20, అక్టోబర్ 2023, శుక్రవారం

అలిగిన బతుకమ్మ

   🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🎍బతుకమ్మ పండుగలో 'అలిగిన బతుకమ్మ'🎍*


బతుకమ్మ పండుగలో ఆరో రోజును *'అలిగిన బతుకమ్మ'* అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. ఆమెకు ఈ రోజు ఏ నైవేద్యం ఉండదు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని 6 వ రోజు బతుకమ్మను ఆడరు. అప్పటి నుంచి ఈ రోజును *'అలిగిన బతుకమ్మ'గా* పిలుస్తారు.


*బతుకమ్మ పాట మీ కోసం..*


రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో..

రామ రామ నంది ఉయ్యాలో రాగమేత్తరాదు ఉయ్యాలో..

నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో నేలవన్నేకాడ ఉయ్యాలో..

పాపిటలో చంద్రుడా ఉయ్యాలో బలాకుమరుడా ఉయ్యాలో..

పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామాసము ఉయ్యాలో..

బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో..

తెల్ల తెల్లయి గుళ్లు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో..

పన్నెండేండ్ల కింద ఉయ్యాలో పాడుబడ్డ గుళ్లు ఉయ్యాలో..

తెల్లయి వేములవాడ ఉయ్యాలో రాజన్న గుళ్లు ఉయ్యాలో..

నల్ల నల్లయి గుళ్లు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో..

నల్లయి నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్లు ఉయ్యాలో..

పచ్చ పచ్చయి గుల్లు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్లు ఉయ్యాలో..

పచ్చయి పరకాన ఉయ్యాలో మల్లన్న గుల్లు ఉయ్యాలో..

పర్వతాల మల్లన ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో..

రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో…


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


🎋🌾🎋🌾🎋🌾🎋🌾🎋🌾

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 69*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 69*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


దుఃఖంతో శోకించని హృదయం ఉండదు. అదేవిధంగా, గత్యంతరం లేని స్థితిలో భగవదభిముఖం కాని హృదయం కూడా ఉండదు. తత్త్వాలు ఏకరువు పెట్ట వచ్చు, సిద్ధాంతాలు ప్రతిపాదించవచ్చు. కాని కాలి క్రింది భూమి చీలిపోయే పరిస్థితి ఎదురయినప్పుడు ఎక్కణ్ణుంచి అయినా ఒక అభయహస్తం వచ్చి చేయూతనివ్వదా అనే ఆశాకిరణం మనిషి మనస్సులో మెరవకపోదు. సామాన్యంగా పేదవారు తమ పేదరికంతో సహజంగానే రాజీపడిపోతారు. 


నరేంద్రుడు కూడా పేదవానిగానే జన్మించి ఉంటే. ఈ పరిస్థితి అతణ్ణి అంతగా బాధించివుండేది కాదు. కాని నిన్నటి దాకా మహారాజుగా జీవించినవాడు నేడు బికారిగా మారిపోవడం ఎంత ఘోరం! నిన్నటి దాకా ఎలాంటి చీకూచింతా లేకుండా సీతాకోక చిలుకలా స్వేచ్ఛగా ఎగురుతూ విహరించిన అతడి మీద నేడు ఎంత భారం! 


ప్రతిసారి ఇంట్లోకి వస్తున్నప్పుడల్లా, 'ఈ రోజు నా కుమారునికి ఉద్యోగం దొరికి ఉంటుందా? మా దారిద్ర్యం తీరిపోతుందా?' అనే ఆశతో ఎదురయ్యే తల్లి ముఖం; 'ఈ రోజు తమ్ముడు ఏదో దారి కనిపెట్టి ఉంటాడా?' అనే ఆతురతతో కనిపించే అక్కల ముఖాలు; 'ఈ రోజు అన్నయ్య ఏదైనా కొని తెచ్చివుంటాడా?' అనే ఆసక్తితో చెల్లీ తమ్ముళ్ల ముఖాలు; - వీరందరికీ 'లేదు' అనే సమాధానంతో ఇంట్లోకి అడుగుపెట్టే యువకుని మనస్సు పొందే ఆవేదన వర్ణనాతీతం.


 మార్గం ఎక్కడ లభిస్తుందని అన్వేషించిన నరేంద్రుని హృదయానికి జగజ్జనని స్ఫురించింది! మానవ సహాయాలు ఏవీ అందనప్పుడు జగజ్జననినే ఆశ్రయించి చూద్దాం అని అతడు చొరవ తీసుకొన్నాడు. ఆ తరువాత జరిగింది అతడి మాటల్లోనే విందాం:


"శ్రీరామకృష్ణుల ప్రార్ధనను భగవంతుడు మన్నిస్తాడని నాకు జ్ఞాపకం వచ్చింది. నా కోసం, నా తల్లికి నా సోదరులకు అన్నవస్త్రాలకు లోటు లేకుండామార్గం చూపించమని జగజ్జననిని ప్రార్థించమని ఆయనను ప్రాధేయపడాలి; తప్పు కుండా ఆయన నాకు ఈ సహాయం చేస్తారని ఆశించి దక్షిణేశ్వరం వెళ్లాను. ఆయన వద్దకు వెళ్లి, 'నా తల్లీ, సోదరుల దారిద్ర్యం తొలగించమని మీరు జగజ్జననిని ప్రార్ధించాలి" అంటూ వేడుకొన్నాను. 


అందుకు శ్రీరామకృష్ణులు, 'నాయనా! ఇలా నేను కోరగలనా? నువ్వే వెళ్లి ఎందుకు ప్రార్ధించరాదు? నువ్వు కాళీమాతను అంగీకరించడం లేదు. అందుకే ఇన్ని బాధలు' అన్నారు. వెంటనే నేను, 'నాకు ఆమె తెలియదు. నా కోసం మీరే ఆమెకు విన్నవించండి, విన్నవించే తీరాలి. అలా చేయనంత వరకు మిమ్మల్ని ముమ్మాటికీ వదలను' అన్నాను. శ్రీరామకృష్ణులు ఆప్యాయత ఉట్టిపడే స్వరంలో, 'నీ దుఃస్థితిని తొలగించమని పలుమార్లు జగజ్జననిని ప్రార్ధించాను. నువ్వు ఆమెను అంగీకరించనందువలన నా ప్రార్థనను ఆమె మన్నించడం లేదు. 


పోనీలే, ఈ రోజు మంగళవారం. ఈ రాత్రి కాళికాలయానికి వెళ్లి ఆమెను ఆరాధించు; నువ్వు ఏం కోరినా తప్పక ఆమె అనుగ్రహిస్తుంది. నా తల్లి చైతన్య స్వరూపిణి, బ్రహ్మశక్తి, సంకల్పమాత్రంగానే ఈ లోకాన్నంతా సృజించింది. ఆమె తలచుకొంటే చేయలేనిది ఏదైనా ఉందా?' అన్నారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 59*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 59*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం*

*చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ |*

*య మారుహ్య ద్రుహ్య త్యవని రథ మర్కేందుచరణం*

*మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే ‖*


స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం = అమ్మా పద్మరాగపుటద్దాల వలె వున్న చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్న నీ తాటంకములు సూర్య, చంద్ర రూపాలు.


చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ = చెవులకున్న తాటంకములు రెండు, ప్రతిబింబిస్తున్నవి రెండు, వెరసి నాలుగు రథ చక్రాలుగా, శివునిపై పుష్పబాణ ప్రయోగం చేయటానికి మన్మధుడు రథియై కూర్చున్నట్లుందమ్మా నీ ముఖ పద్మము. 


యమారుహ్య ద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం = సూర్య చంద్రులే చక్రములుగా అవని అనే రధాన్ని తయారు చేసుకొన్నాడు మన్మధుడు. అంటే అమ్మవారి ఫాలభాగం భూమి వలె విశాలంగా వున్నదని.


మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే = ఆ విధంగా మన్మధుడు బయలుదేరాడు.శివుడు సూర్యచంద్రులను రధచక్రాలుగా చేసుకొని, భూమి అనే రథంపై, త్రిపురాసుర సంహారం కోసం వెడలినట్లుగా.


మన్మధుని తన త్రినేత్రంతో దహించి శివుడు వెళ్ళిపోయాక, రతీ మన్మధుల ప్రార్థనపై పార్వతి అతడిని తన కనుచూపుల కొసల నుండి, అనంగునిగా (శరీరము లేనివాడుగా,రతీ దేవికి మాత్రమే కనబడునట్లుగా) తిరిగి బ్రతికిస్తుంది. అలా అనంగుడైన మన్మధుడు తిరిగి శివునిపై ప్రయోగించటానికి అమ్మవారు తన చెరకు విల్లు నుండి ఒక ధనుస్సునూ, పుష్పబాణముల నుండి బాణములనూ ఇచ్చి పంపారట. వీటితో పాటు అమ్మవారి క్రీగంటి చూపులు, చిరునవ్వులు, బాణములై తపస్సు కోసం వెళ్లిన శివుడిని, ఆమెను వెతుక్కుంటూ స్వయంగా తిరిగి వచ్చేటట్లు చేశాయట.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అంబికా స్తుతి

 



*దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా నవరత్న మాలికా అంబికా స్తుతి వినడం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ, శుభోదయ శుభాకాంక్షలతో, మీ శ్రేయోభిలాషి, నిష్ఠల సుబ్రహ్మణ్యం.*   


https://youtu.be/DJuvk1UJFdU?si=jvflvmZvmXPQu61D


శ్రీదేవీస్తుతి

 .               శ్రీమాత్రేనమః 

*శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*

              ది:20-10-2023


శా॥

వానల్దండిగ నీరమీయ కొలువై పండ్లుం బ్రసూనమ్ములున్ 

కానల్ సైతము నేత్రపర్వమవగా క్రాలేటి చంద్రాతప 

మ్మేనాటం దరుగంగనట్టి రుచిమద్ధ్రీంకారశబ్దార్భటీ 

గానమ్ముల్ వినిపింప పర్వమిలపై కాలూనె సంరంభమై  -11

శా॥

వీటం బందిరులల్లి కొందఱు గృహంబే దేవళమ్మై సనన్ 

వాటమ్ముంగని కొందఱున్ స్థిరత దేవస్థానముం గొందఱున్ 

పీటల్వెట్టి కఠోరదీక్షల మహాప్రీతిం గలామగ్నులై 

సాటింగాంచని బూజలీయ నలరే సర్వార్థదాత్రీ! నతుల్  -12 

శా॥

మోహమ్మే భవబంధకారణము సంపూర్ణమ్ముగా బాపుమా! 

దేహమ్మే బహుకర్మహేతువు నగున్ దేహమ్ము నీబోకుమా! 

దేహింగూర్చి సమగ్రతం దెలిపి సందేహమ్ములం ద్రోలుమా! 

మోహమ్మాదిగ శత్రుషట్కమును నిర్మూలించుమా! మాతరో!  -13

(పీట=పీఠము; కలా=చిత్కళ)

"కవితాభారతి"

*~శ్రీశర్మద*

8333844664

భక్తిసుధ

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 


             *_శ్లోకమ్-_*


*_విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః_*

*_శిష్యాచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతాః_*

*_స్వప్నే జాగ్రతి వాయు ఏష పురుషో మాయా పరిభ్రామితః_*

*_తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే...._*


*_దక్షిణాముర్తి స్తోత్రమ్- 8 -_*


ఎవరి మాయ వలన ఈ ప్రపంచములో కార్యము-కారణసంబంధము, తాను-యజమాని (భగవంతుడు) సంబంధము,  శిష్యుడు-గురువు, తండ్రి-కొడుకు స్వప్నాది అవస్థల వంటి అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

వ ర్ణన మంటే అతిశయోక్తులేనా

 


వ ర్ణన మంటే అతిశయోక్తులేనా? 


(ఆచర్య  చొప్పకట్ల  సత్యనారయణ )


వర్ణ న లనగానే ఆఁయేముందిలెద్దూ? అతిశయోక్తులేగదా! 

అంటారు కొందరు. అవునండీ ఉన్నది ఉన్నట్లు చెపితే అదిమనంమాట్లాడుకునే సంభాషణలో భాగనేగాని కవిత్వం ఞయెలావుతుందీ? కవిత్వమంటే ఒక సౌందర్యాన్ని ఆవిష్కరించటమే! అదిలేనప్పుడు అదికవిత్వ మనిపించుకోదు.

 చేమకూర యీపద్యంలోతనచేవచూపించాడు, పద్యం వినండి!

ఉ: "పున్నమిరేలఁ దత్పురము పొంతనెబో న్ శిఖరాళిదాకి వి 

ఛ్ఛిన్న గతిన్ సుధారసము చింది పయింబడు నంతనుం 

డిన్నెల సన్నగిల్లు; నది నిక్కము; కాదనిరేని, యాపదా 

ర్వన్నె పసిండి మేడలకు రాబనియేమిల? సౌధనామ ముల్!

కవి పాండవ రాజధాని యింద్రప్రస్థపురాన్ని వర్ణిస్తున్నాడు.

 అక్కడున్నవన్నీ సౌధములేనట! అవిఆకాశమంత యెత్తున్నవట! 

వాటికి సౌధనామము యెందుకు యేర్పడినదో యీపద్యంలో చర్చ జరుపుతున్నాడు. ""సుధయీనిర్మిత యితిసౌధమ్"(సున్నముతో కట్టబడినది కావున సౌధమని మామూలుగా వ్యుత్పత్తి. 

అదికాదంటాడు చేమకూర. యెందుకంటే అవి పదునారు వన్నెల బంగారముతో గట్టబడ్డాయి.కాబట్టివీటిని మామూలు గా సౌధమనుటకువీలులేదు. కానీ యీకారణమువలన వాటికి సౌధములని పేరువచ్చిృయుండనోపును, అంటూ ఒకచక్కని కధచెపుతున్నాడు.

పున్నమి రాత్రులలో చంద్రుడు ఈపట్టణంలో ఉన్న యెత్తైన యీ మేడలపై నుండి పోవుచుండగా, భవనముల పైనున్న శిఖరములు అతవిని గాయపరచి యుండనోపును. అపుడాతనిలోని యమృతమంతయు వీమేడలపై కారియండును,ఆయమృత ధారలతో (సుధావర్షమున) తడియుటవలన కాబోలు వీనికి సౌధములను పేరుగల్గినది. లేకున్న నీబమగరు నేడలను సౌధములనుట కెట్లు వీలగును? అనికవియంటాడు.

సౌధమనేమాటకు లోకంలో మేడ యనేఅర్ధం యోగరూఢమైనది. అయినను కారణాంతరములతో దానిని కాదని, వేరొక కారణమును చెప్పుటచే నిందు "నిరుక్తి "యలంకారము చెప్పబడినది.(నిరుక్తిః యోగతోనామ్నా మన్యార్ధత్వప్రకల్పనమ్ - అని లక్షణము)🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👏🌷🌷🌷🌷🌷🌷

సంస్కృత భారతీ*

 *సంస్కృత భారతీ*


రోజు కో పదొకొండు సంస్కృత పదములు.


*౨*

*ఈనాటి సంస్కృత ముత్యాలు*


*౧* ఖళూరిక = సాముచేయుశాల,గరడీశాల, సైన్యం శిక్షణ శాల(parade ground),

*౨* గవ్యూతి = క్రోసు దూరము,

*౩* అభినివేశః = దృఢమైన భక్తి, పట్టుదల, (zeal),

*౪* కుహరం = గుహ,

*౫* యక్ష్మం = క్షయరోగము,

*౬* కంపనం = కదలుట,

*౭* సంయుక్తః = కూడుకొనిన,

*౮* సంశయః/సందేహం‌/అనుమానః = తెలిసీతెలియనిది(doubt)

*౯* కరవాలం/ఖడ్గం = చేతి కత్తి (sword),

*౧౦* సంపుటః = గ్రంథభాగము(volume)

*౧౧* నికాశః/తుల్యః/సమానః = ఒకే రకమైన ది(like/resemble)

*ప్రయోగవిభాగం*

*౧* అస్మత్భారతీయ ఖళూరికాయాం బహవః నిపుణాః సైనికాః ప్రచలన్తి(మన భారత సైనిక శిక్షణా క్షేత్రం లో చాలా మంది నైపుణ్యం గల సైనికులు ఉన్నారు),

*౨* భారతీయానాం జ్ఞానార్జనాభినివేశః వర్తతే(భారతీయులకు జ్ఞానం పొందాలనే బలమైన కోరిక ఉంటుంది),

*౩* భారతీయ జ్ఞాన నికాశః నిస్సందేహే కో౭పి పాశ్చాత్యః నా౭స్తి(భారతీయుల జ్ఞానంతో సమానమైన పశ్చిమ దేశీయులు ఖచ్చితంగా లేరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సుభాషితమ్

 

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


             *_శ్లోకమ్-_*


*_విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః_*

*_శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః_*

*_స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మాయా పరిభ్రామితః_*

*_తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే...._*


*_దక్షిణాముర్తి స్తోత్రమ్- 8 -_*


*ఎవరి మాయ వలన ఈ ప్రపంచము చేత, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు*.....


🧘‍♂️🙏🪷 ✍️🙏

Panchang