🌸 *మాతృభాషౌన్నత్యము* 🌸
సీ.
కన్నతల్లియొడిని కల్గు సౌఖ్యము మించు
సౌఖ్య మెందును లేదు జగతియందు
మాతృహస్తములోని మార్దవమును మించు
మార్దవ మేచోట మనకు లేదు
జననిమనసులోని సౌకుమార్యము మించు
సుకుమారమెట లేదు శోధజేయ
ధరపైన వెలసిన దైవమ్మె మనతల్లి
యట్టి తల్లిని మించు నన్యమేది?
తే.గీ. ఇన్ని సుగుణాల కలుగుచు నెన్నదగిన
మాతృదేవత మరియొండు మాతృభాష
యట్టి భాషామతల్లికి నంజలింతు
శ్రేష్ఠతమమైన మాతకు జేజె యనుచు
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి