16, అక్టోబర్ 2020, శుక్రవారం

27నక్షత్రములు

 మనకి 27నక్షత్రములు ఉన్నాయి. మొదటి అశ్వని నక్షత్రమునకు అధిదేవతలు అశ్వనీ దేవతలు. చంద్రుడు 

 అశ్వనీ నక్షత్రముతో కూడి ఉన్నప్పుడు వచ్చిన పౌర్ణమి కలిగిన మాసము కనక ఆశ్వీయుజ మాసము మొదటి

  మాసము కావాలి. చాంద్రమాన ప్రకారము చైత్రమాసము మొదటి మాసము. 27 నక్షత్రములలో మొదటి 13, వెనక 13 నక్షత్రములను విడచి పెట్టి మధ్యలోఉన్న 14 వ నక్షత్రమైన చిత్తా నక్షత్రముతో చంద్రుడు కూడుకున్న పౌర్ణమి ఉన్న మాసము కనక చైత్ర మాసము మొదటి మాసము అవుతుంది. ఉపాసనకు సంబంధించి ఆశ్వీయుజ మాసము మొదటి మాసము అవుతుంది. భగవంతుని చేరుకోవడానికి ప్రారంభము అక్కడ ఉంటుంది. ఆ మాసమునకు అంత గొప్పదనము ఇచ్చి శారదా నవరాత్రులు అన్న పేరుతో తొమ్మిది రాత్రులు ఉపాసన చేస్తారు అనగా దానికి ఒక్కటే ప్రధానమైన కారణము. ఈ మాసములో మొదటగా ప్రారంభము అయ్యే మొదటి తొమ్మిది రాత్రులు ఒక రోజుకి ప్రారంభములో ఉండేటటువంటి తెల్లవారుఝాము సమయమువంటివి. సూర్యోదయమునకు 48 ని|| కి ముందు ఉండే కాలము బ్రాహ్మీ ముహూర్త కాలము అంటారు. ఉపాసనకి పరమయోగ్యమైన కాలముగా నిర్ణయింపబడింది. ఉపాసన క్రమములో ఉండే సం|| అంతటినీ ఒక రోజుగా భావన చేస్తే తెల్లవారుఝాము కాలము ఆశ్వీయుజ మాసము వచ్చే పాడ్యమి లగాయితు నవమి వరకు ఉండే కాలము. ఆ తొమ్మిది రాత్రులు ఏవి ఉన్నాయో అది తెల్లవారుఝాము కాలముగా పరిగణిస్తారు. ఒక సం || అంతటికి శారదా నవరాత్రులే తెల్లవారు ఝాము కాలము. రోజు మొత్తమునకు ఉపాసనకు అత్యంత యోగ్యమైన కాలము తెల్లవారు ఝామున సూర్యోదయమునకు 48 ని|| కి ముందు ఉండే కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది కనక దానికి ఉపాసనకు యోగ్యము అంటారు. మిగిలిన కాలము ఇంద్రియములతో కలసి పైకి తిరిగే మనసు వశము అవడము అంత తేలిక అయినది కాదు. మనసు తెల్లవారుఝాము కాలములో మనసు వెనకకి వెళ్ళి దాని మూలమైన ఆత్మ ఏది ఉన్నదో దాని యందు ఒదిగిపోతుంది. ఒకరోజుకి తెల్లవారుఝాము కాలము ఎంత గొప్పదో అంత గొప్పది ఒక సం || అంతటినీ రోజుగా భావన చేస్తే శరదృతువులో ఆశ్వయుజ మాసములో వచ్చేటటువంటి మొదటి తొమ్మిది రోజులు. తొమ్మిది రోజుల క్రమమును విడచి పెట్టకూడదు. 

అందరూ చేస్తారు వ్యక్తిగతముగానూ చేస్తారు. దేవాలయములలో చేస్తారు. వీధి వీధిన దుర్గా అమ్మవారిని నిలబెట్టి వాయు ప్రతిష్ఠచేసి

 తొమ్మిది రోజులు అమ్మవారి ఉత్సవములు చేసి పదవ రోజు విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణముగా

 శాంతికర కల్యాణముతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకుని వెళ్ళి నిమజ్జనము చేస్తుంటారు.

భారతీయ ధర్మమే

 *భారతీయ ధర్మమే చాలా గొప్పది, భారతీయులు ప్రపంచములోనే చాలా గొప్పవారు. ఎలాగో మీరే చూడండి.*


1)సూర్యుడి నుంచి వెలువడుతున్న *ఓంకారమని* నాసా ఎందుకు పేర్కొన్నట్టు? 🚩


2) మన దేశీయ *గోమూత్రం* మీద అమెరికా 4 పేటెంట్లను పొంది క్యాన్సర్ ను నివారించే మందును కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తోంది. ఎందుకు!?🚩


3) న్యూజెర్సీ *"సిటాన్ హాలు"* యూనివర్సిటీలో *భగవద్గీత* తప్పనిసరిగా చదవాలన్న నియమం ఎందుకుంది?🚩


4) ముస్లిం దేశమైన ఇండోనేసియా తన దేశ విమానయాన సంస్థకు *"గరుడ ఇండోనేషియా ఎయిర్లైన్స్"* అని, జాతీయ ఎంబ్లెమ్ కు *"గరుడ పంచశిల"* అని విష్ణు వాహనమైన గరుత్మంతుని పేర్లేందుకు పెట్టుకుంది?🚩


5) ఇండోనేషియాలో అతిపెద్ద నోటైన ఇరవై వేల రూపయా మీద *వినాయకుడి బొమ్మ* ఉంటుందేం?🚩


6) అమెరికా మాజీ అధ్యక్షుడు *బారక్ ఒబామా* తన జేబులో ఎప్పుడూ *హనుమంతుడి* చిత్రపటాన్ని పెట్టుకొని ఉంటాడెందుకూ?🚩


7) *యోగ, ప్రాణాయామాలకు* ఈరోజు ప్రపంచంలో అంత గుర్తింపెందుకుంది? 🚩


8)వేల సంవత్సరాల క్రితమే భారతీయ యోగులు *భూమి గుండ్రంగా* ఉందని చెప్పారేం? 🚩


9) *'లుప్త', 'హంస'* అంటే సంస్కృతంలో కనుమరుగవుతున్న హంస. విమానం ఆకాశంలో పైపైకి ప్రయాణిస్తున్నకొద్దీ కనుమరుగవుతూ ఉంటుంది. ఈ అర్థం వచ్చేలా జర్మనీ విమానయాన సంస్థకు *'లుఫ్తాన్సా'* అని పేరెందుకు పెట్టారు?🚩


10) ఆఫ్ఘసిస్తాన్ లోని పర్వతాలను *"హిందూకుష్"* పర్వతాలని ఎందుకంటారు?🚩


11) వియత్నాంలో నాలుగు వేల సంవత్సరాల నాటి *శ్రీమహావిష్ణు విగ్రహం* ఎలా కనిపించింది?🚩


12) అమెరికా శాస్త్రవేత్త *డా. హోవార్డ్ స్టెయిన్గెరిల్* పరిశోధన చేసి *గాయత్రీ మంత్రం క్షణానికి 10 వేల ధ్వని తరంగాలను వెలువరిస్తుందని తేల్చారు.* దీనివల్ల ఈ మంత్రం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మంత్రమని తెలిసింది. ఎందుకు?🚩


13) స్వామి దయానంద సరస్వతి రాసిన *"సత్యార్థ ప్రకాశ్"* చదివి భాగపత్ (యూపీ)లోని బార్వాలా మసీదు ఇమాం 1983లో *"మహేంద్ర పాల్ ఆర్య"* పేరుతో హిందువుగా మారారెందుకు? అప్పటినుంచి వేలమంది ముస్లింలను హిందువులుగా మారుస్తూ.. డా. జకీర్ నాయక్ ను ఎన్నిసార్లు చర్చకు పిలిచినా ఆయన వచ్చే సాహసం చేయలేదేం?🚩


14) హిందువులు చేసే యజ్ఞం మూఢనమ్మకమే అయితే, యజ్ఞం చేస్తూండిన ఒక్క *"కుష్వాహా"* కుటుంబమే భోపాల్ గ్యాస్ ప్రమాదం బారిన పడకుండా ఎలా తప్పించుకుంది? 🚩


15) *ఆవు పేడతో చేసిన పిడకల మీద ఆవునెయ్యి వేసి కాలిస్తే ప్రతి 10 గ్రాములకి ఒక టన్ను ఆక్సిజన్ విడుదల అవుతుంది.* వాయువును శుద్ధి చేస్తుంది. మరి ఇదంతా ఏంటి?🚩


16) అమెరికా నటి, నిర్మాత *జూలియా రాబర్ట్స్* హిందూ ధర్మాన్ని స్వీకరించి రోజూ గుడికి వెళ్తుందెందుకు?🚩


17) రామాయణం మిథ్య అయితే, *ప్రపంచంలోని రాళ్ళలో* రామసేతువు నుంచి విడివడినవి మాత్రమే ఎందుకు *నీటిపై తేలుతున్నాయి?🚩*


18) మహాభారతం కల్పితమైతే, ఉత్తర భారతంలో *80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరం నేషనల్ జాగ్రఫిక్, భారత సైన్యం బృందానికి ఎలా కనిపించింది? 🚩*


19) *5000 సంవత్సరాల పురాతనమైనది,* మహాభారత కాలం నాటిది అయిన విమానం అమెరికా సైన్యానికి కాందహార్ (ఆఫ్ఘనిస్తాన్)లో ఎలా దొరికింది? 🚩


20) అలెగ్జాండర్ మనదేశం నుండి పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లాడా?


*అందుకే, ప్రియమైన భారతీయులారా ఆత్మ బంధువులారా... భారతీయునిగా పుట్టినందుకు గర్వించండి. ✊*


*భారతీయునిగానే మరణించండి.*


మన భారతదేశ గొప్పతనాన్ని మనకన్నా విదేశీయులు బాగా గుర్తిస్తున్నారు. 


మనదేశం యొక్క గొప్పతనాన్ని పొగడకపోయినా కనీసం మనదేశాన్ని మనమే కించపరకాకుండా ఉంటే చాలు. మన తెలివితేటలు, మన శక్తియుక్తులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన ముందు తరాలవారు తెలియచేశారు.


భారతీయులు ఎవరికీ తీసిపోరు, వారికి ఎవరూ సాటిరారు.


*పొగడరా నీతల్లి భూమిభారతిని,నిలపరా నీజాతి నిండు గౌరవమును.*


*భారతీయునిగా పుట్టినందుకు గర్వించు.*

నీలుడి కధ*

 *నీలుడి కధ*


రావణ వధ తర్వాత ,లంకా రాజ్యానికి విభీషనుడికి పట్టాభి షేకం చేయించాడు తమ్ముడు లక్ష్మణుని తో శ్రీ రాముడు .

అతడు ధర్మ బద్ధం గా రాజ్య పాలన చేస్త్రున్నాడు .విభీషణుడి కొడుకు పేరు నీలుడు .ఇతడు గుణము ,బలము ,విద్య లలో మేటి .ఒక సారి నీలుడు ,తండ్రి విభీషణుడి దగ్గరకు చేరి ,నమస్కరించి ఇలా అన్నాడు”తండ్రీ !మీ పరి పాలన లో ప్రజలంతా సుఖ ,సంతోషాల తో వర్ధిల్లు తున్నారు .వారికేమీ లోటు లేదు .మనకు ధనం సంపదలకు కొదవు కూడా లేదు .అయినా మన రాజ్య మైన లంక లో ”చింతామణి ,కామధేనువు ,కల్ప వృక్షం ”లేని లోటు బాగా కన్పిస్తోందినాకు .మీరు ,శ్రీ రాముని పద సన్నిధిని చేరి ,లంక సామ్రాజ్యాన్ని దక్కించుకొన్నా ,వీటిపై మీ కు ద్రుష్టి లేదు .వాటినిమీరు ఎందుకు పొందలేక పోయారు ?నాకు అనుజ్న ఇస్తే వాటిని సాధించి ,తీసుకొని వచ్చి ,మన లంకలో ఉంచు తాను”అన్నాడు వినయం గా . ..

నీలుని మాటలను విన్న తండ్రి విభీషణుడు ”కుమారా,నీలా !నేను శ్రీ రామ చంద్ర పాదాబ్జ మకరందాన్ని గ్రోలే తుమ్మెదను .ఆ రామ ప్రభు దివ్యాను గ్రహం వల్ల అన్ని సుఖాలు ,ఆనందాలు ,భోగ ,భాగ్యాలు అనుభ విస్తున్నాను .బ్రహ్మానంద రసాను భూతిని అనుభవిస్తున్నాను .దేవతలకుకూడా సాధ్యం కాని దీర్ఘాయుస్సు ,సామ్రాజ్యము నాకు శ్రీ రామ కృప వల్ల లభించాయి .శ్రీ రాముడే నా చింతామణి ,కామ ధేనువు ,కల్ప వృక్షం .అంత కంటే వేరే ఏమీ నాకు అక్కర లేదు .రాముని కరుణ వల్ల ,ఇంద్రాది అష్ట దిక్పాలకులు ,నా వశం లోనే వున్నారు .కనుక నాకు నువ్వు చెప్పిన ఆ మూడిటి అవసరం లేక పోయింది .అవి లంక లో లేవనే చింత వదిలెయ్యి .శ్రీ రామ పద భక్తీ తో ధన్యుడవు అయే ప్రయత్నం చెయ్యి ”అని అనునయం గా చెప్పాడు .

తండ్రి మాటలు ,నీలుడికి రుచించ లేదు .కీర్తి కాంక్ష తో తహ తహ లాడి పోతున్నాడు .మళ్ళీ తండ్రి తో వాటి అవసరాన్ని తెలియ జేశాడు .చివరికి విభీషణుడు మెత్త బడి ”నీ కోరిక ను కాదన లేక పోతున్నాను .వాటిని సాధించి ఇక్కడికి తీసుకొని రావ టానికి గురువు అనుజ్న చాలా ముఖ్యం .ముందు గా మన కుల గురువు శుక్రా చార్యుల వారి శుశ్రూష చేసి ,అనుగ్రహం సంపాదించి ,అప్పుడు ,ఆయన అను మతి తో ప్రయత్నం చెయ్యి ”అని సలహా ఇచ్చి ,ఆశీర్వ దించి నీలుడిని పంపాడు .

తండ్రి అనుమతి తో సగం కార్యం తీరింది అని సంతోషించిన నీలుడు ,గురువు శుక్రా చార్యుల వారిని ,చేరి,పూజించి ,నమస్కరించి ,చేతులు జోడించి ”గురు దేవా !మా తండ్రి విభీషణ మహా రాజు ఆనతి తో మిమ్మల్ని ఆశ్రయించ టానికి వచ్చాను .నాకు చింతామణి ,కల్ప వృక్షం ,కామ ధేనువు లను సాధించి ,లంకలో వాటిని ఉంచాలి అన్న కోరిక కలిగింది .దీనికి మీ అనుగ్రహం కావాలి .ప్రసాదించండి ‘అని వేడు కొన్నాడు .నీలుని భక్తీ తత్పరత,వినయం ఆచార్యులకునచ్చి ” కుమారా !ఈ రోజూ మృగశిరా నక్షత్రం .ఈ నక్షత్ర కాలమ్ లో కొత్త మంత్రోపదేశానికి మంచిది .దాన్ని జపిస్తే నీ కోరిక శీఘ్రం గా ఫలిస్తుంది.శ్రీ హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను .శ్రద్ధ తో జపించి నీ కోర్కెను సాధించుకో ”అని చెప్పి ,వెంటనే ”పంచ ముఖ ఆంజనేయ మంత్రం ”ఉపదేశించాడు .జగన్నాధ క్షేత్రం చేరి ,దీక్ష తో ,ఆ మంత్రాన్ని ,త్రికరణ శుద్ధి గా ,జపించమని చెప్పాడు శుక్రా చార్య గురు వరేన్యుడు .పంచముఖ ఆంజ నేయుడు ఎలా ఉంటాడో కూడా వర్ణించి చెప్పాడు

”పంచ వక్త్రం ,మహాభీమం ,కపి యూద సమన్వితం –బహుభిర్దశ భిర్యుక్తం ,సర్వ కామార్ధ సిద్ధిదం

పూర్వంతు ,వానర వక్త్రం ,కోటి సూర్య సమ ప్రభం-దంస్త్రా కరాల వదనం భ్రుకుటీ కుటి లేక్షణం . ”

”అస్త్వైవ దక్షిణ వక్త్రం ,నారసింహం ,మహాద్భుతం –అత్యుగ్ర తేజో వపుషం ,భీషణం ,భయ నాశనం ”

”పశ్చిమే ,గారుడ వక్త్రం ,వక్ర తుండం ,మహాబలం –సర్వ నాగ ప్రశమనం ,సర్వ భూతాది కృంతనం”

”ఉత్తరే సూకర వక్త్రం ,కృష్ణ దీప్త నభో మయం -పాతాలే సిద్ధ భేతాళ ,జ్వర రోగాది కృంతనం ”

ఊర్ధ్వం హయాననం ,ఘోరం ,దాన వాన్తకరం ,పరం -యేన వక్త్రేనా విప్రేంద్ర తాట కాయా ,మహా హవె ”

దీని భావం తెలుసు కొందాం .పంచముఖ ఆంజ నేయుడు సర్వ సిద్ధి ప్రదాత .తూర్పు ముఖం’ వానర ముఖం” .కోటి సూర్యుల కాంతితో ,భీకరమైన కోరలతో ,భ్రుకుటి ముడిచి కని పిస్తుంది .దక్షిణ ముఖం ‘నార సింహ ముఖం ”మహాద్భుతం గా ,మృత్యువును తెచ్చే ఉగ్ర రూపం గా ,తేజో వంతం గావుంటుంది భయ నాశనం చేస్తుంది .పశ్చిమ ముఖం ”గరుడిని ముఖం ”దీనికి వక్ర తుండం వుంటుంది .సర్పాల విషాన్ని నాశనం చేస్తుంది .సర్వ భూతా లను అదుపు లో ఉంచుతుంది .ఉత్తర ముఖం ”సూకర ముఖం ”.ఈ వరాహ ముఖం నల్లని కాంతి తోవుంటుంది . ,భేతాళ ప్రయోగాల్ని ,జ్వరం మొదలైన రోగాల్ని నాశనం చేస్తుంది .పై ముఖం ”హయ ముఖం ‘.ఇది మోక్షాన్ని ఇస్తుంది .ఇలాంటి మహా మహిమాన్విత మైన అయిదు ముఖాలకు చెందిన ”బీజాక్షరాలు ”తో భక్తీ గా మంత్రాలను జపిస్తే ,కోరిన కోరిక తీరు తుంది .


గురువు అనుమతి తో నీలుడు ,బయల్దేరి ‘నీలా చల క్షేత్రమైన పూరి ,జగన్నాధ క్షేత్రాన్ని” చేరాడు .అక్కడ ఒక మహా పర్వతం ,దానికింద పెద్ద అడవి వున్నాయి .ఆ పర్వతం మీదకు చేరి ,అక్కడి జలాశయం దగ్గరున్న కొండ బిలం లో ప్రవేశించి దీర్ఘ తపస్సు చేయటం ప్రారంభించాడు .ఎన్నో సంవత్స రాల తపస్సు ఫలితం గా కోటి సూర్య ప్రభలతో ,ముప్పది మూడు కోట్ల అర్బుద గణం తో” సంజీవ రాయుడు” అయిన ఆంజనేయ స్వామి ,నీలుడికి ప్రత్యక్ష మైనాడు .శంఖ ధ్వని వంటి ధ్వనితో నీలున్ని పిలి చాడు .,వెంటనే మేల్కొన్న నీలుడు ,ఆయన పాదాల పై సభక్తికం గా వాలి పోయాడు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారా పాఠం గా కారి పోతున్నాయి .నీలున్ని బుజం పట్టి పైకి లేపాడు హనుమ .నీలుడు అత్యంత భక్తీ తో స్తోత్రం చేశాడు . దీన్నే ”నీల కృత ఆంజనేయ స్తోత్రం ”అని పేరు .చాలా మహి మాన్విత మైన స్తోత్రం .దానికి విపరీతం గా సంతోషించి హనుమ ”నీలా !నీ తపస్సు ,ధ్యానాలకు మెచ్చాను .నీ మనోభీష్టం నాకు తెలుసు .త్వర లో ఇంద్రుని జయిస్తావు .చింతామణి వగైరాలను పొందుతావు .దేవతా స్త్రీలలో అందమైనది ”వన సుందరి ”అనే స్త్రీ నీకు భార్య గా లభిస్తుంది .నువ్వు కోరక పోయినా ,బ్రహ్మ దేవుడే నీకు వరాలు అనుగ్రహిస్తాడు .లోకం లో ఎవరైనా సరే ,నీ లాగా నా మంత్రాన్ని జపించి ,నా వ్రతాన్ని చేస్తే వారందరి కోరికలు నేను తక్షణమే తీరుస్తాను .నీ తండ్రి విభీషణుడు నాకు మంచి మిత్రుడు .ఆయనా ,నేను శ్రీరాముని బంటులం .నా దక్షిణ భాగం లో నీకు సుస్తిర మైన స్తానం కల్పిస్తున్నాను .నువ్వు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం ఇక నుంచి ”పురుషోత్తమ క్షేత్రం ”అని పిలువ బడుతుంది .నీ కోరికలు న్యాయ బద్ధ మైనవే .త్వరలోనే అవి తీర గలవు ”అని వర దానం చేసి ,పరి వారం తో సహా అదృశ్య మైనాడు ఆంజ నేయుడు .


శ్రీ హనుమ దర్శనం తో తృప్తి చెంది ,ఆయన వరాలను అందుకొన్ననీలుడు ,అక్కడి నుంచి బయల్దేరి మళ్ళీ గురువు శుక్రా చార్యుల సన్నిధి కి చేరాడు .భార్గవుడు చాలా సంతోషించి,ఆశీర్వ దించి ,తండ్రి విభీషణునికి వివరాలన్నీ తెలియ జేయ వలసినది గా చెప్పి పంపించే శాడు .లంకలో తండ్రి విభీషనుడిని చేరి ,జరిగిన విధానం అంతా పూస గుచ్చి నట్లు తండ్రికివిన్న వించాడు .కుమారుని అద్భుత తపో వృత్తాంతం ,వర గ్రహణం విన్న విభీషణుడు ,పరమానందం పొందాడు .నలుణ్ణి ఆశీర్వ దించి .అంతఃపురం చేరమని పంపాడు.

భస్మాసుర హస్తం"*

 *"భస్మాసుర హస్తం"*

*✍🏻జయంతి ప్రకాశ శర్మ.*


*ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి చేత్తో విఐపి బ్యాగు పట్టుకుని దిగిన తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు సూర్యం.*


*ఎదురు వెళ్లి చేతిలో బ్యాగు అందుకుని "అదేవిటమ్మా! కబురు కాకరకాయలేకుండా, హఠాత్తుగా వచ్చేసావు! స్టేషనుకి వచ్చేవాడ్నిగా!" అంటూ ఇంట్లోకి దారితీసాడు.*  


*ఆ మాటలు వింటూనే వంటింటిలోంచి బయట కొస్తూ "రండత్తయ్యగారు! అక్కడంతా బావున్నారా?" అంటూ సుందరి అత్తగార్ని చూస్తూ పలకరించింది.*


*అందర్నీ పలకరించి "కాఫి పెట్టు తల్లీ! కాళ్ళు కడుక్కుని వస్తా!" అంటూ సుభద్రమ్మ పెరట్లోకి దారితీసింది.*


*సుభద్రమ్మకి ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు. పెద్దమ్మాయి హైస్కూల్ చదువు ముగిసేసరికే సుభద్రమ్మ భర్త పోయారు. ఏ ఆధారం లేకపోయినా సరే, నోటి మంచితనం, భర్త చేసిన మంచి పనులతో, పిల్లలని పెంచి, పెద్ద చేసి యోగ్యులను చేసింది.*  

*అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాలలో బాగానే స్థిరపడ్డారు. ఉద్యోగరీత్యా అందరు వేరు వేరు ఊళ్లల్లో ఉంటారు.*  


*"నీకు ఎక్కడ బాగుంటే, అక్కడే స్థిరంగా ఉండొచ్చుగా! మేమే అక్కడికి వచ్చి నిన్ను చూస్తుంటాం!" అంటూ పిల్లలందరు అంటుంటారు.*


*"రెక్క ఆడుతున్నంత వరకు ఇలా చాంద్రాయణం చేస్తుంటానర్రా! మంచం పట్టకుండా వెళ్ళిపోతే, మీరూ, నేను ఇద్దరం అదృష్టవంతులమే! లేదా అప్పుడే ఎక్కడో అక్కడ మంచం వేద్దురుగాని!" అంటూ నవ్వుతూ అనేది*. 


*సుభద్రమ్మకి ఫోన్లు చెయ్యడం ఇష్టం ఉండదు. ఏమైనా విషయాలుంటే ఉత్తరం రాస్తుంది. ఎవరి దగ్గరకైనా వెళ్ళలంటే వాళ్ళకి ఓ వారం ముందుగానే ' నేను ఫలాన తేదీన, ఫలానా బండికి వస్తున్నానంటూ' ఓ ఉత్తరం రాసి పడేస్తుంది.*


*అలాంటిది ఏ ఉత్తరం రాయకుండా వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది. అలా అని సూటిగా ఆడగాలంటే సూర్యానికి భయమే!* 

*"అదేమిటి..నీపెట్టెఏమైంది*!" *కాఫీతాగుతున్నతల్లినిఅడిగాడుసూర్యం.*


*"ప్రపంచం అంతా మారిపోయినా సరే నేను మారటం లేదని అంటారుగా మీరందరునూ! అందుకే ఆ ట్రంకు పెట్టె మార్చి, అదిగో ఆ తోలు బ్యాగు తీసుకొచ్చాను. మీ పెద్దబావ కొనిచ్చాడు!" తల్లీ మాటలకి సూర్యానికి నవ్వొచ్చింది.*


*"మీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ పెట్టె వయసులో నా కంటే పెద్దది. మా అమ్మ కాపురానికి వెళ్తున్నప్పుడు కొని ఇచ్చారుట! నాకు మా అమ్మ ఇచ్చింది! పెళ్ళైన కొత్తలో కాపురానికి రావడానికి రాజమండ్రిలో రైల్లో ఎక్కాం. కూర్చోడానికి చోటు లేదు. ఈ పెట్టె కింద పెట్టి, మా అమ్మ, నేను దానిమీదే కూర్చుని విజయనగరం వరకు ప్రయాణం చేసాం. ఆ పెట్టె ప్రయోజనం ఆ రోజే తెలిసింది.*  


*ఈ షోకుల బ్యాగు మీద కూర్చోగలమా.. చెప్పు! మీ చిన్నప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డారు. ఇల్లాంతా గాలించి వెళ్ళిపోయారు. గదిలో మూలనున్న ఈ పెట్టెని ముట్టుకోలేదు. మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన వెండి కంచం, గ్లాసు, ఒంటిపేట గొలుసు అందులోనే ఉన్నాయి. వాళ్ళేం అనుకున్నారో గాని అ పెట్టెని ముట్టుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే దీని చరిత్ర చాలనే వుంది" అందుకే సూర్యానికి తల్లి అంటే ఇష్టం*


*"ఈ కాలం మనుషుల ఆరోగ్యాలు చెడిపోవడానికి, మీ మెదళ్లే కారణం నాయనా!" అంటూ కాఫీ ముగించి వంటింట్లోకి దారితీసింది.*


*సుభద్రమ్మ ఫ్రిజ్లో ఉన్న కూరలు తీసుకుని, కత్తిపీట ముందేసుకుని కింద కూర్చుని కూరలు తరుగుతూ అంది.*

*"మీ పెద్ద తోటి కోడలికి అప్పుడే కాళ్ళు నెప్పులు వచ్చేసాయి!”*


*“అయ్యో.. అలాగా! అప్పుడే కాళ్ళ నొప్పులా?” అంటూ సుందరి కాఫి గ్లాస్ అత్తగారికి అందించింది*.


*“రోగాలు రాక చస్తాయా! వాటికి వయసు, వేషలతో సంబంధం ఉండదు! ఇప్పడు అందరూ వంటింట్లో నించుని వంట చేయటం, టేబులమీద భోజనం.. వంటి అలవాట్లు చేసుకుంటే ముప్పై ఏళ్ళకే ఆ రోగం రాక చస్తుందా!"*


*సుందరి ఏమి మాట్లాడలేక పోయింది.*

*"మనం చేయగలిగే పనులను మనమే చేసుకోవాలి తల్లి! అవి మనసుకి తృప్తిని ఇవ్వడమే కాదు, శరీరానికి వ్యాయామాన్ని కూడా ఇస్తాయి! వంటింట్లో మూడొంతుల పని మీరు చేయడం లేదు. మిషన్లు చేస్తున్నాయి! టైము కలిసోస్తుందని అంటారు గాని, అది మన జీవితకాలాన్ని హరిస్తుందనే విషయం ఏవరు అర్దం చేసుకోవటం లేదు! నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరింటికి వెళ్ళినా, నాక్కూడా పనుండటం లేదు‌! ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఆ మధ్య వరకు కనీసం వత్తులు చేసుకునేదాన్ని. చేతివేళ్ళకి వ్యాయామం అయ్యేది. ఈ మధ్య వాటిని కూడా నెల సామానుతో తెచ్చెస్తు‌న్నారు!” అంది సుభద్రమ్మ*


*బయటనుండి ఆ మాటలు వింటున్న సూర్యానికి ఎందుకో తల్లి ఎప్పటిలాగా లేద‌నిపించింది.*  


*అక్కావాళ్ళతో గొడవ ఏదైనా జరిగిందిమో! మెల్లగా సమయం చూసి అడగాలి అని మనుసులోనే అనుకున్నాడు.*


*రెండ్రోజులు గడిచాయి.*


*సుభద్రమ్మ బట్టలు మడతపెట్టి బ్యాగులో సర్దుతూ, ఆఫీసు నుంచి అప్పుడే వచ్చిన కొడుకుతో అంది.*


*"రేపు విజయనగరం మీ అన్నయ్య దగ్గరకి వెళ్తాన్రా! ఉదయం బస్సుకి వెళ్తే సరిపోతుంది!"*


*ఆ మాటలు వింటూనే సూర్యం ఒక్కసారి కంగారు పడ్డాడు*

 

*ఎప్పుడొచ్చి‌నా, మూడు, నాలుగు నెలలు ఉండే తల్లి ఇలా మూడు రోజులకే ప్రయాణం అవుతుంటే, ఏం జరిగిందో అని భయపడ్డాడు.*


*తన గదిలోకి వెళ్లి, భార్యని పిలిచి అదే అడిగాడు.*

*"ఏం జరగలేదండి! ఇక్కడికి వచ్చిందగ్గర్నుంచి ఆవిడ ముభావంగానే ఉన్నారు. ఎప్పుడూ అలా ఉండలేదు. అందుకే అడగాలంటే భయం వేసింది కూడా!"*


*భార్య మాటలు వింటూనే సూర్యం ఆలోచనల్లో పడిపోయాడు. తల్లికి కోపం రావడం గాని, ముభావంగా ఉండటం గాని, ఎప్పడూ చూడలేదు. అందరితో ఆప్యాయంగానే ఉంటుంది. అలాగే అందరు ఆవిడ్ని బాగా ఆభిమానిస్తారు.* *అలాంటిది తల్లి అలా సీరియస్‌గా ఉండటానికి కారణం.. ఎదో జరిగి ఉంటుంది. సమయం చూసి అడగాలి.*


*రాత్రి భోజనాలైన తర్వాత తల్లి పక్కన కూర్చుని మెల్లగా అడిగాడు.*

*"అప్పుడే వెళ్ళిపోతున్నావేమిటమ్మా? ఏవరైనా ఏమైనా అన్నారా!"*


*"అబ్బే... ఏవరూ ఏం అనలేదురా! నాకే టైము గడవటం లేదు. పెద్దవాడి దగ్గరకి వెళితే, అక్కడ కాలాక్షేపం బాగానే ఉంటుందిలే!"*


*"అదేమిటి! ఏప్పుడూ ఉండే ఇల్లు, ఆ మనుషులమే కదా! ఇంతకుముందు లేని సమస్య ఇప్పుడేమొచ్చిందామ్మా!"*


*"అవున్రా! సమస్య ఇప్పుడే వచ్చింది. భవిష్యత్తులో అది మరింత పెరిగిపోతుంది! రాను రాను అందరిళ్లల్లో ఉండవలసిన వాతావరణం కనిపించటం లేదురా!"*


*"ఏవైందమ్మా? ఏవరైనా ఏమైనా అన్నారా?" తల్లి మాటలు అర్దంకాక సూర్యం మళ్ళీ అడిగాడు.*


*"అవేం లేదురా! ఒకప్పుడు నా చుట్టూ చేరి, నా మనమలు కథో, కబుర్లు చెప్పమనేవారు. గుర్తుందిగా! ఇప్పుడు చూడు, వాళ్ళు ఆ పోన్లు పట్టుకుని మాటలు, ఆటలు కూడా మరిచిపోయారు. మీరా ఆ టీవి పెట్టుకుని, ఎవరి ధ్యాసలో వాళ్ళు ఉంటున్నారు! నాకే టైము గడవడం కష్టంగా ఉంది!"*


*‘అమ్మయ్య’ అనుకుంటూ ఊపిరిపిల్చుకుని సూర్యం అన్నాడు " వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారుగా... ఈ కాలంలో పిల్లలు ఇలాగే ఉంటారు. వాళ్ళ లోకం వాళ్ళది! కంప్యూటర్ యుగం కదా!"*


*"నిజమేరా! కాని మనిషి మేథస్సు కంటే కంప్యూటర్ గొప్పది కాదు. అసలు ఆ కంప్యూటర్ని కనిపెట్టింది మనిషే కదా! పరిస్థితి ఇప్పుడు భస్మాసుర హస్తంల తయారైంది!"*


*తల్లిని ఆశ్చర్యంగా చూసాడు సూర్యం.* 

*"మన పురాణాల్లో ఓ రాక్షసుడికి, వాడి హస్తం ఏవరి తలమీద పెడితే వాడు భస్మం అయ్యే వరాన్ని, శివుడు ఇస్తాడు.* 

*చివరికి ఆ వరా‌న్ని శివుడిమీదే ప్రయోగిస్తానంటాడు! ఆ కథ తెలుసుగా!* *ఆలోచిస్తుంటే ఇప్పుడు భస్మాసురుడే కంప్యూటరుగా అవతరించాడనిపిస్తుంది!"*


*"అబ్బా! నీ థీరి అమోఘంగా ఉందమ్మా!" సూర్యం నవ్వుతూ అన్నాడు.*


*"మొన్న మీ అక్క బావ కూడా నీలాగే నవ్వారు! నువ్వు కూడా ఆలోచించు నాయనా! మీరు కనిపెట్టిన ఈ కంప్యూటర్లు, ఫోన్లు కొంతమేర ఉపయోగపడి ఉండొచ్చును. కాదనను! కాని అవసరానికి మించి వాడుతున్నారు! ఆ అనర్ధాలు మీ ముందే ఉన్నాయి!"*


*తల్లి ఇలాంటి విషయాలు చెపుతుందని సూర్యం ఊహించలేదు. ఏదో తన పని తాను చేసుకుంటూ, కృష్ణా రామా అనుకుంటూ, చీకు చింతా లేకుండా ఉంటున్నాదని అనుకున్నాడు. కాని ప్రస్తుత పరిస్థితులని ఇలా కాచి వడపోస్తుందని ఊహించలేదు.*


*"అసలు ఇంట్లో వాళ్ళందరు కూర్చుని ఎప్పుడైనా కబుర్లు చెప్పుకుంటున్నారా? ఒకసారి ఆలోచించు! ఇంట్లో అందరం కలసి ఒకేసారి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్లం. రాత్రుళ్లు వెన్నెల్లో మంచాలేసుకుని అందరం వరసగా పడుకుని మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకునేవాళ్లం! పగలు మగళ్ళందరూ ఆఫీసులకి వెళ్ళిపోయిన తర్వాత వీధిలో ఆడాలందరం ఓ దగ్గరకి చేరి, పత్రికలు చదువుకోడమో, కబుర్లు చెప్పుకునేవాళ్లం! అవన్నీ మనుషుల మధ్య బంధాలని ఏర్పచేవి! ఇప్పుడు ఆ వాతావరణం కనబడటం లేదు. ఇక బంధాలు ఎక్కడనుంచి వస్తాయి?” సుభద్రమ్మ*   


*పిల్లలకి నడకొస్తే చాలు, వాళ్ళని స్కూల్లకి తరిమెస్తు‌న్నారు. అక్కడ వాళ్ళ సున్నితమైన మెదడులో పెద్ద విషయాలని నూరి పోస్తున్నారు. వాళ్ళకి అ వయసులో కావలసిన కథలు, ఆటలకి దూరమవుతున్నారు! పిల్లలకి ప్రేమ, ఆదరణ, అభిమానాలని అందించడానికి మీకు టైము చిక్కటంలేదు! అసలు మీకా ఆలోచనలే రావటం లేదు. మనుషుల మధ్య దూరం రోజు రోజుకి పెరిగిపోతున్నాది‌! వీటన్నిటిని కారణం ఆ భస్మసుర హస్తమే!*  


*అతి సర్వత్రా వర్జయేత్ అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పటికే మనిషి అవసరానికి మించి ఈ యంత్రాలను వాడుతున్నాడు. తాను కనుక్కున్న కంప్యూటరు చెప్పుచేతల్లో మనిషి నడుస్తున్నాడు! త‌న పనిని తాను చేసుకోలేక పోతున్నాడు. తన నైపుణ్యాన్ని కొల్పోయి, మిషన్లు మీద ఆదరపడిపోయాడు‌. శరీరానికి కావలసిన శ్రమ లేక పాతికేళ్ళకే ఆరోగ్యాలు క్షీణీస్తున్నాయి! ఈ పరిస్థితులు ఇలా కొనసాగితే మనిషి ఊనిక్కే ప్రమాదం వస్తుంది!"*


*సూర్యం తల్లీ ఆలోచనలకి ఆశ్చర్య పోయాడు. ఇంత లోతుగా విషయాలని చదివి, పరిస్థితులని పరిశీలించి భవిష్యత్తుని విశ్లేషణ చేస్తుంటే చాలా ఆనందం వేసింది.*


*"మా రోజుల్లో కష్టాలంటే.... జీతాలు సరిపోక పోవడం, పెద్ద సంసారం, పెద్దవాళ్ళకి ఒంట్లో బాగా లేకపోవడం, తిండి సరిపడా లేకపోవటం, అప్పులు చేసి వాటిని తీర్చడానికి కష్టపడటం.. వంటివి ఉండేవి.* 


*మరిప్పుడు కష్టాల రూపురేఖలే మారిపోయాయి. అమ్మ తిడితే కష్ఠం, నాన్న దెబ్బలాడితే కష్టం, స్కూల్లో మాష్టారు కొడితే కష్టం, కరెంటు పోతే కష్టం, టివి బందైయితే ఇబ్బంది, ఆ దిక్కుమాలిన ఫోన్ లైన్లు రాకపోతే అంతా ఇంత కష్టం కాదు! వీటికోసం తల తాకట్టు పెట్టయినా కొనిపారిస్తున్నారు. మీకు మానసిక బలం తగ్గిపోబట్టి, మీకన్నీ కష్టంగానే ఉంటాయి! ' మేం కష్టాలు పడి, పెరిగాం, ఆ కర్మ వాళ్ళకెందుకని'*

*పిల్లలని కష్టం తెలియకుండా పెంచుతున్నారు! అదే* *వచ్చే రోజుల్లో భస్మాసుర హస్తంగా తయారై కూర్చుంటుంది!"*


*"నిజమేనమ్మా! కాని లోకం తీరే అలాగుంది! మేం చేయగలం చెప్పు?" సూర్యం దగ్గర అంతకంటే జవాబు లేదు.*


*అందుకేరా.. నేనో నిర్ణయానికి వచ్చాను!"*

*తల్లి మాటలు వినేసరికి ఒక్కసారి కంగారు పడ్డాడు.*


*"అదేం పెద్ద విషయం కాదులే! లోపం ఎక్కడ మొదలయిందో అక్కడే దాన్ని బాగు చెయ్యాలి! నాకింకా ఓపిక ఉంది. రోగాలు రొచ్చులు లేవు! నేను పెద్దగా చదువుకోలేదు గాని, పిల్లలకి మంచి విషయాలు చెప్పగలనులే! అందుకే ఓపిక ఉన్నంత వరకు మనవూరిలో మీరు చదివిన అరటిచెట్ల బడి లేదూ, అందులో కనీసం వారానికోసారి పిల్లలకి కథలు, మంచి, చెడ్డ, నీతి నిజాయితీల గురించి చెప్పాలనీ అనుకుంటున్నాను. వాళ్ళకి ఓ ఉత్తరం రాసాను. అందుకు కలెక్టరుగారే స్పందించి జవాబు రాసారు. నన్ను చూడాలనిపించి నప్పుడు మీరే అక్కడికి రండి!*


*మాట్లాడుతూనే పంచతంత్రకథలు, పేదరాసి పెద్దమ్మకథలు, విక్రమార్కుడు కథల పుస్తకాలని బ్యాగులో సర్దుతున్న తల్లిని చూసేసరికి సూర్యం నోటంటా మాట రాలేదు, కళ్ళంటా ఆనందబాష్పాలు రాలాయి!!*

*సూర్యానికి మోహినీ అవతారంలో ఉన్న తల్లి కనిపించింది.*

రామాయణమ్..145

 రామాయణమ్..145 

.........

నేను ఒకప్పుడు వేయి ఏనుగుల బలముతో,పర్వతమంత ఆకారముతో సంచరిస్తూ మునుల ఆశ్రమాల మీదకు దండుగా వెళ్లి వారివారి యజ్ఞాలను భంగము కావిస్తూ ఉండేవాడిని .

.

ఒకసారి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమములో కలిగిన అనుభవము చెపుతాను విను .

.

ఆ మహర్షి ఒకప్పుడు గొప్ప యజ్ఞం చేయ సంకల్పించి యాగరక్షణార్దము దశరధ మహారాజు వద్దకు వెళ్లి ఆయన కొడుకును తనతో పంపమన్నాడు .అందుకు ఆ రాజు వీడింకా పసిబాలుడు ,నా చతురంగబలాలు తీసుకొని నేనే వస్తాను అని అన్నాడు.

అందుకు మహర్షి నిరాకరించి ,నా యజ్ఞ విధ్వంసానికి పూనుకునే రాక్షసులు సామాన్యులుకారు ,వారిని వధించాలంటే రాముడొక్కడే శరణ్యము కావున రాముని పంపు అని ఆయనను ఒప్పించి పసిబాలుడైన రాముని తెచ్చుకుని కాపలా పెట్టుకున్నాడు.

.

 రాముడికి అప్పటికింకా పసితనపు చాయలు పోలేదు విశాలమైన నేత్రాలు,శోభాసంపన్నుడు అయిన రాముడికి మీసము కూడా మొలవలేదు ,

.

ఒకటే వస్త్రము చుట్టుకొని ,జుట్టుముడిపెట్టుకొని బంగారుమాల ధరించి ,చిత్రముగా ఉన్న ధనస్సును చరుచుకుంటూ ఆశ్రమ వాకిట అటూఇటూ తిరుగుతున్నాడు.

.

నేను అప్పుడు మహర్షి ఆశ్రమము లోపలికి ప్రవేశిస్తూ ఉండగానే నన్ను గమనించి ఏ మాత్రమూ తొట్రుపాటు,భయమూ లేకుండా ధనస్సుకు నారి కట్టాడు .

.

ఆ! వీడేమిచేస్తాడు బాలుడు అని లక్ష్యపెట్టక తొందరగా విశ్వామిత్రుడి యజ్ఞవేదిక వద్దకు వెళ్ళాను .

.

అప్పుడు నాకు గుర్తు ! ఒకేఒక్క బాణము రయ్యిన దూసుకుంటూ వచ్చి నన్ను నూరు యోజనముల దూరములోనున్న సముద్రములో పడవేసినది .

.

ఎందుకు దయతలచాడో కానీ నాకు తెలవదు ,నన్ను మాత్రము ప్రాణాలతో విడిచిపెట్టాడు.సముద్రములో పడ్డ నేను కొంతసేపటికి తేరుకొని బ్రతుకుజీవుడా అని లంకకు చేరుకున్నాను.

.

అప్పటికి రాముడు అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకొని యుండలేదు.

.

ఈ మధ్య కాలములో జరిగిన సంఘటన ఒకటి చెపుతాను విను .

.

మనవాళ్ళు ఇద్దరితో కలిసి ఒక క్రూరమైన మృగ రూపము ధరించి అడవిలో మునులను భయపెడుతూ సంచరిస్తున్నాను నేను .

.

భార్యా ,తమ్ముడితో కలిసి అడవిలో రాముడు ఉండటము చూశాను .వాళ్ళను చూడగానే పూర్వము నాకు జరిగిన అవమానము గుర్తుకు వచ్చి వారిని భక్షించాలని తలచి మెల్లగా వారి ఆశ్రమముప్రాంతములోనికి చేరుకున్నాము.

.

ఎట్లా పసిగాట్టాడో పసిగట్టాడు రాముడు మూడు బాణాలు ధనస్సుకు తొడిగాడు అవి మాకోసమే అని అర్ధమయ్యి అవి ధనుస్సు నుండి వేలువడేలోగానే నేను తప్పించుకున్నాను .

పాపము వారిరువురికీ రాముడి బాణము గురించిన జ్ఞానము లేకపోవటము చేత వాటి బారినపడి మృతులయ్యారు.

.

కాబట్టి రావణా ,హాయిగా సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖ్ఖాన ఎందుకు పెట్టుకుంటావు ,నీవాళ్ళంతా రకరకాల ఉత్సవాలు చేసుకుంటూ రోజూ ఆనందముగా ఉంటున్నారు ,వారికి ఆ ఆనందము కలకాలము ఉండేటట్లు చూడు .నిష్కారణముగా రాముడికి అపకారము చేసి ఆయన కోపానికి గురి అయ్యి మొత్తము రాక్షస జాతినే ఎందుకు పాడు చేసుకుంటావు అని పలికాడు మారీచుడు.

.

రామాయణమ్ .146

.........

మరణించబోయేవాడికి ఇచ్చిన ఔషధములవలె ,చవట నేలలో వేసిన విత్తనములవలె మారీచుడి హితోక్తులు నిష్ఫలమైపోయాయి.

.

రావణుడు రాముడి పట్ల అభిప్రాయమేమీ మార్చుకోలేదు ,పైగా అతడు మానవమాత్రుడు నన్నేమీ చేయజాలడు అన్నట్లుగా పరుషముగా మాట్లాడాడు .

.

ఖరుడి హత్యకు ప్రతీకారముగా ఆతడి భార్యను ఎత్తుకొని రావలసిందే అని పట్టుబట్టాడు .

.

నేను చేయాలనుకున్న పని యొక్క గుణ దోష విచారము చెయ్యి అని నిన్ను అడుగలేదు .

.

నీకు రాజుతో మాటలాడే పద్ధతి తెలియకున్నది ,దోసిలి ఒగ్గి అతనికి ప్రతికూలముకాని హితకరములైన విషయాలను వినయముగా, మృదువుగా చెప్పవలె! 

.

ఎంత హితకరములైనా గౌరవము లేకుండా తిరస్కార బుద్ధితో చెప్పినచో రాజు హర్షించడు..

.

రాజు అనగా అయిదుగురు దేవతల తెజోంశలు కలగలసినవాడు .

అగ్ని,ఇంద్ర,వరుణ,యమ,చంద్ర అంశలవి.

.

నీవు ఆ జ్ఞానము కోల్పోయి నీ ఇంటికి సహాయము నిమిత్తము స్వయముగా వచ్చిన నన్ను అవమానిస్తున్నావు.

.

ఇది మంచిదా ,లేక చెడ్డదా నాకు ఈ పని చేయగల సామర్ధ్యమున్నదా లేదా అని నేను నిన్ను అడుగలేదు .

.

నేను తలపెట్టిన ఈ మహా కార్యమునకు నీ సహాయము అత్యంత ఆవశ్యకము కావున నీవు చేసి తీరవలె !

.

 ఇది నా ఆజ్ఞ!

.

నీవు చిత్రవిచిత్ర వర్ణములగల బంగారు లేడి రూపము ధరించు ,ఆ లేడి వంటి మీద వెండి చుక్కలు మెరుస్తూ ఉండాలి సుమా !

.

వారి ఆశ్రమ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ సీత దృష్టిని ఆకర్షించు ,నిన్ను చూసి ఆవిడకు ఆశ్చర్యము కలుగవలె !

.

.నిన్ను పట్టితెమ్మని ఆవిడ రాముని పంపుతుంది ,నీవు అతనిని ఆశ్రమానికి బహు దూరముగా తీసుకొని పోయి "అయ్యో లక్ష్మణా ,అయ్యో సీతా " అని అరుపులుకూడా అరువు.

.

అది విని సీత లక్ష్మణుని రాముని కొరకు పంపగలదు .వారిరువురూ ఆవిధముగా దూరముగా వెళ్ళిన పిదప అనాయాసముగా ఆమెను నేను ఎత్తుకొని రాగలను.

.

మారీచుడా నీవు ఈ పని చేసినట్లైన ఎడల నా రాజ్యములో సగ భాగము నీకిచ్చెదను. 

ఆలస్యముచేయక బయలుదేరు నీ వెనుక రధముపై కూర్చుండి నేను అనుసరిస్తాను. 

.

ఈ విధముగా రాముని వంచించి యుద్ధము చేయకుండగనే సీతను పొంది కృతకృత్యుడనై లంకకు తిరిగి వెళ్ళేదను, 

.

నా ఆజ్ఞకు విరుద్ధముగా నీవు చేసినట్లైనచొ ఇప్పుడే నిన్ను చంపి వేస్తాను ,రాజుకు ప్రతికూలముగా ఉండేవాడు సుఖముగా అభివృద్ది చెందజాలడు. 

.

నీచే బలాత్కారముగా నైనా ఈ పని చేయిస్తాను . నీ ఇష్టాయిష్టములతో నాకు పని లేదు..

.

నీవు రాముని వద్దకు వెళ్ళినచో మరణించవచ్చును ,లేక మరణించకపోవచ్చును కానీ నాతొ విరోధము పెట్టుకుంటే తక్షణమే మరణిస్తావు కావున నీకేది మంచిదో ఆలోచించి నిర్ణయించుకో! 

.

అని బెదిరించాడు రావణుడు!


రామాయణమ్ 147

...............

రావణుడి ఆజ్ఞ విని మారీచుడు అంతేపరుషముగా బదులిచ్చాడు.

నీవు,నీపుత్రులు,నీఅమాత్యులు,నీ రాష్ట్రము సకలము నాశనమయ్యేటట్లు ఏ పాపాత్ముడిచ్చాడు నీకీ సలహా ! 

.

కోరికోరి మృత్యుద్వార ప్రవేశము చేయాలనుకుంటున్నావు.

.

నీకు సరి అయిన సలహా ఇచ్చే మంత్రులే కరవైనారే!

.

రావణా ఇంత తీక్ష్ణ స్వభావముగల నీ పాలనలో ప్రజలంతా కూడా నక్కచేత కాపలా కాయబడే గొర్రెల వంటి వారు ! వారికింకా వృద్ది ఎక్కడ?

.

నేను ఎలాగూ రామునిచేతిలో చంపబడతాను ,ఆ తరువాత కొంతకాలానికే నీ వంతుకూడా వస్తుంది ,నేను ఆయన చేతిలో చనిపోవడానికే నిశ్చయించుకున్నాను.

.

రాముడి చూపు నా మీద పడనంతవరకే నా ప్రాణాలు ఈ శరీరములో ఉంటాయి ,ఒక్కసారి ఆయన నన్ను చూశాడా ఇక ఆ క్షణమే నా జీవితపు చివరి క్షణము.

.

అని పలుకుతూ దీనముగా ఇక వెళదాము పద అంటూ రావణుడితో బయలుదేరాడు మారీచుడు .

.

అప్పుడు రావణుడు ఆనందముగా మారీచుని కౌగలించుకొని తన రధము మీద కూర్చుండ బెట్టుకొని రామాశ్రమసమీపములోకి చేరాడు.

.

విమానము వలెనున్న ఆ రధము దిగి పరిసరాలను గమనిస్తూ ఆశ్రమము వైపు దృష్టి సారించాడు.

.

మారీచా !అదుగో ఆ అరటి చెట్లు పెరిగివున్నదే ఆ ప్రదేశము ! అదే శ్రీరాముని ఆశ్రమము ,నీవు త్వరగా పనిపూర్తిచేయాలి సుమా అని హెచ్చరించి పంపాడు.

.

మారీచుడు ఒక అందమైన లేడి రూపము ధరించాడు.

.

ఆ మృగానికి అందమైన కొమ్ములున్నాయి,

 ఆ కొమ్ముల చివరలు మణికాంతులతో మెరిసిపోతున్నాయి.

ముఖము కొంత తెలుపు,కొంత నలుపు ,

దాని ముఖము ఒక చోట ఎర్రని పద్మమువలె మరియొక చోట నల్లకలువలాగా ఉన్నది.

.

దాని చెవులు ఇంద్రనీలాల మణులా అన్నట్లుగా భాసిస్తున్నాయి.

మెడ కొంచెము ఎత్తుగా ఉండి క్రింది దవడ ఇంద్రనీల మణి లాగా మెరుస్తూ ఉన్నది.

.

దాని పొట్ట మల్లెపూవులాగా ,చంద్రుడులాగా ,వజ్రములాగా ప్రకాశిస్తూ ఉన్నది.

.

దాని శరీరము కొంత భాగము ఇప్పపూవు రంగులో,కొంత భాగము పద్మ కేసరవర్ణముతో మెరిసిపోతూ ఉన్నది.

.

సన్నటి పిక్కలతో తళతళ మెరిసే రంగుతో పొందికైన అవయవములతో చూడగానే స్వంతము చేసుకోవాలన్న భావన ఎంతవారికైనా కలిగించేదిగా ఆ మృగము ఉన్నది.


రామాయణమ్..148

......

ఆ మాయా మృగము చెంగుచెంగున గంతులు వేస్తూ సీతారాముల ఆశ్రమ ప్రాంతములో సంచరిస్తున్నది .

అది గంతులు వేసినప్పుడల్లా సూర్యకాంతి దాని శరీరము మీదనుండి ప్రతిఫలించి వింత వింత శోభలతో అలరారుతున్నది .

.

ఎలాగైనా సరే సీత కంట్లో పడాలనే తాపత్రయముతో ఆశ్రమ పరిసరాలలోకి వెళుతున్నది ,మరల బయటకు వస్తున్నది ,సీతమ్మ వచ్చే అరటిచెట్ల దగ్గరే తిరుగాడుతూ సీత దృష్టి పడేటట్లుగా దూకుతున్నది , హఠాత్తుగా గంతులు వేసి గుండ్రముగా తిరుగుతున్నది,దాని హొయలు,వయ్యారము చెప్పనలవి గాకుండా ఉన్నది.

.

తోటి మృగాలు దాని వద్దకు వచ్చి వాసన చూసి గాభారాపడి తప్పుకుంటున్నాయి. మృగాలు దగ్గరకు వచ్చినప్పుడు తినాలనివాటిమీద కోరిక కలిగినప్పటికీ నిగ్రహించుకుంటున్నాడు మారీచుడు.

.

 ఆ సమయములో పూలుకోసుకోవడానికి సీత ఆశ్రమము నుండి బయటకు వచ్చింది అదే సమయములో ఆమె కళ్ళముందు ఏదో మెరుపు మెరిసినట్లయి అటువైపు చూసింది ,అప్పుడు ముత్యములచేత,మణులచేత సహజసిద్ధముగా అలంకరింపబడి ప్రకాశించే మృగము ఆవిడ కంట పడ్డది.

.

సీతను చూడగానే ఆ మాయామృగము ఇంకా చిత్ర విచిత్ర గతులతో విన్యాసాలు చేసింది ,మధురముగా కూసింది,ఆహ్లాదకరంగా ఆడింది ,ముద్దులు ఒలకబోస్తూ గిరగిరా తిరిగింది, భూమి మీద పడుకొని వళ్ళు విరుచుకొని శరీర సౌందర్యమంతా సీత కళ్ళలో పడేటట్లుగా అటూఇటూ మెదిలింది.

.

అ మృగాన్ని చూడగానే బిగ్గరగా కేక వేసి రామలక్ష్మణులను పిలిచింది సీత.

.

ఆ మృగాన్ని చూడగానే వీడు మారీచుడే అని గుర్తుపట్టాడు లక్ష్మణుడు,

.

అన్నా వీడు నిస్సందేహముగా మారీచుడే ! వేటకు వచ్చిన రాజులను భ్రమింప చేసి రకరకాల మృగ రూపాలు ధరించి వారిని సమీపించి వారు మొహములో పడి దగ్గరకు రాగానే వారిని చంపి భక్షించే వాడు ,అది వాడి చరిత్ర .

.

ఇది వాడి ఐంద్రజాలమే !

.

రామా ఎక్కడైనా మణిమాణిక్యాలు,రత్నాలు సహజముగా పొదగబడ్డ మృగము సృష్టిలో ఉంటుందా ? అని పలుకుతున్న లక్ష్మణుని మాటలకు అడ్డు తగిలి సీత ఇలా పలికింది.

సభా పర్వము -4

 సభా పర్వము -4

శిశుపాలుని వధ

ఆ తరువాత ధర్మరాజు తన నలుగురు తమ్ములను నలుగురిని పిలిచి నాలుగు దిక్కులకు జైత్రయాత్రకు పంపాడు. నలుగురు తమ్ములు నాలుగు దిక్కుల ఉన్న రాజులను, దేశాలను జయించి కప్పం కట్టించుకుని తిరిగి వచ్చారు.

భీమసేనుడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు నాలుగు దిక్కులను జయించి అసంఖ్యాకంగా ధన, కనక, వస్తు, వాహనములు తీసుకు వచ్చారు. ద్వారక నుండిశ్రీకృష్ణుడు అశేష ధన, కనక, వస్తు, వాహనాలతో వచ్చాడు. అవన్నీ ధర్మరాజుకు ఇచ్చి గౌరవించాడు. ధర్మరాజు అవి చూసి సంతోషించి రాజసూయయాగం ప్రారంభించాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో ” కృష్ణా ! నీ దయ వలన సార్వభౌమత్వం లభించింది. అశేష సంపదలు లభించాయి. నన్ను రాజసూయయాగం చేయడానికి నియోగించు ” అన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు తో “[ధర్మరాజ ! నీవు రాజసూయ యాగం ప్రారంభించు అందుకు నీ ఇష్టం పనికి నన్ను నీ ప్రియం కోరే ఇతరులను అనుమతించు ” అన్నాడు. శ్రీకృష్ణుని అనుమతి పొంది ధర్మరాజు రాజసూయం ప్రారంభించాడు. యాగానికి కావలసిన ఏర్పాట్లను చూడటానికి సహదేవుని నియమించాడు. శిల్పులను పిలిపించి యజ్ఞశాలను నిర్మింపచేసాడు. నానా దేశాధీసులకు ఆహ్వానం పంపాడు. ఆహారధాన్యాలను సమృద్ధిగా సమకూర్చారు. ధర్మరాజు ఆహ్వానాన్ని మన్నించి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు, శకుని,సైంధవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు తదితరులు రాజసూయయాగానికి విచ్చేసారు. వచ్చినవారిని ధర్మరాజు తగిన రీతిన సత్కరించి వసతి ఏర్పాట్లు చేసాడు. అందరికి దానధర్మాలు చేయడానికి అధిపతిగా కృపాచార్యుని, కార్యాచరణకు భీష్ముని, ద్రోణుని, సకల వస్తు వ్యయమునకు విదురుని, నానాదేశరాజులు తెచ్చిన కానుకలు స్వీకరించటానికి దుర్యొధనుడిని నియోగించాడు. శుభముహూర్తములొధర్మరాజు యజ్ఞ దీక్ష తీసుకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు. పైలుడు, ధౌమ్యుడు ఋగ్వేద ఋత్విక్కులుగానూ, యాజ్ఞవల్క్యుడు యజుర్వేద ఋత్విక్కునిగానూ, సుసాముడు సామవేద ఋత్విక్కుగానూ, వేదవ్యాసుడు ప్రధాన ఋత్విక్కుగానూ నారదాది మహర్షులు సదస్యులుగానూ భీష్ముడు సహాయకుడుగానూ ఉండగా యాగం మొదలైంది.

రాజసూయయాగం ప్రారంభం అయింది. భీష్ముడు ధర్మరాజు తో ఇలా అన్నాడు ” ధర్మరాజా ! స్నాతకుడు, ఋత్విజుడు ,భూతలేశుడు, సద్గురుడు, జ్ఞానసంపన్నుడు, అందరికీ ఇష్టుడు అయిన మహానుభావుని ఒకరిని పూజించు ” అని అన్నాడు. ధర్మరాజు భీష్మునితో ” పితామహా ! అటువంటి మహానుభావుడెవరో మీరే శలవీయండి ” అన్నాడు. భీష్ముడు ” ధర్మనందనా ! ఇంక ఎవ్వరున్నారు ? సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడే అగ్ర పూజకు తగిన వాడు ” అని ధర్మరాజు తో చెప్పాడు. తనమనసులో మాట చెప్పినందుకు ధర్మరాజు ఆనందపడి సహదేవుడు తెచ్చిన అర్ఘ్యపాద్యాలను శ్రీకృష్ణునకు సమర్పించాడు.

ఇది చూసి శిశుపాలుడు సహించలేక పోయాడు. ధర్మరాజు ని చూసి ” ఓ ధర్మరాజా! ఈ సభలో ఎందరో మహారాజులు, బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వారిని కాదని ఈ గాంగేయుడు చెప్పాడని చెడు నడవడి కలిగిన ఈ కృష్ణుని పూజిస్తావా ? ఇది అవివేకం కాదా ? ఈ భీష్మునికి ఆలోచనలేకపోతే నీ బుద్ధి ఏమైంది? మీకు కృష్ణుడు కావలసిన వాడైతే మీ ఇంటికి తీసుకు వెళ్ళి పూజలు చేయండి. ఈ మహాసభలో పూజించి మమ్మల్ని అవమానించ కండి. కృష్ణుడు ఇంతటి మర్యాదకు అర్హుడు కాదు ” అంటూ శిశుపాలుడు సభ విడిచి వెళ్ళాడు.

ధర్మరాజు శిశుపాలుని వెంట వెళ్ళి ” శిశిపాలా ! నీ వంటి ప్రభువులు ఇలా పరుషంగా మాటాడ తగునా ? శ్రీకృష్ణుడు సాక్షాత్తు మహావిష్ణు అవతారం కనుక భీష్ముడు అగ్రపూజ చేయమన్నాడు. లోకోత్తరుడని అందరిచే శ్లాగించబడే కృష్ణుని నువ్వు ఇలా కాదనడం భావ్యమా ? ” అని శిశుపాలునికి నచ్చచెప్ప పోయాడు. భీష్ముడు ” ధర్మరాజా ! శిశుపాలుడు బాలుడు, చెడు నడత కలిగిన వాడు. పెద్దలను అకారణంగా నిందించే వాడు. కొద్దిపాటి రాజ్యం లభించగానే మదం ఎక్కిన వాడు. వాడికి ధర్మాధర్మాలు తెలియవు. అతడిని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తావు ? ” అని శిశుపాలుని చూసి ” శిశుపాలా! బుద్ధిహీనుడా శ్రీకృష్ణునికి అగ్రపూజకు అర్హత లేదా ? ఇక్కడ ఉన్న రాజులంతా జరాసంధుని నుండి విడిపించింది ఈ మహానుభావుడే కదా. బాలుడైనా జ్ఞానవృద్ధుడు పూజనీయుడే. అమిత పరాక్రమవంతుడైన క్షత్రియుడు పూజనీయుడే. శ్రీకృష్ణుడు మహాజ్ఞాని, మురుడు అనే రాక్షసుని సంహరించిన పరాక్రమ వంతుడు. ఇతరులను పూజిస్తే వారు మాత్రం తృప్తి చెందుతారు. లోకారాద్యుడైన కృష్ణుని పూజిస్తే లోకమంతా తృప్తి చెందుతుంది ” అన్నాడు. ఇంతలో సహదేవుడు లేచి ” శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయడం మా ఇష్టం . కాదన్న దుర్జనులను నా పాదం క్రింద అణిచివేస్తాను ” అంటూ పాదం ఎత్తి భీకరంగా నిలబడ్డాడు. సభ అంతా సహదేవుని భీకరరూపంచూసి భయపడింది. శిశుపాలుని సైన్యాధిపతి తన సైన్యాన్ని తమపక్షాన ఉన్న రాజులందరిని ఒకటిగా చేర్చి యుద్ధానికి సిద్ధం అయ్యాడు.

ఈ పరిణామానికి ధర్మరాజు కలత చెందాడు. భీష్ముని చూసి ” పితామహా ! ఆహుతులైన రాజులంతా కలత చెంది ఉన్నారు. తమరే శాంతింప చేయాలి ” అన్నాడు . భీష్ముడు ” ధర్మజా! కలత పడకు. సకల రాక్షస సంహారుడు శ్రీకృష్ణుడు యాగరక్షకుడుగా ఉండగా ఈ యాగాన్ని ఎవరూ విఘ్నం చేయలేరు ” అన్నాడు. ఆ మాటకు శిశుపాలుడు కోపించి ” ఈ ముసలి భీష్ముడు యాదవుని పరమేశ్వరునిగా చేసాడు. ఈ పాండవువులు ధర్మాత్ములూ, ధీరులూ అయితే ఇక్కడున్న రాజులు అధర్మవర్తనులూ అధీరులా ? పూతన అనే స్త్రీని చంపుట, ప్రాణ రహితమైన బండిని తన్నుట, పుచ్చిన చెట్లను పడత్రోయుట, చిన్న పుట్టలాంటి కొండను ఎత్తుట పరాక్రమమా ? స్త్రీ వధ చేసినవాడికి మర్యాదలా ? అలాంటి వారిని పొగిడే వారిని సహస్ర చీలికలుగా చేయాలి. ఇక తమరి సంగతి మరొకరు ప్రేమించిన కన్యను తమ్ముడికి కట్టబెట్టాలని చూసావు. కాని ధర్మం తెలిసిన నీ తమ్ముడు అంబను విడిచి పెట్టాడు. సంతాన హీనుడివి నాకు ధర్మపన్నాలు చెప్తావా! ఈ కృష్ణుడు వీరత్వం తెలియనిదా. మహావీరుడైన జరాసంధునికి భయపడి పది సార్లు పారిపోయాడు. కపట బ్రాహ్మణవేషాలలో వెళ్ళి చంపడం వీరత్వమా ? ” అని దూషించాడు. శ్రీకృష్ణుని తూలనాడటం సహించలేని భీముడు శిశుపాలుని చంపటానికి ముందుకు దూకాడు. భీష్ముడు భీముని ఆపాడు.

భీష్ముడు భీమునితో ” భీమసేనా! ఈ శిశుపాలుని నువ్వు చంపరాదు

ఈ దుర్మార్గుడు దమఘోషుడు సాత్వతికి పుట్టాడు. పుట్టుకతోనే నాలుగు భుజాలతో, నొసటి మీద కంటితో, గార్దభ స్వరంతో పుట్టాడు. తల్లి తండ్రులు ఆ బాలుని చూసి కలత చెందారు. అప్పుడు అశరీరవాణి ఈ బాలుడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో ఇతడు హతుడు కాగలడు ” అని పలికింది. అప్పటి నుండి ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు. ఒకరోజు బలరామ కృష్ణులు ఆ బాలుని చూడటానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తధ్యమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుని చూసి ” కృష్ణా ! నీ మరిది అయిన శిశుపాలుని రక్షించు ” అని కోరింది. అలాగే అన్నాడు కృష్ణుడు. ఇతని నూరు తప్పులు సహిస్తాను అవి పూర్తి కాగానే నా చేతిలో హౌతుడౌతాడు ” అని చెప్పాడు భీష్ముడు. అప్పటికి శిశుపాలుడికి బుద్ధి రాలేదు.” కృష్ణా! ఈ ముసలి భీష్ముడు పాండవులు నిన్ను సన్మానించడం నేను సహించలేను. నాతో యుద్ధానికి సిద్ధం కండి ” అన్నాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి ” మేము ప్రాగ్జ్యోతిష పురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించాను. ఇతడు నాకు పరమ శత్రువు అయ్యాడు ” అన్నాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి ” నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నావా ? ” అని దూషించావు .ఇక శ్రీకృష్ణుడు సహించలేక పోయాడు . తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు తో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని ఛేదిదేశానికి రాజుని చేసాడు. శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తి అయింది.

ప్రహ్లాదుడు

 🌺 *ఓం నమో నారాయణాయ* 🌺



*34. సురలం దోలుటయో, సురాధిపతులన్ స్రుక్కించుటో, సిద్ధులం బరివేధించుటయో, ముని ప్రవరులన్బాధించుటో, యక్ష కిన్నరగంధర్వ విహంగ నాగపతులన్ నాశంబు నొందించుటో, హరియంచున్ గిరి యంచు నేల చెడ మోహాంధుండవై పుత్రకా!*



*భావము:-* కుమారా! ప్రహ్లాదా! దేవతలను పారదోలవయ్యా. లేకపోతే దేవతా విభులను పట్టి చావబాదటం కాని, సిద్ధులను బాగా వేధించటం కాని మునీశ్వరులను బాధించటం కాని, లేదా యక్షులు, కిన్నరులు, గంధర్వులు, పక్షి రాజులు, నాగరాజులను చంపటం కాని చెయ్యాలి. ఇలా చేయటం మన ధర్మం. అది మానేసి, హరి అంటూ గిరి అంటూ అజ్ఞానం అనే అంధకారంతో ఎందుకు మూర్ఖుడిలా చెడిపోతున్నావు.”




*35.అనినఁ దండ్రిమాటలకుఁ బురోహితు నిరీక్షించి ప్రహ్లాదుం డిట్లనియె "మోహ నిర్మూలనంబు జేసి యెవ్వని యందుఁ దత్పరులయిన యెఱుకగల పురుషులకుం బరులు దా మనియెడు మాయాకృతం బయిన యసద్గ్రాహ్యంబగు భేదంబు గానంబడ దట్టి పరమేశ్వరునకు నమస్కరించెద.*



*భావము:-* ఇలా చెప్పిన తండ్రి మాటలు విని ప్రహ్లాదుడు గురువు చండామార్కులను చూసి ఇలా అన్నాడు “జ్ఞానులు మోహం తొలగించుకొని భగవంతుని అందు ఏకాగ్ర భక్తి ప్రపత్తులతో ఉంటారు. అట్టి వారికి తమ పర భేదం అనే మాయా మోహం అంటదు. ఆ భగవంతుడు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను.




*36.అజ్ఞుల్కొందఱు నేము దా మనుచు మాయంజెంది సర్వాత్మకుం బ్రజ్ఞాలభ్యు దురన్వయక్రమణునిన్ భాషింపఁగా నేర రా జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వే దజ్ఞుల్తత్పరమాత్ము విష్ణు నితరుల్ దర్శింపఁగా నేర్తురే?*



*భావము:-* కొందరు అజ్ఞానంలో పడి తాము వేరు, పరులు వేరు అనే మాయ అనే భ్రాంతిలో ఉంటారు. సర్వాత్మకుడు అయిన భగవంతుడిని ఎంత తెలివితేటలూ, పాండిత్యం ఉపయోగించినా కూడా తెలుసుకోలేరు. ఆ విష్ణుమూర్తిని పరమాత్ముడిని బ్రహ్మ వంటి వేద విజ్ఞాన మూర్తులు కూడా తెలుసుకోలేని వారే. ఇక ఇతరులు సామాన్యులు ఆ పరాత్పరుడు అయిన విష్ణుమూర్తిని ఎలా దర్శించగలరు!

**అద్వైత వేదాంత పరిచయం**

 **దశిక రాము**


**అద్వైత వేదాంత పరిచయం**


4.1 బ్రహ్మచర్య ఆశ్రమం:

  మొదటిదశ బ్రహ్మచర్య దశ.ఇందులో విద్య నేర్చుకుంటాము.విద్య ఏమిటి? ఎందుకు?

  ఇప్పటి నిర్వచనం మారిపోయింది. సంపాదన కోసం. అర్థ, కామాల కోసమే విద్య అయిపోయింది. శాస్త్రం కూడా విద్య నేర్చుకోమనే చెప్తుంది. మనం తదనుగుణమైన విద్యని నేర్చుకోవాలి. ఇది శాస్త్రం ప్రకారం రెండో ఉద్దేశం. కాని దురదృష్టవశాత్తూ అదే ప్రాధమిక అవసరం అయి కూర్చుంది.శాస్త్రం ప్రకారం విద్య అంటే ఒక వ్యక్తిని తీర్చిదిద్దేది,మంచి నడవడికని పెంపొందించేది,తను నేర్చుకుని తనని తానూ, సంఘాన్నీ 

ఉద్ధరించేటట్టు చేసేది. ఒక లంచగొండి, మోసగాడు సంఘంలో అడుగుపెడితే సమాజం భ్రష్టుపడుతుంది. స్వామి చిన్మయానంద అందంగా ఈ నిర్వచనాన్ని యిచ్చారు. పశుప్రవృత్తి ఉన్న మనిషి, సంస్కారం ద్వారా మనిషి ప్రవృత్తిని పెంపొందించుకోవాలి. అప్పుడు మనిషిప్రవృత్తి నుంచి దైవప్రవృత్తి పెంపొందించుకోగలుగుతాడు.

  గనులలో దొరికే ఖనిజాలు విలువైనవే కానీ వాటిని యధాతధంగా వాడలేము. వాటిని సానపట్టి, పనికివచ్చే లోహంగా తయారుచేయాలి. అలాగే మనం కూడా తల్లిగర్భం నుంచి పుట్టగానే సానబట్టని, నిక్షిప్తమైన శక్తి 

ఉన్న వాళ్ళమన్నమాట. మనని గురుకుల వాసంకి పంపిసానబట్టాలి. అందుకే సంస్కృతం లో జన: అంటే అనాగరిక స్థితి నుంచి నాగరికత స్థాయికి ఎదగటం. ఈ పని విద్య చేస్తుంది.

  మాతుర్‌ అగ్రే అధి జననం ద్వితీయం మౌంజి బంధనాత్‌,

  తత్రస్య మాతా గాయత్రి పితా తు ఆచార్య ఉచ్యతే.

  మొదటి తల్లిదండ్రులు జన్మనిచ్చినవారు. గాయత్రీ మంత్రజపం బోధిస్తాడు గురువు. గాయత్రీ మంత్రం విద్యకి ప్రామాణికం. అందువల్ల గురువు తండ్రి, విద్య తల్లి. ఈ రెండో తల్లిదండ్రులు మనని సంస్కరిస్తారు.

  విద్యార్థి దశని బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు. ఇక్కడ బ్రహ్మ అంటే శాస్త్రం లేదా వేదాలు.బ్రహ్మచారి అంటే దాని గురించి ఆలోచించేవాడు. బ్రహ్మణి వేదే చరతి. చరతి అంటే నడిచేవాడు. వేదశాస్త్రంలో మానసికంగా పయనించే వాడు. ఈ దశని బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు.

  సంస్కరించబడటానికి అవసరమైన విద్య ఏది? శాస్త్రం ఏం చెపుతుంది? శాస్త్రం మూడు విషయాలు చెపుతుంది.

🙏🙏🙏

సేకరణ

ధార్మికగీత - 51*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        *ధార్మికగీత - 51* 

                                  *****

      *శ్లో:- పరాధీనం వృథా జన్మ ౹*

             *పర స్త్రీషు వృథా సుఖం ౹*

             *పర గేహే వృథా లక్ష్మీ: ౹*

             *పుస్తకే విద్యయా వృథా ౹౹*

                          *****

*భా:- కన్నవారు, పెంచినవారు దూరమై, అండదండలు కరువై, నిలువనీడ లేక, పేదరికంతో పరుల పంచల నాశ్రయించి, పరుల మోచేతి నీళ్లు త్రాగుతూ గడిపే జీవనం నిరుపయోగమే. ఇంటిపేరును,కన్నవారిని త్యాగంచేసి, నిన్ను నమ్మి, వలచి వచ్చిన భార్యను నిర్లక్ష్యం చేస్తూ, పరకాంతా వ్యామోహంలో పడి పబ్బం గడుపుకోవడం అనేది దినదినగండమై తన జీవిత వినాశనానికే. పురాణాలలో దీనికి ఉదాహరణలు కోకొల్లలు. కొందరు తమ బంధువుల ఆస్తిపాస్తులను, ఉన్నత పదవులను ఘనంగా ప్రచారం చేస్తూ, ఆత్మానందంలో పరవశించి పోతుంటారు. పరుల ఆ సిరిసంపదల వల్ల తన కేమైనా వీసం లాభం ఉందా? లేదు గదా ! పర సంపద మనకు వృధానే కదా! కొందరు పుస్తకాలు కొని, సేకరించి అలమరలు భారీగా నింపుతుంటారు. ఒక్క పుస్తకం లోని అపారజ్ఞానామృత సారాన్ని మస్తకంలోకి కించిత్తైనా ఎక్కించే ప్రయత్నం చేస్తారా! చేయరు. ఇక ఆ ఆనంతవిజ్ఞాన భా౦డాగారం వల్ల తమకు ఒరిగేదేముంటుంది ? సున్న. పుస్తకం మస్తకంలో నిక్షిప్తమైతేనే సమయానికి అందలి రసజ్ఞత మన కుపకరిస్తుంది. ఆ రసానుభూతికి మన మరియు ప్రక్కవారి డెందాలు అమందానంద కందళితమౌతాయి*.

                                  *****

                   *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

బ్రహ్మోత్సవారంభం

 బ్రహ్మోత్సవారంభం

౼౼౼౼౼౼౼౼౼౼౼

బ్రహ్మాండోత్సవమూర్తికి

బ్రహ్మోత్సవ వైభవాలు బ్రహ్మాండములన్

బహ్మోద మ్మేర్పడగా

బ్రాహ్మీ సంపద్విశోభ ప్రారంభమయెన్.


గోవిం దానందప్రభు

భూవాల్లభ్యమ్ముగాంచి భువనత్రయమున్

సేవోత్సాహమునందగ

వే వేడ్కల నుత్సవాల విందొప్పారెన్.


కంకణబద్ధ నిబద్ధత

వేంకటవిభునుత్సవాల వేడుక లెదలో

నుంకువనిడ మొదలాయెను

సంకటములె బాసిపోవు సత్పథమందున్.


రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.