🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::
87వ దివ్యదేశము 🕉
🙏శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయం : పరమేశ్వర విన్నగరం దేవాలయం, కాంచీపురం 🙏
🔅 ప్రధాన దైవం:.వైకుంఠ పెరుమాళ్
🔅 ప్రధాన దేవత:వైకుంఠ నాయకి
🔅 పుష్కరిణి: ఐరంమద తీర్థము
🔅 విమానం: ముకుంద విమానము
🔔స్థలపురాణం 🔔
💠 విరోచనుడు అను ఒక మహారాజు సంతానము లేక కాంచీపురమున కైలాస పతి పరమేశ్వరుని పూజించి ప్రార్థించు చుండెను . అతనికి ఇద్దరు కుమారులు కలిగిరి .
వారికి ఆ రాజు పల్లవన్ , వల్లవన్ అని నామకరణము చేసి పెంచెను .
పల్లవన్ , వల్లవన్ పెద్దవారై గొప్ప విష్ణు భక్తి కలిగి తమ ప్రజలను మంచి దక్షతతో జన రంజకముగా పరిపాలించుచు గొప్ప రాజులుగా పేరుపొందిరి .
వారు ఒక సమయమున ఈ పురమున ప్రజాహితమే కామ్యముగా అశ్వమేథ యాగమును చేసిరి .
అంతట శ్రీమహావిష్ణువు వారికి పరపద నాథన్ ( వైకుంఠనాథన్ ) గా ప్రత్యక్షము నిచ్చి అనుగ్రహించి వారి జీవితమును ధన్యము చేసెను . వారు ఇరువురు శ్రీమహావిష్ణువు యొక్క ద్వారపాలకులే . కారణ విశేషమున భూలోకములో జన్మించవలని , విరోచన మహారాజునకు సంతానముగా జన్మించి గొప్ప విష్ణు భక్తులుగా జీవితమును సాగించి మంచి రాజులుగా రాణించి , పెరుమాళ్ దర్శన భాగ్యము పొంది , అంతమున విష్ణులోకమునకు తిరిగి ప్రస్థానము చేసిరి .
💠 ఈ స్థలపురాణములో విశేమేమనగా - విరోచన మహారాజు సంతానమునకై పరమేశ్వరునికి పూజార్చనలు చేసి ప్రార్థించగా విష్ణుభక్తి పరాయణులైన కుమారులు జన్మించిరి .
ఈ విధముగా మనలో శివ - వైష్ణవ అనుయాయులందు పరస్పర సామరస్యము , సద్భావములే ఉండవలయును విభేదములు . అనంగీకారభావములు , కలహములు ఉండుట సరికాదు అని పరమాత్ముడు సందేశము నొసంగుటయే కదా !
💠ఈ ఆలయము మూడు అంతస్థులలో ఉండును .
పెరుమాళ్ భూతలమున ఆసీనమూర్తి , మధ్య తలమున శయన మూర్తి , ఆ పైన నిలిచి యున్న మూర్తిగా దర్శన మిచ్చును .
నిలిచి యున్న మూర్తికి నిత్య పూజా లేవు . ఈ ఆలయమును సింహ వర్మ అను పల్లవ రాజు కుమారుడు పరమేశ్వర వర్మ నిర్మించెను . అందువలన " పరమేశ్వర విణ్ణగరమ్ " అని ప్రసిద్ధి చెంది యున్నది .
💠 గొప్ప శిల్ప కళా సంపద ఉన్న అత్యద్భుత క్షేత్రము. కంచి రైల్వే స్టేషన్‌కు 1 కి.మీ. దూరములో ఉంది.
💠 శుక్రవారం శ్రీ వైకుంఠవల్లి తన తల్లిని ప్రార్థిస్తే వివాహం త్వరలో జరుగుతుందని భావిస్తున్నారు.
🙏జై శ్రీమన్నారాయణ 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి