13, ఆగస్టు 2023, ఆదివారం

ఎవ్వడు

 శ్లోకం:☝️

  *కః ఖగౌ ఘాఙ చిచ్ఛౌ జా*

*ఝాఞ్జ్ఞోఽటౌఠీడడంఢణః |*

  *తథోదధీ న్పఫర్బాభీర్*

*మయోఽరిల్వాశిషాం సహః ||*

-భోజుడి సరస్వతీకంఠాభరణం


భావం: దేవతల సమూహముచేత పూజింపబడువాడును, అజ్ఞానమును ఛేదించెడి ఓజస్సు గలవాడును, శత్రువుల బలములను హరించువాడును, పండితుడును, యుద్ధభటులను బాధించువారికి ప్రభువును, అచంచలుడును, సముద్రాలను పూరగించినవాడును, భయములేనివాడును ఎవ్వడు

శత్రుసంహారకములైన ఆశీస్సులను భరించెడి మయుడు.

ఇది క్రమస్థ సర్వవ్యంజనము అనే శబ్దచిత్రము.

పంచాంగం 13.08.2023 Sunday,

 ఈ రోజు పంచాంగం 13.08.2023 Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ  పక్ష: ద్వాదశి తిధి భాను వాసర: ఆర్ద్ర నక్షత్రం వజ్ర యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం. 


ద్వాదశి పగలు 08:20 వరకు.

ఆర్ద్ర పగలు 08:26 వరకు.

సూర్యోదయం : 06:02

సూర్యాస్తమయం : 06:40

వర్జ్యం : రాత్రి 09:46 నుండి 11:33 వరకు.

దుర్ముహూర్తం: సాయంత్రం 04:59 నుండి 05:49 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి తిరుపతి.. IRCTC

 🌹🌺🌹✍️✍️✍️✍️✍️✍️✍️

ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి తిరుపతి.. IRCTC అదిరిపోయే ఆఫర్.. వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా*!


*IRCTC Package*: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. అక్కడికి వెళ్లేందుకు చాలా ముందు నుంచే ప్లాన్స్ వేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.


*IRCTC Tour Package*: తిరుమలలో వెలసిన శ్రీనివాసుడి దర్శనం కోసం ఎందరో భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తుంటారు. దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని పరితపిస్తుంటారు. తిరుమల ప్రయాణమంటే మాటలా? అన్నీ పకడ్బందీగా ముందే ఏర్పాటు చేసుకోవాలి. దర్శనంతో పాటు ప్రయాణ టికెట్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలంటే చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. అలాంటి వారి కోసం రెండ్రోజుల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని.. తిరుగు ప్రయాణం అయ్యేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్యాకేజీ తీసుకొచ్చింది. దర్శన టికెట్ల కోసం చింతించాల్సిన పని లేకుండా.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు.


విమాన ప్రయాణమే కాబట్టి కేవలం రెండే రోజుల్లో తిరుపతి వెళ్లి తిరిగి హైదరాబాద్ కూడా చేరుకోవచ్చు. తిరుమల సహా చుట్టు పక్కల పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు. మీరు ఒకవేళ ఇప్పుడు తిరుపతి ప్రయాణానిని సిద్ధమవుతుంటే.. ఈ ప్యాకేజీపై లుక్కేయండి మరి.


*తిరుపతి బాలాజీ దర్శనం* (Tirupati Balaji Darshnam) పేరిట IRCTC ఈ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి ఈ యాత్ర స్టార్ట్ అవుతుంది. రెండే రోజుల్లో స్వామి వారి దర్శనం ముగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు. తిరుపతి మాత్రమే కాకుండా కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆగస్టు నెలలో అయితే 1,3, 8,10, 17,22 తేదీలు.. అలాగే సెప్టెంబర్ 12,26; అక్టోబర్‌లో 3,5, 1, 12, 31 తేదీల్లో ఈ యాత్ర ఉంటుంది. ఆగస్టు 1,10 తేదీల్లో ప్రయాణానికి టికెట్లను యాత్రికులు ఇప్పటికే పూర్తిగా కొనుగోలు చేశారు. మిగతా తేదీల్లో అయితే ప్రయాణ సమయానికి అనుగుణంగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.


*జర్నీ ఎలాగంటే*?


హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు విమానం (6E- 2005) బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2.05 గంటలకు అంటే గంటలోనే తిరుపతి ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సు మార్గంలో కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయలు సందర్శించుకుంటారు. సాయంత్రానికి ముందుగా మీకోసం ఏర్పాటు చేసిన హోటల్ చేరుకుంటారు. రాత్రి భోజనం అక్కడే ఉంటుంది.


రెండో రోజు పొద్దున్నే అల్పాహారం తీసుకున్న తర్వాత కొండపైకి చేరుకుంటారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత భోజనం చేసి శ్రీకాళహస్తికి వెళ్తారు. అక్కడ ఆలయ దర్శనం తర్వాత తిరుపతి విమానశ్రయానికి మళ్లీ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకోవడానికి 6E-267 విమానం ఎక్కడంతో మీ యాత్ర పూర్తవుతుంది.


*ప్యాకేజీ వివరాలు ఇలా*.. (టికెట్ రేటు ఒక్కొక్కరికి)


సింగిల్ షేరింగ్ - రూ. 16,330

ఇద్దరికి షేరింగ్ - రూ .14,645

ట్రిపుల్ ఆక్యుపెన్సీ - రూ. 14,550

ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారులకు ఒకరికి విత్ బెడ్ అయితే రూ. 13,740, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 13,490 చెల్లించాలి.

రెండేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల కోసం రూ. 1500 వరకు ఎయిర్‌పోర్టులో చెల్లించాలి.


*ప్యాకేజీలో ఏమేం ఉంటాయి*..


హైదరాబాద్- తిరుపతి- హైదరాబాద్ విమాన టికెట్లు (పోను రానూ అన్నమాట)

తిరుపతి ఒక రాత్రి బస చేసేందుకు ఏసీ హోటల్ రూం

మొదటి రోజు రాత్రి భోజనం, రెండో రోజు పొద్దున అల్పాహారం, మధ్యాహ్న భోజనం

ఒక చోటు నుంచి మరో చోటుకు ఏసీ బస్సు ప్రయాణం

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లతో పాటు తిరుచానూర్, శ్రీకాళహస్తి కాణిపాకం, శ్రీనివాస మంగాపురం దర్శనాలు వంటివి ఈ ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి.

యాత్రికులకు గైడ్ సహా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.


*ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సినవి ఇవే*..


ప్రయాణానికి 2 గంటలు ముందుగానే భక్తులంతా విమానశ్రయానికి చేరుకోవాలి.

పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా ఎంట్రీ ఫీ వంటివి ఎవరివి వారే చెల్లించాలి.

ఫ్లైట్ టికెట్ ధర ఒకవేళ పెరిగితే ప్రయాణికులే చెల్లించాలి.

12 ఏళ్ల లోపు చిన్నారులకు మాత్రం లడ్డూ ప్రసాదం ఉండదు.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలంటే స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులే ధరించాలి.

ఏ కారణంతోనైనా 21 రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. టికెట్‌పై 30 శాతం మీ టికెట్ రేటు నుంచి మినహాయిస్తారు. 21-15 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం 55 శాతం, 14-08 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే 80 శాతం మీ టికెట్ ధర నుంచి మినహాయిస్తారు. Cholesterol 7 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే తిరిగి చెల్లించరు.

ఇంకా ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్ కోసం IRCTC Tourism వెబ్‌సైట్ సందర్శించండి.

🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹

Jonnavithula


 

మహనీయుని మాట*🍁

 *

 -------------------

🌻 *మహనీయుని మాట*🍁

        -------------------------

*"లక్షలు ఉన్న వాళ్ళకోసం కాదు మంచి లక్షణాలు ఉన్న వాళ్లకోసం వెంటపడండి. లక్షలు పోతే సంపాదించుకోవచ్చు.కానీ మంచి లక్షణాలున్న వాళ్ళను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేం."*

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌼

      ---------------------------

*"సరిగ్గా మనసు నిలుపలేని వంద నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో మనస్ఫూర్తిగా ఒక్క దండం పెట్టినా చాలు. నిజంగా భగవంతుడిని సంతోష పరచినట్లే."*


🌻🌻🌻🌻🌻🌻

రామాయణమ్ 289

 రామాయణమ్ 289

...

హనుమా ! నీ పరాక్రమము శ్లాఘింపదగినది అవలీలగా శతయోజనవిస్తీర్ణముగల సంద్రమును లంఘించినావు .అది పెనుమొసళ్ళకు ,భయంకరజలచరాలకు ఆలవాలము .

.

నీ ముఖములో తొట్రుపాటుగానీ ,జంకుగానీ రావణుడు ఆతని బలము ,బలగము పట్ల భయము గానీ నాకు కనపడుట లేదు.

నీవు సామాన్యుడవు కావు సుమా!

.

నాకు తెలుసు రాముడు నిన్ను పరీక్షించకుండా నీ సామర్ధ్యమేదో తెలవకుండా నిన్ను పంపడుగాకపంపడు అందునా తన అంగుళీయకము ఇచ్చి మరీ పంపినాడు.

.

రామలక్ష్మణులు ఇరువురూ క్షేమమే కదా ! రాముడు క్షేమముగా ఉన్నచో సముద్రమువరకు వ్యాపించిన ఈ ధరాతలమును కాల్చివేయలేదేమి ?

.

శత్రువులమీద విజయము సాధించుటకు కావలసిన ప్రయత్నములన్నీ శ్రీరాముడు చేయుచున్నాడు కదా ! మంచి మిత్రులను సంపాదించుకున్నాడా ?

.

హనుమా ! రామునికి నా మీద ప్రేమ ఏమీ తగ్గలేదు కదా ? రామునకు స్నేహము విషయమున తల్లిగానీ,తండ్రిగానీ ,మరి ఏ ఇతర వ్యక్తిగానీ నాతో సమానులు గానీ అధికులు గానీ లేరు నా ప్రాణనాధుని గురించిన వార్తలు వినునంతవరకే జీవించవలెనని కోరుకొనుచున్నాను....అని పలికి సీతమ్మ హనుమంతుని సమాధానము కొరకై ఎదురు చూచెను.

.

NB

..

( కొత్తచోటికి అందునా బలవంతుడైన శత్రువుయొక్క స్థావరంలో ప్రవేశించినప్పుడు మామూలు వారికి,ఎంత గొప్పగూఢచారి అయినా సరే సహజంగా తొట్రుపాటు ,భయము ఉంటాయి.అంతెందుకు శత్రుస్థావరమే కానక్కరలేదు పూర్తిగా కొత్తప్రదేశము ఎవరూ తెలియని చోటుకు వెళితే మన పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి!...అదీ హనుమస్వామి అంటే !)

.

జానకిరామారావు వూటుకూరు

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -18🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర  -18🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఒక రోజున ఆకాశరాజు సభకి నారదులవారు రాగా, రాజా మునిని పూజించి వారి ఆశీర్వాదం పొంది, పద్మావతికి తగిన వరునకై తాను చేస్తూన్న అన్వేషణ గూర్చి చెప్పి ‘‘స్వామీ నారదమునీ! మీరు మూడులోకాలూ సంచరిస్తూంటారు కదా! ఎక్కడైనా మా అమ్మాయి పద్మావతికి తగిన సంబందము చూద్దురూ. మీరు తలుచుకుంటే జరగని పని అంటూ వుండదుకదా’’ అన్నాడు. 


నారద మహర్షి ఆకాశ రాజు కు బృగు మహర్షి వృత్తాంతము,లక్ష్మి దేవి వైకుంఠము వెడలుట ,ఆమెను వెదుకుతూ శ్రీ మహావిష్ణువు భూలోకమున కు  వచ్చిన విధానం తెలిపి  ఇంకా ఆ వివరాలు ఈ విధంగా తెలిపారు


శ్రీనివాసుడు లక్ష్మీదేవి కొల్హాపురం నందు ఉన్నదని తెలుసుకుని అక్కడికి చేరగా ఆమె అక్కడి నుండి అంతర్ధానమై తిరుమల కొండలలో కల కపిల మహర్షి ఆశ్రమమునకు చేరినది


 శ్రీనివాసుడు మరల తీవ్ర మనోవేదనతో ఆశ్రమమునకు చేరగా ఆమె అక్కడి నుండి కూడా అదృశ్యమై పాతాళానికి వెళ్ళినది


లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి కపిల మహర్షి సూచనతో తిరుచానూరు పద్మసరోవరము చెంత సూర్య భగవానుని సాక్షిగా చేసుకొని లక్ష్మీదేవి కొరకై 12 సంవత్సరములు తపస్సు చేయగా. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై 


స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. 


కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి")

ఆమె మేని కాంతికి సూర్య కిరణాల కాంతి కూడా చిన్న పోయినది 


ఆ అతిలోక సౌందర్యమును కాంచిన జగత్తు పులకించినది పిదప శ్రీనివాసుని మనో రథమును తీర్చుటకై  మరియు శాప వశమున భువిలో జన్మించిన నిన్ను ఉద్ధరించుట కై జగన్నాటక సూత్రధారి లీలా విశేషాలతో   యజ్ఞ ఫలము గా పసిపాప రూపములో నీకు దొరికినది


ఆమే వేదమాత

ఆమే మహా లక్ష్మి

 ఆమే వేదవతి .

ఆమే లోకమాత

ఆమే శ్రీనివాస హృదయేశ్వరి 


 ఆమెను వివాహము చేసుకొనుటకు అర్హత ఒక్క శ్రీ మహావిష్ణువునకే వున్నది. ఈమెను శ్రీమహావష్ణువు పెండ్లాడును, నమ్ముము.


ఆ శ్రీమహావిష్ణువు నీ కుమార్తెను వివాహమాడే ముహూర్తము త్వరలోనే వున్నది. ఇంక యీ విషయములో బెంగలేకుండా నిశ్చయంగా వుండు అంతా సవ్యంగా జరుగుతుంది’’ అని నారదుడు వెళ్ళిపోయాడు.


ఆశ్రిత రక్ష గోవిందా, అనంత వినుత గోవిందా, వేదాంత నిలయ గోవిందా, వేంకట రమణ గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||18||

 

శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం..


*ఓం నమో వెంకటేశాయ*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

చామకూర సంభాషణా చాతుర్యం !

 శుభోదయం🙏


చామకూర  సంభాషణా  చాతుర్యం !

------------------------------------------------------- 

         

   ఉ: "  కన్నియఁగాని  వేరొకతెఁ గాను , మనోహర రూప!   నీకు నే


                     జన్నియ  పట్టియుంటి  నెల జవ్వన  మంతయు  నేఁటిదాఁక,  నా


                    కన్నులయాన ,  నా వలపు  కస్తురి  నామముతోడు;   నమ్ము ;  కా


                     దన్నను  నీదుమోవి   మధురామృత  మానిట  బాసఁజేసెజన్!  


                       విజయవిలాసము- ప్రథమాశ్వాసం- 179 పద్యం;;  చామకూర వేంకట కవి;


                                     అర్జునిని  మొదటి మజిలీ  గంగాతీరం.  అక్కడ  అతని  సౌందర్యం చూచి  మోహించింది  నాగ కన్య  ఉలూచి. మాయచేసి నాగలోకానికి  తీసికెళ్ళింది. మోజుపడిన యతనిని  అనేక విధములైన  మాటలతో  తన వలపు నంగీకరించేలా

                              ప్రయత్నించింది.

    ఇక్కడ చామకూర తన సంభాషణా చాతుర్యాన్ని ప్రదర్శించినాడు.


                      ఉలూచిని  జూచి  క్రీడి  కూడా  మోజుపడినాడు. కానీ వ్రత భంగ శంక కొంత పీడించినది.దానితరువాత  ఈమె  యన్య

యేమో  నను శంక గలిగినది. అన్య  ఇతరుల భార్య. పరస్త్రీ సంగమము   మహాదోషము. దానిని తొలగించుటకై ఉలూచి యిట్లు పలుకు చున్నది.


                        అర్జునా!  నేను  కన్యనే!   అన్యను గాను.  అన్నది. ఋజువులు కావలెనుగదా! ఆఋజువులను  జూపుచున్నది.


          "ఓమనోహరాకారా! నేను కన్యనే  యన్యను గాను. నేఁటివరకు  నాలేత  వయస్సంతా   నీకొఱకే  ముడుపుకట్టి  యుంచాను.

నాకన్నులపైయాన, నా వలపులీను( సువాసనలువీచు) బొట్టుపై నొట్టు. నమ్ము.ము. అదీ  కాదన్నావా? ఇక ఉన్నదొక్కటేదారి. అదిప్రమాణము. నీమధురమైన  అధరామృత పానము చేసి  నేకన్యనే యని ప్రమాణింతును  అపుడు నమ్మకుండుటకు నీకు వేరు దారిలేదనుచున్నది'"


                      లోకంలో  మన మెరిగినదే

దోషారోపణనెదురుకొనేవారే  ప్రమాణాలు చేస్తూఉంటారు." నేను తప్పుచేసినట్లయితే ,

నాకళ్ళేపోతాయి. నాబొట్టే చెదరిపోతుంది. వీటికీ ఒప్పకపోతే  విషంతాగుతా  అప్పుడైనా  ఒప్పుకుంటారా  నాదోషంలేదనీ"- అంటూ ప్రమాణాలు చెయ్యటం  మనకు వినిపిస్తూ ఉంటుంది) కవి  ఆవ్యవహారాన్ని  యిక్కడ వాడుకొన్నాడు.


                        వలపు కస్తురి నామము-- కస్తురి బొట్టు నల్లగా ఉంటుంది. పెళ్ళికాని పిల్లలకు అదోగుర్తు . కన్య  యనటానికి. ఉలూచి కస్తురితో  తిలక ధారణచేసింది.  మాచిన్నట  పెళ్శికాని  ఆడపిల్లలకు  చాదు  అని   నల్లని బొట్టును వాడేవారు.యిప్పుడు

దాన్ని పాటించేవారు తక్కువయ్యారు కాబట్టి యెవరెవరో  తెలియకుండా పోతోంది. పాములు విషయుక్తములే  కాబట్టివిషంకాక,అమృతపానంతో ప్రమాణంచేస్తానని  నాయికచే  చెప్పించాడు.


                  ఈవిధంగా  లౌకిక ప్రమాణాచారాలను  కావ్యంలో  నిపుణంగా చొప్పించి  ఉలూచిచే  చెప్పించి,అతనిని మెప్పించియతనివలపును పంచుకొన్న నాయికగా కవి  ఉలూచిని తీర్చి దిద్దినాడు. 


                                                    స్వస్తి!

దేశభక్తి

 👉 విదేశీ యూనివర్సిటీలో తనదైన శైలిలో దేశభక్తి చాటిన భారతీయ విద్యార్ధి.


👉 ఇంటర్నెట్‌డెస్క్‌ న్యూస్: విదేశాల్లో ఓ భారతీయ విద్యార్థి (Indian Student) చూపించిన దేశభక్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. ‘దేశభక్తి అంటే ఇది కదా’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే...


👉 విద్యార్థులకు డిగ్రీ పట్టా ప్రదానోత్సవం జరుగుతోంది. అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం ఒక్కో విద్యార్థిని స్టేజ్‌పైకి ఆహ్వానించి డిగ్రీని చేతికందిస్తున్నారు. అక్కడే చదువుకున్న భారతీయ విద్యార్థి వంతు వచ్చింది. అతడు ఫ్యాంటు, షర్టు కాకుండా.. సంప్రదాయ కుర్తా, పైజామా ధరించి వచ్చాడు. వస్తూ వస్తూనే అందులో ఇంకా డిగ్రీ పట్టా అందుకోక ముందే.. జేబులోంచి భారతదేశ మువ్వన్నెల జాతీయ పతాకం 🇮🇳  తీసి ప్రదర్శించాడు. దేశంపై అపారమైన గౌరవంతో మూడు రంగుల జెండా పట్టుకొని స్టేజ్‌ చుట్టూ తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియోను మిని త్రిపాఠీ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.


👉 నేడు విదేశీ మోజులో, మాయలో పడి మన దేశాన్ని అవమానపరుస్తున్న కొంతమంది యువత ఈ విద్యార్థిని చూసి నేర్చుకోవాలని కోరుతున్నాను. 🙏

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ శ్లోకం:46/150

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం:46/150 


భగహారీ నిహంతా చ 

కాలో బ్రహ్మా పితామహః I 

చతుర్ముఖో మహాలింగ 

శ్చారులింగ స్తథైవ చ ॥ 46 ॥  


* భగహారీ = ఐశ్వర్యమును హరించువాడు, 

* నిహంతా = చంపువాడు, 

* కాలః = కాలరూపము తానే అయినవాడు, 

* బ్రహ్మా = సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు, 

* పితామహః = తానే బ్రహ్మ అయినవాడు, 

* చతుర్ముఖః = నాలుగు ముఖములుకల బ్రహ్మ తానే అయినవాడు, 

* మహాలింగః = గొప్పదైన లింగాకారమున ఉన్నవాడు, 

* చారులింగః = సుందరమైన లింగాకారమున ఉన్నవాడు. 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం