06.03.2025,గురువారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం - శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం
తిథి:సప్తమి మ3.39 వరకు
వారం:బృహస్పతివాసరే (గురువారం)
నక్షత్రం:రోహిణి తె4.34 వరకు
యోగం:విష్కంభం రా12.53 వరకు
కరణం:వణిజ మ3.39 వరకు
తదుపరి విష్ఠి రా2.41 వరకు
వర్జ్యం:రా9.00 - 9.31
దుర్ముహూర్తము:ఉ10.14 - 11.01 మరల మ2.55 - 3.42
అమృతకాలం:రా1.32 - 3.03
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:6.20
సూర్యాస్తమయం:6.03
కాలం భగవంతుని స్వరూపం. ఈ సష్టిలో అత్యంత బలమైనది కాలమే. కాలానికి సమస్త జీవరాశీ వశపడవలసిందే. కాలానికి లొంగకుండా బతకగలిగినది ఈ సష్టిలో ఏదీ లేదు. అందుకే శ్రీ రామాయణంలో కాలం గురించి చెబుతూ...‘‘కాలోహి దురతి క్రమః’’ అంటారు మహర్షి. అంటే ..కాలాన్ని దాటడం, తనకు వశం చేసుకోవడం, దాన్ని కదలకుండా చేయగలగడం...లోకంలోఎవరికీ సాధ్య పడదు–అని. సాధారణ సిద్ధాంతంలో అందరూ కాలానికి వశపడవలసిందే.
కాలంలో పుడతారు, కాలంలో పెరుగుతారు, కాలంలోనే శరీరాన్ని విడిచి పెడతారు. అందరూ కాలానికి వశపడి ఉంటారు. కానీ ఎవడు భగవంతుడిచ్చిన జీవితం అనబడే ఈ శరీరంతో ఉండగలిగిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు తన శరీరాన్ని విడిచి పెట్టేసిన తరువాత కూడా కీర్తి శరీరుడిగా నిలబడిపోతాడు. ఆయనకి కీర్తే శరీరం అవుతుంది. ఆయన కాలంతో సంబంధం లేకుండా యుగాలు దాటిపోయినా కూడా కొన్ని కోట్ల మందికి ప్రేరణగా అలా నిలబడిపోతాడు. అందుకే మనుష్యుని జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడేది – కాలం విలువను గుర్తించడం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఎవడు కాలం విలువని గుర్తించలేడో ఎవడు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదో వాడు కాలగర్భంలో కలిసిపోతాడు. ఆ జీవితం ఏ విధంగా కూడా ఉపయోగకరం కాదు. తనను తాను ఉద్ధరించుకోవడానికిగానీ, మరొకరిని ఉద్ధరించడానికిగానీ పనికిరాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి