30, జూన్ 2023, శుక్రవారం

టచ్‌తోనే జీవితం

 నిజమే కదా మరి... 

1. ఇది గడియారాన్ని తినేసింది

2. ఇది టార్చ్ లైట్‌ను తినేసింది

3. ఇది పోస్టు కార్డుల్ని తినేసింది

4. ఇది పుస్తకాల్ని తినేసింది

5. ఇది రేడియోను మింగేసింది

6. ఇది టేప్‌రికార్డర్‌ను తినేసింది

7. ఇది కెమెరాను మాయం చేసింది

8. ఇది కాలిక్యులేటర్‌ను తినేసింది

9. ఇది ఇరుగుపొరుగుతో దోస్తీ తినేసింది

10. ఇది బంధుత్వాల్ని తినేసింది

11. ఇది మన మెమొరీని తినేసింది

12. థియేటర్ లేదు

.

.

.

నాటకం లేదు, 

టీవీ లేదు, 

ఆట లేదు,పాట లేదు... 

ఇదే బ్యాంకు,ఇదే హోటల్,ఇదే కిరాణ షాపు... 

ఇదే డాక్టర్, ఇదే జ్యోతిష్కుడు... 

అసలు మార్కెట్ అంటేనే ఇది... 

బయటికి వెళ్తే కదా, అంతా వర్క్ ఫ్రమ్ ఫోన్... 

అంతా స్మార్ట్ ఫోన్‌దే రాజ్యం... 

మనిషి పిచ్చోడవుతుంటే ఫోన్ స్మార్ట్‌గా  మారుతోంది.

వేలు ప్రపంచాన్ని,సారీ మనిషి జీవితాన్ని శాసిస్తోంది..

నోరు మ్యూట్‌లో ఉంది... 

ఎస్, నిజమే... టచ్‌తోనే జీవితం... 

కానీ ఎవరూ టచ్‌లో లేరు...

ఈ రోజు పదము

 206వ రోజు: (భృగు వారము) 30-06-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

కొడుకు: అంగజుడు, అంగభవుడు, అబ్బాయి, అర్భకుడు, ఆత్మజుడు, ఆత్మసంభవుడు, ఔరసుడు, కొమరుడు, కుమారుడు, తనయుడు, తనూభవుడు, దేహజుడు, నందనుడు, నందివర్ధనుడు, పుత్రుడు, బాలుడు, బిడ్డడు, సుతుడు, మగబిడ్డ.


 ఈ రోజు పద్యము:


 సిరిగల వాని కెయ్యడల చేసిన మేలది నిష్పలం బగున్/

నెఱి గుఱిగాడు పేదలకు నేర్పున చేసిన సత్పలంబగున్/

వఱపున వచ్చి మేఘు డొక వర్షము వాడినచేలమీదటన్/

కురిసిన గాక అంబుధుల కర్వగ నేమి ఫలంబు భాస్కరా!


ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం. పేదవానికి చేస్తే ప్రయోజనం కలుగుతుంది.  వానలు లేనప్పుడు ఎండిపోతున్న చేల మీద మేఘుడు వాన కురిస్తే ఫలితం ఉంటుంది కాని, సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా!

సన్యాసం అంటే ఏమిటి

 *సన్యాసం అంటే ఏమిటి?? - కొంచం వివరంగా తెలుసుకొందాము...!!!*


సన్యాసమంటే కాషాయం కాదు, ఇంటిని వదిలిపోవడం కాదు, వ్యక్తిత్వ విసర్జన...


_సన్యాసమంటే..._

ప్రపంచం నుంచీ, మరి దేని నుంచీ వెనక్కి తగ్గి, సర్వం వదిలి వేయడం కాదు, సమస్తాన్ని ప్రేమతో హృదయానికి హత్తుకోవడం, ఆ ఆలింగనంలో సంసారము అన్నీ వుంటాయి...


_సన్యాసమంటే..._

అహంకార పరిత్యాగం. కోర్కెలనీ, నాది అనే భావాన్ని, దాని పట్ల అనురక్తిని త్యజించడం...


_సన్యాసమంటే.._ 

పరిశుద్ధ జ్ఞానం...

 

ఇల్లు, సంసారం వదిలి కాషాయం కట్టడం కన్నా, ప్రేమతో ప్రపంచాన్ని తనలోనికి తీసుకోవడం ఉత్తమ సాధకుని లక్షణం...

నిజమైన సాధకులు తమ ప్రేమను విశ్వప్రేమగా విస్తృతపరచి, సమస్త ప్రపంచాన్ని ప్రేమతో హత్తుకుంటారు. 

ప్రేమ, సమదృష్టి అలవర్చుకున్నవారు పరిత్యజించాలి, సన్యసించించాలి అని అనుకోరు...


నిజమైన సంసారం మనస్సంసారం, దాన్ని వదలాలి గాని, ఇల్లునీ, ఇల్లాల్ని కాదు. 

కర్మ జీవనాన్ని పరిత్యజించవలసిన పనిలేదు, సర్వ కర్మలు ఆచరిస్తూ, నిష్కామంగా ఉంటూ, స్వస్థితి చెడగొట్టుకోకుండా ఉన్న వారే నిజమైన సాధకులు...


విషయవస్తువుల పట్ల అనురక్తచిత్తుడైన వ్యక్తి అరణ్యాలకు వెళ్ళిన లాభం లేదు. 

మనో నిగ్రహం లేక ఎక్కడకు పోయినను ఇక్కట్లే, సత్కార్యాచరణుడై పంచేద్రియ నిగ్రహం గల వ్యక్తికి గృహజీవనమే తపోవనం...

పెద్దన యాశీస్సులు

 శుభోదయం🙏


పెద్దన  యాశీస్సులు

                              ------------------------------ 


శా: "  శ్రీ వక్షోజ  కురంగనాభ  మెదపైఁ  జెన్నొంద  విశ్వంభరా


          దేవిం దత్కమలా  సమీపమున  బ్రీతిం  నిల్పినాడో  యనం


           గా వందారు  సనందనాది  నిజ  భక్త శ్రేణికిం   దోచు   రా

           

           జీవాక్షుండుఁ  గృతార్ధు  సేయు  శుభదృష్టిన్  కృష్ణరాయాధిపున్


                           మను చరిత్రము  కావ్యారంభమున  కృతిభర్త యగు శ్రీకృష్ణరాయ  సార్వ భౌమునకు  పెద్దన యెసఁగు

ఆశీర్వచనము.


                   ఆది లక్ష్మియు  శ్రీహరియు  సరసములలో  దేలుచుండ  నామె వక్షోజములకు  అలంకరించుకొనిన  కస్తూరి

శ్రీహరి  వక్షస్థలమున  నంటినది.  అది జూచి  సనక సనందనాది మునులు ఆహా! శ్రీహరి యెంతగొప్పవాడు! శ్రీ దేవితో సమముగా భూదేవికి గూడ సముచిత స్థానమునొసంగినాడనుచు మురియుచు  వందనముల నొనరింప  సంతసమున

విలసిల్లు  ఆహరి దయాళువై కృష్ణరాయలను  శుభదృష్టితో జూచి యనుగ్రహించుగాక!

   

                                అనిదీని తాత్పర్యము!


         శ్రీదేవి  విష్ణువక్షస్థల  నివాసి. భూదేవికి ఆభాగ్యములేదు. ఇపుడీ కస్తురి పూతలు జూడ ఆమెకుగూడ హరి తనహృదయమున  నివాస మేర్పరచెనా ?యను భ్రాంతిని సనందనాదులకు కలిగించినది.కావున భ్రాంతిమంత

మను నలంకారము ఇందుకలదు.

                         

                 కృతిభర్త రాయల కిరువురు భార్యలు  తిరుమలదేవి, చిన్నాదేవి,లు. వారిరువురను  శ్రీహరివలెనీవు సమముగా నేలి దక్షిణ నాయకుడ వనిపించు కొందువుగాక! యని రాయల కుపదేశము (వ్యంగ్యము) 


           నావిష్ణుః పృధివీపతిః"- అను న్యాయముచే  ప్రభువుకూడా విష్ణువుతో సమానుడే! విష్ణువు ,జగత్పోషకుడు. రాయలుకూడ జగద్రక్షకుఁడై వర్ధిల్లవలెనని భావము.


                 శ్రీదేవి కలిమిచే భాగ్యము, భూదేవి కలిమిచే  పంటల ,సమృధ్ధితో  నొప్పుదువుగాక యని యాశీస్సు!


ఈవిధముగా "ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశోవాపి తన్ముఖమ్" అను నాలంకారిక సూత్రాను సారముగా  ఆశీర్వాద పురస్సరముగా పెద్దనగారు  మనుచరిత్రమును  ప్రారంభించినారు. 


                                                           స్వస్తి!🙏🙏🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷

⚜ శ్రీ సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం

 🕉 మన గుడి : 


⚜ అరుణాచల్ ప్రదేశ్ : జైరో (సుబన్సీరి జిల్లా)


⚜ శ్రీ సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం



💠 దేవతలు సైతం పూజించే గొప్ప దైవం ఈశ్వరుడు. ఆయన ఎంత శక్తివంతమైన దేవుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


💠 ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని సుబాన్సిరి జిల్లాలోని జైరో వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం బయటపడింది. 

2004 సంవత్సరం శ్రావణమాసంలో  దట్టమైన అడవి మధ్యలో ఈ శివలింగం బయటపడింది. ఈ శివలింగం గురించి శివపురాణంలోని రుద్రకాండం 17 అధ్యాయంలో ఉంది. 


💠 25 అడుగుల ఎత్తు, 22 అడుగుల చుట్టుకొలత ఉన్న ఈ సహజసిద్దమైన రాయి క్రింద నిరంతరం ప్రవహించే జలధార ఉంది.

 ఆ లింగం చుట్టూ పరమశివుని పరివారమైన పార్వతీదేవి, గణేశుడు మొదలైనవారి విగ్రహాలు లింగరూపంలోనే ఉన్నాయి.


💠 రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో లభించిన దేవతా విగ్రహాలను ఆయా ప్రదేశాల్లోనే పునర్ ప్రతిష్టించడంగాని, పురావస్తు ప్రదర్శనశాలకు తరలించడంగాని చేస్తున్నారు. వందలాది సంవత్సరాలుగా ఈ ప్రదేశాలలో ప్రచారంలో ఉన్న పురాణగాథలు, విశ్వాసాలకు బలం చేకూర్చేవిధంగానే ఈ విగ్రహాలు లభ్యమవుతున్నాయని పరిశోధకులు అంటున్నారు.


💠 ఈ శ్రీ సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం..దీని పొడవు 25అడుగులు దీని చుట్టుకొలత 22 అడుగులు

శివుడు తల పై భాగంలో రుద్రమల మరియు వాసుకి నాగను ధరించారు.. లింగం పునాది నుండి నిరంతరం నీటి ప్రవాహాన్ని మనం స్ఫష్టంగా చూడవచ్చు..


💠 శివరాత్రి సమయంలో ప్రతి 3(మూడు)సం.. లకు ఒకసారి పాములు ఈ శివలింగాన్ని ఆరాధిస్తాయని నమ్ముతారు...


💠 శివలింగం చుట్టూ రాతితో ఏర్పడిన పాము ఆకృతిని గమనించగలరు.

శివలింగం వెనుక నిలబడి ఉన్న భంగిమలో పార్వతి, వారి కుమారులు గణేష్,  ఎడమ వైపున కూర్చున్న భంగిమలో మరియు శివలింగానికి కుడి వైపున కార్తికేయుడి సహజంగా ఏర్పడిన ఆకారాలను గమనించారు. 

సహజ శివలింగం దిగువన పవిత్ర నంది ఎద్దు. నంది చాలా భాగం భూగర్భంలో ఉన్నందున పాక్షికంగా కనిపిస్తుంది.


💠 మహాశివరాత్రిని ఇక్కడ గొప్పగా జరుపుకుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి 3 సంవత్సరాలకు శివరాత్రి సమయంలో పాములచే శివలింగాన్ని పూజిస్తారని స్థానికులు నమ్ముతారు. 


💠 శివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మా మరియు విష్ణువుని పూజిస్తారు.


💠 ఉత్తరప్రదేశ్ నుండి చాలా మంది ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చి  ఈ ఆలయ దర్శనం చేసుకుంటారు.

మహాశివరాత్రి సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి కూడా  ప్రజలు శ్రీ సిద్ధేశ్వర్ నాథ్ మందిరాన్ని సందర్శించి సహజ శివలింగాన్ని దర్శిస్తారు . 


💠 అరుణాచల్ ప్రదేశ్‌లోని చాలా మంది ట్రావెల్ ఏజెంట్లు మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళరు, కానీ ప్రత్యేకంగా అడిగితే   తీసుకువెళతారు. అడగండి.



👉 ఎలా చేరుకోవాలి

 

💠 ఈ ఆలయం గౌహతి నుండి 435km ఇటానగర్ నుండి 114km .

అస్సాం అరుణాచాలప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నది ఈ ఆలయం..

Ziro టౌన్ కి 5km దూరంలో ఉన్నది.

 ఇది సముద్ర మట్టానికి 5754 ఎత్తులో ఉన్నది...

అతని వలననే

అతని వలననే  







వాట్సాపులో వచ్చిన ఒక వీడియోకు నే నిచ్చిన  అక్షర రూపం 

సురేష్ ఒక యువకుడు ఉద్యోగరీత్యా తల్లిదండ్రులను వదిలి ఒంటరిగా ఉంటున్నాడు.  తాను నివసించే రూముకు దగ్గరలోనే ఒక టిఫిన్ సెంటరు వుంది ఆ సెంటరులో ఎప్పుడు రద్దీగా ఉంటుంది.  యెంత రద్దీ అంటే అక్కడ టిఫిన్ తిన్నతరువాత కౌంటరులో బిల్లు చెల్లించాలంటే కనీసం 5నిముషాలు ఆగవలసి ఉంటుంది అంటే అక్కడి రద్దీని ఊహించుకోవచ్చు. రోజు సురేష్ ఆ హోటలుకు వెళుతూ ఉండటం వలన అక్కడి వేయిటరులు ఇంకా ఇతర ఉద్యోగస్స్తులు పరిచయం అయ్యారు.  అందువల్ల వారికి సురేష్ ఏమి తింట్టాడు ఏమి తాగుతాడు అంటే కాఫీ, టీలు అన్ని తెలుసు కాబట్టి అతనిని చూడంగానే ఆయన అడగకుండానే అన్ని సమకూర్చేవారు.  అది సురేషుకి కొంత ఆనందం  కలుగచేసింది. తన పరపతి హోటల్లో ఉందని అనుకోని తరచూ తన స్నేహితులిని కూడా ఆ హోటలుకే తీసుకొని వచ్చేవాడు. 

ఇది ఇలా ఉండగా సురేష్ గత కొంతకాలంగా ఒక విషయాన్ని గమనించాడు అదేమిటంటే ఒక నడివయస్కుడు పాత బట్టలు వేసుకొని సరిగా షెవింగు కూడా లేకుండా ఉన్నతను రోజు ఆ హోటలుకు వచ్చి టిఫిన్ తిని అక్కడి మందలో కలిసి చిన్నగా బిల్లు కట్టకుండా తప్పించుకునేవాడు. ఈ విషయాన్నీ మన హీరో సురేష్ చాలా కాలంగా గమనిస్తూ వున్నాడు. ఎట్లాగైనా ఈ మోసాన్ని ఆ హోటలు యజమానితో చెప్పి అతనికి శిక్ష పడేవిధంగా చేసి తన గొప్పతనం చాటుకోవాలని ప్రయత్నం  చేయసాగాడు. కానీ రోజు కౌంటరు దగ్గర అనేకమంది ఉండటంతో ఆ కౌంటరుమీద కూర్చున్న యజమానితో మాట్లాడటమే కుదరటంలేదు.  రోజు రోజుకు సురేషుకు అసహనం పెరిగిపోతున్నది. ఇదేమిటి ఈ హోటలు యజమానికి ఇంత నష్టం వస్తువున్న ఒక్క వెయిటర్ కూడా ఎందుకు చెప్పటంలేదు అని మనసులో అనుకోనగానే  అక్కడి వెయిటర్లమీద కోపం వచ్చింది 

ఒకరోజు ఎందుకో కాని టిఫిన్సెంటరులో కస్టమరులు చాలా తక్కువగా వున్నారు. అప్పుడే మన సురేషు అనుకున్నాడు ఇది సరైన సమయం నేను ఆ మనిషి మోసాన్ని హోటలు యజమానికి చెపుతాను అని అనుకోని కౌంటరు వద్ద కూర్చున్న యజమానితో తానూ రోజు చూస్తున్న విషయాన్ని చెప్పి మీరు పోలీసు కంప్లీన్ట్ చేయండి అటువంటి మోసగాళ్లను అస్సలు వదిలి పెట్ట కూడదు.  కావాలంటే నేను మీకు సాక్ష్యం కూడా చెపుతాను.  నా రక్తం వుడుకుతున్నది అని ఆవేశంతో చెప్పాడు.   అది విన్న హోటలు యజమాని తన సీటు మీది నుంచి లేచి ఒక టేబులు ముందర కూర్చొని సురేషును కూడా అక్కడ కూర్చోమని సైగ చేసాడు. ఇద్దరు టేబులు వద్ద కూర్చోగానే హోటలు యజమాని నవ్వుతూ ఒక వేటర్ని పిలిచి మా ఇద్దరికీ రెండు మంచి కాఫీలు తీసుకునిరా అని ఆర్డర్ వేసి ప్రశాంత వదనంతో ఇలా అన్నాడు చూడు సోదర నీవు గత కోద్ది కాలంగా మా హోటలుకు వస్తువున్నావు నీవు వచ్చినప్పటినుండి నీవు చూసినది నీవు చెప్పావు.  కానీ అతను చాలా  కాలంగా నా హోటలుకు వస్తువున్నాడు. అతను రావటం బిల్లు కట్టకుండా పోవటం నేనెరుగుదును అని అన్నాడు.  అప్పుడు ఆశ్చర్యపడటం సురేషు వంతయింది. ఆ అలానా అయితే మరి ఇంతవరకు అతని మీద ఎందుకు చర్యతీసుకోలేదు అని అడిగాడు.  ఇంతలో వెయిటరు కాఫీ తీసుకొని వచ్చాడు. మిత్రమా ముందు కాఫీ తాగు అంతా వివరంగా చెపుతాను అని హోటలు యజమాని అన్నాడు.  సురేషు మెదడులో అనేక సందేహాలు ఇదేమిటి నేను ఇతనికి మేలుచేసే విషయంచెప్పి మార్కులు కొట్టేద్దాము అని అనుకున్నాను.  ఈయనేమో ఎంతో కూలుగా ఉండటమే కాకుండా అంతా తనకు తెలుసు అంటున్నాడు అని మనసులో అనుకున్నాడు. మిత్రమా కాఫీ తాగు ముందు అంతా నీకు సవివరంగా చెపుతాగా అని అన్నాడు. 

నా కొక ప్రశ్నకు సమాధానం చెప్పు నా హోటలులో రద్దీ ఎలావుంది అని అడిగాడు యజమాని.  మీ హోటలుకు ఏమిటి సారూ ఈ ఏరియాలో వున్న అన్ని హోటళ్లకన్నా ఎక్కువ రద్దీ మీదే మాతో మాట్లాడాలని నేను ఎన్నో రోజులనుండి చూస్తుంటే ఈ రోజు నాకు అవకాశం లభించింది అన్నాడు. అంటే నా హోటలు మంచిగా నడుస్తున్నదని నీవు వప్పుకున్నావన్నమాట అని అన్నాడు.  నేను వప్పుకోవటం ఏమిటి మీ హోటలుకు వచ్చిన ఏ కొత్తవారయినా అదే అంటాడు. ఇంత రద్దీగా ఉండటానికి కారణం అతనే అని అన్నాడు. నిజానికి  ఈ రోజు కూడా నీకు రద్దీగానే ఉండేది కానీ ఈ రోజు పండగ చేయబట్టి ఎవ్వరు బయటి టిఫిను చేయరు ఎంచక్కా ఇంట్లో రకరకాల వంటాకాలు వండుకొని తింటారు. నిజానికి నేను ఈ రోజు హోటలుకు సెలవు  ఇవ్వవలసింది. కానీ నీలా వంటరిగా వుండే వాళ్లకు ఇబ్బంది అవుతుందని టిఫిన్ సెంటరు తెరిచాను అని అన్నాడు. 

ఈ రోజు నా హోటలు ఇంతమంది కస్టమరులతో కళ కళ లాడుతూ ఉన్నదంటే దానికి కారణం ఆయనే తెలుసా అన్నాడు. ఇదేమిటి ఒక బిల్లు ఎగ్గొట్టే వాడు మీ హోటలు అభివృద్ధికి కారణమా నిజానికి అతను ఎగవేసిన డబ్బులు చాలా మీరు నష్టపోయారు. అయినా కూడా మీరు అతనే మీ అభివృద్ధికి కారణం అని అంటున్నారు ఇదెలా సాధ్యం అని సురేషు అన్నాడు. చెపుతాను విను అని హోటలు యెజమాని చెప్పటం మొదలు  పెట్టాడు. మొదట్లో నేనుకూడా అతను బిల్లు ఎగవేసి పోవటం గమనించి అతనిమీద కక్ష సాధిద్దామని ఒకరోజు అతనిని వెంబడించాను.  ఆ విషయం తెలియక అతను ఇక్కడికి దగ్గరిలోవున్నఒక  చెట్టుక్రింద కూర్చొని భగవంతుని ఇలా ప్రార్ధిసున్నాడు " భగవంతుడా ఆ హోటలులో ఎప్పుడు రద్దీగా ఉండేటట్లు చూడు అప్పుడే నేను బిల్లు కట్టకుండా తప్పించుకోగలుగుతాను" అది విన్న నాకు అతనిమీద కోపం పూర్తిగా పోయింది.  దానికి బదులుగా ఆయనమీద నాకు జాలి కలిగింది. ఈ రోజు నేను ఈ స్థితిలో వున్నానంటే దానికి కారణం అతనే అవునంటావా కాదంటావా అన్నాడు. భగవంతుడు ఆతని ప్రార్ధనను మన్నించి నా హోటలులో రద్దీని పెంచాడని ఎందుకు అనుకోకూడదు. నిజానికి అతని స్వార్ధం కేవలం అతను బిల్లు కట్టుకోకుండా తప్పించుకోవటమే కానీ అతనికి తెలియకుండా ఆ భగవంతున్ని నాకు ఎక్కువ కస్టమర్లు రావాలని ప్రార్ధించాడు. అందుకోనేమో అతను నాహోటలుకు వచ్చిన నాటినుండి హోటల్లో రద్దీ ఎక్కువ అయ్యింది నా రాబడిరోజు రోజుకు  పెరగసాదింది. అతను రోజు తింటే యాబై లేక వంద రూపాయల టిఫిను  తింటాడు. కానీ నాకు లాభం వేలల్లో వస్తువున్నది. ఇప్పుడు చెప్పు నాకు అతని వల్ల లాభమా లేక నష్టమా అని అన్నాడు. ఇలా ఆలోచించేవారు కూడా వుంటారా అని నాకు ఆక్షణంలో అనిపించింది. 

 ఆ హోటలు యజమాని మంచితనం సురేషు ఆనందాన్ని ఇచ్చింది.  ఇద్దరు కాఫీలు తాగటం అయ్యింది. బిల్లు ఇస్తానని సురేసు అంటే మీరు నా అతిధులు మీకు నేను ఆతిధ్యం ఇచ్చాను అని అని ఇంకొక మాట అన్నాడు.  మీరు నేను అతని వద్ద బిల్లు తీసుకోవటం లేదనుకున్న నిజానికి ఏ రోజయిన ఆయన రాకపోతే నాకు ఎందుకో మనసు బాధ  పడుతుంది. ఈ రోజు ఆయనకు ఏమైంది ఎందుకు రాలేదు అని అనుకుంటాను. ఆయన రావటం అలానే తప్పించుకొని వెళ్ళటం నేను ఓరగంట కనిపెడుతాను. నిజానికి ఆయన తినే టిఫిన్లు నేను భగవంతునికి అర్పించిన నివేదనగా భావిస్తాను అని అన్నాడు. హోటలు యజమాని ఔదార్యానికి సురేషు హృదయం పులకరించిపోయింది. 

సామాన్యంగా మనమన్దరము చేసే ప్రతిపనికి అప్పుడే ప్రతిఫలం  కావాలనుకుంటాము. కానీ భగవంతుని లీలలు మనకు అర్ధంకావు అయన కొన్ని మన వద్ద తీసుకొని వాటికి బదులుగా  ఎన్నో మనకు  ఇస్తాడు.  ఈ విషయం తెలుసుకుంటే భూమిమీద ప్రతివక్కరు సంతోషంగా వుంటారు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః. 

మీ 

భార్గవ శర్మ

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 106*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 106*


మలయకేతు రాక్షసామాత్యుని దర్శనం కోసం కబురు పంపించాడు. 


ఆ వార్త చేరే సమయానికి పాటలీపుత్రం నుంచి రాక్షసభృతుడైన ప్రతీహారి వచ్చాడు. అతనితో రహస్యంగా ముచ్చటించేందు కోసం రాక్షసుడు తన సిబ్బందిని పిలిచి "మాకు తలనొప్పిగా ఉంది. ఈరోజు ఎవరినీ దర్శించం..." అని చెప్పాడు.  


ఆ తర్వాత కొద్దిసేపటికి మలయకేతు పంపిన భటుడు వచ్చి, రాక్షస దర్శనం కాక తిరిగి వెళ్లి "ప్రభూ ! అమాత్యుల వారికి మా చెడ్డ తలనొప్పిగా వున్నదట.... ఈ రోజు వారి దర్శనం ఎవరికీ లభించదట" అని మనవి చేశాడు. 


బాగురాయణుడు కల్పించుకొని "అయ్యో... పాపం... మనమే వెళ్లి ఆయన్ని పరామర్శించి వద్దాం పదండి" అంటూ మలయకేతును ప్రోత్సహించాడు. ఇద్దరూ కలిసి రాక్షస నివాసానికి వెళ్లారు. ఆ నివాసం బయటనే కాలు గాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్న సిద్దార్థకుడు వాళ్ళని చూసి గతుక్కుమని "అమాత్యుల వారిది కల్పిత శిరోవేదన అని మీకు తెలిసిపోయిందా ?" అనేసి నాలిక కరుచుకున్నాడు. 


మలయకేతు వులిక్కిపడి "ఏమిటి ? తలనొప్పి ? అబద్ధమా ?" అంటూ ముందుకు వెళ్లి అంతకు ముందు సిద్ధార్థకుడు పచార్లు చేసిన చోటనున్న కిటికీ వద్దకు చేరాడు. లోపలి నుంచి మాటలు వినిపించసాగాయి. 


"భళా .... చాణక్య చంద్రగుప్తుల మధ్య విరోధము కల్పించబడి, చాణక్యుడు అతని నుండి విడిపోయినాడన్న మాట" అన్నాడు రాక్షసుడు ఉత్సాహంతో. 


ప్రతీహారి నవ్వి "అవును. నీకంటే రాక్షసుడే మంచివాడని చంద్రగుప్తుడన్నాడు. అయితే ఆ రాక్షసుడినే తెచ్చి మంత్రిని చేసుకోమని చెప్పి చాణక్యుడు వెళ్లిపోయాడు. ఇక మీ అభీష్టం సిద్ధించడానికి ఆటంకాలన్నీ తొలగిపోయినట్లే...." అని చెప్పాడు. 


రాక్షసుడు సంతోషంతో పగలబడి నవ్వి "కాదా మరి. చంద్రుడు నా నామస్మరణ మొదలు పెట్టాడంటే, నా సంకల్పం సిద్ధించినట్లే...." అన్నాడు సంబరంతో. 


ఆ సంభాషణలను కిటికీ బయటనుంచి ఆలకించిన మలయకేతు ఆవేశంతో ఏదో అనబోగా, బాగురాయణుడు సైగలతో అతనిని వారించి అవతలికి తీసుకెళ్ళాడు. ఇద్దరూ రాజభవనం చేరారు. 


"ఆ సంభాషణల ఆంతర్యమేమిటో బోధపడిందా ? చంద్రగుప్తుడు ప్రశంసించాడట... యీయన ఇక్కడ పరవశించిపోతున్నాడట... ఎందులకటా ?" అన్నాడు మలయకేతు ఉక్రోషంతో. 


"మగధరాజ్య మహామాత్య పదవి లభించనున్నదన్న పరవశమేమో...." అనేశాడు బాగురాయణుడు. 


మలయకేతు ఉలిక్కిపడి అనుమానంగా చూశాడు. 


బాగురాయణుడు సాలోచనగా తలపంకించి "అవును. ఎవరేమైపోయినా రాక్షసునికి కావాల్సింది మగధ మంత్రిత్వం. దాని కోసమే ఒకనాడు మహానందుల వారికి ద్రోహం చేసి మహాపద్ముడిని ఆశ్రయించాడు. ఆ పదవి కోసమే లోపలి నుంచి కోట తలుపులు తెరిపించి చంద్రుని ద్వారా నందులను చంపించాడు. కానీ అక్కడ చాణక్యుడు అడ్డగోడ వలె నిలిచాడు. ఇప్పుడా గోడకూలిపోయింది. ఇక అవాంతరం ఏదైనా ఉంటే... అది మనమే..." అన్నాడు సాలోచనగా. 


మలయకేతు కోపంతో పళ్లు కొరుకుతూ "తక్షణమే రాక్షసుని పిలిపించి..... " అంటున్నాడు. 


బాగురాయణుడు వారిస్తూ, "వద్దు. సరైన ఆధారాలు లేకుండా రాక్షసుని నిలదీయడం మంచిది కాదు. మనం కూడా నాటకమాడి వాళ్లకన్ను వాళ్ళ వ్రేలితో పొడవాలి. తక్షణం యుద్ధయాత్ర మొదలెడదాం. ప్రస్తుతం బలహీనుడైన చంద్రగుప్తుని జయించి, ఆ తర్వాత రాక్షసుని సంగతి ఆలోచిద్దాం. అంతవరకూ మనకు తెలిసిన ఈ రహస్యం... గప్ చిప్...." అని చెప్పాడు. 


ఆ సలహా నచ్చిన మలయకేతు యుద్దయాత్రకి ఏర్పాట్లు పూర్తి చేసి ఆ తర్వాత రాక్షసునికి ఆ విషయం తెలియపరిచాడు. ఆ మరునాడే యుద్ధయాత్ర ప్రారంభం. చేసేది లేక రాక్షసుడు అనుసరించాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పూరి జగన్నాథుని దర్శనం

 👆*బంగారు✨ ఆభరణాలతో⚡ పూరి జగన్నాథుని దర్శనం - సునా💫బేషా*(సోనా వేష)


సునా బేషా  ఏకాదశి తిథిలో జరిగే ఆచారం. దశమి నాటికి ప్రదాన ఆలయంకు చేరుకున్న రథంలో ఉన్న దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరించబడతారు దీనినే *సునా బేషా* అంటారు.

దీనిని *రాజధీరాజ భేషా* లేదా *రాజా బేషా* అని కూడా అంటారు. 


1430 సంవత్సరంలో ఈ 'సునా బేషా' ను రాజు కపిలేంద్ర దేబ్ పాలనలో ప్రవేశపెట్టబడిందని చరిత్ర చెబుతోంది. దేవతలు దాదాపు మూడు క్వింటాళ్ల బరువున్న మెరిసే బంగారు ఆభరణాలను ధరిస్తారు. 


ఈ ఆభరణాలను శ్రీమందిర్ ఖజానా వద్ద భధ్రపరుస్తారు. దీనిని *రత్న భండార్* అని పిలుస్తారు.


సాంప్రదాయం ప్రకారం, సేవకులు రత్న భండార్ నుండి బంగారు మరియు వెండి ఆభరణాలను తెచ్చి, రథాలపై *పుస్పాలక మరియు దైతాపతి *సేవకులకు అప్పగిస్తారు, తరువాత *చతుర్ధ మురతిని *ఆభరణాలతో అలంకరిస్తారు.


ముగ్గురు దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. భగవంతుడు జగన్నాథ్ మరియు బలభద్ర బంగారంతో చేసిన చేతులు మరియు కాళ్ళతో కనిపిస్తారు. జగన్నాథుడు తన కుడి చేతిలో బంగారు చక్రం మరియు ఎడమ చేతిలో ఒక వెండి శంఖాన్ని కలిగి ఉన్నాడు. బాలభద్ర ఎడమ చేతిలో బంగారు నాగలిని, కుడి చేతిలో బంగారు జాపత్రిని పట్టుకొని కనిపిస్తాడు.


సునా బేషంలో ఎవరైతే భగవంతుడిని చూస్తారో అతని చెడ్డ కర్మలన్నిటి నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.


సునా వేశంలో దేవతలను అలంకరించడానికి ఈ క్రింది ఆభరణాలు ఉపయోగించబడతాయి:


*హస్తా (చేతి), 

*పాయర్ (అడుగులు), 

*ముకుటా (తలపాగా లేదా పెద్ద కిరీటం), 

*మయూర్ చంద్రికా- ఒక నెమలి ఈక రూపకల్పన, దీనిని శ్రీకృష్ణుడు, చులపతి తల అలంకరణగా ఉపయోగించారు, 

*ముఖ సౌందర్యం, కుండల్ (చెవి వేలాడదీయడం) రింగులు), 

*రాహురేఖా- దేవత ముఖం మీద అలంకరించబడిన సగం చదరపు ఆకారపు అలంకరణ, 

*పద్మం (తామర), 

*సేవతి (చిన్న సూర్య పువ్వు), 

*చంద్రుని పువ్వు ఆకారంలో అగస్తి, 

*వివిధ రకాలైన మాలాలు లేదా కంఠహారాలు. బంగారు పూసలు), 

*నెమలి ఈకలు రూపంలో మేయర్, మరియు *చంపా- ఒక పసుపు పువ్వు,

*దేవతల మూడవ కన్ను సూచించే శ్రీ చితా, చక్ర లేదా చక్రం, గడా లేదా జాపత్రి, పద్మ ఒక తామర పువ్వు, మరియు  శంఖం కొన్ని ప్రత్యేక సందర్భంలో  అలంకరించడానికి ఉపయోగించే బంగారు నమూనాలు.


*జై జగన్నాథ్🙏* 

🔔 🔔 🔔

నేరేడుపండు - మాంసాహారం

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - II 


నేరేడుపండు - మాంసాహారం - అంతరార్థం    


    ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. 

    సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా  తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ పేర్కొంటారు. 

    దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి. 


శాకాహారులూ మాంసాహారులేనా? 


    మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. 

    కానీ, సంస్కృతంలో "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించునది" అని  అర్థం. 

    వరిధాన్యంవంటివి మనం ఆహారంగా తీసుకుంటాము కదా! 

    మొక్క మనకి ఆహారమిస్తూ,అది ప్రాణాన్ని కోల్పోతుంది. అదియే మాంసాహారము. 

    ఆ విధంగా, ప్రతి ఒక్కళ్ళూ తినే ఆహారం, సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణమే కదా! 


హింస - ప్రాయిశ్చిత్తము 


     మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. వాటికి ప్రాయశ్చిత్తంగా పంచయజ్ఞాలు చేయాలి. 

     మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. 

    అందులో మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పుడు జరిగే ప్రాణిహింస".  

     అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. 

    దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". 

    అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం. 


    ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, 

    వేదాలని న్యాసమొనరించి, ఈ రూపంలో అందించిన ఆయనను స్మరించి,  

     వేదాలని కాపాడుకోవడం మన విధి. 

    

ప్రకృతిలో మార్పు - సహజ చికిత్స 


    దేహంనుండీ శ్వేదరూపంలో బయటకు వెళ్ళే నీరు, 

    ఆషాఢంలో ఎండతగ్గి,    

    మూత్రంరూపంలో అధికంగా విడుదల అవుతుంది. 

    వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 

    అతిమూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరిగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో విద్యార్థులు చదువుతారు. 


గమనించవలసిన విషయాలు 


1. వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడమూ, 

2. బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత  గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. 


ఆచరణ 


    కాబట్టి మన పెద్దలు ఆషాఢ మాసం సందర్భంగా మనకందిచ్చిన ఆరోగ్య సూత్రాన్ని పాటించి,  ఆరోగ్యాన్ని పొందుతూ, 

    తద్వారా, దాని వెనక ఏర్పరచిన సాంకేతిక కారణాన్ని తెలుసుకొని, 

     శాస్త్రీయ వైదిక విజ్ఞానాన్ని కాపాడుకొందాం. తరువాత తరాలకి అందిద్దాం.  


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

తేనె ఉపయోగాలు

 తేనె ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 


       తేనె మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు. తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక గుణములు , ఔషధగుణములు ఉన్నాయి . తియ్యదనానికి అర్థం చెప్పే పదార్థం కాబట్టి దీనిని మధు అంటారు. 


        ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకు వ్యాధి నివారణకు కూడా తేనె ప్రాచుర్యం పొందినది. ఆహారమున ఔషధముగా , ఔషధాలకి అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె కీలకపాత్రను పోషిస్తుంది . చలువ చేస్తుంది . ఆకలిని పుట్టిస్తుంది. బలమును కలిగించును. హృదయమునకు మంచిది . నేత్రములకు మంచిది . చర్మానికి కాంతిని కలిగించును . శరీరంలో కొవ్వుని పెరగనివ్వదు. పుండ్లను మాన్పును . ఇలా ఎన్నో గొప్ప ఔషధ గుణాలు తేనెలో కలవు. 


                  స్వచ్చమైన తేనెలో శరీరముకు కావలసిన పోషకపదార్ధాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధముగా ఆహారపదార్ధాల కంటే తేనెలో కెలోరిక్ విలువలు ఎక్కువుగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక కిలో ( 900ml ) పాలలో 620 క్యాలరీలు , ఆపిల్ పండులో 420 క్యాలరీలు , నారింజలో 230 క్యాలరీలు ఉండగా ఒక కిలో తేనెలో 3 ,150 నుండి 3 , 360 క్యాలరీక్ విలువ ఉండును. తేనె అనేక వ్యాధులలో పనిచేస్తుంది అని ఎన్నో పురాతన ఆయుర్వేద గ్రంథాలలో ఉన్నది. నోటిలో పుండ్లకు , దద్దులకు తేనె అత్యుత్తమంగా పనిచేయును . నోటిపూతకు తేనె రాస్తే నోటిపూత తగ్గును . 


                సాధారణముగా వచ్చే దగ్గులలో తేనె , అల్లంరసం కలిపి ఇస్తే దగ్గులు తగ్గును. వాంతులు తగ్గును. ప్రతిరోజు పొద్దున్నే చల్లటినీటిలో తేనె , నిమ్మరసం కలిపి తాగితే శరీరపు లావు తగ్గును. ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు. ప్రతినిత్యం తేనె , నిమ్మరసంతో తీసుకుంటుంటే వ్యాధి తీవ్రత తగ్గుటయే కాక వ్యాధి కూడా తగ్గును . 


                   పుండ్లు , చర్మవ్యాధులు , మొటిమలు , తలనొప్పి , దగ్గు , జ్వరము , రక్తహీనత , న్యుమోనియా , గుండెజబ్బు మొదలగు వ్యాధులకు తేనె దివ్యౌషధముగా పనిచేయును . తులసిరసముతో , తేనె కలిపి తీసుకుంటే శ్వాసకోశ , న్యుమోనియా మొదలగు వ్యాధులు నివారించబడును. తేనె , తులసిరసము , పసుపు కలిపి ఇస్తే ప్లేగు వంటి సాంక్రమిక వ్యాధులు కూడా నివారణ అగును. మధుమేహ వ్యాధి ఉన్నవారు రోజు కొద్దిగా తేనె తాగుట వలన మంచిఫలితాలు కనిపించును. ముఖ్యముగా ఒక్కవిషయం గుర్తించుకోవాలి మార్కెట్లో దొరికే తేనెలో పంచదరపాకం కలిపి ఉంటుంది. అది మధుమేహరోగులు తీసుకోరాదు . దానివల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కలదు. కావున స్వచ్చమైన తేనెని ఎంచుకొనవలెను . 


              Low - Bp సమస్యతో బాధపడువారు , నిద్ర సరిగా పట్టనివారు రోజూ తేనెని తీసుకోవడం చాలా మంచిది . ప్రతినిత్యం తేనెని తీసుకోవడం వలన చక్కటినిద్ర రావడమే కాకుండా సుఖవిరేచనం అగును. తేనె వ్రణారోపణం కలిగి ఉంది. వ్రణారోపణం అంటే పుండ్లును త్వరగా మాన్పుగుణం అని అర్థం . కాలిన గాయాలను , పుండ్లను , కురుపులను తేనె వెంటనే మాన్పును . లొపల చెడు ఉన్నటువంటి పుండ్లు కూడా త్వరగా మానును . 


                    సౌందర్య సాధనములలో కూడా తేనె ఎంతో ప్రయోజనకారిగా పేరు పొందినది. తేనెలో ఎన్నో విటమిన్లు , పోషకాలు ఉన్నవి. బంగారుఛాయలో  సన్నగా ఉండాలనుకునే స్త్రీలు తప్పకుండా నిత్యం తేనెని తీసుకోవడం చాలా మంచిది . చర్మసౌందర్యానికి , శరీర ఆరోగ్యానికి అవసరం అయిన Riboflavin తేనెలో అధికంగా ఉన్నది. పెదవులను కూడా పగుళ్లు లేకుండా చేస్తుంది . అదేవిధముగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడువారు ప్రతిరోజు క్రమంతప్పకుండా ఒక గ్లాసు నీళ్లలో ఒకస్పూను నిమ్మరసం , ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ విధముగా కొంతకాలంపాటు చేయుచున్న మంచి ఫలితం కనిపించును. అలానే తేనెలో పసుపు కలిపి ఉండలుగా చేసుకుని తినుచున్న మొటిమలు తగ్గును. 


              ఆయుర్వేదంలో తేనె బలాన్ని కలిగిస్తూ లేఖన గుణము కలిగి ఉంటుంది అని వివరించబడినది. లేఖన గుణము అనగా శరీరానికి శక్తిని ఇస్తూ శరీరమును సన్నబడునట్లు చేయునది అని అర్థం . ఈవిధముగా శక్తిని కోల్పోకుండా శరీరపు లావును తగ్గించటంలో తేనె అత్యుత్తమముగా పనిచేయును . ముఖసౌందర్యము కొరకు పాలను తేనెలో కలిపి ముఖంపై రాసుకుని కొద్దిసేపు అయ్యాక కడిగివేసిన ముఖము సౌందర్యముగా కనిపించును. తేనె కలిపిన పాలు ముఖమునకు రాసుకుని కొంచం ఆగి మెత్తటి పెసరపిండితో ముఖమును కడుగుచున్న ముఖం కాంతివంతమగును. 


             ఈవిధముగా ఆహారం , ఔషధముగా , ఔషధాలకు అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె ప్రాముఖ్యత వహించడం వలనే మన ప్రాచీనులు తేనె , ఆవుపాలు , ఆవువెన్న , ఆవునెయ్యి , ఆవుపెరుగులతో పాటు చేర్చి పంచామృతాలుగా చెప్పారు . 


      మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

      9885030034                       


    కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


       9885030034