1, అక్టోబర్ 2020, గురువారం

శ్రీమద్భాగవతము

 *వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము"* 🙏  

పద్యం: 1913 (౧౯౧౩)*



*10.1-898-*


*క. పొగరెక్కిన మూఁపురములు;* 

*దెగ గల వాలములు, శైల దేహంబులు, భూ*

*గగనములు నిండు ఱంకెలు*

*మిగుల మెఱయు వృషభగణము మెల్లన నడచెన్.*🌺



*_భావము: మదించిన మూపురములతో, నిడుపై, పొడవైన తోకలతో, కొండల పరిమాణములో నున్న శరీరములు కలవై, భూమ్యాకాశములు దద్దరిల్లేటట్లు రంకెలు వేస్తూ కాంతులీనుచున్న ఆ ఎద్దుల గుంపులు మెల్ల మెల్లగా నడచెను._*🙏



*_Meaning: The bulls, with strong humps and long tails, in the size of a hillock, bellowed loudly creating ripples on earth and sky -  walked steadily towards Gokulam._*🙏

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1914 (౧౯౧౪)*



*10.1-899-వ.*

*10.1-900-*


*మ. "పెరుగుల్ నేతులు ద్రావి క్రొవ్వి, భువి నాభీరుల్ మదాభీరులై*

*గిరిసంఘాత కఠోరపత్రదళనక్రీడా సమారంభ దు*

*ర్భర దంభోళిధరుం బురందరు ననుం బాటించి పూజింప క*

*గ్గిరికిం బూజలు చేసి పోయి రిదిగో కృష్ణుండు ప్రేరేఁపఁగన్.*🌺



*_భావము: ఈ విధముగా కొండకు ప్రదక్షిణములు చేసి లక్ష్మీపతియగు ఆ శ్రీకృష్ణుని తో కూడి వ్రేపల్లె కు వెళ్ళిపోయారు. ఈ సమాచారమంతయు దేవేంద్రుడు తెలిసికొన్నవాడై క్రోధావేశముతో, ప్రళయమును సృష్టించగల (+) సంవర్తకము మొదలైన మేఘములను పిలిచి ఇట్లా చెప్పాడు: "ఈ భూలోకములో నున్న గోపాలకులు పాలు, పెరుగులు, నెయ్యి త్రాగి కొవ్వెక్కి అహంకారంతో ఉన్నారు. కొండలను, వాటి రెక్కలను పిండి చేయగల వజ్రాయుధము ధరించి, పట్టణములను సర్వనాశనము చేయగల నేనంటే ఏ మాత్రము భయము లేకుండా, ఆ కృష్ణుడు రెచ్చకొట్టినందున నాకు పూజలు చేయకుండా నన్ను ధిక్కరించి వెళ్లిపోయారు."_* 🙏


*_+(సంవర్తకాది నవ మేఘములు :: సంవర్తకము, ఆవర్తకము, పుష్కరము, ద్రోణము, కాలము, నీలము, అరుణము, తమస్సు మరియు వారుణము)._*🙏



*_Meaning: As advised by Sri Krishna, the Yadava folk went round the hill, circumambulating it and left for their abodes. Indra got furious on knowing this, called for Samvartaka cloud and its eight associates and told them: "These Yadava folks on earth have turned disdainful and arrogant by consuming huge quantities of Ghee, milk and curd. They did not care for me nor for my powerful weapon Vajrayudha with which I can turn big mountains into powder and destroy all towns and cities. Having been provoked by Krishna, they defied and left without offering Pooja to me."_* 🙏


*_(The nine clouds:- Samvartaka, Aavartaka, Pushkara, Drona, Kaala, Neela, Aruna, Tamas and Vaaruna)._* 🙏🏻


*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*


*-

కామెంట్‌లు లేవు: