7, అక్టోబర్ 2020, బుధవారం

114. ఓం భవారణ్య కుఠారికాయై నమః.🙏

 


చం. పుణ్య ఫలంబె నీ కృపను బొందఁగఁ జేయును సజ్జనాళికిన్.


గణ్యము వారి జన్మ. కొరగాని భవంబను దుర్ వనంబునే


గణ్యముగా కుఠారివయి ఖండన చేయుము తల్లి! యో భవా


రణ్యకుఠారికా! శరణు, రక్షణ నాకు నొసంగి ప్రోవుమా.

🙏

అమ్మ పాదారవిందములకు ప్రణమిల్లుచు🙏

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: