలని + ఫండ్స్ సమకూర్చేవారిని, ఫండింగ్ చేసెవారిని + స్థలం సమర్పించినవారిని, etc., వీలయితే ఒక లీగల్ ఎడ్వైజరుని కూడా ఆహ్వానించండి. 


తరువాత ఆగమ శాస్త్రం తెలిసినవారితో ప్లానుని తయారుచేయించండి.


మీకు కావలసిన దేవతా విగ్రహంకోసము  తిరుమల తిరుపతి దేవస్థానం వారిని సంప్రదించండి. వారు  ఆగమ శాస్త్ర ప్రకారంగా ఉచితంగా లేదా అతి తక్కువ ఖరీదుకి ఇస్తారు.


మీ అనుకూలత ప్రకారంగా, మీకు వీలయినంత వరకూ ఆ దేవాలయం నిర్మాణం చేయబడే ప్రదేశంలోని వారిని ఎక్కువగా ఇన్వాల్వ్  చేయండి. అందువలన హిందూ మత జాగృతిలో అందరూ పాలుపంచుకుంటారు. 


*ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవలసన విషయం ఏమిటంటే... నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వారితో పాటు వారి వంశంలోని వారంతా... ఖచ్చితంగా ఆ దేవాలయాన్ని, చిన్నదైనా లేక పెద్దదనా  సంరక్షించుకుంటారు. దేవాలయ నిర్మాణం పూర్తి చేసిన తరువాత ఆదాయం మొదలు అవుతుంది. దేవాలయానికి పరోక్ష ఆదాయాల కోసం అందరూ కలసి ప్లానింగ్  చేసుకోవచ్చును.


ఇంకా పూర్తగా చాలా వివరాలు క్రింద 👇🏼 ఉన్నాయి. చదవండి... 


(Post by the Group Admin. Read all details.)


T.S.Malleswara Prasad.

Chairman.

Bharathiya Vajra Party

National Vice Chairman.

National Consumer Rights Commission.


1-2-18/1/3, Sri Krishna Colony, Near Gateway International School, 

Cell : 9030362942

Budwel, 

Rajendra Nagar, Hyderabad-500030.


www.bharathiyavajraparty.com


1).  మీకు మీరే లీడర్లు.  మీరు తలపెట్టిన కార్యక్రమాలకోసం, ఇతర సంఘాలలో లేదా  కమిటీలలో మెర్జ్ కాకండి. అప్పుడు ఏ పనినీ మీరు చేయలేరు. మీది అటానమస్ కమిటీగా ఉంటేనే మీ పనులు అన్నీ చక్కగా కొనసాగుతాయి.

ట్రస్టు, కమిటీ వ్వహారాలలో       రాజకీయ నాయకులని  ఎట్టి పరిస్థితుల్లోనూ  ఇనవాల్వ్ చేయకండి. 


2).  ఎక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించడానికి అనువుగా ఉంటుందో మీకుమీరే నిర్ణయించండి


3). మీకు అనుకూలంగా‌, సహకారాన్ని అందించే కొద్ది మందితో కూడి  నూతన దేవాలయ నిర్మాణం గురించి మాట్లాడండి. ఏ దేవతా మందిరం అయితే తేలికగా  నిర్మాణానికి ఆ ప్రాంతాల్లోని ప్రజల నుండి సహకారం లభిస్తుందో ఆలోచించి నిర్ణయించుకోండి.


4). దేవాలయనిర్మణ కోసం స్థల సేకరణకి సహకరించేవారిని గుర్తించండి. వారిని ముందుగా కలసి సంప్రదించండి.


5). మరు తలపెట్టిన దేవాలయాన్ని 200 గజాలు లేదా 2 కుంటలు లేదా 4 సెంట్ల నుంచి ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో నైనా నిర్మాణం చేయవచ్చు.


6). పర్మనెంట్ గా ట్రస్టుని  రిజిస్ట్రేషన్ చేయించండి.


ఈ ప్రపోజ్డ్ దేవాలయ ట్రస్ట్ లో ఉండవలసిన కమిటీలు.  

A.) దేవాలయ ఆధ్యాత్మిక కమిటీ. B.) దేవాలయ నిర్మాణం , రిపేర్స్  కమిటీ C.) దేవాలయ మేనేజింగ్ కమిటీ. D.) దేవాలయ పండుగల కమిటీ. E.) ప్రింటింగ్ అండ్ మీడియా కమిటీ. F.) ఇతర తాత్కాలిక అనుబంధ కమిటీలు.


ఈ కమిటీలలోని సభ్యులని, ట్రస్టు వారికి సమయానుకూలంగా మార్చుకునే అధికారం ఉంటుంది.


ఈ దేవాలయ  కమిటీలలోకి  అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ గ్రామ పెద్దలతోపాటూ,  ప్రతి హిందూ కులం నుండి ఒక్కో వ్యక్తికి ప్రాధాన్యతని ఇచ్చి కమిటీలోకి ఆహ్వానించండి.  


ట్రస్ట్ వారికి ప్రథమ తాంబూలాలు.

అర్చకులకి,  బ్రాహ్మణులకి దైవ తాంబూలాలు. కమిటీ వారికి ముఖ్య తాంబూలాలు ఇవ్వాలి. 

ఆ తాంబూలంతో పళ్ళు, బట్టలు etc ఇచ్చి వారిని సందర్భానుసారంగా పండుగ సమయాలలో సభాముఖంగా గౌరవించండి. ఇదే హిందూ మతంలో అన్ని వర్గాలలో ఉత్తేజాన్ని, భక్తిని నింపే, పెంచే దేవాలయ ఆచారం.


వీరందరికీ  దైవ దర్శనం చేసుకున్నప్పుడు ముఖ్యతాంబూలాలు ఇవ్వాలి.


So, మీకు అనుకూలంగా ఉన్న  ప్రాంతాలలో దేవాలయ నిర్మాణానికి మీరే ప్రాతినిధ్యం వహించండి. వీలయితే నాకు తెలియజేయండి.


ముఖ్యంగా మీకు నేను చెప్పేది ఏమిటంటే మీరు తెలివిగా ఒక్కసారి ప్రారంభించితే...  అందరూ కలసికటుగా పూర్తిస్థాయిలో 1 నుండి 3 సంవత్సరాల సమయంలో  పూర్తి చేస్తారు. ఇది సత్యం. ఆ తరువాత కలసికట్టుగా దేవాలయాన్ని నిర్వహిస్తారు.


మీరు చేసే ఈ దైవకార్యాలకి ప్రజలు ఆకర్షితులై పాత దేవాలయాల  పునరుద్ధరణని కూడా ప్రారంభిస్తారు. 


ఈ నూతన లేదా పాత దేవాలయాల విషయంలో అంతరాయాలు ఏర్పడితే 99% మీరే పరిష్కరించుకోగలరు లేదా ....  నాకు తెలియజేయండి.  


హిందూ ధర్మం జాగృతి కోసం ఎల్లప్పుడూ మీ వెంట ఉండే.... 


మీరు నిర్ణయించుకుని చేయబోయే లేదా చేస్తున్న మీ కార్యక్రమాలని అందరికీ, అన్ని గ్రూపులవారికీ తెలియజేయండి.


💐💐💐💐🙏👏😊


ఇంకా క్రింద 👇🏼ఇచ్చిన పూర్తి వివరాలని చదవండి. 

అది దీని వెనుక ఉన్న రాజకీయ కోణము. మీ అందరికీ తెలియాలి.


🙏😊🙏🤝🏻💐


 *ఈ దేశంలో పఠిష్టమైన హిందూ జాగృతి ఏ విధంగా సాధ్యం ?? ఇదే అందరినీ వేధిస్తున్నటు వంటి అతి పెద్ద క్లిష్ట సమస్య. కాని ఇది మా "భారతీయ వజ్ర పార్టీ"  దృష్టిలో ఇది పరిష్కారం కాని సమస్యకానే కాదు.  చదవండి మీకే అర్థమవుతుంది.* 


....  Regarding Hinduism, ..  only some  people are  having psychologically disturbed imbalance mindset  in the country. It is not a problem. Facts and circumstances will restore them. Please read below all details.


T.S.Malleswara Prasad. 

BVP Chairman.

National Vice Chairman. 

National Consumer Rights Commission.

Cell : 9030362942.


* అందుకే హిందువులందరికీ ఇవి  చాలా చాలా ముఖ్యమైన విషయాలు....తెలుసుకుని, మా రాజకీయ ప్లానింగ్ లని పాటించండి. అదే మనకి ఉన్నటువంటి ఏకైక మార్గము. 


ఈ భూప్రపంచంలో ఏ హిందువుకైనా కోపంవస్తే, గొప్ప అగ్నిజ్వాలగా మారుతాడు. ఆ కోపాగ్ని నుండి...  తనతోపాటుగా  తన హిందూజాతి రక్షణ కోసం  ఇంకా తేజోవంతంగా మారిపోతాడు. అందుకనే  హిందూజాతి, మతము....  చరిత్రకే అందనటువంటి అతి పురాతనమైనది. పళ్ళచెట్లకే రాళ్ళ దెబ్బలన్నట్లుగా, ఛాయాప్రమాణంగా మధ్యలో పుట్టిన ప్రతి అన్యమతముల వలన మనకి ఏదో విధమైన ఇబ్బందులు కొన్ని విధాలుగా కలుగుతూనే ఉన్నాయి. అలా వారు  ఇబ్బందులని కలుగచేసినప్పుడే మనలోని ఐకమత్యం బహిర్గతం అవుతుంది.


ముఖ్యంగా ప్రతి హిందువు తెలుసుకోవలసినటువంటి మతపరమైన, వేద ప్రమాణంతో ఉన్న కొన్ని విషయాలు ఉన్నాయి. 


జీర్ణదశలో ఉన్నటువంటి ఏ  దేవాలయాన్నైనా  పునరుధ్ధరించడంలో పాత్ర వహించినా లేదా నూతన దేవాలయ నిర్మాణంలో పాలుపంచుకున్నా ..... వారితోపాటూ వారి కుటుంబ సభ్యులందరితో పాటూ, వారికి సంభందించిన అటుఇటు ఏడు తరాల పూర్వీకులు అందరికీ స్వర్గప్రాప్తి లభిస్తుందని వేదాలు ఘోషిస్తున్నాయి. అందుకే హిందువులు  దేవాలయ నిర్మాణానికి లేదా పునరుద్ధరణకి తమ ప్రాణాలకన్నా ఎక్కువగా  ఎంతో ప్రాధాన్యతని ఇస్తారు.. అదేవిధంగా దేవాలయ నిర్వహణని దేశప్రజలందరూ తమ జీవిత గమ్యంగా చూస్తారు. 


అందుకని మన దేశంలో ప్రజలు నివసించే ప్రతి గ్రామంలో, మండలంలో, టౌనులో, పట్టణంలో, మెట్రో పట్టణంలో ఉన్న ప్రతి సందు/వీధి/వార్డులో చెరువు దగ్గర/కొండలమీద/అడవిలో/కాలువ గట్లమీద/నదీ పరివాహక ప్రదేశాలలో/ ప్రతి కాలనీలో/ హాస్పిటల్స్ ప్రాంగణంలో/ తోటలలో/ మీకు నచ్చిన వివిధ  ప్రదేశాలలో .... మీకు ఇష్టమైనటువంటి హిందూ దైవ దేవాలయాన్ని అందరూ కలసి నిర్మించండి. 


మన హిందువులకి 3 కోట్ల దేవతలు ఉన్నారు. కాబట్టి మనకి దేవతలకి కొదువలేదు. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణ కార్యక్రమాలను మొదలుపెట్టండి. 


విస్తృతంగా నూతన దేవాలయాల నిర్మాణాలు, జీర్ణదేవాలయాల  పునరుద్దరణ కార్యక్రామాల వలన, మన దేశంలో ప్రతి సంస్కృతిలోనూ  భాగమయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, వారు పాటించే ఆచార సంప్రదాయాలని కాపాడుకోగలుగుతారు. ఇందువలన, తరుచుగా కలవడం వలన, సమిష్టిగా ప్రతి ఒక్కరూ బలవంతులుగా  తయారవుతారు. 


అన్య మతమార్పిడిని ఈ విధమైన కార్యక్రమాల వలన మనం పూర్తిగా అరికట్టవచ్చు. 


ప్రతి ఇంటా ఉన్నటువంటి వారి వారి గ్రామ, కుల, ఇంటి, వంశ, ప్రాంతీయ, దేశీయ ఆచార సాంప్రదాయాలు పఠిష్టమైన రీతిలో కాపాడుకోగలుగుతరు. దీనివలననే హిందూ సంస్కృతి దేశంలో బలిష్టంగా తయారవుతుంది. 


మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ... ప్రతిఒక్కరికీ తను జన్మించిన, పెరిగిన , చదువుకున్న, తల్లిదండ్రులు తాత ముత్తాతలు జీవించిన ప్రదేశాలు,  అదేవిధంగా తన ఉద్యోగ వ్యాపార స్థలాలంటే ఏదో తెలియని అభిమానం, ప్రేమ, వాత్సల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

ఇటువంటి ప్రతి కార్యక్రమాలకు ఆయా ప్రదేశాలకి సంభవించిన ప్రతి వారూ తమ పూర్తి సహకారాన్ని అందిస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని మనం విస్తృతంగా చేపట్టాలి. 


మన మతాన్ని, మన సాంప్రదాయాలని, మన  ఆచారాలని,  కాపాడుకునే స్థిరమైన ప్రయత్నాలు మనమే చేసుకోవాలి. ప్రభుత్వాలు సహకరించవు. కారణం ...అన్ని మతాలని, కులాలని, జాతులని సమదృష్టితోనే ప్రభుత్వాలు చూడాలి కాబట్టి.


*మనదేశంలో..... .*


1.) 35 రాష్ట్రాలు ఉన్నాయి.

2.) 653 పైగా జిల్లాలు ఉన్నాయి.

3.) 6,577 పైగా బ్లాకులు ఉన్నాయి.

4.) 2,46,630 పైగా పంచాయితీలు ఉన్నాయి.

5.) 5,96,856 పైగా గ్రామాలు ఉన్నాయి.

6.) 40 కి పైగా  పట్టణాలలో .. 10 లక్షలకన్నా ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి.

7.)  396 కి  పైగానే పట్టణాలలో  1 లక్ష  నుండి 10 లక్షల జనాభాను కలిగి ఉన్నాయి.

8.)  2,500 కి పైగానే టౌన్లలో  10 వేల నుండీ  1 లక్ష  వరకూ జనాభాను కలిగి ఉన్నాయి.


కనుక మనమంతా కలసి, ప్రతిఒక్క ప్రదేశంలోనూ‌, దేశం నలుమూలలకి  మన హిందూ ప్రజలకి ఈ విధముగా దేవాలయ  నిర్మాణ సందేశాలను చేరవేయటం వలన అందరిలోనూ నూతన ఉత్సాహం, కదలికలు ప్రారంభమయి, ఇటువంటి  కార్యాచరణలకు కదం తొక్కి మొదలు పెడుతారు. 


 ప్రతి ఒక్కరిలో  నూతనోత్సాహంతో  ప్రవేశించి, ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ విధానాన్ని మనం అనుసరింపజేస్తే, దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దేవాలయాలని  1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలో నిర్మించడం జరుగుతుంది.


ప్రతీ చోటా    ఉత్సాహవంతులు పోటీలు పడితే ఈ నూతన దేవాలయాల సంఖ్య రెట్టింపుకు పైగానే అవుతుంది.  పోటీలు సహజమే కదా...  


So, ఈ విధంగా మన వీర కార్యకర్తలు కార్యక్రమాలని దేశవ్యాప్తంగా చేబడుతుంటే..... అన్యమతస్తులు ఈ దేశంలో ఎన్ని దేవాలయాలపైన దాడులు చేయగలరో ఇప్పడు  చెప్పండి ???


* * ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే... దేశంలోని అన్ని ...

వీదులకు,  ఆన్ని  ప్రాంతాలకు, చెరువులకు, నీటిబావులకు, చిన్నా పెద్దా కొండలకు‌, వనాలకు, చిట్టడవులకు, పెద్ద అడవులకు, లోయలకు,  కాలువలకు, బ్రిడ్జీలకు, వంతెనలకు, మీరు చేపడుతున్న ప్రతి  స్కీములకు, పబ్లిక్ కుళాయిలకు,  ఇళ్ళకు, భవంతులకు, ఆట స్థలాలకు, పబ్లిక్ వాటర్ టాంకులకు, రహదార్లకు, విద్యాలయాలకు, సేవాకేంద్రాలకు, హాస్టళ్ళకు,  రచ్చబండలకు, కూడళ్ళకు,  సెంటర్లకు, గ్రంధాలయాలకు, మార్కెట్లకు, బస్సులు ఆగే ప్రదేశాలకు, టాక్సీలకు, ఆటోలకు, వాహనాలకు, ప్రైవేటు సర్వీసులకు, మొదలైన అన్నీటితోపాటూ  అక్కడ జరిగే ప్రతి వ్యాపార వ్యవస్థలకు మీకు  ఇష్టమైన దేవతల  పేర్లనే పెట్టండి.  లేదా మార్చేసేయండి.  


దేశంలో దేనికైనా సరే రాజకీయనాయకుల పేర్లను లేక వ్యక్తుల పేర్లను  మీరు ఆమోదించవద్దు.


*మన బలహీనమైన మనస్సు, నిర్లిప్తతతో మాట్లాడే మాటలు, నిర్వీర్యంచేసే చేతలు, వెనుకంజ వేసే విధానాల వలననే మనమంతా బలహీనంగా అందరికీ కనబడుతున్నాము. ఏ విషయంలోనైనా  బలహీనంగా కనబడితే - ఎదటివారు ఎటువంటివారైనా సరే , దాడులు చేయడానికి విశ్వప్రయత్నం చేస్తారు. కాబట్టి మనలో దాగి ఉన్న శక్తి సామర్ధ్యాలను గుర్తించి, మనం కార్యక్రమాలు నిర్వహించటం వలన, హిందూ మతం మీద ఎటువంటి దాడులూ జరుపలేరు.

 

 So, నివురుకప్పిన నిప్పుకణికల మీద ఉన్న ఛాందస బూడిదని వదిలించే విధమైన ఆలోచనలని ఆచరణలో పెట్టడానికి అందరం కృషి చేద్దాం.


ఏద కొన్నా లేదా అమ్మినా, మీరు ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా లేదా ఉద్యోగం ఇచ్చినా, మీరు కిరాయి ఇంట్లో ఉన్నా లేదా ఇచ్చినా, ఏదైనా సరే హిందూ సంబంధించిన వారితోనే కార్యకలాపాలు చేయండి. అదే విధంగా మీపిల్లల చదువులని కూడా హిందూ సమాజపు  బడుల్లో, కళాశాలలోనే పూర్తి చేయించండి.  మిషనరీ వాటిలో వద్దు. వాటిలో 90% విధ్యార్ధులు హిందూ పిల్లలే చదువుతున్నారు. మన ద్వారా లభించే ధనంతోనే మనకి, మన మతానికి శత్రువులుగా మారుతున్న విధానాన్ని అందరూ గమనిస్తున్నారు. 


కాబట్టి మనం రాజకీయ విధానాలతో ముందుకు సాగితేనే ఫలితాలు వస్తాయి.


Kindly watch us and our all posts ...


ఇది మీకు నచ్చితే, మీకు తెలిసిన వారికి  ఫార్వార్డ్ చేయండి. వారి సలహాలనికూడా తీసుకుని ఆ దిశగా కార్యక్రమాలు చేద్దాం. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో నాకు చెప్పండి. మీ సలహాలు ఎప్పుడూ నాకు అమూల్యమే.. 


*T.S.Malleswara Prasad.*

*Cell: 9030362942.*

*Chairman.*

*Bharathiya Vajra Party.*

*And*

*National Vice Chairman.*

*National Consumer Rights Commission.*


You can contact me at any time please.