☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*విష్ణు సహస్రనామ స్తోత్రము*
*రోజూ ఒక శ్లోకం*
*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్లోకం (68)*
*అర్చిష్మానర్చితః కుంభో*
*విశుద్ధాత్మా విశోధనః ।*
*అనిరుద్ధోప్రతిరథః*
*ప్రద్యుమ్నోమితవిక్రమః ॥*
*ప్రతి పదార్థం:~*
*637) అర్చిష్మాన్ - తేజోరూపుడు, అత్యంత కాంతి ప్రదమైన వాడు;*.
*638) అర్చిత: - సమస్త లోకములచే పూజింప బడువాడు.;*
*639) కుంభ: - సర్వము తనయందుండువాడు. విశ్వమంతా భగవానుని గర్భమునే భాండంలో ఇమిడి ఉంది;*
*640) విశుద్ధాత్మా - పరిశుద్ధమైన స్వభావము (గుణము,ఆత్మ) కలవాడు.*
*641) విశోధనః - పవిత్రము చేయువాడు; తనను స్మరించు వారి పాపములను నశింపచేయువాడు;*
*642) అనిరుద్ధః - నిరోధింప బడనివాడు;*
*643) అప్రతిరథ: - సాటి లేని వాడు; ఇతనితో పోటీ వేరెవ్వరు లేరు; తన నెదుర్కొను ప్రతిపక్షము లేని పరాక్రమవంతుడు.*
*644) ప్రద్యుమ్న: - విశేష ధనము కలవాడు; భక్తులయందే ఉండి వారిని ప్రకాశింప చేయువాడు; విశేషమైన ఐశ్వర్యము సంపద కలిగి భక్తులను అనుగ్రహించు వాడు;*
*645) అమిత విక్రమ: - విశేష పరాక్రమము కలవాడు; అమిత బలపరాక్రమాలు కలవాడు.*
*తాత్పర్యము:~*
*అత్యంత కాంతి ప్రదమైనవాడును, సర్వులచేత పూజింప బడువాడును, సమస్త వస్తువులును కుండలో చక్కగా నిమిడియున్నట్లు అనంతమగు విశ్వమంతయును తన గర్భమందే చక్కగాఇముడ్చుకున్నవాడును, బాగుగా పరిశుద్ధమైన ఆత్మయైనవాడును, స్మరణ మాత్రమున భక్తుల సకల పాపములను పొగొట్టువాడును, శత్రువులెవ్వరిచేతను నిరోధింపబడనివాడును, తనకు ప్రతిపక్షమే లేనివాడును, విశేష ధనము గలవాడును, సాటిలేని బలపరాక్రమ సంపన్నుడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను.*
*పాఠకులందరికీ శుభం కలుగు గాక ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*సూచన*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*అనూరాధ నక్షత్రం 4వ పాదం జాతకులు పై 68వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ఓం నమో నారాయణాయ!*
*ఓం నమః శివాయ!!*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి