1, అక్టోబర్ 2020, గురువారం

శివామృతలహరి


శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||

కరవై పోయెను నీకుపూజలు పురస్కారంబులున్;భక్తి త

త్పరతన్ తావకదివ్యనామ జపముల్ త్వత్పాద సంసేవయున్

సరవిన్ సల్పగనైతి ; దుఃఖమయ సంసారాబ్ది నేరీతి చె

చ్చెర దాటింతువొ కిల్బిషాత్ముడ శివా ! శ్రీ సిద్దలింగేశ్వరా !


భావం;

ఈ సంసార జీవితంలో పడి

నీ యొక్క పూజా పురస్కారాలు సరిగ్గా నిర్వర్తించ లేకపోతున్నాను, పరిపూర్ణమైన భక్తితో నీ దివ్య నామ సంకీర్తనం మరియు నీయొక్క దివ్య పాద సంసేవనం ఒక క్రమ పద్దతిలో చెయ్యలేక పోతున్నాను.

నీకు చెయ్యవలసిన పూజా విధులకు తగు సమయం కేటాయించకుండా పాపం మూట కట్టుకున్న నన్ను ఈ దుఃఖమయమైన సంసార సాగరం నుండి వేగిరంగా దాటించు స్వామీ! సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: