7, అక్టోబర్ 2020, బుధవారం

**అద్వైత వేదాంత పరిచయం**

 **దశిక రాము**




02. శాస్త్రం

  సంస్కృతంలో మనకి ఉన్న గ్రంధాల వివరాలని ఒక విహంగ వీక్షణం చేద్దాము. మొత్తంగ్రంధాలన్నింటినీ కలిపి శాస్త్రం అంటారు. శాస్త్రం పదం ‘శాస్‌’ అన్న ధాతువు నుంచి 

వచ్చింది. దానికి రెండు అర్థాలు ఉన్నాయి. శాసించటం, బోధించటం. అందువల్ల శాస్త్రం అంటే మొదట్లో మానవజాతిని శాసించి, ఆ తర్వాత బోధిస్తుంది అని అర్థం. ఇలా శాసించి, బోధించటం వల్ల మానవాళిని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. ‘త్ర’ అంటే కాపాడుతుంది. ‘శాసనాత్‌ త్రాయతే ఇతి శాస్త్రం’ మానవాళిని సమస్యల నుంచి మొదట శాసనం ద్వారా, తర్వాత బోధన ద్వారా కాపాడేది శాస్త్రం.

శంకరాచార్యుల వారు శాస్త్రాన్ని తల్లితో పోలుస్తారు. పిల్లవాడికి విషయం అర్థం చేసుకునే పరిపక్వత లేని స్థితిలో అతన్ని శాసిస్తుంది తల్లి. అవసరమైతే బెదిరిస్తుంది కూడా. 

కాలక్రమేపీ బోధన చేయటం, నచ్చచెప్పటం, జ్ఞానోదయం కలగజేయటం, ఉన్నతస్థాయికి తీసుకెళ్ళటం చేస్తుంది. ఇవన్నీ మన శాస్త్రం చేస్తుంది. శాస్త్రాన్ని ఆరుస్థాయిలుగా విభజించవచ్చు.

🙏🙏🙏

సేకరణ

*ధర్మము-సంస్కృతి*



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: