🤫 *వినడం నేర్చుకుందాము* 🤫
సభ్యులకు నమస్కారములు.
*శ్రోతుమిచ్ఛామి శుశ్రూషా*. వినాలి అను కోరిక కల్గి ఉండడాన్ని శుశ్రూషా అని అంటారు. శుశ్రూష (సేవ, విను ఇచ్చ) *తక్కువ* మాట్లాడమని, *తక్కువ* తినమని, *ఎక్కువగా* వినమని సూచిస్తూ భగవంతుడు *ఒక* నోటిని, *రెండు* చెవులను మనకిచ్చాడు. తల్లి పలికే మాటలను, ఆమె నేర్పించే శబ్దాలను వినడం వల్లనే ప్రతి వ్యక్తి భావ వ్యక్తీకరణకు అవసరమయ్యే భాషను అభ్యసించగలుతున్నాడు. తత్వ దృష్టలైన మహాత్ములు ఉపదేశించే హితోపదేశాలను వినగలిగితే మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది. అవుతే, వినాలనే ఆసక్తికలవారు లభించడం అంత సులువు కాదు.
*శతేషు జాయతే శూర:, సహస్రేషుచ పండిత:, వక్తా దశ సహ్రేషు, శ్రోతాభవతి వానవా*
అర్థం:- వందలలో ఒక్కడైనా శౌర్య పరాక్రమాలు కలవాడు లభిస్తాడు. వేలల్లో ఒక్కడైనా పండితుడు కాగల్గుతాడు. పది వేల మందిలో ఒక్కడైనా ఆకర్షణీయంగా మాట్లాడగల్గే సామర్థ్యాన్ని కలిగి వక్తగా రాణిస్తాడు. కాని, మనసు లగ్నం చేసి సంపూర్ణమైన ఏకాగ్రతతో తత్వాన్ని, హితాన్ని వినగలిగే *ఉత్తమ శ్రోత* లక్షల్లో *ఒకరైనా లభిస్తారో లేదో* చెప్పలేము అని పై సూక్తి తెలియజేస్తుంది.
Listening skills are more important than communication skills. అని పెద్దలంటారు. శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. *సగం సమస్యలు మాటల కంటే సరిగ్గా వినకపోవడం వల్లే వస్తాయి*.ఎదుటి వారు మాట్లాడుతూ ఉంటే వెంటనే కల్పించుకునే అలవాటు మానుకోవాలి. అవతలి వారు చెప్పేది పూర్తిగా, సహనంగా వింటే సగం సమాధానాలు అందులో మనకు లభిస్తాయి.
అమూల్యమైన విషయాలను, తత్వ రహస్యాలను, హితోపదేశాలను వినాలనే కోరిక (శుశ్రూష) కలవారు అరుదుగా లభిస్తారని, శ్రద్ధగా వినగల్గే వారు తమను తాము ఉద్దరించుకోవడమే గాకుండా మరెందరినో ఉద్ధరించగలరని మన పెద్దలు ఉద్బోధించారు. *అందుచేత మనమందరం సుభాషితాలను శ్రద్ధగా విను అభిలాషను కల్గి ఉండే ప్రయత్నం చేద్దాం*.
ధన్యవాదములు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి