18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

పాలు సేవించుట

 పాలు సేవించుట  వల్ల ఉపయోగాలు - సేవించువారు తీసుకోవలసిన జాగ్రత్తలు  -  


 

  పాలు సేవించుట వల్ల ఉపయోగాలు - 


   పాలు మధురంగా ఉండును. జిడ్డుని కలిగి ఉండును. వాతాన్ని , పిత్తాన్ని హరించును . శీతలం , అన్ని తత్వముల వారికి మంచిది . బలం కలుగజేయును . మేధస్సుకు మంచిది . ఆయువుని వృద్ది చేయును . బాలురు , వృద్ధులు, క్షీణించినవారు, ఆకలిచే కృశించిన వారు పాలు సేవించిన ఆరోగ్యం కలుగును.


              పాలు పితుకుతున్నప్పుడు వేడిగా ఉండు పాలు బలం , అమృత తుల్యంగా ఉండును. అలా కాకుండగా పితికిన తరువాత చల్లబడిన పాలు తాగినచో అనేక రోగాలు తెచ్చి పెట్టును. 


              పంచదార , పటికబెల్లం కలిపిన పాలు తాగినచో శుక్రం పెంచును.  బెల్లం కలిపిన పాలు తీసుకున్నచో మూత్రం బొట్లుబొట్లుగా పడు రోగంని నివారించును. పిత్తాన్ని , శ్లేష్మాన్ని పెంచును. రాత్రుల యందు పాలు తాగుచున్న యొడల అనేక దోషాలను పోగొట్టును . అలా పాలు సేవించాలి అనుకునేవారు భోజనం వేళకు , పాలు తాగు సమయానికి 2 గంటల వ్యవధి ఉండవలెను . భోజనం చేయకుండా పాలు తాగవచ్చు . పాలలో అన్నం కలిపి తినకూడదు.  అలా తినినచో " అజీర్ణం" కలుగును. రాత్రి నిద్రపట్టదు. 


  ప్రతిదినం పాలు తాగువారు పాటించవలసిన నియమనిబంధనలు  - 


 *  మంచి రంగు లేకుండా మంచి రుచి కలిగి ఉండని , పుల్లటి మరియు చెడు వాసన , గడ్డలుగా ఉన్న పాలను తాగరాదు.


 *  పాలతో ఎల్లపుడూ పంచదార మాత్రమే కలిపి వాడవలెను. లేనిచో పటికబెల్లం చూర్ణం కూడా వాడవచ్చు 


 *  పాలల్లో ఉప్పు కలిపి వాడరాదు.


 *  చేపల కూర తిని పాలు మరియు పాలపదార్థాలు తీసుకోరాదు . అలా తీసుకున్నచో తప్పక కుష్టువ్యాది కలుగును. 


 *  కొన్నిరకాల పుల్లటి వస్తువులు పాలతో చేరినపుడు విరుద్దముగా మారును . కావున పాలు తాగు సమయంలో కాని ఆ తరువాతనైనా పుల్లని వస్తువులను భుజించరాదు . 


 *  ఉలవలు , పరిగెలు , కొర్రలు, అనుములు , అడవి పెసలు మొదలైనవి పాలతో విరోధించును. కావున వీనిలో ఏ ఒక్కటి పాలతో కలిపి లోపలికి తీసుకోకూడదు . 


 *  అనుములు , మినుములు ముఖ్యంగా పాలతో విరోధించును.ఈ రెండు పదార్థాలకు సంబంధించిన ఆహారాలు తీసుకున్నప్పుడు పాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు . అనారోగ్యం కలుగును.


 *  ముల్లంగి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు పాలు వాడరాదు.


 * రాత్రుల యందు వేడివేడి గోధుమ చపాతీలు ఇగురు కూరలతో కాని , తీపి పదార్థాలతో కాని లేక పంచదారతోగాని కలిపి భుజించి కాచిన పాలలో పంచదార కలిపి తాగిన చక్కటి ఆరోగ్యం కలుగును. 


 *  పాలయందు వెన్న ఆవులు, గేదెలు తిను ఆహారం నుండి పుట్టును . చిట్టు , పచ్చగడ్డి , పత్తిగింజలు , మినపరొట్ట మెదలైనవి తినిన పశువుల పాలు శ్రేష్టము. పల్లపు ప్రదేశాలలో ఉండు పశువులు ఇచ్చు పాలకన్నా మెట్ట ప్రాంతాలలో ఉండు పశువులు ఇచ్చు పాలు శ్రేష్టం. 


 *  ఆవుపాలు గేదెపాలకన్నా శ్రేష్టమైనవి . గేదెపాలల్లో ఆవుపాలు కంటే మందంగా ఉండును. కారణం వెన్నశాతం ఎక్కువుగా ఉండటం అందువలన ఆలస్యముగా జీర్ణం అగును. గేదెపాలు నిద్రను కలుగజేయును. చలవ చేయును . 


 *  మేకపాలు కారం, చేదు రుచులు కలిగి ఉండును. ఆకులను తినుట చేతను కొద్దిగా నీరు తాగుటచేతను , ఎక్కువ దూరం నడుచుట వలన మేకపాలు అన్ని వ్యాధులను పొగొట్టును. ముఖ్యంగా రక్తపిత్తవ్యాధి అనగా నోటి నుండి రక్తం బయటకి వెలువడు వ్యాధి తగ్గును. క్షయరోగం , దగ్గు , జ్వరములను తగ్గించును .  చంటిబిడ్డలకు తల్లిపాల తరువాత మేకపాలు శ్రేష్టమైనవి . 


      

      

పంచాంగం 18.09.2026 Friday,

  ఈ రోజు పంచాంగం 18.09.2026 Friday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష సప్తమి తిథి భృగు వాసర జ్యేష్ఠ నక్షత్రం ప్రీతి యోగః వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 


శ్రాద్ధ తిథి : అష్టమి 


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము



బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ ।

ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ।। 11 ।।




ప్రతిపదార్థ:



 బలం — బలము; బల-వతాం — బలవంతులలో; చ — మరియు; అహం — నేను; కామ — కోరిక; రాగ — మోహము; వివర్జితమ్ — లేకుండా; ధర్మ-అవిరుద్ధః — ధర్మ విరుద్ధము కాని; భూతేషు — సర్వ భూతములలో; కామః — లైంగిక క్రియలు; అస్మి — నేను; భరత-ఋషభ — అర్జునా, భరతులలో శ్రేష్ఠుడా.



తాత్పర్యము:



భరత వంశీయులలో శ్రేష్ఠుడా, బలవంతులలో కామరాగరహితమైన బలము నేను. ధర్మ విరుద్ధముకాని, శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియలను నేనే.



వివరణ :



రాగము (మోహము) అనేది ఇంకా పొందని వస్తువుల కోసం ఉన్న కోరిక. అనురాగము/మమకారాసక్తి అంటే, ఒకసారి అనుభవించిన తరువాత, కోరుకున్న వస్తువు మరింత కావాలనే ఉద్వేగాన్ని రగిల్చే స్తబ్దముగా ఉండే మానసిక భావము. కాబట్టి శ్రీ కృష్ణుడు కామ-రాగ-వివర్జితం అంటే, ‘మోహము-అనురాగము లేకుండా’ అని అన్నప్పుడు, తన బలము యొక్క స్వభావం గురించి చెప్తున్నాడు. మనుష్యులకు తమ క్రమం తప్పకుండా, విరామం లేకుండా, తమ ధర్మములని ఆచరించటానికి కావలసిన బలాన్ని ఇచ్చే నిర్మలమైన, మహనీయమైన శక్తి స్వరూపం శ్రీ కృష్ణుడే.


నియమానుసార రహితంగా ఇంద్రియ సుఖాలకోసం చేసే లైంగిక కార్యకలాపాలు మృగప్రాయమైనవి. కానీ, గృహస్థాశ్రమంలో భాగంగా, ధర్మ విరుద్ధం కాకుండా, సంతానం కోసమే అయితే అది శాస్త్ర అనుగుణంగా ఉన్నట్టే. ఇటువంటి ధర్మబద్ధమైన, నియంత్రణ లో ఉన్న, వైవాహిక సంబంధం లోబడి ఉన్న లైంగిక కార్యము, తానే అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

17, సెప్టెంబర్ 2026, గురువారం

హనుమాన్ బాహుక్*🙏

 *🪷బృహస్పతివారం 17 సెప్టెంబర్ 2026🪷*


**🙏🌹*హనుమాన్ బాహుక్*🙏🌹 

              *🌷ఆరవ రోజు🌷*


గోపద పయోధి కరి హోలికా జ్యోం లాఈ లంక 

నిపట నిసంక పరపుర గలబల భో ।

ద్రోన - సో పహార లియో ఖ్యాల హీ ఉఖారి కర 

కందుక - జ్యోం కపిఖేల బేల కైసో ఫల భో ॥ 

సంకటసమాజ అసమంజస భోరామరాజ, 

కాజ జుగ - పూగనికో కరతల ఫల భో ! 

సాహసీ సమత్థ తులసీకో నాహ జాకీ బాఁహ 

లోకపాల పాలనకో ఫిర థిర థలభో ॥


ప్రతిపదార్థం (పదాల వారీగా అర్థం)


* **గోపద పయోధి కరి:** ఆవు అడుగు ముద్రలో ఉండే కొద్దిపాటి నీళ్ల లాగా (గోష్పదం లాగా) సముద్రాన్ని (పయోధి) దాటినవాడు.

* **హోలికా జ్యోం లాఈ లంక:** లంకా దహనాన్ని ఒక చిన్న హోలీ పండుగ ఆటలాగా చేసినవాడు.

* **నిపట నిసంక:** ఏమాత్రం భయం లేనివాడై (పూర్తి నిశ్శంకతో).

* **పరపుర గలబల భో:** శత్రువుల నగరమైన లంకలో అలజడి మరియు కలకలం (గలబల) సృష్టించినవాడు.

* **ద్రోన - సో పహార లియో:** ద్రోణాచలం లాంటి భారీ పర్వతాన్ని సైతం.

* **ఖ్యాల హీ ఉఖారి కర:** ఒక ఆటలాగా (లీలగా) చేతులతో పెకిలించి (ఉఖారి కర).

* **కందుక - జ్యోం:** ఒక ఆట బంతి లాగా (కందుకం లాగా).

* **కపిఖేల బేల కైసో ఫల భో:** ఆ వానర వీరుడు (హనుమ) ఒక వెలగపండుతో ఆడుకున్నట్లుగా ఆ కొండను సులువుగా మోసుకొచ్చాడు.

* **సంకటసమాజ అసమంజస భో:** రామ లక్ష్మణులకు, వానర సేనకు సంకటాలు (గండాలు) ఎదురై, ఏం చేయాలో పాలుపోని అలికిడి, సందిగ్ధత (అసమంజస) నెలకొన్నప్పుడు.

* **రామరాజ కాజ:** శ్రీరాముని కార్యాలను (రామరాజ్య స్థాపన వైపుగా).

* **జుగ - పూగనికో:** యుగయుగాల వరకు నిలిచిపోయేలా.

* **కరతల ఫల భో:** చేతిలోని అరటిపండు వలె (హస్తామలకంలా) సులభంగా సాధ్యం చేశాడు.

* **సాహసీ సమత్థ:** అత్యంత సాహసవంతుడు, సర్వసమర్థుడు.

* **తులసీకో నాహ:** తులసీదాసు యొక్క నాథుడు (ప్రభువు).

* **జాకీ బాఁహ:** ఎవరి (హనుమంతుని) బాహువు (భుజబలం).

* **లోకపాల పాలనకో:** లోకపాలకులను (దిక్పాలకులను), లోకాలను రక్షించడానికి.

* **ఫిర థిర థలభో:** మరలా ఒక స్థిరమైన, సురక్షితమైన స్థానాన్ని (ఆశ్రయాన్ని) కల్పించిందో.


**భావం**

సముద్రమంతను గోప్పద (ఆవుగిట్ట) మాత్ర ప్రమాణ

మొనర్చినట్లుగా అవలీలగా దాటి, లంకనంతను భోగిమంటలు వైచినట్లు దగ్ధమొనర్చి శత్రునగరము నంతను గందరగోళముగా భీతావహముగా నొనర్చినవాడు, మహాపర్వతమగు ద్రోణాద్రిని క్రీడామాత్రముగా అవలీలగా పెళ్ళగించి బంతివలె ఎత్తివైచినవాడు; అంతటి పర్వత మాతనికి మారేడుపండువలె ఆటవస్తువై నది. రామరాజ్యమునందు అంతులేని క్లిష్టదశ యేర్పడినది. ఆ సమయమున హనుమంతుని పరాక్రమము కారణమున కొన్ని యుగములందు కాదగినంతటి పని కరకతలామలకమై సులభమైనది.


తులసీదాసుకు స్వామియైన హనుమంతుడు గొప్ప సాహసవంతుడు, సమర్ధవంతుడును. ఆతని భుజములు లోకపాలురను సైతము పాలింప సమర్ధమైనవి. అనగా లోకపాలురనే స్థిరముగా నిలుపజాలినవి అని అర్దం.


**వివరణ**


తులసీదాస్ గారు ఈ శ్లోకంలో హనుమంతుని శౌర్యాన్ని మూడు ప్రధాన ఘట్టాల ద్వారా కొనియాడారు:


1. **లంకా దహనం:** అపారమైన సముద్రాన్ని హనుమంతుడు చాలా సులభంగా, ఒక ఆవు అడుగులో ఉండే కొద్దిపాటి నీటిని దాటినంత సహజంగా దాటేశాడు. రావణుడి లంకలోకి ఏమాత్రం భయం లేకుండా అడుగుపెట్టి, అక్కడ తీవ్రమైన అలజడి సృష్టించాడు. లంకా దహనాన్ని ఆయన ఒక చిన్న హోలీ పండుగ ఆటలాగా ముగించేశాడు.

2. **ద్రోణగిరిని తెచ్చుట:** లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు, వైద్యుడి సలహా మేరకు సంజీవని మూలిక కోసం ద్రోణ పర్వతాన్నే పెకిలించుకొచ్చాడు. ఆ మహా పర్వతాన్ని హనుమంతుడు ఎలా తెచ్చాడంటే, ఒక చిన్న ఆట బంతితో లేదా వెలగపండుతో ఆడుకుంటూ విసిరేసినంత తేలికగా, లీలగా చేతులతో మోసుకొచ్చాడు.

3. **రామకార్య సాధన:** యుద్ధ రంగంలో లక్ష్మణుడికి ప్రాణసంకటం వచ్చి, వానర సేన అంతా సందిగ్ధంలో పడిపోయిన తరుణంలో... హనుమంతుడు రామకార్యాన్ని నిలబెట్టాడు. యుగయుగాల పాటు చెప్పుకునేలా ఆ సంకటాన్ని తొలగించి, విజయాన్ని చేతిలోని ఫలంలా రాముడికి అందించాడు.


**ముగింపు:**


"అలాంటి పరమ సాహసవంతుడు, సర్వసమర్థుడు అయిన హనుమంతుడే నా (తులసీదాసు) నాథుడు. ఆయన బాహుబలం ఎలాంటిదంటే, రావణాసురుడి అరాచకాల వల్ల అభద్రతతో ఉన్న లోకపాలకులకు (దేవతలకు) సైతం తిరిగి స్థిరత్వాన్ని, రక్షణను ప్రసాదించింది. ఓ హనుమా! అంతటి శక్తివంతమైన నీ బాహువులతో నా శారీరక బాధలను, రోగాలను కూడా అలాగే దూరం చేయి తండ్రీ!" అని తులసీదాస్ గారు ప్రార్థిస్తున్నారు.


🙏🌹*జై శ్రీరామ్ జై హనుమాన్*🙏🌹


          *🌷సేకరణ🌷*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 17.09.2026 Thursday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష షష్ఠి తిథి బృహస్పతి వాసర అనురాధ నక్షత్రం నిష్కంభ యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

 


శ్రాద్ధ తిథి : సప్తమి 


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము



బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ ।

బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।। 10 ।।



ప్రతిపదార్థ:



బీజం — విత్తనము; మాం — నేను; సర్వ-భూతానాం — సమస్త ప్రాణులకు; విద్ధి — తెలుసుకొనుము; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; సనాతనమ్ — నిత్య శాశ్వతమైన; బుద్ధిః — బుద్ధి; బుద్ధి-మతాం — తెలివైనవారిలో (బుద్ధిమంతులలో); అస్మి — నేను; తేజః — తేజస్సు; తేజస్వినామ్ — తేజోవంతులలో; అహమ్ — నేను.

 


తాత్పర్యము:



ఓ అర్జునా, సమస్త ప్రాణులకూ సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే.



వివరణ :


కారణమే కార్యమునకు బీజము అని చెప్పబడుతుంది. కాబట్టి, సముద్రమే మేఘములకు బీజం అని చెప్పవచ్చును; మేఘములే వర్షానికి బీజము. సమస్త ప్రాణుల సృష్టికి తానే బీజము అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.


జగత్తులో ఉన్న సమస్త పదార్థమూ భగవంతుని శక్తి స్వరూపమే కాబట్టి, మహోన్నత వ్యక్తులలో కనిపించే అద్భుతమైన గుణాలు, వారిలో వ్యక్తమైన భగవంతుని శక్తులే. తెలివికలవారు తమ ఆలోచన మరియు ఉపాయములలో ఉన్నతమైన ప్రజ్ఞ ప్రదర్శిస్తారు. వారి ఆలోచనలు తేజోవంతముగా, విశ్లేషణాత్మకంగా చేసే సూక్ష్మ శక్తి, తనే అని భగవంతుడు అంటున్నాడు.


ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రపంచాన్ని మెరుగుపరిచే విధంగా అత్యద్భుతమైన ప్రతిభా పాటవాలని ప్రదర్శించినప్పుడు, భగవంతుని శక్తి వారి ద్వారా ఆవిధంగా పనిచేస్తున్నట్టు మనం తెలుసుకోవాలి. విలియం షేక్స్పియర్ ఆంగ్ల సాహిత్యంలో తిరుగులేని తేజోవంతమైన ప్రజ్ఞని ప్రదర్శించాడు, ఈ నాటికి కూడా అంతగొప్ప సాహిత్యం లేదు. బహుశా, ప్రపంచంలో ఒక ప్రధాన భాషైన ఆంగ్ల భాష సాహిత్యాన్ని మరింత ఇనుమడింపచేయటానికి భగవంతుడే ఆయన బుద్ధిని ప్రేరేపించి ఉండవచ్చు. బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క ప్రయోజనం ఏమిటంటే ప్రపంచాన్ని ఒక్క భాషతో ఏకీకృతం చేయటమే, అని స్వామీ వివేకానంద అన్నాడు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంని, విపణిలో తొంభై శాతం వాటాతో అగ్రగామిగా చేయటానికి బిల్ గేట్స్ ఏంతో వ్యాపార తెలివిని ప్రదర్శించాడు. ఇదే గనక జరగక ఉండి ఉంటే, ప్రపంచం మొత్తం ఉన్న కంప్యూటర్స్ లో ఎన్నెన్నో ఆపరేటింగ్ సిస్టంలు ఉండి ఉండేవి; దీనితో చాలా గందర గోళం అయిఉండేది. బహుశా, సునాయాస సమాచార మార్పిడి కోసం, ప్రపంచంలో ఒక ప్రధాన ఆపరేటింగ్ సిస్టం ఉండాలని భగవంతుడు సంకల్పించాడో ఏమిటో, ఆయన ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞని ఈ పని కోసం పెంపొందించాడు.


మహాత్ములు, సహజంగానే, తమ పని యొక్క అందాన్ని, ప్రజ్ఞను మరియు జ్ఞానాన్ని భగవత్ కృపకే ఆపాదించారు. మహర్షి తులసీదాసు ఇలా అన్నాడు:


న మైఁ కియా న కరి సకూఁ, సహిబ కర్తా మోర్

కరత కరావత ఆప హైఁ, తులసీ తులసీ శోర్


‘నేను కాదు రామాయణం రాసినది, నాకు రాసే శక్తి కూడా లేదు. ఇది చేసేవాడు భగవంతుడే. ఆయనే నా పనులు నిర్దేశిస్తాడు, నా ద్వారా పనిచేస్తాడు, కానీ, ప్రపంచం తులసీదాసు చేస్తున్నాడు అనుకుంటుంది.’ ఇక్కడ, శ్రీ కృష్ణుడు స్పష్టంగా చెప్పేదేమిటంటే, ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞ తనే మరియు తెలివికలవారిలో తెలివి తానే, అని.

17సెప్టెంబర్26🌷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

*🌹బృహస్పతివారం🌹*

 *🌷17సెప్టెంబర్26🌷*    

  *దృగ్గణిత పంచాంగం*       

                

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షరుతువు*

*భాద్రపద మాసం - శుక్లపక్షం* 


*తిథి      : షష్ఠి* ఉ 10.47 వరకు ఉపరి *సప్తమి*

*వారం  : గురువారం*

(బృహస్పతివాసరే)

*నక్షత్రం   : అనూరాధ* రా 07.53 వరకు ఉపరి *జ్యేష్ఠ*

*యోగం  : విష్కుంబ* మ 12.50 వరకు ఉపరి *ప్రీతి*

*కరణం   : తైతుల* ఉ 10.47 *గరజి* రా 11.51 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ11.00-12.00 సా04.00-06.00*

అమృత కాలం  : *ఉ 08.24 - 10.10*

అభిజిత్ కాలం  : *ప 11.37 - 12.26*

*వర్జ్యం       : రా 02.09 - 03.57*

*దుర్ముహూర్తం  : ఉ10.00- 10.49 మ 02.53 - 03.41*

*రాహు కాలం: మ 01.33 - 03.05*

గుళికకాళం      : *ఉ 08.59 - 10.30*

యమగండం    : *ఉ 05.56 - 07.27*

సూర్యరాశి : *సింహం/కన్య*            

చంద్రరాశి : *వృశ్చికం*   

సూర్యోదయం :*ఉ 06.04* 

సూర్యాస్తమయం :*సా 06.17*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    :  *ఉ  05.56- 08.22*

సంగవ కాలం        : *08.22 - 10.49*

మధ్యాహ్న కాలం    : *10.49 - 01.15*

అపరాహ్న కాలం  : *మ 01.15- 03.41*

*ఆబ్ధికం తిధి        : భాద్రపద శుద్ధ సప్తమి*

సాయంకాలం     : *సా 03.41 -06.08*

ప్రదోష కాలం     : *సా 06.08-08.29*

రాత్రి కాలం       :*రా 08.29 - 11.38*

నిశీధి కాలం      :*రా 11.38 - 12.25*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.21 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

   *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷*సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

16, సెప్టెంబర్ 2026, బుధవారం

శ్రీకృష్ణుడు

  *శ్రీకృష్ణుడు*

                   ➖➖➖


*శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం:*


```

1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల 

   క్రితం జన్మించాడు.


2. పుట్టిన తేదిక్రీ.పూ.18.07.3228 

   (3228 B.C).


3. మాసం : శ్రావణం.


4. తిథి: అష్టమి.


5. నక్షత్రం : రోహిణి.


6. వారం : బుధవారం.


7. సమయం: రాత్రి గం.00.00 ని. 


8. జీవిత కాలం : 125 సంత్సరాల 

   8నెలల 7రోజులు.


9. నిర్యాణం: క్రీ.పూ.18.02.3102 

    (3102 B.C).


10. శ్రీకృష్ణుని 89వ యేట కుఱుక్షేత్రం 

    జరిగినది.


11 కురుక్షేత్రం జరిగిన 36సం. 

    తరువాత నిర్యాణం.


12. కుఱుక్షేత్రం క్రీ.పూ.8.12.3139 

    న మృగశిర శుక్ల ఏకాదశినాడు 

    ప్రారంభమై 25.12.3139 న 

    ముగిసినది. 

    క్రీ.పూ 21.12.3139న 3గం. 

    నుంచి5గం.లవరకు సంభవించిన 

    సూర్య గ్రహణం జయద్రదుని 

    మరణానికి కారణమయ్యెను.


13. భీష్ముడు క్రీ.పూ.2.02.3138న 

    ఉత్తరాయణంలో మొదటి 

    ఏకాదశినాడు ప్రాణము విడిచెను.


14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో 

    వివిధ నామాలతో పూజిస్తారు. 

    అవి:

    మధురలో కన్నయ్య

    ఒడిశాలో జగన్నాధ్

    మహారాష్ట్ర లో విఠల(విఠోబ)

    రాజస్తాన్ లో శ్రీనాధుడు

    గుజరాత్ లో ద్వారకాదీసుడు &     

    రాంచ్చోడ్.

    ఉడిపి, కర్ణాటకలో కృష్ణ

    ఆంధ్రలో కృష్ణుడు.


15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు.


16. జన్మనిచ్చిన తల్లి దేవకీ.


17. పెంచిన తండ్రి నందుడు.


18. పెంచిన తల్లి యశోద.


19. సోదరుడు బలరాముడు.


20. సోదరి సుభద్ర.


21. జన్మ స్థలం మధుర.


22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ,  

    జాంబవతీ,కాళింది, మిత్రవింద,   

    నగ్నజితి, భద్ర, లక్ష్మణ.


23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం 

    నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. 

వారు : చాణుర - కుస్తీదారు,

      కంసుడు - మేనమామ,

      శిశుపాలుడు మరియు      

      దంతవక్ర - అత్త కొడుకులు.


24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.  

25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. 

26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 

27. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.

28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.

29. కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.

30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.

31. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.

32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.

33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.

34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.

35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.

36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.

37. రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.

38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.

39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.

40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.

41. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. 

43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.

అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పు*శ్రీకృష్ణుడు*

                   ➖➖➖


*శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం:*


```

1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల 

   క్రితం జన్మించాడు.


2. పుట్టిన తేదిక్రీ.పూ.18.07.3228 

   (3228 B.C).


3. మాసం : శ్రావణం.


4. తిథి: అష్టమి.


5. నక్షత్రం : రోహిణి.


6. వారం : బుధవారం.


7. సమయం: రాత్రి గం.00.00 ని. 


8. జీవిత కాలం : 125 సంత్సరాల 

   8నెలల 7రోజులు.


9. నిర్యాణం: క్రీ.పూ.18.02.3102 

    (3102 B.C).


10. శ్రీకృష్ణుని 89వ యేట కుఱుక్షేత్రం 

    జరిగినది.


11 కురుక్షేత్రం జరిగిన 36సం. 

    తరువాత నిర్యాణం.


12. కుఱుక్షేత్రం క్రీ.పూ.8.12.3139 

    న మృగశిర శుక్ల ఏకాదశినాడు 

    ప్రారంభమై 25.12.3139 న 

    ముగిసినది. 

    క్రీ.పూ 21.12.3139న 3గం. 

    నుంచి5గం.లవరకు సంభవించిన 

    సూర్య గ్రహణం జయద్రదుని 

    మరణానికి కారణమయ్యెను.


13. భీష్ముడు క్రీ.పూ.2.02.3138న 

    ఉత్తరాయణంలో మొదటి 

    ఏకాదశినాడు ప్రాణము విడిచెను.


14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో 

    వివిధ నామాలతో పూజిస్తారు. 

    అవి:

    మధురలో కన్నయ్య

    ఒడిశాలో జగన్నాధ్డు

    మహారాష్ట్ర లో విఠల(విఠోబ)

    రాజస్తాన్ లో శ్రీనాధుడు

    గుజరాత్ లో ద్వారకాదీసుడు &     

    రాంచ్చోడ్.

    ఉడిపి, కర్ణాటకలో కృష్ణ

    ఆంధ్రలో కృష్ణుడు.


15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు.


16. జన్మనిచ్చిన తల్లి దేవకీ.


17. పెంచిన తండ్రి నందుడు.


18. పెంచిన తల్లి యశోద.


19. సోదరుడు బలరాముడు.


20. సోదరి సుభద్ర.


21. జన్మ స్థలం మధుర.


22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ,  

    జాంబవతీ,కాళింది, మిత్రవింద,   

    నగ్నజితి, భద్ర, లక్ష్మణ.


23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం 

    నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. 

వారు : చాణుర - కుస్తీదారు,

      కంసుడు - మేనమామ,

      శిశుపాలుడు మరియు      

      దంతవక్ర - అత్త కొడుకులు.


24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.  

25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. 

26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 

27. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.

28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.

29. కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.

30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.

31. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.

32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.

33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.

34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.

35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.

36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.

37. రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.

38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.

39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.

40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.

41. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. 

43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.

అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు. 

44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.``` వర్తమానములోనే బ్రతికాడు. 

44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.```

ఆత్మోద్ధరణ

 *నిజముగా తమ ఆత్మోద్ధరణ కోరుకొనువారు ఎంతటి తీరికలేకుండా ఉన్ననూ తప్పక భగవంతుణ్ణి మరువకుండా నిరంతరం స్మరిస్తూ ఉంటుండాలి.


*మనం అనుకుంటూ ఉంటాం…! ఉదయం నుండి రాత్రి వరకు వివిధ రకాల బాధ్యతలను నిర్వహించడంలో సమయం గడచిపోతోందని, దేవుణ్ణి స్మరించడానికి సమయం దొరకడం లేదని...!


*ఐతే సమయం ఎవరి కోసమో ఆగదు.. మనమే సమయం కేటాయించుకోవాలి. ఆఫీసు లో ఉన్నా, వంటగదిలో ఉన్నా, పంటచేలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆయా పనులు చేస్తూ కూడా భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు.


*ఆయన గుణగణాలను పాడుకోవచ్చు. ఇలా సాధ్యమా అంటే! సాధ్యమే!!గుడిలో పూజారి పూజ చేస్తున్నపుడు నోటితో మంత్రాలు చదువుతారు, ఒక చేత్తో హారతి ఇస్తారు, మరో చేతితో గంట కొడుతుంటారు. ఈ మూడు పనులు ఒకేసారి చేస్తుంటారు.


*ఇందులో ఎలాంటి ఇబ్బంది, దోషము లేకుండా చేస్తుంటారు. ఇది కూడా అలానే! ఎక్కడున్నా సరే మన పని మనం సక్రమంగా చేసుకుంటూ కూడా దైవాన్ని స్మరించుకోవచ్చు, పాడుకోవచ్చు..


*కనుక సాకులు వెదకడం మానేసి సాధనకు ఉపక్రమించాలి. అప్పుడే సర్వేశ్వరుడు తన అనుగ్రహమును మనపై కురిపిస్తాడు.

.

16సెప్టెంబర్26🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌷 *సౌమ్యవారం*🌷 

  *🪷16సెప్టెంబర్26🪷*  

   *దృగ్గణిత పంచాంగం*       

               

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షరుతువు*

*భాద్రపద మాసం - శుక్లపక్షం* 


*తిథి : పంచమి* ఉ 08.59 వరకు ఉపరి *షష్ఠి*

*వారం  : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : విశాఖ* సా 05.22 వరకు ఉపరి *అనూరాధ*

*యోగం : వైధృతి* మ 12.23 వరకు ఉపరి *విష్కుంబ*

*కరణం  : బాలువ* ఉ 08.59 *కౌలంవ* రా 09.49 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు*

*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *ఉ 07.50 - 09.34*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    : రా 09.47 - 11.33*

*దుర్ముహూర్తం  :ప11.38- 12.27*

*రాహు కాలం   : మ 12.02-01.34*

గుళికకాళం      : *ఉ 10.31 - 12.02*

యమగండం    : *ఉ 07.27 - 08.59*

సూర్యరాశి : *సింహం*                     

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.04* 

సూర్యాస్తమయం :*సా 06.18*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      : *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం      : *08.22 - 10.49*

మధ్యాహ్న కాలం    : *10.49 - 01.15*

అపరాహ్న కాలం : *మ 01.15-03.42*

*ఆబ్ధికం తిధి  : భాద్రపద శుద్ధ షష్ఠి*

సాయంకాలం    : *సా 03.42- 06.09*

ప్రదోష కాలం     : *సా 06.09- 08.30*

రాత్రి కాలం       : *రా 08.30 - 11.39*

నిశీధి కాలం     :*రా 11.39 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹