15, మార్చి 2024, శుక్రవారం

SP PICKLES

 *SP PICKLES* 

& *POWDERS*


*కొత్త పచ్చళ్ళు రెడిగా యున్నాయి*

*రీసెల్ చేసుకునేవారికి.. కొత్తవారికి కూడా అవకాశం కల్పించాలి అనుకుంటున్నాము* *సంప్రదించగలరు* 

*సాంప్రదాయ పచ్చళ్ళు*

*మాదగ్గర కలర్స్ ఫ్రీజ ర్వేటివ్స్ వెయ్యకుండా సంప్రదాయ పద్దతిలో పచ్చళ్ళు పొడులు బహ్మనులచే మాత్రమే సూచిగా రుచికరంగా నిల్వా ఉండేవిధంగా క్వాలిటీ పదార్ధాలతో తయారు చేయబడతాయి*


*మీ ఇంటి శుభకార్యలకు కావలసిన పిండివటలు ఆర్డర్ పై మీకు కావలసిన విధంగా తయారు చేసి ఇవ్వగలము* 


*పచ్చళ్ళు*: *1kg cost*

*ఉప్పు పచ్చళ్ళు పోపు లేకుండా*


చింతకాయ తొక్కు 450/-

ఉసిరి తొక్కు 450/-

ఉప్పు గోంగూర 450/-

టమోటా 450/-

మగయా 450/-

నిమ్మకాయ 450/-

దబ్బాకాయ 450/-


*ఇంగువ పోపు వేసినవి రెడీటూఈట్*


చింతకాయ(ఎండుమిర్చి తో పండుమిర్చి ...కారం తో చేసినది ) 550/-

ఉసిరి పచ్చడి 550/-

గోంగూర 650/-

టమోటా 550/-

నిమ్మకాయ 550/-

డబ్బాకాయ 550/-

పులిహోర గోంగూర 750/-

పండుమిర్చి 600/-

పండుమిరప గోంగూర 650/-

ఆవకాయ(వెల్లుల్లి/లేకుండా) 600/-

బెల్లం ఆవకాయ 600/-

పెసర ఆవకాయ 600/-

మెంతి ఆవకాయ 600/-

ఉసిరి అవకాయ 600/-

పచ్చ ఆవకాయ 850//

పనసపోట్టు ఆవకాయ 750/-

మాగాయ 600/-

*వంకాయ నిల్వ పచ్చడి* 750/-

అల్లం పచ్చడి 600/-

మామిడి అల్లం 650/-

మామిడి అల్లం ఆవకాయ 700/-


*పొడులు* : *1kg cost*

కంది పొడి 650/-

నువ్వులపొడి 700/-

ధనియాల పొడి 550/-

పప్పులపొడి 550/-

కరివేపాకు కారప్పొడి 550/-

మునగాకు కారపొడి 550/-

మునగాకు పొడి 2000/-

పుదీనా కారపొడి 550/-

అవిశగింజల పొడి 550/-

కొబ్బరి పొడి 600/-

రసం పొడి 550/-

కాకరకాయ పొడి 600/-

సాంబారు పొడి 650/-

నల్లకారం 600/-


*AS బ్రాండ్ పప్పు నూనె గుంటూరు కారం బళ్లారి కారం

మిర్చి తెచ్చి తోడిమాలు ఓలిచి కారం మేమే తయారు చేస్తాము ఆవాలు కుడా మేమే కడిగి ఆరబెట్టి పిండి పడతాము*

 మావోద్ద తయారు చేయు పచ్చళ్ళు పొడులలో వెల్లుల్లి

వాడము వెల్లుల్లి కావాలి అనుకున్నవాళ్లకు వల్లవరకు వాళ్లకుకేవలసిన విధంగా తయారు చేసి ఇవ్వగలము*


*వడియాలు* & *వొరుగులు *అప్పడాలు*:

ఆవిరి వడియాలు 550/-

సగ్గుబియ్యం వడియాలు  600/-

పెసర అప్పడాలు       100pices - 650/-

మినప అప్పడాలు 100p 650/-

మిర్చి 1kg 1050/-

గుమ్మడి వొడియలు 1150/-

పేలవొడియాలు 600/-

మినపిండి వోడియలు 650/-

చిట్టెంటపోటు kg 1250/-


*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు*

*చార్జీలు అదనం*


*దయచేసిమీకుతెలిసిన

బ్రాహ్మణ గ్రూపులలో

ఈ మెసేజ్ ని పంపవలసినదిగా

కోరుకుంటున్నాము* 🙏


*వివరములకు సంప్రదించండి*

*పుచ్చ పల్లవి*

*గౌతమస గోత్రం*

*విజయవాడ*

*7981370664*

*0866‌ 2533848*

*షష్ఠ స్కంధం

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*షష్ఠ స్కంధం*


*కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదారవింద జా*

*నంద మరందపాన కలనా రత షట్పదచిత్తు లౌచు, గో*

*వింద పరాయణుల్ విమలవేషులు దోష మడంతు రాత్మలం*

*జెందిన భక్తిచేత రవి చేకొని మంచు నడంచుకై వడిన్.*


రాజా ! లోకంలో కొందరు సర్వకాలాలలో పుణ్యకార్యాలే చేస్తూ ఉంటారు. వారి నడవడి అంతా పవిత్రంగానే ఉంటుంది. వారు గోపకుమారుడున్నాడే! అదేనయ్యా కృష్ణయ్య! ఆయన పాదాలను పద్మాలుగా భావించి అందునుండి జాలువారే ఆనందం అనే మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ స్థితిలో వారి హృదయం తుమ్మెదవంటిదవుతుంది. ఆ విధంగా గోవిందుడే పరమగతి అన్నభావనలో నిశ్చలంగా ఉండే భక్తులు స్వచ్ఛమైన వేషం తాల్చి పాపాలను పటాపంచలు చేసుకుంటారు. వారి ఆత్మలలో చక్కగా కుదురుకొన్న భక్తిచేత, సూర్యుడు మంచును అణచివేసినట్లుగా, పాపాలను బాపుకుంటారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

లక్ష్మీగణపతి

 ప్ర: 'లక్ష్మీగణపతి' అంటే ఏమిటి? లక్ష్మి విష్ణువు పత్ని కదా. గణపతితో ఉన్న లక్ష్మి ఎవరు?


జ: ఆ లక్ష్మి వేరు. ఈ లక్ష్మి వేరు. ఇవన్నీ మంత్రశాస్త్ర విషయాలు. ఉపాసనా రహస్యాలు. 'లక్ష్మి' అంటే గ్రహణ శక్తి. ప్రతి దేవతకీ ఆ దేవతాశక్తే లక్ష్మి. ఐశ్వర్యమే లక్ష్మి. ఆ దైవం యొక్క శక్తే. ఆ దైవానికి ఐశ్వర్యం. కాబట్టి ఆ దైవశక్తిని 'లక్ష్మీ' అన్నారు. విష్ణుపత్ని లక్ష్మికీ, గణపతిశక్తి లక్ష్మికీ భేదం ఉంది. వీటిని పౌరాణికంగా వ్యాఖ్యానించనవసరం లేదు. మంత్రోపాసనలో భాగాలివి. ఉపాస్య దైవంలో సర్వ దేవతా శక్తులూ ఉంటాయి. ఆ విధంగా పరాశక్తి 'లక్ష్మి' పేరుతోనున్న గౌరిగా శివాంకంలో ఉన్నట్లు తంత్ర శాస్త్రం వర్ణిస్తోంది.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం -‌ పంచమి - భరణీ -‌‌ గురు వాసరే* (14.03.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ప్రసాద సుధాకరం..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు..


*ప్రసాద సుధాకరం..*


దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రిందట... అప్పుడప్పుడే..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో ఒక్కొక్క వ్యవస్థా రూపుదిద్దుకుంటోంది..


ఆదివారం నాడు, శ్రీ స్వామి వారికి ప్రభాత పూజ, హారతి అయిన తరువాత, భక్తులకు ప్రసాద వితరణ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన తో ఉన్నాము..ప్రసాదంగా చేయించిన పదార్ధాన్ని, అందరికీ అందే విధంగా పంచే వ్యక్తి ఎవరు? ఇదొక ప్రశ్న మా ముందు నిలిచింది..ఎందుకంటే, ఆనాటికి ఆలయ సిబ్బంది గా ఉన్నది ముగ్గురే..టిక్కెట్లు, క్యూ లైన్, ఆలయ పరిశుభ్రత, అన్నీ వాళ్లే చూసుకోవాలి..


అప్పుడు వచ్చాడు సుధాకర్!..18, 19 ఏళ్ల వయసు, చిరునవ్వు..ప్రతి శుక్రవారం, సాయంత్రానికి మొగలిచెర్ల వచ్చి..రాత్రికి మాలకొండ చేరి, శనివారం ఉదయం నుంచీ, సాయంత్రం దాకా ఆ మాలకొండ లో వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహుడి సన్నిధిలో ప్రసాద వితరణ లో,అన్నదాన సత్రంలో స్వచ్ఛందంగా సేవ చేసి, తిరిగి రాత్రికి మొగలిచెర్ల చేరుతున్నాడు.. 


అతనిని గమనించిన నాకు ఆదివారం పూట ప్రసాదం వితరణకు మాకు పరిష్కారం దొరికింది అని అనిపించింది...ఆమాటే అడిగాను..సంతోషంగా ఒప్పుకున్నాడు..సహజంగా ఆదివారం ఉదయం పూట భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది..ఎవ్వరినీ విసుక్కోకుండా ప్రసాద వితరణ చేయాలి..ఈ సుధాకర్ లో ఉన్న సుగుణం ఏమిటంటే..ఎంత మంది వచ్చినా , ముఖంలో అదే చిరునవ్వు!..ఎవరైనా ప్రసాదం కోసం రెండు మూడు సార్లు వచ్చినా..విసుక్కోకుండా పెడతాడు..మా సిబ్బంది లో ఎవరైనా.."అలా పెడితే, ప్రసాదం అయిపోయి చివరలో కొంతమందికి అందదు కదా? " అంటే.."పోనీలే, ఆకలితో ఉన్నట్టున్నాడు!" అంటూ నవ్వేస్తాడు..భక్తులకు పెట్టె ప్రసాదాన్ని తానే దగ్గరుండి ఆలయం లోకి తెప్పించుకుంటాడు..అర్చక స్వామి ఆ ప్రసాదాన్ని శ్రీ స్వామివారికి నివేదన చేసిన తరువాత..ముందుగా అర్చకస్వాముల కొరకు భక్తి పూర్వకంగా ప్రత్యేకంగా కేటాయించి ఇస్తాడు..ఆ తరువాత భక్తులకు పంచిపెడతాడు..


ఆ దత్తుడు చూపిన మార్గం వీడు అనుకున్నాన్నేను..ఆరోజు నుంచీ నేటి వరకూ.. ఆదివారమే కాదు, వేలాదిమంది భక్తులోచ్చే మహాశివరాత్రి రోజు కానీ..స్వామి వారి ఆరాధానోత్సవాల్లో కానీ..సుధాకర్ దే ప్రసాదవితరణ బాధ్యత!..


వారంలో ఐదు రోజులు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయప్పనులు, రెండు రోజులు దైవ సేవ..ఇదీ స్థూలంగా సుధాకర్ దినచర్య..శ్రీ మాల్యాద్రి లక్ష్మీనృసింహ స్వామికి పరమ భక్తుడు..ఇప్పటికీ వివాహం చేసుకోలేదు.. పెళ్లి గురించి అడిగితే.."ఆ నరసింహ స్వామి గుడి, ఇక్కడే..ఈ దత్తాత్రేయుడి ప్రాంగణం లోనే కట్టించి, ఆ స్వామి కళ్యాణం ఆ గుడిలో చేయించి, తరువాత చేసుకుంటాను!" అంటాడీ ముప్పైఒక్క ఏళ్ల సుధాకర్!..


ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలం, విప్పగుంట లో నివాసం ఉండే ఈ సుధాకర్....తక్కువలో తక్కువ... ఓ ఐదారు కోట్ల రూపాయల ఆస్తికి ఏకైక వారసుడు!..


ఏ కార్యక్రమానికి ఎవరు సరిగ్గా సరిపోతారో..అటువంటి వ్యక్తులనే ఎంపిక చేసుకోవాలనే విషయం..మాకంటే బాగా ఆ సమాధి లో కూర్చున్న అవధూత దత్తాత్రేయుడి కే చక్కగా తెలుసు!! 


సర్వం..

శ్రీ దత్త కృప!


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*15-03-2024 / శుక్రవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

మేషం


మాతృ వర్గ బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

---------------------------------------

వృషభం


ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

మిధునం


బంధువులు, మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు అధికమవుతాయి. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం అవుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.

---------------------------------------

కర్కాటకం


స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహమున సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

సింహం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. బందు మిత్రులతో మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

---------------------------------------

కన్య


ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దీర్ఘ కాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

తుల


విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

---------------------------------------

వృశ్చికం


మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబంలో వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

---------------------------------------

ధనస్సు


చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఎంతో శ్రమపడ్డారు ఫలితం కనిపించదు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

---------------------------------------

మకరం


సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. గృహమును కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

కుంభం


 ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

--------------------------------------

మీనం


ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగయత్నాలు మీరు చాలా వస్తాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 51*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*కర్మజం బుద్ధియుక్తా హి* 

*ఫలం త్వక్త్వా మనీషిణః ।*

*జన్మబంధవినిర్ముక్తాః పదం*

*గచ్ఛంత్యనామయమ్ ।।*


*భావము:* 

జ్ఞానులు, సమత్వ బుద్ది కలిగి ఉండి, జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార-ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి భావన తో పని చేయటం వలన దుఃఖరహితమైన స్థితిని పొందెదరు.


*వివరణ:*  

ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని, అది వ్యక్తిని బాధా రహిత స్థితికి చేరుస్తుందని శ్రీ కృష్ణుడు మరింత విశదపరుచుతున్నాడు. జీవితంలో వైరుద్ధ్యము ఎలా ఉంటుందంటే, మనము సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ దుఃఖమే అందుతుంది, ప్రేమ కోసం తపిస్తాము కాని నిరాశే ఎదురవుతుంది, జీవించాలని కోరుకుంటాము కానీ మరణం వైపుగా ప్రతిక్షణం అడుగులేస్తుంటాము. భాగవతంలో ఇలా చెప్పబడింది.


సుఖాయ కర్మాణి కరోతి లోకో న తైస్సుఖం వాన్యదుపారమం వా

విందేత భూయాస్తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః (3.5.2)


"ప్రతి ఒక్క వ్యక్తీ ఆనందం కోసం కామ్య కర్మలను చేస్తూనే ఉంటాడు, కానీ తృప్తి లభించదు. సరికదా ఈ పనులు ఇంకా దుఃఖములు కలుగ చెస్తాయి."


ఈ కారణంగా, ప్రతి ఒక్కరూ ఈ లోకంలో దుఃఖితులై ఉన్నారు. కొంతమంది తమ శారీరిక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు; మరికొందరు తమ స్వజనులు, బంధువులచే బాధింపబడుతున్నారు; మరికొందరు నిత్యావసరాల కోసం కూడా దరిద్రంతో బాధ పడుతున్నారు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి, తాము సంతోషంగా లేము అని తెలుసు, కానీ తమ కన్నా ఎక్కువ ఉన్నవారు సంతోషంగా ఉన్నారు అనుకోని భౌతిక ప్రగతి కోసం ఇంకా పరుగులు తీస్తున్నారు. ఈ గుడ్డి అన్వేషణ ఎన్నో జన్మ ల నుండీ సాగుతూనే ఉంది కానీ ఎక్కడా ఆనందం కనిపించటం లేదు. ఇప్పుడు లోకులు కామ్య కర్మల ద్వారా ఎవరూ ఆనందాన్ని పొందలేరు అని తెలుసుకుంటే, అప్పుడు వారు పరుగులు పెట్టే దిశ నిరర్థకమైనదని అర్థం చెసుకుని, ఆధ్యాత్మిక జీవనం వైపు తమ తమ జీవితాన్ని తిప్పుకునేందుకు ఆలోచిస్తారు.


ఆధ్యాత్మిక జ్ఞానం లో ధృఢమైన సంకల్పం కలవారు భగవంతుడే సర్వ కార్య ఫలములకు భోక్త అని తెలుసుకుంటారు. ఆ కారణంగా వారు తమ కర్మ ఫలములపై మమకారం విడిచిపెట్టి, అంతా భగవంతునికి సమర్పించి, ప్రశాంత చిత్తంతో అన్నిటినీ ఈశ్వర ప్రసాదం (అనుగ్రహం) లా స్వీకరిస్తారు. ఈ విధంగా చేయటం వలన వారి పనులు జీవన్మరణ చక్రం లో పడవేసే కర్మ బంధాలను కలుగ చేయవు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 55*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 160*


*అన్నము తినువేళ నాత్మరుచుల గోరు*

*టదియు నాల్క సెప్ప నడుగు మనసు*

*నాత్మకు దృణమైన నయ్యయ్యో యనరాదు*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అన్నము తినేవేళ , నాలిక రుచులుకోరును మనసు తృప్తి చెందునట్లు భోజనము చేయవలెను.

అన్నం పొట్టలో ప్రవేశించిన తరువాత ఆత్మ ఏ రుచులను కోరదు గదా !


*💥వేమన పద్యాలు -- 161*


*అన్నము నమృతమును నంటు నంటనుచును*

*బరిహరింత్రు దెలియ బడక ద్విజులు*

*యన్నమమృత మివియ హరిహర బ్రహ్మలు*

*యంటవన్న వాని కంటు వేమా !*


*🌹తాత్పర్యము --*

బ్రాహ్మణులు అన్నమును అమృతమని అంటూంటారు.

అన్నము అమృతము , హరిహర బ్రహ్మస్వరూపమని తెలియలేరు.


*💥వేమన పద్యాలు -- 162*


*అన్నయనగ నెవరొ యది తెలియగజూడ*

*తనకు ముందు బుట్టి తనరు చుండె*

*యన్నవంటివాడు హరుడౌను గురుడౌను*

*మిన్ను మన్ను మాడ్కి మెరయు వేమా !*


*🌹తాత్పర్యము --*

తనకు ముందు పుట్టినవాడే అన్న , ఆ అన్నయే హరుడును , గురుడని తెలియుము.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*షష్ఠ స్కంధం*


*కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదారవింద జా*

*నంద మరందపాన కలనా రత షట్పదచిత్తు లౌచు, గో*

*వింద పరాయణుల్ విమలవేషులు దోష మడంతు రాత్మలం*

*జెందిన భక్తిచేత రవి చేకొని మంచు నడంచుకై వడిన్.*


రాజా ! లోకంలో కొందరు సర్వకాలాలలో పుణ్యకార్యాలే చేస్తూ ఉంటారు. వారి నడవడి అంతా పవిత్రంగానే ఉంటుంది. వారు గోపకుమారుడున్నాడే! అదేనయ్యా కృష్ణయ్య! ఆయన పాదాలను పద్మాలుగా భావించి అందునుండి జాలువారే ఆనందం అనే మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ స్థితిలో వారి హృదయం తుమ్మెదవంటిదవుతుంది. ఆ విధంగా గోవిందుడే పరమగతి అన్నభావనలో నిశ్చలంగా ఉండే భక్తులు స్వచ్ఛమైన వేషం తాల్చి పాపాలను పటాపంచలు చేసుకుంటారు. వారి ఆత్మలలో చక్కగా కుదురుకొన్న భక్తిచేత, సూర్యుడు మంచును అణచివేసినట్లుగా, పాపాలను బాపుకుంటారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

కరక్కాయ

 కరక్కాయ గురించి సంపూర్ణ వివరణ - 


 తెలుగు - కరక్కాయ . 


 సంస్కృతం - హరీతకి . 


 హింది - హరడ్ . 


 లాటిన్ - TERMINALIA CHIBULA . 


 కుటుంబము - COMBRETACEAE . 


 గుణగణాలు - 


     కరక్కాయ లవణరస వర్జితముగా , అయిదు రసములు గలదిగా , రూక్షముగా , వేడిగా , జఠరదీపనముగా , బుద్ధిబలమును ఇచ్చునదిగా , మధురపక్వముగా , ఆయురారోగ్యాలను ఇచ్చునదిగా , నేత్రములకు హితవుగా , తేలికగా , ఆయువును పెంపొందించునదిగా , ధాతువృద్ధిగా , వాయువును కిందకి వెడలించునదిగా ఉండును. మరియు శ్వాసను , దగ్గును , ప్రమేహమును , మొలలను , కుష్టును , నంజును , ఉదరమును , క్రిమిని , స్వరభంగమును , గ్రహిణిని , మలబద్ధకమును , విషజ్వరమును , గుల్మమును , కడుపుబ్బరం , దాహము , వాంతిని , ఎక్కిళ్ళను , దురదను , హృదయరోగమును , కామెర్లను , శూలను , ప్లీహారోగమును , అనాహమును , కాలేయవ్యాధిని , శిలామేహమును , మూత్రకృచ్చ రోగమును , మూత్రఘాత రోగమును నాశనం చేయును . 


           కరక్కాయ పులుసు రసం కలిగి ఉండుటచే వాతాన్ని హరించును . తీపి , చేదురసం కలిగి ఉండటం చేత పిత్తాన్ని హరించును . రూక్షత్వం ,వగరు రసం కలదగుట చేత కఫాన్ని హరించును . ఈ విధముగా కరక్కాయ త్రిదోషహరమైనది. 


        కరక్కాయను వర్షఋతువు నందు సైన్ధవ లవణము చేర్చి , శరదృతువు యందు పంచదార చేర్చి , హేమంత ఋతువు నందు శొంఠిని చేర్చి శిశిర ఋతువు నందు పిప్పలిని చేర్చి , వసంత ఋతువు నందు తేనెని చేర్చి , గ్రీష్మఋతువు నందు బెల్లమును చేర్చి భక్షించవలెను. కరక్కాయను భోజనానంతరం భక్షించినను పథ్యకరమైనది . మరియు భోజనం జీర్ణం అయిన తరువాతను , అజీర్ణసమస్య ఉన్నప్పుడును పుచ్చుకోవచ్చు. 


  రూప లక్షణాలు - 


     కరక్కాయ మొత్తం 7 రకాలుగా కలదు. అవి 


             * విజయా . 


             * రోహిణీ . 


             * పూతన . 


             * అమృతా . 


             * అభయా . 


             * జీవంతి . 


             * చేతకీ . 


      అని మొత్తం 7 జాతులుగా ఉండును. ఇప్పుడు మీకు వీటి గురించి సంపూర్ణముగ వివరిస్తాను. 


        విజయా కరక్కాయ వింధ్య పర్వతం పైన పుడుతుంది. చేతకీ కరక్కాయ హిమాలయ పర్వతాలపైన పుట్టుచున్నది. పూతన కరక్కాయ సింధూనది ప్రాంతము నందు పుట్టుచున్నది . అమృత కరక్కాయ , అభయ కరక్కాయ చంపారణ్యం నందు పుట్టుచున్నది. రోహిణీ కరక్కాయ అన్ని స్థలముల యందు పుట్టుచున్నది. జీవంతి కరక్కాయ సౌరాష్ట్ర దేశము నందు పుట్టుచున్నది. 


                  సొరకాయ వలే పొడవుగా , గుండ్రముగా ఉండునది విజయా కరక్కాయ , కేవలం గుండ్రముగా ఉండునది రోహిణి కరక్కాయ , బీజము పెద్దదిగా ఉండి పై చర్మము పలుచగా ఉండునది పూతన కరక్కాయ , బీజములు చిన్నవిగా ఉండి పేడు మందముగా ఉండునది అమృత కరక్కాయ , అయిదు రేఖలు కలిగినది అభయ కరక్కాయ. బంగారు రంగుతో ఉండునది జీవంతి కరక్కాయ , మూడు రేఖలు కలిగినది చేతకీ కరక్కాయ . 


     విజయ కరక్కాయను సర్వరోగముల యందు ఉపయోగించదగినది. రోహిణి కరక్కాయను వ్రణము హరించుటకు ఉపయోగించదగినది . పూతన కరక్కాయ లేపనమందును , పైన పట్టు వేయుటకు ఉపయోగించతగినది. అమృత కరక్కాయ శోధనార్థం , విరేచనములు మొదలగు వానికి ఉపయోగించతగినది. అభయ కరక్కాయ నేత్రరోగములకు ఉపయోగించతగినది. , జీవంతి కరక్కాయ సర్వరోగములను హరించును . చేతకీ కరక్కాయ చూర్ణములకు ప్రశస్తమైనది. 


                కరక్కాయ మనుష్యులకు తల్లివలె హితము చేయును . తల్లికి ఒకప్పుడైనను కోపము కలిగి దండించును. కాని కడుపులో ప్రవేశించిన కరక్కాయ ( తినిన ) ఎప్పటికి హానిచేయదు . ఎల్లప్పుడూ మంచిచేయు గుణము కలిగినది . 


     చేతకీ కరక్కాయ తెలుపు రంగు , నలుపు రంగు బేధము వలన రెండు విధములుగా ఉండును. తెల్ల చేతకీ కరక్కాయ 6 అంగుళముల పొడవుగాను , నల్ల చేతకీ కరక్కాయ ఒక అంగుళము పొడవుగా ఉండును.  


           ఒక జాతి కరక్కాయ తినుట చేతను , ఇంకో జాతి కరక్కాయ వాసన చూసిన మాత్రం చేతను , మరొక జాతి కరక్కాయ ముట్టుకొనిన మాత్రమున , వేరొక జాతి కరక్కాయ చూచిన మాత్రమునే విరేచనం కలిగించును. ఈ ప్రకారం నాలుగు బేధముల విరేచన గుణములు కరక్కాయల యందు కలవు. 


              చేతకీ కరక్కాయ చెట్టు కింద ఏ మనుష్యులు కాని లేక పశు , పక్షి , మృగాదులు కాని తిరిగిన తక్షణం విరేచనములు అగును. చేతకీ కరక్కాయను హస్తము నందు ఎంతసేపు ఉంచుకొనునో అంతవరకు ఆ కరక్కాయ ప్రభావం వలన నిశ్చయముగా విరేచనములు అగుచుండును. చేతకీ కరక్కాయను సుకుమారులు , బలహీనులు , ఔషధము నందు ద్వేషము కలిగినవారు చేతిలో పట్టకూడదు. చేతకీ కరక్కాయ అత్యంత ప్రశస్తమైనది. సుఖవిరేచనం కలిగించుటకు హితకరం అయినది. 


             పైన చెప్పిన 7 జాతులలో విజయ కరక్కాయ ప్రధానం అయినది. ప్రయోగము నందు సుఖవిరేచనం ఇచ్చునది. సర్వరోగముల యందు ఉపయోగించతగినది. ఏ కరక్కాయ నూతనమైనది , జిగట కలిగినది . గొప్పది , గుండ్రనిది , బరువు కలిగినది . నీటిలో మునుగునదిగా ఉండునో ఆ కరక్కాయ ప్రశస్తమైనది. తూనిక నందు 2 తులములు తూగినది ప్రశస్తమైన కరక్కాయ . 


 ఔషధోపయొగాలు - 


 * కామెర్ల నివారణ కొరకు - 


        కరక్కాయ , తేనె , బెల్లం కలిపి తినిన కామెర్లు తగ్గును. 


 * కీళ్ళవాతము నివారణ కొరకు - 


        కరక్కాయ చూర్ణమును , ఆముదముతో కలిపి ప్రతినిత్యం వాడిన కీళ్లవాతం , గృదసీవాతం ( సయాటికా ) తగ్గును. 


 * క్రిమిరోగముల నివారణ కొరకు - 


         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో కలిపి వాడిన క్రిమిరోగాలు తొలగును . ఇది చక్కని విరేచనాన్ని కలుగచేయును . అర్శమొలల సమస్యతో ఇబ్బంది పడువారికి ఇది చాలా మంచిది . 


 * కడుపునొప్పి నివారణ కొరకు 


         కరక్కాయ చూర్ణము నందు బెబులిన్ కలదు. ఇది కడుపునొప్పిని తగ్గించును . 


 * చర్మరోగముల నివారణ కొరకు - 


         కరక్కాయ చూర్ణమును , గోమూత్రము నందు కలిపి తాగిన పామా , దద్రు మొదలగు చర్మరోగాలు తగ్గును. కరక్కాయను కాల్చి చూర్ణము చేసి ఆ చూర్ణముకు నువ్వులనూనె కలిపి రాసిన పురాణ వ్రణములు తగ్గును. 


 * విషమ జ్వరాల నివారణ కొరకు - 


         కరక్కాయను తేనెతో కలిపి వాడిన విషమ జ్వరాలు తొందరగా నయం అగును. 


 * ఆమ్ల పిత్తము నివారణ కొరకు - 


         కరక్కాయను ద్రాక్షతో కలిపి సేవించిన ఆమ్లపిత్తము నయం అగును. 


 * అర్శమొలల నివారణ కొరకు - 


          కరక్కాయ చూర్ణమును బెల్లముతో కలిపి ప్రతిరోజు సేవించిన అర్శమొలలు , మలబద్ధకం , వాత్తరక్తం శమించును . 


 * బరువు తగ్గుట కొరకు - 


         కరక్కాయ ప్రతినిత్యం వాడుచున్న బరువు తగ్గును. 


 * గోరుచుట్టు నివారణ కొరకు - 


        పసుపు రసమునకి కరక్కాయలను చేర్చి వాటిని బాగా దంచి మెత్తగా నూరి పైపూతగా రాయుచున్న గోరుచుట్టు తగ్గును. 


 * నీళ్ల విరేచనాల నివారణ కొరకు - 


         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో తాగుచున్న నీళ్ళవిరేచనాలు తగ్గును. 


 * రక్తస్రావ నివారణ కొరకు - 


        కరక్కాయ చూర్ణాన్ని అడ్డసరం రసంతో భావన చేసి ఎండబెట్టి ఆ చూర్ణమునకు పిప్పళ్లు , తేనె చేర్చి సేవించిన ఎంతపెద్ద రక్తస్రావం అయినను తగ్గును. 


 * శరీర బలం పెరుగుట కొరకు - 


         కరక్కాయలను నేతిలో వేయించుకుని తినుచున్న శరీరానికి మంచి బలం కలుగును. 


 * పాండురోగం నివారణ కొరకు - 


        కరక్కాయలను గోమూత్రము నందు వేసి మరిగించి తీసి పైపెచ్చు పొడిని చేసి దానిని 5 గ్రాముల మోతాదులో కొంచం ఆముదం కలిపి ప్రతినిత్యం ఉదయం సమయంలో పరగడుపున సేవించవలెను . దీనిని గోమూత్ర హరీతకీ అని అంటారు. దీనిని వాడటం వలన పాండురోగం , అధిక బరువు , వరిబీజం తగ్గును. 


 * చర్మ దళ కుష్టు నివారణ కొరకు - 


       20ml గోమూత్రము నందు 3 గ్రాముల కరక్కాయ చూర్ణము కలిపి తాగితే చర్మ దళ కుష్ఠు , కిటిభకుష్టు తగ్గును . ఇతర చర్మవ్యాధుల యందు కరక్కాయ పొడికి సమానం వేపాకు చూర్ణం కలిపి 1 స్పూన్ చొప్పున రెండుపూటలా తాగవలెను . 


 * గొంతు బొంగురు నివారణ కొరకు - 


       కరక్కాయ చూర్ణమునునకు పిప్పలి చూర్ణం లేదా శొంఠిచూర్ణం మరియు తేనె కలిపి లేహ్యముగా చేసి అరస్పూన్ చప్పరించి మింగుచున్న బొంగురుగొంతు , గొంతులో నస తగ్గును. 


 * దగ్గు నివారణ కొరకు - 


        కరక్కాయ పెచ్చును నోటిలో ఉంచుకుని రసము మింగుచున్న కొండనాలుక , దగ్గు , గొంతు వొరుచుకొనుట , పొడిదగ్గు తగ్గును. 


 * తలనొప్పి నివారణ కొరకు - 


        కరక్కాయ గింజలతో నుదుటి పైన పట్టువేసిన తలనొప్పి తగ్గును. 


 * కండ్ల ఎరుపు నివారణ కొరకు - 


         కరక్కాయ , కాచు సమాన భాగాలుగా తీసుకుని నీటితో నూరి కండ్లపైన గుడ్డ వేయవలెను . కండ్ల ఎరుపులు తగ్గును. 


 * ఎక్కిళ్లు నివారణ కొరకు - 


       గోరువెచ్చని నీళ్లతో కరక్కాయ చూర్ణం కలిపి ఇచ్చిన ఎక్కిళ్ళు కట్టును . 


 * ఉదరరోగ నివారణ కొరకు - 


       ఉదయం మరియు సాయంత్రం ఒక్కొక్క కరక్కాయ చొప్పున 2 నెలలపాటు తినుచుండిన ఎటువంటి ఉదరరోగం అయినను తగ్గిపోవును. 


 * ఆహారం జీర్ణం అగుటకు - 


       వేడినీటితో కరక్కాయ చూర్ణం కలిపి తాగిన తినిన ఆహారం సరిగ్గా అరగకుండా ఉన్న సమస్యని తొలగించి ఆహారాన్ని జీర్ణం చేయును . 


 * కఫజ్వర నివారణ కొరకు - 


       గోమూత్రంలో కరక్కాయలు భావన చేసి తినిన కఫసంబంధ దోషం వలన వచ్చు జ్వరం నివారణ అగును. 


 * వాంతుల నివారణ కొరకు - 


        కరక చూర్ణం తేనెతో సేవించిన వాంతులు తగ్గును. 


 * కఫ సంబంధ బోదకాలు నివారణ కొరకు - 


       కరక్కాయ ముద్దను గోమూత్రముతో కలిపి తాగిన బోదకాలు నివారణ అగును. 


 * గుల్మ నివారణ కొరకు -  


        కరక్కాయ చూర్ణం బెల్లముతో కలిపి తినుచున్న గుల్మరోగం నివారణ అగును. 


 * రక్తపిత్త రోగ నివారణ కొరకు - 


        అడ్డసరం రసములో 7 సార్లు భావన చేసిన కరక్కాయను నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకుని కొంచం పిప్పలి చూర్ణం కలిపి తేనెతో సేవించిన అసాధ్యమగు రక్తపిత్తం తగ్గును. 


 * ఉబ్బురోగం నివారణ కొరకు - 


     బెల్లం మరియు కరక్కాయ సమానంగా కలిపి తీసుకొనుచున్న ఉబ్బురోగములు తగ్గును. 


 * వాతరక్త వ్యాధి నివారణ కొరకు - 


     5 కరక్కాయలు బాగుగా నమిలి మింగి తిప్పతీగ కషాయం తాగిన వాతరక్తం తగ్గును.


 * అండవృద్ధి నివారణ కొరకు - 


        గోమూత్రము నందు భావన చేసిన కరక్కాయను ఆముదము నందు వేయించి వేడినీటి అనుపానంగా సేవించిన అండవృద్ధి హరించును . 


 * నేత్రరోగ నివారణ కొరకు - 


        కరక్కాయ ఆవునేతితో ఉడికించి అది కంటిపైన వేసి కట్టు కట్టుచున్న నేత్ర దోషాలు నివారణ అగును. 


 * పిల్లల కోరింత దగ్గు నివారణ కొరకు - 


       కరకపువ్వు 1 భాగము , వేయించిన పిప్పళ్లు 1/2 భాగము , ఎండిన ఉస్తిపండ్లు 1/4 భాగము తీసుకుని వీటన్నింటిని మెత్తగా చూర్ణం చేసి మూడు గురిగింజలంత చూర్ణము 2 గంటలకి ఒక పర్యాయము తేనెతో నాకించుచుండిన కోరింత దగ్గులు తగ్గును. కరకపువ్వు చూర్ణం కూడా వాడవచ్చును . 


  గమనిక - 


           అతిగా నడచినవాళ్లు , బలహీన శరీరం కలవాళ్ళు , చిక్కిన శరీరం కలవాళ్లు , ఉపవాసం వలన బలహీనపడిన వారు , శరీరం నందు అమిత వేడి కలిగినవారు , గర్భవతులు , రక్తం తీయబడిన వారు , రక్తస్రావం వలన ఇబ్బందిపడేవారు , హనుస్థంభ వాత రోగులు కరక్కాయను వాడరాదు. 


  పైన చెప్పినంత వివరణగా ఒక్కో మొక్క గురించి అత్యంత వివరణాత్మకంగా నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణ విశ్లేషణ ఇచ్చాను .


 

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034