1, అక్టోబర్ 2020, గురువారం

**సౌందర్య లహరి శ్లోకము - 13**

 **దశిక రాము**




**శ్రీ శంకర భగవత్పాద విరచితము**


**శ్రీ లలితాంబికాయైనమః**


శ్లోకమ్ 13


**నరం వర్షీయాంసం** 


**నయన విరసం నర్మసు జడం**


**తవా పాఙ్గా లోకే** 


**పతిత మనుధావన్తి శతశః'**


**గళద్వేణీ బన్ధాః** 


**కుచకలశవిస్రస్తసి చయా**


**హఠాత్త్రుట్య త్కాఞ్చ్యో**


**విగళిత దుకూలా యువతయః !!**                                           


తల్లీ ! కనికరం ఉట్టిపడే నీ కడకంటి చూపుకు

పాత్ర మైన వాడు ఎంత ముదుసలి ఐనా, వికార

రూపుడైనా , మన్మథ క్రీడలలో మందుడైనా యువతులు అతగాడినే వలచి తమ కొప్పులు వీడగా , పైటలు జారగా, మొలనూళ్ళు విడివడి

జారుతూండగా, పోక ముడులు వీడిపోయి కట్టుకున్న పట్టుకోకలు కిందికి జారిపోతుంటే వందలాది ఏతెంచి ఆ పురుషుణ్ణి వెంబడించి

నరుగెత్తి వస్తారు .


**ఓం నిత్యాయైనమః**


**ఓం నిర్మలాయైనమః**


**ఓం అంబికాయైనమః**


🙏🙏🙏


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: