ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
10, నవంబర్ 2023, శుక్రవారం
కాలంతో పాటు మనం కూడా మారాలి అనే వింత పోకడ లో పెళ్లి లో చేస్తున్న తప్పులు 👇
**************
👉*నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం,
👉*పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్లు చేయటం,
👉*గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం,
👉*ఆర్భాటంగా మండపాలు కట్టడం,
👉*మెహిందీ పేరుతో,సంగీత్ పేరుతో తాగి తందనాలాడడం..
👉*డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం,
👉*బ్రైడల్ మేకప్పంటూ రెచ్చిపోవడం,
*👉పట్టెడన్నానికి ప్లేటు రేటు పెంచుతూ పోవటం ,ఆప్యాయత అన్న పదానికి అర్ధమే లేకుండా పోవడం..
👉*దావత్ పేరుతో మద్య, మాంసాలను సేవించి,వికృత నాట్యాలు చేయడం,
👉*కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం,లేదా *అప్పులు చేయడం (విది లేక)*
*మధ్యతరగతి మనిషికి అవసరమా..?*
👉*ఒకడిని చూసి ఒకడు,
*👉ఒకడ్నిమించి ఒకడు
వెర్రెక్కి పోతున్నారు
నేటి కాలంలో.
*ఎంత తింటాడు మనిషి?
*దేంట్లో దొరుకుతుంది వినోదం?
*ఎలా చేయాలి వేడుక?
*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం?
*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత?
*ఏది కడితే వస్తుంది హుందాతనం?
*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం?
*ఎలా పెరుగుతుంది ఆకర్షణ?
👉*ఏ విధంగా బలపడుతుంది బంధం?
ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే,
పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ.
*పదిమందితో పట్టెడన్నం తింటే,
*మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే,
*కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే,
*సహజమైన అందానికి పెద్దపీట వేస్తే,
*సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే,
*దాచిన సోమ్ము సద్వినియోగ పడితే,
కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు.
*👉ముహూర్తం చూసి పారేసే కార్డుకి,
*పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ,
*చెమటపడితే కారిపోయే రంగుకీ,
*పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ,
*నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ,
*సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ,
*ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ,
ఉన్నదంతా ఊడ్చిపెడితే
పదికాలాలు బతకడానికొచ్చే
కొత్తమనిషికి
తర్వాత పెట్టేది ఏమిటి?
*👉అప్పు చేసి ఖర్చుచేసే,
వెర్రితనం కాదు పెళ్ళంటే!
*ఇంటికి దీపాన్ని తెచ్చుకునే
ఇంగితమైన పని వివాహ మంటే!
*శక్తికి మించి ఎగరటం,
*అప్పుచేసి ఆర్బాటం చేయటం
*ముమ్మాటికీ తప్పు👌*.
*కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండటానికే కావాలి ధర్మ,అర్ధములు*. *ఇది తెలుసుకున్ననాడు ప్రతినిత్యం బ్రతుకులో శ్రీరస్తు! శుభమస్తు! అవిఘ్నమస్తు*
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
ధనత్రయోదశి
*నేడు ధనత్రయోదశి*
🪷 ధనత్రయోదశి 🪷
ఆశ్వీయుజ మాసంలో కృష్ణ పక్షం లో వచ్చేటువంటి త్రయోదశికి ధన త్రయోదశి అని పేరు.
ధనత్రయోదశి రోజున చేయవలసిన పనులు ఏమిటి తెలుసుకుందాం. ఈ ధన త్రయోదశి అనేది యమధర్మరాజుకి ప్రీతికరమైన రోజు. ఆరోజున ఆయనను పూజించడం వలన మరియు దీపం పెట్టడం వలన అపమృత్యు దోషాలు తొలగించి నరకలోకప్రాప్తి లేకుండా చేస్తారు. ధనత్రయోదశి రోజున మన ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలను లక్ష్మీదేవికి అలంకరించి పూజించాలి.
పూర్వకాలంలో హేమరాజు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు కుమారుడు పేరు సులోచనుడు. ఆ సులోచనుడు యొక్క జాతకం ప్రకారం వివాహమైన నాలుగవ రోజు మృత్యు గండం ఉందని జ్యోతిష్యులు తెలియజేశారు.ఆ తర్వాత కొంత కాలానికి వివాహ వయస్సు వచ్చేసరికి వివాహం చేశారు. కానీ ఆ నాలుగో రోజు రానే వచ్చింది ఆరోజు చాలా బాధతో తన కొడుకుని యమధర్మరాజు తీసుకుపోతాడు అని బాధపడ్డారు కానీ అదేమీ తెలియని ఆ రాకుమారి తన నగలన్నీ తీసి అమ్మవారికి అలంకరించి లక్ష్మీ పూజ చేసి యమదీపం వెలిగించి గుమ్మం లో పెట్టింది. తనకు ఉన్న మృత్యు దోషం ప్రకారం ఆ యమధర్మరాజు 4వ రోజున రానే వచ్చారు సర్పరూపంలో రాకుమారుడిని కాటు వేయడానికి. ఆ సర్పరూపంలో వచ్చినటువంటి యమధర్మరాజు గుమ్మం లో పెట్టిన యమదీపం మరియు లక్ష్మీదేవికి అలంకరించిన బంగారు నగల యొక్క కాంతి ని చూసి మైమరిచిపోయారు. ఈ లోపల సులోచనుడు యొక్క మృత్యు గండ సమయం దాటిపోయి మృత్యు గండం తొలగిపోయింది.
అందుకని యమ ప్రీత్యర్థం గుమ్మం సాయంకాలం గుమ్మంబయట యమ దీపం పెట్టి దాని కింద శ్రీముగ్గు వేసి గుమ్మానికి ఒకపక్కగా పెట్టి పూజించండి.లక్ష్మీదేవికి బంగారు నగలు అలంకరించి లక్ష్మీ పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ యమదీపం అనేది మట్టి ప్రమిదలో వత్తులు వేసి నువ్వుల నూనెతో చెయ్యాలి.
ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో స్వయంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగాపెట్టి అమ్మవారిని కొలవడం వలన అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో పాటు అన్ని రకాల సంపదలు కలుగుతాయి.
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
శర్యాతి వెంటనే అంగీకరించాడు. ఈ రోజే వెడదాం. ఇద్దరం కలిపివెడదాం. అమ్మాయినీ
అల్లుణ్ణి చూసివద్దాం - అని ఓదార్చాడు. వెంటనే రథం అధిరోహించి చ్యవనమహర్షి ఆశ్రమం చేరుకున్నారు.
రూపయౌవన సంపన్నుడై దేవపుత్రుడిలా వెలిగిపోతూ కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్న మునీశ్వరుణ్ణి
చూశారు. ఇద్దరూ క్షణకాలం ఆశ్చర్యపోయారు. ఇదేమిటి? ఈ సుందరాకారుడెవరు? ఛీఛీ! ఎంత
మహాపాపం చేస్తోంది మన అమ్మాయి. లోకానికి తెలిస్తే ఎంత అప్రతిష్ఠ! గుడ్డిమగడిని చంపేసి ఈ
అందగాడితో కాపురం పెట్టిందన్నమాట. కామపీడితురాలై ఇంతపని చేసిందా? అవును, ఎంతటివారికైనా
యౌవనంలో మన్మథుడు అతిదుస్సహుడుగదా! మనువంశానికి పెద్ద కళంకం, మాయని మచ్చ తెచ్చిపెట్టింది.
కన్యా యోగ్యాయ దాతవ్యా పిత్రా సర్వాత్మనా కిల |
తాదృశం హి ఫలం ప్రాప్తం యాదృశం వై కృతం మయా ॥
(6-16)
కన్నకూతురు కళంకిని అయ్యిందంటే ఆ తండ్రి జీవితం పరమకుత్సితం. అన్ని పాపాలూ
మూటగట్టుకుని ఏడిపించడానికే పుడుతుంది కూతురు. నేనూ పొరపాటే చేశాము. నా స్వార్థం కోసం
వృద్ధాంతానికి కట్టబెట్టాను. అన్ని విధాలా యోగ్యుణ్ణి చూసి కన్యాదానం చెయ్యాలంటారు. నేను
చేసినదానికి తగిన ఫలమే దక్కింది.
(6-19)
ఈ దుశ్శీలను ఏం చేసినా పాపం లేదు. నరికిపారెయ్యాలి. కానీ స్త్రీహత్యాపాతకం
అంటుకుంటుంది. అందులోనూ కన్నకూతిరిని సంహరించడం మరీపాపం. నిష్కళంకమైన మనువంశానికి
నా చేతులతో నేనే కళంకం తెచ్చిపెట్టినవాడినవుతాను. లోకాపవాదానికి భయపడనా, ప్రేమానురాగాలకు
కట్టుపడవా ? ఏమి చెయ్యాలో తోచడంలేదు.
బ్రతుకు ధనం కోసం కాదు
*బ్రతుకు ధనం కోసం కాదు ధర్మం కోసం. జీవిత పరమార్ధం భుక్తి మాత్రమే కాదు- భక్తి, సమత్వ బుద్ధి ప్రధానం.*
ప్రకృతిలోని చరాచర సృష్టి జీవనానికి అర్ధం. పరమార్ధం ఉంటాయి. చీమ నుంచి బ్రహ్మ వరకు రూపాలు వేరువేరుగా ఉన్నా ఎవరి పరిధిలో జీవనం వారిది. జీవిత కాలం కూడా నిర్దేశితమై ఉంటుంది. జీవిత లక్ష్యం తెలుసుకోవాల్సిన అవసరం మనిషికి మాత్రమే ఉంది. మానవులు బుద్ధిజీవులు. మిగిలిన అన్ని ప్రాణులకు స్వయం నిర్ణయాధికారం లేదు. అవి ఏ జాతికి చెందినవో ఆ జాతి లక్షణాలు మరణించే వరకు ఉంటాయి. అవి కేవలం చిన్న పరిధిలోనే బతుకుతాయి. ఆకలి, నిద్ర, మైధునం భయం... నాలుగింటికే ఆలోచన. ఆచరణ | పరిమితమవుతాయి. మనిషి జీవిత లక్ష్యానికి పరిమితి లేదు. అది ఆకాశమంత విశాలం. జీవిత లక్ష్యం మోక్ష సాధన అని వేదాంతులు చెబుతారు.
ఎవరి జీవితం ఎలా గడుస్తుందో మాత్రం ఎవరూ కచ్చితంగా నిర్ణయించలేరు, జాతకం, జ్యోతిషశాస్త్రం సైతం కొంతవరకే ఊహించగలవు ఎవరి జీవితానికి వారే నిర్ణేతలు. సూచనలు, సలహాలు, హితోక్తులు, సందేశాలు... వంటివి అనేకం అందుబాటులో ఉన్నాయి. స్వీకరించడం, తిరస్కరించడంలో ఎవరికి వారి స్వీయ నిర్ణయం. మనుషులు అందరూ గొప్పవారు కాకపోయినా.? మంచివారు మాత్రం కావాలని పెద్దలు చెబుతారు. మంచితనమే మానవతా లక్షణం.
ఒక మనిషి ప్రవర్తన ద్వారానే అతడి జీవితాన్ని అందరూ అర్థం. చేసుకుంటారు. వృత్తివ్యాపారాలు, వివిధ రంగాల్లో ప్రవేశం వారివారి అభిరుచులు, అర్హతలను అనుసరించి జరుగుతుంది. సాధించిన అవకాశం, అధికారం క్రమంగా మార్పు తెస్తాయి. తర్కబద్ధంగా, విజ్ఞతతో కూడిన జ్ఞానంతో కొందరు ఆదర్శవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు. సేవ, సహాయం సామాజిక న్యాయం అందరికీ అందించి తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటారు. మరి కొందరు తమకు లభించిన వాటిని దుర్వినియోగం చేయడమే. లక్ష్యంగా భావిస్తారు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు రగిల్చి సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టి ఆనందిస్తారు.
రామాయణంలో కబంధుడు, విరాధుడు అలాంటివారే. యక్షులు, గంధర్వుల స్థాయికి చేరుకున్న స్థితి నుంచి మద, మాత్సర్యం, అహంకారంతో సాధువులు, సజ్జనులను అవమానించి వారి శాపానికి గురయ్యారు. ఉన్నతమైన స్థానం కోల్పోయి రాక్షస స్వభావంతో నీచ స్థానం పొందారు. పురాణాల్లో రాక్షసులుగా నిలిచారు. బ్రతుకు ధనం కోసం కాదు ధర్మం కోసం. జీవిత పరమార్ధం భుక్తి మాత్రమే కాదు- భక్తి, సమత్వ బుద్ధి ప్రధానం.
చరిత్రలో తామర్లేన్, చెంఘిజ్ ఖాన్ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. కార్యదక్షత, పట్టుదలతో పేరు సాధించారు. అంత ఘనమైన | స్థాయికి చేరినవారు అసంబద్ధంగా, క్రూరంగా ప్రవర్తించి చరిత్రహీనులయ్యారు.
ప్రతివారూ తమ జీవిత అర్థం తెలుసుకోవాలి. తమ జీవన గమనం పరిశీలించుకుని అవసరమైతే. మార్చుకోవాలి. ప్రేమ, దయ, జాలి, కరుణతో పాటు సహనం, సంయమనం, సహజీవనం సాగిస్తే మానవులుగా చీరస్మరణీయులు అవుతారు. ప్రపంచంలో నియంతృత్వం ఎంతో కాలం కొనసాగలేదు. అధర్మానికి ఆయువు తక్కువ, సత్యమే శాశ్వతంగా ఉంటుంది.
శాంతికాముకులు, సత్ప్రవర్తన కలిగినవారి జీవితం సఫలమవుతుంది. వసిష్ఠుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మర్షి స్థానాన్ని పొందాడు. ఆయన శక్తి, సామర్ధ్యాలు చూసి ఈర్ష్యతో విశ్వామిత్రుడు తానుకూడా బ్రహ్మర్షి కావాలనుకున్నాడు. అంతటి ఉన్నతమైన పదవి సాధించాలంటే తనలోని ఆరు శత్రువులను (కామ | క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు) జయించాలని గ్రహించి పరివర్తనతో సాధించాడు. బ్రహ్మర్షిగా శాశ్వత కీర్తి సంపాదించాడు. ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థితికి చేరాలనే ఆశయంలో తప్పు లేదు. ఎంచుకునే మార్గం ధర్మబద్ధంగా ఉండాలి.
🍁ప్రేమ, త్యాగం, విశాలత్వం జీవిత అర్థాలు, పరమార్ధాలు. అవి తెలుసుకుని జీవిస్తే ధన్యం....
తెలియకుండా బ్రతికితే వ్యర్ధం.🙏
బాహ్యస్పృహలో లేనివారి
*ప్ర : జీవితమంతా భగవదారాధన చేస్తూ,స్మరణ చేస్తూ మంచి పనులు చేస్తూ ఉండి,అవసాన దశలో పక్షవాతం, హృద్రోగం వంటి వ్యాధులకు లోనవ డంవల్ల బాహ్యస్పృహ కోల్పోవడం జరుగుతుంది. అట్టివారు నామ స్మరణ చేసేందుకు శరీరం, మనస్సు సహకరించని స్థితిలో వారి గతి ఏమిటి ?*
జ : "అన్తకాలే చ మామేవ స్మరన్ ముక్త్యా కలేబరం l యః ప్రయాతి సమద్భావం యాతి నాన్యత్ర సంశయః॥
- చివరి దశలో భగవత్ స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేవారు భగవత్ భావాన్ని పొందుతారని శ్రీకృష్ణ వచనం. ఇది నిజమే. కానీ బాహ్యస్పృహలో లేనివారి విషయం వేరు. జీవితమంతా భగవచ్చింతన చేసేవారు - స్పృహ ఉన్నంతవరకు చేస్తున్న కారణంగా వారికి తప్పక సద్గతి కలుగుతుంది.
" స్పృహకు అంతము కలిగే వరకు " అనే అర్థాన్నే తీసుకోవాలి.
" అన్తకాలే చ "- అనడంలో "అన్తకాల మునందు కూడా " అని అర్థం. నిత్యం స్మరించేవానికే అవసానకాలంలో స్ఫూరణకు వస్తుంది. నిత్యస్మరణం వల్ల భగవద్భావం వ్యక్తి వ్యవస్థగా మారిపోతుంది. భావన భగవన్మయమైన వాడు, బాహ్యస్పృహ లేకున్నా సద్గతి పొందుతాడు.దీనిలో సందేహం లేదు.
