16, ఏప్రిల్ 2023, ఆదివారం

ఊపిరితిత్తులు ఆరోగ్యవంతమై

 *మన ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవడానికి ఏవైనా వ్యాయామాలు కానీ, ఆహార జాగ్రత్తలు కానీ ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా చేయాలో అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*


1.- ఊపిరితిత్తుల ను శుభ్రం చేసుకునేందుకు రోజు ప్రాణాయామం చేయాలి.కొంత వ్యాయామం చేయాలి.సాత్వికాహారం తీసుకోవాలి.అంటే ఉప్పు,కారం, మసాలాలు చాలా తగ్గించి తీసుకోవాలి.వీలైనంతవరకు పళ్ళు తీసుకోవాలి.పచ్చి కారట్, కీరదోసకాయ వంటి వాటిని తురిమి పెరుగు లో వేసుకుంటే ఆరోగ్య మునకు చాలా మంచి ది.


*2.-నిల్వ ఉంచిన పచ్చళ్లు,బిస్కెట్లు, వేపుళ్లు,పాలిష్ చేసిన పదార్థాలు, పంచదార వంటి వాటిని పూర్తిగా మానేయండి.పంచదారకు బదులు బెల్లం లేదా తేనెను తీసుకోండి.*


3.-సిరి ధాన్యాలు కొత్త గా ప్రచారం లోకి వచ్చాయి.ఇవి ఆరోగ్య మునకు చాలా మంచి వి.వరి, గోధుమ లకు బదులు వీటిని వాడుకోండి.చాలా బాగుంటాయి.బిపి,సుగర్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి తీవ్రత తగ్గుతుంది.

*4.-వ్యాయామం -చేయుట వలన గుండె కొట్టుకొనుట వేగవంతమై ఊపిరి తిత్తుల పనితీరు బాగుండి కండరములు ఆక్సిజెన్ సరఫరా మెరుగ్గా ఉండి కార్బన్ డయాక్సైడ్ ను వెలుపలకు పంపిస్తుంది.అన్ని రకముల కాలుష్యములకు దూరం పాటించాలి.*


5.-ఇంటిలోపల ఫర్నిచర్ ను వాక్యూం చేస్తుండాలి (వారం -వారం )


*6.-కిటికీలు తెరచి గాలి వెంటిలేషన్ ఉండే తట్టు గా చూడాలి*


7.-కృత్రిమ ఎయిర్ ఫ్రెషనర్లు , కాండిల్స్ కూడదు


*8.-ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రముగా ఉంచుకోవాలి దుమ్ము ధూళి వలన పీల్చే గాలితో ఊపిరితిత్తులను చేరి ఇర్రిటేషన్ కలుగ చేయును*


*9.-ఇంటిలో ధారాళమైన గాలికి -వెంటిలేషన్ -ఎక్సజాస్ట్ అమరిక ఉంచాలి*


10.-అంటు వ్యాధులు బారిన పడకుండా జాగర్తలు పాటించాలి


11.-పండ్లు కూరగాయలు విరివిగా తీసుకోవాలి. ఎక్కువ మంచి నీరు తాగాలి


12.-వాక్సినేషన్లు తీసుకుంటూ ఉండాలి


*13.-ఉచ్చాస -నిశ్వాసా ములను క్రమబద్దీకరణ పాటించాలి.(బ్రీతింగ్ ).*


*14.-అటు ఆర్ట్ అఫ్ లివింగ్ లో అలాగే ఇషా యోగా లోనూ ఈ పద్ధతులు నేర్పిస్తున్నారు*

ఈ రోజుల్లో ఎవరికీ ఫలానా చేయండి అని సూచించకూడదు నా సలహా

  *ఇవన్నీ పాటిస్తే ఊపిరితిత్తులు ఆరోగ్యవంతమై మనము కూడా ఆరోగ్యవంతులం కాగలం.*

*ధన్యవాదములు 🙏*

*


        




సెలవు

ధృతరాష్ట్రుడు

 💐 *శుభోదయం* 💐


*మహాభారత కథ ప్రకారం ధృతరాష్ట్రుడు అంధుడు..* 


*అతనికి పుత్ర వ్యామోహం ఎక్కువ..*

 

*ఈ కథలో  ఒక అంతరార్థం ఉంది.*


*ధృతరాష్ట్రుడు జీవుడికి సంకేతం...*

 

*రాష్ట్రము అంటే శరీరము...ఉపాధి..*


*ధృత అంటే దృఢం..* 

*ఈ శరీరమే "నేను" అని దృఢంగా నమ్మేవాడు,* 

*ధృతరాష్ట్రుడు...* 

*ఇతడు అహంకారి...* 


*అహంకారంతో ఉన్నవాడు ఎప్పుడూ అంధకారంలో ఉంటాడు.*

 

*అహంకారంతో ఉన్నవాడికి బాహ్యంగా కళ్లున్నా,  జ్ఞాన చక్షువు పనిచేయదు..*


*అందుచేత జీవుడు  అంధుడు...గుడ్డివాడు.*

 

*అహంకారంతో ఉన్నవాడు మమకారంతో జీవిస్తాడు..* 


*ఈ మమకారమే వ్యామోహం...*


*నాది అనే వ్యామోహంతో ఎన్నో తప్పులు చేస్తాడు..*

 

*చివరకు అన్నీ పోగొట్టుకుని అహం వదలక తప్పదని వ్యాసులవారు 

 పాత్ర ద్వారా మనందరికీ చేసిన బోధ...*


*అర్థం చేసుకుని ఆచరిద్దాం...*

 

 

🙏🙏🙏🙏🙏

*ఓం శ్రీ గురుభ్యోనమః*

శ్రీరామనవమి

 *శ్రీరామనవమి-రాముడు జన్మించిన సుదినము.అది సీతారామకళ్యాణము కాదు.*

శ్రీరామచంద్రుడు జన్మించి నేటికి 1,91,49,127- ఒక కోటి తొంబై ఒక్క లక్షల,నలుబై తొమ్మిదివేల ఒకవంద ఇరువది ఏడు సంవత్సరములైనవి.దాదాపు( 2) కోట్ల ఏళ్ళ క్రితం శ్రీరాముడు ఈ ఆర్యావర్త దేశమందు జన్మించారు.

సీతకు పద్దెనిమిది యేండ్లు నిండాక,రాముడికి (25)యేండ్లు నిండాక వారి వివాహము జరిగినట్లు తెలియుచున్నది.అయితే అది చైత్ర శుద్ధ నవమి నాడు కానే కాదు.అయినను నిరాధారంగా,మన దక్షిణాదిన శ్రీరాముడి జన్మదినోత్సవములు జరుపుటకు బదులు సీతారాముల కళ్యాణోత్సవాలు జరపుతున్నారు. జీవితములో ఒక జంటకు ఒక్కమారే వివాహము జరుగుతుంది.కాని ఈ కళ్యాణ వేడుకలు చేయువారు,శ్రీరాముడికి యేటేట పెళ్ళిల్లు జరిపిస్తున్నారు.

ఆ సందర్భంగా పురోహితుడే పతివ్రత తల్లి సీతాదేవి(విగ్రహము) మెడలో తాళి కట్టు కుప్రథకు-దురాచారమునకు తెర లేపారు.

తన భార్య సీతాదేవిని యెత్తుకుని వెళ్ళిన రావణాధముడిని బంధుబాంధవ,పుత్ర సమేతముగా శ్రీరామచంద్రుడు హతమార్చాడు.అటువంటప్పుడు,ఈ దుష్ట కార్యమునాచరించు పూజారులు యేల నశించకుందురు?


మనము అసలుసిసలైన శ్రీరాముడి చరిత్రోపాసకులము.ఇటువంటి కుప్రథలు-దురాచారాలు దక్షిణాదిలో జరుగకుండా మనమే చూడాలి.ఒక ఉద్యమ రూపకంగా పని చేయాలి. పూజారులు సీతామ తల్లి పై చేయుచున్న ఈ దుష్టాచారాన్ని నిరోధించాలి.

మహర్షి స్వామి దయానంద సరస్వతిగారు వాల్మీకి విరచిత రామాయణాన్ని పఠనీయ గ్రంథాలలో సూచించారు.

శ్రీరాముడు జగదభిరాముడు.రఘుకుల సోముడు.

ఇంతకాలం ఒక వ్యక్తిని భరతజాతి యావత్తు యింతగా గుర్తు చేసుకోవడానికి అతడి శుభ గుణములే కారణము.

శ్రీరాముడు ఒక స్ఫూర్తి.ఒక ఉద్యమము.ఒక అగ్ని శిఖ.

అందువలన ఆ మహాపురుషుడు మహిలో రాక్షసులు లేకుండా చేశాడు.సరయూనది తీరమునగల కోసల దేశమునుండి సుదూర ప్రాంతమైన దక్షిణాతటిలోని దండకారణ్యము వరకు పాదాచారియై పయనించి ధర్మవిహీనులను, దుష్కర్ములను దునుమాడాడు.

“అగ్నే త్వం సుజాగృహి”అంటుంది యజుర్వేదము.

(అగ్నే)అగ్నివంటి తేజోవంతుడైన వీర!వీరాగ్రేసరా!(త్వమ్)నీవు(సుజాగృహి)బాగుగా మేల్కొనుము. వీరులు,వీరాగ్రణ్యులు మేల్కొనియుండి ప్రజలను బాగుగ మేల్కొలుప వలయును.నిద్రాణమైయున్న జాతి సర్వ నాశనమగును.

మేల్కొన్న వ్యక్తికి -పురుషార్థ పరాయణునికి పరమే శ్వరుడి మరియు  ధర్మ సహకారముంటుంది. పురుషార్థరహితుడై నిద్రించే వ్యక్తిని ధర్మము యే రకంగాను కాపాడదు.

“Vigilenti bus non dormanti bus “ఇది “లా”లోని ఒక ల్యాటిన్  మ్యాక్సిమ్(సిద్ధాంతము).తన హక్కులపై అవగాహన గల జాగరూకునికి ‘లా’సహకరిస్తుంది.తన హక్కులు-బాధ్యతలు మరచిపోయి నిద్రించే వ్యక్తికి సహకరించదు.

అగ్ని-అంటే జాగరూకత.అగ్ని-వేడియున్నప్పుడు శరీరము చైతన్యవంతముగనుండును.లేనపుడు చల్లబడును.శవమగును.శవమెంతటి మహనీయు నదైనను నిరుపయోగమగును.దానిని కాపాడవలసి వచ్చును.అది ఇతరులను కాపాడదు.తన్న తాను కాపాడుకొనజాలదు.పూర్వము ఆర్యవీరులు అజేయు లుగా యుండి అవనిలో అన్యాయ అక్రమాలు యెక్కడ జరిగినను, అచ్చటికి చేరుకొని మరీ అరికట్టుచుండిరి.

కాని,నేడు దురదృష్టవశాత్తు మన దేశములోనే అన్యాయఅక్రమాలను అరికట్టజాలకున్నాం.దీనికి కారణం? మనలో అగ్ని లేకపోవడమే!

🚩“అగ్ని మూలం బలం పుంసాం రేతో మూలంతు జీవితమ్।తస్మాత్ సర్వ ప్రయత్నేన అగ్నిం వీర్యంచ రక్షయేత్॥(చరక సంహిత)

జీవులకు జఠరాగ్ని దీప్తిని బట్టియే బలం ఉంటుంది.

వీర్యము జీవనానికి మూలము.కావున అన్ని విధాల ప్రయత్నించి అగ్ని దీప్తిని,వీర్యమును కాపాడు కొనవలెను.

వాల్మీకి శ్రీరాముడిని అద్భతంగా వర్ణించాడు.

🚩 “ఇక్ష్వాకు వంశప్రభవో రామోనామ జనైః శ్రుతః।నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ధృతిమాన్వశీ॥”వా.రా.బాల కాండము.8.

ఇక్ష్వాక వంశోద్భవుడు రామనామ విఖ్యాతుడు-నియత స్వభావుడు(మాటిమాటికి స్వభావములు మార్చువాడు కాడు), వీర్యవంతుడు-చెఱకుగడలో రసమున్నట్లు శరీరములోని కణకణమునందు వీర్యమున్నవాడు, అగ్నితుల్య తేజోవంతుడు,ధృతివంతుడు-వెనుకడుగు వేయని దైర్యవంతుడు మరియు తనపై తనకు అదుపు గలవాడు.

🚩బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః।

విపులాంసో మహాభాహుః కంబుగ్రీవో మహాహనుః॥

మహెూరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః।

🚩అజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః॥

వా రా.బాలకాండం.9,10.

శ్రీరాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, వాగ్విశారదుడు-మధుర భాషి,శత్రు సంహారకు డు,ఆజానుబాహుడు,గుండ్రటి బలమైన భుజములు కలవాడు,శంఖాకృతిని బోలిన కంఠము గలవాడు,విశాలమైన నుదురు కలవాడు,సదా ధనుస్సును ధరించి శత్రువులకు బుద్ధి చెప్పుటకు ఉద్యుక్తుడై యుండువాడు,మెడ యెముకలు-clavical bones మాంసముతో కప్పబడి పుష్టికరముగ నున్నవాడు,సుందరమైన శిరస్సు మరియు మహా పరాక్రమవంతుడు.

ఆబాలవృద్ధులు తమ శరీరాకృతిని వ్యాయామ ము(దండెములు-బస్కీలు) సూర్యనమస్కారాలు, ఆసనములు మరియు ప్రాణాయామముల ద్వారా రామునికి తుల్యముగ మార్చుకొని శరీరమునందు వీర్యమును వర్ధిల్ల జేసుకొనవలయును.అగ్ని-తేజములను కలిగి యుండవలయును.

అప్పుడు అందరు వారిని ఆదరింతురు. తేజోవిహీనులను తిరస్కరింతురు.ప్రజ్వరిల్లుచున్న అగ్నిని,జ్వాలలను దాటుటకెవరు సాహసింతురు?నిప్పును త్రొక్కరు.బొగ్గును త్రొక్కవచ్చును.కావున ఆర్యసమాజీయులు,వైదికులు,వేదాభిమానులు “అగ్నే త్వం జాగృహి”వేద వాక్యమును శ్రీరామనవమి రోజు పఠించి,మననము చేసి తాము మేల్కొని,ఇతరులను మేల్కొలిపి చైతన్యవంతమైన  జాతిగ రూపొందవలయునని “ఆదిత్య వాణి”కోరుచున్నది.

ఊరగాయల కార్యక్రమం

 *మార్చి లొనే మనల్ని వడియాల్లా వేయించేస్తున్న ఈ ఎండల్ని చూస్తుంటే పాతారోజులు జ్ఞాపకం వస్తున్నాయి. మునుపూ ఎండలు ఉన్నాయి. కానీ వాటికి మనం ఇంత భయపడింది లేదు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించు కొనేవారు. నాకయితే బాగా గుర్తు. వేసవి కాలం వచ్చిందంటే మాబామ్మ , అమ్మ, చాలా బిజీగా ఉండేవారు. మాకు పరీక్షల హడావుడి; వాళ్ళకి ఇంకోరకం హడావిడి. "నులకమంచాలు, పట్టెడ మంచాలూ, మడతమంచాలు బైటవేసి, ఏడాదికి సమకూర్చుకొన్న పప్పులు ఎండబెట్టి, అన్నీ డబ్బాలలో పోసి అటకెక్కించడం పెద్దపని. అది అవుతూనే వడియాలు పెట్టే కార్యక్రమం మొదలు. గుమ్మిడి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, చల్ల/మజ్జిగ మిరపకాయలు, గుమ్మిడి వడియాలూ, పిండి వడియాలు.... అబ్బో! పెద్ద బృహత్తర కార్యక్రమం. నాలుగు ఎండలకే, వడియాలు గలగల లాడుతూ ఎండిపోయేవి. మధ్యలో పచ్చివడియాలు- అన్నంలోకి వేయించుకొని ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ఈలోపు మాపరీక్షలు అయిపోయేవి. మళ్ళీ ఊరగాయల కార్యక్రమం మొదలు. పప్పులడబ్బాలు, వడియాల డబ్బాలు, అన్ని వరసగా ఆటకెక్కేవి. భోషాణపు పెట్టెలు నిండిపోయేవి.  జాడీలు అన్ని బుద్ధిగా కిందికి దిగేవి. మళ్ళీ ఊరగాయల కార్యక్రమం మొదలు. ఆవాలు, మిరపకాయలు, ఉప్పు ఎండబెట్టడం, పనివాళ్ళచేత ఇళ్లలోనే చెక్కరోళ్లలో ఆవకాయ కారాలుకొట్టించడం, అన్నికొలతలు కొలుచుకొని, జాడీ లకెత్తించడం; మరునాడు సొంత తోటల్లోంచికాని, లేదా వాడుగ్గా ఇచ్చే చెట్టునించి కాని కాయలు కోయించి తేవడం, వెంటనే కాయలు నీళ్ళల్లో వేసి కడగడం మావంతు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ముందురోజే "మరకత్తి పీట" ని అటకమీదనుచిదించి కడిగి శుభ్రంచేసి ఉంచేవారు. నాన్నగారు మరకత్తి పీటతో కాయలుతరిగితే, జీడి తీయడం మావంతు. బామ్మ పర్యవేక్షణలో అమ్మ ఆవకాయకలిపి జాడీలకెత్తి ఆమహాయజ్ఞం జయప్రదంగా పూర్తి చేసేది.  మరునాడు మాగాయ, తొక్కుడు పచ్చళ్ళపని.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

          *ముందురోజే ఆవకాయ కాయతోపాటు, మాగాయకికూడా మామిడికాయలు తెచ్చి నీళ్ళల్లో వేసి ఉంచేవారు. తెల్లవారి లేస్తూనే అమ్మ పాతదుప్పటి పరిచి రడీ అయ్యేది. మేమందరం కాయలన్నీ తుడిచి పెడితే, ఇరుగపొరుగు అత్తయ్యలందరూ కదనరంగానికి వచ్చే వీరనారుల్లా కత్తిపీటలువేసుకొని తయారై వచ్చేవారు. వదినా, అత్తయ్యగారు, పిన్నిగారు, అంటూ కబుర్లు చెప్పుకుంటూ-- అలవోకగా రెండువందలకాయల్ని- మాగాయకి, తొక్కుడుపచ్చడికి తరిగేసి, కావాలంటే ఉప్పువేసి ముక్కల్ని జాడీకెత్తేసి మరీ ఇంటి కెళ్లేవారు.*

*ఒకరికి ఒకరు మేమున్నాం మీకు- అన్నట్లు గా ఆరోజుల్లోఉండేవారు. పనిసాయం, మాటసాయం, ఆర్థికసాయం చేసుకుంటూ ఒకరికొకరు అండదండలుగా ఉండేవారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

        *ఆవకాయలపర్వం పూర్తయ్యేసరికి, అత్తయ్యలు, పిల్లలు, వేసంగి సెలవలకి అమ్మమ్మల ఇళ్ళకి రావడం మొదలయ్యేది. ఇంక ఒకటే సందడి. పెద్దలకి వాళ్ళ కబుర్లు, పిల్లలకి వాళ్ల ఆటపాటలతో, చిలిపిచేష్టలతో ఒకటే సందడి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *సాయంత్రం అయ్యేసరికి మావీరమ్మ  పెరడంతా పేడనీళ్లతో   కళ్ళాపుజల్లి ముగ్గేసి అందరికి పట్టెమంచాలు, మడతమంచాలు వేసి, పక్కలువేసి వెళ్ళేది.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

           *ఆరుబయట హరికేన్ లాంతరు మధ్యలో పెట్టుకొని అందరం చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పు కుంటూ భోజనం చేసిన ఆరోజులు ఇప్పటికి నా కళ్ళకి కడుతున్నాయి. నాకే కాదు, ఇలాంటి అనుభవం మీకందరికీ ఉండే ఉంటుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

       *రెండురోజుల తరువాత కొత్తావకాయ, మామిడిపండు తో అన్నం తింటుటే, స్వర్గం బెత్తె డు దూరం లో ఉన్నట్టు ఉంటుంది.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

        *నాన్నగారు వేసవి వస్తూనే ఓ  పాతిక తాటాకు విసిన కర్రలు కొనేసి అందరి మంచాల దగ్గర పెట్టేసివారు. పెరట్లో మంచాలు వేసుకొని పడుకొంటే ఆవేపచెట్టు నుండి వచ్చే గాలి, కొబ్బరాకుల గలగలలు, ఆకాశం లో చుక్కలు, చంద్రుడు, వెన్నె ల, చుక్కల్ని చూపిస్తూ బామ్మ చెప్పే కబుర్లు ,,,,,,,నిద్రఎప్పుడు పట్టింది తెలిసేదికాదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

    *ఇప్పట్లా ఫాన్, ఏసీ లు ఏమీ లేని రోజులు,అయినా ఏమీ కష్టం అనేపెంచేదికాదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

       *ఆరోజులు ఈరోజులు పూర్తిగా అనుభవించిన తరం మాది. మాతరం కనుమరుగైతే బహుశా ఇలాంటి అనుభూతుల్ని మీతో పంచుకొనే పెద్దలు ఇంకోపదేళ్ల తరవాత ఎవరూ ఉండరు.*  *అందుకే ఆనాటి ముచ్చట్లు మీతో పంచుకుందాం అనిపించింది.*

పరమార్ధమంతయు

 *కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు.ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు.  జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని.*


*ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి.  ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపు తో కొలిచాడు.భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు.చివరికి పెదవి విప్పాడు షావుకారు…“మాస్టారుగారూ, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క..ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి.మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?”*


*రాఘవరావు మౌనం వహించాడు.జానకమ్మే అంది.‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే.*

 *అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై లక్షలు, ఇంటికి పదిహేను, మొత్తం ఏభై ఐదు లక్షలు రాదంటారా?” *


*ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు… “చూడండి అమ్మా, మీ లెక్కలు మీకు ఉంటాయి. కొనేవాడి లెక్కలు కోనేవాడికుంటాయి. నేను ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఇల్లు తీసెయాలి. అందుకని స్తలం రేట్ కి కొందామని నా ఉద్దేశ్యం. అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను.  ఆలోచించండి “ అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు.*


*అతను వెళ్ళాక భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.చివరకుజానకమ్మే నిర్ణయం ప్రకటించింది ."మనం ఆలస్యం చేసేకొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారి పోతుంది

నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం. మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు”.ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది, ఇల్లు నలభై లక్షలకు షావుకారికి ఇద్దామనుకుంటున్నామని .

రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు.*


*మర్నాడే రాఘవరావు షావుకారికి కబురుచేసి తమ అంగీకారం చెప్పాడు.  వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరం అయ్యింది.  రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోవడం చాలా స్పీడుగా జరిగిపోయింది.*


*నెలరోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లితండ్రుల్ని హైదరాబాదుకి  తీసుకునివెళ్లాడు. భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు, జానకమ్మ.*


*కొన్నాళ్ళకు మనవల ఆట పాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరూ. మరో నెల రోజులకు కొడుకు కొన్న ప్లాట్ లోకి మారారు అందరూ.రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. కొడుకుని అడిగితే  ‘మనం ఆలస్యం చేయడంవలన, మూడు పడక గదుల ప్లాట్ చేజారిపోయిందని ‘ చెప్పాడు రాజేష్.  కొడుకు, కోడలు మనవలు ఒక గదిలో, రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునే వారు.మూడు నెలలు ముచ్చటగా గడిచాయి.  ఒకరోజు మనవడు ‘నానమ్మా, నేను నీ దగ్గరే పడుకుంటానని’ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. జానకమ్మ ఎంతో సంతోషంతో వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది.  పది రోజులు తర్వాత మనవరాలు కూడా ‘నానమ్మా, నేనూ నీ దగ్గరే పడుకుంటానని’  జానకమ్మ దగ్గరకు వచ్చేసింది.  ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాను మీదకు మారిపోయింది.

ఆరునెలలు గడిచాయి.  పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడటం చూసి, తన పెన్షన్ లో దాచుకున్న ఏభై వేలు పట్టుకొచ్చి కొడుకుకి ఇచ్చాడు

రాఘవరావు. మరో ఆరునెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ లోంచి ఐదువేలు తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవైవేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.  ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని కోడలు సుమిత్ర కాన్వెంట్ లో టీచర్ గా చేరింది.,


*వంట చెయ్యడం, మనవలు ఇద్దరినీ కాన్వెంట్ కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీ గా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువ అయ్యింది ఇంటి పనితో.శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు.వంట తక్కువ, పని కూడా తక్కువే .  విశ్రాంతిగా ఉండేది.ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని ..పని ..పని..!

మరో ఆరు నెలలు గడిచాయి. మనవలు ఇద్దరూ పెందరాళే పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలు లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేలమీద చాప వేసుకుని పడుకుంటున్నారు.*


*ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు “ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు?” అని అడిగాడు.*


*మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ ‘మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను’ అంది.*


*మర్నాడు ఉదయం శివపురం హైస్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల సభ చాలా బాగా జరిగింది.*



*ముందుగా తమకు విద్య నేర్పిన గురువులు అందరికీ 

పాదాభివందనం చేసి, ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు.రాఘవరావు, మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు.అమెరికాలో, ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరునా పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది.పూర్వ విద్యార్ధుల తరపున వరుణ్ మాట్లాడుతూ “ఈసమావేశానికి మూలకారకులు మిదున్, సాత్విక్.వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నా అందరినీ కాంటాక్ట్  చేసి ఇక్కడికి రప్పించారు.వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులు అందరికీ నా నమస్సులు.” అని అన్నాడు.*


*తర్వాత గురువులు అందరికీ ఘనంగా సన్మానంచేసి, వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్ధులు.*


*రాఘవరావు మాట్లాడుతూ,”మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం.అది గురువుగా మా బాధ్యత.మీరు మన ఊరికి, మన స్కూలుకి  పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి.*


మీరు అందరూ పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలి.

మీరు మాకు చేసిన సత్కారం,సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను” అని అన్నాడు. *


*వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.  చివరగా మిదున్ మాట్లాడుతూ… ”మన బాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్ గా తణుకులో ప్రాక్టీసు చేస్తోంది.  ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది.  ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి” అని అన్నాడు.*


*అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు.  రాఘవరావు ఇంటిముందు ఆగాడు మిదున్.*


*రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు.తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి.గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిదున్, రాఘవరావు చేయి పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు.  “మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెబుతున్నాం. మీరు, అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి.  షావుకారు దగ్గరనుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలంక్రితమే పరమేశం గారు నాకు, మీరు ఎంత బెంగగా, దిగులుగా ఉన్నారో చెప్పారు. మేము ఈ రోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే. మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే నేనూ, నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం.  మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు.  మీ ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది.  మన వూరి నుండి తణుకు పది నిముషాల ప్రయాణం. మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక.  కాదనకండి.” అని రాఘవరావు రెండు చేతులూ పట్టుకున్నాడు.*


*కళ్ళమ్మట ఆనందభాష్పాలు కారుతుండగా రాఘవరావు, మిదున్ ని దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు.*


*వెంటనే ఇంట్లోకి వెళ్లి, ప్రతిగుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు.దొడ్లోకి వచ్చి,మామిడిచెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చున్నాడు.లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించి పోయాడు.తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ,చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు.ఐదు నిముషాలు గడిచాక పూర్వ విద్యార్ధులు అందరూ రాఘవరావు దగ్గర శెలవు తీసుకుని వెళ్ళిపోయారు.*


*రాఘవరావు, మిత్రబృందం మిగిలారు.  పరమేశం, సుబ్బారావు ల చేతులు పట్టుకుని  ‘మీ ఋణం ఎలా తీర్చుకోను’ అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో.*


*“రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.*


*ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ. ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది.*


*“పైస జారనీకు* *ప్రాణమున్నంతకు*

*పైస పోయెనేని ప్రాణమాగు*

*పైస లోనగలదు* *పరమార్ధమంతయు,*

*పైసె యిలను వెలసె ప్రాణమగుచు!!*


*అదీ కథలోని నీతి!*

*విశ్రాంతజీవులందరూ,తస్మాత్ జాగ్రత....*


*మీ కంటూ చివరి వరకు ఒక ఇల్లు ఉండడానికి ఉంచుకోండి. మీరు మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించవచ్చు... చివరి దశలో మిమ్మల్నీ ఒక పనిమనుషులుగా మీ పిల్లలు వాడు కొంటారు. విదేశాలకు వెళ్లి 6నెలలు పిల్లలకు మనవళ్లు మనవరాళ్లకు ఊడిగం చేసి రావాల్సి వస్తది.... ఎందుకంటే విదేశాల్లో పనిమనుషులు దొరకరు ఒకవేళ దొరికిన వాళ్లు చాలా కాస్ట్లీ..!   ఫ్రీ గా వచ్చేది అమ్మ నాన్నలు, అత్త మామలు..!  ఆర్నెల్ల ముందు ఫ్లైట్ బుక్ చేసుకుంటే చాలా చౌకగా పడతాది.   6 నెలలు వాడుకున్నంత వాడుకోవచ్చు.. ముఖ్యంగా తల్లులకు ఎక్కువ పని. అందరు పిల్లలూ అలా లేరు కొందరు మాత్రమే...!  సీనియర్ సిటిజన్స్ చివరి రోజుల్లో స్వేచ్ఛగా ఆనందంగా హ్యాపీగా బతకండి...*

తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు

 తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం  -


    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.


      వాము  250 గ్రాములు .


      జీలకర్ర  250 గ్రాములు .


      ధనియాలు  250 గ్రాములు . 


         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.


            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.


  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -


  పాటించవలసిన నియామాలు  -


      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .


 పాటించకూడనివి  -


       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 


          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు. 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

ఓంకార (ప్రణవ) సాధన*

 .

       *ఓంకార (ప్రణవ) సాధన*


      "ఓం" అనే ప్రణవమే ధనుస్సు. లోనున్న జీవాత్మే బాణము. పరమాత్మయే లక్ష్యం. నిశ్చలమైన మనస్సుతో లక్ష్యాన్ని చేరు. లక్ష్యంతో ఐక్యమై నిన్ను నువ్వు అధిష్టించి పరిపాలించుకో.


      "ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరమ్ మా మనుస్మరమ్" 


      ఓం అనే ఏకాక్షరమే బ్రహ్మం . అది నాద స్వరూపమగును, జ్యోతి స్వరూపం అవుతుంది జీవుని యందు స్థితి చెంది ఉన్నది. అదే "నేను" అనే ప్రజ్ఞ. అదే భావంగా, వాక్కుగా మరియు ప్రాణంగా, శ్వాసగా వ్యక్తం అవుతోంది. అంటే తనను తాను ఉచ్చరించుకొంటోంది. దాని యందు అనుస్మరణం సిద్దిస్తే తానక్షరుడగును.


      అన్ని వేదాలు ఘోషించే గమ్యం, అన్ని తపస్వులు ఉధ్ఘాటించే గమ్యం, సమస్త సాధువుల ఏకైక లక్ష్యం ఓంకారమే. ఓంకార బ్రహ్మం యొక్క నాదస్వరూపమే. అన్ని శబ్దాలకు, భావములకు ఓంకారమే మూలము. కాబట్టి "ఓంకారాన్ని" నిరంతరం జపం చెయ్యి. 


       ఓంకారం ఏకాక్షరముగా త్రిగుణాతీతం. అందులోని "అ" కారం "ఉ" కార, "మ" కారములు త్రిగుణములు. అవే సృష్టి కారకములు. త్రిగుణాతీత శుధ్ధచైతన్యంగా తనను తాను తెలియుట. ఓంకారము ఉచ్చరిస్తూ అది తానే అని భావన చేయాలి. ఇదే అనుస్మరణం కావాలి.


       ధనము, పదవి, కుటుంబంపై ఆధారపడే వారు సుఖ దుఃఖాలకు లోను అవుతాడు. శరీరం పై ఆధారపడే వారు కూడా అలాగే దుఃఖితులు అవుతారు. ఇవి అన్నీ తనపై ఆధారపడి ఉన్నాయి. తనపై ఆధారపడే వానిపై ఆధారపడే వారు అవివేకి. తాను ఓంకారం పై ఆధారపడి ఉన్నాను అని తెలిసి దానిపై ఆలంబనగా అనుస్మరణం చేయడం సర్వోత్కృష్టం.


       ఓంకారం మాత్రమే అక్షరం (శాశ్వతమైనది). దాని నుండి మిగిలిన అక్షరాలు జన్మిస్తాయి. ఈ అక్షరాలు తెలిసినవానికి తాను అక్షరుడని తెలుస్తుంది. అదే ఉన్నతోన్నతమైన సిద్ది. ఈ సిద్ది పొందిన వారికి సమస్తం సిద్దించగలదు. అందుకే ఓంకారాన్ని నిరంతరం అనుస్మరణం చేయమని భగవానుడు బోధిస్తున్నాడు.


       ఓంకారాన్ని అనుస్మరణ రూపంలో ఆశ్రయిస్తే నువ్వు ఎన్నో మార్పులకు లోను అవుతావు. శరీరం యొక్క, పుట్టుక, బుద్ది, నాశము అను మార్పులను కూడా గమనించగల సనాతనుడుగా నిన్ను నువ్వు తెలుసుకోగలవు. సమస్త మార్పుల యందు మార్పు చెందని వానిగా నిన్ను నువ్వు తెలుసుకో గలవు. నువ్వు అక్షరుడవుగా, శాశ్వతంగా నిలువ గలవు. కాబట్టి ఓంకారాన్ని అనుస్మరణ చేయాలి.


       ఓంకారమే బ్రహ్మం. అది వ్యక్త బ్రహ్మం. దానినే ఆత్మ అంటారు. అనుస్మరణచే అది నువ్వే అని తెలియగలవు. అప్పుడు నీ నిజమైన మహిమను నువ్వు తెలుసుకుంటావు. లోపల బయటా శుచి నేర్చుకుంటూ ఓంకారాన్ని నీ యందు జరుగుతున్న స్పందనమును గుర్తించి ధ్యానం చేయాలి.


      ఓంకారాన్ని నిరంతరం అనుస్మరణ మార్గంలో తెలిసిన వారు కదలకుండానే దూర ప్రయాణం చేయగలడు. ప్రయాణిస్తూ స్థిరమైన స్థితిలో ఉండగలడు. కదిలే దానిలో కదలని వాడుగా, కదలని దానిలో కదిలే వాడుగా తన్ను తాను తెలుసుకోగలడు. 


      ఓంకారం తెలియాలంటే ఓంకారాన్ని నిరంతరం జపం చేయడమే మార్గం. ఆ స్మరణం అనుస్మరణం కావాలి. అంటే నిరంతరం గా జరగాలి. నిజానికి ఓంకారం నీ యందు నిరంతరం జరుగుతూనే ఉంది. దాన్ని ప్రశాంతంగా గమనించడమే నీ సాధన. వైఖరితో ఉచ్చరించడం ప్రాధమిక సాధన. జరుగుతున్న ఓంకారాన్ని గమనించడం ఉత్తమ సాధన. అది నువ్వే అని తెలియడం సిద్ది. అప్పుడు నువ్వు నీ శరీరం కాదు అని కూడా తెలుస్తుంది. ఇదే ముక్తి.

గ్రహణం తర్వాత

 శ్లోకం:☝️

*అహంకారగ్రహాన్ముక్తః*

 *స్వరూపముపపద్యతే ।*

*చంద్రవద్విమలః పూర్ణః*

 *సదానందః స్వయంప్రభః ll*

 అధ్యాత్మోపనిషత్-11


భావం: గ్రహణం తర్వాత (రాహువు నుండి విముక్తమైన) చంద్రుని వలె, అహంకారపు పట్టు నుండి విముక్తి పొందిన జీవుడు శుద్ధంగా, పూర్ణంగా, నిత్యానందంగా, స్వయంప్రకాశవంతంగా ఉన్న తన స్వరూపాన్ని పొందుతాడు.🙏

ఆలయాలు

 ⑴ సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

కాశ్మీర్.. *బాసరా (తెలంగాణ)..*

⑵ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో... 

పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి (తెలంగాణ)..* 

⑶ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాలేశ్వరం (తెలంగాణ)*

⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. 

నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)

*గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)*


*ధర్మపురి:-*

యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. 

(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా)

బ్రహ్మదేవుడు (సృష్టి)

నరసింహుడు, (స్థితి)

శివుడు, (లయం)

యముడు, (కాలం)

అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది


*కాళేశ్వరం:-*

ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. 

గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. 

సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే.. 


*వేములవాడ:-*

అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)


*మెదక్:-*

సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది.. 


*యాదగిరి:-*

అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం.. 


*కొండగట్టు:-*

శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.. 


*బాసర (వ్యాసపురి):-*

వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.. 


*భద్రాచలం:-*

శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. 


*చెన్నూర్:-*

గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. 


*మంథని:-*

మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. 


*బోదన్:-*

బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే. 


🙏 *మన తెలంగాణ ఘన కీర్తి గల తెలుగు నేల* *మనదైనందుకు తెలుగు వారిగా గర్వ పడదాం* 🙏

సుభాషితమ్


            _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝


*కదర్థిస్యాపి హి ధైర్యవృత్తేః*

*న శక్యతే ధైర్యగుణఃప్రమార్ష్టుం|*

*అధోముఖస్యాపి కృతస్య వహ్నేః*

*నాధశ్శిఖా యాతి కదాచిదేవ||*


తా𝕝𝕝 

*నిప్పును తలక్రిందులుగా పట్టుకున్నప్పటికీ దాని జ్వాల పైకే ఎగిసిపడుతుందికదా.... అట్లే ఎన్ని కష్టాలెదురైననూ ధీమంతుడు తన ధైర్యాన్ని విడనాడడు*.....

[15/04, 9:11 am] Srmada Vdk Br Fn: *శ్రీ సూక్తము-10*


*మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి౹*

*పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః॥*


తా॥ 

ఓ లక్ష్మీ! మనస్సులోని కోరిక, సంకల్పము, మాటయందలి సత్యము, పశువులవలన క్షీరాదులు, అన్నము మున్నగునవి, సంపద, కీర్తి - ఇవన్నియును నాకు గలుగు గాక!


 శ్లోకం:

*దశ ధర్మం న జానంతి ధృతరాష్ట్ర నిబోధ తాన్ ।*

*మత్తః ప్రమత్త ఉన్మత్తః శ్రాంతః క్రుద్ధో బుభుక్షితః ॥*

*త్వరమాణశ్చ భీరుశ్చ లుబ్ధః కామీ చ తే దశ ।*

*తస్మాదేతేషు భావేషు న ప్రసజ్జేత పండితః॥*

                               ~విదుర నీతి


భావం: ధృతరాష్ట్ర మహారాజ! ధర్మం తెలియని వారు లేక ఆచరించని వారు పది రకాలుగా ఉంటారు – మత్తులో ఉన్నవారు, శ్రద్దలేనివారు, పిచ్చివారు, అలసటతో ఉన్నవారు, కోపంతో ఉన్నవారు, ఆకలితో అలమటించేవారు, తొందరపాటు మనుషులు, భయాందోళనలు గలవారు లేక పిరికివారు, దురాశాపరులు లేక పిసినారులు, మరియు కామాంధులు. అందుకే పండితులు వీళ్లందరితో సాన్నిహిత్యాన్ని తగ్గించుకోవాలి.


*శ్రీ సూక్తము-11*


*కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ౹*

*శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్॥*


తా॥ 

లక్ష్మీదేవి కర్దముడను పుత్రుని సుపుత్రుడు కలదిగా అయినది. కావున ఓ కర్దముడా! నీవు నా యింటియందుండుము. పద్మమాలికలు ధరించి నదియు, నీ తల్లియు నగు లక్ష్మీదేవిని నా వంశమున నుండునట్లు చేయుము.


 శ్రీరామకృష్ణమఠపు ప్రచురణలలోని “శంకర ఉవాచ” అనే పుస్తకములో *అవిద్య, గురువు -శిష్యుడు, నే నెవడు, వైరాగ్యస్తుతి, నిర్వాణ షట్కము, జ్ఞానము, ఆత్మ, బ్రహ్మము, పరిశిష్టము, ప్రార్థన* అనే విషయముల గుఱించి వ్రాయబడింది. వాటిలో *“అవిద్య”* గుఱించి మొదట్లో వ్రాయడం జరిగింది. ఇప్పుడు *‘గురువు - శిష్యుడు’* గుఱించి ఈ రోజునుంచి మొదలుపెట్టబడింది.


*శ్రీ శంకర ఉవాచ:*


*గురువు ~ శిష్యుడు.*


1. వేదవిదుడు, పాపరహితుడు, కోరికలు లేనివాడు, బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడు, బ్రహ్మనిష్ఠుడు, ఇంధనములేని అగ్నివలె శాంతుడు, అవ్యాజకరుణా సముద్రుడు, శరణాగత సుజనులకు మిత్రుడు అగువాడు నిజమగు గురువు.