16, అక్టోబర్ 2024, బుధవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరితము41

 _*శ్రీ ఆది శంకరాచార్య చరితము41 వ,భాగము*_

🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑


శ్రీ శంకరాచార్యులు నీలకంఠుని ఉపన్యాస మంతయు విని, 'ఓయీ! మీ విధానము ననుసరించి మీకు తెలిసి యున్నంతవరకు వచించి యున్నారు.అది సత్యం కానేరదు. ద్వైతమునకుఅతీతమైనది, ఉపనిషత్తులలో నిర్వచించిన అద్వైతము సత్యమై యొప్పారు చున్నది. బ్రహ్మాదులు పరబ్రహ్మ ము కంటే గొప్పవారు కారు. పరాపరమైనది ఆ పరబ్రహ్మమే. అట్టి చైతన్యస్వరూపుడైన పరబ్రహ్మమును మహా వాక్యము స్థిరపరచు చున్నది. జీవునకు ఉపాధి యున్నది. కారణమనే ఉపాధి గలవాడు ఈశ్వరుడు అని శ్రుతి స్పష్టముగ తెలుపుచున్నది. కనుక 'తత్వమసి' జీవేశ్వరు లకు అభేదమునే ప్రతిపాదించుచున్నది. ‘తత్త్వమసి’ మహా వాక్యములో ఆ పరమాత్మ నీవు అను అర్ధమును వివరించు టలో విరోధమే కలుగు చున్నది. ఇందులో జీవేశ్వరులను అంగీక రించుట చేత భేదము కనబడు చూనేయున్నది. చైతన్యపదార్థం ఒక్కటే గాని రెండు కాదు. అది నిత్యమైనది. ఉపాధులు కేవలం కల్పితములు. సత్యం కాదు. కనుక ఉపాధులను లెక్కలోనికి తీసుకొని రాకూడదు.


'తత్-త్వం' అనునవి మాటలు రెండైనా అందు విరుద్ధముగ నున్నదానిని విడచి సత్యమైన దానినే గ్రహించవలెను. చైతన్యం సత్యమైనది గనుక దానినే గ్రహించ వలసి యున్నది. ఇక తత్త్వమసి పరమాత్మనే తెలుపుచున్నది. పరమాత్మ ఒక్కటే కాని ఇన్నిలేవు. ఆనాడెచ్చ టనో కాన్పించిన దేవ దత్తుడు ఈనాడు మరియొక చోట కాన్పించినప్పుడు (సోయం దేవదత్తః) ఆతడే ఈతడు అని చెప్పడంలో తేడాయే లేదు. కాల వ్యత్యాస మందును, రూపు రేఖాదులలోను తేడా గలదు. అట్టి తేడాలు ఉన్నంత మాత్రంచేత ఆతడు వేరుకాక పోలేదు. ఆలాగుననే తత్త్వమసి మహా వాక్యం లో తత్ (నేను), త్వం (నీవు) ఈ రెండు పదములకు భేదము లేదు. ‘సోయం దేవ దత్తః' అను దృష్టాంత ము ఇచట ప్రస్తావనకు ప్రసిద్ధము, సమంజస ము. అందులోగల విరుద్దాంశ ములను విడ నాడినచో దేవదత్తుడు ఒకటిగానే ఉన్నాడు. (ఆనాటి దేవదత్తుడు చిన్నవాడు, ఈనాటి దేవదత్తుడు ముసలి వాడు, గడ్డములు, మీసములు వచ్చి నెరసియున్న వాడు, త్వరలో పోల్చుటకు శక్యం కానివాడు) రెండుగా లేడు. తత్, త్వం పదములు వేరై నను జీవేశ్వరులకు భేదం చూపుట లేదు. రెంటికీ తేడా లేకపోవడ మనేది పరమసత్యం' అని సహేతుకముగా వివరించారు.


శ్రీశంకరపాదుల వచనములు నీలకంఠాచార్యు లువిని, 'శంకరాచార్య స్వామీ! జీవుడు కొద్దిపాటి జ్ఞానం కలవాడు. ఈశ్వరుడు సర్వజ్ఞాని. జీవుని రూపంచిన్నది. ఈశ్వరుని రూపం పెద్దది. పైగా వారిరువురి రూపములు కంటికి కన్పించుట లేదు. అందువలన గుణములను బట్టి జీవేశ్వరురులకు భేదా భేదములు నిర్ణయించవలసి యున్నది. కనుక లక్షణములను బట్టి తత్త్వమసి యందు తేడా ప్రబలముగ నున్నది. అందువలన జీవేశ్వరులకు అభేద మనుట మీ వంటి వారికి తగునా?’


అంతట నీలకంఠుని జవాబువిని, శ్రీశంకర పాదులు, 'నీవనుకొన్నది కల్పితం కాని నిజం కాదు. ముత్యపు చిప్ప లోవెండి కనుపించు చున్నది. అది నిజమా? కాదు. అది కేవలం కల్పితం. పరమాత్మ స్వరూపంలో జీవుని రూపం ముత్యపు చిప్ప లోని వెండి వలె కల్పితమేయగుచున్నది. కల్పిత వస్తువు ఒకటి ఉన్నప్పుడు, అకల్పిత వస్తువునకు నిజమైనది ఒకటి ఉండితీరవలెను. జీవేశులు కల్పితము లైనప్పుడు అందుకు నిజమైనది వచించియున్నారు.అది పరమాత్ము నిగా అంగీకరించ వలెను. త్రాడును చూచి పామనుకొన్నప్పుడు త్రాడుని మించి పాము ఎట్లుండునో కల్పితము (త్రాడు) నకు అధిష్ఠానమైనది పామే కనుక జీవేశ్వరు లకు స్వరూప నిర్ణయం చేయకూడదు. 'అల్పుడు, విజ్ఞుడు’ అనడం కేవలం కల్పితమే యగు చున్నది. సద్వస్తువును అందరు అంగీకరించి తీరవలెను. 'దేహాది ఉపాధులు జీవునకు స్వరూపం. దీనికి అధిష్ఠానం పరమాత్మ' అని ఒప్పుకొని తీరవలెను. ఈ కనబడు శరీరము, అందున్న ఇంద్రియములు జడములే యగు చున్నవి. ఈ జడవస్తువులకు అధిష్టానమైనది జీవుడు. అది జీవ స్వరూపంలో ఉన్న చైతన్యం సర్వలక్షణ మైనది; ఏకరూపములో నున్నది; అద్దానినే పరమాత్మ అందుము. ఆ పరమాత్మ స్వరూపమే ఈ జగత్తు. జగత్తు పరమాత్మకు మాయో పాధి. అందువలన అది నిజం కాదు. ఈ జగత్తంతా జడమై యున్నది. దీనికి అధిష్ఠాన మేదియో తెలిసికొన వలసి యున్నది. అదే సత్యవస్తువు. ఆ సత్య వస్తువే పరమాత్మ. జీవేశ్వరులకు

ఉపాధులు కల్పించడమేయని ఇదివరలో చెప్పబడి యున్నది. అది చైతన్యం మాత్రమే. శుద్ధస్ఫటికం వద్ద ఒక ఎఱ్ఱని పుష్పమున్న ప్పుడు అప్పుడా శుద్ధస్ఫటికం ఎఱ్ఱగా ఉన్నట్లే కన్పించును. అట్లా స్ఫటికం ఎఱ్ఱగా కనుపించినా స్ఫటికములో మాత్రం ఎరుపు లేదు. దాని నిజమైన రంగు తెలుపే గదా! అట్లుగనే కల్పించబడిన ఉపాధులను బట్టి చైతన్యం జీవేశ్వరులుగ తోచును. కనుక జీవేశ్వ రులవలె కాన్పించుచున్న చైతన్యమునకు మూఢత్వము లేదు, సర్వజ్ఞత్వము లేదు. అది కేవలం నిర్గుణమే. జీవేశ్వరులకు భేదముందనుకొనువానికి మోక్షం రాదుసరికదా మృత్యువు ప్రాప్తించును. అట్టి వానికి సంసారసాగరం తప్పదు. జీవేశ్వరులకు భేదం లేనట్టి వారికి మోక్షం కలుగుచున్నది. ఇట్టి విధముగ శ్రుతులు తెలుపు చున్నవి. జీవేశ్వరులకు భేదము కన్పట్టుచుండిన వానికి తత్త్వశాస్త్ర శ్రవణం లేదన్నమాట. చంద్రుడు ఆకసమున కాస్త గోచరించును. బహుదూరమందుండుట వలన అట్లు చిన్నదిగ కాన్పించుట భ్రమ మాత్రమే.


విచారించగ చంద్రుడు చిన్న  వాడు గాడని తేలుచున్నది. అట్లుగనే 'నేను శివుడనుగాను' అను కోవడం భ్రమ మాత్రమే యగుచున్నది. ఈ భ్రాంతి పోవలయు నన్న వేదాంత తత్త్వ విచారణ చేయవలెను. భ్రాంతి సత్యంకాదు కదా! కనుక 'తత్త్వ మసి' జీవేశ్వరులకు భేదము లేదనునది సత్యమే యగుచున్నది. అంతట నీలకంఠుడు, 'శంకరా! కపిలుడు మొదలయిన మహర్షులు జీవుని స్వరూపమును, ఈశ్వరుని స్వరూపమును బహు స్పష్టముగ వివరించి యున్నారు. వారిరువురికి ఉండు భేదమును గూడ బాగుగ వివరించి నిరూపించి యుండగ తాము దానిని వ్యతిరేకించి, రెండూ ఒకటే యనుచున్నారు. పదుగురాడు మాట పాడియై చెల్లవలెను గదా! మీ ఒక్కరి మాట నేనెట్లు ఒప్పుకొన గలను?' శ్రీశంకరా చార్యులంతట, నీల కంఠాచార్యుని సంశ యము నివారణ చేయ 'శ్రుతులకు, స్మృతులకు విరోధము వచ్చినపుడు శ్రుతి వాక్యమునే అంగీకరించవలెను. దుర్బలమైన స్మృతివాక్యం అంగీకరించకూడదు. ఇదే న్యాయము. కపిలుడు మొదలయిన మహాత్ము ల వాక్యములకంటె 'తత్వమసి' బలమై యున్నది అని తెలిపారు. 


'తత్త్వమసి' బలమై యున్నది'  అనితెలియ జెప్పిన శంకరులతో,  నీలకంఠాచార్యులు, 'శంకరాచార్యా! వేదములకు విరోధముగ నున్న స్మృతి వాక్యములు విడిచిపెట్ట మనడంలో సబబు గాన రాదు. మహర్షుల పలుకులు యుక్తియుక్తమై యున్నవి. అవి వేదములతో సమముగా నుండును. కనుక మహర్షుల వాక్యములు వృథా అనడం పాడి గాదు. జీవుడు సుఖము వేరుగను, దుఃఖము వేరుగను అనుభవించుచున్నాడు. అందులో ఒక జీవుడు సుఖమును, ఒక జీవుడు దుఃఖమును అనుభవించు చుండుట అందరు ఎరిగినదే! అందరు సుఖంగా ఉండుట లేదు. ఈ శరీరములలో ఉండు జీవాత్మలు వేరుగను చాలగను ఉంటున్నవి. ఆత్మఉన్నపుడు  అలాజరుగదు. కనుక ఆత్మలు కూడ అనేకమని తేలినది. లేనిపక్షమందు లోకమందు జరుగుచున్న వ్యవహారములన్నియు ఒకేరీతిని ఉండవలెను.


అందుకనే మహర్షుల లందరు ఒకటి కాదని నిశ్చయించారు. ఒకే ఆత్మ అయిననాడు అంతా దుఃఖముతో నైనను ఉండ వలెను. లేకున్న అందరు సుఖముగనైనను ఉండవలెను. అలా ఉంటున్నారా? ఒకరిని సుఖీ అని, వేరొకరిని దుఃఖీ అని అనుచున్నా రెందుకు? ఒకరికి ముక్తి వచ్చిన అందరికీ వచ్చును. ఇదంతా అందరు ఎఱిగినదే. కాదనుటకు ఎవరును లేరు. యతివర్యా! ఇది యటుండ వేదాంతులు ఆత్మను, 'అకర్త, అభోక్త' యనుచున్నారు. కర్త అయినను, భోక్త యైనను అంతఃకరణమే యనుదురు. ఇవి ఆత్మకు లేవనుచున్నారు. జీవునకు చైతన్య మున్నది గనుక కర్త, భోక్తగూడ అతడే. అంతఃకరణము జడము, జ్ఞానము లేనిదియును. అట్టి దానిని కర్త, భోక్త యనుట సమంజస ముగలేదు. యతీశ్వరా! మరొక్క విషయమును తెల్పెద నాలకించుము! మోక్షము సుఖము నిచ్చునని తెలుపు చున్నారు. లోకములో ఎక్కడ జూచినను సుఖమున్నచోట దుఃఖమే కనుపించు చున్నది. సుఖము, దుఃఖమును వెంట బెట్టుకొనియే యున్నది. ఆలోచింపగ సుఖము సుఖము కాదనియే తేలుచున్నది. విష మిళితమైన ఆహారము నెట్లు విసర్జించవలెనో సుఖము నావిధముగనే విడిచిపెట్టవలెను. సర్వ దుఃఖములు నాశన మైన నాడే మోక్షం లభించునని మేము తెలుపుచున్నాము. మీరు మాటాడునది మోక్షము కానేరదు’. 


అంతట శంకరాచార్యు లు, ‘పండితోత్తమా! సుఖమునైనను, దుఃఖమునైనను పొందునది మనసే. మనస్సున కట్టి ప్రభావము ఉన్నది. అది ఇంకను బహు విచిత్రమైన ప్రభావం గలది. ఆత్మకు అట్టి ధర్మములు లేవు. అంతఃకరణములు తేడాగా నుండును గాని ఆత్మ కట్టి ధర్మములు లేవు. ఆత్మ ఒక్కటియే. స్థూల,సూక్ష్మ శరీరములు రెండును జడము లయినను చైతన్య సంయోగము కర్తృత్వ మును కలుగజేయు చున్నది. చైతన్య సంయోగము లేనిచో ఇంద్రియములు కదలనే కదలవు. సూర్యుని కాంతితో ప్రాణులన్నియు తమతమ దైనందిన వ్యాపారములు ఎట్లు నిర్వర్తించుకొన గలుగు చున్నవో ఆ సూర్యుడు అందరికీ ఎట్లు సాక్షీ భూతుడుగ నుంటున్నాడో ఆత్మ సూర్యుని వలెనే సాక్షియై వెలయుచున్నాడు. వెలుగునిచ్చు చున్న సూర్యునకు కర్తృత్వం లేదు. సాక్షీభూతుడైన ఆత్మ కును కర్తృత్వ భోక్తృత్వములు లేవు. చైతన్యములేని శరీరములను శవము లందురు. సుఖము లన్నియు దుఃఖములతో కూడి యున్న వనునది సత్యము. ఐతే అది మామూలుగ జరుగుచున్నపని. అసలు సుఖమనగ దుఃఖము లేనిది. ఆనందముతోగూడినది బ్రహ్మసుఖము. అది ఎక్కడో లేదు, తనలోనే యున్నది. అది దేని వలన కలుగునది కాదు. దుఃఖం

నశించినంత మాత్రమున మోక్షము రానేరదు. స్వానుభవం వలననే బ్రహ్మసుఖం కలుగును. వచ్చినది ఎన్నటికీ పోదు. అది అనంత మైనది' అని నీలకంఠా చార్యుల పూర్వపక్షములన్నియు ఖండించి, ఆయన అనుమాన పిశాచములను పార ద్రోలి, పరమ ప్రమాణ ములతో ద్వైతమును కాదని అద్వైతమతము  స్థాపించారు. అంతటితో నీలకంఠాచార్యులు చెప్పునది లేకపోయెను.


శ్రీశంకరాచార్యులు నీల కంఠుని చేతిలో ఓడిన పోవడం నిశ్చయమను కొన్నవారు నిస్పృహ జెంది శ్రీజగద్గురువుల అఖండ ప్రజ్ఞకు అబ్బుర పడిరి. ఆవార్త దేశమంతట వ్యాపించినది. ఆ క్షణమందు శిష్యులు కూడ, నీలకంఠునితో పాటు ద్వైత భావమును వీడి శైవ భాష్యమును శ్రీశంకర పాదుల కర్పించి పాదాక్రాంతులై శిష్యులు అయ్యారు.


నీలకంఠాచార్యుల గురువు ఉదయనా చార్యుడు. ఆయన అద్వైతమతమును వ్యాప్తి చెందకుండ అణగద్రొక్క నెంచిన వారలలో ఉద్దండుడు. శిష్యులు, ప్రశిష్యులు శ్రీశంకరపాదులకు శిష్యులైనారనిన వార్త విని, అడలిపోయి నిర్వీర్యుడై ఆహారం సహించక శల్యగతు డయ్యాడు.


స్వామి ఆ ప్రాంత మంతయు అద్వైత మత స్థాపన జేసి మరికొన్ని దినములకు ద్వారకా నగరమునకు ప్రయాణ మైనారు.


*కాలడి శంకర కైలాస శంకర*

*శ్రీ ఆది శంకరాచార్య చరితము 41వ, భాగము సమాప్తము*

మహవతార్ బాబా*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

       *మహవతార్ బాబా*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐



మహవతార్ బాబా గారి వయసు రెండు వేల సంవత్సరాలకి పైగా ఉంటుందని ఆ స్వామి ఇప్పటికి ఇంకా హిమాలయాల్లో బ్రతికే ఉన్నారని చాలా మందిలో ఒక నమ్మకం అనేది ఉంది. 


భారతదేశ చరిత్రలో అతి ప్రాచీనమైనది విద్య క్రియా యోగ. ఈ విద్యని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడని చెబుతారు. 


ఆ తరువాత పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో ఈ విద్య గురించి వివరించాడు. ఇక ఈ విద్యని తిరిగి మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది మహావతార్ బాబా అని చెబుతారు. 


మరి మహావతార్ బాబా ఎవరు? 

బాబా సిద్ధిని ఎలా సంపాదించాడు? ఆ విద్యని ఎలా నేర్చుకున్నాడు? అయన శిష్యులు బాబా గురించి ఏమని చెప్పారనే ఇలాంటి మరెన్నో విషయాల గురించి..

                  

తమిళనాడు రాష్ట్రం, ఫరంగిపేట గ్రామంలో ఒక నంబూద్రి బ్రాహ్మణుడైన అర్చకునికి రోహిణి నక్షత్రంలో 203 నవంబర్ 30 వ తేదీన ఒక మగబిడ్డ జన్మించాడు. ఆయనే మహావతార్ బాబా. అయన తండ్రి కుమారస్వామి ఆలయంలో అర్చకునిగా చేసేవాడు. ఇలా రోహిణి నక్షత్రంలో జన్మించిన ఆయనకి వారు నాగరాజు అని పేరు పెట్టారు. అయితే తనకి ఐదు సంవత్సరాల వయసు ఉన్నపుడు ఆలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుండగా 

వేరే ప్రాంతానికి చెందిన ఒకడు ఆయన్ని అపహరించి కలకత్తా నగరానికి తీసుకువెళ్లి అక్కడ ఒక ధనవంతుడికి అమ్మేశాడు. 


ఇంట్లో బానిసగా ఉంటున్న ఆయన్ని చూసి జాలిగుణంతో కొన్ని రోజులకే ఆ ధనవంతుడు ఆయనకి స్వేచ్చని ఇస్తూ తనకి నచ్చిన చోటుకు వెళ్ళమని చెప్పగా. అంత చిన్న వయసులో అయన బయటి ప్రపంచంలోకి రాగా..ఆయనకి ఒక సాధువుల బృందం కనిపించగా వారితో పాటు వెళ్లి వారికి సేవలను చేయడం ప్రారంభించాడు. 


ఇలా ఆ సాధువులు అయన చేసే సేవలకు సంతోషిస్తూ పురాణ ఇతిహాసాలు చెబుతుండేవారు.  

ఇలా అన్ని తెలుసుకుంటూ మంచి పండితుడిగా ఎదిగిన అయన కేవలం పాండిత్యం వలన భగవంతుడి ఆశీర్వాదం సంపాదించలేను అని అనుకోని దివ్యజ్ఞానం, సిద్ది పొందాలంటే ఎలా అనుకుంటూ విచారిస్తుండగా. 


ఆ సాధువుల బృందం కాశీకి వెళుతుండగా..వారితో పాటు కాశీకి వెళ్లి అక్కడ నుండి శ్రీలంకకు చేరుకున్నాడు. ఇక శ్రీలంకలో కతిర్గామ అనే సుబ్రహ్మణ్యస్వామి 

ఆలయం ఉంది. ఇక్కడే సుబ్రహ్మణ్యుడు వల్లీదేవిని వివాహం చేసుకున్నాడని పురాణం. అయితే ఈ ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి యంత్రానికి పూజలు అందుకోడం చూసాడు. అంటే ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం అంటూ ఉండదు. ఒక బంగారు యంత్రం, 

అందులో సుబ్రహ్మణ్యస్వామి వారి రూపం ఉండగా ఆ మహిమగల యంత్రానికే పూజలు చేసేవారు. 


ఇంకా ఈ ఆలయంలో బోగనాధుడు అనే ఒక సిద్ధపురుషుడు ఉండేవాడు. ఆ సిద్ద పురుషుడు సాక్షాత్కరించడంతో అక్కడే ఉంటూ ఆరు నెలల పాటు కదలకుండా ధ్యానం చేసాడు. 

ఇలా ఆరు నెలలు సమాధి స్థితిలో ఉన్న ఆయనకి చివరికి సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్షమవ్వగా ఆయనికి ఎల్లపుడు యువకుడిగా ఉండే సిద్ది లభించింది. 


ఆ తరువాత బోగనాధుడు అయనతో ఇలా అన్నాడు, ద్రవిడ దేశంలో కుర్తాళంలో అగస్త్య మహర్షి ఉన్నాడు. అక్కడికి వెళ్లి అయన అనుగ్రహాన్ని పొందమంటూ సూచించాడు. 

దీంతో అయన కుర్తాళం చేరుకొని అగస్త్య మహా ముని కోసం 47 రోజులు ధ్యానంలోనే ఉంటూ ఘోర తపస్సు చేయగా అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యేక్షమై దివ్య ప్రసాదాన్ని తినిపించి యోగ విద్యలోని ఎన్నో రహస్యాలు చెప్పి సిద్ధిని ప్రసాదించి, హిమాలయాల్లో ఉన్న బదరీనాధ్ కి వెళ్లి అక్కడ మహా సిద్ధిని పొందమని చెప్పాడు.         


ఇలా బదరీనాథ్ క్షేత్రానికి వెళ్లిన బాబా మహాసిద్ధిని పొంది నిత్యా యవ్వనుడిగా, అమరుడిగా ఎదిగిన నాగరాజు మహవతార్ బాబాగా స్థిరపడిపోయారు. 


క్రీస్తు శకం 788 -820 మధ్య బ్రతికిన ఆదిశంకరాచార్యకు సన్యాస దీక్ష ఇచ్చినవారు గోవింద భగవత్పాదులు కాగా యోగ దీక్ష ఇచ్చినది మహా అవతార్ బాబా. 


ఇంకా కొందరు చెప్పిన దానిప్రకారం కేదారనాథ్ పర్వత శిఖర ప్రాంతంలో ఉన్న సిద్ధాశ్రమానికి శంకరులు వెళ్లాలని ప్రయత్నించగా ఆయనకి వీలు కాలేకపోవడంతో అప్పుడు మహావతార్ బాబా కొన్ని యోగ సాధనాలు వారితో చేయించగా అప్పుడు శంకరులు శిఖర ప్రాంతంలో ఉన్న ఆ సిద్ధాశ్రమానికి వెళ్లారని చెబుతారు.                


ఇలా కేదార్ ప్రాంతంలో ఉండే సిద్ధాశ్రమ యోగులు రహస్యంగా ఉంటూ మానవ జాతికి అవసరమైన శుభాలు చేస్తుంటారు. 


ఆ సిద్ధాశ్రమ యోగులే..

రమణ మహర్షి , అరవింద యోగి , కావ్యకంట గణపతి ముని 

అని ధ్యాన యోగులు చెప్తున్నారు. 


బాబా గారి శిష్యులలో పరమహంస యోగానంద వంటి ఎంతో మంది యోగ గురువులు ఉన్నారు.


ఇక మొదటిసారిగా ప్రపంచానికి బాబా గురించి వెలుగులోకి తీసుకువచ్చింది లాహిరి మహాశయుల గురువుగారు. 

ఇక లాహిరిబాబా విషయానికి వస్తే, ఈయన మిలటరీ లో అకౌంటెంట్ గా పనిచేస్తుండేవారు. హిమాలయాల్లో రాణిఖేద్ లో పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు జరిగిన సంఘటన అయన జీవితాన్నే మార్చేసింది. ఒక రోజు సాయంత్రం సమయంలో హిమాలయాల్లో తిరుగుతుండగా ఒక ఎత్తైన పర్వతం నుండి ఎవరో 

ఒకరు అతడిని పేరు పెట్టి పిలుస్తున్నారని అనిపించగా, 

ఈ మంచు కొండలో నాకు తెలిసినవారు ఎవరు లేరు, నేను ఇక్కడ ఉద్యోగానికి వచ్చి కూడా కొన్ని రోజులే గడిచింది నన్ను గుర్తు పట్టి ఎవరు పిలుస్తున్నారని 

కొండ పైకి వెళ్లగా ఒక గుహలోకి వెళ్లగా..అతడిని నీవు ఇంకా గుర్తు పట్టలేదా అంటూ ఒక్కసారి ఆయన్ని స్మృశించగా లాహిరి గారికి తన గత జన్మలు గుర్తుకు వచ్చి నన్ను తాకిన ఆ దివ్య శక్తి మహవతార్ బాబా గారిది అని గ్రహించాడు. 


ఇక బాబాజీ లాహిరి మహాశయులకు క్రియాయోగ దీక్షని ప్రసాదించారు. ఈ సంఘటన 1861 లో జరుగగా ప్రపంచానికి అప్పుడే బాబా రెండు వేల సంవత్సరాల నుండి ఇంకా హిమాలయాల్లోని జీవించి ఉన్నాడని అర్ధం అయినది. 


ఇక లాహిరి యొక్క శిష్యుడు యుక్తేశ్వర్‌గిరిబాబా. లాహిరి యొక్క ప్రియ శిష్యుడైన యుక్తేశ్వర్‌గిరిబాబా 1894లో అలహాబాద్ లో జరిగిన కుంభమేళాలో మహావతార్ బాబాని ప్రత్యేక్షంగా కలుసుకున్నాను అంటూ చెప్పాడు. 

ఈ విషయం యుక్తేశ్వర్‌గిరిబాబా వ్రాసిన కైవల్య దర్శనం అనే పుస్తకంలో ఉంది.        


ఇక మహావతార్ బాబా శిష్యుడు లాహిరి మహాశయుల గురువు అయితే ఈయన శిష్యుడు యుక్తేశ్వర్‌గిరిబాబా. ఇంకా యుక్తేశ్వర్‌గిరిబాబా శిష్యుడు పరమహంస యోగానంద. 


అయితే పరమహంస యోగానంద వ్రాసిన ఒక యోగి ఆత్మకధ అనే పుస్తకం ఆధ్యాత్మిక చరిత్రని సృష్టించింది. 


ఈయన కారణంగానే క్రియా యోగ అనే విద్య అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది.


ఈవిధంగా నాగరాజుగా జన్మించిన ఆయన దేవుడి అవతారం కానప్పటికీ పూర్వ జన్మ పుణ్యఫలమో, దేవుడి లీలనో తెలియదు కానీ చిన్నతనంలోనే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసి 

కుమారస్వామి దర్శనం పొంది 

అగస్త్యమహర్షి అనుగ్రహంతో సిద్ది పొంది క్రియా యోగ వంటి ఎన్నో యోగ రహస్యాలను తెలుసుకొని అమరుడిగా ఇప్పటికి 

హిమాలయాల్లో ఉండే రహస్య గుహలో జీవించే ఉంటున్నాడని చాలా మంది నమ్మకం.


శ్రీ గురుభ్యోనమః..!!

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

కౌరవుల పేర్లు

 100 మంది కౌరవుల పేర్లు మీకు తెలుసా?


1. దుర్యోధనుడు


11. సుబాహుడు


21. సులోచనుడు


2. దుశ్సాసనుడు


12. దుష్పప్రదర్శనుడు


22. చిత్రుడు


3. దుస్సహుడు


13. దుర్మర్షణుడు


23. ఉపచిత్రుడు


4. దుశ్శలుడు


14. దుర్మఖుడు


24. చిత్రాక్షుడు


31. నోర్ణనాభుడు


32. సునాభుడు


33. ລ້ລ້


34. ఉపనందుడు


5. జలసంధుడు


15. దుష్కర్ణుడు


25. చారుచిత్రుడు


6. సముడు


16. కర్ణుడు


26. శరాసనుడు


35. చిత్రాణుడు


36. చిత్రవర్మ


37. ລ້ລ້


7. సహుడు


8. విందుడు


17. వివింశతుడు


18. వికర్ణుడు


9. అనువిందుడు


19. శలుడు


10. దుర్దర్షుడు


20. సత్వుడు


41. చిత్రాంగుడు


51. చిత్రాయుధుడు


42. చిత్రకుండలుడు


52. నిషింగుడు


27. ధర్మధుడు


28. దుర్విగాహుడు


29. వివిత్సుడు


30. వికటాననుడు


61. సదుడు


62. సువాగుడు


38. దుర్విమోచనుడు


39. అయోబావుడు


40. మహాబావుడు


71. దుర్జయుడు


72. దృఢహస్థుడు


73. సుహస్తుడు


74. వాయువేగుడు


43. భీమవేగుడు


53. పాశుడు


63. ఉగ్రశ్రవుడు


44. భీమలుడు


54. బృఎందారకుడు


64. ఉగ్రసేనుడు


45. బలాకుడు


55. దృఢవర్మ


65. సేనాని


75. సువర్చుడు


46. బలవర్ధనుడు


56. దృఢక్షత్రుడు


47. నోగ్రాయుధుడు


57. సోమకీర్తి


66. దుష్పరాజుడు


76. ఆదిత్యకేతుడు


67. అపరాజితుడు


77. బహ్వాశి


48. సుషేణుడు


58. అనూదరుడు


68. కుండశాయి.


49. కుండధారుడు


59. దఢసంధుడు


50. మహోదరుడు


60. జరాసంధుడు


81. క్రధనుడు


86. వలోలుడు


82. కుండినుడు


87. రుద్రకర్ముడు


83. ధనుర్ధరోగుడు


88. దృణరదాశ్రుడు


84. భీమరధుడు


89.అదృష్యుడు


85. వీరబాహుడు


90. కుండభేది


69. విశాలాక్షుడు


70. దురాధరుడు


91. 22


92. ప్రమధుడు


93. ప్రమాధి


94. దీర్గరోముడు


95. దీర్గబాహువు


96. ఉడోరుడు5-


97. కనకద్వజుడు


98. ఉపాభయుడు


99. కుండాశి


100. విరజనుడు


78. నాగదత్తుడ


79. అగ్రయాయుడు


80. కవచుడు

ముక్కు నుంచి రక్తం

 ముక్కు నుంచి రక్తం , వ్రణాలుని హరించుటకు దానిమ్మ పువ్వులతో అద్భుత యోగం - 


    ఇప్పుడు నేను చెప్పబోయే యోగం చరకుడు ప్రయోగించింది.


  ముక్కునుంచి రక్తం కారుచున్న సమయంలో దానిమ్మ పువ్వుల్ని దంచి రసము తీసి చక్కెర కలిపి ముక్కులో పిండిన ముక్కు లో నుంచి కారు రక్తం నిలిచిపోవును. 


     వ్రణములు నివారించుట కొరకు దానిమ్మ మొగ్గలు చెట్టు క్రింద రాలిన వాటిని తీసుకుని కాల్చి వ్రణముల పైన చల్లిన త్వరలోనే మానును. దీనికి తోడు తంగేడు పువ్వుల భస్మం కూడా కలిపిన ఇంకా తొందరగా వ్రణములు మానిపోవును.


 మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

బుధవారం*🪷 🌷 *16, అక్టోబర్, 2024*🌷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🪷 *బుధవారం*🪷

🌷 *16, అక్టోబర్, 2024*🌷

      *దృగ్గణిత పంచాంగం*               


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి     : చతుర్ధశి* రా 08.40 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం :బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : ఉత్తరాభాద్ర* రా 07.18 వరకు ఉపరి *రేవతి*


*యోగం  : ధృవ* ఉ 10.10 *వ్యాఘాత* రా 05.57 తె వరకు

*కరణం  : గరజి* ఉ 10.31 *వణజి* రా 08.40 ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు*

 *ఉ 09.00 - 10.30 సా 04.00 - 05.00*

అమృత కాలం :*మ 03.04 - 04.28*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*


*వర్జ్యం          : ఉ 06.36 - 08.01*

*దుర్ముహూర్తం : ప 11.29 - 12.16*

*రాహు కాలం  : మ 11.53 - 01.21*

గుళికకాళం      : *మ 10.25 - 11.53* 

యమగండం    :  *ఉ 07.28 - 08.56*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 06.00* 

సూర్యాస్తమయం :*సా 05.45*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.00 - 08.21*

సంగవ కాలం    :*08.21 - 10.42*

మధ్యాహ్న కాలం  :*10.42 - 01.03*

అపరాహ్న కాలం : *మ 01.03 - 03.24*

*ఆబ్ధికం తిధి : ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి*

సాయంకాలం :  *సా 03.24 - 05.45*

ప్రదోష కాలం :  *సా 05.45 - 08.12*

రాత్రి కాలం    :  *రా 08.12 - 11.28*

నిశీధి కాలం     :*రా 11.28 - 12.17*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.11*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🪷 *శ్రీ సరస్వతి స్తోత్రం*🪷


*సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |*

*విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||*


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

🌹🌷🌹🪷🪷🌹🌷🌹

పంచాంగం 16.10.2024 Wednesday

 ఈ రోజు పంచాంగం 16.10.2024 Wednesday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష చతుర్దశి తిధి సౌమ్య వాసర: ఉత్తరాభాద్ర నక్షత్రం ధ్రువ యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


చతుర్దశి రాత్రి 08:39 వరకు.

ఉత్తరాభాద్ర రాత్రి 07:16 వరకు .


సూర్యోదయం : 06:12

సూర్యాస్తమయం : 05:50


వర్జ్యం : ఉదయం 06:33 నుండి 07:56 వరకు.


దుర్ముహూర్తం : పగలు 11:38 నుండి 12:25 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 03:01 నుండీ 04:26 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

Panchaang


 

15, అక్టోబర్ 2024, మంగళవారం

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం  -  త్రయోదశి - పూర్వాభాద్ర -‌‌ భౌమ వాసరే* (15.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మనస్సు, మేఘం

 మనస్సు, మేఘం రెండూ ఒక్కటే.

మేఘం తనలోని బరువు మోయ లేక వర్షం రూపంలో జల్లులు కురిపిస్తుంది.

మనస్సు తనలోని బాధను అణుచుకోలేక కన్నీటి రూపంలో నీరుని కారుస్తుంది.సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లితండ్రుల పెంపకం, గురువుల బోధన, సమాజంతీరు,మనం చేసుకొనే స్నేహితుల వలనే సంస్కారం అలవడుతుంది."

"ఆవేశం అదుపు తప్పితే వివాదం.

వేగం అదుపు తప్పితే ప్రమాదం.

అహంకారం అదుపు తప్పితే పతనం"🙏Good Morning 🙏శుభోదయం 🙏🏻

మంగళవారం*🍁 🌹 *15, అక్టోబర్, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🍁 *మంగళవారం*🍁

🌹 *15, అక్టోబర్, 2024*🌹

      *ధృగ్గణిత పంచాంగం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి     : త్రయోదశి* రా 12.19 వరకు ఉపరి *చతుర్ధశి*

*వారం:మంగళవారం*( భౌమవాసరే )

*నక్షత్రం  : పూర్వాభాద్ర* రా 10.08 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*


*యోగం  : వృద్ధి* మ 02.15 వరకు ఉపరి *ధృవ*

*కరణం  : కౌలువ* మ 02.03 *తైతుల* రా 12.19 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం:*మ 03.00 - 04.26*

అభిజిత్ కాలం  : *ప 11.29 - 12.16*


*వర్జ్యం          : ఉ 06.26 - 07.51*

*దుర్ముహూర్తం  : ఉ 08.21 - 09.08 రా 10.40 - 11.29*

*రాహు కాలం :మ 02.49 - 04.18*

గుళికకాళం      : *మ 11.53 - 01.21*

యమగండం    :  *ఉ 08.56 - 10.25*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 06.00* 

సూర్యాస్తమయం :*సా 05.46*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.00 - 08.21*

సంగవ కాలం    :    *08.21 - 10.42*

మధ్యాహ్న కాలం :*10.42 - 01.04*

అపరాహ్న కాలం :*మ 01.04 - 03.25*

*ఆబ్ధికం తిధి      : ఆశ్వీయుజ శుద్ధ త్రయోదశి*

సాయంకాలం  :  *సా 03.25 - 05.46*

ప్రదోష కాలం   :  *సా 05.46 - 08.13*

రాత్రి కాలం     :  *రా 08.13 - 11.29*

నిశీధి కాలం     :*రా 11.29 - 12.18*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.11*

________________________________

         🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

      

🌹 🙏 *అంజని పుత్ర స్తోత్రం..!!*🍁


ఉష్ట్ర వాహన హనుమంత

ఊహాతీతా హనుమంత

జయ బజరంగబలి 

జయజయ జయ బజరంగబలి

     

           🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹