1, అక్టోబర్ 2020, గురువారం

రామాయణమ్.79

 

..

రాత్రి గడిచి తెల్లవారింది. పక్షుల కిలకిలారావాలు,నెమళ్ళక్రేంకారాలు,అడవికోడి కూతలతో అరణ్యంలో సందడిసందడిగా ఉంది.సీతారాములు నిదురలేచారు.మరల నడక సాగించారు.

.

కొంతదూరము వెళ్ళగనే వారికి పెద్దపెద్ద జలరాశులు కలుసుకున్న చప్పుడు వినపడ్డది. ఆ జలతరంగ ఘోషను శ్రద్ధగా ఆలకించారు .వారికి అర్ధమయ్యింది అది గంగా యమునల సంగమక్షేత్రమని అతి దగ్గరలోనే ప్రయాగ కలదనీ.

.

వారు నడుస్తున్న ప్రాంతంలో మనుషులచే విరవబడినట్లుగా కర్రముక్కలు కనపడ్డాయి. తలెత్తి పరీకించి చూసారు. దూరంగా పొగ ఆకాశంలోకి వెడుతూ కనపడ్డది.

.

ఉత్సాహంగా నడక సాగించారు .ఒక ఆశ్రమ పరిసరప్రాంతాలలో తామున్నట్లు గ్రహించారు.అది భరద్వాజమహర్షి ఆశ్రమము.

.

ఆశ్రమంలో అడుగు పెట్టగానే ధనుర్ధారులైన వారిని చూసి ఆశ్రమంలోని మృగాలు భయపడ్డాయి.

.

వారు మువ్వురూ శిష్య గణంతో శోభిల్లుతున్న భరద్వాజ మహర్షికి వినయంగా నమస్కారములు చేసి తమను తాము పరిచయం చేసుకున్నారు.

.

మహర్షీ నన్ను రాముడంటారు దశరధమహారాజు పుత్రుడను,ఈ కల్యాణి సీత జనకరాజపుత్రి అనిందిత నా సహధర్మచారిణి.

.ఈతడు నా సోదరుడు లక్ష్మణుడు నా తండ్రి నన్ను అరణ్యములకు పంపగా తనంతతానే నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు.

.

మహర్షీ ! నా తండ్రి ఆజ్ఞమేరకు మేము అరణ్యవాసము చేస్తూ కందమూలఫలములములు స్వీకరిస్తూ కాలం గడిపెదము.అని పలికిన రాముని చూసి రామా నీ గురించి అంతా విన్నాను.

.

ఎంతో కాలానికి మా ఆశ్రమానికి వచ్చావు మా ఆతిధ్యం స్వీకరించు అని మధుర ఫలరసాలతో కూడిన కమ్మని ఆహారం ( తాపసులు భుజించేది,అరణ్యంలో లభ్యమయ్యేవి) వారికి అందచేసి వారుండటానికి బస ఏర్పాటు చేశాడు భరద్వాజ మహర్షి.

.

మరల రాత్రి రానే వచ్చింది .ఎంతో దూరము నడచిన అలసట వల్ల సీతారాములు గాఢంగా నిదురించారు.

.

ఆ రాత్రి తెల్లవారిన పిదప రాముడు మహర్షి వద్ద సెలవు తీసుకొని మహర్షి సూచించిన చిత్రకూటపర్వతం వైపు నడక సాగించారు.ఆ పర్వతము మనోహరమై ఉండి క్రూరమృగ బాధలేని ,తాపసులు నివాసముండే ప్రాంతము .అక్కడికి పది క్రోసుల దూరంలో ఉన్నది.

.

అంతకు ముందు భరద్వాజుడు తన ఆశ్రమంలోనే వనవాసం పూర్తిచేసుకొమ్మని చెప్పినప్పటికీ అది తమ కోసల ప్రజలు తేలికగా రాదగ్గప్రాంతం కావున సున్నితంగా వలదని అనువైన ప్రదేశం చిత్రకూటమని తెలుసుకొని ఆ దిశగా శ్రీ రామ ప్రయాణం సాగింది.

.

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక


.

కామెంట్‌లు లేవు: