29, మే 2024, బుధవారం

పుట లెన్నో కలిసికదా

 *పుట లెన్నో కలిసికదా పుస్తకమయ్యేది,

పూటలన్నీ కలసిగదా 

కాలం విలువ తెలిసేది,

తొలి పుట చదవకుండా, మధ్య పేజీ తిరగెయ్యకనే,

 చివరపేజీ కొసమెరుపు కావాలంటే , కాలం మలుపులు

కర్తవ్యం కాంతులవ్వాలి.

డా.వేదుల శ్రీరామశర్మ

బుధవారం, మే 29, 2024*

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*బుధవారం, మే 29, 2024*

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

     *వైశాఖ మాసం - బహళ పక్షం*   

🔔తిథి     : *షష్ఠి* మ1.16 వరకు

🔯వారం   : *బుధవారం* (సౌమ్యవాసరే )

⭐నక్షత్రం  : *శ్రవణం* ఉ8.40 వరకు

✳️యోగం : *ఐంద్రం* రా11.43 వరకు

🖐️కరణం  : *వణిజ* మ1.16 వరకు

            తదుపరి *విష్ఠి* రా12.11 వరకు

😈వర్జ్యం   :   *మ12.26 - 1.57*

💀దుర్ముహూర్తము : *ఉ11.31 - 12.23* 

🥛అమృతకాలం    :  *రా9.30 - 11.01*  

👽రాహుకాలం       : *మ12.00 - 1.30*

👺యమగండ/కేతుకాలం : *ఉ7.30 - 9.00*

🌞సూర్యరాశి: *వృషభం* || 🌝చంద్రరాశి: *మకరం*

🌅సూర్యోదయం: *5.5.29* || 🌄సూర్యాస్తమయం:*6.25*

సర్వేజనా సుఖినో భవంతు 

ఇరగవరపు రాధాకృష్ణ🙏

ఇంజనీరింగ్ విద్య

 అన్ని గ్రూప్ లకు  పంపించండి 

తెలియనివాళ్ళు తెలుసుకొని జాయిన్ అవుతారు.

ఉచిత రెసిడెన్సియల్.

ఇంజనీరింగ్ విద్య (B.Tech). 

KLR COLLEGE OF ENGG AND TECH AUTONOMOUS, PALAWANCHA,

BHADRADRI KOTHAGUDEM.


NBA ACCREDITED AND AUTONOMOUS COLLEGE ONE AND ONLY IN BHADRADRI AND KHAMMAM DISTRICTS


CSE - 120  seats

CSM(AIMl) - 60 seats

CSD(DS) - 60 seats

IT - 60 seats

EEE - 60 seats

ECE - 60 seats

MECH - 30 seats

MIN - 30 seats

CIVIL - 30 seats


ఇంజనీరింగ్ విద్యలోచదవాలని ఆసక్తి ఉన్న SC,ST,BC,EBC,MINORITY దూరప్రాంత లో ఉన్న పేద విద్యార్థులకు ఉచితభోజనము మరియు ఉచిత బోర్డింగు సదుపాయ అవకాశం కల్పిస్తూ ఎన్నో వేల మంది విద్యార్థినీవిద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ  TELANGANA టాప్ 10 కాలేజీ లో ఒకటిగా నిలిచిన ఏకైక కాలేజ్ KLR  COLLEGE OF ENGG AND TECH Basavatharaka colony, bhadradri kothagudem, Palwancha

EAMCET CODE: KLRT

ట్రైన్ సదుపాయం కొత్తగూడెం కు కలదు 

ఇంజనీరింగ్ చదవాలని ఆసక్తి వుండి ఆర్థికంగా వెనుకబడిన  వారికి తెలియజేయండి.


2024 EAMCET అప్లై చేసిన - రాసిన వారికి 


Free education  

వివరాలకు:

Cell : 9440613393

          8790102503

          9603511111

          9490756760

          7989388534


 ముఖ్య గమనిక: 

నో హాస్టల్ ఫీజు నో కాలేజ్ ఫీజు.

ఎన్నో అవసరం లేని  మెసేజ్లు గ్రూవ్ప్ నందు పెడుతుంటాం . ఈ ఒక్క మెసెజ్ ని మీకు తెలిసిన గ్రూప్ నందు గని ,మీ మిత్రులకు గని ,మీ బందువులకు గాని షేర్ చెయ్యండి🙏🏼🙏🏼

పేద విద్యార్దులకు సహాయంచేయండి.🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం  -‌ షష్ఠి  - శ్రవణం -‌‌ సౌమ్య వాసరే* (29.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కంచికామకోటి ఘటికస్థానం*

 *శ్రీ చంద్రశేఖర విశ్వ మహా విద్యాలయం (దీమ్డ్ యూనివర్సిటీ). కాంచీపురం.*


జూన్ 2 వ తేదీన విజయవాడలో బందరు రోడ్ లో గల లబ్బిపేట వేంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 4 గంటలవరకు యూనివర్సిటీ వారి స్పాట్ అడ్మిషన్లు జరుగును. కావున ఈ సమాచారం మీ తోటి విద్యార్థిని విద్యార్థుల కు పంపించండి.... ఎందువలన అంటే.....


కంచి యూనివర్సిటీ లో


డోనేషన్లు లేవు

మేనేజ్మెంట్ కోటా సీట్లు లేవు

మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ లు కలవు

చక్కని హాస్టల్ వసతి

UGC అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అతి తక్కువ ఫీజులు.

ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ/శిక్షణ.


అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్/యూనివర్సిటీ ల లాగానే అన్ని కోర్సులు అందుబాటులో..


ముఖ్యంగా ఈ యూనివర్సిటీ గురించి ఎక్కడా వ్యాపార ప్రకటనలు ఉండవు. ఇది స్వామీజీ వారి ఆజ్ఞ. విద్యని వ్యాపార దృష్టితో చూడకూడదు అని వారి భావన. విద్యార్థులకు ఉన్నత ప్రమాణ విద్య అందించి వారి సామర్ధ్యాలను అనుసరించి మంచి ప్లేస్మెంట్స్ ఇప్పించడమే కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ  స్వామీజీ వారి లక్ష్యం.


*ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఈ యూనివర్సిటీ లో అన్ని కులాలవారికి అడ్మిషన్లు ఇవ్వబడును.*


*ఇటువంటి సదావకాశం మీరు పొందడమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కూడా పొందేలా ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోండి. ఈ సమాచారం అందరికీ పంపించండి*


*స్పాట్ అడ్మిషన్ కొరకు తెచుకోవలసిన డాక్యుమెంట్లు 20 వ తేదీన తెలియచేయబడును.*


*మరిన్ని వివరాలకు*

*యామిజాల నరసింహ మూర్తి*

*చీఫ్ కో ఆర్డినేటర్*

*కంచికామకోటి ఘటికస్థానం*

*సెల్ 9912626900*

28, మే 2024, మంగళవారం

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

గుండెపోటు

 



* *గుండెపోటు ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి స్థానిక అల్లo ని మీ జేబులో వజ్రంలా ఉంచుకోండి. దాడి జరిగిన వెంటనే, పైన క్లిప్‌లో చూపిన విధంగా కూర్చుని అల్లం నమలండి. మీ కళ్లలో నీళ్లు వచ్చే వరకు నమలండి. అందరికీ షేర్ చేయండి. భాగస్వామ్యం ఒక జీవితాన్ని కాపాడుతుంది*

తేడా ఏమిటి?

 తేడా ఏమిటి?


కర్తవ్యం, బాధ్యత- అనే రెండు మాటలూ మనకు ఒకేలా వినిపిస్తాయి. అర్థాలు ఒకేలా తోస్తాయి. వాస్తవానికి ఆ రెండూ వేరు. విధి నిర్దేశించేవి కర్తవ్యాలు. కావాలని మనిషి నెత్తికెత్తుకొనేవి బాధ్యతలు. కాబట్టే కర్తవ్యాలకు ముగింపు(డిటాచ్ మెంటు) ఉంటుంది. బాధ్యతలకు కొనసాగింపు (అటాచ్మెంట్) ఉంటుంది. వివేక వంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు. తక్కినవారంతా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటారు. రామాయణంలోని ఇద్దరు మహర్షుల చర్యలను పరిశీ లిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది. రాముణ్ని ఓ ఇంటి వాణ్ని చేసింది- కన్నతండ్రి దశరథుడో, పిల్లనిచ్చిన జనకుడో కాదు. జాగ్ర త్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామి త్రుడు. అది ఆయనకు విధి నిర్దేశిం చిన కర్తవ్యం. ఆయన పుట్టుకకు లోకకల్యాణం, సీతారామకల్యాణం అనేవి రెండూ ప్రధాన లక్ష్యాలు. వీటిలో మొదటిది- రాముడి అవతార పరమార్ధంతో ముడివ డినది. రెండోది- ఆ పరమార్థం నెర వేరేందుకు కావలసిన శక్తిని సమ కూర్చినది. ఆ శక్తి పేరు సీతమ్మ. విశ్వామిత్రుడు తొలుత తాటక వధతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు. రాక్షసులతో వైరానికి నాంది పలికాడు. యాగ సంరక్షణ మనేది ఓ నెపం. అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడి వశం చేసేందుకు ఏర్ప డిన సన్నివేశం. రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమ కూర్చే ప్రయత్నం అది. యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు. మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకై అహల్యను పరిచయం చేశాడు. గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు. ఇదంతా ఆ ముని కర్తవ్యం

సీతారామకల్యాణం పూర్తవగానే రంగంలోంచి ఆయన నిష్క్రమించాడు. వారి సంసారం ఏ విధంగా నడుస్తోందో, రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం. అది రాముడి పని. రాక్షసుల రక్తాన్ని తోడేయడం, ఇక తానిచ్చిన అస్త్ర శస్త్రాలే చూసుకొంటాయి. పంట కోత పూర్తయ్యాక- ఇక కొడవలికి పనేమిటి? కర్తవ్యం ముగిసిందనే మాటకు, డిటాచ్మెంటు అనే భావానికి అసలైన అర్థం అదే!


రామరావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు. రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. మూడుసార్లు పారాయణ చేయించాడు. వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. తన ఉపదేశం ఫలించిందా లేదా, రాముడు తేరుకొని రావణాసురుణ్ని సంహరించాడా లేదా... వంటి సంశయాలు, కుతూహలాలు ఆ మహర్షికి లేనే లేవు. తాను నేర్పించిన గాండీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు. రాముడికి తాను ఉపదేశించిన మంత్ర శక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు. అంతవరకే వారి పని. కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోయారిద్దరూ!


పిల్లలను పెంచి పెద్ద చేయడం, సంస్కారాన్ని అలవరచడం, విద్యాబుద్ధులు నేర్పించడం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం. పెరిగి పెద్దయి వారివారి జీవితాల్లో స్థిర పడినా- ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం ఓ బలహీనత. తాము బతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కర్తవ్యం కాదు. దాని కొనసా గింపు. కర్తవ్యాలు సంతృప్తికి, బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి. ఆ తేడాను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి.


ఎర్రాప్రగడ రామకృష్ణ

Panchaag


 

అమ్మానాన్నలు

 రాత్రి భోజనాల తర్వాత ఒకటీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది . 


ఆమె పిల్లలు పడుకున్నారు!


భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.


చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది.


ఆ  ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!


"ఏమైంది? ఎందుకు  ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.


 నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.


"అయితే...?"


"ఇదిగో! ఈ చివరి  పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"


భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"


హెడ్డింగ్ ఇలా పెట్టాడు


💥నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.💥


అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రేమిస్తారు!


వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!!


నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!


అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్  చేతిలోకి తీసుకుని  జవాబిస్తారు!


కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...

నేను  ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!


వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!


వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు! 

అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!


అదే ఒకవేళ నాతో  మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే  ఫోన్ కి జవాబిస్తారు!


అమ్మానాన్నలు

స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!

ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!

దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!

దాన్ని చాలా ఇష్టపడుతారు!!

దానితో రిలాక్స్ అవుతుంటారు!!

దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!


దానిని ఎపుడు పనివాళ్ళకి అప్పగించరు


నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ ఒక్కగంట పనిచేయకపోతే చాలా కంగారుపడతారు హడావిడి చేస్తారు 


రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!

ఉదయం లేవగానే దాన్నే  చేతిలోకి తీసుకుంటారు!!


కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న  చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!! 


భార్య చదువుతుంటే... విన్న  భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...

"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.


"మన కొడుకు" అంది భార్య కన్నీరు కారుతుండగా!


వస్తువులను ఉపయోగించుకోవాలి!

బంధాలను ప్రేమించాలి!!


అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!......


#నీతి : ఎవరికి ఏం అర్ధమయితే అది 


శుభసాయంత్రం మాష్టారు 😊💐


#Courtesy #WhatsApp