30, సెప్టెంబర్ 2025, మంగళవారం

మూత్రం బిగించి మృత్యువుకి దగ్గర్లో ఉన్న రోగిని కాపాడే సిద్ద యోగం -

 మూత్రం బిగించి మృత్యువుకి దగ్గర్లో ఉన్న రోగిని కాపాడే సిద్ద యోగం - 

   

*. కొండపిండి మొక్క సమూల చూర్ణం , చిన్న యాలుకల పొడి , శుద్ది చేసిన కర్పూర శిలాజిత్ పొడి , దోరగా వేయించిన పిప్పిళ్ళ పొడి సమభాగాలు గా కలిపి ఉంచి రెండు పూటలా పూటకు అర టీ స్పూన్ పొడి అర గ్లాస్ బియ్యం కడిగిన నీటిలో కలిపి తాగుతూ ఉంటే మూత్రం వెంటనే బయటకు వచ్చి చావుకి దగ్గరగా వెళ్లిన రోగి కూడా జీవించే అవకాశం ఉంది.

     

*. తమలపాకులు కి ఆముదం రాసి మంట దగ్గర కొంచం వేడి చూపించి పొత్తి కడుపు మీద వేస్తే కొంచం సేపట్లో పొత్తికడుపు ఉబ్బు పోయి బంధించిన మూత్రం బయటకి వచ్చి రోగి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. ఇది నా అనుభవపూర్వకం . 



 మరింత విలువైన సమాచారం, సంపూర్ణ వివరణ మరియు అనేక రకాలైన వ్యాధులకు అతి సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 



గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

చక్కని పద్యం

 అపురి బాయకుండు, మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా

షాపరశేషభోగి , వివిధాధ్వ రనిర్మలధర్మకర్మ దీ

క్షాపరతుంత్రు డంబురుహ గర్భకులాభరణం, బనారతా

ధ్యాపనతత్పరుండు, ప్రవరాఖ్యుడలేఖ్య తనూ విలాసుఁడై

29, సెప్టెంబర్ 2025, సోమవారం

Panchaag


 

27, సెప్టెంబర్ 2025, శనివారం

పరిమళ ద్రవ్యముల చరిత్ర

 ఆయుర్వేదము నందలి భాగమైన పరిమళ వైద్యము గురించి సంపూర్ణ వివరణ -

     

పరిమళ ద్రవ్యముల చరిత్ర అత్యంత పురాతనమైనది. రమారమి మూడువేల సంవత్సరాల క్రితమే వేదములలో వర్ణింపబడిన  " పరోమ" విధానమున పరిమళ పుష్పముల యొక్క మరియు సుగంధద్రవ్యముల యొక్క ప్రస్తావన కలదు.  ఋషులు పరిమళభరితమైన ధూపము దేవతలను ఆవాహనకు ఉత్తమ సాధనగా భావించిరి. ఆనాడు హోమధూపమును వాతావరణము నందలి కల్మషము ప్రక్షాళణ చేయుటకు , దుర్గన్ధమును , రోగాసాంక్రమిక క్రిములను పారద్రోలుటకు సాధనాభూతముగా ఉపయోగించేవారు. 

              

వరాహమిహిరుడు తన బృహత్సంహిత నందు పరిమళ ద్రవ్యముల గురించి వివరించెను. ఆనాడు శ్రీగంధం ఎక్కువుగా వాడుక నందు ఉండేది. జాజి , దవనం , మరువం , కస్తూరి , కర్పూరం , కుంకుమపువ్వు మున్నగు వస్తువులు కూడా ఉపయోగించేవారు .

     

.  ప్రముఖ మరాఠ కవి గంగాధరుడు  "గంధసార - గంధపాత" అను గ్రంథముల యందు పరిమళ ద్రవ్యముల గురించి తెలుపుచూ వాని తయారీ మరియు వినియోగించే విధానం గురించి వివరించాడు. దాదాపు 1500 సంవత్సరముల నాటి పంచతంత్రమున విష్ణుశర్మ సుగంధద్రవ్యముల వర్తకము , బంగారు వర్తకము కంటే లాభసాటిది అని చెప్పుటను గమనిస్తే ఆకాలము నందు వాటిపై ప్రజలకు గల ఇష్టాన్ని మనం గమనించవచ్చు .

         

ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్ దేశము నందలి కుమ్రాన్ గుహలలో తవ్వకాలు జరిపినపుడు పురాతన శాస్త్రవేత్తలకు ఒక పాతనూనె సీసా కనిపించింది. ఆ సీసాను పరిశోధించినప్పుడు అది 2000 సంవత్సరాల పూర్వమునకు చెందినది అని తేలింది . అప్పటి మహారాజులు పరిమళద్రవ్యముగా ఆ సీసా నందలి తైలమును వాడేవారు అని బయటపడినది. ఇన్ని సంవత్సరాలు గడిచినను ఆ సీసా నందలి పరిమళద్రవ్యము ఘుమఘుమలాడుచుండెను. 

                   

ప్రాచీన కాలము నందు భారతదేశము , పర్షియా , ఈజిప్టు సుగంధద్రవ్యముల తయారీలో అగ్రగాములుగా ఉండెను . వారు ఆకులు , పువ్వులు , వ్రేళ్లు దంచి చమురులో నానబెట్టి పరిమళద్రవ్యములు తయారుచేసెడివారు. పరిమళ వస్తువులు రోగనివారణలో ప్రముఖ పాత్ర వహించునని ఆయుర్వేద తంత్రకర్త చరకుడు తన చికిత్సాసారమున తెలిపి గంధము , గోరింట , వట్టి వేళ్లు , తామర , కలువలు మున్నగు వానితో సిద్ధము చేసిన తైలములతో చికిత్స చేయు విధానమును వివరించెను. 

                   

"సుఖాంతి' అను పుష్ప పరిమళము నిర్ణీత సమయమున నిత్యం వాసన చూసుట వలన ఉబ్బసం వంటి శ్వాశకోశ వ్యాధులు నయం అగును. చంద్రమోహ పుష్పముల సుగంధము మానసిక వ్యాధులకు విరుగుడుగా పనిచేయును . పవనాలి అనే పుష్పముల సుగందము రక్తపోటుకు విరుగుడుగా పనిచేయును . ఈ పువ్వులన్నియు హిమాలయముల యందే లభించును. కొన్ని రకాల పుష్ప సుగంధములను లోపలికి పీల్చుట చేత తలనొప్పి నుండి గుండెపోటు వరకు అనేక రోగములను నయం చేయవచ్చు . 


. ఇప్పుడు మరికొన్ని మూలికా సువాసనల ఉపయోగాలు తెలుసుకుందాము.


 * పుదీన -

       

. కొన్ని ఆకులను నలిపి వాసన చూసిన యెడల అరుచి , అగ్నిమాంద్యము , నోటి దుర్గంధం , శిరోభారం , దగ్గు , జలుబు నశించును. దీనిని కూరలలో , పచ్చళ్లలో వాడినయెడల రుచిని పెంచును.

 

 * కొత్తిమీర -

       

. దీని వాసన చూచినయెడల వాంతులు అరికట్టును. మనసుకు శాంతముగా ఉండును. తలనొప్పి నివారణ అగును. 


 * దాల్చినచెక్క - 

        

. శ్రీలంక యందు దీని చెట్లు ఉండును. దీని ఆకులను లేదా చెక్క నుంచి తీసిన తైలము నందు నయుజినాల్ , సిన్నామిక్ , అల్దేహైడ్ , పప్పెన్ , ఆల్కాల్సు , బెంజిల్ బెంజోయెట్ సాపరోర్ , ఫర్ ఫ్యులాల్ ఓనోవ్ మున్నగు రసాయనాలు ఉండును. ఇది వాసన చూసినను లేదా తలకు రాచుకొనుచుండిన యెడల దీర్ఘకాలంగా వేధిస్తున్న తలనొప్పి , జలుబు , పొడిదగ్గు నివారించబడును. కడుపులొకి వాడుచున్న కడుపునొప్పి , కడుపుబ్బరం , అతిసారం , రక్తపిత్తము , తెల్లకుసుమ తగ్గును. పాము కరిచినప్పుడు రక్తం పిండి దీని అరుకు అంటించిన యెడల విషము హరించును .

 

 మత్తెక్కించే సువాసనలు -

 

* గోరింట పువ్వుల గుత్తులను వాసన చూచుచుండిన లేదా తలకింద పెట్టుకుని నిద్రించిన యెడల గాడనిద్ర పట్టును .

 

* వెలగ చెట్టు ఆకు వాసన చూచిన యెడల వాంతులు నిలుచును . తలగడ కింద పెట్టుకుని నిద్రించిన యెడల గాడనిద్ర పట్టును .

 

* గసగసాలు ఒక స్పూన్ తీసుకుని నాలుగు చుక్కలు ఆవునెయ్యి వేసి ఒక ఇనప గంటెలో వేయించి పలచటి బట్టలో వేసి వాసన చూస్తున్న యెడల గాడనిద్ర పట్టును .


 * దవనం , మరువం , జాజి , జాపత్రి , యాలుకలు , చందనం , కురువేరు వంటి ఔషధ తైలాలు గాడనిద్రను కలుగచేయును .

          

. పైన చెప్పిన గాడనిద్రను కలుగచేయు యోగాలను నిద్రపట్టక ఇబ్బంది పడువారు తప్పక ఉపయోగించుకొని సమస్యల నుంచి బయటపడవచ్చు.

                       


. సంపూర్ణం 



మరింత విలువైన సమాచారం, సంపూర్ణ వివరణ మరియు అనేక రకాలైన వ్యాధులకు అతి సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

తెలుగు నేల

 తెలుగు నేల 


అలతి పదమ్ముల నన్నమాచార్యుండు 

          హరికీర్తనమ్ముల నల్లె నిచట

భద్రాద్రిరాముని ప్రస్తుతి చేసి తా

         రమ్యతన్ గీర్తించె రామదాసు 

మువ్వగోపాలుపై మురిపెంపు పదములన్

          బల్కి క్షేత్రయ్యిట బడసె ముక్తి

స్వరబ్రహ్మ త్యాగయ్య వరలినభక్తితో

          దివ్యకీర్తనముల తీర్చె నిచట

వసుధ వరలెడి గాన విద్వాంసులకును

జానపదులకు సంగీతజ్ఞానులకును 

భక్తి సంగీత జ్ఞానమ్ము పంచినట్టి

దివ్యమైనట్టి ధాత్రి యీ తెలుగు నేల



శ్రీవేంకటేశ్వర క్షేత్రమ్ము వెలసియు

        విశ్వమ్ము నందున వినుతి చెందె

లక్ష్మీనృసింహుని సుక్షేత్రరాజమై 

         విలసిల్లె యాదాద్రి విభవముగను 

భవ్యగోదావరీ పావనతీరాన

         భద్రాద్రినిలయము పరిఢవిల్లె

దివ్య ద్వాదశలింగతీర్థమై నటువంటి

          శ్రీశైలలింగ మీ క్షితిని వెలసె

సకల హరిహరక్షేత్రాల సంగమంబు

భవ్య పావన వాహినీ ప్రాంతయుతము

హరిత కానన విరిసస్య భరిత మైన 

దివ్యమైనట్టి ధాత్రి యీ తెలుగునేల


               

బసవపురాణమున్ ప్రజల కందించిన

      పాల్కురికి కవీంద్రు ప్రాంత మిద్ది

తెలుగుభారతమును తీర్చి దిద్దిన యట్టి

     నన్నయ్య యున్నట్టి మన్ను యిద్ది

భారత గ్రంథానపదునైదు పర్వాల   

      చెప్పిన తిక్కన క్షేత్ర మిద్ది

భాగవతమ్మును భక్తాళి కిచ్చిన

 పోతన బుట్టిన పుడమియిద్ది

భారతేతిహాస పురాణ వర్గములును

భవ్య సాహిత్య జటిల ప్రబంధములును

నెలవుగా పొంది దశదిశల్ వెలిగినట్టి

దివ్యమైనట్టి ధాత్రి యీ తెలుగు నేల


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

మనసు వృత్తి**

 **మనసు వృత్తి**


👉నా పంధాయే నాకు ముఖ్యం

👉నేను ఏది వినను

👉నాకు విచక్షణ వద్ధు

👉నాకు నిజాయితి అంటే గిట్టదు

👉నేను చెప్పేది ఒకటి, నేను చేసేది ఇంకొకటి

👉మోసం చేయడమే నా వృత్తి 


లాభం: పంతాన్ని సాధించుకోవడం


నష్టం: ఎన్నో జన్మలు ఎత్తుతూ తీవ్ర దుఃఖంలో మునిగి పోవడం. ఆత్మకే ద్రోహం చేయడం


**బుద్ధి వృత్తి**


👉నేను వింటాను.

👉నేను వింటున్నాను.‌

👉 నేను విచక్షణను

👉 నేను నిజాయితీని

👉నేను చెప్పేదే చేస్తాను, నేను చేసిందే చేబుతాను. 

👉మోసం చేయడం నా వృత్తి కాదు‌. 


లాభం: మనశ్శాంతి, జన్మరాహిత్యం.


నష్టం: డబ్బు, పదవి, పేరు ప్రతిష్టల మీద మోజు నశించడం


**శరీర వృత్తి**


👉 భానిసలాగ తిరుగడం.

👉అనారోగ్యం మరియు శరీర భాధలు


**ఆత్మ వృత్తి**


👉ఇవన్నింటికీ ఆధారంగా  

**నేను ఉన్నాను**


👉నేను ఉన్నాను ఉనికిగా

👉నేను ఉన్నాను శాంతిగా

👉నేను ఉన్నాను అనుభవంగా

👉నేను ఉన్నాను విస్తృతంగా

👉నేను ఉన్నాను దృఢంగా

👉నేను ఉన్నాను విశాలంగా

👉నేను జన్మించలేదు, కాబట్టి నాకు మరణ‌ లేదు.

👉నేను ఉన్నాను ఏ ఆలోచనలకూ అందని అనుభూతిగా అంటుంది.


కర్తవ్యం ఏంటి? 


1️⃣ ఎవరిని పట్టుకోవాలి?

      ఎవరిని పట్టించుకోవద్ధు? 


2️⃣ ఎవరిని నమ్ముకోవాలి? 

      ఎవరిని నమ్మవద్ధు?


3️⃣ నేను ఎవరిని? 

👉ఒక ఉనికినా?

👉మనసునా? బుద్ధినా? 

👉శరీరాన్నా? 


4️⃣ నేను ఎలా ఉన్నాను?


ఈ విచారణ ద్వారా విచక్షణను సాధించడం, ఈ విచక్షణలో *మనసు* స్థిరపడేలా చేయడమే కర్తవ్యం. 


భగవాన్ బోధనల దయ ..🙏🙏

ఈ పద్యం గుర్తుందా

 

ఈ పద్యం గుర్తుందా

అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్

అనుగ్రహ భాషణం

 


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹 ఆధ్యాత్మికత అడుగడుగునా కనిపించే ఈ శరన్నవరాత్రులలో పండిత శ్రేష్ఠులు చెప్పే నాలుగు మంచి మాటలు వినడం కంటే అదృష్టం ఏముంటుంది! ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధకులైన ప్రవచన వేత్త జి. శివప్రసాద శాస్త్రి గారు ప్రత్యేకంగా అందిస్తున్న ఈ అనుగ్రహ భాషణంలో మన ధర్మం ఏమిటో, దానిని ఎలా అనుసరించాలో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం -‌ చతుర్థి - విశాఖ -‌‌ భృగు వాసరే* (26.09.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

25, సెప్టెంబర్ 2025, గురువారం

చతుర్ధావస్థ

చతుర్ధావస్థ  

మోక్షార్ధులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది. ప్రతి సాదారణ మానవుడు తన దైననందికే జీవితంలో మూడు అవస్థలలో జీవితాన్ని గడుపుతాడు.కేవలం జ్ఞాని మాత్రం నాలుగవ అవస్థను పొందగలుగుతాడు దానిని తురీయావస్థ లేక సమాధి స్థితి అని అంటారు. ముందుగా  ఈ మూడు అవస్థలలో ఆత్మ జీవునితో (మానవునిలో) ఎలా ఉంటుంది.అది చూద్దాము  అవి ఏమిటంటే 

1) జాగ్రతావస్థ 

మనం నిత్యం నిద్రలేచినప్పడి నుండి మరల నిద్రించే వరకు ఈ స్థితిలోనే ఉంటాము జాగ్రత్తావస్థలో ఆత్మా శరీరంలో ఉంది ఈ చరాచర జగత్తుతో సంచరిస్తూ ఉంటుంది. దశ ఇంద్రియాలు (5 జ్ఞానేంద్రియాలు, 5కర్మేంద్రియాలు) తేజోమయంగా (active )గా ఉండి ఐహిక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. అంటే కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, ముక్కు వాసన చూస్తూ ఉంటుంది, చర్మం స్పర్శ కలిగి ఉంటుంది. జిహ్వ రుచుల చూస్తూ ఉంటుంది. అంటే దాని అర్ధం అవి అన్ని ఒక్కసారి వాటి పనులు చేస్తాయి అని కాదు. వీటి అవసరం వచ్చినప్పుడు అవి చురుకుగా వాటి పనులు నిర్వహిస్తూ వున్నాయి అన్న మాట. ఒక దృశ్యాన్ని చూడాలంటే కళ్ళు చూడగలవు.  అవి చుసిన విషయాన్నీ మనస్సు ద్వారా చెతన్య స్వరూపమైన ఆత్మకు చేరవేయగలవు. అనుకుంటే తాత్కాలికంగా కళ్ళు మూసుకొని కొంత సమయం చూడటం అనేది చేయకుండా ఉండవచ్చు. మరల కావాలంటే కళ్ళు తెరుచుకొని చూడగలవు. అంటే పాటిది మనస్సు నిర్వహించగలదు. అలాగే ముక్కు, చెవి కూడా చేయగలవు. అలాగే కర్మేంద్రియాలు కూడా వాటి వాటి కర్మలను అంటే ఇవి కూడా  ఐదు రకాలు:అవి  వాక్కు (మాట్లాడటం), పాణి (చేతులు), పాదం (కాళ్లు), పాయువు (మలద్వారం), మరియు ఉపస్థ (అంగం). జ్ఞానేంద్రియాల వలె కాకుండా, కర్మేంద్రియాలు మన పనులు, కదలికలు, మరియు శారీరక కార్యకలాపాలను నియంత్రిస్తాయి. ఈ పది ఇంద్రియాలు జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి ఈ అవస్థను జాగ్రదావస్థ అని పేర్కొన్నారు. జాగ్రత్తవస్థలో వున్న ఆత్మ మొదటి పాదంగా తెలియవడుతున్నది దీనికి వైశ్వానరుడు లేక విసుడు అని పేరు ఎందుకంటె ఇక్కడ ఆత్మ విశ్వముతో సంయమం కలిగి ఉన్నందున ఈ పేరు వచ్చింది

2) నిద్రావస్థ లేక సుషుప్తావస్థ 

జాగ్రత్తవస్థలో  రోజంతా శారీరిక వ్యాపారాలు చేసిన ఆత్మా విశ్రాన్తి తీసుకునే అవస్తే నిద్రావస్థ లేక సుషుప్తావస్థ ఈ స్థితిలో మనస్సు లయమై ఉంటుంది. నిద్రలో చాలామటుకు శరీరం చేష్టలు లేకుండా ఉంటుంది. అంటే ఇంద్రియాలు వాటి పనులు చేయవు. కానీ ఆత్మ మాత్రం జాగృతంగానే ఉంటుంది ఈ స్థితిలో వున్నా ఆత్మ పాదాన్ని ప్రాజ్ఞుడు గా పేర్కొన్నారు.  

ప్రాజ్ఞుడు అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు...
(i) ప్ర+అజ్ఞ = ప్రాజ్ఞ : అంటే గొప్ప అజ్ఞానం అని. ఈ సుషుప్తిలో ఏమీ తెలియదు. నీవెవరో తెలియదు. ఎక్కడున్నావో తెలియదు, నీ భార్యబిడ్డలు ఎవరో తెలియదు. అసలు నీవున్నావో లేవో తెలియదు. అందుకే గొప్ప అజ్ఞానం అనే అర్థం బాగా సరిపోతుంది.
(ii) ప్రా+జ్ఞ = నిరుపయోగమైన జ్ఞానం అని. జ్ఞానం అనేది బయటి ప్రకృతి నుండి జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సుకు చేరుతుంది. తర్వాత బుద్ధికి చేరుతుంది. ఇది జాగ్రదవస్థలో సర్వసాధారణం. అయితే సుషుప్తిలో ఈ జ్ఞానం అనేది మనోబుద్ధుల నుండి, ఇంద్రియాల నుండి ఉపసంహరించబడుతుంది. అంటే అవి జ్ఞానంతో పనిచేయవు. ఏమైందీ జ్ఞానం.. అది మూటగట్టబడి, సీల్ వేసి ఒక మూలన పెట్టినట్లు అవుతుంది. అందువల్ల ఇది నిరుపయోగంగా ఉన్న జ్ఞానం అవుతున్నది. అందుకే ప్రా+జ్ఞ అనేది సరిపోతుంది.
ఇంతకీ ఈ ప్రాజ్ఞుడెవరు? ఆత్మయే - జీవుడే. ఆత్మయా? జీవుడా? ఆత్మయే ఇంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యంలో ఉన్నంత కాలం ఆత్మను జీవుడు అంటారు. ఆ జీవుడే జాగ్రదవస్థలో విశ్వాన్ని చూచే విశ్వుడు. . ఆ జీవుడే సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఉన్న ప్రాజ్ఞుడు. 
3) స్వప్నావస్థ  
మానవుడు నిద్రావస్థలో వున్నప్పుడు నిద్రలో కొంత సమయం స్వప్నాన్ని కంటాడు. ఈ స్వప్నం అనేది జీవుడు సృష్టించుకున్న ఒక అవస్థ ఈ అవస్థలో ఇంద్రియాలు పనిచేయవు కానీ ఇంద్రియ వ్యాపారాలు గోచరిస్తాయి అదెలా అంటే తన స్వప్నంలో ఒక సుందరమైన దృశ్యాన్ని చూస్తాడు ఒక చక్కటి ఉద్యానవనంలో పూల సుగంధాన్ని అనుభవిస్తాడు, చక్కటి భోజనాన్ని ఆరగించి వాటి రుచులు అనుభవిస్తాడు. అన్ని ఇక్కడ పంచేంద్రియాలు లేవు కేవలం అనుభూతి మాత్రమే వున్నది. ఈ సుషుప్తిలో జీవుడు ఎక్కడ ఉండి తన కార్యకలాపాలు సాగిస్తాడు.. అంటే హృదయస్థానంలో ఉండి. విత్తనంలో కొమ్మలు, పూలు కనిపించకుండా ఉన్నట్టు సుషుప్తిలో జగత్తు కనిపించకుండా ఉంటుంది.ఆ జీవుడే స్వప్నావస్థలో స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటున్న తైజసుడు..
మనం ఇక్కడ ఆత్మను మూడు అవస్థలాల్లో మూడు రకాలుగా అంటే  వైశ్వానరుడు, ప్రాజ్ఞుడు, తైజసుడు. అని మూడు ఆత్మలుగా ఉన్నాయా అంటే కనే కాదు. కానీ ఇవి మూడు వేరు వేరు పాదాలుగా చెపుతున్నాము. అది ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక ఉదాహారణ చూద్దాము. ఒక మనిషి తన భార్యకు భర్త అంటే తానూ ఇంట్లో వున్నప్పుడు ఒక భర్తగా తన భార్యను చూసుకుంటాడు. అదే మనిషి ఆఫీసులో ఒక ఆఫీసరుగా తన భాద్యతలను నిర్వహిస్తాడు. మరి తన పిల్లల ముందు ఒక తండ్రిగా తన భాద్యతలను నిర్వహిస్తాడు నిజానికి అతను ఒక సాధారణ మానవుడు కానీ ఒక్కొక్కళ్ళ వద్ద ఒక్కొక్క బాధ్యత నెరవేరుస్తూ జీవితాన్ని గడుపుతాడు. అదేవిధంగా ఆత్మ ఒక్కొక్క అవస్తలో ఒక్కొక్క పాదాన్ని కలిగి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. 
4)  తురీయ అవస్థ
ఇప్పటివరకు చెప్పిన అవస్థలు సాధారణముగా మన అందరికి అనుభవంలో వున్నవి. కానీ చెతుర్ద అవస్థ మాత్రం  కేవలము జ్ఞానులు మాత్రమే పొందగలరు. దీనిని తురీయ అవస్థ లేక సమాధి స్థితి అని అంటారు. నిద్రావస్థలో స్వప్నావస్త వస్తుందని నాకు తెలుసు. అదేవిధంగా ఈ తురీయ అవాస్ట్ జాగ్రదావస్థలోనే వస్తుంది. అంటే ఇక్కడ ఆత్మ ఆత్మలో సంయమం చెంది ఉంటుంది. అంటే జాగ్రదావస్తలో వున్నా కూడా ఆత్మ విశ్వనరుడుగా ప్రవర్తించాడు అంటే బాహ్య ప్రపంచ జ్ఞానం కలిగి ఉండదు. మెలకువతో వున్నా కూడా ఈ ప్రపంచంతో సంబంధము లేకుండా సాధకుడు ఉంటాడు. ఒక అద్వితీయమైన అనుభూతితో వుంది ఆత్మానుభవం కలిగి ఉంటాడు. అట్టి స్థితే మోక్ష స్థితి. అది కేవలం ఎంతో సాధనచేసి ఆత్మ పరిపక్వత సిద్దించుకుంటే మాత్రమే కలుగుతుంది. ఈ స్థితిలో ఆత్మ నాలుగవ పాదమైన తూరీయుడుగా పిలువబడతాడు. ప్రతి సాధకుడు అత్యంత కఠోర సాధన చేసి చివరకు ఈ స్థితిని చేరుకుంటాడు. 
మనకు అత్యంత శక్తివంతమైన సూక్ష్మమైన జ్ఞానాన్ని ప్రసాదించిన మహర్షులు సదా స్మరణీయులు.

 



ఎంతటిపుణ్యమో

 శు భో ద యం 🙏


"ఎంతటిపుణ్యమో శబరియెంగిలిఁగొంటివి వింతగాదె నీ

మంతన మరయఁగా,యుడుత మైని కరాగ్రనఖాంచలమ్ములన్

సంతసమందఁజేసితివి;సత్కులజన్మములేమిలెక్క?వే

దాంతముగాదె,నీమహిమ!దాశరధీ కరుణాపయోనిధీ!

- కంచెర్ల గోపన్న.


    భగవంతుని లీలలు అనుాహ్యములు.శబరి భిల్లకాంత,పండుముదుసలి.ఆమెయొసగిన యెంగిలి పండ్లను ముదమారగ నారగించి ఆమెకు మోక్షము నొసంగెను.

  సేతుబంధనసమయమున ఉడుత చేయు సాయమును పరికించి పులకితుడై దానివీపున తనకరాగ్రముననిమిరెను.కరుణార్ద్రములైన స్వామి చేతిచిన్నెలు ముచ్చటగొలుపు చారలుగా నాజాతికి దఖలు పడినవి.

     ఏమిది?స్వామి తనభక్తులపట్ల చూపు కారుణ్యమునకు హద్దులులేవు.చిన్నపెద్దలను తారతమ్యములు లేవని తెలియజెప్పుటగదా?

       రామా! నీమహిమ వేదాంతమయ్యా!మాటలకందదు.

                   స్వస్తి!!!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నవరాత్రి వేడుకలు

 


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹విజయ దశమికి ముందు పది రోజుల పాటు ప్రతి ఇల్లు అమ్మవారి ఆలయంలా మారిపోతుంది. అన్ని ఇళ్లు ఆ జగన్మాత అర్చనలతో కళకళలాడుతూంటాయి. హైదరాబాద్ గాంధీ నగర్ లోని శ్రీమతి దేవులపల్లి దుర్గ గారి మిత్రబృందం నిర్వహించిన నవరాత్రి వేడుకలు ఈ ఎపిసోడ్ స్పెషల్. అమ్మవారి స్తోత్రాలు వీనుల విందుగా ఆలపించారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🌹

23, సెప్టెంబర్ 2025, మంగళవారం

ఏడువారాల నగల గురించి

 ఏడువారాల నగల గురించి సంపూర్ణ వివరణ -


 *  ఆదివారమునకు సూర్యుడు అధిపతి. అతని లోహము బంగారము , రత్నము మాణిక్యం. మాణిక్యమును శిరోభూషణములలో తప్పక పొదుగుదురు. తిరుపతి వేంకటేశ్వరునకు బొడ్డునందు మాణిక్యం ఉండును.

       

.  ఈనాడు రవ్వలు పొదగని శుద్ద స్వర్ణాభరణములు లేదా నిజమైన మాణిక్యములు దొరుకుట దుర్లభము కనుక లేత ఎరుపు గల రవ్వలు తాపడం చేసిన ఆభరణములు ధరింపవలెను.


 *  సోమవారమునకు చంద్రుడు అధిపతి. అతని లోహం వెండి , రత్నము ముత్యం కనుక సోమవారంనాడు చంద్రహారముతో పాటు ముత్యాలదండలు , శంఖం మరియు ముత్యపు చిప్పలతో చేసిన నగలు , వెండి తీగలతో అల్లిన తావళములు , వెండి దండ కడియములు , ముంజేతి కడియములు ధరించవలెను .

 

*  మంగళవారమునకు కుజుడు అధిపతి. అతని లోహం రాగి , రత్నము పగడము కనుక ఈనాడు పగడాల దండ , ముదురు ఎరుపురంగు గల రవ్వలు పొదిగిన తాటంకములు , పతకములు మెదలైనవి. రాగితీగలతో అల్లిన ఆభరణములు , రాగి కడియాలు ధరించవలెను .

 

*  బుధవారమునకు బుధుడు అధిపతి. అతని లోహము కంచు. రత్నము పచ్చ. పచ్చలలో ఆకుపచ్చ , చిలకపచ్చ అని రెండు రకములు కలవు. వానిలో దేనినైనా ధరించవచ్చు . పూర్వము పచ్చలదండలు ప్రసిద్ది. వెండిలేదా బంగారంతో వేపకాయ పూసలు చేయించుకుని వానిని పచ్చల నడుమ గ్రుచ్చుకొని ప్రతివారు ధరించేవారు.

              

. ఈనాడు కంచు పూసలు , కడియములు , ఉంగరములు లేదా పచ్చలు పొదిగిన పోగులు , పతకాలు , కడియాలు ధరించవచ్చు .


 *  గురువారమునకు బ్రహస్పతి అధిపతి. అతని లోహము ఇత్తడి , రత్నము పుష్యరాగం . గురువారం నాడు ఇత్తడి లేదా వన్నె తక్కువ బంగారంతో చేసిన కడియంలు , ఉంగరములు , పూసలు మొదలైన నగలు లేదా పుష్యరాగములు పొదిగిన ఆభరణములు ధరించవలెను .

 

*  శుక్రవారమునకు శుక్రుడు అధిపతి. ఇతని లోహం తగరం , రత్నం వజ్రం  . శుక్రవారం నాడు తగరముతో పూసలు , గజ్జెలు మొదలైనవి ధరించవలెను . వెండితో చేసినవి అయినను ధరించవచ్చు . ఆర్ధికంగా ఉన్నతస్థితిలో ఉన్నవారు వజ్రములు పొదిగిన ఆభరణములు ధరించవచ్చు .


 *  శనివారమునకు శనైచ్ఛరుడు అధిపతి. అతని లోహము ఇనుము , రత్నము నీలము . ఇనుమును ఆభరణాలకు ఉపయోగించరు కాని కొందరు కడియాల రూపములో ధరిస్తారు. నీలములలో రెండు రకములు కలవు. ఒకటి నీలం రెండొవది ఇంద్రనీలం . నీలము నలుపు రంగులో ఉండును. ఇంద్రనీలం బ్లూ రంగులో ఉండును. ఇందులో ఏదైనను ధరించవచ్చు . నీలాల ను చెవిపోగులలో , ముక్కెరలలో పొదుగుదురు .

          

.  స్త్రీలు ఆభరణములను ఈ విధముగా వారమును అనుసరించి గ్రహావివేకము కలిగి ఆయా లోహములతో చేసినవి గాని , ఆయా రత్నములు తాపడం చేసినవిగాని పుష్పములతో పాటు ధరించిన యెడల ఆయా గ్రహముల యొక్క క్రూరదృష్టి నుండి తొలగినవారై సుఖమును పొందుదురు.

                      

. గ్రహబలం చాలనప్పుడు ఆయా గ్రహములకు సంబంధించిన రత్నములను , లేదా జన్మరాశిని అనుసరించిన గ్రహములకు సంబంధించిన రత్నములను గాని ఉంగరము లేదా లాకెట్టుల యందు శాశ్వతముగా ధరించుట మంచిది . స్త్రీలకు ఎప్పుడైనను రంగురంగుల వస్త్రములు ఇష్టపడుచుందురు. కనుక వారు వారములను అనుసరించి ఆది , మంగళవారముల యందు ఎరుపు రంగు , సోమ , శుక్రవారముల యందు ఆకుపచ్చ రంగు , గురువారం నాడు పసుపురంగు , శనివారం నాడు నలుపు లేదా నీలపు రంగు గల చీరలను ధరించిన యెడల వారు ఆయా గ్రహములను ఆరాధించినట్టుగా అగును. ఆ రోజుల్లో చీర అంతయు ఆరంగు లేకున్నను దాని అంచు అయినను ఆ రంగు కలదిగా చూచుకొని ధరించుట మంచిది . అదేవిధముగా గృహము వాకిళ్ళలో కూడా వారమును అనుసరించి ఆయా రంగులతో ముగ్గులను వేయుచున్న ఆ గృహమునకు శోభ కలుగును.  


. సంపూర్ణం 



 మరింత విలువైన సమాచారం, సంపూర్ణ వివరణ మరియు అనేక రకాలైన వ్యాధులకు అతి సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 



గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*

 *ఎవరీ..రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*



బెంగుళూరు లోని ఓ ఇంటి ముందు

తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి

శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు..కారులోంచి దిగారు.

లోపలికి వెళ్ళి చూస్తే..అంతా నిశ్శబ్దం.

మంచం మీద ఓ వృద్ధుడు నిస్తేజంగా

పడుకుని ఉన్నారు. చుట్టూ ఎవరెవరో వున్నారు.

ప్రసాద్ తాను వచ్చిన పని గురించి చెప్పారు.

అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి..

నాన్నగారు వారం నుంచి కోమాలో వున్నారు,

అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు

తీసుకుపోయి..ఆ వృద్ధుని చెవిలో

*నాన్నగారూ..నాన్నగారూ* అంటూ పిలిచాడు.

సమాధానం లేదు. ఈ సారి చెవి దగ్గరగా..

*మీ కోసం తిరుమల నుండి ప్రసాదం వచ్చింది*

అన్నాడు. అప్పుడు తెరుచుకున్నాయి..

ఆ వృద్ధుని కళ్ళు. అర్ధ నిమీలిత నేత్రాలతో

ఆయన ప్రసాద్ వంక, ఆయన చేతిలోని ప్రసాదం

వంక చూస్తున్నాడు. ప్రసాద్ వెళ్లి ఆయన మెడలో

శ్రీవారి డాలర్ హారం అలంకరించి, శాలువా కప్పి,

శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు..


*మిమ్ము స్వామి వారి ఆస్థాన విద్వాంసునిగా*

*నియమిస్తున్నాము* అని నియామక పత్రాన్ని

ఆయనకు అందించారు. ఆ వృద్ధుని కళ్ళు

వాటి వంక చూశాయి..కళ్ళనుంచి

నీళ్లు కారుతున్నాయి.పెదాలు వణుకుతున్నాయి.

ఏవో మాటలు వినిపిస్తున్నాయి.

ఏదీ అర్ధం కావడం లేదు.

ఆఖరు మాట ఒక్కటే అందరికీ వినిపించింది..


*స్వామీ! ఇన్నాళ్లకు నా మీద దయకలిగిందా?*

అంటూ..తన చేతనున్న వాటిని తడుముకుంటూ..

అనిర్వచనీయ అనుభూతిని అనుభవిస్తూన్నాడు.

స్వామి వారి కరుణ లభించింది.ఇక తన

జీవితానికి విముక్తి లభించిందన్నట్లు మరో

పది నిముషాల తరువాత....

*రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ప్రాణాలు*

*అనంత వాయువుల్లో కలిసిపోయాయి!*

*అందరికీ అదో అద్భుతం,అనిర్వచనీయం!*


*ఎవరీ...రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*


శ్రీనివాసునిపై అన్నమయ్య రాసిన కీర్తనలు

30 వేలకు పైగా ఉన్నాయి. అప్పటి పాలకులు

అన్నమయ్య కీర్తనలను తాళపత్రాలపై

చెక్కించారు. వాటిని స్వామి వారి ఆలయంలో

నిక్షిప్తం చేశారు. 20 శతాబ్దంలో ఆలయ

నిర్వహణప్పుడు..ఇవి బయటపడ్డాయి.

ఆ తాళపత్రాలను గ్రంధ రూపంలోకి తెచ్చి,..

"జో అచ్యుతానంద..జోజో ముకుందా"

అని మనం పాడుకోగలుగుతున్నామంటే..

ఆ కృషికి కారకులు.. *వేటూరి ప్రభాకర శాస్త్రి* 

*రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు!*


ఓ రోజు సంగీత సమావేశం ముగిశాక..

అన్నమాచార్య ప్రాజెక్ స్పెషల్ ఆఫీసర్

కామిశెట్టి శ్రీనివాసులు..ప్రసాద్ గారితో..

*సర్! రేపు మీరు బెంగుళూరు వెళుతున్నారు.*

*రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ గారు ప్రస్తుతం*

*అక్కడే ఉన్నారు. అన్నమయ్య కీర్తనలను*

*జనబాహుళ్యంలోకి తీసుకు రావడానికి*

*ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన*

*సమకాలికులకు అన్ని గుర్తింపులు లభించాయి.*

*కానీ రాళ్లపల్లి వారికి మాత్రం అన్యాయం జరిగింది.*

*ఆయనను మీరు కలిస్తే బాగుంటుంది!* అన్నారు.


పివిఆర్కే ప్రసాద్ చాలా సేపు ఆలోచించి

ఓ నిర్ణయానికి వచ్చారు. డిప్యూటీ ఈ.ఓ.ని పిలిచి..

*ఉదయానికల్లా..రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని*

*ఆస్థాన విద్వాంసునిగా నియామక పత్రం,*

*శ్రీవారి గోల్డ్ డాలర్,శాలువా, ప్రసాదం*

*అక్షింతలు వగైరా సిద్ధం చేయండి అన్నారు!*

డెప్యూటీ ఈ.ఓ.అవాక్కయ్యాడు.

*సర్! అలా నియమించే అధికారం మీ పరిధిలోనిది కాదు.బోర్డు ఓ కమిటీని* *నియమించి, ఆ కమిటీ ఎంపిక చేసిన వారిని మాత్రమే*

*బోర్డు నియమిస్తుంది. రూల్స్ కు విరుద్ధంగా అలా చేస్తే మీ మీద ఏ చర్యలైనా తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది. అవసరమైతే*

*మిమ్ము ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు*

అన్నాడు..


అయినా ప్రసాద్ గారు వినలేదు.

*వెంటనే నేను చెప్పినట్లు చేయండి!* అన్నారు!

అలాగే అన్నీ సిద్ధం అయిపోయాయి.

అవి తీసుకుని బెంగుళూరు బయలుదేరారు

పివిఆర్కే ప్రసాద్ గారు. బెంగుళూరులో ఆఖరు

క్షణాలలో..వాటిని రాళ్లపల్లి వారికి సమర్పించడం.

దాని కోసమే ఆయన ఎదురుచూస్తున్నట్లుగా..

ఆ శుభ సందేశం అందుకోగానే ఆయన

స్వర్గస్థులవడం జరిగిపోయాయి!


టిటిడి బోర్డు మీటింగ్ హాలు..వాతావరణం

సీరియస్ గా వుంది. జరిగిందంతా చెప్పి

ప్రసాద్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు.

*ప్రసాద్ గారూ - మీరు చేసినది చాలా పెద్ద తప్పిదం. రూల్స్ కు విరుద్ధం* అన్నాడో సభ్యుడు.

*మీ మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడానికి ఇక బోర్డు ఎందుకు?* అన్నారు మరొకరు.

ఎవరికి తోచింది వారు మాట్లాడారు. చివరిలో

అందరూ చైర్మన్ నాగిరెడ్డిగారి వంక చూశారు.

ఆయన చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వారు!

*స్వామి వారికి బోర్డు చైర్మన్ నుండి..సాధారణ యాత్రికుడి వరకూ అందరూ *సమానం. ఆయన సమస్త జీవరాసులను సమానంగా ప్రేమిస్తాడు.*

*ఎవరిని ఎప్పుడు, ఎక్కడ ఆదుకోవాలో అప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు. ఆయన లీలలు అలా ఉంటాయి. రాళ్లపల్లి వారిని*

*జీవన చరమాంకంలో సంతోష పెట్టేందుకే ప్రసాద్*

*గారిని అలా తరుముతున్నట్లు బెంగుళూరు*

*పంపించాడేమో? అని నేను భావిస్తున్నాను.*


*ఈ రూల్సు అన్నీ ప్రసాద్ గారికి తెలియనివి కావు.*

*రాళ్లపల్లివారికి ఎప్పుడో జరగవలసిన సత్కారం*

*అప్పుడు జరగలేదు.ఇప్పుడు మనకు భగవంతుడు*

*కల్పించిన అవకాశంగా నేను భావిస్తున్నాను!*

*ప్రసాద్ గారి చర్యకు ఆమోదం తెలుపుతున్నాను!*

అన్నాడు. అంతా నిశ్శబ్దం. నాగిరెడ్డిగారి

తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.


ఎన్నో చిత్రాలలో..కథలను మలుపులు తిప్పి,

ఉత్కంఠ రేకెత్తించి, ముగింపులో ఓ సందేశంతో

ప్రేక్షకులను ఇంటికి పంపే విజయాధినేత

నాగిరెడ్డిగారు..ఈ సమస్యకు ఒక్క చిరునవ్వుతో

ముగించిన ఆయన స్థితప్రజ్ఞతకు మనసులోనే

కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ప్రసాద్ గారు!


*(నాహం కర్తా హరిః కర్తా నుంచీ...వేంకటేశ్వరార్పణమ్)*

కావమ్మ మొగుడు

 *_“కావమ్మ మొగుడు.. అంటే కామోసు అనుకున్నాను... 😁😁😁”_*

_(భలే సరదాగా ఉంటుంది.. చదవండి)_

*=================*


*దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్న తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో CM NTR ‌ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్‌ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ:*


*ఒక ఊళ్ళో వైశ్య దంపతులు తమ కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం చేసారు. తరువాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి 2-3 ఏళ్ళు పడుతుంది, నేను దేశాటనచేసి వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొని వస్తానన్నాడు. అత్తమామలు సంతోషంగా సరేనన్నారు. రెండేళ్ళు నాలుగేళ్ళయినా అల్లుడి రాలేదు. అత్తమామలు ఆందోళన చెందారు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని కనిపించాడు. అతనిని చూసి ఒక స్త్రీ కావమ్మ మొగుడులా ఉన్నాడంటే మిగిలిన వారు కూడా అవునని వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు. వారు పరుగున వచ్చి, ఇంటికి తీసుకెళ్ళారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనంపెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచిన తరువాత అసలు భర్త వచ్చాడు. కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు. అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది. అందుకు అతడు కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. కాదంటే నా కాషాయ బట్టలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడు.*


*రోశయ్య చెప్పిన కథ విని ఎన్‌టిఆర్‌ తో సహ సభ్యులందరూ నవ్వారు. తరువాత ఎన్‌టిఆర్‌ తేరుకుని నాకూ కావమ్మ మొగుడికీ సంబంధం ఏమిటి? అనడిగారు.*


*మీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి అర్జించారు. 60 ఏళ్ళు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేనందున అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్‌ గ్రోత్‌ రికార్డు అయ్యింది. ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితం ప్రజలపై పడటానికి సంవత్సరం పడుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు– నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు... అని ముక్తాయించారు రోశయ్య.*


*ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం రోశయ్యకు ఉంది.*


*పి.వి. నరసింహారావు, రోశయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగించారు. సభానంతరం వెళ్ళుతున్నప్పుడు నరసింహారావు... ఏమయ్యా రోశయ్య! జనం నీప్రసంగం చప్పట్లు, ఈలలు వేస్తూ విన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్ధుగా ఉండిపోయారు. ఏమిటి కారణం?. దీనికి రోశయ్య బదులిస్తూ... అయ్యా, మీ ప్రసంగం ఎంఎస్‌ సుబ్బలక్ష్మి పాట కచేరీలా ఉంటుంది. మరి నా ప్రసంగం ఎల్‌ఆర్‌ ఈశ్వరి పాటలాగా ఉంటుంది అని చెప్పి పీవీని నవ్వించారు.*


*అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం.🤝*

*_{ఇదిసేకరణే : --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*

22, సెప్టెంబర్ 2025, సోమవారం

తండ్రిని పూజించే(గౌరవించే) కొడుకు,



               మానవజీవన సాఫల్యానికీ, వైఫల్యానికీ, అతనిననుసరించే వారిసహకారంమేకారణమౌతుంది. యెలాంటివారుమనకుచేరువగాఉంటే మేలో అలాటివారుదొరకాలంటే యేంచేయాలోవివరించాడు, భర్తృహరి యనేముని. విందాంయేమంటాడో! 


చ: జనకుని పూజలం గడు బ్రసన్నుని జేయునతండు బుత్రు, డే

     వనిత మెలంగు భర్తృవశవర్తినియై యది సత్కళత్ర , మే

      జనుడు విపత్తి సౌఖ్య సదృశక్రియు డాతడు మిత్రు,డీత్రయం

       బును లభియించు లోకమున పుణ్యము జేసిన యట్టి వారికిన్;


               తండ్రిని పూజించే(గౌరవించే) కొడుకు, చెప్పినమాటవినేభార్య,కష్టసుఖాలలో ఒక్కటిగా పరిగణించిమనవెంటనడచేమిత్రుడు.ఈమూడులోకంలోపుణ్యంచేసికొన్నవాడికిలభిస్తాయట!


                 తండ్రంటేగౌరవంలేనికొడుకు కుటుంబానికిచేటు.యెడ్డెమంటే తెడ్డెమనే భార్యఉంటే ఆయిల్లుప్రత్యక్ష నరకమే, నిత్యంకలహాలకాపురమే,కాబట్టి చెప్పినమాటవినేభార్య లభించటం అదృష్టమే! ఉన్నప్పుడుమనతోసుఖాలనుభవించి,మనంకష్టాలలోఉంటేదూరంనుండేతొలగిపోయేమిత్రుడుమిత్రుడుకాడు.అలాకాక కష్టసుఖాలలోపాలుపంచుకుంటూనిరంతరం మనవెంటనుండేమిత్రుడుంటే, యింక లోటేముంటుంది? కానీవీరుదొరికేదెలా? సహృదయంతోనీవుమెలగుతూ లోకానికిమేలుచేసేపనులనాచరిస్తే, (అదేపుణ్యం)మనకివారుకోరకుండానే లభిస్తారు.జీవితంహాయిగా నడుస్తుంది.

                       స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సోమవారం🕉️* *🌹22సెప్టెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

      *🕉️సోమవారం🕉️*

 *🌹22సెప్టెంబర్2025🌹*  

     *దృగ్గణిత పంచాంగం*                    


             *ఈనాటి పర్వం*

  *🌷దేవీ శరన్నవరాత్రులు🌷* 

              *ప్రారంభం*```

    (కలశ స్థాపనకు)``` *ఉదయం* 05.56 - 08.22 & 11.36 - 12.24

*సాయంత్రం*: 06.04 -  

08.26 మంచి సమయాలు)```


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరత్ఋతౌః*

*ఆశ్వయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి  : పాఢ్యమి* రా 02.55 వరకు ఉపరి *విదియ*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : ఉత్తర* ప 11.24 వరకు ఉపరి *హస్త*

*యోగం : శుక్ల* రా 07.53 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : కింస్తుఘ్న* మ 02.06 *బవ* రా 02.55 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 06.00 - 07.00 & 10.30 - 12.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు* 

అభిజిత్ కాలం  : *ప 11.36 - 12.24*

*వర్జ్యం      : రా 08.36 - 10.21*

*దుర్ముహూర్తం  : మ 12.24 - 01.13 & 02.50 - 03.38*

*రాహు కాలం   : ఉ 07.27 - 08.58*

గుళికకాళం       : *మ 01.31 - 03.02*

యమగండం     : *ఉ 10.29 - 12.00*

సూర్యరాశి : *కన్య*                              

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 06.05* 

సూర్యాస్తమయం :*సా 06.12*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.56 - 08.22*

*సంగవ కాలం*         :     *08.22 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.13*

అపరాహ్న కాలం    : *మ 01.13 - 03.38*

*ఆబ్ధికం తిధి         : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం        :*సా 03.38 - 06.04*

ప్రదోష కాలం         :  *సా 06.04 - 08.26*

రాత్రి కాలం           :*రా 08.26 - 11.36*

నిశీధి కాలం          :*రా 11.36 - 12.24*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.09*

*****************************

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*నో తప్తం గాంగతీరే* 

*వ్రతజపనియమైః* 

*రుద్రజాప్యైర్న జప్తం*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం -‌ ప్రతిపత్ - ఉత్తరాఫల్గుణి -‌‌ ఇందు వాసరే* (22.09.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

21, సెప్టెంబర్ 2025, ఆదివారం

Panchaag


 

వ్యాధులు కావు,

 చాలా *వ్యాధులు* వ్యాధులు కావు, కానీ *సాధారణ వృద్ధాప్యం*. 

బీజింగ్‌లోని ఒక ఆసుపత్రి డైరెక్టర్ వృద్ధులకు ఐదు సలహాలు ఇచ్చారు: మీరు అనారోగ్యంతో లేరు, మీరు వృద్ధాప్యం అవుతున్నారు.. మీరు వ్యాధులు కాదని భావించే అనేక *వ్యాధులు*, *శరీరం వృద్ధాప్యం అవుతోందని* సూచిస్తాయి. 

1. *జ్ఞాపకశక్తి తగ్గడం* అల్జీమర్స్ వ్యాధి కాదు, కానీ వృద్ధుల మెదడు యొక్క స్వీయ-రక్షణ యంత్రాంగం. *మిమ్మల్ని మీరు భయపెట్టవద్దు*. ఇది మెదడు వృద్ధాప్యం అవుతోంది, వ్యాధి కాదు. మీరు మీ కీలను ఎక్కడ ఉంచారో మర్చిపోతే, కానీ మీరు వాటిని మీరే కనుగొనగలిగితే, అది చిత్తవైకల్యం కాదు. 

2. *నెమ్మదిగా నడవడం* మరియు కాళ్ళు మరియు కాళ్ళు అస్థిరంగా ఉండటం' పక్షవాతం కాదు, కానీ కండరాల క్షీణత. దీనికి పరిష్కారం మందులు తీసుకోవడం కాదు, *కదలడం*. 

3. *నిద్రలేమి* ఒక వ్యాధి కాదు కానీ మెదడు దాని లయను సర్దుబాటు చేసుకుంటోంది. ఇది నిద్ర నిర్మాణంలో మార్పు. విచక్షణారహితంగా నిద్రమాత్రలు తీసుకోకండి. నిద్ర మాత్రలు మరియు నిద్రపోవడానికి ఇతర మందులపై దీర్ఘకాలికంగా ఆధారపడటం వల్ల పడిపోవడం, అభిజ్ఞా బలహీనత మొదలైన ప్రమాదం పెరుగుతుంది. *వృద్ధులకు ఉత్తమమైన నిద్ర మాత్ర* పగటిపూట *ఎక్కువ ఎండలో ఉండటం మరియు క్రమం తప్పకుండా షెడ్యూల్ నిర్వహించడం. 

4. *శరీర నొప్పులు* రుమాటిజం కాదు, కానీ నరాల వృద్ధాప్యానికి సాధారణ ప్రతిచర్య. 

5. చాలా మంది వృద్ధులు ఇలా అంటారు: నా చేతులు మరియు కాళ్ళు ప్రతిచోటా బాధిస్తాయి. ఇది రుమాటిజం లేదా ఎముక హైపర్‌ప్లాసియానా? ఎముకలు వదులుగా మరియు సన్నగా మారుతాయి, కానీ 99% 'శరీర నొప్పి' ఒక వ్యాధి కాదు, కానీ నెమ్మదిగా నరాల ప్రసరణ, ఇది నొప్పిని పెంచుతుంది.

దీనిని *సెంట్రల్ సెన్సిటైజేషన్* అంటారు, ఇది వృద్ధులలో ఒక సాధారణ శారీరక మార్పు. అనాల్జెసిక్స్ పరిష్కారం కాదు. *వ్యాయామం మరియు ఫిజికల్ థెరపీ* అనేవి సర్దుబాటు పద్ధతులు. మీరు 'పాదాల స్నానం , పడుకునే ముందు వేడి కంప్రెస్ , తేలికపాటి మసాజ్'ని సిఫార్సు చేయవచ్చు, ఇది ఔషధం తీసుకోవడం కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. 

6. అసాధారణ శారీరక పరీక్ష' అనేది ఒక వ్యాధి కాదు, కానీ సూచిక ప్రమాణాలు నవీకరించబడలేదు. 

7. ప్రపంచ ఆరోగ్య సంస్థ వృద్ధుల శారీరక పరీక్ష సూచికలను *సడలించాలి* అని సిఫార్సు చేస్తోంది. కొలెస్ట్రాల్ విషయంలో కూడా ఇది నిజం. వృద్ధులకు కొంచెం ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ వారు ఎక్కువ కాలం జీవిస్తారు. కొలెస్ట్రాల్ హార్మోన్లు మరియు కణ త్వచాలను సంశ్లేషణ చేయడానికి ముడి పదార్థం కాబట్టి, చాలా తక్కువ స్థాయి రోగనిరోధక శక్తిని సులభంగా తగ్గిస్తుంది. చైనాలో *అధిక రక్తపోటు నివారణ మరియు చికిత్స* కోసం మార్గదర్శకాలు' కూడా వృద్ధులకు రక్తపోటు తగ్గింపు లక్ష్యం <150/90 mmHg, యువకుల ప్రమాణం <140/90 కాదు అని స్పష్టంగా ఎత్తి చూపాయి. *వృద్ధాప్యం* ను *అనారోగ్యం* గా పరిగణించవద్దు మరియు *మార్పు* ను *గాయం* గా పరిగణించవద్దు 

8. వృద్ధాప్యం ఒక వ్యాధి కాదు, ఇది ఒక అవసరమైన మార్గం. వృద్ధులకు మరియు వారి పిల్లలకు కొన్ని మాటలు చెప్పాలి: మొదట, *గుర్తుంచుకోండి, అన్ని అసౌకర్యాలు ఒక వ్యాధి కాదు*. రెండవది, వృద్ధులు 'భయపడటానికి' ఎక్కువగా భయపడతారు. శారీరక పరీక్ష నివేదికను చూసి భయపడకండి లేదా ప్రకటనలను చూసి మోసపోకండి.

మూడవది, *పిల్లలకు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారి తల్లిదండ్రులను ఆసుపత్రికి మాత్రమే తీసుకెళ్లడం కాదు*, వారితో పాటు నడక, సూర్య స్నానం, భోజనం, మాట్లాడటం మరియు బంధం ఏర్పరచుకోవడం. *వృద్ధాప్యం శత్రువు కాదు* ఇది జీవించడానికి మరొక పదం .. కానీ స్తబ్దత శత్రువు! *ఆరోగ్యంగా ఉండండి* ☘️

పంచాంగం 21.09.2025

 ఈ రోజు పంచాంగం 21.09.2025

Sunday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస కృష్ణ పక్ష అమావాస్య తిథి భాను వాసర పూర్వఫల్గుని నక్షత్రం శుభ యోగః చతుష్పాత్ తదుపరి నాగవం కరణం



రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు. 



నమస్కారః , శుభోదయం

20, సెప్టెంబర్ 2025, శనివారం

Panchaag


 

పొరుగింటి పుల్లకూర

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. అలాగే తెలుగు వారికి పొరుగు భాషా పదాలన్నా ఎంతో రుచి. ఉర్దూ, హిందీ, పార్శీ, మధ్య మధ్యలో అరబిక్ పదాలను కలగలిపి మాట్లాడుతూంటాం. ఇంగ్లీషు, సంస్కృతం సరేసరి. అలా ఎన్నెన్ని 

 మాట్లాడుతూంటామో చక్కగా వివరించారు ప్రముఖ సాహితీవేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ముక్కు మీద చక్కని పద్యం !

 శు భో ద యం 🙏


ముక్కు మీద చక్కని పద్యం !


             శా: నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే

                    లా న న్నొల్ల దటంచు ? 'గంధఫలి ' బల్కాకం దపంబంది ,యో

                     షా నాసాగ్రము బూని , సర్వ సుమనస్సౌరభ్య సంవాస మై ,

                    పూనెం బ్రేక్షణమాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్ .


                          వసు చరిత్రము 2 ఆశ్వాసము- రామ రాజ భూషణుడు. 


                               ప్రబంధకవులు చిత్ర విచిత్రమైన వర్ణనలు చేశారు. కావ్యనాయిక సోందర్య మాధారంగా, వారు (ప్రబంధనాయిక)

అంగాంగ సౌందర్యమును పనిగట్టుకు వర్ణించారు. ఉపమలతో ఉత్ప్రేక్షలతో అతిశయోక్తులతో, అప్పటి ప్రభువుల, ప్రజల అభిరుచులు

అలా ఉండేవన్నమాట. 


                    వసుచరిత్రలో నాయిక గిరిక ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తూ కృతికర్త రామ రాజ భూషణుడు. ముక్కుపై నొక చక్కని పద్యం వ్రాశాడు. అదే పైపద్యం. 


                            " గంధఫలి"- అంటే సంపెంగ పూవు. ( ఈసంపెంగలు రెండురకాలు 1 తుప్ప సంపెంగ 2 చెట్టు సంపెంగ. దీనినే మనవారు "సింహాచలం సంపెంగ"- అంటారు. అదే ముక్కును పోలియుంటుంది. ఇప్పుడు దాన్ని గురించే మనం చెప్పుకోబోయేది) 

ఆసంపెంగకు తుమ్మెదలపై కోపం వచ్చిందట. ఎందుకు? నానాసూన వితాన వాసనల నానందించు సారంగము(తుమ్మెద) యేలానన్నొల్లదని. అనేక పుష్పాలపైవ్రాలి మకరందం జుర్రుకునే తుమ్మెద నాదగ్గరకు రాదేం? అని దానికి కోపం! యెలాగైనా పట్టుబట్టి సాధించాలిగదా! అందుకనే అది తపస్సు చేసింది. ఆతపః ఫలంగా గిరిక ముక్కుగా నవతరించి ,సకల పుష్పముల సువాసనలను పుణికి పుచ్చుకొని తన ముఖానికిరువైపులా చూపులనే (కన్నులనే) రెండుగండు తుమ్మెదలను కదల కుండా కట్టేసిందట! 


                   ఇంతకీ యిక్కడో విషయం చెప్పుకోవాలి. ఏవిటది? తుమ్మెదలకు సంపెంగికి యెందుకు విరోధం? ఏమో అది ప్రకృతిగతమైనది.సంపెంగ వాసన తుమ్మెదకు పడదు. ఆవాసకది తలదిరిగి పడిపోతుంది. అందుకని అది సంపెంగ దరిదాపులకు రాదు.

దాని నాధారంగా కవి యొక కథనల్లాడు. అదే "తుమ్మెదపై సంపెంగ అలక" 


                గతంలో సంపెంగ గా ఉండటంతో తుమ్మెదలు దరికి రాలేదు. ఆరువాత తపస్సుచేసి గిరిక ముక్కుగా అవతరించింది. ఇక అప్పుడు తుమ్మెదకు తప్పలేదు. అదిగూడా అందమైన ఆమెకన్నుల వలెమారిపోయింది. అదీ సంగతి!


                    ఇంతకీ గిరిక ముక్కు సంపెంగి వలె, కన్నులు తుమ్మెదల వలె నున్నాయని చెప్పటమన్నమాట. 


               ఇంతకీ యీముక్కుపద్యం కర్తృత్వం వివాదాస్పదమైంది. అప్పటికీ యిప్పటికీ ఆవివాదం తెగలేదు. ఈపద్యం నంది తిమ్మన గారిదనీ, ముక్కుమీద పద్యంవలననే ఆయనకు ముక్కు తిమ్మన యనే వ్యవహార నామం వచ్చిందనీ కొందరివాదన.దాన్ని రామరాజభూషణుడు వెలగొని తనగ్రంథంలో వాడుకున్నాడని దానికి సమర్ధింపుగా చెప్పారు.కానీ తిమ్మనగారి పారిజాతాప హరణంలో ఈపద్యం కనిపించదు. కాబట్టి ఈవాదంలో పస గనిపించదు.


                     మొత్తానికి ముక్కు మీద కూడా ప్రబంధకవులు పద్యాలల్లినది యదార్ధం!


                                                                     స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఉద్దండ కవితా విన్యాసము -2

 శు భో ద యం 🙏


ఉద్దండ కవితా విన్యాసము -2


                    కొందరు పుట్టుకవులుంటారు. మరికొందరు పెట్టుకవులుంటారు. పుట్టుకవులలో ప్రఖ్యాతిగన్న మహాకవి వేముల వాడ భీమ కవి! దక్షారామ భీమేశ నందనుడైన యీకవి 'ఉద్దండ కవితా వేశము కలవాడు. గద్దరించి బెదరించి శాపదిగ్ధమైన కవితలతో నాటిప్రభువుల భరతమును బట్టి తనజీవనమును మహోజ్వలముగా గడపిన మహనీయుడు. 


                           భీమ కవి సంచార శీలుడు. అతడొక మారు కళింగ చొక్కరాజు యాస్థానమునకేగినాడు. ఆప్రభువు వేశ్యాలంపటుడు. భీమకవి యొచ్చువేళకతడు రాజోద్యాన వనమున వేశ్యా సమేతుడై విహరింుసాగెను. ద్వారపాలకుడు భీమకవి యరుదెంచిన విషయమును విన్నవింపగా పొగరుబోతుతనమున ఇక్కడికేరమ్మని కబురంపెను. భీమకవి యరుదెంచి వాని వాలకమునుగాంచి తలవంచి నమస్కరించెను. 


                                        " భీమకవీ ! నీగురించి చాలవిన్నాము. నీ టక్కుటమారములు మా*కడ సాగవు. నీవెదియన్న నది జరుగునా? ఓహో! అటులైన యీపందిరి గుంజను మహావృక్షముగావింపుమని "--పల్కెను. ఆసమయమున చొక్కరాజుకాలు మల్లెపందిరి గుంజకానుకుని

యుండెను. భీమకవి గంభీరముగా గళమెత్తి--


                      "శా: " ఆనీతాభ్యుపదాన శృంఖల పదాభ్యాలంబిత స్తంభమా!


                                  నేనే వేములవాడ భీమకవినేనిం జిత్రకూటంబులో


                                 భూనవ్యాపృత పల్లవోప లతికా పుష్పోప గుఛ్ఛంబులన్


                                 నానా పక్వ ఫల ప్రదాయి వగుమా ! నాకల్ప వృక్షాకృతిన్."---- అనిపద్యం చెప్పాడు. అంతే ఆపందిరి గుంజ కాస్తా మహా వృక్షమైపోయింది. రాజుగారికాలు ఆచెట్టులో యిరుక్కుపోయింది. దెబ్బతో భీమకవి మహిమెంతో ఆరాజుకు తెలిసింది.

"మహాకవీ నాతప్పు మన్నించు. మళ్ళీ వృక్షాన్నిపందిరికి గుంజగాజేసి నన్నుకాపాడమని " ప్రార్ధించాడు. కవి కరుణాళుడై. చొక్కరాజా!

కవుల నెన్నడు నవమానింపకుము. బుధ్ధిగలిగిప్రవర్తింపు మనుచు----


  

                ఉ: " శంభువరప్రసాద కవిసంఘ వరేణ్యుడ నైన నావచో


                          గుంభన మాలకించి యనుకూలత నొంది యనూన భావనన్


                          కుంభిని జొక్కనామ నృపకుంజరు పందిటి మల్లెసాలకున్


                           స్తంభమురీతి నీతనువు దాలిచి యెప్పటియట్ల నుండుమా! "--- అనేపద్యం చెప్పాడు. వృక్షం పందిరి గుంజయిపోయింది.రాజుగారి పాదానికి విముక్తి లభించింది.


                                               భీమకవి మహిమకు అక్కడివారందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.


                                                                  ఇదండీ భీమకవిగారి ఉద్దండ కవిత్వం !🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

19, సెప్టెంబర్ 2025, శుక్రవారం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం -‌ త్రయోదశి - ఆశ్రేష/ మఘా -‌‌ భృగు వాసరే* (19.09.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

18, సెప్టెంబర్ 2025, గురువారం

గురువారం🪷* *🌹18సెప్టెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🪷గురువారం🪷*

 *🌹18సెప్టెంబర్2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*                 

  

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి  : ద్వాదశి* రా 11.24 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : పుష్యమి* ఉ 06.32 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం : శివ* రా 09.37 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : కౌలువ* ప 11.27 *తైతుల* రా 11.24 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.37 - 12.26*

*వర్జ్యం      : రా 07.38 - 09.16*

*దుర్ముహూర్తం  : ఉ 10.00 - 10.48 మ 02.52 - 03.41*

*రాహు కాలం   : మ 01.33 - 03.04*

గుళికకాళం       : *ఉ 08.59 - 10.30*

యమగండం     : *ఉ 05.56 - 07.27*

సూర్యరాశి : *కన్య*                   

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.05*

సూర్యాస్తమయం :*సా 06.16*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.48*

మధ్యాహ్న కాలం    :     *10.48 - 01.14*

అపరాహ్న కాలం    : *మ 01.14 - 03.41*


*ఆబ్ధికం తిధి         : భాద్రపద బహుళ ద్వాదశి*

సాయంకాలం        :*సా 03.41 - 06.07*

ప్రదోష కాలం         :  *సా 06.07 - 08.29*

రాత్రి కాలం           :*రా 08.29 - 11.38*

నిశీధి కాలం          :*రా 11.38 - 12.25*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.09*

++++++++++++++++++++++++++

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీదత్త నవరత్నమాలికా స్తోత్రం*


*రాగమోహముఖ* 

*వైరినివృత్త్యై*  

*దత్తదేవమనిశం* 

*కలయామి ॥*


*ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

అమావాస్యావిశేషః

 అమావాస్యావిశేషః


75. శ్లో॥ అమావాస్యా దినే ప్రాస్తే గృహద్వారం సమాశ్రితాః । వాయుభూతాః ప్రపశ్యన్తి శ్రాద్ధం వైపితరో నృణామ్ | యావదస్తమయం భానోః క్షుత్పిపాసా సమాకులాః । తతశ్చాస్తంగతే భానౌ నిరాశా దుఃఖ సంయుతాః | నిఃశ్వస్య సుచిరం యాన్తి గర్హయన్తః స్వవంశజమ్ | జలేనా2 పి చ నశ్రాద్ధం శాకేనాపి కరోతియః । అమాయాం పితరస్తస్య శాపందత్వా ప్రయాన్తి చ ॥“కూర్మపురాణే”


భావము :- అమావాస్య దినము పితృదేవతలకు ప్రీతికరము. ఆ రోజున


వాయురూపములో వారు వారి కుమారుల ఇంటి ద్వారము వద్ద ఉండి శ్రాద్ధమును, మా పుత్రులు ఆచరించుచున్నారా యని గమనిస్తూ ఉందురు. సాయంత్రము వరకు శ్రాద్ధముగానీ, ఆమద్రవ్య సమర్పణగానీ, తిలతర్పణకానీ చేయనిచో, ఆకలి దప్పికలతో నిరాశతో వెడలిపోవుచూ మన వంశమందు ఇట్టి వ్యర్థులు జన్మించిరి అని నిట్టూర్పు విడచి వీరు అభివృద్ధికి రాకుండుదురుగాక అని శాపమిచ్చి నిరాశతో వెళ్ళిపోయెదరు. - కావున అమావాస్యనాడు పితృప్రీతిగా కనీసము తిలతర్పణయైననూ చేసి తీరవలెను.

కంపవాతము ( parkinsonism

 కంపవాతము ( parkinsonism ) రావడానికి గల కారణాలు - లక్షణాలు . 


    ఆయుర్వేద శాస్త్రం నందు పార్కిన్సన్స్ వ్యాధిని కంపవాతం అని అంటారు. ఈ వ్యాధి పుర్తిగా నరములకు సంబంధించిన వ్యాది. మెదడులో "డోపమైన్ " , నార్ - ఎపినెఫ్రిన్ , సిరోటినిన్ , ఎసిటైల్ కొలిన్ , కొలిస్ట్ స్టాకిన్ -8 , సబ్ స్టెన్సు -p మెటాక్ ఫాలిన్ మరియు ల్యూ ఎన్ ఏ ఫాలిన్ మొదలయిన హార్మోన్స్ అస్తవ్యస్తంగా తయారు అవుతాయి. దీని పరిణామమే పార్కిన్సన్ వ్యాది. దీనితో పాటు మెదడు వాపు , మెదడులో గడ్డలు ఏర్పడటం , మెదడుకు రక్తప్రసరణ లోపించడంతో పాటు కార్బన్ మోనాక్సయిడ్ పాయిజనింగ్ లు కూడా కారణాలుగా గమనించాలి . ఇది వాతప్రకోప వ్యాధిగా ఆయుర్వేదం నందు చెప్పబడినది. 


  ఈ వ్యాధి లక్షణాలు - 


 * కంపవాతం నందు వణుకు విచిత్రముగా ఉంటుంది. వణుకు చేతుల్లో మొదలు అవుతుంది. 


 * పనిచేస్తున్నప్పుడు వణుకు ఉండదు. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వణుకు ఉంటుంది.


 * కండరాలు బలహీనత పడతాయి. కండరాలు బిగదీసినట్టుగా ఉంటాయి. 


 * ఒళ్ళు తూలుతుంది . నడిచేప్పుడు వంగి నడుస్తారు. చేతులతో పాటు , పెదవులు , మెడకండరాలు , తల కూడా వణుకుతుంది.


 * నోటి నుంచి చొంగ కారుతుంది. 


 * కంటిచూపు కొంచం తీక్షణంగా ఉంటుంది. 

 

 * రోగి మానసికంగా కృంగిపోతాడు . 

  

గమనిక - మొదట చేతులు వణకడంతో ప్రారంభం అయిన వ్యాధి సరైన చికిత్స తీసుకోకపోవడం మూలాన ఎక్కువ అయ్యాక పైన చెప్పిన లక్షణాలు ఒక్కొక్కటిగా మొదలవుతాయి. 

   

. దీనికి చికిత్స కొరకు ప్రత్యేక ఔషదాలు ఉపయోగించవలసిందే ...ఆయుర్వేదం నందు స్వర్ణభస్మం వంటి భస్మాలతో వైద్యం చేస్తూ ఆహార విషయంలో వాతం కలిగించే ఆహారం తీసుకోకుండా కఠిన పథ్యం పాటిస్తే తప్పకుండా వ్యాధి నయం అవుతుంది. దీర్ఘకాలిక చికిత్స అవసరం అవుతుంది. 


 మరింత విలువైన సమాచారం, సంపూర్ణ వివరణ మరియు అనేక రకాలైన వ్యాధులకు అతి సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

17, సెప్టెంబర్ 2025, బుధవారం

బుధవారం🌷* *🪷17సెప్టెంబర్2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌷బుధవారం🌷*

 *🪷17సెప్టెంబర్2025🪷*        

    *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి  : ఏకాదశి* రా 11.39 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం   : పునర్వసు* ఉ 06.26 వరకు ఉపరి *పుష్యమి*


         *ఈనాటి పర్వం*  

         *ఇందిరైకాదశి* 

      *కన్యా సంక్రమణం*


*యోగం : పరిఘ* రా 10.55 వరకు ఉపరి *శివ*

*కరణం  : బవ* ప 11.57 *బాలువ* రా 11.39 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:* *ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *రా 12.06 - 01.43*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం      : మ 02.28 - 04.04*

*దుర్ముహూర్తం  : ప 11.37 - 12.26*

*రాహు కాలం   : మ 12.02 - 01.33*

గుళికకాళం       : *ఉ 10.30 - 12.02*

యమగండం     : *ఉ 07.27 - 08.59*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.04*

సూర్యాస్తమయం :*సా 06.17*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.49*

మధ్యాహ్న కాలం    :     *10.49 - 01.15*

అపరాహ్న కాలం    : *మ 01.15 - 03.41*

*ఆబ్ధికం తిధి         : భాద్రపద బహుళ ఏకాదశి*

సాయంకాలం        :*సా 03.41 - 06.08*

ప్రదోష కాలం         :  *సా 06.08 - 08.29*

రాత్రి కాలం           :*రా 08.29 - 11.38*

నిశీధి కాలం          :*రా 11.38 - 12.25*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.09*

==========================

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌷శ్రీ సరస్వతీ కవచం🌷*


*ఓం సర్వ వర్ణాత్మికాయై* 

*స్వాహా పాదయుగ్మం* 

*సదాఽవతు |*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

    🌹🌷🪷🌷🪷🌷🌹

కాశీ వెళ్లాలనుకునే kaasi yaatra

 ఈ మెసేజ్ మీకు అవసరం లేకపోవచ్చు. కాశీ వెళ్లాలనుకునే పేద భక్తులకు ఉపయోగ పడుతుంది.ఈ మెసేజ్ మీకు తెలిసిన వారికి పంపించండి.


సనాతన ధర్మంలో తీర్థ యా త్రలు కూడా ఒక భాగం.


ప్రతి హిందు వు జీవితంలో ఒక్కసారి అయినా కాశీ మహాక్షేత్రాన్ని దర్శించాలని కోరుకుంటాడు. 


   3 వేలకే 10 రోజులు కాశి యాత్ర.   

               (9రాత్రులు కాశీ వాసం)

తల్లి గర్భం లో 9నెలలు ఉన్నట్లు, 9 రోజులు, 9నెలలు, 9సంవత్సరాలు, కాశీలో నివాసం ఉంటే, మరొక జన్మ లేకుండా మోక్షం ప్రసాదిస్తాడు కాశీ విశ్వనాధుడు.


అతి సామాన్యుల కూడా మోక్షాన్ని ప్రసాదించే కాశీ మహా క్షేత్రాన్ని దర్శింప చేయాలని 3 వేల రూపాయల కే 10 రోజులు కాశీ యాత్ర ను అందిస్తున్నారు.కాశీ శ్రీకంఠ బాబాజీ వారు.


ఇప్పటివరకు సుమారు వేల మందినీ కాశీ మహా క్షేత్రాన్ని దర్శింపజేశారు శ్రీకంఠ బాబాజీ వారు 


ప్రతి బుధ, గురు , శుక్ర, శని వారాల్లో 

3వేల రూపాయలు యాత్ర కలదు.

మొదటి బ్యాచ్ నవంబర్ 15 మొదలు


ఈ యాత్రకు రాదలచిన వారు 70 రోజులు 

ముందుగా డబ్బు చెల్లించి టికెట్ బుక్ చేసుకోవలెను.


ఈ యాత్ర లో కల్పించు సౌకర్యాలు  


1. చెన్నై,.. విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్ , సికింద్రాబాద్, వరంగల్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లలో ఎక్కడ నుండైనా రానుపోను స్లీపర్ టికెట్లు ఇవ్వబడును.

2. కాశీ రైల్వే స్టేషన్ నుండి వసతి గృహానికి,

 రాను, పోను ఆటో ఛార్జీలు.

3. కాశీ లో 10 రోజులు వసతి, కామన్ హాల్ ,నేల పై పడుకొనుటకు చాపలు ఇవ్వబడును, 

4. కాశీలో 10 రోజులు సత్రం లో మధ్యాహ్నం భోజనం, రాత్రి ఫలహారం ఇవ్వబడును.

5. తిరుగు ప్రయాణంలో పులిహర, 

దద్దోజనం పాకెట్స్ ఇవ్వబడును. (రైల్లో తినడానికి)

6. కాశీ వెళ్ళే టప్పుడు రైల్లో ఎవరి భోజనం వారే 

ఏర్పాటు చేసు కొన వలెను.

7. లోకల్ సైట్ సీయింగ్, ఆటో,రిక్షాలు, గుడి దర్శనం ఖర్చులు,పితృ కార్యాల, ఇతర ఖర్చులు భక్తులే తీసుకున వలెను.

8. Ac రైలు టికెట్లు, ఏసీ,నాన్ ఏసీ, రూమ్ లు, కావలసిన వారు తగిన సొమ్ము చెల్లించి బుక్ చేసుకొనవచ్చును.

9.మేము ఇచ్చిన టికెట్ దగ్గర పెట్టుకుని మీరే ట్రైన్ ఎక్కి , కాశీ లో దిగి వలెను. కాశీ రైల్వే స్టేషన్ నుండి మావాళ్ళు మిమ్ములను పికప్ చేసుకుని మన ఆశ్రమానికి తీసుకొని వస్తారు.


పూర్తి వివరాలకు..98663 77208___ (పోన్ పే, గూగుల్ పే) 

                            70751 69635 లకు కు పోన్ చేయండి.

15, సెప్టెంబర్ 2025, సోమవారం

శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి జయంతి

 ✒️💐తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకరు శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి జయంతి సందర్భంగా💐✒️


*జెండాపై కపిరాజు….బావ ఎప్పుడు వచ్చితీవు… అదిగో ద్వారక… అయినను పోయి రావలె హస్తినకు… వంటి నాటక పద్యాలు వినని తెలుగువారు ఉండరు.* తిరుపతి వేంకట కవుల కలంనుంచి జాలువారిన పాండవోద్యోగ విజయాలు నాటకంలోనివి అవి. తెలుగుభాష పదభూయిష్ఠమై నారికేళప్రాయంగా ఉన్న రోజుల్లో అలతి, అలతి పదాలతో పద్యాలు చెప్పి, రచనలుచేసి సామాన్యులకూ తెలుగు భాషా సాహిత్యం పట్ల మోజుపెంచిన కవితామూర్తులు వీరు........


*ఉత్తమమైన కవిత్వం అలవడితే సామ్రాజ్యాలను ఆశించవలసిన పనిలేదని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. సాహిత్యం ఒక విశాల సామ్రాజ్యం. దానికి అధినేత మహాకవి. భారతీయ వాంగ్మయంలో ఎందరో సాహితీ సామ్రాజ్య చక్రవర్తులు ఉన్నారు. తెలుగు కవిత్వాన్ని ఊరూరా, వాడవాడలా ఊరేగించి తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేయించిన జంట కవిరాజులు- తిరుపతి వేంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట కవి. చెళ్లపిళ్లవారు తిరుపతి శాస్త్రి కన్నా వయసులో ఏడాది పెద్ద అయినా వారు పరమపదించిన తరవాత మూడు దశాబ్దాలు జీవించారు.*


*#ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తొలి ఆస్థానకవి.*


‘కవనార్థంబుదయించితిన్, సుకవితా కార్యంబు నా వృత్తి’ అని చెప్పుకున్నాడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. చెప్పినట్లుగానే తెలుగునాట కవితా కల్యాణం చేయించి, జీవితాన్ని తరింపజేసుకున్న మహాకవి చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి.

ఈయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తొలి ఆస్థానకవి. 1949లో, సాక్షాత్తు ప్రభుత్వ యంత్రాంగం మద్రాస్‌ నుండి తరలి విజయవాడ వచ్చి, ఈ పదవిని అందించింది. అంతటి ఘన చరిత్ర చెళ్లపిళ్లది.


400 లకుపైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన చెళ్లపిళ్ల సత్యం గారి ముత్తాతగారే చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి.


ఆ కాలంలోనూ చెళ్లపిళ్లవారి రచనా వ్యాసంగం తిరుపతి వేంకటీయంగానే సాగింది. అవధానాల రూపంలో ఈ జంట కవులు పద్యకవిత్వాన్ని ప్రదర్శనాత్మకమైన కళగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.


*#కవులకు మీసాలెందుకని......*


తిరుపతి వేంకట కవులు మీసాలు పెంచారు. అదీగాక, కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, మీసాలు ఎందుకు పెంచారో, వారి పద్యంలోనే విందాం!


దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,

మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా

రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ

మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.


*#అష్టావధాన, శతావధానాలు:*


తెలుగు నేలపై సంచారం చేస్తూ అష్టావధాన, శతావధానాలు నిర్వహించారు. తెలుగునాట వీరు దర్శించని రాజాస్థానాలు లేవు. కాలుమోపని నగరాలు, గ్రామాలు లేవు. ఈ కవుల ‘పాండవోద్యోగ విజయాలు’ నాటకం పేరు చెప్పగానే తెలుగువారు ఆత్మీయంగా పులకరిస్తారు. ఈ నాటక పద్యాలు పండిత, పామరుల నాలుకపై నర్తిస్తాయి. వీరిద్దరూ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శిష్యులు. వీరు మహాకవులు, బహు గ్రంథకర్తలు, శాస్త్రద్రష్టలు,తాత్త్వికులు, లోకజ్ఞులు.


*#బాల్యం-ఉద్యోగం:*


వేంకటశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా కడియంలో 8-8-1870న జన్మించారు. తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్యలు. వీరికి తల్లిదండ్రులు పెట్టిన మొదటి పేరు వేంకటాచలం. బాల్యంలో బడికి వెళ్లకుండా తోటి పిల్లలతో గోళీలు, కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ విచ్చలవిడిగా తిరిగినా, కాలక్రమంలో బుద్ధి కలిగి ఏళ్లలో నేర్వదగిన విద్య నెలల్లో ఆర్జించారు. ‘శాస్త్రి సామాన్యం ఎత్తు, చామనఛాయ, బహు చురుకైన మొహం, పిల్ల జుట్టు, కంచు గంట లాంటి గొంతుక, పండిత శాలువా పైనవేసుకొని, పంచ ధరించేవారు. చేతనున్న బంగారు కడియం కవితా దిగ్విజయాన్ని సూచిస్తుంది. తిరుపతి శాస్త్రి గారిది కవితాధారణ అయితే, చెళ్లపిళ్లవారిని లౌక్య ప్రజ్ఞకు ప్రసిద్ధులుగా చెబుతారు. తిరుపతి శాస్త్రి గారిది సంస్కృత ప్రకర్ష అని, వేంకట శాస్త్రి గారి కవిత్వంలో తెనుగుదనం జాస్తి అని వారిని బాగా తెలిసినవారు చెబుతారు.


 వేంకట కవి బందరు హిందూ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో వీరిని సత్కరించింది.


*#కంచు కంఠం:*


‘కవనార్థంబుదయించితిన్‌ సుకవితా కావ్యంబె నా వృత్తి’ అని చెప్పుకొన్నారు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి. పద్య పఠనంలో ఆయనది ఒక కొత్త తీరు. ఆయనలా పద్యాలు చదవాలని ఎందరో ప్రయత్నించినా, ఆ కంచు కంఠం అందరికీ రాదు కదా. ప్రతి విషయంలో తనదొక ప్రత్యేకత అన్నట్టు వేంకటశాస్త్రి వ్యవహరించేవారు.


చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అనంత ప్రతిభామూర్తి. అద్భుతమైన ధారణ ఈయన సొత్తు. పద్య పఠనం పరమాద్భుతం. సంగీతజ్ఞానం కూడా మెండుగా ఉండేది. పద్యం ఎత్తుకోగానే అనేక రాగాలు అవలీలగా వచ్చి చేరేవి. శ్రీ రాగంలో ఎక్కువగా పాడేవారని చెబుతారు. ఉపన్యాసాలు సురగంగా ప్రవాహాలు. సందర్భోచితమైన శ్లోకాలు, పద్యాలు, పిట్టకథలు, సామెతలతో చెళ్లపిళ్ల ప్రసంగం చేస్తుంటే.. ప్రేక్షకులు మంత్రముగ్ధులై పరవశించేవారు.


*#శతకంల రచన:*


 ఆయన కామేశ్వరి శతకం, ఆరోగ్య కామేశ్వరి శతకం రచించారు. తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు కామేశ్వరీ దేవిని ప్రార్థిస్తూ వీరు రాసిన ఆరోగ్య కామేశ్వరి శతకంలో స్వవిషయాలు, తిరుపతి కవి గురించిన పద్యాలు ఉన్నాయి. అనంతర కాలంలో వెలువడిన ఆరోగ్య శతకాలకు వీరి శతకం మార్గదర్శనమైంది. తాను వ్రణంతో బాధపడుతున్నప్పుడు శారీరక బాధను, మానసిక వేదనను కామేశ్వరి శతకంలో దేవికి విన్నవించుకున్నారు.


*#గొప్ప వక్త.:*


వేంకటశాస్త్రి గొప్ప వక్త. అమిత భాషి. యౌవనంలో ఆయన ఉపన్యాస వాణి మేజువాణి. షష్టిపూర్తి తరవాతా వారి కంఠంలో ఝంకారం, మాధుర్యం తగ్గలేదు. ఆయనది శాఖాచంక్రమణం. అనేక విషయాల్లోకి చొచ్చుకుపోయేవారు. పద్యాలను, పిట్ట కథలను, సంఘటనలను, గానాన్ని, హాస్యాన్ని మేళవించి పంచామృతంగా ఉపన్యాసం అందించేవారు. ఏం మాట్లాడినా అది ధ్వని కావ్యం.

‘మంచి కవిత్వం అంటే ఏమిటి’ అనే అంశంపై  విశాఖపట్నంలో రాజా విక్రమదేవ వర్మ ఇంట్లో, చెళ్లపిళ్ల 5 గంటలపాటు అనర్గళమైన ప్రసంగం చేశారు. ఆద్యంతం నాటకీయ ఫక్కీలో సాగిన ఆ ప్రసంగం అనన్య సామాన్యం. దీనికి ప్రత్యక్ష సాక్షి శ్రీశ్రీ. అద్భుతమైన ప్రసంగాన్ని అందించడంతో పాటు, విక్రమదేవ వర్మ నుండి చెళ్లపిళ్ల మూడువేల రూపాయలు కూడా అందుకున్నారు. ఆ రోజుల్లో మూడువేలంటే, ఈరోజుల్లో లక్షలు. 


*#శిష్యగణం:*


వేంకట కవికి గణనీయమైన గొప్ప శిష్యగణం ఉంది. ఆయన బందరు పర్రల్లో కవుల్ని సృష్టించారని ఆ రోజుల్లో చెప్పుకొనేవారు. పింగళి, కాటూరి, వేటూరి శివరామశాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ వంటి వీరి శిష్యులు విద్వత్‌ కవులుగా వాసికెక్కారు. పింగళి, కాటూరి కవులు తమ సౌందరనంద కావ్యాన్ని చెళ్లపిళ్ల వారి షష్టిపూర్తి సందర్భంలో సమర్పిస్తూ వారిని ‘అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాత’గా సంభావించారు.


శాస్త్రి గ్రాంథిక భాషా కవిత్వంలో పుట్టి పెరిగినా, చివరి దశలో వ్యావహారిక భాషను ఆదరించారు. వచనంలోనూ అమూల్యమైన రచన చేశారు. కృష్ణా పత్రికలో ప్రచురితమైన వారి కథలు, గాథలు మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. అవి తెలుగు భాషా సాహిత్యాలకు విజ్ఞాన సర్వస్వాలు. వ్యావహారిక భాషా సౌందర్యానికి తరగని గనులు. 


*#అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే.....*


అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన ఈ క్రింది పద్యాన్ని తిలకించండి, వారి వినయ విధేయతలు, కూడా ద్యోతకమవుతాయి.


ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స

న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మె

వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్ర

జ్ఞా నిధులంచు బేరు గొనినాము, నీ వలనన్ సరస్వతీ!


*#కాశీయాత్ర:*


వారి ‘కాశీయాత్ర’ యాత్రా సాహిత్యంలో విశిష్టమైనది. ఆధునిక, సాంఘిక చరిత్రకు విలువైన ఆధార గ్రంథం. ఆనాటి ఉత్తర హిందూస్థానం విశేషాలు, నాటి సామాజిక పరిస్థితులు ఈ గ్రంథంలో చూడవచ్చు. 


*#మానవతావాది:*


చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు గొప్ప మానవతావాది. వీరు కవికోకిల శ్రీ జాషువా గారి పాదాలు కడిగి, వారికి కాలికి గండపెండేరం తొడిగి, ఇలా అన్నారు--- "ఈ మహాకవి పాదాలు తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను"


*#పాండవ ఉద్యోగ విజయాలు:*


పాండవ ఉద్యోగ విజయాలు అజరామరమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో పద్యనటులు తెలుగునేలపై పుట్టుకువచ్చారు. ఎందరో కళాకారులకు అన్నం పెట్టి, అనంతమైన ఖ్యాతిని అందించిన ఆధునిక పద్యనాటక రాజాలు ఈ పాండవ ఉద్యోగ విజయాలు. సంప్రదాయ పద్య కవిత్వ ప్రక్రియలోనే, భారత కథలను వాడుకభాషలో రాసి, వాడుకభాషను శిఖరంపై  కూర్చోపెట్టిన ఘనత వీరిదే

సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ ఈ నాటకాల విజయాన్ని గురించి చెప్తూ “పాండవోద్యోగ విజయాల ప్రదర్శన జరగని ఊరు ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదని” పేర్కొన్నారు. వాటిలో వారు రాసిన పద్యాలు జాతీయాలుగా నిలిచిపోయాయి. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో “అయినను పోయి రావలె హస్తినకు” వంటివి ప్రముఖ ప్రయోగాలుగా, నిలిచిపోయాయి.


#వారి నాటకాల ద్వారా అనేక మంది నటులు ప్రఖ్యాతమైన పేరు తెచ్చుకున్నారు. వారిలో ముఖ్యులు, బందా, అద్దంకి, సి.యస్.ఆర్. రఘురామయ్య, పీసపాటి, షణ్ముఖి, ఏ. వి. సుబ్బారావు, మాధవపెద్ది మున్నగు వారు. ప్రస్తుతం గుమ్మడి గోపాలకృష్ణగారు, ఎ.వెంకటేశ్వరరావు గారు మొదలైన వారు వీరి నాటకాన్ని తన చక్కని గాత్రంతో, హావ భావాలతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.

80వ పడిలో 1950 ఫిబ్రవరి15న శివైక్యం  పొందారు వేంకటశాస్త్రి.

*బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, అలుగుటయే యెరుంగని... లాంటి పద్యాలు తెలుగు వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తునే ఉంటాయి.*

🙏🙏🏵️🌷🌸🙏🙏

Collected by 

Dr.A.Srinivasa Reddy

9912731022

Zphs Munugodu Amaravathi mandal Palanadu district.

పోతన పాత్ర చిత్రణ



పోతన పాత్ర చిత్రణ 


                    ఉ: కాటుక కంటినీరు చనుగట్ల పయింబడ నేలయేడ్చెదో?


                          కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! యోమదంబ! యో


                         హాటకగర్భురాణి! నిను నాకటికైఁ గొనిపోయి యల్ల క


                         ర్ణాట కిరాట కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ నమ్ము; భారతీ!


                                        -- చాటువు ;


                 ఉ: కోపము తోడ నీవు దధి భాండము భిన్నము సేయుచున్నచో


                        గోపిక త్రాటఁగట్టిన వికుంచిత సాంజన భాష్ప తోయ ధా


                        రా పరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై నటించుట గృపాపర ! నామదిఁ జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన కవితల్లజులలో పాత్ర చిత్రణ విషయమున కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగినఅలంకారములు.వానికితగినమాటలు .మాటలకు దగిన చక్కనిపదములబంధములు, పోతన పాత్రచిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి దీనవదనయై కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,." అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా నేలనమ్మా విలపింతువు? ఓహో! ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము!!


                                   ఇఁక రెండవ చిత్రము చలనము. బాలకృష్ణుని కొంటేపనులను దలచుకొని కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో పగులగొడితివి. ఆగోపికయు కోపమున నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కజ్జలశిక్తమై కన్నీరుగార

దానినంతయు నిరుచేతులతో మొగమంతయు పులుముకొనుచు వేడినిట్టూర్పులను విడచుచు బాలునివలె నటించుట నేడుదలచికొనిన నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! "భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన మోమును చేతులతో పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు "అంతవాడ వింతవాడ వైతివే!! యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷💄💄🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అర్చకుని తపస్సు

 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹


అర్చకశ్య తపోయోగాత్, 

అర్చకస్యాతి శ్యాయనాత్,

అభి రూప్యాచ్చ బింబానాం, 

దేవ సాన్నిధ్య మృచ్ఛతి.


తాత్పర్యము: అర్చకుని తపస్సు, యోగము, వినయము, భక్తి ప్రపత్తులు, ఆచారము, మంత్ర సౌష్టవముల వలన దేవతా విగ్రహములు దైవ సాన్నిధ్య శక్తిని కలిగి లోకానుగ్రహము కలిగించగలవు.... మనుస్మృతి ..  


విశ్లేషణ: ఈ శ్లోకం శ్రీశైలక్షేత్రం లోని శిఖరేశ్వర ఆలయం వద్ద కనపడుతుంది. మనుస్మృతి లోనిదని తెలుస్తోంది. అర్చకునికి ఉండవలసిన లక్షణాలేవో ఈ శ్లోకంలో తెలుస్తుంది.


అర్చకుడు తపస్సు చేయాలి. తపస్సు అంటే తపించడం, వేగిపోవడం. ఏ స్వామిని అర్చిస్తున్నారో ఆ స్వామి సేవలో పూర్తిగా లీనమై ఉండాలి. ఆ స్వామికి ఏమి కావాలి, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే నిరంతర తపస్సులో ఉండాలి. 

యోగం లేకపోతే ఇవేవీ సాధ్యపడవు. 

ఆ యోగం పొందడానికి నిరంతరం కృషి చేయాలి. భగవంతుని పట్ల, భాగవతుల పట్ల వినయము కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. 

భక్తి లేని పూజ పత్రి చేటు అని తెలుసు కదా. 

ప్రపత్తి కలిగివుండాలి. 

ప్రపత్తి అంటే శరణాగతి. 

ఏ స్వామిని సేవిస్తున్నారో ఆ స్వామిపట్ల 'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ' అన్న భావాన్ని త్రికరణ శుద్ధిగాకలిగి ఉండాలి. ఆచారము పాటించాలి. శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రంలో 'ఆచార ప్రభవో ధర్మః' అన్నారు. సదాచారము నుండే ధర్మము ప్రభవిస్తుంది అని చెప్పారు. కనుక ధర్మాన్ని నిలబెట్టాలంటే ఆచారమును పాటించడం తప్పనిసరి. మంత్రాన్ని స్పష్ఠంగా ఉచ్చరించాలి. ఉచ్చారణ దోషాలుంటే ప్రకంపనలలో తేడా వచ్చి ఆ మంత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. అప్పుడు ఆ మంత్రం సరిగా పనిచేయదు. ఈ లక్షణాలన్నీ అర్చకునిలో ఉన్నప్పుడు, ఆ అర్చకుడు అర్చన చేసే బింబములో, అంటే విగ్రహములో దైవసాన్నిధ్యం చేకూరుతుంది. అంటే, అర్చకుడి వలననే విగ్రహానికి ఆ ప్రత్యేకశక్తి వచ్చి చేరుతుంది. అందుకే కొన్ని ఆలయాలలో నిజమైన దైవసాన్నిధ్య అనుభూతి కలుగుతుంది. అందుకే, దైవం తరువాత ఆ స్థానం ఆలయాల్లో అర్చకునిదే.


                     🙏🙏

సోమవారం🕉️* *🌹15సెప్టెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     *🕉️సోమవారం🕉️*

*🌹15సెప్టెంబర్2025🌹*   

   *దృగ్గణిత పంచాంగం*                     


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి  : నవమి* రా 01.31 వరకు ఉపరి *దశమి*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం   : మృగశిర* ఉ 07.31 వరకు ఉపరి *ఆరుద్ర*

*యోగం : వ్యతీపాత* రా 02.34 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం  : తైతుల* మ 02.15 *గరజి* రా 01.31 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*

అమృత కాలం  : *రా 09.05 - 10.38*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.27*


*వర్జ్యం      : సా 03.39 - 05.12*

*దుర్ముహూర్తం  : మ 12.27 - 01.16 & 02.54 - 03.43*

*రాహు కాలం   : ఉ 07.27 - 08.59*

గుళికకాళం       : *మ 01.34 - 03.06*

యమగండం     : *ఉ 10.31 - 12.02*

సూర్యరాశి : *సింహం*       

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.04* 

సూర్యాస్తమయం :*సా 06.18* 

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.49*

మధ్యాహ్న కాలం    :     *10.49 - 01.16*

అపరాహ్న కాలం    : *మ 01.16 - 03.43*

*ఆబ్ధికం తిధి         : భాద్రపద బహుళ నవమి*

సాయంకాలం        :*సా 03.43 - 06.09*

ప్రదోష కాలం         :  *సా 06.09 - 08.31*

రాత్రి కాలం           :*రా 08.31 - 11.39*

నిశీధి కాలం          :*రా 11.39 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.09*

++++++++++++++++++++++++++

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*హవ్యం తే లక్షసంఖ్యైర్హుత* 

*వహవదనే నార్పితం* 

*బీజమంత్రైః ।*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

Panchaag



 

_ఒక_పద్యం

 _ఒక_పద్యం



"కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? వారేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపైపేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములైఈరే కోర్కెలు? వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా!"


ఇది పోతన గారి పద్యం. వామనావతార ఘట్టంలోది. వామనుడు నిజానికి విష్ణువని, బలిని నాశనం చెయ్యటానికే వచ్చాడని గ్రహించిన శుక్రుడు వామనుడికి దానం ఇవ్వొద్దని బలిని హెచ్చరించినప్పుడు అతనన్న మాటలు ఇవి.పోతన భాగవతంలో రెండే పాత్రలు భగవంతుడు, కవి. మిగిలిన వాళ్ళంతా నిమిత్తమాత్రులు. అంచేత నిజానికి ఈ మాటలు బలి పేరుతో పోతన గారే అంటున్నవని అనుకోవటం తప్పుకాదు.ఇంతకు ముందు ఒక సంచికలో వేలూరి గారు “ఎవ్వనిచే జనించు…” పద్యం గురించి అన్నట్లు, ఇక్కడ కూడ కొంత విచిత్రమైన భాషా ప్రయోగం కనిపిస్తుంది. “కారే రాజులు?” అనటమే ఒక వింత వాడుక. ఆ రెండు పదాల్నే తీసుకుని అర్థాన్ని సాధించాలంటే కష్టం కూడా. ఎవరో ఏమిటో చెప్పకుండా “వాళ్ళెక్కడ?” అంటే ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? కాని అలా సందర్భాన్ని వివరించకుండా పద్యాన్ని ఎత్తుకోవటంలో బలి ఎంత భావావేశంలో వున్నాడో, అతని మనసు కన్నా వేగంగా మాటలు ఎలా పరుగిడుతున్నాయో ఇక్కడ పోతన గారు చూపిస్తున్నారు. ఇలాటి సందర్భాలు మనందరికీ అనుభవంలో వున్నవే. మరో విధంగా కూడ ఈ పద్యం ఎత్తుగడని వివరించొచ్చు. “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” అన్న గ్రంథంలో వెల్చేరు నారాయణరావు గారు అన్నట్లు, తెలుగు భారత భాగవత పురాణాలు నిజానికి ఎవరికివారు చదివి ఆనందించటానికి ఉద్దేశించినవి కావు ఒక పౌరాణికుడు వీటిలోని పద్యాలను మధ్య మధ్యలో వాడుతూ తనదైన కథనంతో ప్రవచనం చేసే పద్ధతికి అనుకూలమైనవి. అంచేత, ఒక పౌరాణికుడు ప్రసంగిస్తూ, బహుశా రకరకాల దేశాల పేర్లు చెప్పి, యుగాల పేర్లు చెప్పి, “అప్పట్నుంచి ఇప్పటివరకు

ఎందరెందరో..” అని ముందు చేర్చి “కారే రాజులు?” అని పద్యాన్ని ఎత్తుకుంటే అప్పుడు సరిగ్గా సరిపోతుందన్న

మాట. ఇక ఈ పద్యంలో పోతన గారు అంటున్నది, “ఎందరో రాజులయ్యారు, వాళ్ళకి రాజ్యాలు కలిగాయి, కాని అందువల్ల జరిగిందల్లా వాళ్ళకు గర్వం పెరగటం త ప్ప మరేమీ కాదు” అని. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళు

ఏమయ్యారు? ఆ సంపదని మోసుకుపోలేదు కదా! పోనీ, భూమ్మీద వాళ్ళ పేరైనా నిలబడిందా? అదీ లేదు. వాళ్ళెవరో

ఎవరికీ పట్టదు. అదే శిబి లాటి దాతలు కీర్తి కోసం కోరికలు తీర్చారు. వాళ్ళ పేర్లు ఇప్పటివరకూ నిలిచాయి. కొంచెం లోతుగా చూస్తే ఇక్కడ కనిపించేది గర్వోన్నతులైన రాజులకు చివరికి ఏ గతి పడుతుందంటే వాళ్ళ సిరిని ఇంకా బలవంతులైన వాళ్ళు వచ్చి కొట్టుకుపోతారు; ఆ పనిలో వాళ్ళెలాగూ ఈ గర్వోన్నతుల్నీ వాళ్ళ వంశాల్నీ నాశనం చేస్తారు; అంచేత వాళ్ళ వంశాలు కూడ మిగలవు ఆ విధంగా వాళ్ళ పేర్లు కాలగర్భంలో కలిసిపోతాయి; అనేది. చారిత్రకంగా చూస్తే ఇది నిజమే మరి. రాజుల జీవితాలు దినదిన గండాలుగా వుండేవి. వృద్ధాప్యంలో సహజ మరణాల్తో పోయిన వాళ్ళు చాలా కొద్దిమందే! కనుక నిజంగా విష్ణువే తనని నాశనం చెl ు్యటానికి వచ్చినప్పుడు దానం చేసి పేరు నిలబెట్టుకోవటమో లేక ఆ గర్వోన్నత రాజుల దారిలో నడిచి వంశనాశనం చేసుకోవటమో ఈ రెండే మార్గాలున్నాయి బలికి (పోతన గారి దృష్టిలో). అంచేత దానం ఇవ్వటం అనే మార్గాన్ని ఎంచుకోవటంలో బలి చేస్తున్న త్యాగం పెద్దగా ఏమీ లేదు. అది అతనికీ తెలుసు. మరో విషయం ఈ పద్యం “పేరు నిలబడటం” అనేది గొప్ప లక్ష్యమని ప్రతిపాదిస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఇది చాదస్తంగా, మౌఢ్యంగా అనిపిస్తుంది కాని వందేళ్ళ క్రితం కూడ అభిమానధనం ముందు ధనానికి విలువ తక్కువగానే వుండేది. అందుకు ముఖ్యకారణం పటిష్టమైన కుటుంబ వ్యవస్థ. ఒక కుటుంబం మీద మచ్చ పడితే అది మాసిపోవటానికి ఏడు తరాలు పడుతుందని భావించే సమాజంలో ఏ విధమైన చెడ్డ పేరూ రాకుండా చూడటం ప్రతి వ్యక్తికీ బాధ్యతే. అలా చెయ్యకపోతే అతను తన వంశాన్ని ఎన్నో తరాల ముందు వరకు శాపగ్రస్తం చేసిన వాడౌతాడు. కుటుంబ వ్యవస్థ కూలిపోయి వ్యక్తులు సర్వస్వతంత్రులై, వాళ్ళ ప్రవర్తనకి వాళ్ళు వ్యక్తిగత బాధ్యతని వహించే ఈ నాటి పాశ్చాత్య,

పాశ్చాత్య ప్రభావిత, సమాజాల్లో అప్పటి విలువలు పనికిరావు కనుక ఈ పద్యం చెప్పే నీతి ఇప్పుడు మనకు

అంగీకారయోగ్యం కానక్కర లేదు. ఐనా చక్కటి పద్యానికి ఉన్న శక్తి, దాన్లోని విషయం మనకు నచ్చకపోయినా


పదే పదే మన చేత మననం చేయించటం!

14, సెప్టెంబర్ 2025, ఆదివారం

లిపిడ్ ప్రొఫైల్

 *లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి?*

ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను చాలా చక్కగా వివరించాడు మరియు దానిని ఒక ప్రత్యేకమైన రీతిలో వివరించే అందమైన కథను పంచుకున్నాడు.


మన శరీరం ఒక చిన్న పట్టణం అని ఊహించుకోండి. ఈ పట్టణంలో అతిపెద్ద సమస్య సృష్టించేది - *కొలెస్ట్రాల్*


అతనికి కొంతమంది సహచరులు కూడా ఉన్నారు. నేరంలో అతని ప్రధాన భాగస్వామి - *ట్రైగ్లిజరైడ్*


వీధుల్లో తిరగడం, గందరగోళం సృష్టించడం మరియు రోడ్లను అడ్డుకోవడం వారి పని.


*హృదయం* ఈ పట్టణం యొక్క నగర కేంద్రం. అన్ని రోడ్లు హృదయానికి దారి తీస్తాయి.


ఈ సమస్య సృష్టించేవారు పెరగడం ప్రారంభించినప్పుడు, ఏమి జరుగుతుందో మీరు ఊహించవచ్చు. వారు గుండె పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు.


కానీ మన శరీర పట్టణంలో కూడా ఒక పోలీసు దళం మోహరించబడింది - *HDL*


మంచి పోలీసు ఈ సమస్య సృష్టించేవారిని పట్టుకుని జైలులో పెడతాడు *(కాలేయం)*.


అప్పుడు కాలేయం వారిని శరీరం నుండి తొలగిస్తుంది - మన డ్రైనేజీ వ్యవస్థ ద్వారా.


కానీ అధికారం కోసం ఆకలితో ఉన్న ఒక చెడ్డ పోలీసు - *LDL* కూడా ఉన్నాడు.


 LDL ఈ దుర్మార్గులను జైలు నుండి బయటకు తీసుకెళ్లి వీధుల్లోకి పంపుతుంది.


మంచి పోలీసు *HDL* తగ్గిపోయినప్పుడు, పట్టణం మొత్తం అల్లకల్లోలంగా మారుతుంది.


అటువంటి పట్టణంలో ఎవరు నివసించాలనుకుంటున్నారు?


మీరు ఈ దుర్మార్గులను తగ్గించి మంచి పోలీసుల సంఖ్యను పెంచాలనుకుంటున్నారా?


*నడక* ప్రారంభించండి!


ప్రతి అడుగుతో *HDL* పెరుగుతుంది మరియు *కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్* మరియు *LDL* వంటి దుర్మార్గులు తగ్గుతాయి.


మీ శరీరం (పట్టణం) మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది.


మీ గుండె - నగర కేంద్రం - దుండగుల అడ్డంకి *(హార్ట్ బ్లాక్)* నుండి రక్షించబడుతుంది.


మరియు గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.


కాబట్టి మీకు అవకాశం దొరికినప్పుడల్లా - నడవడం ప్రారంభించండి!


*ఆరోగ్యంగా ఉండండి...* మరియు *మీకు మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాను*

**ఈ వ్యాసం HDL (మంచి కొలెస్ట్రాల్) పెంచడానికి మరియు LDL (చెడు కొలెస్ట్రాల్) తగ్గించడానికి అంటే నడకకు ఉత్తమ మార్గాన్ని మీకు చెబుతుంది.*

ప్రతి అడుగు HDL ను పెంచుతుంది. కాబట్టి - *రండి, ముందుకు సాగండి మరియు కదులుతూ ఉండండి.*




ఈ విషయాలను తగ్గించండి:-


1. ఉప్పు


2. చక్కెర


3. శుద్ధి చేసిన పిండి


4. పాల ఉత్పత్తులు


5. ప్రాసెస్ చేసిన ఆహారాలు


*ప్రతిరోజూ ఈ విషయాలను తినండి:-*


1. కూరగాయలు


2. పప్పులు


3. బీన్స్


4. గింజలు


5. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్


6. పండ్లు


*మర్చిపోవడానికి ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:*


1. మీ వయస్సు


2. మీ గతం


3. మీ మనోవేదనలు


*అలవాటు చేసుకోవాల్సిన నాలుగు ముఖ్యమైన విషయాలు:*


1. మీ కుటుంబం


2. మీ స్నేహితులు


3. సానుకూల ఆలోచన


4. ఇంటిని శుభ్రపరచడం మరియు స్వాగతించడం


*అలవాటు చేసుకోవాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:*


1. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి


2. మీ స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయండి


3. మీ బరువును తనిఖీ చేసుకోండి మరియు నియంత్రించండి


*మీరు అలవర్చుకోవాల్సిన ఆరు ముఖ్యమైన జీవనశైలి అలవాట్లు:*

1. నీరు త్రాగడానికి దాహం వేసే వరకు వేచి ఉండకండి. 2. విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోయే వరకు వేచి ఉండకండి.


3. వైద్య పరీక్షల కోసం అనారోగ్యంతో బాధపడే వరకు వేచి ఉండకండి.


4. అద్భుతాల కోసం వేచి ఉండకండి, దేవునిపై నమ్మకం ఉంచండి.


5. మీపై ఎప్పుడూ నమ్మకం కోల్పోకండి.


6. సానుకూలంగా ఉండండి మరియు ఎల్లప్పుడూ మంచి రేపటి కోసం ఆశిస్తారు.


ఈ వయస్సులో మీకు స్నేహితులు ఉంటే *(45-80 సంవత్సరాలు)* దయచేసి వారికి దీన్ని పంపండి.




మీకు తెలిసిన మంచి సీనియర్ సిటిజన్లందరికీ దీన్ని పంపండి.



🙏 🌹🌹🌹🙏