17, డిసెంబర్ 2023, ఆదివారం

Shop in ezipt


 

నవ్వుల వెన్నెల.

 ---౦ ఈ రోజు 15వ తేది. మనం గతంలో అనుకొన్నట్లు నేడు "" నవ్వుల వెన్నెల."" ఆ మిఠాయిల పొట్లాన్ని పంచుకొని తిందాం.             1* రాజకీయ నాయకులంతా కలసి ప్రయాణించే ఒక లగ్జరీ బస్సు ఒక పల్లెటూరి వద్ద రోడ్డు ప్రక్కన వున్న చెట్టుకు గుద్దుకొంది. " ఊరికి ఉపకారి అయిన రైతు తన పొలం ప్రక్కనే మరణించిన వారందరినీ పాతిపెట్టాడు." మరునాడు పోలీసులు "" పంచనామా"" చెయ్యటానికి వచ్చి ,రైతును ప్రశ్నించారు. "" ఏమయ్యా! అందరికందరూ ఏక్సిడెంట్ లో మరణించారంటావా? కనీసం ఒకరిద్దరైనా బ్రతికలేదా?"" అని. దానికా రైతు ఇట్లా జవాబిచ్చాడు. "" ఒకరిద్దరేం ఖర్మ సార్! నలుగురైదుగురు మేం బ్రతికే ఉన్నామని ఏడ్చుకొంటూ చెప్పారు. కానీ చనిపోయిన మా నాన్న చెప్పిన నాలుగు మంచి మాటలు గుర్తుకొచ్చి వాళ్ళను కూడా పాతిపెట్టా! నాయనా! నీవు ఈ లోకంలో దొంగలను నమ్ము, జూదరులను నమ్ము. చివరకు త్రాగుబోతులనైనా నమ్ము. కానీ "రాజకీయనాయకులు చెప్పే మాటలను మాత్రం నమ్మవద్దు"" అని.                 -------౦౦౦౦౦౦౦--------       హాస్పిటల్ ముందు క్యూలైన్ మెలికలు తిరిగి ఉంది. మధ్యలో నుండి ఒక పెద్ద మనిషి ముందుకు నడుస్తూపోతున్నాడు. వెనక నిలబడిన జనం కేకలు వేసుకొంటూ అతడ్ని లాక్కొచ్చి చివర నిలబెట్టారు. మూడు, నాలుగు పర్యాయాలు ఇదే సంఘటన జరిగేసరికి ఆ పెద్దమనిషికి ఒళ్ళు మండిపోయి "" మీరంతా ఇట్లాగే చావండి. నేను ఇవ్వాళ హాస్పిటల్ తలుపులే తెరవనంటూ"" ఇంటి దారి పట్టాడు.              -------************ ------          అదేమిటండీ టానికి బాటిల్ పట్టుకొని అట్లా ఊగిపోతున్నారు-- అడిగింది అర్థాంగి.                ఈ బాటిల్ మీద "" Shake well before use."" అని వ్రాసి ఉన్నదే, జవాబిచ్చాడు అమాయక రావ్.                                    --------౦౦౦౦౦౦౦ ---------     రిటైరయిన ఆర్టీసీ కండక్టరు ఇస్త్రీ బట్టల లెఖ్ఖ వ్యాయడానికి కుర్చీలో కూర్చున్నాడు. కాసేపు అయింతర్వాత భార్యను కేక వేసి పిలిచాడు. "" ఇదిగో ఒక్క అక్షరం కూడా కుదురుగా రాయలేకపోతున్నా. ఈ కుర్చీని ముందుకు, వెనుకకు ఊపుతువుండు. అప్పుడేమైనా రాయొచ్చేమో ప్రయత్నిస్తా.""                       *******౦౦౦౦౦*******         " కొత్తగా స్కూలుకు వచ్చిన సోషల్ స్టడీస్ టీచర్ " బోధన" గురించి తల్లి తన చిన్నారి కూతుర్ని అడిగింది, తల్లి.                      "ఆ ,మిస్ కు ఏమీ రాదమ్మా! క్లాస్ రూమ్ లోకి రాగానే, నన్నే ప్రపంచంలో ఖండాలెన్ని?" అని అడిగింది.                             ---------౦౦౦౦౦ ---------         "" ఏమయ్యా! నీకు ప్లీడర్ ఎవరూ లేరా? బయట చెట్టు క్రింద ఎవరో ఒకరు దొరుకుతారు. తెచ్చుకోవయ్యా!" జడ్జీగారు క్లయింట్ తో అన్నాడు. పదిహేను నిముషాల తరువాత ఒక్కడే తిరిగి వచ్చిన క్లయింట్ జడ్జిగారితో చెప్పుకొన్నాడు "" అయ్యా! బయట చెట్టుక్రింద ఉండే ప్లీడర్లంతా జడ్జీలై వేరే ఊళ్ళకు వెళ్ళిపోయినారని.""              ******౦౦౦౦౦*******       వన్స్ మోర్లతో ఇరవైఒక్క సారి పద్యం పాడి అలసటతో చతికలపడ్డాడు, రంగస్థల కళాకారుడు. " ఏమండీ! పద్యం ఎంత బాగున్నా 21 సార్లు వన్స్ మోర్ కొట్టడం బాగాలేదండీ!""                      "" నువ్వు పద్యం బాగా పాడేంతవరకు మేం వన్స్ మోర్ అనకుండా ఆగం!"" ఇది కళాభిమానుల జవాబు. ---- ఇక కొన్ని కార్టూన్స్, జోక్స్, కామిక్స్ చూద్దాం.

అన్నమాచార్యకీర్తనకు ద్విపదానుసరణ *

 *అన్నమాచార్యకీర్తనకు ద్విపదానుసరణ *


నిఖిల జీవులలోన  నే నెంత వాడ

కడగి యా యీశుండె కాపాడు చుండె


చెప్పినా రెవ్వ రా చిట్టి చీమలకు

పుట్టలో దాన్యమున్ బెట్టుకొండనుచు,

అంతరంగంబులో నాది నుండియునె

సంసార భ్రాంతి  నా సర్వేశ్వరుండె

కల్గించి బ్రతుకును కల్గించు చుండె


చెప్పి రెవ్వరు బుద్ధి చెట్టుల కిలను

అదనులో మొలకెత్తి యభివృద్ధి నొంది

కొమ్మలన్ పూవులన్ గూర్చు కొమ్మనుచు,

కూడి చైతన్యమై గుట్టుగా నుండి

అనుగుణ గుణముల న్నందించు నతడె


పుట్టిన మెకముకు బుద్ధెట్లు గలిగె

చనుబాలు వెంటనే చప్పరించుటకు

మృదువైన పచ్చికన్ మెసవుచుండుటకు,

అంతరంగంబులో ననునిత్య ముండి

ప్రాణుల కనువైన పనులను నేర్పి

శ్రీవేంకటేశుండె చేయు సర్వంబు


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*17-12-2023 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

---------------------------------------

వృషభం


విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. వివాదాలకు సంభందించి విలువైన సమాచారం అందుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

మిధునం


ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణ మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు తప్పవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబసభ్యుల నుంచి ధనపరమైన ఒత్తిడి తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------

కర్కాటకం


వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఇంటాబయట బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

---------------------------------------

సింహం


 పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో కీలక వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు సానుకూలమౌతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది.

---------------------------------------

తుల


వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు.

---------------------------------------

వృశ్చికం


చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమౌతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

---------------------------------------

ధనస్సు


కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. పాతబాకీలు వసూలవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

మకరం


కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. సంతాన విద్యా, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కుంభం


 ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో సమస్యలు అదిగమిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు. బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

మీనం


 దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కొన్ని పనులలో శ్రమ పడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

శ్రీ సత్యన్నారాయణ స్వామి

 🌹శ్రీ సత్యన్నారాయణ స్వామి వ్రత కథల అంతరార్థం 🌹



🌿సత్యనిష్ఠులైన వారిలో అరిషడ్వర్గాలకు, ఈర్ష్యాసూయ లకు, అహంకార మమకారాలకు తావుండదు.... ఇలా సత్యనారాయణ స్వామి వ్రత కథలలో మొదటి కథను సాక్షాత్తు నారాయణుడే నారదునికి చెప్పడం విశేషం.... 


🌸ఇది ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగిస్తుంది, సత్యనిష్ఠకు పునాది వేస్తుంది.... నారాయణుడు ఉదాహరణ పూర్వకంగా మరో నాలుగు కథలు వినిపించాడు....


🌿వాటిలో తాను గీతలో పేర్కొన్న నాలుగు వర్ణాలను ప్రస్తావించాడు....సదానందుడనే బ్రాహ్మణుడు, కట్టెలమ్ముకునే శ్రామికుడు, రాజు వల్ల స్ఫూర్తి పొందిన వైశ్యుని భార్య, లీలావతి, కూతురు కళావతి, చంద్ర కేతువు, తుంగధ్వజుడనే రాజు, గొల్లపిల్లల పాత్రలు ఆ కథల్లో కనిపిస్తారు....సత్యనిష్ఠ వారిలో ఏ విధంగా కలిగింది సూచించబడింది....


🌸సత్య ప్రకృతి ఉన్న వారు లౌకిక, పారలౌకిక జీవితాలలో సుఖ సంతోషాలు పొందగలరని ఆశ్వాసన ఇవ్వడం జరిగింది.....


🌿బ్రాహ్మణుడు తాను జ్ఞానార్జన చేయడమే కాక సమాజాన్ని నడిపించడానికి తన కర్తవ్యాన్ని ఎలా నిర్వహించాలో ఉపదేశించడం జరిగింది....


🌸ఒక రాజు సత్యవ్రత నిష్ఠుడై లీలావతికి ప్రేరణ కలిగిస్తాడు.... భార్య వల్ల స్ఫూర్తిని పొందిన వైశ్యుడు సత్యనారాయణ అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని, సంతానాన్ని పొంది అహంకారంతో భగవంతుణ్ణి మోసం చేయాలనుకుంటాడు...వివేకం నశించి, సత్యనిష్ఠ సడలింది, పర్యవసానం పశ్చాత్తాపం....


🌿పశ్చాత్తప్తులకు భగవంతుడు జ్ఞానబోధ చేసి సక్రమ మార్గంలోకి తెస్తాడు..... క్షత్రియుడు లేదా రాజు సమాజానికి రక్షకుడే కాక అన్ని వర్గాలను సమభావంతో చూడాలి...వర్ణ వివక్షను చూపకూడదు....


🌸సత్య ధర్మాల విషయంలో ఉపేక్ష పనికిరాదు.... ఉపేక్ష పతనానికి దారితీస్తుంది.... తుంగధ్వజుని జీవితం చెప్పే నీతి ఇదే.....


🌿కట్టెలమ్మే వాని వద్ద శ్రమ శక్తి ఉంది. గొల్లపిల్లలు సత్యధర్మాలు తెలిసినవారు.... వీరంతా సమాజ సేవకులే.... వీరందరి అవసరం మిగతా వారికుందని వేరే చెప్పనక్క ర్లేదు.... శరీరంలోని వివిధ అంగాల మాదిరే సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి ప్రాముఖ్యం ఉంది....


🌸శరీరం ఒక యంత్రం వంటిది..... అందులో ఏ ఒక్కచక్రం పనిచేయకపోయినా మొత్తం యంత్రం నిష్ఫలమై పోతుంది.... అదే విధంగా శరీరంలో ప్రతి అంగం పనిచేస్తేనే శరీరం నిలబడేది... సమాజమూ అంతే....


🌿ప్రతి వర్ణం తమ బాధ్యత తెలుసుకుని కర్తవ్యాన్ని నిర్వహిస్తే సమాజం ముందుకు సాగుతుంది.... సత్యనారాయణ వ్రత కథలోని ఈ అంతరార్థాన్ని గ్రహించి తదనుగుణంగా ప్రవర్తిస్తే ప్రత్యేకంగా భగవంతుని అర్చించవలసిన అవసరం లేదు....


🌸అతడు సర్వాంతర్యామి అందరి హృదయాలలో సాక్షీభూతంగా ఉన్నాడు.... ఎవరికేది, ఎప్పుడు, ఎంతెంత కావాలో, ఎప్పుడీయాలో అతనికి తెలుసు.... వాటన్నిటినీ ప్రసాదించే భారం తన మీదే ఉంచుకుని శుభం శాంతి ఆనందం అనుగ్రహిస్తాడు..


🌿సందేహించవలసిన అవసరం అంతకన్నా లేదు... అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వ్యష్టిగానో, సమిష్టిగానో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రద్ధతో ఆచరిస్తే నారాయణుడు నారదునికి చెప్పిన విధంగా 


🌷ఏవం య: కురుతే సత్యవ్రతం పరమ దుర్లభం

దరిద్రో లభతే విత్తం బద్ధో ముచ్యేత బంధనాత్‌ 


🌸భగవంతుని కృపకు పాత్రులై ఇహ పర లోకాలలో సమస్త ఇష్ట కామ్యాలను అనుభవించి ముక్తులవుతారు.... 



🌸ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః...స్వస్తి...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

*🚩శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 117*


"ఏకాంతవాసానికి పోతున్నాను''


భగవదన్వేషణలోనే జీవితం గడపడం అసిధారా వ్రతం లాంటిదని కఠోపనిషత్తు వచిస్తున్నది.

ప్రతి క్షణమూ అప్రమత్తంగా వ్యవహరించకపోతే  మార్గం నుండి వైదొలగే ప్రమాదాలుఈ జీవితంలో కొల్లలు. సొంతాలు, బంధాలు అన్ని పారమార్థిక మార్గంలో ఆటంకాలని ఎంచి వాటిని త్యజించి సన్న్యాసం స్వీకరిస్తాడు మనిషి ,కాని అతడి ఎరుక లేకుండానే మిత్రులు, శిష్యులు, సోదర సన్యాసులు, మఠం అంటూ కొత్త బంధాలు తగిలించుకొంటాడు. 


ఎంతో అప్రమత్తంగా  వ్యవహరించకపోతే ఈ బంధాలు సైతం ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలుగా పరిణమిస్తాయి. అలాంటి బంధనాల్లో ప్రస్తుతం తాను చిక్కువడుతున్నట్లుగా స్వామీజీకి తోచింది. సోదర సన్న్యాసులతో జపధ్యానాలూ, ఆధ్యాత్మిక సాధనల తోనే రోజులు గడిచాయి. అయినప్పటికీ వారితో కలసి ఉండడం ఆయనకు ఒక అడ్డంకిగానే అనిపించింది. 


హృషీకేశ్ లోనూ, హిమాలయాల్లోనూ తనకు తారస వద్ద సన్న్యాసులు ఆయన మనస్సులో తళుక్కున మెదిలారు. ఎలాంటి బంధాలూ లేకుండా సర్వస్వతంత్రంగా వారు గడుపుతున్న జీవితాలు స్వామీజీని గాఢమైన చింతనకు లోను చేశాయి. ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు.


ఒక రోజు అఖండానందను పిలిచి తాను ఏకాంతంలోకి వెళ్ళగోరు తున్నట్లుగా తెలియజేశారు స్వామీజీ. అందుకు అఖండానంద, "మధ్య ప్రాచ్య ప్రాంతాలకు వెళ్ళాలనే నా ఆకాంక్షను ప్రక్కకు పెట్టి నేను ఈ యాత్రలో పాల్గొనడం మీ కోసమే. ఇప్పుడు నన్ను వదలిపెట్టి వెళ్ళిపోతామంటున్నారే! అన్నాడు ఆవేదనతో. ఆ మాటలు విన్న స్వామీజీ ఇలా అన్నారు: 


"సోదర సన్న్యాసులే అయినప్పటికీ బంధం బంధమే; ఆధ్యాత్మిక జీవితానికి వారు కూడా అడ్డంకులే. నువ్వే చూడు, టెహ్రీలో నీకు జబ్బు చేసింది. అప్పుడు నేను కూడా సాధన లేవీ అనుష్ఠించలేకపోయాను కదా! సోదర సన్న్యాసి అనే మాయను సైతం అధిగ మించకుంటే తపోమయ జీవితంలో పూర్తిగా మునగలేం. 


తపోమయ జీవితంలో పూర్తిగా మునిగిపోవాలని నేను తలచినప్పుడల్లా గురుదేవులు ఏదో ఆటంకాలను కల్పిస్తున్నట్లుగా తోస్తున్నది. ఇప్పుడు నేను ఏకాంతంలోకి పోతున్నాను. ఎక్కడికి వెళ్ళేదీ, ఎక్కడ బస చేసేదీ ఎవరికీ చెప్పను." అందుకు అఖండానంద, "మీరు పాతాళానికి వెళ్ళినప్పటికీ నేను వెదకి తెలుసుకొంటాను" అన్నాడు. 


అందుకు జవాబుగా స్వామీజీ మౌనంగా నవ్వి ఊరకున్నారు.చెప్పినట్లుగానే ఎవరికీ చెప్పాపెట్టకుండా ఒక రోజు మీరట్ నుండి స్వామీజీ బయలుదేరి వెళ్లారు. అది జనవరి 1891.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

సుభాషితం

 *జైశ్రీరామ్*


                              22-6-2020

                              అభ్యాసం-32


                            *సుభాషితం*


"హిమాలయం సమారభ్య

  యావదిందు సరోవరమ్ |

  తం దేవనిర్మితం దేశం

  హిందూ స్ధానం ప్రచక్చతే"||

             (బృహస్పతి ఆగమం)


                                  *భావం* 


హిమాలయాలు మొదలుకొని దక్షిణ (ఇందు) సముద్రమువరకు వ్యాప్తమగుచూ దేవతలచే నిర్మించబడిన భూమి హిందుస్ధానమని చెప్పబడుచున్నది.

       బృహస్పతి ఆగమశాస్త్రం ప్రకారం *హిందూ* అన్న పదం హిమాలయములలోని 'హి'వర్ణము,ఇందుసరోవరము (దక్షిణ సముద్రం) లోని 'ఇందు' పదములతో కూడి ఏర్పడి మన సంపూర్ణ మాతృభూమిని సూచిస్తున్నది.


                          *అమృతవచనం* 


మహాయోగి అయిన *శ్రీకృష్ణుడు* *కర్ణునితో*( కురుక్షేత్ర యుద్ధరంగంలో ఉండగా బురదలో దిగబడిన రధచక్రాలను పైకి లేవనెత్తడానికి కర్ణుడు రధంనుంచి క్రిందకు దిగినప్పుడు,అతనిపై బాణ ప్రయోగం చెయ్యమని శ్రీకృష్ణుడు అర్జునుని ఆజ్ఞాపించినప్పుడు, విరధుడై నిరాయుధుడైన ప్రత్యర్ధిపై బాణప్రయోగం అధర్మమని చెపుతూ తనను కొట్టవద్దని ' *ధర్మంపేరున* ' అర్జునుణ్ణి అర్ధించినపుడు) ఇలాఅన్నాడు:

            *కర్ణా*! ఈనాటివరకు నువ్వు అనుష్ఠించిన ధర్మశాస్త్ర నియమాలు ఏమున్నాయని ఈనాడు మాకు ధర్మాన్ని బోధిస్తున్నావు ?    

     మాయా జూదంలో పాండవులను ఓడించినపుడు ఏమైంది నీ ధర్మం ?  

      నిరాయుధుడు, పశివాడైన *అభిమన్యుని* యోధానయోధులైన మీరందరూ చుట్టుముట్టి సిగ్గువిడిచి నిర్ధాక్షిణ్యంగా సంహరించినపుడు నీవు చెప్పే ఈ ధర్మం ఏమైంది ?

      నిస్సహాయురాలు,అబల ఐన *ద్రౌపదిని* నిండుసభలో బహిరంగంగా *దుశ్శాసనుడు* అవమానిస్తోంటే  అడ్డుకోకుండా ఇంకా రెచ్చగొట్టేటట్లు మాట్లాడావు అప్పుడు ఈ నీ ధర్మం ఎటు మాయమయింది ?

       నేను రక్చించవలసింది ఒక ధర్మమే అదే *ధర్మరాజు* అతని సోదరులు.ఎందుకంటే ధర్మం వారివైపుంది కాబట్టి.నాకు పక్ఛపాతాలు ఏమీ ఉండవు.నేను ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాను.

        *శ్రీకృష్ణుడు* ఇట్టి సరియైన దృష్టికోణాన్ని నిరూపించి తద్వారా *అర్జునుని* (పాండవుల) సంకల్పశక్తిని వజ్రసదృశం చేసాడు కాబట్టే అర్జునుడు యుద్ధం చేయగలిగాడు, తద్వారా ధార్మికశక్తుల విజయపతాకాన్ని ఎగురవేశాడు.


                      శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి


.

ఆలోచనాలోచనాలు

 ### ఆలోచనాలోచనాలు ### సంస్కృత సూక్తి సుధ ### ( ప్రజ్ఞారసః తృప్తి కరో రసేభ్యః! -జ్ఞానరసమే అన్ని రసాలకన్నా తృప్తి కలిగించే రసం)                                    1* విద్వానేవ విజానాతి, విద్వజ్జన పరిశ్రమమ్! నహి వంధ్యా విజానాతి, గుర్వీం ప్రసవ వేదనం!!                      ( పండితుడు చేసిన కృషిని మరియొక పండితుడు మాత్రమే గుర్తించగలడు. గొడ్రాలు అయిన స్త్రీ ప్రసవ వేదన లోని శ్రమను గుర్తించలేదు కదా!)               2* చందనం శీతలం లోకే, చందనాదపి చంద్రమా! చంద్ర చందన యోర్మధ్యే, శీతలా సాధుసంగతి!!           ( శీతల గుణం కలది చందనం. చందనం కంటే శీతలమైంది చంద్రుని వెన్నెల. ఈ రెండింటి కన్నా మిక్కిలి శీతలమైంది సజ్జన సాంగత్యం.)                         3* దధి మధురం, మధు మధురం, ద్రాక్షా మధురా, సుధాపి మధురైవ! తస్య దేవహి మధురం, యస్య మనో యత్ర సంలగ్నమ్!!       (పెరుగు తియ్యగా ఉంటుంది. తేనె, ద్రాక్ష, అమృతాలు తియ్యనివి. కానీ మనస్సు దేనిపై లగ్నమై ఉంటుందో అదే అతడికి/ ఆమెకు మధురాతిమధురం.)           4* నకశ్చిత్ కస్య చిన్మిత్రం, నకశ్చిత్ కస్య చిద్రిపుం! వ్యవహారేణ మిత్రాణి, జాయన్తే రిపువస్తదా!!          ( ఎవ్వరికి పుట్టుకతోనే మిత్రులు కానీ శత్రువులు కానీ ఏర్పడరు. మన వ్యవహారశైలిని బట్టి మిత్రులు కాని, శత్రువులు కాని ఏర్పడతారు సుమా! అది అచ్చంగా మన నడవడిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది.)          5* నతేన వృద్ధో భవతి యేవాస్య ఫలితం శిరః! యోవా యువా స్వధీయానస్తం దేవాస్థ విరం విదుః!! -- మనీస్మృతి.     ( తలవెంట్రుకలు నెరసినంత మాత్రాన వృద్ధుడనిపించుకోడు. పిన్న వయస్సు వాడైనప్పటికీ, విద్యగలవాడే వృద్ధుడనిపించుకొంటాడని దేవతలు అంటారు. )            6* న స్నానమాచరేత్ భుక్త్వా, నాతురాన మహా నిశిః! నవాభిసోభిస్వహోజస్రం, నా విజ్ఞతే జలాశయం!! -- సుభాషిత రత్న భాండాగారం.                         ( భోజనం చేసిన తరువాత స్నానం చెయ్యకూడదు. రోగి అయిన వ్యక్తి స్నానం చెయ్యకూడదు. అర్థరాత్రి వేళ అస్సలు స్నానం చెయ్యకూడదు. తెలియని మడుగులోకానీ, సరస్సులో కానీ స్నానం చెయ్యడం పనికిరాదు.)                         7* క్రోధో వైవస్వతో రాజా, చాశా వైతరణీ నదీ! విద్యా కామదుఘా ధేనుః, సంతుష్టి నందనవనం!!-- నీతి శాస్త్రం.                             ( కోపమున్నదే అది యమునితో సమానం. ఆశ ఆకాశంలోని వైతరిణీ నది వంటిది.విద్య కామధేనువు వంటిది. సంతృప్తి నందనవనం వంటిది.)         8* నాస్తి కామ సమో వ్యాధిః,నాస్తి మోహ సమో రిపుః! నాస్తి క్రోధ సమో వహ్నిః, నాస్తి జ్ఞానాత్ పరం సుఖమ్!! -- నీతి శాస్త్రం.        ( కామం అన్నది వ్యాధి వంటిది. మోహం శత్రువు వంటిది. కోపంతో సమానమైన అగ్ని లేదు.జ్ఞానం కంటే సుఖాన్నిచ్చే మరొక వస్తువు లేదు. కనుక ( మనుష్యులు) జ్ఞానాన్ని పెంచుకోవాలి.)                        9* యస్యనాస్తి స్వయం ప్రజ్ఞా, శాస్త్రం తస్య కరోతి కిమ్! లోచనాభ్యం విహీనస్య, దర్పణం కిం కరిష్యతి!! --- సుభాషిత రత్న భాండాగారం.                   ( కొంత అయినా స్వయం ప్రతిభ లేని వానికి, శాస్త్రముల వలన ప్రయోజనం ఉండదు. కళ్ళులేని కబోదికి అద్దం వలన ఏం ప్రయోజనం ఉంటుంది?                           10* చితా, చింతా ద్వయోర్మధ్యే , చింతానామ గరీయసి! చితా దహతి నిర్జీవం, చింతా ప్రాణయుతం వపుః!! -- నీతి శాస్త్రం.                         ( చిత ( శవాన్ని కాల్చే కట్టెల రాశి), చింత ( దిగులు లేదా విచారము) ఈ రెండింటి మధ్య రెండవదే మిక్కిలి బాధాకరము. మొదటిది చనిపోయిన శవాన్ని తగులబెడితే, రెండవది బ్రతికి ఉండగా మనిషిని కాల్చివేస్తూ ఇబ్బందిని కలుగజేస్తుంది.                     11* లోభేన బుద్ధిశ్చలతి, లోభో జనయితే త్వషామ్!     త్వషార్తో దుఃఖమాప్నోతి, పరత్రేహచ మానవః!! -- సుభాషిత రత్న భాండాగారం.                        ( ధనంపై అత్యాశ ఉన్నట్లయితే, మనస్సు చలిస్తుంది. ధనాశ కోరికలను పెంచుతుంది. ధనాశ గల వ్యక్తి ఇహ, పర లోకాల్లోను దుఃఖిస్తాడు. కాబట్టి లోభం ( ధనంపై అత్యాశ ) కూడదు.                  12* వరం దరిద్రః, శ్రుతి శాస్త్ర పారంగతః! నచాపి మూర్ఖః, బహురత్న సంచయః!! --- సుభాషిత రత్న భాండాగారం.                వేద శాస్త్ర పారంగతుడైన వ్యక్తి దరిద్రుడైనప్పటికీ ఉత్తముడే, శ్రేష్ఠుడే! అనేక రత్న భాండాగారాలు ఉన్నప్పటికీ మూర్ఖుడు ఎన్నటికీ శ్రేష్ఠుడు కాలేడు.       చివరగా ఒక చమత్కార శ్లోకం.                                   శిరసా ధార్య మాణోపి, సోమః సౌమ్యేన శంభునా!     తథాపి కృశతాం యాతి, కష్టం ఖలు పరాశ్రయః!!           పరమశాంతుడైన శివుడు చంద్రుణ్ణి తన తలమీదనే అలంకారంగా పెట్టుకొన్నాడు. అయినా ఏం లాభం? ఆ చంద్రుడు రోజు, రోజుకు క్షీణిస్తూనే ఉన్నాడు. పరులను ఆశ్రయించి బ్రతకడం కష్టమే కదా?                         తేది 17--12--2023, అదివారం, శుభోదయం.

ధనుర్మాస ధ్యానం

 *ధనుర్మాస ధ్యానం భజనం 2023-24 ప్రత్యేక శీర్షిక .*💐


*అన్నమయ్య అజరామర సంకీర్తనలు -  01* 


🌺🍃 *----------------* 🍃🌺


*అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 359*


*( అదివో అల్లదివో హరివాసము ... )*


🌺🍃 *----------------* 🍃🌺


ఓం నమో వేంకటేశాయ. 🙏


 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 359 కి శుభ స్వాగతం ..🙏 


*ప్రార్థన ః--*🌹🙏


*అదిగో వేంకటనగ మది-*

*గదిగో వైకుంఠమనగ నదియే యిలలో !*

*పదముల కలసట లేలా ?*

*పదపదరే వేంకటాద్రి వరదుని కడకున్ !* 


🌹🙏🌹


✍️ *స్వీయపద్యము ( కందము )*


🌹🌹


( అలసట మరచి  ఇలవౖకుంఠమైన  తిరుమల కొండనెక్కి 

ఆ వేంకటాద్రి విభుని వద్దకు చేరుదాము !  🙏


అదిగో మన చేరువనే ఉన్నది ,ఆలస్యము వలదు , అలపులు అసలే వలదు !!🙏 )


🌹🙏🌹



🌺🍃 *----------------* 🍃🌺


అన్నమాచార్యుల వారి సుప్రసిద్ధ సంకీర్తనలలో ఆది కీర్తనగా దీనిని పరిగణించుకోవచ్చు . 


ప్రతీ తెలుగింటిలోనూ మారుమ్రోగే కీర్తన ఇది . 🙏


ఈ పాట పాడుకుంటూ ఆ తిరుమల కొండ మెట్లు ఎక్కుతుంటే అలసట అన్నది ఉంటుందా అసలు ?🙏


అంతటి ఉత్సాహాన్ని మనలో నింపారు అన్నమయ్య ఆ తిరుమల కొండను అండగా చూపించి .

అందరికీ తెలిసిన కీర్తనయే ఐనా నా తృప్తికోసము భావార్థమును అందిస్తున్నాను అంతే ! 🙏


🌺🍃 *----------------* 🍃🌺



🌹🌹


అదిగో  !  అదిగదిగో  ! అదేనయ్యా ఆ శ్రీ హరి మనకోసమే కొలువైన కొండ , ఆయన స్థిరనివాసమును ఏర్పరుచుకున్న కొండ .🙏


ఆ కొండ ఎంత గొప్పగా ఉన్నదో చూడండి  ఆ ఆది శేషుని వేయిపడగలతో  ముందే స్వామికొరకు వచ్చి అమరినట్లుగా ఉన్నది .🙏


శేషశాయి అయిన ఆ *శ్రీమన్నారయణుని* శేషతల్పమే ఈ కొండ .🙏


🌹🌹


అదే వేంకటాద్రి కొండ .

అన్నిటికీ మించినదియై పొడవుగా అలరారుచున్నది .🙏


అదియే ఆ బ్రహ్మ మొదలగు వారికి మిక్కిలి విలువైన , అసాధారణమైన కొండ .🙏


అదియే శ్రేష్టులైన మౌని తపస్వులకందరికీ  నిజమైన ఇరవు .🙏


అదిగో చూడండి ! అదిగో ఆ కొండకు నమస్కరించుకోండి !🙏


అంతకు మించిన ఆనందము మరెక్కడా ఉండదు . అక్కడికి చేరుటయే అన్నిటికీ మించిన ఆనందమగును .🙏


🌹🌹


అదిగో ప్రక్కనే శేషాద్రి కొండ కూడా శోభలతో కూడి యున్నది .


ఆ ఆకాశాన ఉన్న దేవతలకందరికీ ఇదియే సత్యమగు నిధానము .🙏


మన ముందరే అదిగో గర్భగుడిలో వెలసి నిలుచున్నాడు సంపదలకంతటికీ గొప్ప సంపదయైన వాడు .🙏


బంగారు కాంతులీనుచూ గోపుర శిఖరములతో  ఆ పరబ్రహ్మ స్వరూపమే అయి ముక్తిని ప్రసాదించే దివ్య ధామము .🙏


🌹🌹


ఇక్కడికి చేరుతున్నామంటే  ఆ వైకుంఠమునకు  చేరువలో ఉన్నాము అనియే భావించండి .అంత గొప్పనైనది ఈ వేంకటాద్రి .🙏


ఈ కొండయే ఆ *శ్రీ వేంకటేశ్వరునికి* సిరియై యున్నది .🙏


అసలు చిత్త శుద్ధిగా భావన చేసితే ,

సంపదలన్నిటిలోకి మేలైన సంపద ఇదియే .🙏


పవిత్రములైన వాటన్నిటిలోకి అమిత పవిత్రమైనది కూడా ఇదియే .🙏


రండి ఆ వేంకటాద్రి కొండ ఎక్కెదము . *శ్రీ వేంకటేశ్వరుని* దర్శించుకుని ధన్యులమౌదాము .🙏


🌹🙏🌹


*ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏


తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏

దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏

*(  అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 359)*


✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏


     🌹🌹 *సంకీర్తన* 🌹🌹



*॥పల్లవి॥*


అదివో అల్లదివో హరివాసము

పదివేలుశేషుల పడగల మయము


*॥చ1॥*


అదె వేంకటాచల మఖిలవున్నతము

అదివో బ్రహ్మాదుల కపురూపము

అదివో నిత్యనివాస మఖిలమునులకు-

నదె చూడుఁడదె మొక్కుఁడానంద మయము


*॥చ2॥*


చెంగట నల్లదివో శేషాచలము

నింగినున్న దేవతల నిజవాసము

ముంగిట నల్లదివో మూలనున్న ధనము

బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము


*॥చ3॥*


కైవల్యపదము వేంకటనగ మదివో

శ్రీవేంకటపతికి సిరులైనది

భావింప సకలసంపద రూపమదివో

పావనములకెల్లఁ బావన మయము


           🌹🙏🌹🙏🌹

వామనావతారం

 *ॐ   భద్రాచల రామయ్య - వామనావతారం* 


   *ముక్కోటి ఉత్సవాలలో 5వ రోజైన ఈరోజు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి "వామన" అవతారుడుగా దర్శనం అనుగ్రహిస్తారు.*


*దాశరథీ శతకం - వామనావతారం*


*పదయుగళంబు భూ గగన భాగములన్* 

                   *వెసనూని విక్రమా*

*స్పదమగు నబ్బలీంద్రు నొకపాదమునం* 

                      *దలక్రిందనొత్తి మే*

*లొదవ జగత్త్రయంబు* 

 *బురుహూతునకియ్య వటుండవైన చి*

*త్సదమలమూర్తి వీవెకద!* 

     *దాశరథీ కరుణాపయోనిధీ!*


*అనువాద శ్లోకం (సంస్కృతం)* 


*ధారిణ్యాం ప్రథమం తతశ్చగగనే* 

              *దత్వాద్వితీయం పదం* 

*తార్తీయేన బలాద్బలె రవనతం* 

               *భక్త్యాశిరోనామయన్ I* 

*దేవేన్ద్రాయజగత్ప్రభుత్వమదదా*  

              *భూత్వావటుర్వామనః* 

*శ్రీమన్ దాశరథే దయాజలనిధే!* 

                *భద్రాద్రి భాగ్యావధే! ॥*  


       *O! Rama the mighty son    of King Dasaratha, and the Lord, residing on the crest of the mountain Bhadra, You, the ocean of compassion:*

       *Have You not in Your incarnation as Vamana(the little Brahmachari) covered the entire universe with one of Your feet and thr sky with the other and pressed down into the nether world the mighty Rakshasa sovereign Bali, to the entire satisfaction and joy of the peopleof all the worlds and restored sovereignityto Indra?*


*అంతరార్థం*


*బలి -  జన్మాంతరమైన వాసనా బీజ బలమే బలి*


*వామన - త్రివిక్రమ*


*—అణురూపమైన భగవానుడు విశ్వవ్యాపకుడు.*

*(అణోరణీయాన్ మహతో మహీయాన్)*

*వా మనః = మనస్సా?*

*Is it the mind?*


*మూడడుగులు*


*విశ్వ, తేజస, ప్రాజ్ఞ స్థితులు*

*జాగృత్, స్వప్న, సుషిప్తి అవస్థలు*

*స్థూల,సూక్ష్మ, కారణ దేహాలు*


*1. లోకవాసన(కీర్తి ప్రతిష్ఠలకై చేయు పనులు),*

*2.శాస్త్రవాసన(తన శాస్త్ర జ్ఞానమే గొప్పదను వాదన),*

*3.దేహవాసన(వయస్సువల్ల వచ్చే మార్పునంగీకరించక చేసే ప్రయత్నాలు) అనే మలినవాసనలు*


*కారణ దేహం వాసనాబీజం. అదికూడా నశిస్తే తప్ప మోక్షజ్ఞానానందానికి వెళ్ళే అవకాశంలేదు.*


*బలిని "సుతల" లోకానికి పంపడం అంటే,*

*(సు = మంచి, తల = స్థానం)*

*మోక్ష స్థానమే అయిన మంచిలోకానికి అనుగ్రహించడం.*


    *వామనావతారం జరిగి ఇప్పటికి 4,40,45,064 సంవత్సరాలయింది.*


       *— రామాయణంశర్మ*

               *భద్రాచలం*