1, అక్టోబర్ 2024, మంగళవారం

మాస శివరాత్రి?

 మాస శివరాత్రి? ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? దీని వలన ఉపయోగములు ఏమిటి


? మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి?


ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు.


అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.


మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి?


మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.


చంద్రోమా మనసో జాతః


అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది.

తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.


మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు ఘడియాలలో కొందరి ఆరోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంతమేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.


మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి.


అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో పెట్టిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.


అదేవిధంగా ఆరోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి.


మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి.


మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు?


ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవడము వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గు ముఖం పడుతుంది.


సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది.


వృత్తికి సంబంధించిన అవరోధాలలో మార్పు కల్గుతుంది.


దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలముకు వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమములో కచ్చితముగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.


కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందగలుగుతాము...

31. " మహాదర్శనము

 31. " మహాదర్శనము "--ముప్పై ఒకటవ భాగము--మింగుడు పడని ముద్ద


 31.  ముప్పై ఒకటవ భాగము--  మింగుడు పడని ముద్ద



          ఆచార్య దేవరాతుడు ప్రాతః కర్మలన్నిటినీ ముగించి , వచ్చి కూర్చున్నాడు . కించిత్ ఉపాహారమును స్వీకరించు వేళ. కానీ అతనికి ఈ దినము ఉపాహారము సహించదు .ఆకలి దప్పులు పుట్టవు . ఏదో చింతలో ఉన్నాడు . మనస్సు యొక్క క్లేశమును శరీరము కూడా వహించినట్లుంది . యజమానుడు రోగ గ్రస్తుడైనపుడు ఇంటిలోని పశువులలో కూడా కనిపించు దౌర్మనస్యము వలె అంగాంగములూ తేజోహీనమైనవి . అధ్యయనము కోసము వచ్చి నిలచిన శిష్యులకు అధ్యయనము చేయించమని వృద్ధ శిష్యుడొకనికి చెప్పి , తాను చింతాక్రాంతుడై కూర్చున్నాడు . 


          ఆలంబినికి కూడా ఆచార్యునికి వచ్చిన జ్వరమేమిటో తెలుసు . ఆమెకు కూడా వంట చేయునపుడు పెద్దగా ఏడవవలె ననిపిస్తున్నది . అయితే అది ఆమెకు అలవాటులేని పని .  ఆడపిల్ల అని , తన తల్లి వలె తనను నెత్తికెక్కించుకోకున్ననూ , భర్త దగ్గర ఇతరులకు అధికారము లేని , అనన్యభాజమైన తన స్థానము ఒకటుందన్న నమ్మకము పొందిన మనసు ఇంటి పనులలో ఆమెకు స్వాతంత్ర్యమును ఇచ్చినది . భర్త తన మాట ప్రకారము నడవకున్ననూ , తన మాటను కొట్టివేయడు అన్న ధైర్యము ఆమెకు తాను చేయు పనులలో ఉత్సాహము శ్రద్ధ లను ఇచ్చింది . " తాను చేయుచున్న పనులు , ఏవికూడా ఇతరుల ఆక్షేపణలకు గురియగుట జరగదు , తృప్తిని తెచ్చేవి" అను నమ్మిక కావలసినంత సంతోషాన్ని తెచ్చింది . చేసే పనిలో ఏదైనా తప్పు జరిగితే , దానిని పెద్దదిగా చేసి తనను ఒక అనామకురాలిగా చేయక,  ’ కాళ్ళు నడుస్తున్నపుడు ఎప్పుడైనా ఒక  అడుగు తప్పదా ? ’ అను విశాలమైన మనసుతో చూచు గొప్పవారు . తనను దేవతయని గౌరవిస్తూ తన ప్రసాదము కోసము వేచియుండే గొప్పవారు . ఆమె కన్నీరెందుకు కార్చ వలెను ? 


         నిన్నటి ప్రసంగము మొగుడూ పెళ్ళాలిద్దరికీ మింగుడు పడని ముద్ద అయినది . గురుదేవులు వైశంపాయనుల గురుకులములోని శిష్యమండలము లన్నిటా , వీడు లేకున్న ఇంకేమీ లేదు అనిపించుకున్న కొడుకు ఇప్పుడు కులపతుల కోపమునకు పాత్రుడై ఇంటికి వచ్చేసినాడు . అధ్యయనము చేయునపుడు శిష్యుల దౌర్బల్యము వల్లనో , అనవధానము వల్లనో అక్కడక్కడా చెడిపోవుట కద్దు . అయినా అది దోషము . వేదము నకు అపరాధము అగుట వలన అది బ్రహ్మ హత్యతో సమానము . దానిని దినదినమూ తగ్గించుట కోసము ఆచార్యుడైన వాడు ప్రత్యేకముగా కొన్ని భాగములను పారాయణ చేయును . ఏ దినమైనా అతని దేహ , మనోస్థితులవల్ల అతనికి ఆ కార్యమును చేయుట సాధ్యము కాకపోతే అతని కోసము వృద్ధ శిష్యుడొకడు చేయును . అప్పుడపుడు ఆ కార్యమును చేయుట యాజ్ఞవల్క్యుని వంతు అయ్యేది . యాజ్ఞవల్క్యుడు గురు దేవులకు ఏదో అస్వస్థత ఉండుట చూచి వారి అనుమతి అయితే , ఆ ప్రాయశ్చిత్తాధ్యయనమును తాను చేయగలనని తెలుపుకున్నాడు . నీరు ఉన్నట్టుండియే ఉడుకునట్లు గురుదేవులు రెచ్చి , " ఇతరులకన్నా బాగా అధ్యయనము చేసియున్నావన్న అహంకారము నీకు వచ్చింది . ఈ అహంకారము విద్యావంతునికి తగినది కాదు . ఈ అహంకారము వలన ఇతరులకు అవమానము చేసినట్లయింది . మా విద్యను మాకు ఇచ్చివేసి వెళ్ళూ ! " అని ఎగురుటయా ? 


          యాజ్ఞవల్క్యుడు సదా వినయముతో ఉండువాడు . కానీ ఆకస్మికమైన ఈ కోపమువలన అతనికి కూడా విరసమైనది . మనసు విరిగి ఆక్రోశమైనది . కంట నీరు వచ్చింది . అయినా కూడా సభ్యతను వదలక , ఆ ఆక్రోశములో కూడా , " నేను తప్పు చేసిన క్షమించ వలెను " అని నమస్కారము చేసినాడు . 


         ఎప్పటివలె అయితే , ఆ నమస్కారముతో కులపతులు శాంతులయ్యేవారు . కానీ ఆ దినము అదేమిటో , మండే మంటకు ఉప్పు తగిలినట్లాయెను . ఇంకా చెలరేగిపోయి , " అపచారానికి వినయపు ముసుగు కప్పవలెనని యున్నావా ? మేము చెప్పినట్లు చేసి వెళ్ళిపో . నువ్వు ఇకమీదట మా ఆశ్రమములో ఉండవద్దు . నువ్వు మా ఆశ్రమములో ఒక్క ఘడియ కూడా ఉండకూడదు . మా విద్యను మాకు ఇచ్చి వెళ్ళు " అని అతడు గద్దించినాడు . 


         అతడు అలాగు గదరుకోవడము చూచి కులపతి యొక్క పత్ని కదంబిని వచ్చినది . భర్త ఎదురుగా కన్నీరు కారుస్తున్ననూ , నాగుపాము వలె బుసకొట్టుతూ , కళ్ళు వెడల్పు చేసుకొని , క్రోధ తామ్రాక్షుడై నిలచిన శిష్యుడిని చూచి రివ్వుమని వచ్చి వాడిని తన వెనుకకు లాగుతూ , భర్తకు ఎదురైంది . ఆమెకు దిగులు పుట్టింది . గురుశిష్యులిద్దరూ తపస్వులు . ఇద్దరికీ కోపము మితిమీరి , శాప ప్రతి శాపముల పర్యవసానము అగునో ఏమో అని బెదరి ఆమె వెంటనే భర్తకు నమస్కారము చేసి , " ఇక్కడికే ఈ కోపము ఉపసంహరించవలెను . యాజ్ఞవల్క్యుని పిలుచుకొని వెళ్ళుటకు అనుమతి కావలెను ." అని చేతులు జోడించినది . గురుదేవుడు కోపమునంతటినీ ఉపశమించుకుంటూ , కోపముతో మండునట్లున్న కళ్ళను అటు తిప్పుకొని , సరేనని అనుమతినిచ్చినాడు . ఆమె వాడిని లాగుకొని వంట ఇంటికి వెళ్ళినది . ఆచార్యుడు లేచి స్నానమునకు వెళ్ళినాడు . మాధ్యాహ్నికములన్నీ ముగిసి కులపతి వైశ్వదేవమును అయిన తర్వాత ఆమె యాజ్ఞవల్క్యునికి భోజనము పెట్టినది . ఇష్టము లేకున్ననూ , ఆమె బలవంతానికి ఇంత తిన్నాననిపించుకుని ఎవరికీ చెప్పకుండా , దొంగతనము చేసినవాడి వలె , దుర్దానమును పట్టినవాడివలె ఆశ్రమమునుండీ బయలుదేరి వచ్చినాడు . 


          భార్యాభర్త లిద్దరూ కొడుకు ద్వారానే ఈ కథనంతటినీ విన్నారు . అకారణముగా  కోపము , అదికూడా తమ కొడుకుపై కోపము చేసుకున్నారు గదా ఆ కులపతులు ? అని భర్తకు అభిమానము ముంచుకొచ్చినది . భార్యకు , తన కొడుకు అప్పుడూ , ఇప్పుడూ వినయముతోనే ఉన్నాడుకదా అని ఒక అంతస్సంతోషము . బ్రహ్మ హత్యా నివారణకోసము ప్రాయశ్చిత్తాధ్యయనమును తాను చేసెదనని చెప్పుటలో తప్పేమిటని భర్త విచికిత్స చేస్తే , " ఎంతైనా కదంబినిది తల్లి హృదయము . అప్పుడు , ఏమౌతుందో అని ఆమె అడ్డము రాకుండా ఉండి ఉంటే నిజము గానే ఏమేమి జరిగేదో ? " అని భార్యకు భయమై వణుకు వస్తుంది . అంతు , ఇద్దరికీ దౌర్మనస్యము . ఏమి చేయుటకూ మనసు ఒప్పదు . భర్తకు అభ్యాసమైన అధ్యాపనమూ వద్దనిపిస్తే , భార్యమాత్రము , అభ్యాసమును వదలలేక వంట చేస్తున్నది . ఇలాగ ఇద్దరూ తమ తమ బాధ ,  చెరువు కట్టను తెంచుకొని పరవళ్ళు తొక్కుటకు సిద్ధమైన నీటివలె పెరిగి కాల్చుతుండగా నిద్రాహారాలు లేక వ్యథ ననుభవించు వారి వలె మూగబోయి , స్తబ్ధులై తమ తమ స్థానములలో కూర్చున్నపుడు , " ఆచార్యా ! " అన్న గొంతు ఉరుము ఉరిమినట్లు వినిపించినది . ఆచార్యుడు ఆ గొంతు వినగానే కొత్తగా ఏదో దారి దొరికినట్లై , నీటిలో మునగ బోయేవాడికి మునగ బెండు ఆసరా దొరికి మరలా ఆయుస్సు లభించినట్లై , కళ్ళు చెమర్చినాయి . " రావలెను , దయ చేయవలెను " అని లేచి ఆ వచ్చినవారికి ఎదురు వెళ్ళి పిలుచుకు వచ్చినాడు . వారికి కాళ్ళు చేతులకు నీరిచ్చి పిలుచుకొని వెళ్ళి నడిమింట్లో వేత్రాసనము పైన కూర్చోబెట్టినాడు . 


         ఇటు ఆలంబినికి కూడా ఆ ఉరుము వినిపించినది . ఇంత గట్టిగా అరచువారెవరు ? అనిపించినది . మనసు ఎప్పటివలె తేలికగా ఉంటే , గొంతును గుర్తించ గలిగేది . కానీ అటుల కాలేదు . ఏమైనా సరే యని , మీగడ పెరుగును గిన్నెలో వేసి, దానికి చక్కెర కలిపి తీసుకొని వచ్చింది . 


         వచ్చినవారు బుడిలులు. " ఏమిటి సంగతి ? " అని అడిగినారు . ఆచార్యుడు ’  కొడుకు  సంగతి చెప్పవలెను . ఎక్కడనుండీ ఆరంభించేది ? ’  అన్న యోచనలో ఉండగా ఆలంబిని చెక్క పళ్ళెములో , చెక్క గిన్నెలో చక్కెర కలిపిన పెరుగును తెస్తూ వాకిట్లో కనిపించినది . బుడిలులు నవ్వుచూ , " ఏమి ఆలంబమ్మా ? ఏమిటి సంగతి ? " అని అడిగినారు . ఆమెకు , అలాగయిన , వీరికి కూడా తెలిసిందా ? అనిపించి కళ్ళలో నీరు నిండింది . కానీ అల్పాహారము నిచ్చునపుడు కన్నీరు పెట్టరాదని బహుకష్టముతో దానిని నిగ్రహించుకొని , " ఏదో ఒకటి ఉండే ఉంటుంది , మొదట అగ్ని దేవుడు శాంతము కానీ , ఆ మీదట మాటలు "  అని పళ్ళెమును ముందుంచింది . అయినా గొంతులో జీర లేకుండా పోలేదు . 


          బుడిలులు , ’ అటులనా ? సరే సరే ’ అని మారు మాట్లాడక , మళ్ళీ అడిగించు కోకుండా పెరుగు తీసుకున్నారు . దానిని సేవించి , " ఈ పెరుగు తోడు పెట్టుట కూడా ఒక కళ అయి ఉండాలి . అది నీకు చాలా బాగా అలవడిందమ్మా , ఇదేమిటి , పాలరాయా లేక బిగిసిపోయిన పెరుగా ? " అని దానిని ఆస్వాదించి , గిన్నెను పక్కకు పెట్టి , " ఎక్కడ యాజ్ఞవల్క్యుడు ? "  అన్నారు . 


          దంపతులకు , " బుడిలులకు అంతా తెలిసినట్లుంది " అనిపించినది . ఒకరి ముఖము నొకరు చూసుకున్నారు . ఒక ఘడియ తాళి , " వాడు పెరట్లో తోటదగ్గర ఉండవలెను , వెళ్ళి పిలుచుకు వస్తాను " అని ఆలంబిని వెళ్ళింది . బుడిలులు ఆమెకు చేత్తో నిలవమని సంజ్ఞ చేసి , " వద్దు వద్దు , వాడే వస్తాడు . ఇంకొంచము సేపైన తర్వాత వాడే రానీ . నువ్విక్కడే ఉండి నేను చెప్పునది విను " అన్నారు . ఆలంబిని లోపలికి బయలుదేరినది అక్కడే నిలిచింది . బుడిలులు ఆరంభించినారు : 


          " ఆచార్యా , మీరు కొడుకు విషయము ఆలోచిస్తున్నారు . నిన్నటి సంగతి మీ ఇద్దరి మనసులలో నిండింది . ఆ విషయమై ఆలోచనలను మానండి . ఇదంతా దేవతల ఆట. అటువైపు వైశంపాయనుడు , ఇటువైపు యాజ్ఞవల్క్యుడు , ఇద్దరినీ పట్టి ఆడించినారు దేవతలు . అది మీకు చెప్పాలనే నేను వచ్చినది . " 


" సరే , తమకెలా తెలిసింది ? "


          " అయ్యా , యాజ్ఞవల్క్యుని పంపించుటకైతే పంపించినారు గానీ ఇప్పుడు ఆ వైశంపాయనుల గోడు ఎవరూ తీర్చలేనిది . నిన్న సరిగ్గా అర్ధరాత్రి జాములో వచ్చి వాకిలి తలుపు తట్టినారు . ఈ సమయములో వచ్చువారు ఎవరు అని వచ్చి చూస్తే వైశంపాయనులు వస్తూనే పాదములు ముట్టి నమస్కరించి ’ ఒక మూర్ఖపు పని జరిగిపోయింది .  దాని వలన ముందు ముందు ఏమీ అనర్థము సంభవించకుండా చూచి కాపాడు భారము మీదే " అని కన్నీరు పెట్టుకున్నారు . " ఏమిటో చెప్పండి , సరిదిద్దుకుందాం ’ అని నేను అనునయించిన కొద్దీ అతడి దుఃఖము ఎక్కువయింది . చివరకు వారు చెప్పినదేమంటే , 


          " పొద్దుటినుండీ అతడికి ఏదో అవివేకము జరుగునని తెలుసు . దానివలన మనసు అలజడి అయింది . అయినా అభ్యాస బలము వలన అధ్యాపనము చేసినారు . చివరకు అందరూ వెళ్ళిపోయిన తరువాత యాజ్ఞవల్క్యుడు అక్కడే నిలచి , ’ ఈ దినము మీకు దేహస్థితి సరిగా లేనట్లుంది . అనుమతి అయితే నేను ప్రాయశ్చిత్తాధ్యయనము చేస్తాను ’ అన్నాడట. అదే కారణముగా అతడు రేగిపోయినాడు . అదేమో , చిలికి చిలికి భూమ్యాకాశములను ఏకము చేయునట్లయిందట . దైవ వశాత్తూ కదంబిని మాత అడ్డురాకుండిన ఏమయ్యెడిదో ? అదే కారణము వల్లనే  యాజ్ఞవల్క్యుని పంపించినది . అతడిదేమీ తప్పులేదు . తప్పుంటే , అకారణముగా రేగిపోయిన నాది . అతనికి ఈ నిర్గమనము వలన శ్రేయస్సే అగునట్లు నా తపస్సునంతటినీ ధారపోసినాను . కాబట్టి ఆచార్య దంపతులు కొడుకుపై ఏమాత్రమూ కోపము చేసుకోరాదు , గద్దించనూ వద్దు అని తమరు వెళ్ళి వారికి సాంత్వన నిచ్చి రావలెను " అని ఈ కార్యమును నాకు అప్పజెప్పి , అదే అర్ధరాత్రిలోనే అతడు వెళ్ళిపోయినాడు . మీకు ఇది చెప్పుటకు నేను వచ్చినాను " 


" ఎట్టి కారణము చేతనైనా సరే , బుడిలులు మా ఇంటికి వచ్చినారు . అదే మా భాగ్యము . సరే , మరి అతడే వచ్చి మాకు ఎందుకు చెప్పియుండ కూడదు ? "


          " దానిలో ఏదో రహస్యమున్నదట . యాజ్ఞవల్క్యుని ఎదురుగా ఈ విషయమును మీకు చెప్పకూడదు అని అతడు రాలేదట ! వటువు ఎదురుగా చెప్పకూడదు అనుటలో లౌకికమునకన్నా , అలౌకికమే ఎక్కువ అని నాకు అనిపించి , ’ పోనివ్వండి , ఆ దంపతులు ఇది తెలిసిన తరువాత వ్యథపడుట మానెదరు . అటులనే మీరు కూడా నామీద భారము వేసి మీ దుఃఖమును వదలండి . ఏదైతే తర్కమునకు అందకుండా జరుగుటకు కారణమగునో దానిని దైవికమనవలెను. కాబట్టి అది దైవ చిత్తముచేత జరిగినది . ఇది కూడా దేవకార్యార్థమే అయి ఉండవలెను ’ అన్నాను . గురుదేవులు నవ్వుచూ , నాకూ అటులే యనిపించుతున్నది . తమరు ఇంత చెప్పిన తరువాత దుఃఖము నన్ను వీడినది . ’ అంటూ , ఏడుస్తూ వచ్చినవారు నవ్వుతూ వెళ్ళినారు "  


         ఆ దంపతులకు మోయలేని భారమేదో దింపినట్లై వారికి తెలీకుండానే , వారి ప్రయత్నము లేకుండానే ఒక నిట్టూర్పు వచ్చినది . తేలికైన మనసుతో వారు బుడిలులకు నమస్కారము చేసి తమకు అయిన ఉపకారమును గురించి మాట్లాడినారు . 


         బుడిలులు నేర్పుగా మాట మార్చుతూ , " నేను వచ్చి ఇంత సేపైనది . యాజ్ఞవల్క్యుడెక్కడ ? ఇంకా రాలేదే ? " అన్నారు . యాజ్ఞవల్క్యుడు , ’ ఇగో , వచ్చినా తాతా ! " అని వచ్చి నమస్కరించినాడు . 

Janardhana Sharma

జగదంబను రుక్మిణి వేడుట!



.జగదంబను రుక్మిణి వేడుట! 


            ఉ:  నమ్మితి  నామనంబున  సనాతనులైన  యుమామహేశులన్  


                 మిమ్ము , పురాణ దంపతుల  మేలుభజింతు గదమ్మ ! మేటి   పె


                ద్దమ్మ !  దయాంబురాసివి గదమ్మ!  హరిం బతిసేయుమమ్మ!  నిన్


                నమ్మిన  వారి  కెన్నటికి  నాశము  లేదు గదమ్మ!    యీశ్వరీ !


                    శ్రీ భాగవతము- దశమస్కంధము- 1741 పద్యం:  బమ్మెఱపోతన;


                               తెలుగు వారి  పుణ్యాల పేటి  శ్రీ మహాభాగవత గ్రంధము. ఇది 18 పురాణములకు  మించిన నహాపురాణముగా

ప్రసిధ్ధి గాంచినది. శ్రీకృష్ణ పరమాత్ముడే నాయకుడుగా వెలసిన యీగ్రంధమున  నతని లీలా వినోదములే యనేక రసవద్ఘట్టములుగా , తీరిచి దిద్ద బడినవి. రక్తికి , భక్తికి , ముక్తికి ,యీగ్రంధము మూలమై యాంధ్ర సాహిత్యమున కొక వెలలేని యలంకారమై భాసించు చున్నది. భాగవతమునందలి  రసవద్ఘట్టములలో  రుక్మణీకళ్యాణము  ప్రముఖమైనది. 


                                 పెండ్లి కుమార్తెయగు  రుక్మణి  శిశుపాలుని  వరింప నిష్టపడక  తాను మనసిచ్చిన కృష్ణ పరమాత్మకు తనహృదయమును నివేదించి  యతనిని దోడ్కొని వచ్చుటకు అగ్నిద్సోతనుడను బ్రహ్మణ వర్యుని  ద్వారకకు పంపినది.తడవైనది యతడురాడాయెను.ముహూర్తము దరియు చున్నది.  గౌరీ పూజయు ,ప్రారంభమైనది. డోలాయమాన చిత్తయగు రుక్మిణి  సర్వమునకు  ఆపరమేశ్వరిపైననే భారముంచి  ఆజగ దంబ  నిట్లని ప్రస్తుతింప సాగినది. 


                   పోతన కవి చాతుర్యమంతము  పద్యము యెత్తుగడలోనే ప్రదర్శించినాడు."  నమ్మితి నామనంబున  సనాతనులైన  యుమామహేశులన్ మిమ్ము"- అమ్మా!  నేను  మిమ్మల్నే నమ్ము కొన్నాను. మీరు సనాతన దంపతులు. మీకన్న నాకు దిక్కెవ్వరు?అనుచున్నది. ఆమాటతో భారమంతయు పార్వతీ పరమేశ్వరులపై నుంచినట్లయినది.


                      పార్వతీ పరమేశ్వరులనే  గోరనేల? వారును ప్రేమ జంటలే !వారినిగూడ పెద్దలు వారించినారు. అయినను వారిరువురు సతీపతులైనారు. ఎన్ని యుగములైనదో వారిదాంపత్య మారంభమై,కావున వారు పురాణదంపతులు. అట్టి దంపతులదీవెనలే పెండ్లికుమార్తెకు కావలసినది. నచ్చినవరుతో కళ్యాణము ఆడుదానికి ఒక అమూల్యమైన వరముగదా! ఆవరము నీయగల

శక్తి శివ పార్వతులకేగలదు. కాబట్టే రుక్మిణి వారినాశ్రయించుట. గౌరీ పూజలోని ఆంతర్యమిదే !


                                     మిమ్ము పురాణదంపతుల  మేలుభజింతు గదమ్మ" ఆది దంపతులగు మిమ్ము  నెల్లవేళల పూజింతునుగదా!

నాచేపూజలందెడు మీరే నాకోర్కెదీర్పవలె. వేరెవ్వరు దీర్పగలరు.? 


                    మేట్టి  పెద్దమ్మ!  అమ్మలకు  అమ్మలున్నారు కాని  మేటియైన పెద్దమ్మల నెక్కడ గాంచగలము. ఆతల్లి పార్వతియే!" ఆకీట,

బ్రహ్మపర్యంతం ,ఆమెయే జనని. జగజ్జనని. కావున నందరకు పెద్దమ్మ ఆమెయే! పెద్దలే పిల్లలకోరికలు దీర్చాలి. లేకున్న వారి పెద్దరికమునకే అవమానము.


                     "దయాంబురాశివి గదమ్మ" ఆమె దయా సముద్ర. సువిశాలమై  అగాధమై  యనంతమైన  సముద్రముతో  నామెదయకు పోలిక. ఆహా! యెంత చక్కని యుపమానము.భక్తులయెడ  తరుగని దయగలది యాతల్లి.కావున ఆమెదయకు నోచుకొన్నవారి కోరికలు దీరక పోవునా?


                 చివరకు చెప్పుచున్నది అసలుమాట."హరింబతిసేయుమమ్మ" శ్రీకృష్ణుని నాకు భర్తగా చేయవమ్మా! యెవరు కాదన్నాసరే,నీవు అవునంటే చాలు మావివాహం జరిగితీరుతుంది. అమ్మా! నేవలచిన కృష్ణుని  భర్తగా ననుగ్రహించు.


                       నిన్  నమ్మిన వారి కెన్నటికి  నాశము లేదుగదమ్మ  యీశ్వరీ!"- నిను నమ్మిన వారు చెడగా నేనెక్కడా చూడలేదమ్మా!

కాన నాకోరిక ఫలింప జేసి  మానమ్మకము నిలబెట్టు మని రుక్మిణి  గౌరీ ప్రార్ధనము!


                           చక్కని నుడికారముతో  బహు చక్కని భావజాలముతో  రుక్మిణి కోరిక  ఫలించు రీతిగా  గౌరీ ప్రార్ధనా ఘట్టమును

కేవల మొకేయొక్కపద్యమున సయుక్తికముగ, సముచితముగ  రచియించిన పోతన మహాకవికి సాటి యగువారెవ్వరు? 


                                                       స్వస్తి!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


Bhargava Sarma pravachan


 

మహాభారత సారాంశం

 *లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం*


*పది వాక్యాలలో...*

   

1. *మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు... వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు.*

ఉదా: *"కౌరవులు."*


2. *నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ... ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ... వాటిని "అధర్మం కోసం వినియోగిస్తే"... అవి నిరుపయోగమవుతాయి. నువ్వు కూడ వినాశనం అవుతావు.*

ఉదా: *కర్ణుడు* 


3. *యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే "వినాశం" జరుగుతుంది.*

ఉదా:*అశ్వత్థామ.*


4. *పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.*

ఉదా:*" భీష్ముడు."*


5. *సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  "దురహంకారం" తో "అధర్మంగా" వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి "వినాశం" జరుగుతుంది.*

ఉదా: *"దుర్యోధనుడు "*


6. *స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా "తనవారి పట్ల వల్లమాలిన అభిమానం" గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.*

ఉదా: *ధృతరాష్ట్రుడు* 


7. *శక్తి యుక్తులకి, తెలివితేటలకి ధర్మం" తోడైతే "విజయం" తప్పక లభిస్తుంది.*

ఉదా: *అర్జునుడు.*


8. *ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం.*

ఉదా: *శకుని*


9. *నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు, నీ వాళ్ళకి హానిచేయదు.*

ఉదా: *యుధిష్ఠిరుడు*


10. *అందరి బంధువైనా... అన్ని తెలిసినా, చివరకి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్యధర్మం కూడా.*

ఉదా: *శ్రీకృష్ణుడు*


*కోటి కథల, లక్షల వ్యధల, వేల ఉప కథల, 100 మంది శత్రువుల, 5గురు మిత్రుల (అందరు సోదరులే)...*

*నాలుగు ధర్మాల సారాంశము భారతం* 

  📖🙏📖 🙏📖🙏 📖🙏📖

అల్సర్ నివారణ

 తీవ్రమయిన అల్సర్ నివారణ కొరకు అద్బుత యోగం  - 


       అల్లము , మంచిబెల్లం , నువ్వులు సమానభాగాలు గా తీసుకుని బాగా దంచి ఉసిరికాయ అంత మాత్రలు గా చేసుకొని రెండు పూటలా ఆహారానికి గంట ముందు తీసికొనవలెను. 40 రోజుల్లో ఎంత తీవ్రమయిన అల్సర్ అయినా నివారించబడును. 


 గమనిక  - 


      కారం , ఉప్పు , పులుపు పదార్దాలు అతిగా సేవించరాదు.


         

  

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

పంచాంగం 01.10.2024 Tuesday,

 ఈ రోజు పంచాంగం 01.10.2024 Tuesday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష చతుర్దశి తిధి భౌమ వాసర: పూర్వఫల్గుని నక్షత్రం శుక్ల యోగ: భద్ర తదుపరి శకుని కరణం. ఇది ఈరోజు పంచాంగం.


 చతుర్దశి సాయంత్రం 09:39 వరకు.

పూర్వఫల్గుని పగలు  09:16 వరకు .


సూర్యోదయం : 06:10

సూర్యాస్తమయం : 06:02


వర్జ్యం : సాయంత్రం 05:23 నుండి రాత్రి 07:12 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:32 నుండి 09:20 వరకు తిరిగి రాత్రి 10:53 నుండి 11:42 వరకు. 


అమృతఘడియలు : ఈ రోజు లేదు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30  వరకు.



శుభోదయ:, నమస్కార:

వేద ఆశీర్వచనం


 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం  - చతుర్ధశి - పుర్వాఫల్గుణి -‌‌ భౌమ వాసరే* (01.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Shaakhaa chandra nyaayam


 

జరిగిన కథ..

 రాత్రి భోజనాల తర్వాత ఒకటీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది. 


ఆమె పిల్లలు పడుకున్నారు!


భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.


చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది.


ఆ  ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!


"ఏమైంది? ఎందుకు  ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.


 నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.


"అయితే...?"


"ఇదిగో! ఈ చివరి  పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"


భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"


హెడ్డింగ్ ఇలా పెట్టాడు


💥నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.💥


అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రేమిస్తారు!


వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!!


నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!


అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్  చేతిలోకి తీసుకుని  జవాబిస్తారు!


కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...

నేను  ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!


వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!


వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు! 

అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!


అదే ఒకవేళ నాతో  మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే  ఫోన్ కి జవాబిస్తారు!


అమ్మానాన్నలు

స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!

ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!

దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!

దాన్ని చాలా ఇష్టపడుతారు!!

దానితో రిలాక్స్ అవుతుంటారు!!

దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!


దానిని ఎపుడు పనివాళ్ళకి అప్పగించరు


నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ ఒక్కగంట పనిచేయకపోతే చాలా కంగారుపడతారు హడావిడి చేస్తారు 


రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!

ఉదయం లేవగానే దాన్నే  చేతిలోకి తీసుకుంటారు!!


కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న  చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!! 


భార్య చదువుతుంటే... విన్న  భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...

"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.


"మన కొడుకు" అంది భార్య కన్నీరు కారుతుండగా!


వస్తువులను ఉపయోగించుకోవాలి!

బంధాలను ప్రేమించాలి!!


అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!......


ఇది నిజంగా జరిగిన కథ.. 


కాబట్టి ఇలాంటి కథలో తల్లిదండ్రులు మీరు కాకండి ..🙏


🙏దయచేసి ప్రతిఒక్కరూ ఆలోచించండి 🙏


మీ గుండెను తాకితే ... మరికొన్ని గుండెలకు చేర్చండి ,,, కొంతమందైనా మారే అవకాశం కల్పించండి🌹🙏