7, అక్టోబర్ 2020, బుధవారం

చంద్ర కిరణ లక్షణములు

 మనకు చంద్ర కిరణ లక్షణములవలన ఎలా ఉపయోగము అనే విషయ పరిశీలన. మన యింద్రియములు చంద్రకిరణ లక్షణములవలననే సృష్టి కి సంబంధించిన కార్యములు నెరవేరును. అది ప్రకృతి రూపం ప్రకృతిని ఆశ్వాదించాలంటే శక్తి కావలెను. అది ఉష్షరూపంలో సూర్యకాంతి వలన పరిమితమై దేహ ఉష్ణోగ్రత రూపంలో కలిగియుండును. సమతుల్యత అనగా బాలన్స్ లేనియెడల యింద్రియములు పనితేయజాలవు. యింద్రియములు అనగా యింద్రియములు శబ్దమునకు ప్రతిరూపం. యింద్రియములు అనగా ఏమిటో వేదం తెలుపు చున్నది. ప్రకృతి పంచభూతాత్మకము ఏలాగున మనకు కూడా అటులనే పంచభూతములు సమాహారమే. మూలము. అదియే ధాతురూపమని ఎలిమెంటల్ శరీరమని వివరణ. వేద వాక్కు యీ విధంగా పంచభూతములు వివరించిన విధంగా. అవి వరుసగా ఓజోన్ అసి, బలం అసి, భ్రా జోసి, ధామనాం అసి, విశ్వం అసి, విశ్వాయుః, సర్వం అసి సర్వాయి అని కలదు. వాటికి కారణమైన మంత్రం' ఇన్ద్రం ఈశానం ఓజసా అభి స్తోమా అనూషత' అని కలదు. ఓజసాభిఈశ్వరరూపంలో యున్న సూర్య శక్తియే యింద్రియములు అని అనగా యింద్రియములు అనేది శక్తి లక్షణమని తెలియును. అనగా పైన తెలిపిన ఓజోన్ అసి... అని తెలిపిన సమస్తము సోమ అనగా చంద్రుని వలననే అని అట్టి లక్షణమైన కిరణ ఉష శక్తియని, అదియే జీవ లక్షణమని తెలియును. వీటికి మూలమైన చంద్ర రూపంలో ఈశ అనే సూర్య శక్తియే మూలము. యఙ్ఞభోక్త యింద్రుడుయని వాటి వలననే వర్షమును వర్షం వలననే జీవ చైతన్య లక్షణమును వీటికి మూలము అధ్వరమని అనగా యఙ్ఞమని యజ్ఞమునకు హవిస్సు లే మూలమని అవి అక్షర రూప మంత్ర పదార్ధ రూప కలయిక యే మూలమని అది అగ్నిరూపమలో మాత్రమేయని మనకు తెలియుచున్నది.

కామెంట్‌లు లేవు: