17, నవంబర్ 2023, శుక్రవారం


 

Anjaneya swami


 

భగవంతుడు

 3.భగవంతుడు మనకు ఎందుకు కనబడడు?


భగవంతుడు కనిపించడని ఎవరు అన్నారు? భగవంతుడు తనని చూడదలచుకున్నవారికి తప్పక కనిపిస్తాడు. దానికి మార్గాలు కూడా మన ఋషులు, అనుభవజ్ఞులు చెప్తున్నారు.దేశాన్ని ఏలే రాజుని చూడాలంటే దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఏదైతో ఉంటుందో దానిని అనుసరించి వెళితేనే ఆయన వద్దకు వెళ్లి ఆయనను చూడగలవు. మరి సకలభవనచక్రవర్తి ఆయనను దర్శించుకోవాలంటే ఎంత ప్రోటోకాల్ అనుసరించాలి. 

   కానీ ఈ రాజు తన ఎడ్రస్ ఎక్కడో ఉందని చెప్పినా మనలో కూడా  ఉన్నాడు."అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణఃస్థితః"

మనలో ఆయన ఉన్న స్థలం:- " అణోరణీయాన్ మహతోమహీయాన్" అణువులలో అణువుగానూ, గొప్పవాటిలో గొప్పవానిగానూ కూడా ఉన్నాడని వేదం చెప్తోంది.


 "ఈశ్వరఃసర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్ఠతి."-- భగవద్గీత. 


"సర్వస్య చాऽహం హృదిసన్నివిష్టో.." -- భగవద్గీత.


"పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయంచాప్యథోముఖం.....నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా 

తస్యాఃశిఖాయామధ్యే  పరమాత్మా వ్యవస్థితః"  -- బ్రాహ్మణం.


అహమాత్మా గుడాకేశ! సర్వభూతాశయస్థితః.- భగవద్గీత.


అథోముఖంగా ఉన్న ఒక పద్మం ఉందనీ అక్కడ నీవారధాన్యముయొక్క పైన పొల్లు ఎలా ఉంటుందో అంత సన్నటి ప్రకాశం ఉండి దాని కిరణానికి మధ్యలో పరమాత్మ ఉన్నాడు అని చెప్తున్నారు.


పుణ్డరీకేణ సదృశం హృదయం స్యాదధోముఖమ్ । జాగ్రతస్తద్వికశతి స్వపతశ్చ నిమీలతి ॥  “ ఇతి చ( సుశ్రుతే శారీరస్థానే చతుర్థేఽధ్యాయే ॥ )


పుడరీకంలాగ హృదయం అథోముఖం గా ఉండి మనం మెలకువగా ఉన్నప్పుడు అది వికసిస్తుంది ట. నిద్రలో ఉన్నప్పుడు ముడుచుకుంటుందట.

 ఈ విధంగా మనలోపల ఉన్నవాడిని గూర్చి చెప్తున్నారు. వానిని చూసే మార్గాలు కూడా చెప్తున్నారు.


ఇక బయట ఉన్న మన రాజుగారి ఎడ్రస్:-


" న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః.

యద్గత్వా నా నివర్తన్తే తద్ధామ పరమం మమ."-- భగవద్గీత.


ఎక్కడైతే సూర్యచంద్ర అగ్నుల కాంతి ఉండదో ఎక్కడికైతే వెళ్లి మళ్లీ రారో అది ఆయన స్థానంట. ఇది సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్మ చెప్పినదే.ఇలా ఆయన్ని చూడాలంటే చూసిన తరువాత మన అనుభవం చెప్పాలన్నా మనం జీవించి ఉండము కదా!

లోకంబులు లోకేశులు

లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం

జీకటి కవ్వల నెవ్వం

డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్.


అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దాపల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలోత్పలపర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు 

విహ్వల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై.-- పోతనభాగవతం.


  ఈ పద్యమైతే సాక్షాత్తూ శ్రీరామచంద్రులవారే వారు ఉండే స్థానాన్ని వ్రాశారని అంటారు.

  ఇలా మన మహర్షులు, భక్తులు మన రాజుగారి అడ్రస్ చెప్పారు. 

లోపల ఉన్నవాడు నిర్గుణుడు. అంటే రూపనామగుణములు లేనివాడు. అటువంటి వానిని రూపనామగుణాలున్న మనం ఎలా చూడగలం? కళ్లతో చూడాలంటే కంటికి కనబడే విధంగా వాడు ఉండాలి. పోనీ ఆయనగారి స్వరమాధుర్యం ఎలా ఉంటుందో వినాలన్నా దానికి తగ్గస్వరంలోనే ఆయన మాట్లాడాలి. ఇలా సగుణాలైన మన ఇంద్రియాలను బట్టి, మనం కోరిన విధంగా మన దగ్గరకు ఆయనే రావాలి. లోపలున్నా బయట ఉన్నా సరే. ఆ రాజుగారికి మనం కనబడుతూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే మన లోపలైనా బయటైనా ఆయన లేనిదే మనం లేము. కానీ మనకి ఆయన కనిపించాలంటే ఎన్నో నియమాలు నిబంధనలు. నియమనిబంధనలు పాటించకపోయినా నువ్వు ఎందుకు కనిపించవయ్యా? అని హఠం వేసుకుని కూర్చుంటే ఆయన కనిపించడా? కనిపిస్తాడు. ఆయన భౌతికమైన రాజుగారు లా కఠినాత్ముడు కాడు. పట్టుదలతో నువ్వు నాకు కనిపించాలంటే నియమనిబంధనలేవీ పాటించకపోయినా మన వద్దకు మనం అనుకున్న రూపంలోనే మనలోనుండే వాడే బయటికి వచ్చి తనని చూపించుకుంటాడు. అదే కదా! అవతరించటమంటే. భక్తకన్నప్ప కి కనిపించలేదా! ఏనుగు, పాము మొదలైన జీవజాలానికి కనిపించలేదా! మొన్న మొన్నటి రామకృష్ణ పరమహంస కి కనబడలేదా! ఇంకెందరో లెక్కించలేనట్టి మహాత్ములకు కనిపించలేదా! మరి మన కళ్లకి ఎందుకు కనిపించటంలేదు? మనకి ఆ పట్టుదల లేదు కాబట్టి. ఏదో ఆ సమయానికి కాస్త 'కృష్ణారామ‌' అనుకుంటే చాలని, అది కూడా అనుకోకపోయినా జీవితం ఎలాగైనా గడిచిపోతోందిగా అనే నిర్లిప్తత కారణంగా మనకి కనిపించటం లేదు.

  ---బాలా...✍️🌺

మూడున్నరాంధ్రులు

 మూడున్నరాంధ్రులు-  


అప్పట్లో  అనగా 1950  లలో  మన నెహ్రూ గారికి  చైనా అంటే పిచ్చి ప్రేమ ఉండేది .. ఆలా మనకు వారికీ సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని తెలపడానికి హిందీ చీనీ భాయి భాయి అంటూ నినాదాన్ని కూడా లేవనెత్తారు . చివరకు అది మన దేశం యొక్క పుట్టి ముంచి  దాదాపు 90 , 000  ఎకరాల  భౌమిని చైనా పాలయ్యేలా చేసింది అది వేరే కథ అనుకోండి . 


నెహ్రూ గారికి సోషలిజం మీద ఉన్న అవ్యాజానురాగ ప్రేమతో మన భారత దేశం నుండి సాంస్కృతిక రాయ భార సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసి  చైనా కి పంపారు. అందులో పద్నాలుగు మంది సభ్యులు . వీరంతా చైనాకి వెళ్లి అక్కడ వేరు వేరు ప్రాంతాలలో అక్కడి అధికారులు, మంత్రులను కలవడం మనకూ చైనా కు అనాదిగా వస్తున్న సంబంధాన్ని గూర్చి వివరించడం వీరు చేసే పని.


ఆ రాయబార సంఘములో  మన తెలుగు వెలుగు దుర్గాబాయమ్మ  , సూరి భగవంతం,  చలపతిరావు  మరియు మన దేశ స్వతంత్ర  సమరయోధురాలు  సరోజినీ నాయుడు కుమార్తె లీలా నాయుడు కూడా అందులో సభ్యులు.


లీలా నాయుడు పద్మజా నాయుడు చెల్లెలు అని గుర్తు తెచ్చుకోండి.. ఆమె బెంగాల్ తరపున వెళ్లారు. సరోజినీ నాయుడు భర్త గోవిందరాజుల నాయుడు తెలుగువారు కాబట్టి అలా లీలా నాయుడు మన తెలుగింటి అమ్మాయే .. కానీ ఆమె బెంగాల్ కి ప్రాతినిధ్యం వహించడం  వలన   ఆమె సగం ఆంధ్రురాలు.  అలా మన దేశం నుండి  వెళ్లిన భారతీయ సాంస్కృతిక రాయబార సంఘములో సభ్యులు అత్యధికులు అంటే పదనాలుగురులో మూడున్నర ఆంధ్రులు  మన తెలుగు వారు కావడం యాదృచ్చికమో ఏమో గానీ అది మన అందరికీ గర్వకారణం. 


నేడు మన తెలుగులు   కులరాజకీయుల  గోలలో పడి భాషను సంస్కృతిని ఏనాడో విస్మరించారు  - ఇంక ముందు ముందు మంచి రోజులు వస్తాయన్న ఆశా లేదు.  నేడు పాలకుల మూర్ఖత్వం వలన తెలుగు సంసృతియే కాదు భాషకు కూడా దుర్దినాలు ఆరంభం అయ్యాయి.  తెలుగు తల్లీ ఏవీ నిరుడు కురిసిన హిమసమూహమ్ములు - నేడు  ఐక్యతా శూన్యతతో ఒక సరి అయిన మార్గదర్శనం లేక కొట్టు మిట్టాడుతున్నారు అవశేషాంధ్ర   తెలుగులు .

Stitching ideas

 https://youtube.com/shorts/aW5YPYJjeyc?si=bqYQwnp9Btk2kVyP


20 rupees meals at vijayawada


 

Bullet train


 

*కార్తిక పురాణము- 4*

 *కార్తిక పురాణము- 4*



అథ చతుర్థధ్యాయ ప్రారంభః

జనకుడిట్లడిగెను. వశిష్టమునీంద్రా! నీఉఒక్క వాక్సుధా రసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆకార్తీకమందు ఏదానమును జేయవలెో ల్దేనిని గోరి వ్రతము ఆచరించవలయునో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను. పాపములను నశింప జేయునదియు, పుణ్యమును వృద్ధిబొందించునదియు అయిన కార్తీకవ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీకమాసమునందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీకమాసమందు శివాలయంలో గోపుర ద్వారమందును, శిఖరమందును ఈశ్వర లింగ సన్నిధియందును దీపారధన చేసిన యెడల సమస్తపాపములు నశించును. ఎవ్వడు కార్తీకమాసమునందు శివాలయంలో ఆవునేతితో గాని నేతితోగాని నువ్వునూనెతో గాని విప్పనూనెతో గాని నారింజనూనెతో గాని భక్తితో దీపసమర్పణము చేయునో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు. ధర్మాత్ముడును అగును. పూర్వోక్తములయిన నూనెలు సంభవించినచో ఆముదముతోనయినా దీపమును సమర్పించిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు శివాలయంలో మోహముచేతగాని, బడాయికి గాని భక్తితో గానీ దీపమిచ్చువాడు శివప్రియుడగును. సందేహములేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన యొక రాజుగలడు. సంతానము లేక గోదావరీతీరమందు తపస్సు చేసెను. గోదావరీ స్నానార్థమై పైప్పమహాముని అచ్చటికి వచ్చి చూచి రాజా ఎందుకు తపస్సు చేయుచున్నావని యడిగెను. ఆమాట విని రాజు మునీశ్వరా నాకు సంతానము లేదు గాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పల్కెను. రాజా! భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లయిన యెడల నీకు పుత్రసంతానము కలుగును. ఇట్లు పైప్పలముని చెప్పగ ఆ రాజు విని ఆనందసాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను జేసెను. పిమ్మట ఆ పుణ్యముచేతనే రాజుభార్య గర్భవతియై పదియవమాసమున రెండవ సూర్యుడువలె ప్రకాశించెడి ఒక పుత్రునిగనెను. ఆరాజు విని అధికానందమును బొంది కార్తీకమహాత్మ్యము సత్యమైనది ఈకార్తీకవ్రతము ధర్మార్ధ కామమోక్షములనిచ్చును. సమస్త భూతములకు కార్తీకమాసము శుభప్రదము అని వచించెను. తరువాత రాజు కుమారునకు "శత్రుజిత్" అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూధానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రమముగా వృద్ధినొంది యౌవనవంతుడై శూరుడై సుందరుడై వేశ్యాసంగలోలుడై అంతట తృప్తిలేక పరస్త్రీలయందు ఆసక్తి గలిగి ధనాదికమునిచ్చి వారిని లోబరచుకొని సంభోగించెడివాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర కారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చినవారిని హింసించుచు అన్యాయమార్గవర్తనుడైయుండెను.

ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది సింహముయొక్క నడుమువంటి నడుుగది. పెద్దకన్నులు గలది. పెద్దవైన పిరుదులును, కుచములును గలదియు, అరటి స్థంభములవంటి తొడలు గలదియు, చిలుకకువలె సుస్వరమైన వాక్కు గలదియు, మన్మధోద్రేకముగలదై యుండెను. ఆరాజకుమారుడు అట్టి విప్రభార్యను జూచి దాని సౌందర్యమునకు సంతోషించి దానియందాసక్తిగలవాడాయెను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందాసక్తి గలదాయెను. తరువాత ఆ భ్రాహ్మణుని భార్య అర్ధరాత్రమందు భర్తను విడిచి రాజకుమారునియొద్దకుబోయి అతనితో రాత్రిశేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈప్రకారముగా అనేకదినములు జరిగినవి. ఆసంగతి బ్రాహ్మణుడు తెలుసుొి నిందితమైన నడతగల భార్యను, దానిని మరిగిన రాజకుమారుని చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలుదొరుకునాయని కాలమును ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత యొకప్పుడు శివాలయాన కార్తీకపూర్ణిమా సోమవారమునాడు బ్రాహ్మణి క్తన చీరె అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆవత్తితో జాచిన్నది దీపము వెలిగించి అరుగుమీద పెట్టెను. అచ్చటే వారిద్దదు కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంత బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుణినరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతములచేత ఆజీర్ణదేవాలయమందు ముగ్గురు మృతినొందిరి. ఆదినము కార్తీకపూర్ణిమ సోమవారము. దైవవశము చేత అట్టి పర్వమందుముగ్గురికి శివుని సన్నిధియందు మరణము గల్గినది. అంతలో పాశ హస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులును వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుని, బ్రాహ్మణ భార్యను విమానముమీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు గట్టి తీసికొనపోవ ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసగమనమును, తనకు యమలోకగమనము జూచి బ్రాహ్మణుడు శివదూతలారా! ఈనాభార్య జారిణి. ఈరాజకుమారుడును జారుడుగదా. నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను గదా, ఇట్లుండ నాకీగతియేమి, వారికాగతియేమి అని యడిగెను. శివదూతలిట్లనిరి. బ్రాహ్మణోత్తమా! నీవన్నమాట సత్యమేగాని అందొక విశేషమున్నది చెప్పదము వినుము. ఈనీభార్య పాపాత్మురాలును జారిణియు అయినప్పటికి కామమోహముచేత కార్తీకపూర్ణిమా సోమారము నాడు శివాలయమునందు దీపారాధనకు గాను తన చీరెను చించి వత్తిని చేసి ఇచ్చినది.గాన దీని పాపములన్నియు భస్మములయినవి. ఈరాజకుమారుడును దీపార్థమై ఆముదమును దెచ్చి పాత్రలోనుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయెను. కాబట్టి కామమోహము చేయనయినా శివాలయమందు దీపదానము చేసిన వాడు ధన్యుడు. సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీభార్యకు రాజకుమారునకు ైలాసమును, దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినదు. ఇదివరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో సమానుడవుగా లేదు. ధర్మసూక్ష్మమిదియని చెప్పిరి.

శివదూతలు ఈప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈబ్రాహ్మణుని భార్యతో రమించి ఈబ్రాహ్మణునిచేత శివాలయమందు హతుడనైన నాకు కైలాసము. ఇతనికి నరకము గలుగుట చాలా దుఃఖకరముగానున్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈబ్రాహ్మణునకు ఇచ్చెదను. ఏకకాలమందు మృతినొందిన మాముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక దీపదానముచే ముగ్గురు కైలాసమునకుబోయిరి. కాబట్టి కార్తీకమాసమున ధర్మమును జేయవలెను. అట్లు చేయనివాడు రౌరవనరకమును బొందును. కార్తీకమాసమందు నిత్యము శివాలయమందుగాని, విష్ణ్వాలయమునందుగాని దీపమాలను సమర్పించిన యెడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును బొంది తద్ద్వారా పునరావృత్తిరితమగు మోక్షమునొందును. సందేహములేదు. కార్తీకమాసమందు హరిసన్నిధిలో స్త్రీలుగాని, పురుషుుగాని తన శక్తికొలది దీపార్పణము చేసినయెడల సర్వపాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీకమాసమున దీపముల పంక్తి సమర్పించుము.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే చతుర్థోధ్యాయ స్సమాప్తః

శ్రీ స్వామివారి ప్రవర్తన..మాటలు..ఉపదేశం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శ్రీ స్వామివారి ప్రవర్తన..మాటలు..ఉపదేశం.*


*(ముప్పై వ రోజు)*


శ్రీ స్వామివారు తెల్లవారుఝామునే గదిలోంచి బైటకువచ్చి..ఇంటి ఆవరణలో తిరుగుతూ వుండేవారు..ఒక్కొక్కసారి శ్లోకాలు..దైవ సంకీర్తనలు పాడుతూ వుండేవారు..శ్రావ్యమైన కంఠస్వరం తో అద్భుతంగా గానం చేసేవారు..ప్రభావతి గారికి శ్రీధరరావు గారికి కూడా ఉదయాన్నే లేచే అలవాటు..ప్రభావతి గారు పశువుల ఆలనా పాలనా చూసుకోవడం..గేదెల వద్ద పాలు పితకడం..వగైరాలన్నీ చేసుకుంటూ వుండేవారు..ఆ సమయంలో ఆవిడ సహజంగా ఏదో ఒక స్తోత్రాన్ని మననం చేసుకుంటూ వుండేవారు..కానీ శ్రీ స్వామివారు వారింట్లో అడుగుపెట్టిన తరువాత ..శ్రీ స్వామివారు దాదాపు ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటల ప్రాంతంలో తన గానమాధుర్యాన్ని చవిచూపడం అలవాటుగా మారింది..వినేవారికి అదో గొప్ప అనుభూతి..


ఐశ్వర్యం గురించి రాత్రి పొద్దుపోయేదాకా శ్రీధరరావు దంపతులకు వివరించి..రాత్రి తన గదికి వెళ్లిపోయిన శ్రీ స్వామివారు..మళ్లీ తెల్లవారుఝామున నాలుగు గంటలకే వచ్చేసారు..శ్రీ స్వామివారి ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకున్న శ్రీధరరావు దంపతులు కూడా ఆ సమయానికి లేచి..కాలకృత్యాలు తీర్చుకుని..ఇంటి ముందుకు వచ్చారు..ఎదురుగా చిరునవ్వుతో శ్రీ స్వామివారు నిల్చుని వున్నారు..


"శ్రీధరరావు గారూ..కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది..సమయం కూడా చక్కగా ఉంది..మీరిద్దరూ తప్పక వినవలసినవి.. మళ్లీ మళ్లీ నాకు కుదరక పోవొచ్చు..లేదా..మీకు ఆ సమయమూ లేక పోవొచ్చు..ఏం తల్లీ!..వింటారా?.." అన్నారు..ఇద్దరూ తలాడించారు..


"శిష్యుడి మానసిక స్థితి..ఆధ్యాత్మిక ఉన్నతి గమనించి..ఆ శిష్యునికి సరైన సమయంలో సరైన మంత్రోపదేశం చేసి..ఆ మంత్రాన్ని శిష్యుని ద్వారా కోటి జపం పూర్తి చేయించి..కోటి జపం చేసేలా దీవిస్తూ..మార్గం నిర్దేశించేవాడే సద్గురువు!..ఉపదేశించిన మంత్రానికి..ఉపదేశం తీసుకున్న వ్యక్తిీ..ఆ మంత్రం పరిపూర్తి చేసినప్పుడే..మంత్రోపదేశం చేసిన గురువుకు కూడా అపాత్రదానం చేసాననే భావన లేకుండా పరిపూర్ణ తృప్తితో సద్గతి పొందుతాడు!.."


"దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోవడం ఏ యుగంలోనూ లేదు!..దైవ నామొచ్చారణతో జన్మ జన్మల పాపాలూ ప్రక్షాళన అయి తీరుతాయి..కోరరాని కోర్కెలు తీర్చేవాడు దేవుడు కానేకాదు!..భక్తులకు ఏది శ్రేయస్కరమో..ఏ క్షణంలో తన రక్షణ అవసరమో..అది ప్రసాదించేవాడు ఒక్క భగవంతుడు మాత్రమే!..నీవు చేయవలసిందల్లా..విడవకుండా..అచంచల విశ్వాసంతో..ఆయన పాదాలను మనసా, వాచా, కర్మణా నమ్మి శరణాగతి పొందడమే!.."


"దైవ జపం విశ్వాసం తో చేస్తే..సంపదలు మాత్రమే కాదు..అష్టసిద్ధులూ వశం అవుతాయి..కానీ వాటిని ఇతరులకు హాని కొరకు ఉపయోగిస్తే..రాక్షసులుగా మారతారు..అవి అందించిన భగవంతుని చేతిలోనే చావుదెబ్బ తింటారు..అలాకాక.. ధర్మమార్గాన వాటిని సమాజహితం కొరకు వినియోగిస్తే..వారు మహాత్ములు అవుతారు..అదొక యోగం..వారినే యోగులు అంటాం.." 


ఇంతవరకూ చెప్పిన శ్రీ స్వామివారు..హఠాత్తుగా పక పక మని నవ్వసాగారు..వింటున్న దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు..ఆ తెల్లవారుఝామున శ్రీ స్వామివారి స్వచ్ఛమైన నవ్వు..అదీ తెరలు తెరలుగా నవ్వడం..వారికి అర్ధం కాలేదు..


ఇంతలో శ్రీ స్వామివారే తమ నవ్వును ఆపుకొని..ప్రభావతి గారి వైపు చూసి.."అమ్మా..నిన్న రాత్రి నీకు అష్టైశ్వర్యాల గురించి బోధ చేసాను కదా!..నీవు ధన వ్యామోహం లో పడకూడదని అంతదూరం చెప్పాల్సి వచ్చింది..ఆ ఒక్క సందేహాన్ని తీర్చడం కోసం నేను ఎంతో సమయాన్ని వెచ్చించి..మీ సందేహాలను నివృత్తి చేయాల్సి వచ్చింది..మీరు ఈ జ్ఞానం నా ద్వారా పొందాలని ఆ భగవంతుడి నిర్ణయం..గృహస్తుల సందేహాలకు ఎంత సమయం ఇలా కేటాయించాలనో..అని నాకు నవ్వు తెప్పించింది..శ్రీధరరావు గారూ మీకు కూడా బోధ పడిందా?.." అన్నారు శ్రీ స్వామివారు..


"నాలోనూ చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి స్వామీ.." అన్నారు శ్రీధరరావు గారు..శ్రీ స్వామివారి బోధలో..శ్రీధరరావు గారికి బాగా ఆకట్టుకున్న విషయం..సమాజహితం తో కూడుకున్న ధర్మాచరణ!..అది గృహస్తులకు అత్యవసరం..


"చివరగా ఒక్కమాట!..ఫలానా పూజ చేస్తే..దేవుడు నెత్తిన మొట్టాడు..అంటూవుంటారు కొందరు..అది తప్పు!..నిజమైన భక్తుడిని దైవం నెత్తిన మొట్టడు.. అనవసర కోరికలు..మోసం..పరనిందా.. పరులకు హాని..ఇత్యాదులను దేవుడు క్షమించడు!..అదీ అసలు రహస్యం..అది తెలుసుకొని మసలుకోండి!.." అని చెప్పి..


"అమ్మా..త్వరగా ఒక గ్లాసు పాలు ఇవ్వమ్మా!..బాగా ఆకలిగా ఉంది.." అని అడిగారు స్వామివారు..ఆసరికే కొద్దిగా వెలుతురు వస్తోంది..ప్రభావతి గారు గబ గబా గేదె దగ్గరకు వెళ్లి, పాలు పితికి.. వెచ్చచెసి ఇచ్చారు..శ్రీ స్వామివారు ఆ పాలు త్రాగి..మళ్లీ తన గదిలోకి వెళ్లి ధ్యానం లో కూర్చున్నారు..


అవధూత లక్షణం..శ్రీ దత్తాత్రేయ అవతారం..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

 🎻🌹🙏కార్తీకమాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం.  ....!!


🌿శివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడూ కనిపించే క్షేత్రం.....


🌸సాధారణంగా శివుడు లింగ రూపంలో మనకు కనిపిస్తాడు.అయితే దేశంలో ఎక్కడా లేనట్లు ఇక్కడ పరమశివుడు కుర్చొని ఉన్న భంగిమలో మనకు దర్శనమిస్తాడు.సిద్ధాసనంలో (కుర్చొని) శివుడు కొలువై ఉండటం వల్ల ఈ ఆలయానికి సిద్దేశ్వరాలయం అని పేరు వచ్చింది.


🌿ఇక స్వామివారు జఠాజూటంలో చంద్రుడితో పాటు సూర్యుడు కూడా కనిపిస్తారు.కుడిచేతిలో బ్రహ్మకపాలాన్ని, మెడలో కపాలాలను కూడా స్వామి వారు ధరించి సగం మూసిన కనులతో స్వామివారు కనిపిస్తారు. 


🌸ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో అమరాపురం మండలం హేమావతిలో ఉన్నది 


🌿ఇటువంటి రూపం భారత దేశంలో ఇదొక్కటే అని స్థానికులు చెబుతున్నారు. 


🌸ఇదే ఆలయంలో పంచ లింగాలు కూడా మనం చూడవచ్చు.శివరాత్రి రోజు సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఈ దేవాలయంలోని మూల విగ్రహం నుదిటిమీద ఖచ్చితంగా పడుతాయి. 


🌿ఇలా ఎలా పడుతున్నయన్న దానికి ఇప్పటి వరకూ ఖచ్చితమైన సమాధానం లేదు.


🌸ఇక ఆలయంలో శివుడికి ఎదుగా ఉన్న నంది స్వామివారిని చూస్తున్నట్టుగా కాక కొంత పక్కకు తిరిగి ఉంటుంది. 


🌿పడమర ముఖంగా ప్రవేశ ద్వారం ఉన్న దేవాలయాల్లో హేమావతి సిద్దేశ్వరస్వామి దేవాలయం కూడా ఒకటి.


🌸హేమావతిని పూర్వ కాలంలో హెంజేరుగా పిలిచేవారు. కాలక్రమంలో అది హేమావతిగా మారింది. 


🌿పూర్వం ఈ ప్రాంతాన్ని నోలంబరాజులు పరిపాలించేవారు. అందువల్ల హేమావతిలోని సిద్దేశ్వరుడిని నోలంబేశ్వరుడు, ఎంజేరప్ప అని కూడా అంటారు.


🌸అనంతపురం, హిందూపురాలకు రైల్వే సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హేమావతిని చేరుకోవచ్చు....స్వస్తీ...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿