17, మే 2021, సోమవారం

పది నిమిషాలు

 👩 పది నిమిషాలు భార్య ముందు కూర్చుంటే

జీవితం  యొక్క భాద్యత గురించి తేలుస్తుంది ..🙁


🍺పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే

జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది.....🙂


👩‍🚀పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే

ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది 😇


🦹‍♀️పది నిమిషాలు రాజకీయ  నాయకుడి ముందు కూర్చుంటే 

మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది...😔


 💷పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే 

చస్తేనే మంచిదిమో అనిపిస్తుంది....😔


👨‍💼పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే 

మన సంపాదన చాలా తక్కువ, దేనికీ సరిపోదు అనిపిస్తుంది....🙁



👨‍🔬పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే 

మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది...🧐


👨‍🏫పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే 

మనం మళ్లీ విద్యార్థులం కావాలని అనిపిస్తుంది.📚


👨‍🌾పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే 

వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది.😢


👮పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే 

వారి ముందు, మన త్యాగం, సేవలు ఏమీ కావనిపిస్తుంది.😒

      

👨 కానీ ఓ పది నిమిషాలు ఓ స్నేహితుని ముందు కూర్చుంటే 

జీవితం స్వర్గంలా ఉంటుంది.😄

👌👍👌👍👌👍👌👍👌

Important medical Information*

 *Important Information*


1️⃣ *Blood Pressure*

👉 120 / 80 --  Normal

👉 130 / 85 --  Normal  (Control)

👉 140 / 90 --  High

👉 150 / 95 --  Very High


2️⃣ *Oxygen Level)*

Check Through Oximeter

👉 94 - Normal

👉 95  To 100 - Good Oxygen Level

👉 94 To 90- Low Oxygen Level

👉 Below 90- Very Low Oxygen Level...

(To Be Hospitalised For Oxygen Support)


3️⃣ *PULSE* PR 

👉 72  Per Minute  (Standard)

👉 60 -- 80 P.M. (Normal)

👉 90 ते 120  Pulse - Increased (High)


4️⃣ *TEMPERATURE*          

👉 92 - 98.6  F - (Normal)

👉 99.0 F - Normal Fever

👉 100 .F ते 102 F  High Fever


5️⃣ *HRCT Means CT SCAN Through Checking Of Corona Infection....*

👉 HRCT Score: 0 - 8  (Mild Infection). 

👉 HRCT Score: 9 - 18  (Moderate Infection). 

👉 HRCT Score: 19 - 25  (Severe Infection)


Good Info to share.👍

అరుణాచల ఆలయంలో

 *అరుణాచల ఆలయంలో జరిగిన యదార్థ సంఘటన.*


ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.


ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.


అందులో ఒకడు "ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.

రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.


ఇద్దరు అరుణాచలునికి ఎదురుగా నిలబడి 'మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లంలో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ )' అన్నారు.


ఇలా ప్రతీ రోజూ పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం  మాయమవుతోంది.


ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించాడు... వీళ్లిద్దరూ ఎనిమిదేళ్ల  పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని.


'అరేయ్ పిల్లలూ...! మీరు ఇద్దరూ అంతరాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి. ఇదే మీకు శిక్ష...!' అన్నాడు అధికారి.


పిల్లలు ఇద్దరూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చుని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. 


ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృళ్లి పడ్డారు. పరిశీలించి పిల్లల్ని మరొకసారి  చూసారు. ఆ ఇద్దరి పిల్లలతో పాటు, ఎవరో మూడవ పిల్లవాడు కూడా ప్రదక్షిణ చేయడం కనిపించింది. మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు... మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని  గట్టిగా వాటేసుకున్నాడు.


అద్భుతం!!

మూడవ పిల్లవాడు కాంతిరేఖగా మారి, గర్బాలయంలోకి వెళ్లి మాయమైపోయాడు.


అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా...! అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.


ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ "అసలేం జరిగింది...?" అని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురించి చెప్పారు. 


అది విని పూజారీ...అధికారీ కూడా ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోయారు.


సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట. 


ఆలయం లో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఎం కావాలి...?!


నిష్కల్మష  ప్రేమకు, నిర్మల  భక్తికీ అరుణాచలేశ్వరుడు ఎప్పుడూ బందీయే...! అరుణాచలుడు  కాంతి రూపంలో ఉంటాడనీ, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో  మరియు కొడపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం ( bheem of light ) రూపంలో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు ఎన్నో కలవు.


అరుణాచలశివ...  అరుణాచలశివ... అరుణాచలశివ... అరుణాచలా...!

🙏🙏🙏

నీతి కథ🍁

 🍁ఒక చిన్న నీతి కథ🍁


ఊరి బయట పొలం దగ్గర ఇద్దరబ్బాయిలు👦👶 పరుగులు పెట్టి అడుకుంటున్నారు.

ఒకడు పదేళ్ల వాడు.

ఇంకొకడు ఆరేళ్ల వాడు.

చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు.

పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.

ముందు పెద్ద బావి 🏟 ఉంది.


పెద్దోడు చూసుకోలేదు.


అందులో పడిపోయాడు.


వాడికి ఈత రాదు.


బావి చాలా లోతు.


చుట్టుపక్కల ఎవరూ లేదు.


అరిచినా 😮😩 సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.


చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.

"అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు.

నీట మునిగి తేలుతూ🏊🏻 కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.


చిన్నోడు తన శక్తినంతా💪😰 కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు.

"అన్నా ... భయపడకు..!☝

జాగ్రత్తగా పట్టుకో..!

పడిపోకుండా చూసుకో" అని అరిచాడు.😧

తాడు 📯 చివరను ఒక చెట్టుకి🌴 కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు.


➡ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు.

ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు.

ఊళ్లో ఎవరూ నమ్మలేదు.


ఆరేళ్ల వాడేమిటి...🤔


పదేళ్ల వాడిని లాగడమేమిటి?🙄


అందునా బావి నుంచి లాగడమేమిటి?😯


అసాధ్యం..!☹️


వాడు చేయలేడు అని అన్నారు.

ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు.


➡సంగతి ఆ నోటా ఈ నోటా పాకింది.

ఆ ఊరు పెద్దమనిషికి విషయం తెలిసింది.

"మీరు నమ్ముతారా అని అడిగారు

"నమ్ముతాను" అన్నాడు.

"ఎలా?"

"చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు."

"అదెలా సాధ్యం...

అంత చిన్నోడు ఎలా చేయగలడు?"


➡"తనకి అంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావినుంచి లాగలేడన్న సంగతి చిన్నోడికి తెలియదు.


"ఒరేయ్..! నీకంత బలం లేదురా,


నువ్వు చేయలేవురా,


అది నీవల్ల సాధ్యం కాదురా.


అని చెప్పేవారెవరూ కూడా...

ఆ పరిసరాల్లో లేరు, కాబట్టి వాడు చేయగలిగాడు."


👉 "నీవల్ల కాదని చెప్పే వాళ్లుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్లోకి పరిగెత్తుకు వచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్లే సరికి పెద్దోడు శవమై తేలి ఉండేవాడు. "


ప్రశ్నవేసిన వాడు మాట్లాడలేకపోయాడు.😶


👉"నీవల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు. అది బావైనా, బతుకైనా అంతే..." అన్నాడు పెద్దమనిషి.


Note : 


మీరు ఇతరులకు ధైర్యం ఇవ్వకున్నా పర్లేదులే గానీ...

దయచేసి మీ భయాన్ని మాత్రo ఇతరులపై రుద్దకoడి.🙏


ఇప్పుడు కరోనా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 


కరోనాని జయించి వచ్చిన వారి గురించి తెలిసేలా చేయండి బ్రతుకుతామన్న ఆశ కలుగుతుంది, అంతే కానీ బెడ్స్ లేవు వాక్సిన్ లేదు స్మశానాలు ఖాళీ లేవు అని ప్రజల్లో భయాన్ని రేకెత్తించి చంపేయకండి 🙏


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ

 _*వైశాఖ పురాణం - 6 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




_*జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ*_




☘☘☘☘☘☘☘☘☘




నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా !  వినుము మాసవ్రతములన్నిటిలో నుత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.


పూర్వము ఇక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట , నీటిబొట్టులను గణించుట , ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము , భూదానము , తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే యెవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను , దరిద్రులను , ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను , పండితులను , సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరును ప్రసిద్దులను , ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు , విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు , దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు ? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.


ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను , కుక్కగ నేడుమార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారజు గృహమున గోడపైనుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను.


మిధిలాదేశ రాజగృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్నకాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి యెదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి దీసికోవచ్చెను. వానిని మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి యా నీటిని తన తలపై జల్లుకొనెను. అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని యెగిరి గోడమీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము నన్ను రక్షింపుమని మానవునివలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ ! నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు. నీవు యేపని చేసి యిట్టి దశనందితివి ? ఇట్లేల అరచుచున్నావు ? నీవు దేవజాతివాడవా , రాజువా , బ్రాహ్మణుడవా ? నీవెవరవు ? నీకీదశయేల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను.


శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగదమహారాజు మహాత్మా ! నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. భూమియందలి రేణువులెన్ని యుందునో , నీటియందు జలబిందువు లెన్నియుండునో , ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మల నాచరించినను , ముమ్మారు చాతక పక్షిగను , గ్రద్దగను , యేడుమార్లు కుక్కగను , ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుచుండగా కొన్ని నీటితుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను ఇరువది యేడుమార్లు బల్లిగా జన్మించవలసి యున్నట్లుగ నాకు తోచుచున్నది. నాకీవిధమైన బల్లిగా జన్మపరంపరయెట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మయేల కల్గెనో యెరుగజాలను. దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆపాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవమహాముని హేమాంగదుని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి యిట్లనెను. రాజా ! నీవు శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైశాఖమాసమున జలమునెవనికిని దానమీయలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట యేమి అని తలచితివి. ప్రయాణమున అలసినవారికిని జలదానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును గూడ పాటింపలేదు. హోమము చేయదలచినవారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలయును. అట్లుగాక బూడిద మున్నగువాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును ? అట్లే నీవును యోగ్యులగువారికి దానమీయక అయోగ్యులగువారికి దానముల నిచ్చితివి. అపాత్రులకెన్ని దానము లిచ్చినను ప్రయోజనము లేదు కదా ! వైశాఖమాస వ్రతమును చేయలేదు. జలదానమును చేయలేదు. యెంతయేపుగ పెరిగినను , సుగంధాదిగుణములున్నను ముండ్లుకల వృక్షము నెవరాదరింతురు ? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి ? వృక్షములలో రావిచెట్టు ప్రశస్తమైనది. అందువలన అది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావిచెట్టును , తులసిని వదలి వాకుడు చెట్టునెవరైన పూజింతురా ? అట్టి పూజలవలన ఫలితముండునా ? అనాధలు , అంగవైకల్యము కలవారు దయజూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టివారిని పూజించుట ఫల దాయకము కాదు. వారిపై దయ , జాలి చూపవచ్చును. కాని గౌరవింపరాదు. తపము , జ్ఞ్ఞానము , వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైనవారు. అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగ భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైనవారు సర్వాధికులు , సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీమహావిష్ణువును అవమానించుటయే యగును. ఈ విధముగ చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ , వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు , అంధులు - ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధుల నెంతమందిని పూజించినను ఫల్ముండునా ? గ్రుడ్డివానికేమి కనిపించును ? అతడేమి చెప్పగలడు ? కావున జ్ఞానహీనులైన వారి నెంతమందిని యెంత పూజించినను , వారిని సేవించినను అవి నిష్ఫలములు , నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను , దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములెట్లు సిద్దించును ?


తీర్థములు కేవలం జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము , సేవ చేసినచో శిలారూపముననున్న దైవమును చిరకాలము పూజించినచో వారియనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. ఇష్టఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు. ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతమును సేవించినచో జన్మ , మృత్యువు , ముసలితనము మున్నగువానిని వలని బాధయుండదు. అమృతత్వసిద్ది కలుగును. హేమాంగద మహారాజా ! నీవు వైశాఖమాస వ్రతము నాచరింపలేదు. జలదానము చేయలేదు. జ్ఞానులగువారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖమాస వ్రతము నాచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యద్వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు. అని పలికి శ్రుతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను.


ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్యరూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు , శ్రుతదేవమహామునికి నమస్కరించెను. వారి యనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరును హేమాంగదుని అదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగ జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు , జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై యుండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగ ఆచరించెను. అందు చేయవలసిన దానధర్మముల నన్నిటిని శ్రద్దాసక్తులతో భక్తి పూర్వకముగ చేసెను. సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నందెను. శ్రీమహావిష్ణువు సాయుజ్యము నందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము. అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాసవ్రతమును , వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరియనుగ్రహము నందవలెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాసవ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికావృత్తాంతమును వివరించెను.

భక్తుడు-బిచ్చగాడు*


🌷 *భక్తుడు-బిచ్చగాడు*🌷

               🌷🌷🌷

👉ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు.

చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.

రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.

ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే.

ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......


బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు.

చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది.

తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.

తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు.

భక్తుడు సరేనన్నాడు.

ఆ ఘడియ రానే వచ్చింది.

బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. .....

భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.

ఆశ్చర్యం ......! దాని నుండి నిధి బయటపడింది.

వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి.

అవన్నీ అతడి సొంతమయ్యాయి.....


మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.

అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు.

కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.


నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.


దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది!

అని దేవుణ్ణి ప్రశ్నించాడు. ......

అతడికి దేవుడు సమాధానం చెబుతూ.....నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు.

అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది.

అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు.

నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.

అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి అన్నాడు దేవుడు.

వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి, గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి.

తప్పక అంతర్ముఖుడు కావాలి!

హైదరాబాద్

 హైదరాబాద్‌లోని ప్రాంతాలు- వాటి వెనుక చరిత్ర.....

వివిధ మాధ్యమాల ద్వారా, మితృల ద్వారా,..... తెలుసుకున్న కొంత సమాచారం....


చాలామందికి తెలియని ఈ విషయాలను అందరితో పంచుకోవాలనుకుని పోస్ట్ చేస్తున్నాను....


ఆరో నిజాం కాలంలో అల్‌ బర్ట్ అబిద్ అనే యూదుడు ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా 👉" అబిడ్స్ "గా మారిపోయింది.


గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ఖానాకాలక్రమేణా

👉 "లంగర్‌ హౌజ్‌" మారింది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.


చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో👉" చెంచల్‌ గూడ"గా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.


 ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు

👉" కార్వాన్" అని పిలుస్తున్నారు.కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.


 ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా👉" కవాడిగూడ"గా మారింది.


 దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది

👉" దోమలగూడ"గా మారింది.


ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగంకు ఇచ్చిన జాగీరు కాలక్రమేణా👉" ఖైరతాబాద్" గా మారింది.


హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో 👉"బేగం బజారు"గా నిలిచిపోయింది.


ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా

👉" అఫ్జల్ గంజ్ "గా మారింది.


ఏడవ నిజామ్ పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో 

👉"హిమాయత్ నగర్" గా స్థిరపడింది.


మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో

👉" హైదర్ గూడ" ఏర్పడింది.


గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పనిచేసే మాలిక్ యాకూబ్ ఇంటి పరిసరాలు ఆయన పేరుతో👉 "మలక్ పేట "గా మారింది.


తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె.. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది

👉 "తార్నాక"గా మారింది.


శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ పై నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు..కాలక్రమంలో అది👉"శాలిబండ"గా మారింది.


నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను 👉"హబ్సిగూడ" పిలుస్తున్నారు.


ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి

👉" మదీనా "అనే పేరు వచ్చింది.


చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో 👉"చిక్కడపల్లి"గా మారిపోయింది.


అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో👉" అడిక్ మెట్ "గా మారిపోయింది.


నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి 👉"నౌబత్

పహాడ్ "అని పేరొచ్చింది.


గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో  పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను👉" బాగ్‌లింగంపల్లి" అంటున్నారు.


సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ 

👉"మీరాలంమండి" మార్కెట్ ఫేమస్!


నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు👉 "బార్కాస్"అని పిలుస్తున్నారు.


 తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో 👉"తాడ్‌ బండ్‌"గా మారిపోయింది.


ఇర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం 👉"ఎర్రమంజిల్‌" గా స్థిరపడింది.ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.


కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి 👉"కాచిగూడ "అనే పేరొచ్చింది


మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన

👉 "లాడ్‌ బజార్ "లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.


హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం 👉"ముషీరాబాద్" గా స్థిరపడిపోయింది.


ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు. ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్! ఇప్పుడక్కడ👉" ఎల్బీ స్టేడియం" నిర్మించారు.


పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడుబాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు: బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా

 👉"పబ్లిక్ గార్డెన్స్ "అని పిలుస్తున్నారు.


మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు 👉"చాదర్ ఘాట్" అని పేరొచ్చింది.


1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్  పేరు మీద 👉"ఆస్మాన్ గఢ్" ఏర్పడింది.


నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద 👉"ఉమ్దా బజార్" ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది.


గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం 👉"గౌలిగూడ"గా స్థిరపడిపోయింది.


రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం "మౌలాలీ "సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో 👉"లాలాగూడ"గా మారింది. 


1933కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక, ఆ ఏరియాని 👉"సుల్తాన్ బజార్ "అని మార్చేశారు.


రెండో అసఫ్ జాహీ తన కూతురు బషీర్- ఉల్- నిసా బేగంకు కట్నం కింద 1796లో కొంత జాగీర్ రాసిచ్చాడు. 👉"బేగంపేట" ఏరియా ఆమె పేరుమీదనే స్థిరపడింది. 


1853లో నవాబ్ నసీరుద్దౌలా హయాంలో పండిట్ సోనాజీ అనే రెవెన్యూ ఉద్యోగి ఉండేవాడు. ఆయన ఇల్లు ఆ రాజప్రాసాదాన్ని తలపించేది! లాండ్ మార్కుగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని మొదట్లో సోనాజీగూడ అని పిలిచేవారు. తర్వాత 👉"సోమాజీగూడ" అయింది.


రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో 👉"రికాబ్ గంజ్‌"గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్! మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.


రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం 👉"సరూర్ నగర్ "అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.


నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ 👉"డబిర్ పురా"లో ఉండేవి! డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.


అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది 👉"అంబర్‌ పేట"గా స్థిరపడిపోయింది.


చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది 👉"చాంద్రాయణగుట్ట"గా మారిపోయింది.


చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి 👉"చిలకలగూడ"కు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి!


మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్‌ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో 👉"మంగళ్‌హాట్‌"గా మారిపోయింది.


నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్  అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది 

👉"నాంపల్లి"గా మారిపోయింది.


1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరుమీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత 👉"సైదాబాద్ "అని పిలుస్తున్నారు.


టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని

👉" టప్పాచబుత్ర" అని పిలుస్తున్నారు.


లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు. ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం 👉"తుకారాంగేట్" గా మారిపోయింది.


హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు 

👉"యాఖుత్ పురా" అని నవాబే నామకరణం చేశాడు.

**సేకరణ ** *కరుణసాగర్* .

Adbhtam


 

Pravachan


 

తోటకాష్టకం

 *తోటకాష్టకం* 


🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺


విదితాఖిల శాస్త్ర సుధా జలధే


మహితోపనిషత్-కథితార్థ నిధే |


హృదయే కలయే విమలం చరణం


భవ శంకర దేశిక మే శరణమ్ || 1 ||



కరుణా వరుణాలయ పాలయ మాం


భవసాగర దుఃఖ విదూన హృదమ్ |


రచయాఖిల దర్శన తత్త్వవిదం


భవ శంకర దేశిక మే శరణమ్ || 2 ||



భవతా జనతా సుహితా భవితా


నిజబోధ విచారణ చారుమతే |


కలయేశ్వర జీవ వివేక విదం


భవ శంకర దేశిక మే శరణమ్ || 3 ||



భవ ఎవ భవానితి మె నితరాం


సమజాయత చేతసి కౌతుకితా |


మమ వారయ మోహ మహాజలధిం


భవ శంకర దేశిక మే శరణమ్ || 4 ||



సుకృతే‌உధికృతే బహుధా భవతో


భవితా సమదర్శన లాలసతా |


అతి దీనమిమం పరిపాలయ మాం


భవ శంకర దేశిక మే శరణమ్ || 5 ||



జగతీమవితుం కలితాకృతయో


విచరంతి మహామాహ సచ్ఛలతః |


అహిమాంశురివాత్ర విభాసి గురో


భవ శంకర దేశిక మే శరణమ్ || 6 ||



గురుపుంగవ పుంగవకేతన తే


సమతామయతాం న హి కో‌உపి సుధీః |


శరణాగత వత్సల తత్త్వనిధే


భవ శంకర దేశిక మే శరణమ్ || 7 ||



విదితా న మయా విశదైక కలా


న చ కించన కాంచనమస్తి గురో |


దృతమేవ విధేహి కృపాం సహజాం


భవ శంకర దేశిక మే శరణమ్ || 8 ||


🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺