2, ఆగస్టు 2020, ఆదివారం

సొంతంగా 12 రోజుల లో 9 జ్యోతిర్లింగాలను దర్శించుట ఎలా?


ఓం నమో గణాధి పతయే నమః ఓం నమః శివాయ
ఈ క్రింద తెలిపిన ప్లాన్ వీలైనంత తక్కువ ఖర్చు తో జ్యోతిర్లింగ దర్శనం కోసం వ్రాయబడినది. శివ భక్తులకు సాయ పడుదామన్న చిన్న ఆశ తో ఈ ప్లాన్ వ్రాసాను. ప్లాను లో వున్న రైళ్లు ప్రతి రోజు నడిచేవి. మీ అవసరాన్ని బట్టి మీకు కావలిసిన ఊరిలో మీరు  విశ్రమించ వొచ్చు. శివాష్టోత్తరం లేక మీకు అవసరమైన మంత్రాలూ తీసుకుకొని గుడి లో చదవండి. లేక శివ నామం స్మరించండి. అభిషేకం కొరకు రాగి లేదా వెండి పాత్ర తీసుకు వెళ్ళండి. ఈ ప్లాన్ గుడి లో ఉంటే ఇతర భక్తులకు కూడా ఉపయోగ పడును. దయ చేసి ఈ ప్లాన్ గుడి లో నే ఉంచ గలరు. నేను మీ వంటి ఒక శివ భక్తుడిని. నేను టూర్ ఆపరేటర్ ను కాను. ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి. శీఘ్రమేవ శివ దర్శన ప్రాప్తిరస్తు. Note: రైల్వే స్టేషన్ కోడ్ ని () లోపల రాసాను.
1వ రోజు: బేగంపేట్ లో రాత్రి 9:00 కి ట్రైన్ # 57549 (ఔరంగాబాడ్ పాసెంజర్) ఎక్కి మరుసటి రోజు పొద్దున్న 6:30 కి పర్లీ రైల్వే స్టేషన్ లో దిగండి. OR మీరు విజయవాడ నుంచి యాత్ర ప్రారం భిస్తుంటే, ట్రైన్# 17206 కాకినాడ సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి  లేదా ట్రైన్# 17208 విజయవాడ లో సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ పొద్దున్న 10.30 కి ఎక్కి, పర్లీ (PRLI) రైల్వే స్టేషన్ లో రాత్రి 12:05 కి దిగండి (ప్రయాణ సమయము 13 గంటలు).
2వ రోజు: పర్లీ రైల్వే స్టేషన్ నుండి బైజనాథ్ గుడి 3KMs  దూరం లో వుంది. స్టేషన్ బైట ఆటోలు దొరుకును. ఉదయం బైద్యనాథ్ జ్యోతిర్లింగ[1] దర్శనం చేసుకున్న పిమ్మట బస్సు లో పర్భానీ () (67KMs) రైల్వే స్టేషన్ కి 10:30 AM లోగ చేరుకొని ట్రైన్# 12715 స్చఖండ్ ఎక్ష్ప్రెస్స్ 10.37 AM ఎక్కండి లేదా ట్రైన్# 17618 తపోవన్ ఎక్ష్ప్రెస్స్ 11.17 AM కి ఎక్కండి. ఔరంగాబాద్ () రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 2:30 PM కి దిగి 30 కిలోమీటర్ల దూరం లో వున్న గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించండి. గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనము (ఇక్కడ నుంచి ఎల్లోరా గుహ 1KM దూరం లో వుంది, ఏ గుహలను పూర్తి గా చూడాలంటే ఒక రోజు పడ్తుంది) గుడి దెగ్గర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.
3 వ రోజు: ఔరంగాబాద్ బస్సు స్టాండు లో నాశిక్ బస్సు ఎక్కండి. నాశిక్ బస్టాండ్ (దూరం 187 కిలోమీటర్లు) ప్రయాణ సమయం 5 గంటలు. నాశిక్ బస్సు  స్టాండ్ లో త్రియంబక్ కి వెళ్లే బస్సు ఎక్కి (దూరం 30 కిలోమీటర్లు) త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం[3] దర్శించుకోండి (రాత్రి 9:00 PM వరకు గుడి తెరచి  ఉంటుంది) దర్శనం తరువాత, గోదావరి ఆవిర్భవించిన క్షేత్రం దర్శించండి. గుడి దెగ్గర రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.
4 వ రోజు: పొద్దున్నే 06:00 AM బయలుదేరి నాశిక్ బస్సు స్టాండ్ చేరుకోండి. 07:00 గంటలకు నాశిక్ బస్సు స్టాండ్ లో మంచర్ వెళ్లే గవర్నమెంట్ బస్సు (ప్రైవేట్ బస్సు ఎక్కితే లేట్ అవుతుంది) ఎక్కి మంచర్ బస్సు స్టాండ్ లో 11:00 AM కి దిగండి (దూరం 150 KMs). మంచర్ బస్టాండ్ లో భీమా శంకర్ బస్సు ఎక్కి భీమశంకర్ (61KMs, 2hours) లో భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని [4] దర్శించుకొండి (బస్సు స్టాండ్ దెగ్గర లో నే గుడి వున్నది). మధ్యాహ్నం 2:00 PM కి భీమశంకర్ బస్టాండ్ లో పూణే  బస్సు ఎక్కి పూణే (PUNE) రైల్వే స్టేషన్ కి చేరుకొండి (110 KMs, 3 hours). రాత్రి 7:50PM కి ట్రైన్# 11090 పూణే భగత్ కి కోతి ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి. ఒక వేళారోజు గురువారం ఐతే డైరెక్ట్ సోమనాథ్ ట్రైన్ రాత్రి 7:50 PM ట్రైన్# 11088 పూణే వెరావల్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.
5 వ రోజు: అహ్మదాబాద్ (ADI) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:45AM కి దిగి ట్రైన్# 11464 జబల్పూర్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 8:15AM కి లేదా ట్రైన్#19119 అహ్మదాబాద్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 10:40 AM ఎక్కి వెరావల్ (VRL) రైల్వే స్టేషన్ లో సాయంత్రం 5:35PM కి లేదా 7:30PM కి దిగండి. అక్కడ బల్క తీర్థ్ దర్శించి, ప్రభాస్ తీర్థ్ త్రివేణి సంగమం లో స్నానం చేసి సోమనాథ్ జ్యోతిర్లింగ[5] దర్శనం  చేసుకుని  ట్రైన్# 19251 సోమనాథ్ ఒక  ఎక్ష్ప్రెస్స్ వెరావల్  లో రాత్రి 11:10 కి ఎక్కండి.
6 వ రోజు: ద్వారకా (DWK) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:10 AM కి దిగి, ద్వారకాధీశ్ దర్శనం, నాగేశ్వర  జ్యోతిర్లింగ [6] దర్శనం చేసుకుని ట్రైన్# 19006 (సౌరాష్ట్ర మెయిల్) మధ్యాహ్నం 1:00 PM కి  ద్వారకా స్టేషన్ లో ఎక్కండి. { (optional) లేదా ఒక రోజు ద్వారకా లో నే ఉండి ద్వారకాధీశ్ గుడి, ఆది శంకరాచార్య మఠం, భేట ద్వారకా, భద్కేశ్వర్ మహాదేవ్ గుడి, గోపి తలాబ్, గోమతి నది దర్శించండి.}
7 వ రోజు: వడోదర (BRC) రైల్వే స్టేషన్ లో రాత్రి 12:48 AM కి దిగి, ట్రైన్# 12961 అవంతిక ఎక్ష్ప్రెస్స్ రాత్రి 1:10 AM కి ఎక్కండి. లేదా వడోదర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.
{8 వ రోజు: వడోదర రైల్వే స్టేషన్ నుంచి 61KMs దూరం లో సముద్రం లో వున్న స్తంభేశ్వర్ మహాదేవ్ గుడికి వేళ్ళగలరు. రాత్రి 9:50 PM కి ట్రైన్# 19309 GNC ఇండోర్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.}
9 వ రోజు: ఉజ్జయిని (UJN) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:20 AM లేదా 4:00 AM కి దిగి శిప్రా నది లో స్నానం చేసి మహాకాళేశ్వర జ్యోతిర్లింగ[7] దర్శనం చేసుకున్న తరువాత లోకల్ సైట్ సీఇంగ్ బస్సు ఎక్కండి. అక్కడ వున్న అమ్మ వారి శక్తిపీఠాన్ని దర్శించు కొండి. తరువాత ఓంకారేశ్వర  (135 kms) బస్సు ఎక్కి, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ[8] దర్శనం చేసుకోండి. పక్కనే వున్న స్వామి గజానన ఆశ్రమం లో రూమ్ తీసుకోండి.
10 వ రోజు: పొద్దున్నే నర్మదా నది లో స్నానం చేసి మళ్ళి వీలయితే ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించి ఖండ్వా (70KMs) బస్సు ఎక్కి ఖండ్వా (KNW) రైల్వే స్టేషన్ కి ప్రొద్దున్న 10:00 AM లోపల చేరుకొండి. అక్కడ ట్రైన్# 11093 మహానగర ఎక్ష్ప్రెస్స్ లేదా ట్రైన్# 12167 లోకమాన్య తిలక్  టెర్మినస్ వారణాసి సూపర్ ఎక్ష్ప్రెస్స్ ప్రొద్దున్న 10:00AM కి ఎక్కండి.
11 వ రోజు: వారణాసి (కాశి) (BSB) రైల్వే స్టేషన్ కి పొద్దున్న 3:45 AM కి చేరుకొండి. కాశి లో గోదోలియా చౌక్ దెగ్గర రూమ్ లేదా డార్మిటరీ తీస్కొని ఫ్రెష్ అప్ ఐ కాశి విశ్వేశ్వర జ్యోతిర్లింగ[9] దర్శనం చేసుకోండి, తరువాత  కాశి విశాలాక్షి శక్తిపీఠ దర్శనం చేసుకోండి, తరువాత తిల్ బండేశ్వర్ శివ లింగాన్ని (బెంగాలీ తొల దెగ్గర వుంది) దర్శించుకోండి  (ఈ శివ లింగాన్ని దర్శించిన వారు కాశీ లో అన్ని శివ లింగాలు దర్శించినట్టే), కాల భైరవుని కూడా దర్శించుకోండి. ముఖ్యమైనది మధ్యాహ్నం 12:00 నుంచి 12:10 వరకు మణికర్ణికా ఘాట్ లో సంకల్పం చెప్పుకుని స్నానం చెయ్యాలి. ఆ సమయం లో స్నానం చేస్తే  లోకం లో వున్న సకల నదులలో స్నానం చేసిన దాని కంటే ఉత్తమం (చాగంటి కోటేశ్వర్ రావు గారి ప్రవచనం). రామేశ్వరం లోని శివ లింగానికి అభిషేకం కొరకు వేరుగా ఒక పాత్ర లో గంగ జలం తీసుకో గలరు. సాయంత్రం 5:00 PM కి సికింద్రాబాద్ (SC) రైల్వే స్టేషన్ వెళ్ళుటకు ట్రైన్# 12792 సికింద్రాబాద్  ఎక్ష్ప్రెస్స్ వారణాసి రైల్వే స్టేషన్ ఎక్కండి  లేదా  విజయవాడ  వెళ్ళుటకు  ట్రైన్# 12296 సంఘ మిత్ర  ఎక్ష్ప్రెస్స్ ముఘల్  సారాయి (MGS) రైల్వే స్టేషన్ లో రాత్రి 11:27PM కి ఎక్కండి. మీరు ప్రయాగ లో స్నానం చేయ్యాలంటే వారణాసి నుండి ప్రయాగ (రైలు లో ప్రయాణ సమయం  3:30 గంటలు) ముందుగా వేరే రైలు లో చేరుకొని అలాహాబాద్ (MGS) రైల్వే స్టేషన్ (ALD) (ప్రయాగ) లో స్నానం చేసి రాత్రి 8:40 కి హైదరాబాద్  వెళ్లే train#12792 సికింద్రాబాద్ ఎక్ష్ప్రెస్స్ అలాహాబాద్ రైల్వే స్టేషన్ లో ఎక్కగలరు.
12 వ రోజు: సికింద్రాబాద్ కి రాత్రి 10:00 PM కి చేరుకొండి లేదా విజయవాడ కి ప్రొద్దున్న 6:05 AM కి చేరుకొండి.

కృష్ణా..కుచేలా

కృష్ణుడు లీలలు చేసాడు.. మాయలు చూపించాడు.. అంతేనా నిస్వార్థమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచాడు.

కృష్ణుడు-కుచేలుడు వీరి స్నేహం గురించి అందరికీ తెలసిందే. యుగాలు మారినా వారి స్నేహం గురించి మనం చెప్పుకుంటూనే  వస్తున్నామంటే వారి మైత్రి అంత గొప్పది.

కృష్ణ-కుచేలులు చిన్ననాటి స్నేహితులు. కలిసి చదువుకున్నారు. కృష్ణుడు పెరిగి పెద్దై ద్వారకాధీసుడైతే.. కుచేలుడు పేదవాడిగా మిగిలిపోయాడు.

గంపెడు సంసారంతో వారిని పోషించలేని స్థితిలో జీవితాన్ని భారంగా గడుపుతాడు. అలాగని తన స్నేహితుడైన కృష్ణుని సాయమడిగేందుకు అతని మనసు అంగీకరించదు.

కానీ కష్టాలు మితిమీరడంతో దిక్కుతోచని స్థితిలో ద్వారకకు వెళ్తాడు. స్నేహితుడిని ఎంతగానో ఆదరించిన కృష్ణుడు తన భార్యలతో కలిసి సత్కరిస్తాడు. కుచేలుడు తన వెంట కృష్ణుడికి ఇష్టమైన అటుకులు తీసుకువస్తాడు. కానీ అది కృష్ణుడికి ఇచ్చేందుకు సంశయిస్తాడు.

కానీ కృష్ణుడు ఆ అటుకులు తీసుకుని ఎంతో ఇష్టంగా ఆరగిస్తాడు. అలా కృష్ణుడు రెండు పిడికెళ్లు అటుకులు తింటాడో లేదో కుచేలుడి పాపకర్మలు తొలిగిపోతాయి. అతని కష్టాలు పరి సమాప్తమవుతాయి. మూడో పిడికిలితో అటుకులు తినడానికి సిద్ధమైన కృష్ణుని రుక్మిణి వద్దని వారిస్తుంది. ఆయన కష్టాలు తీరాయని నమ్మిన కృష్ణ పరమాత్మ ఆ అటుకులు తినకుండానే వదిలేస్తాడు.

స్నేహితుడు నోరు తెరిచి అడగకపోయినా అతని అవసరాన్ని గుర్తించి సాయం చేసి కృష్ణుడు స్నేహానికి నిదర్శనంగా నిలిచాడు.

నిజమైన స్నేహితుడు అంటే ఎలా ఉంటాడో వీరి అనుబంధం మనకు చెబుతుంది.

కాని యిక్కడ అర్థం కానిది ఏంటంటే మూడో పిడికిలి అటుకుల్ని తినడానికి ఉపక్రమించిన కృష్ణుణ్ణి రుక్మిణి ఎందుకు వారించినట్టు

***************

శ్రీ కాళహస్తి

వెంకన్నను దర్శించుకున్నాక.. శ్రీ కాళహస్తికి ఎందుకు వెళ్ళాలో తెలుసా?💐💐

శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులు దర్శనం అనంతరం తిరుమల దగ్గర్లో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకుంటారు. పాపవినాశనం, కాణిపాకంతో పాటు చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకోవడం సాధారణం. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న తర్వాత మరే దేవాలయానికి వెళ్లకూడదని చెబుతారు. 

ఒకవేళ వెళితే అరిష్టం అనే ఆచారం హిందు సాంప్రదాయాలలో అనాది నుండి వస్తోంది. అసలు ఎందుకు అలా చేయాలి, కాళహస్తీశ్వరుడిని దర్శించుకోవడంలో ఆంతర్యం ఏమిటి, ఆ ఆలయానికి వెళ్లిన తర్వాత మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. ఇలాంటి సందేహాలు రావడం అందరికీ సహజం. ఈ విశ్వం పంచభూతాల నిలయం. 

పంచభూతాలు అంటే గాలి, నింగి, నేల, నీరు, నిప్పు. వీటికి ప్రతితగా భూమి మీద పంచభూతలింగాలు వెలశాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన వాయులింగం. అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇతర దేవాలయాలకు వెళ్లకూడదు అనే ఆచారం ఉంది. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. 

శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనంతో సర్పదోషం తొలుగుతుంది, ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికే వెళ్ళమని చెబుతారు. ఇక్కడి పూజల వలన దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలు వదిలేసి ఇంటికి వెళ్ళాలి, తిరిగి ఇతర దేవాలయాలకు కానీ లేదా మరెక్కడికైనా వెళ్ళినా దోష నివారణ ఉండదనేది ప్రతీతి. 

అలాగే గ్రహణాలు పరమశివుడికి ఉండవని మిగతా అందరి దేవుళ్ళకి శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీనికి నిదర్శనంగా చంద్రగ్రహణం రోజున గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. ఈ సమయంలో కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు, గ్రహణానంతరం శుద్ధి జరిపిన తర్వాత పూజలు నిర్వహిస్తారు. 

అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవదర్శనం అవసరం లేదని నీతి. భక్తులందరూ ఏడాదిలో ఒక్కసారైనా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ రాహుకేతు పూజలు చేయించుకుని అక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులు నుండి గట్టెక్కవచ్చని పండితులు చెబుతుంటారు.

మన పండుగల గొప్పతనం 🙏


ఉగాది:- కష్టము,సుఖము,సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
శ్రీరామ నవమి:- భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
అక్షయ తృతీయ:- విలువైన వాటిని  కూడబెట్టుకోమని.
వ్యాస (గురు)పౌర్ణమి :-  జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
వరలక్ష్మి వ్రతం :-  నీకున్న ఐశ్వర్యమును అందరికి పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
పితృ అమావాస్య :-   చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.
బతుకమ్మ :- ఊళ్లోని వాళ్లంతా ఆట పాటలతో కలిసిపోతూ సంతోషంగా గడపమని.
దసరా ( ఆయుధ పూజ)  :- ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
కార్తీక పౌర్ణమి :-  చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమనెడి.
సంక్రాంతి :-  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
మహా శివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
కామదహనం:-  కోరికలు తగ్గించమని.
హోలీ :-  వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు ,వివిధ అనుభూతులను పిల్లా పెద్ధ అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.
***************

దర్పం



ఎదుటివాళ్ల దుస్తులను బట్టి, కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయాణించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ల స్థాయిని లెక్కగడుతుంటాం
తొందరపడి ఎవరిని తక్కువగా అంచనా వేయకండి......
-------------------------
హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ దగ్గర జరిగిన ఒక సంఘటన.....
ఒక దంపతులు  హార్వర్డ్  యూనివర్సిటీ ప్రెసిడెంట్ ని కలవడానికి వచ్చారు...
 దంపతులిద్దరినీ చూసి, పీఏ ముఖం చిట్లించుకుంది.

ముతక వస్త్రధారణలో ఉన్న ఆ ఇద్దరు వృద్ధులను, ప్రెసిడెంట్ దగ్గరకి పంపడానికి ఆమె అంగీకరించలేదు.

 లేకపోతే, ఈ ముసలివాళ్లకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్తో పనేమిటి?

ఇంతలో ఆ అధ్యక్షుడే గదిలోంచి బయటకు వచ్చాడు.

“చెప్పండి, ఏం కావాలి?" అడిగాడు ప్రెసిడెంట్..

"మేము విరాళం ఇద్దామనుకుంటున్నాం" చెప్పాడు ఆ ముసలాయన.

ప్రెసిడెంట్ కు నమ్మకం కలగలేదు. అయినా బయటపడకుండా
"ఎంత ఇవ్వాలనుకుంటున్నారు?" అన్నాడు.

"మా పదహారేళ్ల కొడుకు టైఫాయిడ్తో చనిపోయాడు. 
వాడి జ్ఞాపకార్థం ఈ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక భవనం నిర్మించాలని మా ఆశ" చెప్పింది వృద్ధురాలు.

 "ఎంత అవుతుంది?" అని చాలా క్యాజువల్గా అడిగాడు ముసలాయన,

"బిల్డింగ్ కు ఎంతవుతుందో తెలుసా?" ప్రశ్నించి  ప్రెసిడెంట్, ఆ బిల్డింగ్ కి అయ్యే ఖర్చు వివరాలు చెప్పాడు. 

ముసలాయన ఆశ్చర్యపోయాడు. ముసలావిడ కూడా ఆశ్చర్యపోయింది.

“అంటే ఈ లెక్కన ఓ యూనివర్సిటీ స్థాపించాలంటే
ఎంతవుతుంది?' కుతూహలం ఆపుకోలేక అడిగింది పెద్దావిడ.

ఆ పెద్ద మొత్తాన్ని ఒక్కొక్క పదమే నొక్కి చెప్పాడు ప్రెసిడెంట్.

ఆమె, భర్త వైపు తిరిగి అంది,
 “మరి మనమే ఓ యూనివర్సిటీ ఎందుకు పెట్టకూడదు డార్లింగ్!"

"సరే" అన్నాడు భర్త.

కొంతకాలానికి కాలిఫోర్నియా నగరంలో  "స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ" స్థాపన జరిగింది.

ఆ దంపతులిద్దరూ "లేలాండ్ స్టాన్ఫోర్డ్",  "జేన్ స్టాన్ఫోర్డ్'..

ఒక్కోసారి మనం ఎదుటివారిని ఎలా తప్పుగా అంచనా వేస్తామో చెప్పడానికే ఇదంతా చెప్పాల్సి వచ్చింది.

ఎదుటివాళ్ల దుస్తులను బట్టి, కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయాణించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ల స్థాయిని లెక్కగడుతుంటాం.

రేప్పొద్దున మీ ఎదురుగా నిలబడివున్నది, ఎవరైనా కావొచ్చు. వాళ్లను మీకంటే గొప్పవాళ్లుగా భావించకపోయినా ఫర్లేదు..
కానీ ... తక్కువ వాళ్లని మాత్రం అనుకోవద్దు.

ఎందుకంటే, పూర్వం మన పాత కథల్లో కూడా దేవుడో, మహారాజులో మారువేషాల్లో వచ్చేవారు.

 దేవుళ్ళలో
మనుషుల్ని చూసుకునే అవసరం మనకు లేకపోయినా,

మనుషుల్లో దైవత్వం చూసే అవకాశం దేవుడు ఎప్పుడూ మనకు కల్పిస్తూనే ఉంటాడు.

సాయం చేసే వాడే దేవుడు,

సాయం అందించే చోటే దేవాలయం.

    🌸సర్వేజనాసుఖినోభవంతు🌸

************************************* 


సుప్రీంకోర్టులో జరిగిన వాద ప్రతివాదనలు

గోవధ పై సుప్రీంకోర్టులో జరిగిన వాద ప్రతివాదనలు - విజయం సాధించిన తీరు.

ప్రతి ఒక్కరు చదవి  ఇతరులకు తెలియజేయండి. గోవధ నిషేధ చట్టాన్ని ఖచ్చితంగా అమలు పరిచేటట్టు గట్టిగా ప్రయత్నం చేయండి.

ఈ కేసులో ముస్లింల తరపున చాలా పేరు ప్రతిష్టలున్న న్యాయవాదులు సోలి సోరాబ్జీ (ఫీజు 20 లక్షలు), కపిల్ సిబాల్ (22 లక్షలు), మహేష్ జత్మలానీ (35 లక్షల) దాకా తీసుకుని వీరంతా గోమాంస వ్యాపారుల తరపున కేసును వాదించారు.

ఇక మన హిందువుల తరపున శ్రీ రాజీవ్ భాయి అనే న్యాయవాదిని పెట్టుకునడానికి తగినంత డబ్బులేదని కోర్టుకు విన్నవించిన తరువాత "కోర్టు మీకు న్యాయ సహాయం ఇస్తే?" అని అడిగినప్పుడు, అది సంతోషమే కానీ, కేసు మేమే వాదించేందుకు అనుమతించాలని శ్రీ రాజీవ్ భాయి కోరారు.

కోర్టు అలా అనుమతిస్తునే, శ్రీ M E ఎస్కురి అనే న్యాయవాదిని ఈ కేసులో న్యాయ సహాయం కోసం నియమించడంతో కేసు కొనసాగింది. 

ఇక గోమాంస వ్యాపారుల వాదనలు చూద్దాం. 

1వ వాదన : గోవును రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక వ్యవస్ఠ బలపడుతుంది. 

2వ వాదన:  గోవులకు తగినంత గ్రాసం ఈ దేశంలో లేక ఆకలితో చచ్చే కన్నా వాటిని చంపటం మంచిది. 

3వ వాదన:  మనదేశంలో మనుష్యులకే చోటులేదు. పశువులను ఎలా వసతి ఇస్తాం.

4వ వాదన:  మనకు అత్యంత విదేశీ మారక ద్రవ్యం మాంసాహార ఎగుమతల వలన వస్తుంది. 

5వ వాదన:  మాంసాహారం తినడం మతపరమైన హక్కు.

ముస్లీం మతంలో ఎక్కువ గో హింసకు పాల్పడే ఖురేషీ అనే వర్గంవారు ఈ వ్యర్ధ వాదనలు చేసారు.  

ఈ వ్యర్ధ వాదనలన్నిటికీ శ్రీ రాజీవ్ భాయి అత్యంత సహనంతో, అన్ని  గణాంకాలను కోర్టు వారి ముందుంచారు. 

శ్రీ రాజీవ్ భాయి సమాధానాలు చూద్దాం. 

ఒక ఆరోగ్యంగా ఉన్న గోవు 3 నుండి 3.5 క్వింటాళ్ల బరువుంటుంది. దానిని చంపితే షుమారు 70 కిలోల మాంసం వస్తుంది. కిలోకి 50 రూపాయల చొప్పున మాంసం ఎగుమతి వలన లభించే డబ్బు రూ. 3,500/-. ఆవు రక్తానికి లభించే రొక్కం రూ.1500/- నుండి రూ.2000 వరకు. ఇక 30-35 కిలోల ఎముకలకు లభించే రొక్కం 1,000 నుండి 1,200/-. ఏతావాతా ఒక గోవును చంపి వీరు దేశానికి కానీ, వారి స్వార్ధానికి గానీ, సంపాదించే మొత్తం డబ్బు రూ.7000/-.

ఒక ఆరోగ్యమైన గోవు రోజుకి  10 కిలోల గోమయం, (ఆవుపేడ ), 3 లీటర్ల గోమూత్రం ఇస్తుంది. ఒక కిలో గోమయం తో 33 కిలోల ఎరువు తయారవుతుంది. దీనినే మనం సేంద్రీయ ఎరువు అంటాము. శ్రీ రాజీవ్ భాయి ఇలా చెపుతూంటే కోర్టు వారు "ఇది ఎలా సాధ్యం?" అని అడిగారు. 

ఆయన తన వాదనను నిరూపించటానికి ధర్మాసనం ఒప్పుకున్న తరువాత కోర్టువారి ముందు శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో గోమయంతో 33 కిలోల సేంద్రీయ ఎరువును తయారుచేసి కోర్టుకు సమర్పించారు. 

Institute Research Committee 
(IRC) శాస్త్రవేత్తలు, Indian Council of Agricultural Research (ICAR) శాస్త్రవేత్తలు, Indian Institute of Agricultural Biotechnology  శాస్త్రవేత్తలు (మొత్తం 22 మంది బృందం) కోర్టు వారి ఆదేశాల ప్రకారం సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ పరీక్షలలో గోమయంతో చేసిన ఎరువును పరీక్షించి అత్యుత్తమ సేంద్రీయ ఎరువుగా ప్రకటించారు.

ఈ సేంద్రీయ ఎరువు భూమికి కావల్సిన 18 సూక్ష్మపోషకాలు అందిస్తుందని  శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఈ సూక్ష్మపోషకాలలో సాగుచేసే క్షేత్రానికి కావలసిన మాంగనీసు, ఫాస్పేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కొబాల్ట్, సిలికాన్, మొదలైనవన్నీ ఉన్నాయని నిర్ధారించారు. రసాయినిక ఎరువులలో కేవలం 3 ఖనిజాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి గోమయం ద్వారా తయారైన, సేంద్రీయ ఎరువు రసాయన ఎరువులకన్నా 10 రెట్లు గుణవర్ధకమైనది అని శ్రీ రాజీవ్ భాయి తన వాదనలో పేర్కొన్నారు. 

సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనతో అంగీకరించింది.

శ్రీ రాజీవ్ భాయి కోర్టుకి అభ్యంతరం లేకపోతే, తన ఊరు వచ్చి, గత 15 సంవత్సరాలుగా తాను, తన కుటుంబ సభ్యులు ఒక కిలో గోవుపేడ నుండి, 33 కిలోల సేంద్రీయ ఎరువులు ఎలా చేస్తున్నారొ చూడమని ఆహ్వానించారు.

తన వాదనలో శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో సేంద్రీయ ఎరువు అంతర్జాతీయ విపణిలో 6 రూపాయలు (ఇది అతి తక్కువ ధర), అనుకుంటే, ఒక రోజుకు గోమాత రూ.1,800/- నుండి రూ.2,000/- దాకా ఆదాయం తెచ్చి పెడుతుంది. (౩౩ కిలోల ఆవు పేడ నుండి 330 కిలోల సేంద్రీయ ఎరువు తయారు అవుతుంది కదా! 330 x Rs.6/-).  పైగా ఈ గోవుల కు ఆదివారం  శెలవులు కానీ లేవు! ఈ లెక్కన గోమాత వలన ఒక సంవత్సరములో అంటే 365 రోజులలో వచ్చే ఆదాయం 1800 X 365 = Rs.6,57,000/-. ఇదంతా గోమయము వలన అంటే "ఆవు పేడ" వలన వచ్చే ఆదాయం. 

శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాల ప్రకారం రమారమి 20 సంవత్సరాలు జీవించే గోమాత వలన వచ్చే ఆదాయం దాదాపు Rs. 1 కోటి 31  లక్షల 40 వేలు రూపాయలు దాటిపోవడం చూచి ఆశ్చర్యం చెందారు. 

వేల సంవత్సరాల పూర్వం నుండి గోమయం "లక్ష్మీదేవి తో సమానం" అని మన పూర్వీకులు ఎందుకు భావించారో శ్రీ రాజీవ్ భాయి సశాస్త్రీయంగా సుప్రీంకోర్టులో గణాంకాల ద్వారా నిరూపించారు. 

ఇది హేళన చేసిన వారికి చెంపపెట్టు. "మెకాలే" చదువులు వంట బట్టించుకున్న వారు ఎన్నో ఏళ్ళుగా మన "గోమయం లో "లక్ష్మీదేవి" నివాసముంటుంది అంటే, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళ సంస్కృతి ఇంతే, వీళ్ళు ఇలాగే మోసపూరిత మాటలు చెబుతారని నవ్విన వారు నోళ్ళు వెళ్ళబెట్టారు. 

ఇక "గోమూత్రము" పై శ్రీ రాజీవ్ భాయి గారి వివరణ - "ఒక గోవు రోజుకి 2 లేక 2.25  లీటర్ల  గోమూత్రం ఇస్తుంది. ఇది అనేకరకాల వ్యాధులకు, మధుమేహం, క్షయ, కీళ్ళ వాతం, కీళ్ళకు సంబంధించిన అన్ని రోగాలు, ఎముకల మూలుగ కు సంబంధించిన వ్యాధులు మొదలైన 48 రకాలైన  రోగాలన్నీ సమూలంగా నిర్మూలించ గలదని ఆ గోమూత్రం ద్వారా తయారు చేసిన ఆయుర్వేద మందులు, తెలుపు తున్నాయి. (చరక మహర్షి తన సంహిత లో గోమూత్రము ఉపయోగాలన్నీ ఎంతో వివరంగా ప్రాచీన కాలంలోనే చెప్పటం జరిగింది, గ్రంధస్థం చేయటం కూడా జరిగింది)".

ఒక లీటరు గోమూత్రం భారతీయ విపణీ లో రూ.500/-లు గా ఉన్నది. అంతర్జాతీయ విపణిలో ఈ రేటు ఇంకా ఎక్కువ ఉన్నది. అమెరికాలో గోమూత్రం పేటెంటు కూడా చెయ్యబడింది. గోమూత్రానికి 3 పేటెంట్లు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం గోమూత్రాన్ని భారతదేశము నుండి దిగుమతి చేసుకుని, కాన్సర్ కు, మధుమేహానికి మందులు తయారు చేస్తున్నది.  

అమెరికాకు ఎగుమతి చేసే గోమూత్రపు రేటు ప్రస్తుతం (అంటే సుప్రీంకోర్టులో వాదనలు జరిగేటప్పుడు) ఒక లీటరు రూ.1,200/- నుండి రూ.1,300 దాకా ఉన్నది. ఆ లెక్కన గోమూత్రం వలన ఆదాయం రోజుకు రూ.3,000/-, వార్షిక ఆదాయం రూ.3000/- X 365 = రూ.10,95,000/-, ఒక గోవు తన జీవిత కాలమైన 20 సంవత్సరాలలో కేవలం గోమూత్రం మీద ఇచ్చే ఆదాయం 3000X365X20 = 2,19,00,00 (అక్షరాల 2 కోట్ల 19 లక్షల రూపాయలు). అంటే ఎంతో విలువైన గోమూత్రము వలన కోట్ల ఆదాయం. 

ఇదే గోమయం "మిథైన్" అనే వాయువు ఉత్పత్తి చేస్తుంది. దీనిని మనం మన వంటగదిలో వంటకి (గోబర్ గ్యాస్)గా వాడుకోవచ్చును. మన ద్విచక్ర  వాహానాలను, మన కార్లు కూడా ఈ వాయువును తో నడుపుకోవచ్చును.

ఈ వాదన ధర్మాసనంలోని ఒక జడ్జీ  నమ్మలేక పోయారు. అప్పుడు శ్రీ రాజీవ్ భాయి "మీరు అనుమతిస్తే, మీ కారుకు మితైన్ గాస్ సిలిండర్ అమరుస్తాను. మీ కారు మీరే డ్రైవ్ చేసి మీరే పరీక్షించండి". అని తన వాదన పటిమ చూపించారు. ఆ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అనుమతించి, తన కారును 3 నెలలు మిథైన్ వాయువుతో నడిపారు. తన కారుకు కిలో మీటరుకు 50నుండి 60 పైసల కంటే ఎక్కువ ఖర్చు కాకుండా చూచి  ఆయన నివ్వెర పోయాడు. అంతకు ముందు ఆయన కిలోమీటరు డీజల్ కు 40 రూపాయలు (అంటే ఆ రోజులలో రేట్ అన్నమాట) ఖర్చు చేశారు. పైగా డీజల్ లాగా పొగ లేదు. శబ్ద, వాతావరణ కాలుష్యాలు అసలే లేవు.

అలాగే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, గోమాత కి గల మరొక ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే, ఏదేని ఒక రోగంతో ఉన్నటువంటి వ్యక్తి తన పూర్తి అరచేతులతో గోవు వెనక తోక పైన కుడి ఎడమ భాగాన్ని తాకి ఒక్క క్షణం అలా చేతులను అలా ఉంచినప్పుడు గోమాత అదుర్కొంటుంది. గోమాత శరీరంలో తల భాగం నుంచి పొట్ట భాగం వరకు ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇది జరిగిన ఆరు గంటల తర్వాత ఆ  గోవు ఇచ్చే పాలు పితికినప్పుడు,  ఆ వ్యక్తి యొక్క రోగానికి విరుగుడు లక్షణాలతో కూడుకున్నటువంటి పాలని ఆ గోమాత ఇస్తున్నది అని శాస్త్రీయంగా నిరూపితమైంది. అంటే ఆ వ్యక్తికి ఔషధ గుణాలతో కూడిన పాలన ఇస్తున్నది అన్నమాట.

ఆ జడ్జీ ఈ ఆధారాలన్నీ చూసిన తర్వాత సంతృప్తి చెందాడు. శ్రీ రాజీవ్ భాయి చెప్పినది వాస్తవమని ఒప్పుకున్నారు. 

రోజు వచ్చే 10 కిలోల గోవు పేడతో ఎంత మిథైన్ వాయువు తయారవుతుందో, అది 20 సంవత్సరాలలో ఎంత దేశానికి పొదుపు చేస్తుందో చెప్పి ధర్మాసనంకు తన గణాంకాలు సమర్పించారు. 

దేశంలో ఉన్న 17 కోట్ల గోవుల వలన దాదాపు 1 లక్ష 32 వేల కోట్ల ధనం పొదుపు అవుతుంది. మన రవాణా మొత్తం మిథైన్ ఆధారితమైతే, అరబ్ దేశాల నుండి మనము పెట్రోల్ గానీ, డీసెల్ గానీ, దిగుమతి చేసుకోనక్కర లేదు. మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టనక్కర్లేదు. మన రూపాయి అంతర్జాతీయంగా బలపడుతుంది. ఇది గోవు వల్లనే సాధ్యం.

ఈ వాదన విని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ఘాంతపోయి, శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాలు అన్నీ శ్రద్దగా పరిశీలించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం శ్రీ రాజీవ్ భాయి చెప్పిన వాదనలో "సత్యాన్ని గ్రహించి, " గో సంరక్షణ" వలన దేశానికి ఆర్ధికంగా, భారత దేశానికి ఆర్ధికపుష్టి లభించగలదని అంగీకరించారు. 

ఈ సంపదంతా ఇది గోవుల సంతతి నుంచి మాత్రమే సాధ్యం గాని, ఇతర జంతువుల నుంచి సాధ్యం కాదు. ఎందుకంటే ఇటువంటి విలక్షణమైనటువంటి జన్మతః లక్షణాలు గోవులకు తప్ప ఇతర జంతువులలో గోచరించవు.

సుప్రీంకోర్టు శ్రీ రాజీవ్ భాయి వాదనలను అంగీకరించే సరికి, గో హంతకుల తల బొప్పికట్టి, దిక్కుతోచలేదు. కేసు వారి చేతుల్లో నుండి జారిపోతోందని గ్రహించారు. ఎందుకంటే వారు గోవు రూ.7,000/- వేల కంటే ఆదాయం ఇవ్వదని అంతకు ముందే కోర్టుకు చెప్పారు. ఇప్పుడు శ్రీ రాజీవ్ భాయి, గోమాత కోట్ల రూపాయాలు ఆర్జించి పెడుతుంది అని ఋజువు చేశారు. 

అప్పుడు గోహంతకులు "గోమాసం తినడం ఇస్లాం మత పరమైన హక్కు" అనే వాదన లేవదీశారు. శ్రీ రాజీవ్ భాయి" అయితే, ఎంతమంది ఇస్లాం పాలకులు ఈ మత పరమైన హక్కును వాడుకున్నారు? ఈ మత పరమైన హక్కు చెప్పే ఇస్లాం గ్రంధాలు ఏమిటీ" అనే ప్రశ్నలు కోర్టు పరిశీలించాలి అని కోరారు.

అప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశాలు పరిశీలించడానికి ఒక విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ కి ఈ అంశాలను కూలంకషంగా పరిశీలించాలని ఆదేశించారు". ఇస్లాం పాలకులు, మతగ్రంధాలు గో మాంసం తినడంపై ఏమి చెప్పాయి? ఆ హక్కనేది ఉన్నదో లేదో తేల్చి చెప్పమని ఈ కమిటీని ఆదేశించారు. ఈ Islamic సభ్యుల కమిటీ చారిత్రాత్మక పత్రాలను శోధించి, ఈ విధంగా తేల్చి చెప్పింది.

"ఇస్లాం పాలకులు ఎవరూ గోవధను సమర్ధించలేదు. నిజానికి కొంతమంది పాలకులు గోవధకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశారు. వారిలో ప్రధముడు "బాబర్" ఆయన తన "బాబర్ నామా"లో గోవధ నేరమని, అలాంటి నేరం తను చనిపోయినా ఈ దేశంలో జరగకూడదు అని వ్రాసి, తను చేసిన చట్టం కొనసాగాలని పేర్కొన్నాడు. ఆయన సంతతి వారంతా, హుమాయున్ అదే చట్టం కొనసాగించారు. చివరకు హిందూ సంప్రదాయాలను క్రూరంగా అణచివేసిన ఔరంగజేబ్ కూడా ఈ గోవధని వ్యతిరేకిస్తూ, తన పూర్వీకులు చేసిన చట్టాన్ని కొనసాగించాడు. 

ఇక్కడ దక్షిణాపధంలో టిప్పుసుల్తాన్ తండ్రి, హైదర్ ఆలీ గోమాతను వధ చేసేవాడు కనపడితే "వాడి తలకాయ నరకమన్నాడు". చాలామంది ఈ శిక్షలో బలయ్యారు. టిప్పు సుల్తాన్ రాజు కాగానే, ఈ చట్టాన్ని కాస్త మార్చి, గోవధకు పాల్పడిన వారి" చేతులు నరకమన్నాడు". 

సుప్రీకోర్టు నియమించిన Islamic కమిటీ ఇలా తన రిపోర్ట్ సమర్పించగానే, శ్రీ రాజీవ్ భాయి,  వాదనకు మరింత పుష్టి వచ్చింది. 

"గోవధ ఇస్లాం మత హక్కు అయితే, ఇస్లాం శిరసాదాల్చి పాలించిన చక్రవర్తులు బాబర్, హుమాయున్, చివరకు ఔరంగజేబ్ గోవధ కు వ్యతిరేకంగా చట్టాలను చేసి, ఎలా కొనసాగించారు" అని సూటిగా ప్రశ్నించారు. 

తరువాత శ్రీ రాజీవ్ భాయి తన అత్యంత కీలక వాదన మొదలు పెట్టారు. సుప్రీకోర్టు అనుమతితో పవిత్ర ఖురాన్, హదీద్, మిగతా ఇస్లాం పవిత్ర గ్రంధాలు గోవధ గురించి ఏమి చెప్పాయో పరిశీలించమని కోరారు. ఏ ఇస్లాం గ్రంధము కూడా గోవధ ను సమర్ధించలేదు. సరికదా, హదీద్ లు, "గోవును రక్షించమని, అవి మిమ్మల్ని రక్షిస్తాయి" అని పేర్కొన్నాయి. మహమ్మద్ ప్రవక్త గోవు అత్యంత అమాయక ప్రాణి అని, పత్రివారు దాని పట్ల దయగలిగి ఉండాలని ప్రభోదించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనములో "గోవును వధించిన వాడికి నరకంలో కూడా స్థానం లేదు" అని చెప్పారు.

తన వాదనను ముగిస్తూ, శ్రీ రాజీవ్ భాయి, పవిత్ర ఖురాన్, మహమ్మద్ ప్రవక్త, హదీద్ లు, గోవధను వ్యతిరేకిస్తుంటే, గోవధ ఇస్లాం మతహక్కు ఎలా అవుతుంది. ఈ మాంసాహారులను, మక్కా, మదీనాలలో ఏదైనా పుస్తకంలో గోవధ చెయ్యమని ఉన్నదేమో చూడమని చెప్పండి. అలా ఉన్నదని నాకు తెలియదు. ముస్లిం మత పెద్దలకు తెలియదు." అని ముగించారు. 

గోహంతకులు మాన్పడిపోయారు.  సుప్రీకోర్టు మాంసాహారులను, పదే పదే  అడిగింది. వారు ఇస్లాంలో గోవధ చెయ్యమని చూపెట్టలేక పోయారు. 

సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం  ఈ అత్యంత కీలకమైన కేసులో 26 అక్టోబర్ 2005 న తన తీర్పును ప్రకటించింది.

ఈ తీర్పును మీరు సుప్రీకోర్టు వెబ్సైటు లో చూడవచ్చును. 

తన 66 పేజీల తీర్పుతో సుప్రీంకోర్టు ఒక చరిత్ర సృష్టించింది. తన తీర్పులో ఇలా పేర్కొంది. 

"గోవధ రాజ్యాంగ రీత్యా, మతపరంగా కూడా పాపం. ప్రతి పౌరుడు, ప్రభుత్వము, గోవును రక్షించడం  రాజ్యాంగ ధర్మముగా భావించాలి. 

మనం మన రాజ్యాంగంలో, "రాజ్యాంగ ప్రకారం నడచుకుంటామని, మన జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని, మన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవిస్తామని, మన సారభౌమత్వాన్ని రక్షించుకుంటూ, మన ఐకమత్యాన్ని పాటిస్తూ, ఈ దేశ సమగ్రతను పటిష్టంగా చెయ్యాలని రాజ్యాంగం  వ్రాసుకున్నాం. ఇప్పుడు దానిలో గోసంరక్షణ కూడా చేరింది." 

సుప్రీంకోర్టు తన తీర్పులో " 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ గోసంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి ప్రతి ముఖ్యమంత్రి, గవర్నర్, ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలి" అని స్పష్టంగా పేర్కొన్నది. 

శ్రీ మంగళ్ పాండే గోసంరక్షణ కోసం గోవు కొవ్వుతో తయారు చేసిన తుపాకీగుండును నోటిలో పెట్టుకోవడం సహించక, ఒక బ్రిటీషు ఆఫీసర్ ను కాల్చి చంపాడు. ఈ ఘటన మన ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామానికి దారి తీసి, గో సంరక్షణ ప్రారంభమైంది. శ్రీ మంగళ్ పాండే చేసిన త్యాగాలను మరిస్తే, మనం కృతఘ్నులుగా మిగిలిపోతాం.

గో సంరక్షణ ప్రతి భారతీయుని కర్తవ్యం. అది రాజ్యాంగబద్దమైనది. ఎక్కడైనా ఈ తప్పు జరిగితే ఆ తప్పు అడ్డుకోవడం నేరం కాదు.

వందే గోమాతరం!  భారత జాతి యావత్తూ మాత "శ్రీలక్ష్మి "యే !!
స్వస్తి !!

స్నేహితుల దినోత్సవం

అసలు ఈ స్నేహితుల దినోత్సవం ఎలా ఏర్పడిందో చరిత్రను ఓసారి తిరగేస్తే, 1935వ సంవత్సరం ఆగస్టు మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో చనిపోయిన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తర్వాత రోజైన ఆదివారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం ఆగస్టు మొదటి ఆదివారాన్ని 'ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే'గా ప్రకటించింది. అప్పటి నుంచి ఫ్రెండ్‌షిప్ డేను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు ప్రెండ్స్. 

ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. 

తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించుకుంటారు. దటీజ్ ఫ్రెండ్‌షిప్ డే

రామాయణమ్.. 18

గంగ భూమిమీదకు ఎలా అవతరించింది మహర్షీ ! చాలా ఉత్సుకతతో ప్రశ్నించాడు రాముడు .
.
రామా ,చెపుతాను విను అంటూ మొదలు పెట్టారు విశ్వామిత్ర మహర్షి! 
.
హిమవంతుడికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కొమరిత గంగ రెండవ ఆవిడ ఉమ.
.
పెద్ద కూతురు గంగను ఆయన దేవతల కోరిక మీద వారికి ఇచ్చివేయగా ఆవిడ దేవలోకం వెళ్లి పోయింది!
.
రెండవకూతురు ఉమ శంకరుని ఇల్లాలయింది.
.
పూర్వం అయోధ్య ను సగరుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు ! ఆతడు మీ ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాజు .
ఆయన కు ఇద్దరు భార్యలు పెద్దభార్యపేరు కేశిని,రెండవ భార్య సుమతి!.
.
సంతానార్ధియై సగరుడు భార్యలతో కూడి భృగుప్రస్రవణము అనే పర్వతం మీద ఘోరతపస్సు చేశాడు.
.
ఆయన తపస్సుకు మెచ్చి భృగు మహర్షి ప్రత్యక్షమై నీకు ఒక భార్యయందు వంశమును నిలిపే ఒక కుమారుడు ,ఇంకొక భార్యయందు మహాబలవంతులైన అరువది వేల మంది  పుత్రులు కలుగుతారు అని దీవిస్తాడు .
.
అప్పుడు సగరుని పెద్దభార్య కేశిని తనకు ఒక్క కుమారుడు చాలు అనగా ఆవిడ యందు అసమంజుడు అనే మహాబలశాలి యైన పుత్రుడు జన్మిస్తాడు .
.
చిన్నభార్య సుమతి యందు అరవైవేలమంది సగరులు జన్మిస్తారు.
.
అసమంజుడు పేరుకు తగ్గట్టుగా అసమంజసమైన ,వికృతమైన చేష్టలకు పెట్టింది పేరు .అతను పసి పిల్లలను పట్టుకొని సరయూ నదిలో ముంచి వారు మునకలేస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందేవాడు ! 
.
ఈ దుశ్చర్యలు భరించలేక దేశ ప్రజలు సగరుడి వద్ద మొర పెట్టుకొంటారు .
.
కొడుకు అనే పక్షపాతము కూడా లేకుండా అసమంజుడికి దేశబహిష్కరణ శిక్ష విధిస్తాడు సగరుడు. అయితే అప్పటికే అసమంజుడికి అంశుమంతుడు అనే వీరాధివీరుడు,బుద్ధిమంతుడు అయిన పుత్రుడు ఉంటాడు! 
ఆలుబిడ్డలను వదిలిపెట్టి కట్టుబట్టలతో దేశం నుండి వెళ్ళగొట్టబడ్డాడు అసమంజుడు.
.
ఇలా చాలా కాలం గడచిన తరువాత సగరుడికి అశ్వమేధయాగము చేయాలనే కోరిక పుట్టింది!.
.
యాగాశ్వమును స్వేచ్ఛగా వదిలాడు దానిని దుర్బుద్ధియై ఇంద్రుడు అపహరించి పాతాళంలో కపిలముని ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు..
.
యాగాశ్వాన్ని వెతుక్కుంటూ అరవై వేలమంది సగరులూ బయలుదేరారు భూమి నాలుగు చెరగులా వెతికారు ,అణువణువూ శోధించారు ఎక్కడా వారికి అశ్వము జాడ కనపడలేదు ..
.
ఇక లాభంలేదు అని భూమిని అన్నివైపుల నుండి బద్దలు కొట్టి పాతాళానికి పయనమయ్యారు. పాతాళలోకంలో ఒక చోట కపిల ముని ఆశ్రమంలో గడ్డిమేస్తూ కనపడ్డది అశ్వము.
.
కపిలముని అపహరించాడనే అపోహతో ఆయన మీద యుద్ధానికి వెళ్ళగా ఆయన ఆగ్రహజ్వాలలో మాడి మసి అయి బూడిద కుప్పలుగా మారారు సగరులు.
.
పుత్రులు ఎంతకీ రాక పోయేసరికి చింత పట్టుకున్నది సగరుడికి.
మనుమడు అంశుమంతుని వారి జాడ కనుగొనమని పంపినాడు .
.
N.B
..
శిక్షలు విధించడంలో ఇక్ష్వాకులు స్వ, పర భేదాలు పాటించరు!
న్యాయం అందరికీ ఒకటే ! సగరుడయినా ,రాముడయినా అదే ధర్మం పాటించారు ,అందుకే చిరకాలం భూమి మీద యశఃకాయులైనారు.
మన ఇప్పటి తరాలకు ఈ కధలు అందించే నైతిక బలం అపారం ! ఇలాంటి కధలు విస్త్రుతంగా ప్రచారం చేద్దాం.
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

get up during the night?

How many people say they don't want to drink anything before going to bed because they have to get up during the night?

 Something else I didn't know ... Why do people have to urinate so much at night?

 Response from a heart doctor:

 When you stand upright (leg swelling), gravity keeps water in the lower part of your body.

 If you lie down and your lower body (legs, etc.) is level with your kidneys, the kidneys remove the water because it is easier.

 That fits the last statement!

 I knew you needed a minimum of water to flush the toxins out of your body, but this was news for me.

 Right time to drink water ... Very important.

 From a heart specialist!

 Drinking water at a certain time maximizes its effect on the body:

 2 glasses of water after waking up - helps activate the internal organs

 1 glass of water 30 minutes before a meal - helps digestion

 1 glass of water before bathing - helps to lower blood pressure (who knew that ???)

 1 glass of water before bed - can prevent stroke or heart attack (good to know!)

 In addition, water at bedtime also helps prevent leg cramps at night.

 The leg muscles look for moisture when they contract and wake you up with a Charlie Horse (calf cramp).

 A cardiologist said that if every person sends this message to 10 people, a life could possibly be saved!

 I have already shared this information with you!
 What about you ❓

 Forward this message❗
 It can save lives❗

అసహాయత!*🙏 👉 అజ్ఞానం!*🙏



1.  తాజా ఆహారం అందుబాటులో లేక, వండుకోవదానికి సమయం కేటాయించుకో లేక ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద, బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన ఖర్మపట్టడం అమెరికా యూరప్ *వాళ్ళ నిస్సహాయత !*
👉 56 భోజన వంటకాలను పక్కనపెట్టి ఎవడో ఏనాడో వండి పెట్టిన రొట్టెని కాలవలో పారెయ్యకుండా, ఫ్రిజ్జిలో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹ 400 / - పెట్టి  మరీ తినడం, *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక, కోట్లూ సూట్లూ వేసుకోవడం *వారి నిస్సహాయత...*
👉 వేసవి వేడిలో చమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు వెర్రిగా కోట్లూ సూట్లూ వేసుకుని  తిరగడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

3. తాజా భోజనం వండేవాళ్ళు లేక ఫ్రీజ్ వాడడం, అమెరికా యూరోప్ *వాళ్ళ నిస్సహాయత...*
👉 రోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజుల కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి  మురుగుతున్నవాటిని వండుకు తినడం, *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో ఏవేవో మందులు తయారు చేయడం, వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి వేరేవేరో రోగాల పాలవ్వడం *వారి నిస్సహాయత...*
👉 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా... కెమికల్  మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

5. సరిపడ ధాన్యం లేక పంటలు పండక పళ్ళూ కాయలూ దొరకకా  పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని నక్కల్ని కూడా చంపి తినడం *వాళ్ళ నిస్సహాయత...*
👉 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

6. కొబ్బరి నీళ్ళూ మావిడి పళ్ళు బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం *వారి నిస్సహాయత...*
👉 అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా... పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన  తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని తిరగడం స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం *వాళ్ళ నిస్సహాయత...*
👉 సుబ్బరంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా  
తుడుచుకొని, సెంటేసుకుని తిరగడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో  కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం *వాళ్ళ బుద్దిహీనత*
👉 అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. సరియైన కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల, నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం *వాళ్ళ నిస్సహాయత...*
👉 చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో, చక్కని ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో,  పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని, చెట్టుకి పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా, అందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే మనం...
ఆ అమెరికా, యూరోప్ వారిని అనుకరించడం... ఇలా కొట్టుకు చస్తూ, ఏడుస్తూ బతకడం... *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

10. చెట్లు పెంచుకోవడానికి ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు కేన్సర్లూ  తెచ్చుకోవడం *వాళ్ళ నిస్సహాయత...*
👉 ఇంట్లో వుండే ఎద్దులూ, ఆవులు, కోళ్ళు, మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం...
వాటిని వదిలి అమెరికా, యూరోప్ వాళ్ళ మోజులో పడి వాళ్ళని అనుసరించి, మనం కూడా ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ, ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

11. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం *వాళ్ళ నిస్సహాయత...*
👉 హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

12. గడ్డకట్టేసిన నీటితో  స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ...
అవే బట్టలతో ఇల్లంతా తిరగడం, మంచాల మీద పడుకోవడం... వాటివల్ల మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం *వాళ్ళ నిస్సహాయత...*
👉హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కుక్కకంపు కొట్టే సెంట్లు కొట్టుకుంటూ తిరగడం *మన అనంతమైన అజ్ఞానం.*
*🙏మరోసారి మళ్ళీ క్షమించాలి ఇదినిజం*🙏

13. దూరంగా నిలబడి ఆహ్వానించడం, నమస్కరించడం, 
చెప్పులు వేసుకుని ఏ ఇంట్లోకి వెళ్ళక పోవడం. 
కాళ్ళు చేతులూ కడుక్కోవడానికి బకెట్ తో నీళ్ళివ్వడం 
మన సంస్కారం. మన పెద్దలు మనకు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. దాన్ని వదిలేసి ఇవ్వాళ ఏడవడం *మన అజ్ఞానం.!*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

14. విపరీతమైన చలితట్టుకోలేక ఇంటాబయటా అవే సాక్స్ అవే బూట్లతిరగడం *వాళ్ళ నిస్సహాయత.*
👉ఇంట్లోకి వచ్చేముందు చెప్పులు గుమ్మం బయటే వదిలెయ్యడం, బయట తిరిగిన బట్టల్ని బాత్ రూములొ  తడిపేసి స్నానం చేసి ఇంట్లోకి రావడం మన పద్దతి. అలాంటి పద్దతుల్ని చాదస్తం పేరుతో... ఆలోచన లేకుండా వదులుకోవడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

మనం ఎంతో ఆత్మీయత గుండెల్లో పొంగితే కానీ చేతులు పట్టుకోలేం, హత్తుకుని కౌగిలించుకోలేం. తల మీదో బుగ్గల మీదో ముద్దులు పెట్టుకోలేం కానీ అవి అమెరికా వాళ్ళకి అత్యంత సహజం..
కానీ నేడు దాన్ని వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య మానవాళి... అంతా 
భారతీయుల్ని చూసి  క్వారంటైన్ జ్ఞానం నేర్చుకుంటోంది. నేర్చుకోమంటోంది.

కనీసం ఇప్పటికైనా మనం మన ఆచారాలను మళ్ళీ పాటించడం ప్రారంభించకుంటే అది *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

🧐🧐🧐 జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అజ్ఞానం అంతా వాళ్ళని చూసి మనకుగా మనం తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం...

మన బానిస మనస్తత్వ అజ్ఞానం...

విదేశీ వ్యామోహ అజ్ఞానం...

కరోనా లాంటి వైరస్ లను కొంపమీదకు తెచ్చిపెట్టుకునే అజ్ఞానం...

అమెరికాలో యాపిల్ ఫోన్ అంత మంచిఫోన్ మరొకటి లేదు.
అన్నది ఎంత నిజమో...

అమెరికా, యూరోపియన్ ప్రజలు తినేంత అనారోగ్యకరమైన ఆహారం...
వాళ్ళ కున్నన్ని ఆర్టిఫిషల్ అలవాట్లు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. అన్నది కూడా అంతే నిజం...

ఆధునీకరణ, ఫ్యాషన్, మొదలగు పేర్లతో ఋషులు మనకు అందించిన
దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా...
ప్రాకృతిక జీవనాన్ని  వదలేసుకోవడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

Bottom LIne.
*వేటిని స్వీకరించాలో వాటినే స్వీకరిద్దాం...*

కానీ గుడ్డిగా...
మోజుతో...
వెర్రిగా...
అనాలోచనతో...
అనుకరిస్తే...
పోతాం! 

ఏం వచ్చి పోతాం?

కరోనా లాంటివి వచ్చి పోతాం!. 
****************