7, ఏప్రిల్ 2026, మంగళవారం

క్లారిఫికేషన్

 #క్లారిఫికేషన్#


సుబ్బారావు గారు ఓప్రసిద్దుడైన కవి.తరచుగా సాహిత్య సభలకి, కవి సమ్మేళనాలలో 

అధ్యక్షుడు గా హాజరౌతుంటాడు.


అలాగే ఈ రోజు కవయిత్రి సుకవితా శ్రీ 

ఆహ్వానం మేరకు హాజరయ్యాడు.


అదే సభకు హాజరైన కవయిత్రి శ్రీమతి కుమారి కూడా హాజరయి కవితా పఠనం చేసింది.


పన్లో పనిగా తాను పిలిస్తే సుబ్బారావు గారు రావడం లేదని

నిందారోపణ చేసింది.


సుబ్బారావు గారు నవ్వుతూ ఓపిక 

ఉండటం లేదమ్మా అన్నాడు.


సుకవితాశ్రీ గుంభనంగా నవ్వుకుంది.ఎందుకే అలా నవ్వుతావు అంది కుమారి శ్రీ మతి.


ఆయన మనం పిలిచేలా పిలిస్తే తప్పక వస్తారు.ఇంతకీ నువ్వెలా పిలిచావు? అడిగింది సుకవితాశ్రీ.


బాబయ్య గారూ! మీరు సభకి వచ్చి అధ్యక్షత వహించాలి అన్నా.


అదే మరి,ఈ సారి బావగారూ మీరు

తప్పకుండా రావాలి అను,గేరంటీగా

వస్తారు, అంతేకాదు ఎవ్వరికైనా చెప్పి ధనసహాయం కూడా 

చేయిస్తా రు.


అదండీ సంగతి ఏ రంగంలో నైనా కిటుకు పట్టుకోవాలి.

                     *****


జయంతి లక్ష్మీ నరసింహం

కామెంట్‌లు లేవు: