2, డిసెంబర్ 2023, శనివారం

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ*

*శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పమ్*

*ఆరుహ్య దుఃఖ జలధౌ పతతో దయాళో*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 09_* _


తా॥

సంసార వృక్షమునకు పాపమే బీజము. సమస్త కర్మలును శాఖలు, ఇంద్రియము లే ఆకులు. మన్మథుడే పూవులు. దుఃఖములే ఫలములు. అట్టి వృక్షము నెక్కి క్రింద పడిపోయితిని. దయాళువగు ఓ నృసింహదేవా! చేయూతనిచ్చి నన్నుద్ధరింపుము. *లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.

కామెంట్‌లు లేవు: