ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
5, డిసెంబర్ 2024, గురువారం
*05, డిసెంబర్, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*
సుభాషితమ్
*_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_*
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*ముఖం పద్మదళాకారం వచస్చందన శీతలం౹౹*
*హృత్ కర్తరి సమంచాతివినయం ధూర్త లక్షణం౹౹*
*భావం:-*
కొంతమంది ముఖం పద్మముల రేకులవలె అందంగా వుంటుంది. మాటలు గంధము వలె చల్లగా చెవుల కింపుగా వుంటాయి..... కానీ, *మనస్సు మాత్రము కత్తెరలాగ పదునుగా వుండి మనను కత్తిరించి వేస్తుంది. అటువంటి వారు ధూర్తులు.*
సుభాషితమ్
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*పతిత్వా-యం కాయః కఠినదృషదంతే విదళితః|*
*వరం న్యస్తో హస్తః ఫణిపతిముఖే తీక్ష్ణదశనే*
*వరం వహ్నౌ పాతస్త దపి న కృతః శీలవిలయః ||*
*భావము:*
కొండమీద నుంచి జారే కఠినశిల కిందపడి నలిగినా నలుగవచ్చు. తీక్షణమైన జ్వాలలు కక్కుతున్న సర్పం నోటిలో చేయి పెట్టవచ్చు. అగ్నిలో పడి శలభంలా మాడనైనా మాడవచ్చు. కానీ *వ్యక్తిత్వాన్ని మాత్రం వదులుకోరాదు.*
శ్రీ శనీశ్వర రాహు-కేతు ఆలయం
🕉 మన గుడి : నెం 950
⚜ కేరళ : ఎరమత్తూరు : అలెప్పి
⚜ శ్రీ శనీశ్వర రాహు-కేతు ఆలయం
💠 హైందవ భక్తులు అత్యంత భయంతో మాత్రమే చూసే గ్రహం శనీ.
కష్టకాలంలో భక్తులు ఎక్కువగా భయపడే శనిదేవుడిని పూజించే ఆలయాలు చాలా అరుదు.
పాప గ్రహంగా భావించే శనిని పూజించే ఆలయం కేరళలో ఉంది.
కేరళలోని ఏకైక శనీశ్వర దేవాలయంగా పేరొందిన ఇరమతుర్ శని ఆలయాన్ని సందర్శించడం శుభప్రదమని నమ్ముతారు. ఇక్కడ శని దోషాలను వదిలించుకోవడానికి భక్తులు వస్తారు.
💠 ఈ ఆలయంలో శనీశ్వరుడే కాకుండా ఆదిగురువు త్రిమూర్తి స్వరూపుడు, పితృదోష నివారిణి అయిన శ్రీ దత్తాత్రేయ భగవానుడు, శనీశ్వరుడు మిత్రులైన రాహు-కేతువులు, సిద్ధపంచముఖి హనుమంతుడు కలవు.
💠 ఆలయ ప్రధాన దైవం కాకివాహనన శనీశ్వరుడు
హిందూ పురాణాలలో, శని గ్రహాన్ని శని అని పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో గ్రహానికి ప్రత్యేక హోదా ఇవ్వబడినందున, శనిని 'ఈశ్వరుడు' లేదా 'శనీశ్వరుడు' అని పిలుస్తారు.
💠 'శని' అనే పదం సంస్కృత పదం 'శనైః చరహ' అంటే 'నెమ్మదిగా కదిలేవాడు' నుండి వచ్చింది. శని అనేది భౌతిక ప్రపంచాన్ని సన్యాసం లేదా పరిత్యాగానికి సూచిక.
💠 భారతీయ జ్యోతిషశాస్త్రంలో, శనీశ్వరుడు క్రమశిక్షణ, అధికారం, వృద్ధాప్యం, సన్యాసం, కష్టాలు, కార్మికులు, ఆలస్యం, ఆశయం, నాయకత్వం మరియు అధికారం, సమగ్రత, కీర్తికి ప్రధాన గ్రహ దేవతగా సూచించబడ్డాయి.
💠 నవగ్రహాలలో (తొమ్మిది గ్రహాలు) శనీశ్వరుడు నెమ్మదిగా కదులుతున్న గ్రహం .
రాశిచక్రంలో శని యొక్క గ్రహాల స్థానాల ప్రకారం, వివిధ రాశులలో జన్మించిన వ్యక్తులు శనీశ్వరుడు ఆపాదించబడిన మంచి / చెడు ప్రభావాలను అనుభవిస్తారని చెప్పబడింది.
💠 శనిచే పాలించబడే వ్యక్తులు (జనన జాతకాలలో అనుకూలమైన స్థానాల్లో శనీశ్వరుడు ఉండటం) వారు భౌతిక సుఖాల కోరికను నియంత్రించడానికి మరియు ఉన్నత సంకల్పానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే, అత్యధిక విజయాన్ని పొందవచ్చు మరియు అజేయంగా మారవచ్చు.
శనీశ్వరుని గ్రహప్రభావాల సమయంలో, స్థానికుడు సత్కార్యాలు చేస్తే, వృద్ధులను గౌరవిస్తూ, తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు మరియు పేదలకు దానం చేస్తే, అపారమైన సంపదను మంచి కీర్తితో పొందవచ్చు.
💠 శని ప్రతికూల స్థానాల్లో ఉన్నప్పుడు అత్యంత హానికరమైన గ్రహంగా పరిగణించబడుతుంది, కానీ నిస్సహాయులు మరియు పేదల పట్ల దయ చూపడం, తప్పు చేసేవారిని క్షమించడం మరియు భౌతిక ఆస్తులు మరియు సౌలభ్యాల పట్ల అనుబంధాలను వదులుకోవడం ద్వారా దాని కోపాన్ని నిరోధించవచ్చు.
💠 శ్రీ శనీశ్వరక్షేత్రంలో నిర్వహించబడే సంస్కృత కర్మలు
వేదపాఠశాల
విద్యారంభం
అన్నప్రాశం
చిత్రరాంతి మహాహవనం
గృహప్రవేశనం
💠 శని దోషం నుండి ఉపశమనం కోరుకునే వారు శనీశ్వర ఆలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేసి, పై పరిహారాలు చేయాలి.
💠 ఇరమత్తూరు శనీశ్వర దేవాలయం అరుదైన విశేషాలకు, నమ్మకాలకు ప్రసిద్ధి.
శని దోషాల నుంచి విముక్తి పొందాలంటే ఇక్కడికి వచ్చి పూజిస్తే సరిపోతుందని విశ్వాసం.
శనిదోష భక్తులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ప్రార్థనలు మరియు పూజలు నిర్వహిస్తారు.
🔆 ఆలయ చరిత్ర
💠 మతవిశ్వాసాలు, ఆచార వ్యవహారాలను పరిశీలిస్తే ఈ ఆలయం చాలా పురాతనమైనది. పురాతన కాలంలో బ్రాహ్మణులు కలిసి ఉండే ప్రదేశం ఇది.
పూజలు, ఆచారాలు, త్యాగాలు వారి జీవితంలో భాగమయ్యాయి.
ఇక్కడ అనేక యాగాలు జరిగాయని నమ్ముతారు.
60 సంవత్సరాల క్రితం వరకు, ఈ ప్రాంతం సమీపంలోని మఠంలో భాగంగా ఉండేది.
వీరు తమిళనాడు నుండి వలస వచ్చి ఇక్కడ శని ఆరాధనను ప్రారంభించినట్లు వారి ద్వారానే ఇక్కడ పూజలు కొనసాగుతున్నాయని నమ్ముతారు.
💠 చెన్నితల అనే గ్రామం పేరు కూడా ఇక్కడి శని దేవాలయం నుండి వచ్చిందని నమ్ముతారు.
శని నివాసమైన శనితల నుండి చెన్నితల వచ్చారు.
💠 అనేక పూజలు మరియు ఆచారాలు నిర్వహించబడే ఈ ఆలయంలో శని మరియు ఆదివారాల్లో మాత్రమే ప్రజల ప్రవేశం అనుమతించబడుతుంది.
💠 ఆలయ సమయాలు ఉదయం 6.30 నుండి 10.30 వరకు మరియు సాయంత్రం 5.30 నుండి 7.15 వరకు.
💠 శనిదేవుడు ముఖ్యమైన పూజలు ఇక్కడ ప్రధానంగా జరుగుతాయి.
మకర మాసంలో బృహత్ అగ్నిహోత్ర మహావనం, తిలమషన్నం, పొంగళ, బలివైశ్వదేవయాజ్ఞ, మేధాసూక్త సరస్వతీహవనం, శనిదోష నివారణ క్రియలు, కాలసర్పేష్టి హవనం మొదలైనవి ఇక్కడ ప్రధాన పూజలు.
💠 ఇక్కడ కుడుంబ దోషం, అపమృత్యు దోష నివారణ, ఏడు తరాల శాపాలు, పాప దోషాల హరణం, కండకశని, అష్టమాసని, మృత్యు దోష నివారణ మొదలైన వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
💠 ఈ ఆలయం అలప్పుజా జిల్లాలోని ఇరమత్తూర్ నయన్యంబలం జంక్షన్‌లో ఉంది. నాదల అనేది ఆలయం ఉన్న ప్రదేశానికి పేరు. చెన్నితాల సమీప ప్రధాన పట్టణం.
రచన
©️ Santosh Kumar
తిరుమల సర్వస్వం -78*
**తిరుమల సర్వస్వం -78*
*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 17*
*అశ్వవాహనోత్సవం*
*గక్కున నయిదవనాడు గరుడునిమీదను*
*యెక్కెను ఆరవనాడు యేనుగుమీద*
*చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోను*
*యిక్కున దేరును గుర్ర మెనిమిదోనాడు*
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవరోజు రాత్రి మలయప్పస్వామివారు ఒంటరిగా, కలిపురుషుని వేషధారణలో, శిరస్త్రాణభూషితుడై, నడుముకు కత్తి డాలు ధరించి, ఒక చేతియందు చర్నాకోల, మరో చేతితో గుర్రపు పగ్గాలు చేబూని, యుద్ధానికి సిద్ధంగా ఉన్న వీరాధివీరుని వలె, అశ్వవాహనంపై రాచఠీవి ఉట్టిపడేలా ఊరేగుతారు.
అశ్వానికి చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక, సమకాలీన ప్రాశస్త్యం విశేషంగా ఉంది. వేగానికి ప్రతీక అయిన అశ్వం చతురంగబలాలలో ప్రధానమైనది. యుద్ధాలలో సైనికులు గుర్రాలనెక్కి యుద్ధం చేస్తుండగా, దళాధిపతులు, రారాజులు తమతమ హోదాలను బట్టి అశ్వాలు పూన్చిన రథాలపై నుండి సమరం సాగించేవారు. విశ్వాసానికి మారుపేరైన అశ్వరాజాలు తమ యజమానులను కాపాడటం కోసం, తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి.
పురాణేతిహాసాల ననుసరించి శ్రీహరి శ్రీనివాసునిగా భూలోకంలోని వేంకటాచలంచేరి పద్మావతిదేవిని పరిణయమాడటం కోసం వేట నెపంతో, ఖడ్గధారియై, అశ్వంమీద నారాయణవనానికేతెంచారు. క్షీరసాగరమథనంలో పుట్టిన ఉచ్ఛైశ్రవము అనే అశ్వరాజ్యాన్ని ఇంద్రుడు తన వాహనంగా స్వీకరించాడు. శ్రీమహావిష్ణువు యొక్క జ్ఞానావతారాలలో మొదటిది "హయగ్రీవుని" అవతారం. హయగ్రీవుడంటే, "గుర్రం ముఖం కలిగిన దైవం" అని అర్థం. హయగ్రీవునికి గుర్రం ముఖం ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.
ఒకానొకప్పుడు పదివేల ఏండ్లపాటు నిర్విరామంగా రాక్షసులతో యుద్ధం చేసి అలసిపోయిన శ్రీమహావిష్ణువు అల్లెత్రాడుతో (వింటినారితో) ఇరుకొనలూ బిగించి కట్టబడిన "శాబ్ధం" అనబడే ధనుస్సు యొక్క ఒక కొనను నేలపై నుంచి, మరొక కొనపై గెడ్డాన్ని ఆన్చి, నుల్చొని ఉండే నిద్రపోతాడు ( *"...శాఙ్గధన్వా గదాధరః"* అన్న 107వ విష్ణుసహస్రనామ శ్లోకాన్ని స్మరణకు తెచ్చుకోండి). ఆయనను నిద్రనుండి మేల్కొలపటానికి దేవతలు భయపడుతుంటే బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకు ఓ *"వమ్రి"* (చెదపురుగు), వింటినారిని కొరికి శ్రీహరికి నిద్రాభంగం కావించే ప్రయత్నం చేస్తుంది. కానీ, దురదృష్టవశాత్తూ వింటినారి తెగడంతో, ధనుస్సు యొక్క కోపు అతివేగంగా వెళ్ళి విష్ణువు యొక్క తలను ఛేదించగా, ఆ శిరస్సు వెళ్ళి ముల్లోకాలకు ఆవల పడుతుంది. ఈ హఠాత్సంఘటనకు నివ్వెరబోయిన దేవతలు, లక్ష్మీదేవి యానతి ననుసరించి, ఓ అశ్వరాజాన్ని వధించి దాని శిరస్సును తీసుకుని వస్తారు. దేవశిల్పి గుర్రం తలను విగతజీవియైన విష్ణుమూర్తి మొండానికి అతికించగా, బ్రహ్మదేవుడు తిరిగి ప్రాణం పోస్తాడు. ఇదంతా, లోకకళ్యాణార్థం, పూర్వపు యుగాల శాపాలు-వరాల ననుసరించి జరుగుతుంది.
సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి హయగ్రీవుని ఆలయం, ఉత్తరమాడవీధి చివరిభాగంలో, స్వామిపుష్కరిణి యొక్క ఈశాన్యదిక్కుకు ఎదురుగా స్థితమై ఉంది.
బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటిదైన "పెద్దశేషవాహనం" కుండలినీ యోగానికి ప్రతీక అయితే, చిట్టచివరిదైన "అశ్వవాహనం" ఓంకారానికి సంకేతం.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
99490 98406
10-31-గీతా మకరందము
10-31-గీతా మకరందము
విభూతియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
పవనః పవతామస్మి రామశ్శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి
స్రోతసామస్మి జాహ్నవీ ||
తా:- నేను పవిత్రమొనర్చువారిలో (లేక వేగవంతులలో) వాయువును, ఆయుధమును ధరించినవారిలో శ్రీరామచంద్రుడను, చేపలలో మొసలిని, నదులలో గంగానదిని అయియున్నాను.
వ్యాఖ్య:- ఈ శ్లోకమందు తెలుపబడినరీతి గంగానది సాక్షాత్ భగవత్స్వరూపమే. కావున అది మహాపవిత్రముగ, పాపహారకముగ నెన్నుకొనబడుచున్నది. కృష్ణుడు తాను రాముడేయని వచించుటవలన రామకృష్ణు లిరువురును ఒకే భగవత్స్వరూపమని స్పష్టమగుచున్నది.
పంచాంగం 05.12.2024
ఈ రోజు పంచాంగం 05.12.2024
Thursday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు మార్గశిర మాస శుక్ల పక్ష చతుర్థి తిథి బృహస్పతి వాసర: ఉత్తరాషాఢ నక్షత్రం వృద్ధి యోగః: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.
యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
తన వాళ్ళ కోసం
Credits :- Raghav Indra ❤️🔥
కూతుళ్లే కాదు ...కొడుకులు కూడా ఇల్లొదిలి వెళ్తారు ..కూతురు పెళ్ళైతే ..కొడుకు పెళ్లికి ముందే ..
తనవారి కోసం ..ఇంటికోసం ..
ఎప్పుడైనా ఆలోచించారా ..??
తలగడ లేకపోతే పడుకోడానికి ససేమిరా అనేవాడు ..ఇప్పుడు కటిక నేల పైనా కిక్కురుమనకుండా పడుకుంటున్నాడు .
తినడానికి వంద సాకులు చెపుతూ ఏడిపించేవాడు ...ఇప్పుడు ఏది దొరికితే అదే తింటున్నాడు .
తన గదిలోకి ఎవరికి రానివ్వని ,తన వస్తువులను ముట్టుకోనివ్వని వాడు ..ఇప్పుడు ఒకే గదిలో అందరితో ఉంటూ షేర్ చేసుకుంటూ అడ్జస్ట్ అవుతున్నాడు .
ఇల్లు ,తనవాళ్ళని ఎంతో మిస్ చేస్తూకూడా ...అబ్బే నే బాగానే ఉన్నా అంటూ తన ఫీలింగ్స్ దాచేస్తున్నాడు .
వందల కలలుకన్నవాడు ..వర్తమానం లో జీవిస్తూ ఏదైనా సరే ఫర్వాలేదు అనుకుంటున్నాడు .
కెరీర్ కోసమో ,జాబ్ కోసమో కాగితంలా తయారయ్యాడు .
ఎర్రటి ఎండలో నడుస్తూ అనుకుంటున్నాడు ..నేను కాలితేనే కదా ఇంట్లో దీపం వెలిగేది ..అని .
వర్షంలో తడుస్తూ తిరుగుతున్నాడు ..కొద్దిగా ..ఇంకొద్దిగా కష్టపడైనా సరే సంపాదించాలి ..కన్నవాళ్ళని చూసుకోవాలి అనుకుంటూ .
కూతుళ్ళే కాదు సార్ ...కొడుకులూ ఇల్లొదిలి వెళ్తున్నారు ..తన వాళ్ళ కోసం ..!!
4, డిసెంబర్ 2024, బుధవారం
వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి.
వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి.
నిత్యం మనం అనేకచోట్ల దేవి దేవతల పేర్లతో వ్యాపారసంస్థలు ఉండటం చూస్తున్నాము. వ్యాపారవేత్తలకు భక్తి ఉంటే అది వారి దేముడి గది మటుకు ఉంచుకొని బయటకు రాకుండా చూసుకుంటే మన దేముళ్ళ పవిత్రత, పరిశుద్ధత, విలువలను కాపాడినవాళ్లు అవుతారు. కానీ వారి మనస్సులో కల్మషం ఉన్నా లేకపోయినా కానీ దేముళ్ళను వారి వారి వ్యాపారాల వరకు తీసుకొని వస్తే అది మన ధర్మానికి అవాంతరంగా మారే ప్రమాదం వున్నది. అది ఎట్లానో చూద్దాం.
కొంతమంది సారా వ్యాపారాలు చేసే వారు వారి షాపులమీద " ధనలక్ష్మి వైన్స్" శంకర బ్రాందీ షాపు, వెంకటేశ్వర డ్రింక్స్, ఇలా అనేక దేముళ్ళ పేరులమీద ఈ రోజుల్లో వ్యాపారాల షాపుల మీద అమ్మవార్ల బొమ్మలతో సహా పేర్లు ఉండటం మనం అక్కడక్కడ చూస్తున్నాము. అటువంటివి చూసినప్పుడు ఏదో తెలియని మనసులో బాధకలుగుతుంది. ఈ విధంగా మనలో చాలామంది బాధపడి వున్నవార్లు వుంటారు.
అదే విధంగా అనేక షాపులు కిరానా షాపులు, ఫాన్సీషాపులు, ఇతర షాపులు, హోటళ్లవాళ్లు కూడా అనేక దేముళ్ళ పేర్లు, ఉపయోగించి వ్యాపారాలు చేస్తున్నారు.
ఇక లారీ సంస్థలు కూడా భగవంతుని పేర్లతో వ్యాపారాలు చేస్తున్నారు. వీరాంజనేయ లారీ సర్వీస్, వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్స్, కనకదుర్గ లారీ సర్వీసు. ఇలా అనేక పేర్లతో లారీలమీద వ్రాస్తున్నారు. అంటే కాక కార్లు, మినీ బస్సులు అద్దెకు ఇచ్చే వార్లు కూడా దేముళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు.
పూజా సామానులు.
అష్టలక్ష్మి దూప్ స్టిక్లు, అంబికా దర్బారుబత్తి ఉడుబత్తీలు, ఇలా అనేక వస్తువులమీద దేవి దేవతలా పేర్లు కాకుండా దేవుళ్ళ బొమ్మలు ముద్రిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఆలా వున్నా అత్తడబ్బాలను మనం చెత్తలో పారేయగలమా మీరే చెప్పండి. ఈ పోస్టుద్వారా అందరికి నేను తెలియచేసేది ఏమిటంటే సాధ్యమైనంతవరకు మన హిందూ దేవుళ్ళ పేర్లను, చిత్రాలను మీ మీ వ్యాపారాలకు ఉపోయోగించకండి. దాని బదులు మీకు వస్తువో జంతువునో మీ వ్యాపారానికి వాడుకోండి. అది ఎట్లానో మీకు ఒక ఉదాహరణ తో చెపుతాను. మనలో చాలామందికి గతంలో హెచ్ యమ్ వి అనే గ్రామఫోను రికార్డులు ఉండేవి వాటి మీద ఒక కుక్క బొమ్మ ఉండేది. అదే విధంగా మనం అనేక జంతువులను, వస్తువులను వ్యాపారానికి పేర్లుగా చిహ్నాలుగా వాడుకోవచ్చు.
మీకు ఈ పోస్ట్లు నచ్చితే అందరికి పంపి మన హిందూ ధర్మాన్ని కాపాడతాంలో మీ వంతు కృషి చేయగలరు.
