18, నవంబర్ 2026, బుధవారం

భగవద్గీత

 ,

--------------------------భగవద్గీత. ------------------------

                        అష్టమోధ్యాయః

                    అక్షర బ్రహ్మ యోగము



సహస్రయుగపర్యంతమ్ అహర్యద్బ్రహ్మణో విదుః ।

రాత్రిం యుగసహస్రాంతాం తేఽహోరాత్రవిదో జనాః ।। 17 ।।




ప్రతిపదార్థ;


సహస్ర — వెయ్యి; యుగ — యుగము; పర్యంతం — వరకూ; అహః — ఒక రోజు; యత్ — ఏదైతే; బ్రహ్మణః — బ్రహ్మ యొక్క; విదుః — తెలుసుకొనుము; రాత్రిం — రాత్రి; యుగ-సహస్ర-అంతాం — వెయ్యి యుగములు ఉంటుంది; తే — వారు; అహః-రాత్ర-విదః — అతని రాత్రి పగలు తెలిసినవారు; జనాః — జనులు.



తాత్పర్యము:


వెయ్యి చతుర్యుగము (మహాయుగము) ల కాలము, బ్రహ్మ దేవునికి ఒక రోజు (కల్పము) అవుతుంది మరియు ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యదార్థాన్ని అర్థం చేసుకున్నట్టు.


 

వివరణ :


వైదిక ప్రామాణంలో కాలం యొక్క కొలతలు కూడా విస్తారమైనవి. ఉదాహరణకి, కొన్ని పురుగులు రాత్రి పూట పుడతాయి — అవి పెరుగుతాయి, పునరుత్పత్తి చేస్తాయి, గుడ్లు పెడతాయి, మరియు వృద్ధాప్యంలోకి వస్తాయి, ఇవంతా ఒక్క రాత్రి లోనే జరిగిపోతాయి. పగటి పూట అవన్నీ వీధి దీపం కింద చనిపోయిపడి ఉండటం మనం గమనించవచ్చు. ఒకవేళ ఈ పురుగులకు, మీ జీవిత కాలం మొత్తం కలిపి మానవులకు ఒక రాత్రి మాత్రమే అని చెప్తే, వాటికి అది నమ్మశక్యంగా ఉండదు.


ఇదే విధంగా, వేదముల ప్రకారం, ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతల ఒక పగలు ఒక రాత్రి, భూలోకంలో ఒక సంవత్సరం అవుతుంది. దేవతల యొక్క ఒక సంవత్సరం, 30 రోజులు x 12 నెలలు, భూలోకంలో 360 సంవత్సరాలకు సమానం. దేవతల 12,000 సంవత్సరాలు, భూ లోకంలో ఒక మహాయుగం (నాలుగు యుగాల చక్రం) అవుతుంది; అంటే 4,320,000 సంవత్సరాలు. (12,000 దేవతా సంవత్సరాలు X 360 భూలోక సంవత్సరాలు)


ఇటువంటి 1000 మహా యుగములు బ్రహ్మ దేవుడికి ఒక పగలు. దీనినే కల్పము అంటారు, ఇది కాలాన్ని కొలవటానికి ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ప్రమాణం. బ్రహ్మ యొక్క ఒక రాత్రి కూడా ఇంతే సమయం ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం, బ్రహ్మ దేవుడు 100 సంవత్సరాలు బతుకుతాడు. భూలోక లెక్క ప్రకారం ఇది 311 ట్రిలియన్ 40 బిలియన్ సంవత్సరాలు.


ఈ ప్రకారం వైదిక శాస్త్రం ప్రక్కరం కాలం యొక్క ఈ క్రింది విధంగా ఉంది:


కలి యుగము : 432,000 సంవత్సరాలు.

ద్వాపర యుగము : 864,000 సంవత్సరాలు.

త్రేతా యుగము : 1,296,000 సంవత్సరాలు.

సత్య యుగము : 1,728,000 సంవత్సరాలు


ఇవన్ని కలిపి ఒక మహా యుగం అంటే 4,320,000 సంవత్సరాలు.


వెయ్యి మహాయుగములు బ్రహ్మ దేవుని ఒక పగలు, కల్పము అంటే అదే : 4,320,000,000 ల భూలోక సంవత్సరాలు. ఇంతే సమయం బ్రహ్మ దేవుని రాత్రి. ఇది ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే నిజంగా పగలు, రాత్రిని అర్థం చేసుకున్నట్టు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు.


ఈ సమస్త విశ్వం యొక్క వ్యవధి బ్రహ్మ గారి జీవిత కాలం అయిన 100 సంవత్సరాలు: 311 ట్రిలియన్ 40 బిలియన్ భూలోక సంవత్సరాలు. బ్రహ్మ కూడా ఒక జీవాత్మనే, ఆ పదవిని పొంది, భగవంతుని పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూఉంటాడు. కనుక, బ్రహ్మ కూడా జనన-మరణ చక్రం లోనే ఉంటాడు. కానీ, మహోన్నతమైన పరిణితి పొంది ఉండటం వలన, ఆయన జీవిత కాలం తరువాత ఆయన జనన-మరణ చక్రం నుండి విముక్తి చేయబడి, భగవంతుని ధామాన్ని చేరుకుంటాడు అని ఆయనకు హామీ ఉంది. ఒక్కోసారి, సృష్టి సమయంలో బ్రహ్మ పదవి నిర్వహించటానికి ఏ జీవాత్మకి కూడా అర్హత లేకుంటే, భగవంతుడే బ్రహ్మ అవుతాడు.

రాశి ఫలాలు

  శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

17-11-2026 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు. 

---------------------------------------


వృషభం


దైవ చింతన పెరుగుతుంది. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. కుటుంబమున కొందరి మాటలు వివాదస్పదంగా మారతాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.     

---------------------------------------


మిధునం


ఆప్తులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మరింతగా మందగిస్తాయి. మానసికంగా సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు పెరుగుతాయి.   

---------------------------------------


కర్కాటకం


ఉద్యోగమున ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపారమున నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. 

---------------------------------------


సింహం


సంఘంలో పెద్దల పరిచయాలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున శ్రమకు తగిన గుర్తింపు లభించదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి ఇబ్బంది తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.            

---------------------------------------


కన్య


దైవ కార్యక్రమాలకు ధనం అందిస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో మెరుగైన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులుంటాయి. చుట్టుపక్కల వారితో వివాదాలలో పై చేయి సాధిస్తారు. రాజకీయ సభ సమావేశలకు హాజరవుతారు.                

---------------------------------------


తుల


కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించడం మంచిది. చేపట్టిన పనులు అతికష్టం మీద పూర్తి అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు వేదిస్తాయి. స్థిరాస్తి సంభందిత విషయాలలో వివాదాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు.

---------------------------------------


వృశ్చికం


బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో మీ అంచనాలు నిజం అవుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుండి కొంత వరకు బయటపడతారు.

---------------------------------------


ధనస్సు


వృత్తివ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. 

---------------------------------------


మకరం


ఇతరులతో తొందరపడి మాట్లాడం మంచిది కాదు. దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. బంధువర్గం వారితో మాటపట్టింపులంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

---------------------------------------


కుంభం


వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తికావు. ఖర్చులకు తగిన ఆదాయం లభించదు. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి.   

--------------------------------------- 


మీనం

 

అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. దీర్ఘకాలిక వివాదాల నుండి ఉపశమనం పొందుతారు. 

---------------------------------------

కేర్ టేకర్

 మల్కాజిగిరి హైదరాబాద్ వేద పాఠశాలలో కేర్ టేకర్ గా పనిచేయడానికి మగవారు మాత్రమే బ్రాహ్మణ వ్యక్తి ఏ బాధ్యతలు లేని వారు కావలెను ఉచిత వసతి భోజన సౌకర్యములు ఆరోగ్య ఇన్సూరెన్స్ మరియు 15 వేల రూపాయలు జీతం ఇవ్వబడును 60 సంవత్సరాలలోపులో వారు మాత్రమే ఈ ఉద్యోగమునకు ఫోన్ చేయగలరు పై విషయాలన్నీ రెండుసార్లు చదువుకొని అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఫోన్ చేయగలరు 98483 69716 వెంటనే కావలసి ఉన్నది దయచేసి అన్ని బ్రాహ్మణ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయవలసిందిగా బ్రాహ్మణ సోదరులను కోరుతున్నాను

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 18.11.2026 Wednesday


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం శరదృతువు కార్తీక మాస శుక్ల పక్ష నవమి తిథి సౌమ్య వాసర శతభిషం నక్షత్రం ధ్రువ యోగః బాలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.  



శ్రాద్ధ కర్మ తిథి : నవమి. 


 

నమస్కారః , శుభోదయం.

భగవద్గీత

 ,

--------------------------భగవద్గీత. ------------------------

                        అష్టమోధ్యాయః

                    అక్షర బ్రహ్మ యోగము



అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే ।

రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే ।। 18 ।।




ప్రతిపదార్థ;


 అవ్యక్తాత్ — అవ్యక్తము నుండి; వ్యక్తయః — వ్యక్తమైనవి; సర్వాః — సమస్త; ప్రభవంతి — ఉద్భవించును; అహః-ఆగమే — బ్రహ్మ యొక్క పగలు అయినప్పుడు; రాత్రి-ఆగమే — బ్రహ్మ యొక్క రాత్రి ప్రారంభమైనప్పుడు; ప్రలీయంతే — విలీనమైపోతాయి; తత్ర — దానిలో; ఏవ — నిజముగా; అవ్యక్త-సంజ్ఞకే — ఆ అవ్యక్తము అనబడే దాంట్లోకి.



తాత్పర్యము:


 బ్రహ్మ యొక్క పగలు ప్రారంభంకాగానే, సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి. మరియు ఆయన రాత్రి మొదలైనంతనే, అన్ని జీవాత్మలూ తమ అవ్యక్త రూపంలోకి లీనమై పోతాయి.


 

వివరణ :


 మహాద్భుతమైన విశ్వ క్రీడలో, వివిధ లోకాలు వాటి యొక్క గ్రహ వ్యవస్థలు మళ్లీ మళ్లీ - సృష్టి, స్థితి, ప్రళయ చక్రానికి గురిఅవుతూనే ఉంటాయి. బ్రహ్మ యొక్క ఒక పగలు అయిపోయేటప్పటికి, అంటే ఒక కల్పము యొక్క 4,320,000,000 సంవత్సరములలో, మహర్లోకం వరకు ఉన్న అన్ని గ్రహ వ్యవస్థలు నాశనం చెందుతాయి. దీనినే నైమిత్తిక ప్రళయం (పాక్షిక లయము) అంటారు. శ్రీమద్భాగవతంలో, శుకదేవుడు పరీక్షిత్తుకి ఇలా చెప్పాడు, ‘ఎలాగైతే ఒక పిల్లవాడు పగలు ఆడుకునేటప్పుడు బొమ్మలతో నిర్మాణాలు చేసి, పడుకునేటప్పుడు వాటిని మళ్లీ తీసేస్తాడో, అదే విధంగా, బ్రహ్మ లేచినప్పుడు ఈ విశ్వ-గ్రహాల వ్యవస్థని వాటి యందు జీవ రాశులని సృష్టించి, పడుకునే ముందు వాటి అన్నింటిని లయం చేస్తాడు.


బ్రహ్మ యొక్క 100 సంవత్సరముల జీవన కాలం ముగిసే సమయానికి, సమస్త విశ్వము లయం చేయబడుతుంది. ఈ సమయంలో మొత్తం భౌతిక సృష్టి లయం చేయబడుతుంది. పంచ-మహాభూతములు, పంచ-తన్మాత్రలలో విలీనమవుతాయి. పంచ తన్మాత్రలు అహంకారములో విలీనమవుతాయి. అహంకారము మహాన్ (మహత్తు) యందు విలీనమవుతుంది, మరియు, మహత్తు ప్రకృతిలోకి విలీనము అవుతుంది. ప్రకృతి అనేది భౌతిక శక్తి, మాయ - యొక్క సూక్ష్మ రూపము. మాయ - దాని యొక్క ఆదిమ రూపంలో, అప్పుడు వెళ్లి మహా విష్ణువు యొక్క శరీరంలో కూర్చుంటుంది. దీనినే ప్రాకృతిక ప్రళయం లేదా మహా ప్రళయం అంటారు. తిరిగి మహా విష్ణువు సృష్టి చేయటానికి ఎప్పుడైతే సంకల్పిస్తాడో, ఆయన ప్రకృతి రూపంలో ఉన్న భౌతిక శక్తి వైపు తన చూపు ప్రసరిస్తాడు, కేవలం ఆయన దృష్టి సారించినంతనే, అది ఆవిష్కరించటం మొదలవుతుంది. ప్రకృతి నుండి మహాన్ వస్తుంది: మహాన్ నుండి అహంకారము వస్తుంది; అహంకారము నుండి పంచ-తన్మాత్రలు సృష్టించబడుతాయి; పంచ-తన్మాత్రల నుండి పంచ-మహాభూతాలు సృష్టించబడుతాయి. ఈ ప్రకారంగా , అనంతమైన బ్రహ్మాండాలు సృష్టించబడుతాయి.


ఆధునిక కాల శాస్త్రవేత్తలు, మిల్కీ-వే లో, 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి అని అంచనా వేశారు. ఈ మిల్కీ-వే లాగా, ఈ విశ్వంలో ఒక బిలియన్ పాలపుంతలు ఉన్నాయి. ఈ విధంగా, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, మన విశ్వంలో 1020 నక్షత్రాలు ఉన్నాయి. వేదాల ప్రకారం, మన విశ్వం వంటివి, వేరు వేరు పరిమాణాలలో, లక్షణాలతో అసంఖ్యాకమైన విశ్వములు ఉన్నాయి. ప్రతి సారి, మహావిష్ణువు శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు, అనంతమైన విశ్వములు ఆయన శరీర రోమకూపాల్లోంచి వ్యక్తమవుతాయి; మరియు ఆయన శ్వాస వదిలినప్పుడు, సమస్త విశ్వములు లయమై పోతాయి. అంటే, 100 సంవత్సరముల బ్రహ్మ జీవనకాలం, మహా విష్ణువు యొక్క ఒక శ్వాసకాలం మేర ఉంటుంది. ప్రతి విశ్వమునకు ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, మరియు ఒక శంకరుడు ఉంటారు. కాబట్టి, అసంఖ్యాకమైన బ్రహ్మలు, విష్ణువులు మరియు శంకరులు, అసంఖ్యాకమైన విశ్వాలలో ఉంటారు. అన్నీ విశ్వముల యొక్క సమస్త విష్ణువులు కూడా శ్రీ మహా విష్ణువు యొక్క విస్తరణలే.

నేనే శివుడిని

  నేనే శివుడిని  

ప్రతి సాధకుడు ఒక్క విషయన్ని తెలుసుకోవాలి. ఈ సృష్టి మొత్తం ఈశ్వరుడిదే అయి వున్నది. అటువంటప్పుడు సృష్టిలో ఈశ్వరుడు కానిది, ఈశ్వరుడికన్నా బిన్నంగా వున్నది ఏది లేదు. అటువంటప్పుడు ఈ జగత్తులో భక్తుడు, భగవంతుడు అని రెండు లేవు. వున్నది ఒక్కటే ఆ ఒక్కటి పరమేశ్వరుడే అయి వున్నాడు. ఈ సత్యమే మనకు పరి పరి విధాలుగా అనేక పరియాయలు మన మహర్షులు బోధిస్తూ వున్నారు. కానీ దేహ వ్యామోహంతో వున్న మనం నేను దేహాన్ని అని నేను భగవంతుని ఆరాధిస్తూ వున్నానని, దేముడిని మా తోటలోని మల్లెపూలతో, చామంతి పూలతో మందార పూలతో పూజిస్తూ వున్నానని అర్చిస్తూ వున్నానని, అలంకరిస్తూ వున్నానని గర్వంగా చెప్పుకుంటూ ఉండటం సహజం. నిజానికి నాకు తోట ఉన్నదా? ఆ తోటలో పూలు పుస్తున్నవి అవి నాకు చెందినవా? ఆ పుల మీద నాకు ఏ అధికారం వున్నది అని ప్రతి సాధకుడు ఆలోచించాలి. 


సాధకుడు ఒక్క విషయం ఎల్లప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకోవాలి అదేమిటంటే తానూ ధరించిన తన శరీరం తనది కాదని అది కేవలం తన తల్లిదండ్రుల వలన ఈ భౌతిక ప్రపంచములో తయారయినదని. దానికి బిన్నంగా దానిని ఆసరాగా చేసుకొని తాను వున్నానని తెలుసుకోవాలి. ఈ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే సాధకునికి అర్ధం అవుతుంది. తన శరీరమే తనది కానప్పుడు ఆ శరీరానికి సంబందించిన బంధాలు కూడా తనవి కావు అని తెలుసు కుంటాడు. అటువంటప్పుడు ఇక ఆస్తి పాస్తులు తనవి యెట్లా అవుతాయి.తాను నాటిన చెట్లను మొలకెత్తించి పురుషుపించే టట్లు చేసింది ఎవరు. ఆ ఈశ్వరుడు తప్ప ఇంకెవరు. పద్మ పురాణంలోని ఈ శ్లోకాన్ని ఒకసారి చూడండి.


ఋణానుబంధ రూపేణ! పశు పత్నీ సుతాలయాః!

ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా!!


దేహాన్ని ఆశ్రయించి వున్న జీవునికి జన్మ జన్మల కర్మ ఫలితంగా ఏర్పడిన రుణముల కారణంగా మాత్రమే పశు , పత్ని, సుతుడు, గృహాలు ఇంకా ఇతర ఆస్తి పాస్తులు కలుగుతున్నాయి. ఎప్పుడైతే ఆ ఋణం క్షీణిస్తుందో అప్పుడు అవి బందంనుంచి తొలగుతాయి.  


ఒక నది ప్రవాహంలో రెండు తుంగాలు కొట్టుకొని వస్తున్నాయట. అవి ప్రవాహంలో కలుసుకున్నాయట. ఆలా ఒక దానితో ఒకటి కలిసి కొంత దూరం ప్రయాణం చేసి తరువాత వీటి దోవన అవి విడిపోయి వెళ్లిపోయాయట. ఈ ప్రపంచంలో దేహంతో ఏర్పడే బంధాలు కూడా అటువంటివే. వాటినే శాశ్వితం అని సామాన్యులు భావిస్తారు. కానీ సాధకులు ఈ నగ్న సత్యాన్ని తెలుసుకొని జాగరూకులై నిత్యం, సత్యం, అనంతము అయినటువంటి ఆ ఈశ్వరునితో మాత్రమే సంబంధం పెట్టుకొని అనుక్షణం ఈశ్వరునితో లయం అయి బ్రహ్మనందాన్ని పొందుతూ వుంటూ. ఈ దేహం కేవలం తనకు ఆశ్రయాన్ని ఇచ్చిన ఒక ఉపకరణం లాగ మాత్రమే తలుస్తూ జీవితాన్ని గడుపుతారు. నీవు కొంత దూరం వెళ్ళాలి దానికోసం ఒక కారుని ఏర్పాటు చేసుకొని ప్రయాణిస్తావు అనుకో. నీ గమ్యాన్ని చేరుకున్న తరువాత నీవు కారు దిగి నీ పనిమీద వెళతావు. అదేవిధంగా ఆ కారు లాంటిదే ఈ రోజు నీవు ధరించిన ఈ శరీరం. ఈ సత్యాన్ని కేవలం సాధకులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. సామాన్యులు ఈ శరీరమే తాను అని భావన చేస్తూ అరిషడ్వార్గాలతో అనుబంధాన్ని పెంచుకొని వాటి సాధనే జీవిత లక్ష్యం అనుకోని చెతుర్విధ పురుషార్ధాలలో మధ్య రెండు పురుషార్ధలైన అర్ధ కామదులే పరమావధిగా భావించి మొదటిది, చివరిది ఐన ధర్మాన్ని, మోక్షాన్ని విస్మరించి జీవనం సాగించి అనేక పాప కృత్యాలు చేస్తూ భవిష్యత్తులో నీచ జీవులుగా జన్మలను పొంది ఈ జరామరణ చక్రంలో పరిభ్రమిస్తూ వుంటారు. 


సాధకులు మాత్రము ధర్మాచరణపరులై జీవనం కొనసాగిస్తూ, జీవిత పరమ లక్ష్యం చతుర్ధ పురుషార్థం మాత్రమే అని నమ్మి దాని సాధనకొరకు నిరంతరం అనన్య సామాన్య కృషి చేస్తూ ఒక సద్గురువుని శరణు చొచ్చి మోక్ష పదాన్ని చేరుకోవటానికి ప్రయత్నిస్తారు. 


ఈశావాస్యమిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్

తేన త్యక్తేన భుంజీథాః, మా గృధ: కస్య స్విద్ధనం , 1  


ఈ జగత్తులో ప్రతి ఆణువణువూ లోపల బైట కేవలం ఈశ్వరునిచే వ్యాపించి వున్నది. కాబట్టి ఇక్కడ నాది అనేది ఏది కూడా లేదు ప్రతిదీ ఆ ఈశ్వరునిది మాత్రమే త్యాగ బుద్దితో ఈశ్వరునిది నీవు అనుభవిస్తున్నట్లుగా భావించి జీవనం గడపవలెను. 


మొట్ట మొదటి ఉపనిషత్తుగా భాసిల్లిన ఈశావాసోపనిషత్తు శుక్ల యజుర్వేదంలోనిది. ఒక సాధకుడు తరించటానికి వేరే ఏ గ్రంధాలు చదవనవసరం లేదు. కేవలం అంటే కేవలం ఈశావాసోపనిషత్తులోని ఈ మొదటి మంత్రాన్ని చదివి అర్ధం చేసుకొని ఆకళింపు చేసుకొని తన జీవితానికి అనుసంధానము చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తే సాధకుడు నిత్ర్య ముక్తుడే. 


రుద్రుడు అంటే దుఃఖంని హరించే వాడు అని అర్ధం. అంటే ఆనంద స్వరూపుడు అని తెలుసుకోవాలి. సాధకుడు రుద్రుడిని పూజించాలంటే ముందుగా తాను రుద్రుడిగా మారాలి


నారుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము


మరి ఒక సామాన్యుడు రుద్రునిగా ఎలా అవుతాడు అంటే దానికి ఒక ప్రక్రియను మన మహర్షులు తెలిపారు. అదే అంగన్యాస,కరన్యాసాలు. భక్తుడు తన శరీరంలోని ప్రతి అంగాన్ని పవిత్ర మైనటువంటి మంత్రాలతో న్యాసం అంటే దైవ శక్తిని స్థాపన చేసి తదుపరి రుద్రుని అర్చించాలని మన మహర్షులు ప్రబోధించారు. నేటికీ రుద్రార్చన చేసేవారితో పౌరోహితులవారు అంగన్యాస, కరన్యాసాలని చేయించటం మనం గమనిస్తూ వున్నాము. ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి భక్తుడు తప్పకుండా రుద్రుడు కావలసిందేనా అంటే అవును అని సమాధానం. 


సాధారణ వ్యవహార సరళిలో మనమంతా అనుకుంటాము నేను అపవిత్రంగా వున్నాను అని భావించి శిరస్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకుంటాము. కానీ మన శరీరంలో రక్త మాంసాలు, చీము నెత్తురు, మల మూత్రాదులతో అశుద్ధంగా ఉంటుంది అని సర్వుల భావన అటువంటి దోషం తొలగాలి న్యాసం చేయాలనీ కొందరి అభిమతం. ఏది ఏమైనా భక్తుడు రుద్రుడు కాకుండా రుద్రర్శన చేయ వీలు లేదనేది యదార్ధం. 


ఉపనిషత్తు మంత్రార్ధాన్ని కనుక పరిగణలోకి తీసుకొని లోతుగా యోచిస్తే ఈ జగత్తు మొత్తం ఈశ్వరుడే అయి వున్నాడు. అట్టి తరి భక్తుడు ఈశ్వరుడి కన్నా బిన్నంగా ఉన్నదా అంటే లేదు అని అర్ధం చేసుకోవాలి. అప్పుడు సదా పరిశుద్ధుడు అయినా ఈశ్వరుని అంశగా భక్తుడు భావిస్తే ఇక అశుద్ది అనేది ఎక్కడ వున్నది. వున్నదంతా ఒక్కటే అయితే పూర్తిగా అది ఈశ్వరుడే అయితే అంటా శుద్ధి అని అర్ధం చేసుకోవాలి. మరి సాధకుడు రుద్రుడే అయి ఉంటాడు. మరి రుద్రుడు యెట్లా అయి ఉంటాడు అనే సందేహం కలుగుతుంది. 


 


ఉపనిషత్తు మంత్రార్ధాన్ని కనుక పరిగణలోకి తీసుకొని లోతుగా యోచిస్తే ఈ జగత్తు మొత్తం ఈశ్వరుడే అయి వున్నాడు. అట్టి తరి భక్తుడు ఈశ్వరుడి కన్నా బిన్నంగా ఉన్నదా అంటే లేదు అని అర్ధం చేసుకోవాలి. అప్పుడు సదా పరిశుద్ధుడు అయినా ఈశ్వరుని అంశగా భక్తుడు భావిస్తే ఇక అశుద్ది అనేది ఎక్కడ వున్నది. వున్నదంతా ఒక్కటే అయితే పూర్తిగా అది ఈశ్వరుడే అయితే అంటా శుద్ధి అని అర్ధం చేసుకోవాలి. మరి సాధకుడు రుద్రుడే అయి ఉంటాడు. మరి రుద్రుడు యెట్లా అయి ఉంటాడు అనే సందేహం కలుగుతుంది. 


ప్రతి సాధకుడు ఒక విషయాన్నీ ఎప్పుడు మననం చేస్తూ ఉండాలి అదేమిటంటే తాను ఈశ్వరుడు అని. ఎలా అంటే తాను నిత్యం తన ఇంద్రియాలను పూర్తిగా ఈశ్వరుని మీదనే లగ్నం చేసి జీవనం చేస్తూ ఉండాలి.ఇక్కడ ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు,చ కర్మేంద్రియాలు, ఇంకా వీటిని ఆధీనంలో ఉంచుకున్న మనస్సు వెరసి మొత్తం పదకొండు . అందుకేనేమో మనకు రుద్రులు ఏకాదశ రుద్రులుగా పేర్కొన్నారు. ఈ పదకొండు సాధకుడు నిత్యం, అనుక్షణం, నిరంతరమూ తదేకంగా అహర్నిశలు ఈశ్వరునితో అనుసందానం చేసి ఈశ్వరుడు తప్ప మరొక జాస లేకుండా జీవితాన్ని ఎడతెరపి లేకుండా లగ్నాత చేస్తూ ఉంటే అప్పుడు కలిగే స్థితే ఆత్మా సంయమనం స్థితి . దానికే సమాధి స్థితి అని తురీయా స్థితి అని మన మహర్షులు నొక్కి వక్కాణిస్తున్నారు.ఈ స్థితిని పొందటం చాలాకష్టతరం,




ఓం శాంతి శాంతి శాంతిః 


ఇట్లు




 మీ 


చేరువేల భార్గవ శర్మ

కార్తీకపురాణం

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*సౌమ్యవారం తేదీ 18 నవంబరు 2026*


           *🕉️కార్తీకపురాణం🕉️*             

             *తొమ్మిదో అధ్యాయం*   

```

విష్ణుదూతలడిగిరి..

“ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీయమదండనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? ఈవిషయములన్నిటిని మాకు చెప్పమ”ని విష్ణుదూతలడుగగా యమదూతలు “ఓ విష్ణుదూతలారా! సావధానముగా వినుడు..


సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు.


మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వానిని దండింతుము. వేదమార్గమును వదలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు, వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదములచేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని, నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారములను వదిలినవారిని, ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వనివానిని, డాంబికుని, దయాశాంతులు లేనివానిని,భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములను చెప్పువానిని మేము దండింతుము.


నేను దాతనని చెప్పుకొనువానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వానిని అపకారమును చేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను జూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును జూచి దుఃఖించువానిని కన్యాశుల్కముల చేత జీవించువానిని, చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వానిని, నిర్మితములయిన వాటిని చెరుచు వానిని మేము దండింతుము.


మోహముచేత మాతాపితరుల శ్రాద్ధమును విడచినవానిని, నిత్యకర్మను వదలిన వానిని మేము దండింతుము. పరపాకపరిత్యాగిని, పరపాకరతుని, పితృశేషాన్నమును భుజించువానిని మేము దండింతుము.


(పరపా పరిత్యాగియనగా తానువండిన అన్నములో ఇతరులకు ఎంతమాత్రము పెట్టక తానే అంతయు భుజించువాడు,పితృశేషాన్నభోక్తయనగా శ్రాద్ధభోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు) ఇతరులు దానము చేయు సమయాన ఇవ్వవద్దని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకివ్వని వానిని, తన్ను శరణుజొచ్చిన వానిని చంపువానిని మేము దండింతుము.


స్నానమును, సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణ నిందకుని, బ్రాహ్మణహంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈ మొదలయిన పాతకములను చేయు మానవులు యమలోకమున మాచేత యాతనలను పొందుదుర”ని చెప్పారు. 


ఈ అజామీళుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై    పుట్టినది మొదలు చచ్చువరకు పాపములను చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితిలేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును?”


ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖపద్మములు గలవారై మేఘ సమాన గంభీరధ్వనితో నిట్లనిరి.. 

“ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు. ధర్మమర్యాదను మేము చెప్పెదము. సావధానముగా వినుడు..

దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మ చింతనమును చేయువాడు యమదండార్హుడుగాడు. స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును, జపహోమాదులు ఆచరించువాడును, సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయా దోషరహితుడై జపాగ్నిహోత్రములను జేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడుగాడు. కర్తృభోక్తృత్వాదులను సగుణ పరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు.


అన్నదానమాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. (వృషోత్సర్గము=ఆబోతును అచ్చుపోసి వదలుట) విద్యను గోరినవారికి విద్యాదానమాచరించువాడు, పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందడు.


హరిని బూజించువాడును, హరినామమును జపించువాడును, వివాహములను ఉపనయనములను చేయువాడును, యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడు, క్రీడాస్థానములను గట్టించువాడు, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును చేయించువాడు యమలోకమును పొందడు. నిత్యము సాలగ్రామ అర్చనమాచరించి ఆ తీర్థమును పానముజేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు.


తులసీ కాష్ఠమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందుంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేషతులా మకర సంక్రాంతుల యందుండగా ప్రాతః స్నానమాచరించు వారు యమలోకమును పొందరు.


రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, ఓ రామా! అని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు.


కాశీయందు మణికర్ణికాఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతినొందినయెడల వాడు సర్వపాపములు చేసినవాడయినను యమలోకమును పొందడు. దొంగ, కల్లుత్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురుభార్యరతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య, చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన యెడల పాపవిముక్తులగుదురు.


మహిమను తెలుసుకొనిగాని, తెలియకగాని, మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములయినను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్రుపాటు బొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదులచేత పీడింపబడినప్పుడును, సప్తవ్యసనములచే పీడింపబడునప్పుడును, వశముకానప్పుడును హరి హరీయని అన్నయెడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదింపబడి ప్రాయశ్చిత్తములు లేక కొండలవలె పెరిగియున్న పాపములన్నియు భూమియందుగాని, స్వర్గమందుగాని హరినామసంకీర్తనము చేత నశించును.


మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణమును చేసినయెడల వాని పాపములన్నియు అగ్నిలోనుంచిన దూదివలె నశించును.” విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామీళుని యమదూతల నుండి విడిపించిరి. 


తరువాత అజామీళుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి “మీ దర్శనము వలన నేను తరించితిని” అనెను. 


తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకు బోయిరి.


తరువాత అజామీళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి “అయ్యో ఎంతకష్టమాయెను. ఆత్మహితము చేసికొనలేకపోతిని. ఛీ ఛీ నాబ్రతుకు సజ్జన నిందితమాయెనుగదా! పతివ్రతయైన భార్యను వదలివేసి కల్లుద్రాగెడి ఈ దాసీ భార్యను స్వీకరించితినిగదా! వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములయిన మాతాపితరులను నీచుడనై విడిచితిని గదా! అయ్యో ఎఃత కష్టము,ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరమనుభవించెడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెడివాడను.


ఇదియేమి ఆశ్చర్యము. ఇది స్వప్నమా. ఆనల్లకత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి? నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించినవాడను ఇది నిజము. అట్లుగానిచో దాసీపతియైన నాకు మరణకాలమందు హరిస్మృతి యెట్లుగలుగును.


నా జిహ్వహరినామమును యెట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ, అంత్యకాలమందీ స్మృతియెక్కడ? సిగ్గువిడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడ, మంగళకరమయిన నారాయణ నామమెక్కడ? అజామీళుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తినిబొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. 


కాబట్టి నారాయణ నామకీర్తన గావించువాడు సమస్తపాపవిముక్తుడై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందియము లేదు.```


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి నవమోధ్యాయము -నవమి దిన పారాయణము సమాప్తం.*```


*🕉️ఓం నమః శివాయ🙏*


            🌷🙏🌷


  *🕉️🪷సేకరణ🪷🕉️*

    🙏*న్యాయపతి*🙏 

       *నరసింహారావు*

17, నవంబర్ 2026, మంగళవారం

అగ్గితోటి కడుగు

 నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

 అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని 

 లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ 

ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం


గాలివాటు గమనానికి కాలిబాట దేనికి 

 మండకి నీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర 

 పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మా..ర్గం


రామబాణమార్పిందా రావణ 

 కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం 

 అడుగు ఈ సిగ్గులేని జనాన్ని 

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని 

 లోకం మారదు కాలం

పంచాంగము

 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

బుధవారం,నవంబర్.18,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం -  శుక్ల పక్షం

తిథి:నవమి రా1.51 వరకు    

వారం:బుధవారం(సౌమ్యవాసరే)

నక్షత్రం:శతభిషం రా2.14 వరకు

యోగం:వ్యాఘాతం తె4.54 వరకు

కరణం:బాలువ మ1.26 వరకు తదుపరి కౌలువ రా1.51 వరకు

వర్జ్యం:ఉ8.28 - 10.09

దుర్ముహూర్తము:ఉ11.23 - 12.07

అమృతకాలం:సా6.37 - 8.18

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00

సూర్యరాశి:వృశ్చికం||చంద్రరాశి:కుంభం 

సూర్యోదయం:6.10|| సూర్యాస్తమయం:5.21

సర్వేజనా సుఖినో భవంతు -శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

కర్తవ్యము

  

*శ్రీగురుభ్యోనమః*🙏


కర్తవ్యము ఉన్న చోట శ్రద్ధ ఉండును. శ్రద్ధ ఉన్న చోట ధర్మము స్పురించును. కర్తవ్యమును అశ్రద్ధ చేసినచో లక్ష్యము గతి తప్పును. లక్ష్యము గతి తప్పినచో సంసార చక్రమున బంధింప బడుదుము. అనగా జనన మరణములు అశేషముగా ఉండును. 


తాను ఏమి చేయవలెను అనునది పురోగమనమునకు దారి. తనకేమి కావలయును అనునది పతనమునకు దారి.


*Master K.P. K.🙏*


*నవ గోపికా సంఘము*