ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
25, నవంబర్ 2023, శనివారం
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
*రేపు కార్తికపూర్ణిమ*
🪔🪔🪔🪔🪔🪔
కార్తీక పౌర్ణమి విశిష్టత..!
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు.
ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం.
ఈ పర్వదినాన్ని ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు.
ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది.
ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.
ఈ నెల అంతా కార్తీక మహా పూరాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు.
మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి.
ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు
ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు.
వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి.
కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు.
ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి.
కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు.
ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం.
ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు.
రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు.
కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు.
ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు.
ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.
కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే.
సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.
కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం.
గురునానక్ జయంతి కూడా ఈరోజే.
ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.
పౌర్ణమినాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది, సాదారణంగా కృత్తిక నక్షత్రం కార్తీక పౌర్ణమి కలసి వస్తుంటాయి.
ఆనక్షత్రంలో దీపారాధన చేయడం శ్రేష్టం.
ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అనే పేరుకూడా ఉంది.
కార్తీక పౌర్ణమి విశిష్టత, ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం..
*సర్వపాపాలు.*
కార్తీకపౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీతొలగిపోతాయి.
ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి, పూజలు నిర్వహించాలి.....
*ఉసిరిదీపం.*
పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి.
బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి.
అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.
దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు.
*365వత్తుల దీపం.*
కార్తీక పౌర్ణమిన రోజంతా ఉపవాసం ఉండి,
సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే.
సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.
*శివుడి దర్శనం.*
పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టే ఆకాశదీపాన్ని దర్శించుకుంటే.. సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శించుకున్న ఫలితం లభిస్తుంది.
కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు మత్య్సఅవతారంలో దర్శనిమిస్తాడు.
*పాయసం నైవేద్యం.*
కార్తీక పౌర్ణమి రోజు శివుడికి రాత్రి పాయసం నైవేద్యంగా సమర్పించాలి.
కొంతమీరు తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, సంపద జీవితంలో పొందుతారు.....
*నరాలకు మంచిది.*
కార్తీక పౌర్ణమి రోజు 4 నుంచి 5 నిమిషాలు చంద్రుడు కిరణాలు మీమీద పడటం వల్ల నరాలు, కళ్ళు రిలాక్స్ అవుతాయి.
కార్తీక పౌర్ణమి రోజు నాలుగు వైపులు ఉండే దీపాన్ని వెలిగించాలి.
ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వైపులుగా ఉండే
ఈ దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు వెలిగిస్తే మంచిది....హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది.
కార్తీకేయుడికి
కార్తీక మాసం కార్తీకేయుడికి ప్రత్యేకమైనది.
అలాగే తులసి మాత పుట్టినరోజు కూడా.
అలాగే తులసి వివాహం లేదా తులసి పూజ చేయడానికి ఇది ఆఖరి రోజు.
*మహామృత్యుంజయ మంత్రం.*
కార్తీక పౌర్ణమి రోజు మహా మృత్యుంజయ మంత్రం జపించాలి.
"ఓం త్రియంభకం యజామయే సుగంధిమ్ పుష్టివర్ధం ఊర్వరుకమివి బంధానాం మృత్యోర్ ముక్షియ మమ్రితాత్"
అనే ఈ మంత్రాన్ని 108సార్లు జపించాలి.
సాయంకాల దీపం.💐
కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది.
ముఖ్యంగా ఇంటి ముందు, తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగి శుభం కలుగుతుంది.
దీపం వెలిగించే అవకాశం లేనివాళ్లు శివాలయంలో ఆవు నెయ్యి సమర్పించినా,మంచి ఫలితం కలుగుతుంది.
ఆశ్వమేధ యాగం ఫలితం.💐
ఈ కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇలా ఇవాళ దీపం వెలిగించడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి.
కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి.
ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది.
ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే
ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది.
ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని,
ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.
పఠించవలిసిన శ్లోకం.💐
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి టైం శ్వవచాహి విప్రాః!!
దీపం వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ, త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపో, కుంకుమో, అక్షతలో వేయాలి.
అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి.
ఆరోజు దీపం చాలా గొప్పది.
ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు.
కీటాశ్చ - పురుగులు; మశకాశ్చ - దోమలు, ఈగలు మొదలైనవి, అంతే కాదు చెరువు ఉంది అనుకోండి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి.
అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి.
నీటిలో ఉన్న పురుగులు, భూమ్మిద ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి.
ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతోందో ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో
ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక! వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక!
అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానము చేసి భగవంతుణ్ణి చేరుగాక!
అని శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు.
ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం.
దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టిన వాడు ఎంత ప్రయోజనాన్ని పొందాలి?
ఈ పవిత్ర దినాన విష్ణువాలయంలో స్థంబదీపం పెట్టిన వారు శ్రీమహవిష్ణువుకి ప్రీతివంతులవుతారు.
ఈ దీపాన్ని చూసినవారి పాపాలుపటాపంచాలవుతాయని విశ్వసిస్తారు.
స్థంబ దీపం పెట్టని వారి పితృదేవతలకు నరక విముక్తి కలగదంటారు.
ఈ రోజున ధ్వజస్థంభం పైన నందా దీపం వెలిగిస్తారు.
జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు.
శివ కేశవ బేదం లేని పరమ పవిత్రమైన మాసం లో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి.
జ్వాల తోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి.
కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి.
లోకాః సమస్తాః సుఖినోభవంతు..!
*మెల్లగా చంపేస్తున్న మైదా*
మైదా పిండి ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినా పిల్లలు పెద్దలు ఎవరూ మైదా పిండి తో తయారయ్యే స్నాక్స్, టిఫిన్, బిస్కెట్లు తినటం మానటం లేదు. రెస్టారెంట్ల లలో పూరిలు, మైసూర్ బొండాలు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో పానీపూరీలు, సమోసాలు లాగించేస్తూ ఆరోగ్యాన్ని ఫాస్ట్ గా తగలేసుకుంటున్నాము.అయినా ఆరోగ్య స్పృహ లేదు ..
ఇటీవల కేరళలోని ప్రజల్లో వచ్చిన మైదా మీద వ్యతిరేకత తో వచ్చిన alertness తో ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ write up ని సేకరించి పోస్టు చేస్తున్నాను.
*మృత్యువు వెంటాడుతుంది.....మైదా రూపంలో!*
గత నాలుగు నెలల్లో చెన్నైలో మరణించిన వారి వయస్సు 33/31/34/35/37/39/41/43/46
వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది..
దయచేసి మైదాతో చేసిన పదార్థాలను తినవద్దు.
పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఇష్టపడే చవకైన విషపూరితమైన ఆహారం మైదాతో చేసిన పదార్థాలు.
పరోటా దుకాణాలు తమిళనాడు అంతటా విస్తృతంగా కనిపిస్తాయి.
ఈ పరోటాలలో ఎన్నిరకాలో?
అంతులేదు.
యువతను తనవైపు తిప్పుకునే అసంఖ్యాకమైన పరోటాలు ఉన్నాయి .... దీని అమ్మకాలు రోజురోజుకు దూసుకుపోతున్నాయి.
అయితే ఈ ప్రొటీన్ శరీరానికి హాని కలిగిస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.
మైదా వల్ల కలిగే నష్టాలపై కేరళలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఐరోపా, బ్రిటన్, చైనా వంటి దేశాలు మైదా ఉత్పత్తులను నిషేధించాయి.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గోధుమల కొరత కారణంగా, పిండితో చేసిన ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభమైంది. పరోటా కూడా ప్రాచుర్యం పొందింది.పరోటా లో ఫైబర్ లేదు. కాబట్టి మన జీర్ణశక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా (రాత్రిపూట) పరోటా తినడం మానేయండి. *దీంతోపాటు మైదా పిండితో చేసిన రొట్టెలు, కేకులు,బిస్కెట్లు తినడం మానేయాలి.*
లేకుంటే మనం అనారోగ్యం పీడితులమై చంపబడతాము.
మెత్తగా రుబ్బిన గోధుమ పిండి లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ దాన్నుంచి మైదా తయారు చేసేందుకు *బెంజాయిల్ పెరాక్సైడ్* అనే రసాయనాన్ని(Chemical) గోధుమ పిండిలో కలుపుతారు.
ఈ రసాయనమే మనం జుట్టుకు వేసుకునే రంగులోని రసాయనం. ఈ విష రసాయనం, మైదాలోని ప్రొటీన్లతో కలిసి క్లోమగ్రంధిని దెబ్బతీసి మధుమేహాన్ని కలిగిస్తుంది.
అదనంగా, పిండిని మెత్తగా చేయడానికి మరియు సింథటిక్ పిగ్మెంట్‌గా చేయడానికి *అలోకాన్* అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు.
భారతదేశంలో మైదా ఎక్కువగా తింటారు.
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం మన దేశంలోనే ఎక్కువగా ఉండడానికి కారణం ఇదే అంటున్నారు నిపుణులు.
మైదా కిడ్నీ, గుండె జబ్బులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు.
కృష్ణకుమార్ అనే స్వచ్ఛంద సేవకుడు నేతృత్వంలోని *మైదా విసర్జన సమితి* కేరళలో ఈ విషయంపై అవగాహన కల్పించడంలో ఈ స్వచ్ఛంద సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.
మైదా దుష్ప్రవర్తనపై పాలక్కాడ్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. పలు జిల్లాల్లో ప్రచారం కొనసాగుతోంది. "ఇక నుండి మన సంప్రదాయ ఆహారాలు జీడిపప్పు, రైస్, మొక్కజొన్నతో _విదేశీ ఆహారమైన మైదా అనే ప్రోటా మిక్స్‌డ్ కెమికల్‌ని ఏరి పారేయ్యాలని మా కేరళ వాసులం డిసైడ్ అయ్యాము. అందుకై కృషి చేస్తున్నాము." అంటున్నారు కేరళ ప్రజలు.
మరి మన సంగతేమిటి?
మనిషి జీవితం రాగబంధాలతో కూడింది. రజోగుణమే రాగం. స్థూలంగా చెప్పాలంటే- ఇది నాది, వీరు నా వారు, ఇది నా ఆస్తి మొదలైన మమకారాలతో కూడిన భావమే రాగం. అది ఉన్నచోట ద్వేషం కూడా ఉంటుంది. సమాజంలో కొందరిని తనవారిగా భావించినప్పుడు, మరికొందరు పరాయివాళ్లుగా మారతారు. తనవాళ్ల కోసం పాటుపడే సమయంలో పరులను పక్కన పెట్టడం వల్ల సమాన దృష్టి కొరవడుతుంది. ఇలా తనవాళ్ల పట్ల పెరిగిపోయే అనురాగాలు మనిషిని బంధిస్తాయి. ఎప్పుడూ తనకోసం, తనవాళ్ల కోసం తపించడంలోనే శక్తియుక్తులన్నీ కర్పూరంలా హరించుకుపోతాయి. ఇలాంటి భావబంధాలను, భవబంధాలను తొలగించుకొమ్మని చెబుతుంది వేదాంతం.
అసలు మనిషి ఆయుర్దాయమే అతి స్వల్పం. నిండు నూరేళ్లు బతకడమే ఎంతో కష్టం. ఆ నూరేళ్లలోనూ బాల్యక్రీడలతో బాల్యం హరించుకుపోతుంది. చదువుసంధ్యలతో కౌమారదశ ముగిసిపోతుంది. విషయసౌఖ్యాలతో యౌవనం మాయమవుతుంది. నిరంతర చింతతో వృద్ధాప్యం గడుస్తుంది. అర్ధభాగం నిద్రకు, అర్ధభాగం ఇతర వ్యవహారాలకు ఆహుతి కాగా మనిషి ఆత్మానందం కోసం ఎంత కాలాన్ని వెచ్చిస్తున్నాడనేది ప్రశ్నార్థకమే. అందుకే శంకర భగవత్పాదులు చర్పటపంజరికా స్తోత్రంలో ‘ఓ మూఢమతీ! గోవిందుణ్ని భజించు! నీ కాలం మూడినప్పుడు నిన్ను ఆ గోవిందుడు తప్ప ఎవరూ కాపాడలేరు. నీవు చదివిన వ్యాకరణ శాస్త్రం నిన్ను అంత్యకాలంలో కాపాడదు. కనుక శాస్త్రాలు వల్లెవేయడం కాదు, సాధనతో భగవంతుడికి సమీపంగా ఉండటానికి ప్రయత్నించు’ అన్నారు.
మనిషి జన్మించే సమయంలో ప్రసవవేదనను కలిగించి తల్లిని కష్టపెడతాడు. పుట్టిన తరవాత పెరిగేదాకా తల్లితో సేవలు చేయించుకుంటాడు. పెరిగి పెద్దవాడైన నాటినుంచి సాంసారిక బంధాల్లో అష్టకష్టాలు అనుభవిస్తాడు. అనారోగ్యాలతో, ఆపదలతో దుర్భరంగా కాలాన్ని వెళ్ళదీస్తాడు. అందుకే శంకరభగవత్పాదులు- ఈ సంసారం ‘దుస్తారం’ (అతికష్టంతో దాటదగిన సముద్రం). కనుక ఓ మురారీ! నన్ను కాపాడు!’ అని ప్రార్థించారు.
చీకటిలో నడుస్తున్నవాడికి దారి తెలియదు. అజ్ఞానాంధకారంలో తిరిగేవాడికి జ్ఞానోదయం కానే కాదు. జ్ఞానకాంతికోసం వెదకాలి. చీకటిలో చిరుదివ్వెను వెలిగించాలి. మృత్యువు నుంచి అమృతత్వాన్ని తోడుకోవాలి. అదే మనిషి చేయవలసిన పని. నేనెవరు, నీవెవరు... అందరిలోనూ ఉన్న ఆత్మ ఎవరు, లోకంలో శాశ్వతంగా నిలిచేదేమిటి? ఏది నశించేది, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? ఈ ప్రశ్నలు ఉదయించాలి. వాటికి సమాధానాల కోసం అన్వేషించాలి. అదే నిజమైన జీవితం!
ఈ ప్రపంచంలో మనిషి జీవితం ఒక కల వంటిది. ‘కల’ ఎలా కొంతసేపు మురిపించి, నిద్ర మేల్కొన్న తరవాత కనబడకుండా పోతుందో అలాగే ఈ ప్రపంచం కూడా కొన్ని యుగాల వరకే పరిమితం. ఇది ఎల్లకాలం ఇలాగే ఉండదు. అదే వేదాంత భావన.
ప్రపంచమే అశాశ్వతమైనప్పుడు ప్రపంచంలో కొంతకాలమే బతికి ఉండే మనిషి అశాశ్వతుడే కదా! అశాశ్వతమైన ఈ మానవజన్మను శాశ్వతానందాన్ని కలిగించే విషయాల కోసం ఉపయోగించాలే కానీ, క్షణిక సౌఖ్యాల కోసం వినియోగిస్తే ఇక సార్థకత ఎలా ఉంటుంది?.. ఆదిత్యయోగీ..
ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.
దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.
మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!
దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.
మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను
దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.
మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?
దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి
మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?
దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి
మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!
దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు
మనిషి: నా స్నేహితులున్నారా అందులో?
దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే
మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?
దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు
మనిషి: అయితే నీవద్ద ఉన్న శరీరం ఉండుండాలి!
దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.
మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?
దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.
మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.
మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.
మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?
దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి.
పశ్చాతాపులను క్షమించాలి. తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి...
ఇప్పుడైతే ఈ మొత్తం ప్రపంచానికి తెలుసు, పరమాత్మ ఒక్కరే, ఆ పరమాత్మను కొందరు శక్తి అని నమ్ముతారు, కొందరు ప్రకృతి అని అంటారు కావున ఏదో ఒక రూపంలో తప్పకుండా వారిని నమ్ముతారు. ఏ వస్తువునైతే నమ్ముతారో, తప్పకుండా ఆ వస్తువు ఏదో ఉంటుంది, అప్పుడే దానికి పేరు ఉంటుంది కానీ ఆ ఒక్క వస్తువు గురించి ఈ ప్రపంచంలో ఎంతమంది మనుష్యులైతే ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి, కానీ వస్తువైతే ఒక్కటే ఉంటుంది. అందులో ముఖ్యంగా నాలుగు అభిప్రాయాలను వినిపిస్తారు - కొందరు ఈశ్వరుడు సర్వత్రా ఉన్నారని అంటారు, మరికొందరు బ్రహ్మమే సర్వత్రా ఉంది అని అంటారు, సర్వత్రా బ్రహ్మమే బ్రహ్మము అని అంటారు. కొందరు ఈశ్వరుడు సత్యము, మాయ మిథ్య అని అంటారు, మరికొందరు ఈశ్వరుడు లేనే లేరు, అంతా ప్రకృతేప్రకృతి అని అంటారు. వారు ఈశ్వరుడిని నమ్మరు. ఇప్పుడు ఇన్ని అభిప్రాయాలు ఉన్నాయి. జగత్తు అంటే ప్రకృతి, అంతేకానీ, ఇంకేమీ లేదు అని వారు భావిస్తారు. ఇప్పుడు చూడండి, జగత్తును నమ్ముతారు కానీ ఏ పరమాత్మ అయితే జగత్తును రచించారో, ఆ జగత్తు యొక్క యజమానిని నమ్మరు! ప్రపంచంలో ఎంతమంది మనుష్యులైతే ఉన్నారో, వారివి అన్ని మతాలు ఉన్నాయి, చివరికి ఈ మతాలన్నింటి యొక్క నిర్ణయం స్వయం పరమాత్మ వచ్చి తీసుకుంటారు. ఈ మొత్తం జగత్తు గురించి పరమాత్మ వచ్చి నిర్ణయము తీసుకుంటారు లేక ఎవరైతే సర్వోత్తమునిగా, శక్తివంతునిగా ఉంటారో, వారే తమ రచన యొక్క నిర్ణయాన్ని విస్తారపూర్వకంగా అర్థం చేయిస్తారు, వారే మనకు రచయిత యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు మరియు తమ రచన యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు... ఆదిత్యయోగీ...
చాలామంది మనుష్యులు ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు, మనము ఆత్మలము అని మనకు ఋజువు ఏమిటి. ఇప్పుడు దీనిపై అర్థం చేయించడం జరుగుతుంది, మనం ఎప్పుడైతే, ఆత్మనైన నేను ఆ పరమాత్ముని సంతానాన్ని అని అంటామో, ఇప్పుడు ఇది తమను తాము ప్రశ్నించుకునే విషయము. మనం రోజంతా ఏదైతే నేను, నేను అని అంటూ ఉంటామో, అది ఏ శక్తి మరియు ఎవరినైతే మనం స్మృతి చేస్తామో వారు మనకు ఏమవుతారు? ఎప్పుడైనా ఎవరినైనా స్మృతి చేసేటప్పుడు తప్పకుండా ఆత్మలమైన మనకు వారి ద్వారా ఏదో కావాలి, అన్ని వేళలా వారి స్మృతి ఉండడం ద్వారానే మనకు వారి ద్వారా ప్రాప్తి కలుగుతుంది. చూడండి, మనుష్యులు ఏదైతే చేస్తారో తప్పకుండా మనసులో ఏదో ఒక శుభమైన కోరిక ఉంటుంది, కొందరికి సుఖం యొక్క, కొందరికి శాంతి యొక్క కోరిక ఉంటుంది కావున ఎప్పుడైతే కోరిక ఉత్పన్నమవుతుందో, తప్పకుండా అప్పుడు తీసుకునేవారు ఎవరో ఉంటారు మరియు ఎవరి ద్వారా ఆ కోరిక పూర్తవుతుందో తప్పకుండా ఇచ్చేవారు ఎవరో ఉంటారు, కావుననే వారిని స్మృతి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రహస్యాన్ని పూర్తి రీతిలో అర్థం చేసుకోవాలి, వారు ఎవరు? ఈ మాట్లాడే శక్తి స్వయం నేను ఆత్మను, దాని ఆకారము జ్యోతిర్బిందువు వలె ఉంటుంది, మనుష్యులు స్థూల శరీరాన్ని వదిలినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. అది ఈ కనులకు కనిపించదు, ఇప్పుడు దీని ద్వారా నిరూపించబడుతుంది, ఆత్మకు స్థూల ఆకారం లేదు కానీ మనుష్యులు ఆత్మ వెళ్ళిపోయిందని తప్పకుండా అనుభవం చేసుకుంటారు. మనం దానిని ఆత్మ అనే అంటాము, ఆత్మ జ్యోతి స్వరూపము, మరి తప్పకుండా ఆ ఆత్మకు జన్మనిచ్చేటువంటి పరమాత్మ రూపం కూడా ఆత్మ రూపం వలె ఉంటుంది, ఎవరు ఎలా ఉంటారో వారి సంతానము కూడా అలాగే ఉంటుంది. మరి ఆత్మలమైన మనం ఆ పరమాత్మను, వారు ఆత్మలమైన మనందరి కన్నా శ్రేష్ఠమైనవారు అని ఎందుకంటాము. ఎందుకంటే వారిపై మాయ యొక్క ఎటువంటి ప్రభావం ఉండదు. ఇకపోతే, ఆత్మలమైన మనపై మాయ యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మనం జనన మరణాల చక్రంలోకి వస్తాము. ఇప్పుడు ఇదే ఆత్మ మరియు పరమాత్మకు మధ్యనున్న వ్యత్యాసము...
ఎవరు ఉన్నా లేకపోయినా మన దారి మనం సాగిస్తూనే ఉండాలి గమ్యం చేరేదాకా....
గమ్యం కోసం పయనిస్తూ ఉంటాను...
ఎదురుపడిన కొందరు ఆత్మీయులను
చీమల బారులా నాతో పాటు కలుపుకుంటాను..
నా త్రోవలో నాతో పాటే నడిచే బంధాలు కొన్ని ...
మధ్యలో వేరే చీమల బారులో కలిసిపోయే బంధాలు కొన్ని..
పుట్టినపుడు ఏకాకినే
పోయేటపుడు ఏకాకినే
మద్యలో నేను అల్లుకున్న పూల పొదరిల్లు
ఎంతగా పరిమళిస్తుందో
ఎదుటి వారి హృదయాలను దోచుకుంటుందో
అదే నేను సద్వినియోగపరచుకున్న నా జీవితపు విలువ...
"మనసు శూన్యస్థితికి చేరాలంటే ఏమి చెయ్యాలి ?"
"ఏకాగ్రతను అలవర్చుకోవాలి. మనసుకు కుదురు రావటం అంటే మనకు కుదురు రావటమే. మనమూ మనమనస్సు విడివిడిగా లేవు. నేను కదలకుండా ఉన్నానంటే నా మనసు కదలకుండా ఉందని అర్ధం. నేను కదులుతున్నానంటే నా మనస్సు చంచలంగా ఉందని అర్ధం. మనసు అంటే మనకి ఏర్పడిన జ్ఞాపకాల సమూహం. ఆ జ్ఞాపకాలు గుర్తుకురావటమే మనం నిరంతరం చేస్తున్న ఆలోచన. నిజానికి మనం కళ్ళు ముసుకున్నా కనిపించేవన్నీ బయట చూసినవే. మనకి చూడటం, వినటం ప్రవృత్తిగా ఉంది. జ్ఞాని మనసు నివృత్తిలో ఉంటుంది. కాబట్టే జ్ఞాని కళ్ళు మూసుకుంటే శూన్యం ఉంటుంది. అలాంటి శూన్యస్థితి కలిగే వరకూ మనసుకు ఏకాగ్రత అలవరుస్తూ వెళ్ళటమే సాధన. మనశ్శాంతి కోసం మొదలైన సాధన పరిణామంలో దైవం కోసం పడే తపనగా మారుతుంది !..
.
శరీరము, మనసుతో బాటు ఆత్మను కూడా ఆరాధించే వ్యక్తి యొక్క దృష్టి శరీరమూ, మనస్సు పైననే గాక, ఆత్మపై కూడా ఉంటుంది. కానీ ఆత్మ యొక్క ప్రయోజనం అతడికి తెలియదు. అతడు జాగ్రత్తదావస్థ, స్వప్న, సుషుప్తి అనే ఈ మూడు అవస్థల్లో చేసే పనులన్నీ చేస్తుంటాడు. అలా చేస్తున్నప్పటికీ, ఆత్మ తత్వమూ, ఆత్మను గురించిన పరమసత్యమూ అతడికి తెలియదు. అందువల్లనే అతడు అజ్ఞాని, అతడి స్థితి అటువంటిది.....
🎻🌹🙏 కార్తికమాసంలో నెలరోజులూ దీపాలు వెలిగించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి?
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿నిత్యం తులసికోట వద్ద, పూజగదిలో దీపారాధన చేయవచ్చు. ఏదైనా కారణం వల్ల కొన్నిరోజులపాటు దీపారాధన చేసే అవకాశం లభించకపోవచ్చు. దానికి చింత పడనవసరం లేదు.
🌸ప్రత్యేకించి కార్తికమాసంలో దీపోత్సవాలు విశిష్టమైన ఫలితాలు కలిగిస్తాయి. అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే దీపారాధన కార్తికమాసంలో మాత్రమే చేయడం చూస్తుంటాం.
🌿అటువంటి దీపోత్సవాల్లో పాల్గొనవచ్చు. కనీసం కార్తిక పౌర్ణమినాడు లేదా ఆ మాసంలో ఏదైనా ఒక రోజున 'ఆలయంలో, నదీతీరంలో, పూజగదిలో, తులసికోటవద్ద దీపారాధన చేయడం మంచిది.
🌸కార్తిక పౌర్ణమినాడు సంవత్సరం మొత్తానికి గాను 366 వత్తులను వెలిగించే సంప్రదాయం ఉంది. ఆనాడు దీపారాధన చేస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది.
కార్తికమాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారు?
వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే.
🌿దీపం వెలిగించడానికి ఓ ప్రమిద కావాలి. అదే మానవ దేహం. పృధివీతత్త్వం. వైరాగ్యంతో కూడిన తైలం, నూనె కావాలి. ఇది జలతత్త్వం. భక్తి అనే వత్తి అందులో ఉంచాలి. అది ఆకాశ తత్త్వం . వెలిగించడానికి అగ్ని కావాలి. వెలిగించిన తర్వాత దీపం అఖండంగా వెలగడానికి గాలి కావాలి. అది ఆ వాయుతత్త్వం. ఇలా పంచతత్వాలతో కూడినదే దీపం.
🌸మానవునిలో ఉండే ఈ పంచతత్వాలకు ఊపిరిపోసే ఉసిరికను దీపశిఖకు ఆధారంగా చేస్తాం. దేహంపై మమకారం వదలిపెట్టడానికి, అజ్ఞానం తొలగి జ్ఞానం పొందడానికి కార్తిక దీపదానం చేస్తాం.
కార్తికమాసంలో దేవుని దగ్గర పెట్టిన దీపం ఎంతసేపు వెలగాలి
🌿దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవడం అవసరం.
🌸దీపం కనీసం గోదోహన కాలంపాటు వెలగాలన్నారు.
🌿అంటే ఆవుపాలు పితికేందుకు పట్టేంత కాలమైన దీపం వెలగాలని అర్ధం. సామాన్య పరిభాషలో అరగంట దాకా వెలిగేంత చమురుపోసి దీపారాధన చేయాలి అలాగే పూజా పూర్తయ్యాక మనంతట మనమే దీపం కొండ ఎక్కేలాగా చెయ్యకూడదు దానంతట అది కొండ ఎక్కేవరకు వరకు అలా ఉంచాలి. పూజమధ్యలో దీపం కొండ ఎక్కకుండా చూసుకోవాలి.
🌸దీపం ఆరింది అనడం కూడా అపశకునంగా భావిస్తారు. దీపం కొండెక్కింది లేదా ఘనమయ్యింది అంటూ ఉంటారు...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *87వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*గురుగ్రహ చరిత్ర - 3*
బృహస్పతి చేయి అంగవస్త్రం చాటు నుంచి ఇవతలకి వచ్చింది. ఆ చేతిలో ఏదో పుష్పం... నవరత్నాలతో పొదిగినట్టు రకరకాల రంగుల్లో మెరుస్తోందది. *"ఇది ఇంద్రపత్ని శచీదేవి గురుపత్ని తారాదేవికి కానుకగా పంపింది !"*
బృహస్పతి నవ్వుతూ పుష్పాన్ని అందించాడు. తార అందుకోలేదు. ఆమె మెల్లగా ముందుకు వంగింది. సున్నితంగా ఆ దివ్యపుష్పాన్ని ఆఘ్రాణించింది. తల పైకెత్తి , పరవశంగా చూసింది. ఆమె ఎర్రటి తడి పెదవుల్ని చిరునవ్వు అందంగా విడదీసింది. తార మెల్లగా , వీపుని భర్త వైపు తిప్పింది. పుష్పాన్ని శిరోజాలలో అలంకరించమన్న సూచనను అందిస్తూ.
బృహస్పతి పువ్వును తార శిరోజాలలో అలంకరించాడు. శిరోజాల నేపథ్యంలో దివ్య కుసుమం ధగధగలాడుతోంది. తార శిరోజాల ఆశ్రయం పొందేక పుష్ప సౌరభం హెచ్చినట్టనిపిస్తోంది బృహస్పతికి , తల వాల్చి సువాసనను గాఢంగా ఆఘ్రాణించాడు. రెండు చేతుల్నీ తార భుజాల మీద వేశాడు. సున్నితంగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు.
తార ఆయన ముఖంలోకి తన్మయత్వంతో చూస్తోంది. ఆమె కళ్ళు తారల్లా మెరుస్తున్నాయి.
*"తారా ! వాతాయనం మూసివేశావెందుకు ?"* బృహస్పతి ఉన్నట్టుండి అడిగాడు.
తార కనురెప్పలు కిందికి వాలాయి.
*"ఎందుకు తారా ?"* బృహస్పతి మళ్ళీ అన్నాడు. *"తెరిచి ఉంచితే చల్లటి మలయమారుతం వీవనలు వీస్తుంది కదా!*
*"... వాతాయనం లోంచి అతను... కనిపిస్తూ , చూస్తున్నాడు..."* తార కంఠం బలహీనంగా ధ్వనించింది.
*"ఎవరు ? ఎవరతను ?"* బృహస్పతి ఆశ్చర్యంతో అడిగాడు.
*"... అతనే... ఆ బుధుడి తండ్రి..."* తార బలవంతం మీద ఆగి , ఆగి... పలికింది.
*"తారా!"*
*"నాకు... అది... ఇష్టం లేదు..."* తార నెమ్మదిగా అంది.
*"తారా !"* బృహస్పతి కదిలిపోతూ అన్నాడు. ఆయన చేతులు ఆమెను అనురాగలతికల్లా అల్లుకున్నాయి. మెరిసే కళ్ళతో తన ముఖంలోకి చూస్తున్న తార ముఖంలోకి ఆప్యాయంగా చూశాడాయన.
*"నీ నిబద్ధత నన్ను అలరిస్తోంది... వరం కోరుకో !"* బృహస్పతి ఉద్వేగంతో అన్నాడు... *"కోరుకో , తారా !”*
తార ఆయన వక్షస్థలం మీద రెండు చేతుల్నీ బోర్లించింది. *"స్వామీ... నాకు... నాకు.... సౌందర్యవంతుడూ , మేధావీ అయిన పుత్రుణ్ణి ప్రసాదించండి !"*
బృహస్పతి చిన్నగా నవ్వాడు. *"ఆ వరం నీ ఒక్కదానిదే అనుకుంటున్నావా ? కాదు , అది మన ఇద్దరిదీ !”*
*“స్వామీ...”*
*"వరం అనుగ్రహిస్తున్నాను. మనోహరాకారంతో , మహా మేధస్సుతో పుత్రుడు జన్మిస్తాడు నీకు !"* బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. ఆయన మాటలను మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నట్టు ఆయన చేతులు తార చుట్టూ బిగుసుకున్నాయి.
తార పారవశ్యంతో తన తలని ఆయన మెడ కింద దాచుకుంది. ఎక్కడి నుంచో చొరబడిన మలయమారుత వీచిక ప్రమిదలో దీపకళికను కబళించింది.
********************
బృహస్పతి తారకు ఇచ్చిన వరం వృధా కాలేదు. తార గర్భవతి అయ్యింది.
తార చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చుంది. ఆమె దగ్గరగా రకరకాల ఆహారాలున్న వెదురు బుట్ట ఉంది. ఆమె ముందు , నేల మీద ఆశ్రమంలో పెరుగుతున్న జంతువులూ , పక్షులూ వరసగా కూర్చున్నాయి. గర్భంతో ఉన్న కుందేళ్ళు ! తల్లి కాబోతున్న లేడి ! నేడో రేపో ఈనబోతున్న దుప్పి , గర్భిణి పావురాలు , గర్భాలతో బొద్దుగా ఉన్న చిలుకలు ! అన్నింటికీ వాటి ఆహారం అందిస్తోంది తార.
*"ఏమిటి ? గర్భవతులంతా సమావేశమయ్యారు ?”* దగ్గరగా వచ్చిన బృహస్పతి నవ్వుతూ అన్నాడు..
*"ఇవన్నీ... నేను గర్భవతినని ఎలా తెలుసుకున్నాయో అర్ధం కావడం లేదు , స్వామీ ! ప్రతీ పూటా , ఉదయమూ , సాయంత్రమూ క్రమం తప్పకుండా నన్ను చూడడానికి వస్తున్నాయి. నేరుగా ఆశ్రమంలోకే ! అందుకే నేనే వచ్చేస్తున్నాను , వాటికి ఇష్టమైన ఆహారపదార్ధాలతో !"* తార నవ్వుతూ అంది.
*"బాగుంది ! నీ స్థితిలో ఉన్న ఈ గర్భవతులందరూ సహ - అనుభూతులతో నీతో జతకట్టారు !"* బృహస్పతి చిరునవ్వు నవ్వాడు.
తార చిన్నగా నవ్వింది, చిలుకకు జామపండు అందిస్తూ.
*"నిండుగర్భిణులు కలిసి కూర్చున్న ఈ దృశ్యం నిండుగా , చూడముచ్చటగా ఉంది. సుమా !"* బృహస్పతి అన్నాడు..
*“త్వరలో పుట్టబోయే మా అందరి శిశువులూ ఇలాగే ఒకచోట చేరితే ఇంకెంత ముచ్చటగా , ఇంకెంత ముద్దుగా ఉంటుందో !"* తార ఉత్సాహంగా అంది.
***********************
తార అన్నట్టుగానే అచిరకాలంలో ఆశ్రమానికి చిన్ని చిన్ని శిశువులు వచ్చాయి ! ఆ పక్షుల , జంతువుల పిల్లలతో జట్టుకట్టి ఆడుకోవడానికి అన్నట్టు తారకు బాలుడు జన్మించాడు.
ఎర్రటి దేహవర్ణం. ఒత్తుగా , నల్లగా ఉన్న జుత్తు. దేనికోసమో అన్వేషిస్తున్నట్టు తదేకంగా , లోతుగా చూసే చారడేసి కళ్ళు , నిర్విరామంగా , బోసినవ్వులు వొలకబోసే ఎర్రటి పెదవులు... ఎక్కడినుంచో తెచ్చుకున్న అమూల్యమైన వస్తువులను దాచుకున్నట్లుగా బిగుసుకునే వున్న పిడికిళ్ళు ! అమ్మ పెట్టే ముద్దులను అందుకోడానికా అన్నట్టు కొద్దిగా ఉబ్బిన బుగలు !
*"స్వామీ ! నా బిడ్డడు ఎంత అందగాడో చూశారా ?"* తార ఆనందంగా అంది బృహస్పతితో.
*"తల్లిని పోలిన తనయుడు ! ముద్దులు మూటకట్టుతున్న నీ పుత్రుడు ముందు ముందు చూడచక్కని సుందరాంగుడవుతాడు !"* బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు , తామరరేకుల్లా ఎర్రగా ఉన్న బాలుడి అరికాళ్ళను సున్నితంగా స్పృశిస్తూ.
************************
*"దేవరాజా ! నా పుత్రుడికి 'కచుడు' అనే నామధేయం నిర్ణయించాను !”* నామకరణ మహోత్సవానికి సతీసమేతంగా , పరివార సమేతంగా విచ్చేసిన ఇంద్రుడితో అన్నాడు. బృహస్పతి.
*"మీ నిర్ణయం అర్థరహితంగా ఉండదు. శుభం !"* ఇంద్రుడు నవ్వుతూ అన్నాడు.
బాలుడికి నామకరణం జరిగింది. ఇంద్రుడూ , శచీదేవీ కానుకలు ఇచ్చి దీవించారు.
*"గురుదేవా ! మీ సుపుత్రుడు మా దేవలోకవాసుల తలదన్నే అందగాడవుతాడు ! గురుపుత్రుణ్ణి మా శ్రేయోభిలాషిగా , దేవగురువుకి తగిన వారసుడిగా తీర్చిదిద్దండి ! ఇది మా అభిమతం.".*
*"తథాస్తు !"* బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. కాలం గడుస్తోంది. కచుడు మాతృస్తన్యంతో పుష్టిగా ఎదుగుతున్నాడు. తార ఊహించినట్టుగానే ఆశ్రమంలో జంతువులు , పక్షుల సంతానం కచుడితో ఆడుకోవడం ప్రారంభించాయి. కచుడి కిలకిల నవ్వులతో , అతని స్నేహితుల' అరుపులతో ఆశ్రమ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
బృహస్పతి కచుడికి విద్యాభ్యాసం ప్రారంభించాడు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *⚜️పెరియ పురాణం⚜️*
. *నాయనార్ల చరిత్ర - 10*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*10. గుంగులియ క్కలయ నాయనారు*
చోళదేశంలో 'తిరుక్కడవూరు' అనే గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామంలో కలయనార్ అనే ఒక వైదిక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు.
అతడు పరమేశ్వరునికి నిత్యమూ పరిమళ భరితమైన గుగ్గులిని (గుంగులి) ధూపం
వేసే పనిలో నిమగ్నమై ఉండడం వలన ప్రజలందరూ ఇతనిని గుంగులియ
కలయనారు అని పిలవడం ప్రారంభించారు. శివుడు ఒక పర్యాయం
కలయనారు భక్తిని పరీక్షించదలచుకొన్నాడు. పరమేశ్వరుని లీలా విలాసాల
కారణంగా అతనికి దారిద్ర్యం సంక్రమించింది.
అయినప్పటికీ కలయనారు
ధూపం వేసే పవిత్ర కైంకర్యాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కొంత కాలానికి అతడు తన సంపదలన్నీ కోల్పోయాడు. బంధువులతో, భార్యాబిడ్డలతో
ఆహారంలేక ఆకలితో బాధపడవలసి వచ్చింది ఇంట్లో తినడానికి ఏ
పదార్ధమూ లేదు.
రెండు రోజులు వరుసగా ఆహారం లేకుండా సొమ్మసిల్లి
పోయిన పిల్లలను చూసి కలయనాయరు భార్య తన బంగారు
మంగళసూత్రాన్ని తీసి భర్తచేతికి ఇచ్చి “దీనికి వడ్లు తీసుకురండి" అని
కోరింది.
కలయనారు ఆ బంగారు తాళిబొట్టును తీసుకొని వడ్లు కొనడానికై
బయలుదేరాడు. అప్పుడు అతని కెదురుగా ఒక వర్తకుడు గుగ్గిలపు మూటతో
వచ్చాడు. కలయనారు ఆ వర్తకుని చూసి “నేను బంగారు ఇస్తాను. మీరు
దానికి ఈ గుగ్గిలాన్ని ఇవ్వండి” అని అడిగాడు.
వర్తకుడు దానికి
అంగీకరించగా కలయనారు తన భార్య బంగారు తాళిబొట్టును అతని
చేతిలో పెట్టాడు. వర్తకుడు దానిని తీసుకొని గుగ్గులిమూట ఇచ్చాడు.
కలయనారు ఆ మూటను తీసుకొని పరమేశ్వరుని దేవాలయానికి వేగంగా
వెళ్లాడు.
స్వామి భండారంలో ఆ గుగ్గులిమూటను భద్రపరచి పరమేశ్వరుని
తిరుచరణాలను అర్చిస్తూ అక్కడే ఉండిపోయాడు. కలయనారు ఈ విధంగా
దేవాలయంలో ఉండగా పరమేశ్వరుని కరుణాకటాక్షాలచే అతని గృహం
ధనధాన్యాలతో, సువర్ణ రత్నాభరణాలతో, అపూర్వమైన సంపదలతో
నిండిపోయింది.
వడ్లకోసం కాచుకొని ఉన్న కలయనారు భార్యబిడ్డలు
ఆకలితో సొమ్మసిల్లి నిద్రపోయారు. అప్పుడు తపోనిధి అయిన కలయనారు
భార్య కలలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై గృహమంతటా నిండి ఉన్న సంపదను
తెలియజేశాడు. ఆమె నిద్రనుండి లేచి "పరమేశ్వరుడే మనకు దీనిని అనుగ్రహించాడు" అని రెండు చేతులూ మోడ్చి భగవంతునికి
నమస్కరించింది.
తరువాత తనభర్తకు, పిల్లలకు భోజనం తయారు
చేయసాగింది. అక్కడ దేవాలయంలో ఉన్న కలయనారుకు స్వామి కలలో
కనిపించి "నీవు ఆకలితో ఉన్నావు. ఇంటికి వెళ్లి నీ ఆకలిని తీర్చుకో” అని
చెప్పాడు. పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి కలయనారు తన ఇల్లు
చేరుకున్నాడు.
ఇంటిలోపల ధనధాన్య రాశులు చూసి “ఇవన్నీ ఎలా
వచ్చాయి” అని భార్యను ప్రశ్నించగా ఆమె “పరమేశ్వరుని అనుగ్రహంతో
లభించింది” అని జవాబు చెప్పింది. గుంగులి కలయనారు పరమేశ్వరుని
కరుణాకటాక్షాలను తలచుకొని చేతులను శిరసుమీద మోడ్చి స్తుతించాడు.
యథాప్రకారం పరమేశ్వరునికి గుగ్గులిధూపాన్ని సమర్పించే కైంకర్యాన్ని
చేస్తూ వచ్చాడు.
*పదవ చరిత్ర సంపూర్ణం*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 97*
ఆ రోజుల గురించి కాలాంతరంలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు:
"శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం మేం వరాహ నగర మఠంలో ఎన్నో పారమార్థిక సాధనలు చేశాము. వేకువజామున మూడు గంటలకే లేచే వాళ్లం. దంతధావనం మొదలైన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కొందరు, చేయ కుండా కొందరు - ప్రార్థనా మందిరంలో చేరి జపధ్యానాలలో మునిగిపోయే వాళ్లం. ఆహా! ఆ రోజుల్లో ఎటువంటి వైరాగ్యం ఉన్నదో! ప్రపంచం ఉందా లేదా అనే ధ్యాసే మాకు ఉండేది కాదు.
ఇంట్లో గృహిణి ఏ ప్రకారంగా ఉంటుందో ఆ ప్రకారంగా శశి (స్వామి రామకృష్ణానంద) రాత్రింబవళ్లు శ్రీరామకృష్ణుల సేవ, అర్చన మొదలైన కార్యాలలో నిమగ్నుడై ఉండేవాడు. శ్రీరామకృష్ణుల పూజకు, మా భోజనానికి కావలసిన వాటి నన్నిటిని అతడే చాలావరకు బిచ్చమెత్తి తెచ్చే వాడు..... ఉదయం నుండి సాయంత్రం నాలుగు, ఐదు గంటల దాకా జప ధ్యానాలు సాగిన రోజులున్నాయి..... ఆహా! ఏం అద్భుతమైన రోజులవి.
మే మా రోజుల్లో గడిపిన జీవిత విధానాన్ని చూసి భూతాలే భయపడేవి అంటే, ఇక మనుష్యుల మాట చెప్పాలా! .
"డబ్బు లేని కారణంగా కొన్నిసార్లు మఠాన్ని మూసివేద్దామనుకొన్నాను. కాని శశిని అందుకు ఒప్పించలేకపోయాను. అతడే ఈ మఠానికి మూలస్తంభం. మఠంలో అన్నం మెతుకులైనా లేని రోజులు ఉన్నాయి. భిక్షాటన వలన అన్నం లభిస్తే, ఉప్పు ఉండేది కాదు. కొన్ని రోజులు కేవలం అన్నం, ఉప్పు మాత్రమే ఉండేవి. కాని ఎవ్వరూ ఏమాత్రం లక్ష్యపెట్టలేదు......
ఒక్కోసారి నెల పొడవునా అన్నం, ఉప్పు, ఉడికించిన దొండాకుకూర మాత్రమే మా భోజనం శశి భోజనం సిద్ధం చేసి మా కోసం వేచి ఉండి, చివరికి జపధ్యానాల నుండి బల వంతాన మమ్మల్ని ఇవతలకు లాగేవాడు. అతడి ప్రేమ ఎంత అద్భుతమయింది. "
దుస్తుల విషయంలోనూ అంతే. అందరికీ ఉమ్మడిగా ఒక పంచె, ఒక తువ్వాలు మాత్రమే ఉన్నాయి. బయటికి వెళ్లేవారు వాటిని ధరించాలి. ఇకపోతే ఒక కౌపీనం, ఒక తువ్వాలు మాత్రమే అందరి దుస్తులు🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
శివానందలహరీ – శ్లోకం – 10*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *శివానందలహరీ – శ్లోకం – 10*
. శ్రీ ఆదిశంకరాచార్య విరచితం
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా*
*పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననమ్ |*
*సదా త్వత్పాదాబ్జస్మరణపరమానందలహరీ*
*విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా ? 10*
మనుష్యుడుగాగానీ, దేవుడుగాగానీ, పర్వతముగాగానీ, అడవిగాగానీ, మృగముగాగానీ, దోమగాగానీ, పశువుగాగానీ, పురుగుగాగానీ, పక్షులుమొదలగువానిగా ఎలా పుట్టినా ఫరవాలేదు. కానీ ఎల్లప్పుడూ నా మనస్సు నీ పాదపద్మముల స్మరణలో పరమానందముగా విహరించుటయందు ఆసక్తి కలిగిఉన్నచో ఇంక ఏ జన్మ వచ్చినా బాధ లేదు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
ఆ తరువాత అరుణుడు - వంశోద్ధారకుడు లేకపోయాడే అని విచారించి, రాజ్యం వదిలిపెట్టేసి
తపస్పులకు వెళ్ళిపోయాడు. ఆ కాలాన పన్నెండు సంవత్సరాలపాటు ఆ దేశంలో వానలు కురవలేదు.
సత్యవ్రతుడు చేసిన అధర్మానికి ఇంద్రుడు విధించిన శిక్ష ఇది.
అదే సమయంలో విశ్వామిత్రుడు (కౌశికుడు) తన భార్యాపుత్రులను ఆశ్రమంలో విడిచిపెట్టి
కౌశికీతీరానికి తపస్సుకోసం వెళ్ళాడు. పన్నెండేళ్ళ కరువు రావడంతో కౌశికుడిభార్య బిడ్డలను పోషించలేక
చాలా అగచాట్లు పడింది. పిల్లలు ఆకలో అని ఏడుస్తుంటే ఓదార్చలేక సతమతమయ్యింది. తల్లి పేగు
తల్లడిల్లింది. పెద్ద పిల్లలు నీవారధాన్యం ముష్టత్తుతూంటే విలవిలలాడింది. రాజధానిలో రాజులేడు.
మగడేమో తపస్సుకి వెళ్ళాడు. తనకా పోషించే శక్తి లేదు. ఎవరిని యాచించాలి, ఏమి చెయ్యాలి ? పిల్లలుచూస్తే మాడిపోతున్నారు. ఛీ ! ఎందుకువచ్చిన జీవితం ఇది. కౌశికుడు ఇంటిలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది
కాదుగదా ! ఎక్కడో ముక్కుమూసుకుని హాయిగా నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడికి చా
నిర్ధనత, నా అశక్తత ఎలా తెలుస్తాయి సమర్థుడే. కానీ పరిస్థితి ఇది అని తెలిసేదెలా ?
ఇలా ఆలోచిస్తూ కూచుంటే ప్రయోజనంలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. పిల్లల్ని అందరినీ
ఆకలితో మార్చి చంపుకునేకంటే ఒకడిని అమ్మేసి మిగతావారినైనా బతికించుకోవడం తెలివైనపని. నాకిక
మిగిలింది ఇదొక్కటే దారి. ప్రాణాలు నిలుపుకోడానికి, కాలం గడపడానికి మరో మార్గంలేదు ఇలా
ఆలోచించి విశ్వామిత్రుడి భార్య గుండెను రాయిచేసుకుని, దర్భలు తాడుగా పేని నడిమి కొడుకు
మెడకు పలుపుతాడులా కట్టి, వాడిని తీసుకుని తమ ఆశ్రమ పర్ణశాలనుంచి బయటకు వచ్చింది.
అడవిదారివెంట రాజధానికి నడక సాగించింది.
శ్వపచులతో కలిసి అడవుల్లో జీవిస్తున్న సత్యవ్రతుడు (అరుణుడి కొడుకు) ఎదురయ్యాడు.
ఏమిటమ్మా ఇది? ఎందుకు ఏడుస్తున్నావ్ ? ఈ పిల్లవాడినేమిటి పశువులా తాడుకట్టి లాక్కువెడుతున్నావ్?
ఎవరి బిడ్డడు ? ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు? నిజం చెప్పు. నేను చెయ్యగలిగిన సహాయం ఏమన్నా ఉంటే చేస్తాము.
అయ్యా ! నువ్వు ఎవరో నాకు తెలియదు. అయినా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను
