ఈపద్యం పాల్కురికి సోమన రచయించిన వృషాధిపశతకంలోనిది
"
"బలుపొడతోలు సీరయును బాపసరుల్ గరుపారుకన్ను వె
న్నెలతల చేదుకుత్తుకయు నిండినవేలుపుటేరు పల్గుపూ
సలుగలరేని లెంకనని జానుతెనుంగున విన్నవించెదన్
వలపు మదిందలిర్ప బసవా బసవా వృషాధిపా!!"
మచ్చలుగల గజచర్మమే వస్ర్తం. పాములేహారాలు . వంకరటింకరకళ్ళు . వెన్నెలనిండినతల. నెలవంకధారణ.
కంఠంలోవిషం. తలపైనగంగ. పుర్రెలహారం .,ఇదీ ఆయవ వ్యవహారం.
పరమశివా!
ఇట్టినీకుసేవకుడనని ప్రేమతోపలుమార్లు జానుతెనుగులో విన్నవిస్తాను
బసవా బసవా అంటూస్మరిస్తాను
అంటూకవివృషాధిపశతకం రచించాడు. ఇందులో మనం గమనింపతగినది "జానుతెనుగు'- అంటేనాటి వ్యవహారంలోఉన్న
తెలుగన్నమాట',
పైపద్యస్వరూపమంతాజానుతెనుగే!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి