: కాకవద్దు రావణన్న ఖతముజేయ బుట్టె భూ
లోకమందు తాతతాత రూపుడిప్డు రాముడై
వీకమా!మడదిని విడుము వెలదిమిన్న సీతయే
లేక పాపఫలము తప్పునే మనకిల వింటివా!
విభీషణుడు రావణునితో
: కాక తాత మామ పాప దత్తపదులతో రామాయణార్థంలో
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
: కాకవద్దు రావణన్న ఖతముజేయ బుట్టె భూ
లోకమందు తాతతాత రూపుడిప్డు రాముడై
వీకమా!మడదిని విడుము వెలదిమిన్న సీతయే
లేక పాపఫలము తప్పునే మనకిల వింటివా!
విభీషణుడు రావణునితో
: కాక తాత మామ పాప దత్తపదులతో రామాయణార్థంలో
🌹🦜🙏🏽🦜🌹
14.09.2024
శనివారం
అంశం..శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగము.
*శార్థూలమ్..* *సవరణ*
జ్యోతిర్లింగ స్వరూపమై వెలసి తా
శోభిల్లి దేవ్ ఘర్ స్థలిన్
వ్రాతల్ వ్రాయుచు వైద్యనాథుడు మహిన్
భాగ్యమ్ములందించుచున్
మాతై పార్వతి బిడ్డలౌ మనుజులన్
మన్నించి దీవింపగా
చేతుల్ మోడ్చి జపంబుసేసి
భవునిన్ సేవింప దర్శింపుడీ!!
.....................................................
🦄🐓🦜🦢🐘
పి.ఎల్.నాగేశ్వరరావు
హైదరాబాదు
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి సిధ్ధించుట నాకెన్నటికో।*
*శ్రి గురు పాదాబ్జంబులు మదిలో స్థిరముగ నిలిచేదెన్నటికో।*
*మరవక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో।*
*హరి హరి హరియని హరి నామామృత పానము జేసేదెన్నటికో!!*
*కమలాక్షుని నా కన్నులు చల్లగ గని సేవించేదెన్నటికో*
*లక్షణముగ శ్రీ లక్ష్మీ రమణుని దాసుడనయ్యేదెన్నటికో!!*
*పంచాక్షరి మంత్రము మదిలో పఠియించుట నాకెన్నటికో।*
*ఆది మూర్తి శ్రీ అమర నారేయణ భక్తుడనయ్యేదెన్నటికో!!*
*ఓం నమో నారాయణాయ॥*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*విభూది మహిమ*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము.*
*మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలములో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు.*
*ఈ భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో.*
*బ్రాహ్మణ, క్షత్రీయులు "మానస్తోకే మంత్రము " తో, వైశ్యులు " త్ర్యయంబక " మంత్రము తో , ఇతరులు శివపంచాక్షరి తో భస్మ ధారణ చెయాలి.*
*ముఖమున భస్మమమును ధరించిన నోటి పాపములు (తిట్టుట అభక్ష్యములను దినుట అను పాపములు), చేతుల పైన ధరించిన చేతి పాపములు (కొట్టుట మొ||) హృదయము పై ధరించిన మనః పాతకములను (దురాలోచనలు మొ||), నాభి స్థానమున ధరించుట వలన వ్యభిచారాది దోషములను, ప్రక్కలందు ధరించుట వలన పరస్త్రీ స్పర్శ దోషములను పోగొట్టును. పాపములను భార్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది గాన భస్మము అను పేరు దీనికి పేరు గలిగెను.*
*భస్మముమీద పండుకొన్నను, తిన్నను, ఒడలికి పూసుకున్నను పాపములు భస్మీభూతములగును. ఆయువు పెరుగును. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవము గలిగించును. సర్పవృశ్చికాది విషములను హరించును. భూత పిశాచాదులను పారద్రోలును.*
*యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచ్చిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండములో వేసి హోమము చెయ్యాలి. అనంతరం శుభ్రమైన పాత్రలో విభుతిని నింపాలి.*
*మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని "శాంతికము " అని అంటారు.*
*షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని "పౌష్ఠికం" అని అంటారు.*
*బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని "కామదం" అని అంటారు..*
*భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.*
*హర హర మహా దేవ శంభో శంకర॥*
*ఓం నమః శివాయ॥*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐
శ్రీభారత్ వీక్షకులకు గణపతి నవరాత్రి శుభాకాంక్షలు 🌹 గణపతి స్వరూపాలెన్నో.. లీలలు ఇంకెన్నో.. గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక క్షేత్రాలలోని మాహాత్మ్యాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. ఈ ఎపిసోడ్ లో " మోర్ ' గణపతి, సిద్ధి క్షేత్ర గణపతి, చింతామణి , గిరిజాత్మజ గణపతి, మరి కొన్ని విశేషాలు వివరించారు. మన పురాణాలలో గణపతి వైభవం ఎంత గొప్పదో, ఎన్ని క్షేత్రాలలో గణపతి వెలిశారో తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశం. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
16. " మహా దర్శనము "--పదహారవ భాగము ---అతి నాచికేతుడు
16. పదహారవ భాగము --అతి నాచికేతుడు
బుడిలులు వాకిలి దగ్గరే కాచుకొనియున్నారు . స్నాతకుడైన కొడుకు అటువైపు నుండీ వచ్చుటకూ , ఆచార్యుడు ఇటునుండీ పోవుటకూ సరిపోయింది . ఇద్దరూ ఒకేసారి లోనికి వెళ్ళినారు . బుడిలులు , ’ ఎంతైనా , ఆచార్యులు ఋత్విజులు కాదా ? వారు ఆలస్యము చేయుట ఉంటుందా ? చూడండి , సరిగ్గా సమయానికే వచ్చినారు... కదా ? " అన్నారు . ఆచార్యుడు , ’ ఏమైనాసరే , ఎటులనో , పెద్దవారి దగ్గర ఆలస్యముగా వచ్చినానని మర్యాద పోగొట్టుకొనుటకు బదులు , సరిగ్గా సమయానికి వచ్చినానని పొగిడించుకున్నాను కదా " అని సంతోష పడినాడు .
స్నాతకుడు , వచ్చుదారిలో తన మిత్రుడొకరి ఇంటిలో వైశ్వేదేవమునకు ఆగినాడు . మిత్రుని తల్లిదండ్రులు తమ సంబంధములో నున్న పిల్లను చూచుకొని వెళ్ళు అన్నారు . కాత్యాయనుడు , ఏదేమైనా , పిల్లను చూచు పని తన తల్లిదండ్రులది అని ఎంత చెప్పిననూ వినక ఆ పిల్లను , తల్లిదండ్రులతో సహా అక్కడికే రప్పించినారు . వారి మాట ప్రకారము , నక్షత్రానుకూల్యత , వర సామ్యము రెండూ సరిపోయినాయి . అక్కడి కలాపముల నన్నిటినీ ముగించుకొని బయలు దేరు వేళకు ఆలస్యమైపోయి , ఇక్కడికి సకాలమునకు వచ్చుటకు కాలేదు .
బుడిలులు , కొడుకు వినయముగా నున్నాడని చాలా సంతోషించినారు . రాజ పురోహితుడు భార్గవుడు , ఆచార్యుడు దేవరాతుడూ ఆ సంతోషములో భాగస్తులైనారు . బుడిలులు , " మేము ఆ అమ్మాయిని చూచుటకు వెళ్ళేది ఎప్పుడు ? " అన్నారు . భార్గవుడు , ’ ఎప్పుడేమిటి ? అమావాస్య ఇక నాలుగైదు దినములే ఉంది , అది గడచిన తరువాత వెళ్ళేదే " అన్నాడు .
ఆచార్యులు , " ఔనౌను , శుభస్య శీఘ్రం . అయినంత వేగముగా మన ద్వివేదుల కడుపున ఒక బిడ్డ కలిగి , బుడిలులు పౌత్రవంతులు కావలెను అని మా కోరిక " అన్నారు .
ఇలాగే ఒక్కొక్కరు ఒక్కొక సంతోషపు మాట ఆడుతుండగా లోపలినుండీ పిలుపు వచ్చినది . బుడిలులు వెళ్ళి చూచుకొని వచ్చి , " అందరూ కాళ్ళు చేతులు కడుగుకొని మడి కట్టుకోవలెను " అన్నారు . అందరూ లేచినారు .
భోజన శాలలో ఒక్కొక్క పీట ముందరా ఒక్కొక్క అగ్రపు అరిటాకు వేసి , రకరకాల ఫలహారములు వడ్డించి యున్నవి . నేతిలో వేయించిన ఫలహారములు , వేపుడులు , పళ్ళు , పానీయములూ , అన్నీ సిద్ధముగానున్నవి . వాటి సువాసన అతిథుల వద్దకు వెళ్ళి , వారి ముక్కు పట్టుకొని లాగితెచ్చు దిట్టతనము గల గృహస్థుడి వలె అంతటా వ్యాపించినది . అతిథులందరికీ అర్ఘ్య పాద్యములు తానే ఇచ్చినారు . భార్గవుడు తాను ఇంటివాడనని తప్పించుకున్నాడు . ఆచార్యుడు వద్దని ఎంత వేడుకున్నా , వదలక , ’ నీ యోగ్యత మా అందరికన్నా గొప్పదయ్యా , మహాపురుషుడి తండ్రివి నువ్వు . నీకు అన్ని మర్యాదలూ తక్కువే " అని వారే అతని కాళ్ళు కడిగి , పిలుచుకొని వెళ్ళి అగ్రస్థానములో కూర్చోబెట్టినారు .
కొందరు ఆచార్యునికి అగ్ర స్థానమును ఇచ్చుటను విరోధించుటకు సిద్ధమయినారు . అయితే అది ఇంకో చోటయితే సాధ్యమయ్యేదే కానీ , బుడిలుల ఇంటిలో అయ్యేది కాదు . బుడిలులకు ఎదురు చెప్పలేక వారు కిమ్మనకుండా కూర్చున్నారు .
నిరాటంకముగా ఫలహారములు అయినవి . అందరూ బయలుదేరినారు . భార్గవుడు ’ ఆచార్యా , ఆలస్యమగునేమోనని నేను ఇంటికి వెళ్ళకుండా బండిలో ఇట్లే వచ్చినాను . మనమిద్దరమూ కలసి వెళదామా ’ అని నిలిచాడు .
ఆచార్యుడు , ’ భార్గవా , నేను బుడిలులను అడగవలసిన అంశము ఒకటుంది . అది ఆలస్యమైతే ? " అన్నాడు .
భార్గవుడు , ’ అది రహస్యమై , నేను ఉండకూడదు అనునదైతే ఇప్పుడే బయలుదేరుతాను ’ అన్నాడు .
ఆచార్యుడు నవ్వుతూ , " ఇది మహారాజుల ఏకాంతము వంటిదే , మా వాడు ఉన్నాడు చూడండి , వాడు చిలుక అనుకొని తెచ్చిపెట్టుకుంటే రాబందుపిల్ల అయినట్టయింది, వాడూ , వాడి ప్రశ్నలూ మాకు సమాధానాలిచ్చుట అసాధ్యమైపోయింది . ’ ఇది ఈదినము వద్దయ్యా , ఇంకొక దినము ’ అంటే ఊరికే ఉండిపోయే వాడి వైఖరి చూడవలెను . మీకు ఆ దినమే చెప్పినాను కదా , ’ లోపల కడగకున్న మడ్డి , బయట కడగకున్న మసి ’ బాగానే ఉంది , అయితే లోపల కడుగుకొనేది ఎట్లా అని అడిగినాడు . దానికేమి చెప్పవలెను ? మంత్ర జపము తో అని యంటే , ఇంకొక ప్రశ్నకు దారి , ’ అలాగంటే ఏమి ? ’ అని తప్పక అడుగుతాడు . ఏమి చేయుట ? "
" మహా పురుషుడవగల కొడుకును ఎత్తుకున్నది చిన్న విషయ మనుకున్నావా ? మీ అమ్మ , అమ్మమ్మలు మీకు పెట్టిన వస , వెన్నలను కక్కిస్తాడు " భార్గవుడు నవ్వుతూ అన్నాడు .
" ఈ దినమేమయిందో తెలుసా ? ఏదో ప్రశ్న అడగవలెనని వచ్చినాడు . నేను , మనసును గట్టిగా పట్టుకొని ’ మాఘ మాసము వరకూ ఉండు ’ అన్నాను . మీకన్నా , మాకన్నా ఎక్కువగా , అటులనా సరే అని ఊరకే ఉండిపోయాడు . కథ చెప్పు అన్నాడు . గువ్వ , కాకి కథలు చెప్పుటకు పోతే ఈ కథలతో మనవంటివారికి వచ్చేదేముంది అనేసినాడు . ! "
" ఆ మన వంటి వారు అంటే ఎవరయ్యా అని అడగలేదా ? "
" అడగ వలెననుకున్నా , కానీ ఎందుకో అడగలేదు . "
" సరే , తర్వాత ? "
" సరే , నచికేతుని కథ చెప్పు అన్నాడు . నేను రెండవ వరపు సంగతి ప్రస్తావించునపుడు వాళ్ళమ్మ వాడిని పిలిచింది . వెళుతూ , " నేనూ ఒక నచికేతుడిని అవుతాను . ఆ కథ నాకు పెద్దదిగా ఇంకొక దినము చెప్పండి " అని పరిగెత్తి పోతాడా ? "
" ఏదేమైనా మీరు అద్భుతమైన బిడ్డను పొందినారు . ఆచార్యా , వాడు మీకు తెలియకుండానే మీకొక వరము నిచ్చినాడు . "
" అలాగంటే ? "
" అగ్ని విద్య , బ్రహ్మ విద్య రెంటినీ సాధించినవాడు నచికేతుడు . తానూ అటుల కావలెనని చెప్పి , మీ హృదయ భారమును తీసివేసినాడు "
" నిజమే , ఆ మాత్రమైనా అయింది "
ఆ వేళకు బుడిలులు వెళ్ళువారి నందరినీ వీడ్కొలిపి వచ్చినారు . కూర్చున్న ఇద్దరూ లేచి నిలుచుని వారిని ఆహ్వానించినారు . బుడిలులు వారిని కూర్చోండి అని చెప్పి , " చూడండి , నా భార్య , కొడుకు వస్తాడని ఈ దినము ఇంత సంబర పడింది , కోడలు వస్తుందంటే ఆకాశానికి ఎగురుతుందేమో తెలీదు " అన్నారు .
వారి మాటకు నవ్వుతూ , " అట్లయిన , పిల్లను ఒప్పుకున్నారా ? " అని అడిగినారు .
" ఇంకేమి , ఒప్పుకున్నట్లే . ఆ అమ్మాయిని నేను కూడా చూచియున్నాను . సాముద్రికము బాగుంది . అమ్మాయి కూడా లక్షణముగా ఉంది ., సోదరులున్నారు . వయసు పదో , పదకొండో ఉంటుంది . వంశము రెండు వైపులా బాగుంది , ఇంకేమి కావలెను ? "
" అట్లన్న , వెళ్ళుటకు ముందే అంతా నిర్ణయమైనట్టే కదా ? "
" చూడు భార్గవా , ఎవరో ఒక అమ్మాయిని తెచ్చుకోవలసినదే కదా ? తెలిసిన వారిలో , చూచిన పిల్ల అయితే మేలు కదా ? రేపు అమావాస్య ముగియగానే వెళ్ళి చూచి రావలెను . మాఘమాసములో తలపై జీలకర్రా బెల్లమూ పెట్టించి అక్షింతలు వేసేది . ఏమి , ఆచార్యా ? "
" సరే , తమకు నచ్చినపుడు ఇంకా చెప్పేదేముంటుంది ? "
భార్గవుడు రాగం తీస్తూ , ’ నేనొక మాట అనవచ్చా ? " అన్నాడు
బుడిలులు అన్య మనస్కంగా ఉండి , " చెప్పవలసినది చెప్పియే తీరవలెను . అదేమిటో చెప్పు ? " అన్నారు
భార్గవుడు , " పెళ్ళి ఖర్చులు ? " అన్నాడు
బుడిలులు , " అదేమిటది ? మగ పెళ్ళి వారికి ఖర్చులేముంటాయి ? ఉంటే ఒంటి నిండా నగలు , లేకుంటే ఒక మాంగల్యము . నేను ఒక ఉసిరికాయంత బంగారము ఉంచుకున్నాను . దానిలోనే మాంగల్యము , ముక్కు పుడక , గాజులు చేయిస్తే సరిపోతుంది "
" అట్లు కాదు , బుడిలులు మనందరికన్నా యేలాగు శ్రేష్ఠులో , అలాగు వారి కోడలు కూడా బంగారు , ఆభరణాలు పెట్టుకొని శ్రేష్ఠురాలుగా ఉండవలెను . "
బుడిలులు నవ్వి , " అట్లు కావలెనంటే , నేను కనిపించిన వారికందరికీ చేతులు జోడించి , చేయి చాచవలెను . "
" అలాగేమీ అవసరము లేదు . ఎలాగూ , సమావర్తన సందర్భముగా ఎవరైనా కావలసినదంతా అంటే , సుమారు వెలగ పండంత బంగారము మీ కుటుంబమునకు చదివిస్తారు . దాన్ని వారు కోడలికే ఇవ్వనీ , మీరు కూడా మీదగ్గరున్నది ఆమెకు ఇవ్వండి , "
దాని అర్థము గ్రహించి , బుడిలులు మొదట ఒప్పుకోనే లేదు . చివరికి , " నువ్వు నాకు దశరాత్రి జ్ఞాతి కాని పిండభాగివి . నువ్వు ఇచ్చేది తీసుకుంటే నా అపరిగ్రహ వ్రతమేమీ చెడిపోదు , కానీ లోకమేమనుకుంటుంది ? అది గమనించు . " అన్నారు .
" సరే , మరి , భార్గవుడు రాజభవనమునకు కన్నము వేసి కొల్లగొట్టి తెచ్చి ఇల్లు నింపుకున్నాడే అనుకునే జనాలు , బుడిలుల ఇంట పెళ్ళైతే అంత పీనాసిగా ఉత్తచేతులతో వచ్చాడు అనుకోరా ? అది గమనించండి "
" సరే , ఎంతైనా నువ్వు రాజ పురోహితుడవు . నీకు ఎదురు చెప్పి బతుకుటకు అవుతుందా? అలాగే చేయి . ఏమి ఆచార్యా ? అమావాస్య అవగానే మీరిద్దరూ నా వెంట వచ్చి ఒక లగ్న పత్రిక చేయించి రావాలి . "
భార్గవుడు అన్నాడు , ’ ఇప్పటికి నేను రాకపోయినా ఆచార్యులు తప్పక వస్తారు . మీరు మాఘ మాసములో లగ్నము పెట్టుకొంటారేమో ? నేను అప్పుడు వస్తాను . రాజభవనపు నిర్బంధము . నన్ను వదిలివేయండి . "
" కాదయ్యా , పెళ్ళి ఖర్చులన్నీ నావే అనువాడు లగ్నపత్రికకు రాకుంటే బాగా ? "
" నిజమే , కానీ నిర్బంధము మరి , నన్ను వదిలేయండి ."
ఆచార్యుడు నోరు తెరిచాడు . : " అట్లయితే పెళ్ళికి నన్ను వదలి వేసినట్టే కదా ? "
" ఇది మరీ బాగుంది , నువ్వు యాజ్ఞవల్క్యుని తండ్రివి . నువ్వూ , నీ కుటుంబమూ కొడుకును పిలుచుకొని రాకపోతే ఈ ఇంటిని వదలి పెండ్లికి వెళ్ళేది ఎవరు ? ఏమంటావు భార్గవా ? "
’ సరైన మాట . అది సరే , ఆచార్యులు ఏదో మాట్లాడవలెనని వచ్చినట్టుంది . "
" నాకు అదీ తెలుసు . అతడికి ఒకటే ఆలోచన . ఆ పాపడిని పెంచుట ఎలా అని కొండంత ఆలోచన . ఈ దినము వద్దు , ఇంకొక రోజు రా. వివరముగా చెప్పెదను . ఒకమాటలో నన్నడిగితే , అది ఒక గంధ గజము . దానికి ఏ లోపమూ లేకుండా చూసుకోండి . ఆ బాలుడికి కావలసినది కూడు , గుడ్డ కాదు . వాడు చిన్నవాడు అని హాస్యము చేయవద్దు . వాడు అడిగిన దానికంతా దాపరికము లేకుండా చెప్పండి . వయసు చాలదు అని మోహపడకండి . "
" ఈ దినమేమో నేను నచికేతుని అవుతాను అన్నాడంట "
" వీడు అతి నచికేతుడు కావలెనయ్యా ! కానిమ్ము , ఇంకో దినము మాట్లాడదాము . " ఆచార్యుడూ , భార్గవుడూ బుడిలులకు నమస్కారము చేసి ఆశీర్వాదము పొంది వెళ్ళిపోయినారు .
వారు వాకిలి దాటుతుండగనే వెనకాల నుండీ బుడిలులు వచ్చి , ’ ఆచార్యా , చౌలపు దినమే అక్షరాభ్యాసము కూడా కానీ . న్యాయంగా ఐదో సంవత్సరము వరకూ ఆగవలెను . కానీ మీ కొడుకు సామాన్యుడు కాడు . కాబట్టి ఎలాగో జరగనీ " అన్నారు .
ఆచార్యుడు మారుమాట లేకుండా, ఏ ఉద్వేగమూ లేకుండా , " యజమానులు చెప్పినది వేద వాక్యము . అక్కడ మా వాదమే ఉండదు " అని ఒప్పుకొన్నాడు . మరలా అడిగినాడు , " అట్లయితే మాఘమాసములో చేయవచ్చును కదా ? "
" తప్పకుండా ! మీ ఇంట్లో అక్షరాభ్యాసపు బొబ్బట్లు , మా ఇంట్లో దేవతా సమారాధన బొబ్బట్లు . రెండూ ముగించుకొని పెళ్ళికి బయలుదేరవచ్చు . ఏమంటారు రాజ పురోహితులవారు ? సరేనా ? "
భార్గవుడు నవ్వుతూ చేతులు జోడించి అన్నాడు , " తండ్రి మాటను జవదాటని కుమారులము , మాదేముంది ? మేము ఎప్పటికీ మీ పుత్రులము . తమరు విధాయకులు; మేము విధేయులము "
బుడిలులు , " సరే వెళ్ళిరండి " అని వారిని బండి ఎక్కించి తాము వెనుతిరిగినారు .
--Janardhana Sharma
ప్రతి ఫలం
కొన్ని సందర్భాలలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఇటువంటి దానికి నిదర్శనంగా శ్రీ ఆది శంకరుల ఒక వృత్తాంతం తెలుపుతారు.
ఆది శంకరుల వారు సన్యాసాశ్రమం సవీకరించిన తోలి రోజుల్లో అంటే ఇంకా స్వామి బాల్యంలోనే వున్నారు. బిక్షాటన కొరకు ఒకసారి ఒక గుడిశముందు నిలబడి " భవతి బిక్షం దేహి" అని యాచించారట కానీ ఆ గృహంలోనుంచి ఎంతసేపటికి ఎవ్వరు రాలేదు. అయినా కానీ మన శంకరులవారు ఇంకా నిరీక్షిస్తూ ఆ గుడిసె ముందే ఉన్నారు. కొంతసేపటికి ఒక పేదరాలు వణుకుతున్న చేతులతో స్వామికి లేదు అని చెప్పటానికి మనస్కరించక ఒక ఉసిరిక పండును మాత్రం ఆయన జోలెలో వేసిందట. ఆమె దైన్యతను గమనించిన శంకరాచార్యులవారు ఒకసారి ఆమె గుడిసెను సంపూర్ణంగా పరికించి చుస్తే మొత్తం ఇల్లంతా కాళీగా ఎటువంటి వస్తువులు లేకుండా ఉండటం చూసి ఆమె కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నదని తెలుసుకున్నారు.
ఆది శంకరాచార్యుల వారి మనస్సు ఆర్ద్రతమైనదట. వెంటనే శంకరాచార్యులవారు మహాలక్షిని స్తుతిస్తూ స్తోత్రము చేశారట. ఆయన స్తోత్రానికి ప్రసన్నమైన అమ్మవారు ఆయనకు ప్రత్యక్షం అయి నాయనా ఎందుకు నన్ను పిలిచావు అని అడిగింది. దానికి శంకరులవారు అమ్మా ఇది నీకేమైనా న్యాయంగా ఉన్నదా ఈ సాద్వి మణి దీనత్వం చూసి నీకు కొంచమైనా దయరాలేదా తల్లి అని వేడుకొన్నాడు. అప్పుడు అమ్మవారు నాయనా నేను ఏమి చేతును ఆమె గతజన్మలో పూర్తిగా పిసినారిగా వుంటూ ఎవరికి కూడా ఎటువంటి దానధర్మాలు చేయకుండా ఉండి పూర్తిగా పుణ్యరహితంగా ఉండటం వలన ఆమెకు ఈ జన్మలో ఈ దారిద్యం దాపురించింది అని అన్నది. అమ్మా ఆమె ఏ పుణ్యము చేయలేదు సరే మరి ఆమె భర్త పుణ్యము వలన అయినా ఈమెకు కొంత ఊరట కలగాలి కదా తల్లి అని అన్నాడు. దానికి తల్లి నాయనా ఆమె భర్త ఈమెకన్నా ఎక్కువ పాపాత్ముడు . అందుకే వారిద్దరిని కలిపాడు పరమేశ్వరుడు. ఇద్దరు ఒకరిని మించిన వారు ఇంకొకరు. కాబట్టి వారు ఈ దారిద్యాన్ని అనుభవిస్తున్నారు అని అన్నారు అమ్మవారు.
నాయనా
ప్రస్తుత పరిస్థితుల్లో వారి దారిద్యాన్ని బాపటం
ఆ పరమేశ్వరుని వశం కూడా కాదు
వారు అంత పాపాత్ములు అని
తల్లి ఉన్నసంగతి ఉన్నట్లు చెప్పింది. అప్పుడు ఆలోచించటం శంకరులవారి వంతయినది శంకరులు అంటే సాక్షాత్తు శంకరులేకదా
మరి శంకరాచారులవారు ఊరుకుంటారా. తల్లి నీవు చెప్పింది
నిజమే కావచ్చు ఆ సాద్విమణి ఏ
పుణ్యము గత జన్మలో చేసి
ఉండకపోవచ్చు. మరి ఈ జన్మలో
విషయం ఏమిటి తల్లీ అని
అమ్మవారిని మరల వినమ్రుడై అడిగాడు.
ఈ జన్మలోకూడా ఆమె ఏ రకమైన
దానం చేయలేదు అని లక్ష్మీదేవి బదులిచ్చింది.
అప్పుడు శంకరులవారు ఒక్కసారి ఆమె గుడిశ మొత్తం
పరికించి చూడు తల్లీ అని
వేడుకున్నాడు. మొత్తం చూసిన మహాలక్షి ఏమున్నది
నాయనా అని అన్నది. తల్లీ
నేను చెప్పేది కూడా అదే ఆ
సాద్వీమణికి ఇవ్వటానికి ఏమిలేకపోయినా నాకు ఒక ఉసిరిక
పండును దానం చేసింది తల్లీ
మరి ఆ దానఫలితాన్ని ఇవ్వవా
అని మరల వేడుకొన్నాడు. అప్పుడు
శంకరుని తెలివికి మెచ్చుకొనిన లక్ష్మీ దేవి ఆ ఇంట
బంగారపు ఉసిరికాయలను వర్షించిందట దానితో ఆ పేదరాలి పేదరికం
అంతా మటుమాయం అయిపొయింది.
ఆది శంకరులు లక్షి అమ్మవారిని ప్రసన్నురాలిగా చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రముగా చాల ప్రసిద్ధి చెందింది. ఈ స్తోత్రాన్ని భక్తితో రోజు పారాయణ చేసే భక్తులకు సిరి సంపదలు సమకూరుతాయని ప్రతీతి. త్రికరణ శుద్ధిగా అకుంఠిత దీక్షతో ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా ఆ మహాలక్షి ప్రత్యక్షం అవుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అని అంటారు. .
చూసారా సత్పురుషునికి చేసిన ఒక చిన్న దాన ఫలితంగా యెంత ఫలితం లభించిందో కదా. కాబట్టి మనం ఎప్పుడూ సపాత్ర దానాన్ని చేయాలి. అంటే పాత్రనెఱిగి దానం చేయాలి. దానం చేసేటప్పుడు దాన గ్రహీత మీరు చేసే దానానికి యోగ్యుడా కాదా అని నిర్ధారణ చేసుకొని మరి దానం చేయాలి. మీరు చేసిన దాన ద్రవ్యముతో దాన గ్రహీత ఏదైనా పాపపు కృత్యాలు చేస్తే మీకు దానఫలితంగా పుణ్య ఫలం రాకపోగా ఆ పాపంలో భాగం వస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి మరి పాపాలను కొనుక్కోవటం అన్నమాట.
మన పూర్వికులు అందుకేనేమో అన్నిదానాలలోకి అన్నదానం గొప్పది అని అన్నారు. అన్నదానం చేయటం వలన రెండు విషయాలు అవగతం అవుతాయి. ఒకటి అన్నం తిన్న దాన గ్రహీత ఇక నాకు చాలు అంటాడు అంటే అతను మీ దానంతో తృప్తి చెందుతాడు. కాబట్టి అతని తృప్తివలన మీకు దాని ఫలితంగా పుణ్యఫలం వస్తుంది. ఇంకొక విషయం. మీరు పెట్టిన అన్నాన్ని మీ సమక్షంలోనే ఆరగిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో అన్న దానం వలన పాపం రాదు. ఏదానానికైనా పాత్రను యెరిగి దానం చేయాలి కానీ అన్నదానానికి మాత్రం ఆకలితోవున్న ఎవ్వరికైనా చేయవచ్చు. పుణ్య ఫలితం ఒకేవిధంగా ఉంటుంది. అన్నదానం కేవలం మనుస్యులకు మాత్రమే చేయాలనీ నియమం లేదు. పశుపక్ష్యాదులకు కూడా చేయవచ్చు. నిత్యం పక్షులకు అన్నం పెట్టె వారికి ఈ జన్మలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి జీవితం కలుగుతుంది. వారి పితృదేవతలు కూడా సంతోషిస్తారు.
కాబట్టి ప్రతివారు ఇతర దానాలకన్నా అన్నదానమే శ్రేష్ఠము కావున అన్నదానాన్ని విరివిగా చేయటం శ్రేయస్కరం. . అన్నదానాన్ని ప్రోత్సహించండి. ఆలా అని రోజు ఒక్కరికే అన్నాన్ని పెట్టి మనుషులను ఏ పని పాట చేసుకొని సోమరులుగా తయారు చేయకూడదు.
అన్నదానం తరువాత చెప్పుకోదగిన దానం విద్య దానం. ప్రతి విద్వంసుడు తాను సముపార్జించిన విద్యను పలువురికి దానం చేసి విద్యావంతులను చేయాలి. విద్యావంతుడైన వాడు తన విద్యతో చక్కగా జీవితాంతం సంపాదించుకొని తానూ సుఖపడి పలువురిని సుఖపెట్టగలడు. కాబట్టి విద్యాదానం చేయటం కూడా చాలా మంచి విషయం.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ
*🙏జై శ్రీమన్నారాయణ 🙏*
15.09.2024,ఆదివారం
*నేడు వామన జయంతి, (ఓనం)*
కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓనం (Onam). ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. తెలంగాణలో బతుకమ్మ, బోనాలు, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి, తమిళనాట దీపావళి ఎంత ప్రసిద్ధో.. ఓనం కూడా కేరళ సంస్కృతికి ప్రతీక. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓనం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కేరళలోని వ్యవసాయ పండుగ.
ఓనం వేడుకల్లో భాగంగా తొలిరోజును అతమ్.. చివరి రోజున తిరు ఓనమ్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు చాలా కీలకమైనవిగా పరిగణిస్తారు.
పదవ రోజు తిరువోనం. దీనినే ఓనం ప్రధాన ఉత్సవంగా పరిగణించాలి. కుటుంబంలోని అందరు ఒకచోట చేరి కలసి పండగ జరుపుకుంటారు. *‘ఓనమ్ సద్య’* అనే ప్రత్యేక భోజనాన్నిఈ రోజున ఆరగిస్తారు, అందరికీ పెడతారు. ఈ పండుగలో పూలతో అలంకరణ, వంటకాలు, ఆటలు, సంగీతం, కేరళ ప్రత్యేక సంప్రదాయ సంబరాలు భాగంగా ఉంటాయి.
ఓన సద్యం..
ఇక ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపై పలు రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు. సంప్రదాయ ఊరగాయలు, అప్పడాలు, పాయసం, పప్పు, అన్నంతోపాటు రకరకాల పిండివంటలను చేసుకుని కుటుంబమంతా కలిసి ఆరగిస్తారు.
పాలనలో రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్థిల్లారని చెబుతారు. అందుకే రాక్షస రాజు అయినప్పటికీ బలిచక్రవర్తిని గౌరవించేవారు. బలిచక్రవర్తితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పదిరోజుల పాటూ మహాబలిని పాతళలోకం నుంచి భూమ్మీదకు అహ్వానిస్తూ జరుపుకునే పండుగే ఓనం. ఇదే వేడుగను కొన్ని రాష్ట్రాల్లో వామన జయంతిగా జరుపుకుంటారు.
*యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః ।*
*శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగఛ్చతి ।। 15 ।।*
युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानस: |
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति || 15||
యుంజన్ — మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేసి; ఏవం — ఈ విధంగా; సదా — ఎల్లప్పుడూ; ఆత్మానం — మనస్సు; యోగీ — ఒక యోగి; నియత-మానసః — క్రమశిక్షణ కలిగిన మనస్సు కల వాడు; శాంతిం — శాంతి; నిర్వాణ — భౌతిక బంధాల నుండి విముక్తి; పరమాం — అత్యున్నత; మత్-సంస్థామ్ — నాయందే స్థితమై ఉండి; అధిగఛ్చతి — పొందును.
*BG 6.15 : ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపిఉంచుతూ, క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నా యందే పరమ శాంతితో స్థితుడై ఉండును.*
*వ్యాఖ్యానం*
ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యాన పద్దతులు ఉన్నాయి. జెన్ పద్దతులు, బౌద్ధ పద్దతులు, తాంత్రిక పద్దతులు, టావో పద్దతులు, వైదిక పద్దతులు మొదలగునవి. వీటన్నిట్లో మరల ఉప-శాఖలు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని పాటించేవారిలోనే అనేకానేక రకాల పద్దతులు పాటిస్తున్నారు. క్లిష్టమైన సమస్యేమిటంటే, మన వ్యక్తిగత అభ్యాసం కోసము వీటిలో మనం ఏది పాటించాలి? అని నిర్ణయించుకోవటం. శ్రీ కృష్ణుడు ఈ చిక్కు ప్రశ్నకు సులువైన సమాధానం సూచిస్తున్నాడు. ధ్యాన విషయం భగవంతుడే ఉండాలి మరియు భగవంతుడు మాత్రమే ఉండాలని చెప్తున్నాడు.
ధ్యానము యొక్క లక్ష్యము కేవలం ఏకాగ్రతను పెంపొందించుకోవటమే కాదు, మనస్సుని పరిశుద్ధి చేసుకోవటం కూడా. శ్వాస, చక్రాలు, శూన్యం, దీపం వంటి వాటిపై ధ్యానం ఎకాగ్రతను పెంచుకోవటానికి దోహదపడవచ్చు. కానీ, మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికి ఖచ్చితంగా మనస్సుని సంపూర్ణ పరిశుద్దుడైన భగవంతును యందు నిలిపితేనే సాధ్యం. భగవంతుడు ప్రకృతి త్రిగుణముల కన్నా అతీతుడని 14.26వ శ్లోకంలో పేర్కొనబడినది, కాబట్టి, ఎవరైతే ఆయనపై మనస్సుని నిమగ్నం చేస్తారో వారి మనస్సు కూడా త్రిగుణముల కంటే అతీతంగా అవుతుంది. ఈ విధంగా, 'ప్రాణము' లపై ధ్యానం అలౌకికమైనదని అభ్యాసకులు అనవచ్చు కానీ నిజమైన అలౌకిక ధ్యానం అనేది భగవంతుని పట్ల చేసేదే ఉంటుంది.
మరైతే, భగవంతునిపైనే మనస్సు నిలిపే మార్గం ఏమిటి? మనము భగవంతుని దివ్య లక్షణములైన అన్ని - నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, పరివారము - వీటిపై ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ భగవంతుని కన్నా అభేదము మరియు ఆయన సర్వ శక్తులను కలిగి ఉన్నాయి. కాబట్టి, భక్తులు వీటిలో దేనిపైనైనా ధ్యానం చేసుకుని, భగవంతునిపై ధ్యానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. భారతదేశంలో, చాలా భక్తి మార్గాల్లో భగవన్నామమే ధ్యానానికి ఆధారంగా చేయబడింది. ఈ విధంగా రామాయణం (రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది:
బ్రహ్మ రామ తేఁ నాము బడ, బర దాయక బర దాని
‘జీవాత్మలకు ప్రయోజనకారిగా ఉండటంలో, భగవంతుని నామము భగవంతుని కన్నా గొప్పది.’ నామ ఉచ్చారణ అనేది భగవంతున్ని గుర్తుంచుకోవటానికి అత్యంత అనుకూలమైన పద్దతి, ఎందుకంటే దీనిని ఎక్కడైనా, ఎప్పుడైనా చేయవచ్చు - నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కూర్చున్నప్పుడు, తినేటప్పుడు, ఇంకా ఏ ఇతర పని చేస్తున్నప్పుడైనా.
కానీ, చాలామంది సాధకులకు, కేవలం భగవత్ నామము మాత్రమే, మనస్సుని రంజిల్ల చేయటానికి తగినంత ఆకర్షణ కలుగచేయదు. అనంతమైన జన్మల సంస్కారముల వలన మనస్సు సహజంగానే స్వరూపముల వైపు ఆకర్షితమవుతుంది. భగవత్ రూపము ఆధారంగా చేసుకుంటే, ధ్యానమనేది సహజంగా, సులువుగా ఉంటుంది. దీనినే 'రూప ధ్యానము' అంటారు.
ఒకసారి మనస్సు భగవత్ రూపంపై కేంద్రీకృతమయితే, మనము దాన్ని, దేవుని గుణముల పై - అయన దయ, ఆయన సౌందర్యం, ఆయన జ్ఞానం, ఆయన ప్రేమ, ఆయన ఉదారత, ఆయన కృప, ఇంకా ఎన్నో... – వీటిపై చింతన చేయటం ద్వారా - మరింత ఇనుమడింపచేయవచ్చు. ఆ తర్వాత మానసిక సేవ చేయటం ద్వారా ధ్యానంలో మరింత పురోగతి సాధించవచ్చు. ఆయనకు ఆహార పదార్థములు సమర్పించినట్టు, అర్చన చేసినట్టు, ఆయనకు పాటలు పాడినట్టు, పాద సేవ చేసినట్టు, విసనకర్ర వీచినట్టు, స్నానం చేపించినట్టు, ఆయనకై వంట చేసినట్టు ఇలా భావన చేయవచ్చు. దీనిని 'మానసీ సేవా' (మనసులో భగవంతుని సేవ చేయటం) అంటారు. ఈ రకంగా, మనం భగవంతుని నామాలు, రూపాలు, గుణములు, లీలలు మొదలైన వాటిపై ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ భగవంతుని యందే మనస్సుని నిమగ్నం చేయటానికి, శ్రీ కృష్ణుడు చెప్పిన ఉపదేశం పాటించటానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఉపకరణములే.
ఈ శ్లోకం చివరన, శ్రీ కృష్ణుడు, ధ్యానం యొక్క అత్యున్నత ప్రయోజనం ఇస్తున్నాడు, అవే, మాయా నివృత్తి, మరియు శాశ్వత ఆనందాన్ని ఇచ్చే భగవత్ ప్రాప్తి.
ఒరిజినల్ ఇంగ్లీష్ మూలం ఇక్కడ చూడండి: https://www.holy-bhagavad-gita.org//chapter/6/verse/15
అష్ట దిక్కుల గాలులు - లాభ నష్టాలు .
గాలులు లొని రకాలు -
బౌగోళిక పరిస్థితులను బట్టి సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు. అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్ని ఒకే రకంగా ఉండవు . ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది . అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో రుతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులు మానవులకు కొంత ఆరోగ్యము , కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం.
దక్షిణ దిక్కు గాలులు -
ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి . ఇవి మలయ పర్వతం మీదగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి , చేదు , వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి
నైరుతి గాలులు -
జూన్ , జూలై నెలలలో వచ్చే గ్రీష్మ రుతువు లొ నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వాళ్ళ ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు.
పడమర గాలులు -
ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పొతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి.
వాయువ్య దిక్కుల గాలులు -
అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం . కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది.
తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు -
డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి . తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి.
ఆగ్నేయ గాలులు -
ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.
మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034