30, నవంబర్ 2025, ఆదివారం

ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ

  *ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది*.


*ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు*.


*ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి*..!


" *మీరేంచేస్తారో నాకు తెలియదు, నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను" అని కన్నీరుపెట్టుకుంది*..!


*దానికి ఇంద్రుడు*...

*దీనికే ఇంత ఏడవడం ఎందుకు*.!? *అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ కదా..! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను* *నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు*.


*ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ*

*నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను* *దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు..! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద.!" అంటూ బయలుదేరారు*.


*వీరిరాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు*.

*నిజమే ప్రాణాలు* *కాపాడేవాణ్ణి నేనే ..కానీచిలుక ప్రాణం చివరి దశలో ఉంది..! మళ్ళీ ఊపిరి పోయాలంటే.. శివునికే సాధ్యం, మనం ముగ్గురం శివుని ప్రార్థిస్తాం పదండి అన్నారు*.


*ముగ్గురూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు*.

" *ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను..! మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! " అంటూ అందరూ బయలుదేరారు*.


*ఇంద్ర,బ్రహ్మ,విష్ణువు,శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాదారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు*.

 

*అయ్యో* ..! *అదేమి పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను,వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం అని అన్నాడు* .


*యముడు , అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే.. ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో.. అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ..ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం వ్రాసి ఉంది ఇలా*..!


*ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు.. బ్రహ్మ.. శివుడు..విష్ణువు.. యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది*..! *అని* *వ్రాసి ఉంది*


*ఇదే విధి*..! *విధిని ఎవ్వరూ మార్చలేరు..🙏

అంతా_అన్నంలోనే_ఉంది

  🌹అంతా_అన్నంలోనే_ఉంది🌹


అంపశయ్యపై ఉన్న భీష్ముడు తన చుట్టూ చేరిన పాండవులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు. అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది ఫక్కున నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నవ్వు భీష్ముడి మాటల ప్రవాహానికి భంగం కలిగించడంతో ‘అమ్మా! ఇప్పుడు నువ్వెందుకు నవ్వావో నాతో పాటు వీళ్లకీ తెలియాలి.. కాస్త చెప్పమ్మా’ అన్నాడు.


ద్రౌపది బదులిస్తూ ‘భీష్మాచార్యా! ఇంకొద్ది రోజుల్లో మరణించబోయే మీరు ఇంత చక్కగా ధర్మం గురించి చెబుతున్నారు, బాగుంది. కానీ నాడు నా వస్త్రాపహరణ సమయంలో ఈ ధర్మపరిజ్ఞానం అంతా ఏమైపోయిందో అనిపించగానే నవ్వు ఆగలేదు’ అంది.


ఆయన తల పంకించి ‘నువ్విలా నవ్వడం మంచిదయ్యిందమ్మా! నువ్వు గనుక నవ్వకపోయుంటే నాకూ నీకూ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఇదొక శేష ప్రశ్నగా మిగిలిపోయేది. నీ సందేహానికి నా సమాధానం విను!


అప్పుడు నేను సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను. అది నా రక్తంలో కలిసి.. ఆ ప్రభావం నా విజ్ఞతను, వివేకాన్ని తెరలా కప్పేయడం వల్ల కర్తవ్యం గుర్తు రాలేదు. నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ కాలుష్యమంతా అంతరించింది కనుక ధర్మం మాట్లాడుతున్నాను అన్నాడు.


మిత్రులారా! అన్నం మహిమ అంతటిది. మనం తినే ఆహారం కష్టార్జితంతో కూడుకొన్నదై ఉండాలి. పీడన సొమ్ముతో లభించింది తింటే.. అది చెడు ఆలోచనలు కలిగిస్తుంది(మనం తినే ఆహారం లో 6 వంతు మనసు అవుతుంది). అందుకని ఆహారం స్వార్జితం, దైవార్పితం, మితం అయ్యుంటే అది మనసును పరిశుద్ధంగా ఉంచుతుంది. ధర్మమార్గంలో నడిపిస్తుంది. సాత్విక ఆహారంతో ఆత్మ, దేహం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. దైవసాధనలో మనసు నిగ్రహం కోల్పోదు .🙏🙏🏻🌹🌹🙏🏻🙏🏻

ఋషులు కాలాన్ని ఎలా గణించారో,

  🌹హిందూ ధర్మం 🌹


ఇప్పుడు జ్యోతిష్యంలో మన ఋషులు కాలాన్ని ఎలా గణించారో, మామూలు వారు ఊహించని స్థాయిలో, 17 మైక్రో సెకన్ల నుంచి 311,040,000,000,000 ఏళ్ళ వరకు కాలాన్ని అతి సూక్ష్మంగా ఎలా గణించారో, ఆ వివరాలు చూద్దాం.


1 పరమాణువు- ఒక సెకన్‌లో 60,570 వ వంతు, 16.8 మైక్రోసెకను (1 మైక్రోసెకను= 1 సెకెనులో 10 లక్షల వంతు)

1 అణువు- 2 పరమాణువులు≈ 33.7 మైక్రోసెకను

1 త్రసరెణు- 3 అణువులు≈ 101 మైక్రోసెకను

తృటి- 3 త్రసరెణు≈ 1/3290 సెకన్లు; అనగా ఒక సెకనులో 3290 వ వంతు= 304 మైక్రోసెకను

1 వేధ= 100 త్రుటి≈ 47.4 మిల్లిసెకన్లు

1 లవం- 3 వేధలు≈ 0.14 సెకన్లు≈ 91 మిల్లిసెకన్లు

1 నిమేషం (కంటిరెప్ప కాలము)- 3 లవములు≈ 0.43 సెకన్లు (లెకలన్నీ దరిదాపుల్లో)

1 క్షణం- 3 నిమేషాలు≈ 1.28 సెకన్లు

1 కాష్టా- 5 క్షణాలు≈ 6.4 సెకన్లు

1 లఘు- 15 కాష్టాలు≈ 1.6 నిమిషాలు

1 దంఢ- 15 లఘువులు≈ 24 నిమిషాలు

1 ముహూర్తం- 2 దంఢలు≈ 48 నిమిషాలు

1 అహోరాత్రం- 30 ముహుర్తాలు≈ 24 గంటలు

మాసము- 30 అహోరాత్రాలు≈ 30 రోజులు

ఋతువు= 2 మాసాలు ≈ 2 నెలలు

అయనము= 3 ఋతువులు≈ 6 నెలలు

సంవత్సరము= 2 అయనాలు= దేవతలకు ఒక రోజు.

-----

1 త్రుటి= 29.6296 మైక్రోసెకన్లు

1 తత్పర= 2.96296 మిల్లిసెకన్లు

1 నిమెషం- 88.889 మిల్లిసెకన్లు

45 నిమెషాలు - 1 ప్రాణ= 4 సెకన్లు

6 ప్రాణాలు- 1 వినాడి- 24 సెకన్లు

60 వినాడి(లు)- 1 నాడి- 24 నిమిషాలు

60 నాడులు= 1 అహోరాత్రము

ఆధునిక ప్రమాణాల ప్రకారం, 24 గంటలు అంటే ఒక పగలు, రాత్రి. మనం గమనించేది 1 నాడి లేదా దంఢం= 24 నిమిషాలు, 1 వినాడి= 24 సెకన్లు, 1 ఆసు/ ప్రాణం= 4 సెకన్లు ........ 1 తృటి= 1 సెకనులో 33,750 వంతు. అసలు ఇంత చిన్న కాలాన్ని మన ఋషులు లెక్కించడమే ఆశ్చర్యం కదూ.


సూర్య సిద్ధాతం కాలాన్నివాస్తవికంగాను, వ్యవహారికంగానూ చెప్పింది. Virtual భాగాన్ని మూర్తం అని, Practical భాగాన్ని అమూర్తం అని చెప్పింది. ప్రాణం (ఊపిరి) పీల్చుకునే కాలంతో మొదలయ్యేది సత్యమని, తృటితో మొదలయ్యేది నిత్యజీవితంలో అవసరంలేనిదని చెప్పింది. 1 ప్రాణం అంటే, ఆరోగ్యవంతమైన మనిషి 1 సారి ఊపిరి పీల్చి విడువడానికి పట్టే సమయం లేదా గురువక్షరం అనే 10 అక్షరాలను పలికే సమయం.

🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹సశేషం

30నవంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

 *🌹30నవంబర్2025🌹*      

    *దృగ్గణిత పంచాంగం*                  


         *స్వస్తి శ్రీ విశ్వావసు*

         *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*


*తిథి  : దశమి* ‌రా 09.29 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : ఉత్తరాభాద్ర* రా 01.11 వరకు ఉపరి *రేవతి*

*యోగం : వజ్ర* ఉ 07.12 *సిద్ధి* రా.తె 04.22 ఉపరి *వ్యతీపాత*

*కరణం  : తైతుల* ఉ 10.27 *గరజి* రా 09.29 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 మ 02.00 - 04.00* 

అమృత కాలం  : *రా 08.37 - 10.08*

అభిజిత్ కాలం  : *ప 11.34 - 12.19*

*వర్జ్యం    : ప 11.30 - 01.01*

*దుర్ముహూర్తం  : సా 04.03 - 04.48*

*రాహు కాలం   : సా 04.09 - 05.33*

గుళికకాళం      : *మ 02.44 - 04.08*

యమగండం    : *ప 11.56 - 01.20*

సూర్యరాశి : *వృశ్చికం*                  

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 06.30*

సూర్యాస్తమయం :*సా 05.40*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.19 - 08.34*

సంగవ కాలం         :     *08.34 - 10.49*

మధ్యాహ్న కాలం    :    *10.49 - 01.03*

అపరాహ్న కాలం    : *మ 01.03 - 03.18*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర శుద్ధ దశమి*

సాయంకాలం        :  *సా 03.18 - 05.33*

ప్రదోష కాలం         :  *సా 05.33 - 08.06*

రాత్రి కాలం           :*రా 08.06 - 11.31*

నిశీధి కాలం          :*రా 11.31 - 12.22*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.38 - 05.29*

*****************************

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


        *అరుణాయ నమః*

        *సూర్యాయ నమః*

         *ఇంద్రాయ నమః*

          *రవయే నమః*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసిం*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

 *🌹30నవంబర్2025🌹*      

    *దృగ్గణిత పంచాంగం*                  


         *స్వస్తి శ్రీ విశ్వావసు*

         *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*


*తిథి  : దశమి* ‌రా 09.29 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : ఉత్తరాభాద్ర* రా 01.11 వరకు ఉపరి *రేవతి*

*యోగం : వజ్ర* ఉ 07.12 *సిద్ధి* రా.తె 04.22 ఉపరి *వ్యతీపాత*

*కరణం  : తైతుల* ఉ 10.27 *గరజి* రా 09.29 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 మ 02.00 - 04.00* 

అమృత కాలం  : *రా 08.37 - 10.08*

అభిజిత్ కాలం  : *ప 11.34 - 12.19*

*వర్జ్యం    : ప 11.30 - 01.01*

*దుర్ముహూర్తం  : సా 04.03 - 04.48*

*రాహు కాలం   : సా 04.09 - 05.33*

గుళికకాళం      : *మ 02.44 - 04.08*

యమగండం    : *ప 11.56 - 01.20*

సూర్యరాశి : *వృశ్చికం*                  

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 06.30*

సూర్యాస్తమయం :*సా 05.40*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.19 - 08.34*

సంగవ కాలం         :     *08.34 - 10.49*

మధ్యాహ్న కాలం    :    *10.49 - 01.03*

అపరాహ్న కాలం    : *మ 01.03 - 03.18*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర శుద్ధ దశమి*

సాయంకాలం        :  *సా 03.18 - 05.33*

ప్రదోష కాలం         :  *సా 05.33 - 08.06*

రాత్రి కాలం           :*రా 08.06 - 11.31*

నిశీధి కాలం          :*రా 11.31 - 12.22*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.38 - 05.29*

*****************************

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


        *అరుణాయ నమః*

        *సూర్యాయ నమః*

         *ఇంద్రాయ నమః*

          *రవయే నమః*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసిం🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

 *🌞ఆదివారం 30 నవంబర్ 2025🌞*


        `` *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                    6️⃣0️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


      *సంపూర్ణ మహాభారతము*         

              *60 వ రోజు*                    


*మాయా జూదానికి నాంది*```


దుర్యోధనుడు శకునితో 

ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. కుమారుడు కృశించి పోతున్నాడని విని ధృతరాష్ట్రుడు  చింతించాడు. “నాయనా సుయోధనా! కౌరవ సంపదనంతా నీకు ఇచ్చాను కదా. దేవేంద్రునితో సమానమైన భోగభాగ్యాలు నీకు ఉన్నాయి కదా. నీవిలా కృశించడం ఎందుకు?" అని అడిగాడు. 

“తండ్రీ! పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని కంటే గొప్పది. వారి కీర్తి నలుదిశలా వ్యాపించింది. వారితో పోల్చడానికి మూడు లోకాలలోని రాజులు సరిపోరు. హరిశ్చంద్రుడు  చేసిన రాజసూయయాగం కంటే పాండవులు చేసిన రాజసూయ యాగం గొప్పది. సామంతుల వలన అశేషరత్నాభరణాలు కప్పంగా పొందారు. 

ధర్మరాజుకు సాత్యకి 

ముత్యాల ఛత్రం పట్టాడు. భీముడు  చామరం వీచాడు. రాజులందరి చేత శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మొక్కించాడు. సాటి రాజ కుమారుడుగా నేనిది సహించలేను” అన్నాడు. 


శకుని దుర్యోధనునితో “ధర్మరాజు జూద ప్రియుడు. అందులో కపటం తెలియని వాడు. నేను అక్షవిద్యలో నేర్పరిని. జూదంలో 

ధర్మరాజుని అక్రమంగా ఓడించి అతని సంపద అంతా సుయోధనుని హస్తగతం చేస్తాను” అన్నాడు. 


సుయోధనుడు సంతోషించి “తండ్రీ! ఇందుకు మీరు అంగీకరించండి” అన్నాడు. 


ధృతరాష్ట్రుడు “విదురుడు చాలా దూర దృష్టి కలవాడు. నీతి కోవిదుడు. మీ ఇరువురి క్షేమం కోరేవాడు. అతనితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము” అని అన్నాడు. 


దుర్యోధనుడు “తండ్రీ విదురుడు  పాండవ పక్షపాతి. అతడు ఇందుకు అంగీకరించడు. మీరు అంగీకరించనిచో నేను అగ్ని ప్రవేశం చేస్తాను. మీరు, విదురుడు సంతోషంగా ఉండండి” అన్నాడు. 


జూదం తగదని సంశయిస్తూనే  ధృతరాష్ట్రుడు కుమారుని సంతోషపెట్టడానికి సభానిర్మాణానికి ఏర్పాట్లు చెయ్యమని చెప్పాడు. ఒక నాడు విదురునితో సుయోధనుని అభిప్రాయం చెప్పాడు. విదురుడు 

“ఇందుకు నేను అంగీకరించను. పాండవులకు,కౌరవులకు విరోధం కలగడానికి పునాది వెయ్యద్దు. ఎంతటి శాంత స్వభావులకైనా జూదం విరోధం కలిగిస్తుంది. పాండవులు కౌరవులు కలసి ఉండేలా ఏర్పాటు చెయ్యి” అన్నాడు. 


ధృతరాష్ట్రుడు “విదురా! నీవు అనవసరంగా అనుమానపడవద్దు. మీరు, భీష్ముడు ఉండగా అన్నదమ్ముల మధ్య విరోధం ఎందుకు వస్తుంది. కనుక నీవు ఈ జూదానికి అంగీకరించి ఇంద్రప్రస్థానికి వెళ్ళి పాండవులను జూదానికి తీసుకురా!” అన్నాడు. 


ధృతరాష్ట్రుడు “దుర్యోధనా! ఈ జూదం వలన మీకు విరోధం వస్తుంది మీ విరోధం భూమి మీద ప్రజలందరికి కీడు చేస్తుంది. విదురునికి ఇందులో అంగీకారం లేదు. నీకు సంపద కావాలంటే నీవు కూడా యాగం చెయ్యి. 

మీరిద్దరూ రాజ్యాన్ని పాలించండి.” అన్నాడు. 


దుర్యోధనుడు "మహారాజా! ధర్మరాజు జూదం ఆడుతుండగా చూడటం ఒక యజ్ఞం. నేను సకలైశ్వర్యములు పొందడానికి అది మార్గం. శత్రువుల అభివృద్ధిని ఉపేక్షించిన మనలను అది నాశనం చేస్తుంది. పాండవుల ఐశ్వైర్యాన్ని కొల్లగొడితే కాని నాకు ఉపశమనం లేదు" అన్నాడు. 


వెంటనే శకుని “సుయోధనా! ఎలాంటి సైన్యం లేకుండా యుద్ధం రక్త పాతం లేకుండా పాచికలాడించి పాండవ రాజ్యలక్ష్మిని నీకు ఇస్తాను. జూదం కాక వేరు ఏ విధంగానూ పాండవులను జయించడం ఎవరి తరం కాదు" అన్నాడు. 


ధృతరాష్ట్రుని మనసు జూదానికి అంగీకరించలేదు. “మీరు ఎన్ని చెప్పినా నేను వినను. విదురుడు  జూదం అనర్ధ హేతువని చెప్పాడు. అతడు నీతి కోవిదుడు. నేను అతని మాట మీరను. జూదం వదిలి ఎప్పటిలా ఉండు" అని దుర్యోధనునితో అన్నాడు. 


దుర్యోధనుడు “తండ్రీ! విదురుడు  పాండవ పక్షపాతి అతడు మనకు ఆప్తుడు కాడు. జూదం పురాణంలో ఉంది. స్నేహంతో ఆడుకునే జూదం హాని కాదు. కనుక శకునితో జూదం ఆడటానికి అనుమతి ఇవ్వండి” అన్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏హా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹హా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

సంపూర్ణ మహాభారతము*

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🍁శనివారం 29 నవంబర్ 2025🍁*


`` *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                            5️⃣9️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


         *సంపూర్ణ మహాభారతము*       

            *59వ రోజు*                    

```

అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి “మేము ప్రాగ్జ్యోతిషపురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు  ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు  అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించాను. ఇతడు నాకు పరమ శత్రువు అయ్యాడు.” అన్నాడు.  


శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి “నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నావా?”అని దూషించాడు.


ఇక శ్రీకృష్ణుడు సహించలేక పోయాడు. తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని ఛేదిదేశానికి రాజుని చేసాడు. 

శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తి అయింది.```


*రాజసూయయాగం అనంతర విశేషాలు*```


ధర్మరాజు రాజసూయానికి విచ్చేసిన దేవతలను, గురువులను, బ్రాహ్మణులను తగు రీతిని సత్కరించి తృప్తిపరిచాడు. ధర్మరాజు 

ఆజ్ఞ ప్రకారం భీమసేనుడు భీష్మ, దృతరాష్ట్రులను సాగనంపాడు. అలాగే అర్జునుడు  దృపదుని సాగనంపాడు. నకులుడు  శల్యుని,సుబలుని సాగనంపాడు.  సహదేవుడు ద్రోణ,కృప,

అశ్వత్థామలను సాగనంపాడు. 

శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు 

వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమయ్యాడు. 

పాడవులందరూ శ్రీకృష్ణుని సాగనంపారు. 

వ్యాసమహర్షి కూడా బయలు దేరుతూ శిష్యులతోగూడి ధర్మరాజు దగ్గరికి రాగా ధర్మరాజు

“పురుషోత్తమా!రాజసూయయాగమును చేయమన్న మా తండ్రిగారి సందేశాన్ని నారద మహర్షి తెలుపుతూ రాజసూయయాగము చేయడం వలన ఈ భూమండలంపై సర్వక్షత్రియ వినాశాకమైన ఉత్పాదం, యుద్ధం సంభవించే కారణమైన సంఘటన జరిగేఅవకాశం ఉన్నదన్నారు. శిశుపాలుడి వధతో ఆ ఉత్పాతాలు సమసి పోయినట్లేనా" అని అడిగాడు. 


అంత వ్యాస మహర్షి “నాయనా యుధిష్టిరా! మహోత్పాతాల ప్రభావం పదమూడేళ్లు ఉంటుంది. సర్వక్షత్రియ నాశము జరుగుతుంది. ఆ సమయం రాగానే నీ కారణంగా దుర్యోధనుడి అపరాధం వలన భీమార్జునుల పరాక్రమం ద్వారా భూమి మీది రాజులందరూ కలిసి పరస్పర యుద్దంలో నాశనం అవుతారు. ఇందుకు నిదర్శనంగా తెల్లవారు జామున స్వప్నంలో నీవు వృషభారూఢుడైన పరమశివుడు దక్షిణ దిక్కును చూస్తూ కనిపిస్తాడు. దాని గురుంచి చింతించకు. కాలం దాటరానిది. నీకు శుభమవుగాక. అప్రమత్తంగా ఉంటూ భూమిని పరిపాలించు” అని చెప్పి కైలాసపర్వతానికి వెళతాడు. 


ధర్మరాజు తమ్ములందరితో...

“వ్యాసమహర్షి నాతో చెప్పినది విన్నారు గదా. సర్వక్షత్రియ నాశనానికి విధి నన్ను కారణముగా చేయదలచుకుంటే నేను జీవించి ఉండటం వలన ప్రయోజనం ఏముంది? కాబట్టి నేను మరణించాలను కుంటున్నాను” అని తన నిశ్చయం తెలియజేయగా అంత అర్జునుడు “ఘోరమైన ఇటువంటి మోహమును పొందక, ధైర్యం వహించి ఏది మేలో అది ఆచరించు, మేము నిన్ను అనుసరిస్తాము” అన్నాడు. 


అంత ధర్మరాజు ”సోదరులను గాని, ఇతర రాజులనుగాని పరుషంగా మాట్లాడను. జ్ఞాతుల ఆజ్ఞను పాటిస్తూ భేదభావం రాకుండా, విరోధం రాకుండా అడిగినవి ఇస్తూ, చెప్పినవి చేస్తూవుంటాను” అని ప్రతిజ్ఞ చేయగా తమ్ముళ్ళందరూ అందుకు సమ్మతించారు. 


మయసభ విశేషాలు చూడటానికి  శకుని,దుర్యోధనుడు 

ఇంద్రప్రస్థంలో ఉన్నారు. 

ఒక రోజు సుయోధనుడు ఒంటరిగా మయసభను చూడటానికి వెళ్ళాడు. దాని అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. దుర్యోధనుడు మయసభను చూసే సమయంలో అక్కడక్కడా భంగపడ్డాడు. తెరచిన ద్వారం మూసి ఉన్నట్లు గానూ, మూసిన ద్వారం తెరచినది గాను భ్రమించి లలాటం కొట్టుకున్నాడు. నీరులేనిచోట ఉన్నదని, నీరు ఉన్న చోట లేదు అని భ్రమపడి దిగి దుస్తులు తడుపుకున్నాడు. అతని అవస్థచూసి ధర్మరాజు

సుయోధనునికి నూతన వస్త్రాలు ఇచ్చాడు. కానీ దుర్యోధనుడు అది తనకు జరిగిన అవమానంగా భావించి రోషపడ్డాడు. హస్థినకు బయలుదేరాడు. మయసభా విభవం పాండవుల వైభవం అతనిలో అసూయా అగ్నిజ్వాలలా రగిలించింది. 

దుర్యోధనుడు అసూయతో రోజురోజుకు కృశించి పోసాగాడు. శకుని ఇది గమనించి “సుయోధనా నీకు ఏమైంది?” అని అడిగాడు.  


దుర్యోధనుడు “మామా మయసభ చూసావు కదా. అంతటి మయసభ కలిగిన ధర్మరాజు ఎంతటి అదృష్టవంతుడు. ధర్మరాజు 

చక్రవర్తి అయ్యాడు. రాజులంతా ధర్మరాజుకు  అమూల్యమైన కప్పములు సమర్పించారు. శ్రీకృష్ణుడు 

శిశుపాలుని వధించినా రాజులు పొగిడారు కాని ఏమని అడగలేదు. పాండవుల ఐశ్వర్యం సహించరానిదిగా ఉంది. అభిమానధనుడు దాయాదుల వైభవాన్ని సహింపకలడా?” అని దు॰ఖించాడు. 


శకుని “సుయోధనా! దృతరాష్టృని అనుమతి పొంది నా మాట పాటిస్తే పాండవ లక్ష్మిని నీకు చెందేలా చేస్తాను" అన్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🍁శనివారం 29 నవంబర్ 2025🍁*


`` *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                            5️⃣9️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


         *సంపూర్ణ మహాభారతము*       

            *59వ రోజు*                    

```

అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి “మేము ప్రాగ్జ్యోతిషపురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు  ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు  అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించాను. ఇతడు నాకు పరమ శత్రువు అయ్యాడు.” అన్నాడు.  


శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి “నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నావా?”అని దూషించాడు.


ఇక శ్రీకృష్ణుడు సహించలేక పోయాడు. తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని ఛేదిదేశానికి రాజుని చేసాడు. 

శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తి అయింది.```


*రాజసూయయాగం అనంతర విశేషాలు*```


ధర్మరాజు రాజసూయానికి విచ్చేసిన దేవతలను, గురువులను, బ్రాహ్మణులను తగు రీతిని సత్కరించి తృప్తిపరిచాడు. ధర్మరాజు 

ఆజ్ఞ ప్రకారం భీమసేనుడు భీష్మ, దృతరాష్ట్రులను సాగనంపాడు. అలాగే అర్జునుడు  దృపదుని సాగనంపాడు. నకులుడు  శల్యుని,సుబలుని సాగనంపాడు.  సహదేవుడు ద్రోణ,కృప,

అశ్వత్థామలను సాగనంపాడు. 

శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు 

వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమయ్యాడు. 

పాడవులందరూ శ్రీకృష్ణుని సాగనంపారు. 

వ్యాసమహర్షి కూడా బయలు దేరుతూ శిష్యులతోగూడి ధర్మరాజు దగ్గరికి రాగా ధర్మరాజు

“పురుషోత్తమా!రాజసూయయాగమును చేయమన్న మా తండ్రిగారి సందేశాన్ని నారద మహర్షి తెలుపుతూ రాజసూయయాగము చేయడం వలన ఈ భూమండలంపై సర్వక్షత్రియ వినాశాకమైన ఉత్పాదం, యుద్ధం సంభవించే కారణమైన సంఘటన జరిగేఅవకాశం ఉన్నదన్నారు. శిశుపాలుడి వధతో ఆ ఉత్పాతాలు సమసి పోయినట్లేనా" అని అడిగాడు. 


అంత వ్యాస మహర్షి “నాయనా యుధిష్టిరా! మహోత్పాతాల ప్రభావం పదమూడేళ్లు ఉంటుంది. సర్వక్షత్రియ నాశము జరుగుతుంది. ఆ సమయం రాగానే నీ కారణంగా దుర్యోధనుడి అపరాధం వలన భీమార్జునుల పరాక్రమం ద్వారా భూమి మీది రాజులందరూ కలిసి పరస్పర యుద్దంలో నాశనం అవుతారు. ఇందుకు నిదర్శనంగా తెల్లవారు జామున స్వప్నంలో నీవు వృషభారూఢుడైన పరమశివుడు దక్షిణ దిక్కును చూస్తూ కనిపిస్తాడు. దాని గురుంచి చింతించకు. కాలం దాటరానిది. నీకు శుభమవుగాక. అప్రమత్తంగా ఉంటూ భూమిని పరిపాలించు” అని చెప్పి కైలాసపర్వతానికి వెళతాడు. 


ధర్మరాజు తమ్ములందరితో...

“వ్యాసమహర్షి నాతో చెప్పినది విన్నారు గదా. సర్వక్షత్రియ నాశనానికి విధి నన్ను కారణముగా చేయదలచుకుంటే నేను జీవించి ఉండటం వలన ప్రయోజనం ఏముంది? కాబట్టి నేను మరణించాలను కుంటున్నాను” అని తన నిశ్చయం తెలియజేయగా అంత అర్జునుడు “ఘోరమైన ఇటువంటి మోహమును పొందక, ధైర్యం వహించి ఏది మేలో అది ఆచరించు, మేము నిన్ను అనుసరిస్తాము” అన్నాడు. 


అంత ధర్మరాజు ”సోదరులను గాని, ఇతర రాజులనుగాని పరుషంగా మాట్లాడను. జ్ఞాతుల ఆజ్ఞను పాటిస్తూ భేదభావం రాకుండా, విరోధం రాకుండా అడిగినవి ఇస్తూ, చెప్పినవి చేస్తూవుంటాను” అని ప్రతిజ్ఞ చేయగా తమ్ముళ్ళందరూ అందుకు సమ్మతించారు. 


మయసభ విశేషాలు చూడటానికి  శకుని,దుర్యోధనుడు 

ఇంద్రప్రస్థంలో ఉన్నారు. 

ఒక రోజు సుయోధనుడు ఒంటరిగా మయసభను చూడటానికి వెళ్ళాడు. దాని అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. దుర్యోధనుడు మయసభను చూసే సమయంలో అక్కడక్కడా భంగపడ్డాడు. తెరచిన ద్వారం మూసి ఉన్నట్లు గానూ, మూసిన ద్వారం తెరచినది గాను భ్రమించి లలాటం కొట్టుకున్నాడు. నీరులేనిచోట ఉన్నదని, నీరు ఉన్న చోట లేదు అని భ్రమపడి దిగి దుస్తులు తడుపుకున్నాడు. అతని అవస్థచూసి ధర్మరాజు

సుయోధనునికి నూతన వస్త్రాలు ఇచ్చాడు. కానీ దుర్యోధనుడు అది తనకు జరిగిన అవమానంగా భావించి రోషపడ్డాడు. హస్థినకు బయలుదేరాడు. మయసభా విభవం పాండవుల వైభవం అతనిలో అసూయా అగ్నిజ్వాలలా రగిలించింది. 

దుర్యోధనుడు అసూయతో రోజురోజుకు కృశించి పోసాగాడు. శకుని ఇది గమనించి “సుయోధనా నీకు ఏమైంది?” అని అడిగాడు.  


దుర్యోధనుడు “మామా మయసభ చూసావు కదా. అంతటి మయసభ కలిగిన ధర్మరాజు ఎంతటి అదృష్టవంతుడు. ధర్మరాజు 

చక్రవర్తి అయ్యాడు. రాజులంతా ధర్మరాజుకు  అమూల్యమైన కప్పములు సమర్పించారు. శ్రీకృష్ణుడు 

శిశుపాలుని వధించినా రాజులు పొగిడారు కాని ఏమని అడగలేదు. పాండవుల ఐశ్వర్యం సహించరానిదిగా ఉంది. అభిమానధనుడు దాయాదుల వైభవాన్ని సహింపకలడా?” అని దు॰ఖించాడు. 


శకుని “సుయోధనా! దృతరాష్టృని అనుమతి పొంది నా మాట పాటిస్తే పాండవ లక్ష్మిని నీకు చెందేలా చేస్తాను" అన్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ఉచితాలకి ఇక చెల్లుచీటీ...

  🌹🌹🌹


*ఉచితాలకి ఇక చెల్లుచీటీ... కోర్టుల జోక్యం...ఊపిరి తీసుకుంటున్న సామాన్య ఉద్యోగులు...ఇక చదవండి.👌*

*తమిళనాడు (హైకోర్టు)*


ఇక చదవండి...🙏


_*ఉచిత పథకాలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం.*_

*మీ వల్లే బద్ధకం.. కొన్నాళ్లైతే అన్నం వండి తినిపిస్తారేమో.*

*- కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశo...*

★ మా పార్టీని గెలిపిస్తే ఇంటికో వాషిన్ మెషీన్..! నన్ను గెలిపిస్తే మహిళలకు ఉచితంగా బంగారం ఇస్తాం..! మా అభ్యర్థిని సీఎం చేస్తే ప్రతి ఇంటికీ నెలకు రూ.10 వేలు..! ఎన్నికల్లో ఇలాంటి ఉచిత హామీలు ఎక్కువయ్యాయి. 

★ ఏ పార్టీ మెనిఫెస్టో చూసినా ఉచితాలే దర్శనమిస్తాయి. 

★ ఇక తమిళనాడులో అయితే లెక్కే లేదు. 

★ ఉచిత టీవీ, ఉచిత ఏసీ, ఉచిత సైకిల్, ఉచిత బైక్, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ఉచిత కేబుల్ కనెక్షన్.. ఇలా ఒక్కటా రెండా.. అక్కడ అన్నీ ఉచితాలే. 

★ ఈ ఉచిత హామీలపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. 

★ ఉచిత పథకాలతో ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నారని.. ఏ పనీ చేయకుండా తయారు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది.

★ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీ ప్రకటించిన ఉచిత హామీలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.

★ ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్యా వైద్యారంగ అభివృద్ధి, రవాణా, వ్యవసాయ రంగాలను పక్కనబెట్టి.. ఉచిత హామీలపైనే అభ్యర్థులు ఫోకస్ పెడుతున్నారని పిటిషన్ వాదించారు. 

★ వీటికి కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

★ దానిపై విచారించిన జస్టిన్ ఎన్.కిరుబకరన్, జస్టిస్ బి.పుగలెంతినేతృత్వంలోని ధర్మాసనం.

★ ఉచిత పథకాలను తీవ్రంగా తప్పుబట్టింది. 

★ ఉచిత పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులుగా మారుతున్నారని అభిప్రాయపడింది. 

★ ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు తక్కువలో తక్కువ రూ.20 కోట్లు ఖర్చుపెడుతున్నారని.. బిర్యానీ, బీరు కోసం ఓటువేస్తే, మీ నాయకుడిని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఎక్కడుంటుందని ప్రశ్నించింది.

★ ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజలకుందని స్పష్టం చేసింది. 

★ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉచిత కలర్ టీవీలు, ఫ్యాన్స్, మిక్సర్ గ్రైండర్లు, ల్యాప్‌టాప్‌లు.. వంటి హామీలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

★ అన్నాడీఎంకే పార్టీ ఉచిత వాషింగ్ మెషీన్ హామీ కూడా ఇచ్చింది.

★ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మహిళలకు రేషన్ కోసం ఆర్థిక సాయం చేస్తాయని కూడా ప్రకటించాయి. 

★ ఐతే ఈ ఉచిత హామీల సంప్రదాయం కొనసాగడం ప్రజలకు ఎంత మాత్రమూ మంచిది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. 

★ రానున్న రోజుల్లో అన్నం కూడా వండి తినిపిస్తారేమోనని సెటైర్లు వేసింది. 

★ ఉచిత హామీలను అవినీతి వ్యవహారంగా పరిగణించాల్సిన అవసరం ఉందని..

★ వీటి వలన ఓటర్లు ప్రభావితమవుతున్నారని అభిప్రాయపడింది. 


★ ఉచిత పథకాల వలన తమిళ ప్రజలు బద్ధకస్తులుగా మారిపోయారని.. అందుకే హోటళ్లు, సెలూన్‌లు, చివరకు పొలాల్లో పనిచేసేందుకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని మద్రాస్ హైకోర్టు కోర్టు తెలిపింది. 


★ రానున్న రోజుల్లో ఇక్కడి స్థిర, చరాస్తులకు వలస కార్మికులే యజమానులుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. 


★ ఉచిత పథకాలకు సంబంధించి పిటిషనర్ పేర్కొన్న 20 ప్రశ్నలకు కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. 


*ఉచిత హామీలకు అడ్డుకట్ట వేసే దిశగా ఎలాంటి చర్యలు చేపడతారో ఏప్రిల్ 26 లోగా చెప్పాలని స్పష్టం చేసింది.*..®✓

హిందూ ధర్మం

 🌹హిందూ ధర్మం 🌹


ఇంతకి ఈ 14 లోకాలు ఎక్కడ ఉన్నాయి? వాటి లోకవాసులు ఎలా ఉంటారు? వారు సాధారణ మనుష్యులేనా? లేక దివ్యలోకాలకు చెందినవారా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఈ ప్రశ్నలకు నాస్తిక కోణం నుంచి సమాధానాలు వెతికితే, అది అర్ధ సమాచారంతో ముగుస్తుంది, అవగాహనారాహిత్యన్ని బయటపెడుతుంది. మనకు 3 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి శాస్త్రప్రమాణం, రెండవది ఆప్తప్రమాణం, మూడవది ఆత్మప్రమాణం. శాస్త్రమనగా వేదాది శాస్త్రాలు, ఆప్తులు అంటే ధర్మం మేలు కోరేవారు; భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య, త్రైలింగ స్వామి మొదలైనవారు; ఆత్మప్రమాణం అంటే వ్యక్తి యొక్క అనూభూతి/ దివ్యానుభవం. ఆత్మప్రమాణాన్ని ఆప్తప్రమాణం, శాస్త్రప్రమాణంతో పోల్చి చూసి, అప్పుడే నిర్ధారణకు రావాలి. శాస్త్రకారుల దృష్టి, జ్ఞానం, అనుభవం మనకు లేకపోవచ్చు, కనుక మలిన, సంకుచిత బుద్ధితో వీటికి అర్ధా లను చెప్పి అసలు విషయాన్ని పక్కదారి పట్టించకూడదు.


దేవ- అనే పదం ద్యు లేదా ద్యౌ అనే అక్షరం నుంచి వచ్చింది. ద్యౌ అంటే కాంతిగల లోకం. దేవతలు అంటే కాంతి శరీరం కలిగినవారు. వారివి మనలాంటి పాంచభౌతిక దేహాలు కాదు, రక్తమాంసాలతో నిండిన దేహాలు కావు, అవి దివ్యశరీరాలు. వారు కాంతి శరీరులు. అందుకే దేవతలు ప్రత్యక్షం అయ్యారని అంటాము, అంటే కళ్ళముందు కనిపించడం; అదృశ్యం అయ్యారు అంటాము- దృశ్యం అంటే కనిపించేది, కనిపించకుండా పోవటం అదృశ్యం. అంటే తమను వ్యక్తం చేసుకున్న దేవతలు తిరిగి అవ్యక్తమవ్వడం అన్నమాట. అలాగే పితృదేవతలు - మరణించిన మన కుటుంబాలకు చెందినవారు. వీరు కూడా భౌతిక దేహాన్ని కోల్పోయి, పితృలోకానికి చెందిన శరీరాన్ని పొందినవారే. దేవత అంటే ఇచ్చుటకు శక్తి కలిగి ఉన్నది అని అర్దం. పితరులు ఆశీస్సులు నిత్యజీవితంలో ఎంతో అవసరం. అలాగే ఇంద్రాది దేవతలవి కూడా. వారు మనకు ఎన్నో విధాలుగా సాయం చేస్తారు. వరాలను ఇస్తారు. అందుకే దేవతలు అన్నారు. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లల వృద్ధికి కారణమవుతుంది కనుక వారిని దేవతలుగా భావించమని వేదం చెప్పింది. ఇంద్రుడు, అగ్ని, ఆదిత్యుడు, యక్షులు, గంధర్వులకు పునర్జన్మ ఉంది. అయితే పరంబ్రహ్మ/ పరమాత్మ- ఈ దేవతలకంటే పైస్థాయివాడు. మనం పూజించే శివ, శక్తి, విష్ణు, గణేశ మొదలైన స్వరూపాలు ఈ పరబ్రహ్మం యొక్క ప్రతిబింబాలు.


ఇప్పుడు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నిజదేవుడిని పూజించండి, మా ద్యాముడు మాత్రమే నిజదేవుడు, అల్లాహ్ నే అసలు దేవుడు, హిందూ దేవీదేవతలు సైతాన్లు అంటూ మతమార్పిడి మూకలు ప్రచారం చేస్తున్నాయి. దేవత (తెలుగులో దేవుడు) అనేది సంస్కృతపదం. అది ఎవరికి వాడాలో కూడా శాస్త్రమే చెప్పింది. ఈ అన్యమతస్తులు చెప్పిన దేవుడికి రూపంలేదు, అది కాంతిశరీరం కలదని, దివ్యశరీరం కలదని వాళ్ళ గ్రంథాలు చెప్పలేదు. ఉంటే అలా ఎక్కడుందో reference చూపించమని అడగాలి. అసలు శరీరం ఉందని చెప్పడమే నింద అని చెప్పాయి. కానీ వాళ్ళేమో నిజదేవుడంటారు- ఈ దేవుడు అనే పదం వాళ్ళు వాడటం ఆయా గ్రంథాలను అపహాస్యం చేయడం, వాళ్ళ గాడ్‌ (God) కు ఈ పదాన్ని హిందువులు ఉపయోగించటం సనాతనధర్మాన్ని అవమానించటమే అవుతుంది. ఇది మనం గమనించాలి. వారు వాడకూడదని తెలియజేయాలి. 

అలాగే యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన ఇతర లోకవాసుల గురించి, సూర్యమండలం, చంద్రమండల వాసుల గురించి పురాణాలు చెబుతున్నాయి. వీరి ఎక్కడ ఉన్నట్లు? వీరిని మానవులుగా, కొండజాతి వారిగా భావించకూడదు. యక్షులు, గంధరువులు మొదలైన వారితో సంభాషించిన మహాత్ములు, సిద్ధులు ఈ భూమి మీద తిరిగారు. వారి చరిత్రలు మనలో పేరుకుపోయిన ఎన్నో సందేహాలను, అపార్ధాలను తొలగిస్తాయి. యక్షులు, గంధర్వులు మొదలైనవారు కామరూపధారులు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. వీరు చెడ్డవారు అనే అభిప్రాయం చాలామంది చెప్తారు. కానీ వాస్తవంలో చక్కని జ్ఞానం, లోకహితం కోరే యక్షులు అనేకమంది ఉన్నారు. భగవంతుడు వీరిని కొన్ని అరణ్యాలకు రాజులుగా నియమించాడు. ఆయుర్వేద మూలికలపై వీరి ఆధిపత్యం ఉంటుంది. సంపదల కోసం లోకులంతా పూజించే కుబేరుడు యక్షరాజు. కొన్ని పురాతన ఆలయాలను నిర్మించినప్పుడు, ఆ ఆగమంలో భాగంగా ఆ ఆలయసంపదలకు రక్షకులుగా యక్షులను నియమించడం కనిపిస్తుంది. ఆలయ గోడలపై రకరకాల రూపాలు చెక్కి ఉండటం మనం చూస్తుంటాము. అందులో కొన్ని యక్షులవి ఉంటాయి. వారు ఆ ఆలయానికి రక్షకులుగా ఉంటారు. 

ఆలయ సంపదను, హుండీ డబ్బును ప్రభుత్వం తీసుకుని ప్రజల కోసం ఉపయోగించాలి. దేవాలయంలో స్వామికి అర్పించిన బంగారాన్ని ప్రభుత్వం కరిగించి తాకట్టు పెట్టాలి; ఇలాంటి మాటలు అప్పుడప్పుడూ వింటూ ఉంటాము. గుప్తనిధుల కోసం దేవాలయంలో తవ్వకాలు జరపడం చూస్తుంటాము... ఇలాంటి మాటలు మాట్లాడేవారిని, నిధుల కోసం ఎగబడేవారిని యక్షులు శిక్షిస్తారు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకుండా, పనులు చేయకుండా జాగ్రత్తపడండి. యక్షులకు దైవభక్తి ఉంటుంది. మనం వృక్షాల చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. అప్పుడు మనకు తగిన ఫలితం ఇచ్చేది ఎవరు?.... యక్షిణీదేవతయే ఆ చెట్టు మీద ఉండి, మన ప్రదక్షిణకు తగిన ఫలితం ఇస్తుందని తంత్రగ్రంథాల్లో శివపార్వతుల సంవాదంలో కనిపిస్తుంది. అనగా వీరు దివ్యశరీరం కలవారని స్పష్టమవుతోంది. దేవలోక గాయకులు గంధర్వులు. వీరు కూడా దివ్యశరీరులు. వీరికి దైవభక్తి అధికం, పరమాత్మను ఉద్దేశించి వీరు చేసే గానాలకు గంధర్వవేదం అనే ప్రత్యేక వేదం కలిగి ఉన్నారు. అహోబిలంలో ఛత్రవట నృసింహస్వామి వారి సన్నిధిలో హాహా, హూహూ అనే పేరుగల గంధర్వులు గానం చేశారు. అప్పుడు స్వామి వారి గానానికి మైమరిచి, తాళం వేశారు. అహోబిలంలో ఛత్రవట నృసింహస్వామి వారి మూలవిరాట్టు స్వయంభూః. అక్కడ స్వామి రూపం కూడా తాళం వేస్తున్నట్లుగానే ఉంటుంది. 


అహోబిలం, మాల్యాద్రి, అరుణాచలం, శేషాచలం (తిరుమల), శ్రీశైలం, పశ్చిమ కనుమూల్లో కొన్ని ప్రదేశాలు.... ఇలా అనేక పవిత్ర స్థలాల్లో యక్షులు, సిద్ధులు, గంధర్వులు మొదలైన ఇతరలోక జీవులు ఈనాటికీ తపస్సు చేసుకుంటున్నారు. అలాగే కొందరు ఋషుల జీవిత చరిత్రలను గమనించినప్పుడు, వారు తపస్సు చేసుకోవడం కోసం, దేవకార్యం కోసం భూలోకనికి వచ్చారాని చెప్పబడి ఉంటుంది. ఆ కార్యం పూర్తవ్వగానే తిరిగి దివ్యలోకాలకు వెళ్ళిపోయారని కనిపిస్తుంది. అంటే మనకు కనిపించే ఈ లోకం కాక మరెన్నో లోకాలు ఉన్నాయని ఆప్తుల ద్వారా, గురువుల ద్వారా స్పష్టమవుతోంది.

🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

పంచాంగం

 


29, నవంబర్ 2025, శనివారం

పిల్లనగ్రోవి కధ!

  పిల్లనగ్రోవి కధ!

.

అనగనగా అవి సీతారాముల వనవాసపు రోజులు. సీతమ్మవారొక రోజు చెరువులో జలకాలు ఆడుతున్నదట. స్నానం కానిచ్చి ఒడ్డుకి వచ్చి పర్ణశాలకి దారి తీస్తుండగా, దార్లో ఓ ముల్లు ఆవిడ కాల్లో గుచ్చుకుందట. బహు సుకుమారి. కళ్లంట జివ్వున నీళ్ళు చిప్పిల్లాయి.

అల్లంత దూరాన ఉన్న రాముల వారిని " స్వామీ..!" అని పిలిచి, పక్కనే ఉన్న రాయి మీద కూర్చుండిపోయిందట.

పరుగున వచ్చిన రాముల వారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి మొహాన్ని చూసి కంగారు పడ్డారట.

ఇంకొకింత ఎర్రగా కందిన అరికాలిని చూసి బెంబేలు చెందారట. ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా

ఆ ముల్లును బయటకు లాగి, సీత మొహం వైపు చూసారట.ముల్లు దిగిన కంటే పైకి లాగిన బాధ ఎక్కువగా ఉందేమో! జలజలా నీటి బొట్లు ఎర్రటి చెక్కిళ్ళ మీద జారిపోతుండగా "వచ్చేసిందా?" అన్నట్టు చూస్తోందట ఆయన వైపు.

ఏడు మల్లెలెత్తు రాకుమారిని అడవులంట తిప్పుతున్నానే అనే బాధలో అసలే మునిగి ఉన్నారేమో రాముల వారు, చేతిలో ఉన్న ముల్లు వైపు క్రోధంగా చూసారట.

అది చూపా? అనల బాణమా? ముల్లు భగ్గున మండి బూడిదైపోయిందట.

ఇదంతా చూస్తున్న సీతమ్మ వారు " అయ్యో, ఏలే దొరలే కినుక చూపితే ఇంక దిక్కెవరు ప్రాణులకు? మండుట అగ్ని లక్షణం. అలాగే గుచ్చుట ముల్లు లక్షణం. ఇంత పెద్ద శిక్షా ప్రభూ?" అని వాపోయిందట.

మహాత్ముల కోపం తాటాకు మంట కదూ! చప్పున చల్లారిన రామయ్య నొచ్చుకున్నాడు. బూడిదయిన ముల్లుని దయగా చూసాడు. కాల్చిన చూపే కరుణించి ఏం వరమిచ్చిందయ్యా ముల్లుకి అంటే.. మరుజన్మలో వెదురై పుట్టి కృష్ణుడి చేతిలో పిల్లనగ్రోవి అయిందట. సంతోషంతో మధురంగా మ్రోగిందిట.🌹🌹🌹

28, నవంబర్ 2025, శుక్రవారం

మదురై మీనాక్షిదేవి కోవెల..!!

మదురై మీనాక్షిదేవి కోవెల..!!

మీనాక్షి- మీనముల వంటి

కనులు కలిగినది మీనాలు నిద్ర పోవు. 


శక్తి రూపమైన మీనాక్షి దేవి తన కంటి రెప్పలు మూసుకున్న మరుక్షమణమే యీ అండ పిండ బ్రహ్మాండములోని చరా చరములు నశిస్తాయి. అటువంటి దుస్థితి యీ లోకానికి ఏర్పడకుండా వుండడం కోసమే మీనాక్షి దేవి కంటి రెప్ప మూయకుండా 

సకల ప్రపంచాన్ని కాపాడుతున్నది.

మదురై నగర అధిదేవత

మీనాక్షి దేవి . ఆదేవత రెప్ప వేయకుండా కాపాడుతుండడం వలనే, 

మదురై ప్రజలు రాత్రనక , 

పగలనక కష్టపడి పనిచేస్తారు.

మదురైని నిద్రపోని నగరంగా పిలుస్తారు. అత్యంత ఆశ్చర్య కరమైన

అధ్యాత్మికాద్భుతాలతో నిండి వున్న ఆలయంగా మదురై మీనాక్షి దేవి ఆలయం ప్రఖ్యాతి గాంచింది.

పది హేడు ఎకరాల స్ధలంలో ఈ బ్రహ్మాండమైన ఆలయం నిర్మించబడినది. ఈ ఆలయం ఆది కాలంలోనే ఇంద్రునిచే నిర్మించబడినది. 

వృత్తాసురుని వధించిన

ఇంద్రునికి బ్రహ్మ హత్యా

పాతకం చుట్టుకున్నది. ఆ దోషంనుండి విముక్తి పొందడానికి ఇంద్రుడు కదంబవనంగా వున్న యీ దివ్య స్ధలంలో వెలసిన స్వయంభూ సుందరేశ్వరుని పూజించి తరించాడు.

ఇంద్రుడే యీ దేవాలయాన్ని నిర్మించినట్లుగా 

తిరువిళయాడల్ పురాణం తెలియ పరుస్తోంది. మలయధ్వజుడనే మహారాజు సంతానం కోసం

పుత్రకామేష్టి యాగం చేశాడు. మలయధ్వజుడి భార్య అయిన కాంచనమాల అంబిక కి పరమ భక్తురాలు , పూర్వ జన్మలో అంబికనే తన పుత్రికగా కావాలని కోరుకుంది. ఆవిడ కోరికను తీర్చడానికి అంబిక ఆ యాగ గుండము 

నుండి మూడుసంవత్సరాల బాలికగా ఆవిర్భవించింది. 

అప్పుడు కాంచనమాలకి

పోయిన జన్మలో శ్యామలాంబిక తనకు యిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. వరప్రసాదంగా లభించిన ఆ పుత్రికకు శ్యామల అనే పేరుతో అపురూపంగా పెంచారు.

కొడుకేలేని కారణంగా ఆ పుత్రికనే పుత్రుడుగా భావించి, సకల శాస్త్రములు , విద్యలు

నేర్పించారు. ఆ బాలిక యవ్వనవతి అయినది.

తమ పుత్రిక అతిశయంగా మూడు వక్షోజాలుకలిగి వుండడం చూసిన కాంచనమాల దిగ్భ్రాంతి చెందినది.

భగవంతుడు ఇచ్చిన సంతానసంపద , అంబికే పుత్రికగా జన్మించినదని సంతోషిస్తున్త తరుణంలో యీ విపరీతం ఏమిటని భార్యా భర్తలుచింతిస్తూండగా 

ఒక అశరీరవాణి

వినిపించింది. " రాజా ! విచారించకండి, ఎప్పుడైతే మీ పుత్రిక తన కాబోయే భర్తని చూస్తుందో, అప్పుడు మూడవ స్ధనం మాయమై పోతుంది " అని పలికింది.

తమ చింత తీరినందుకుభార్యా భర్తలు ఇద్దరూసంతోషించారు.

మలయధ్వజుడు తన తదనంతరం మీనాక్షిని పాండ్య రాజ్యానికి

రాణిని చేశాడు. శ్యామల 

ఎంతో భాధ్యత గా కంటికి రెప్ప వేయకుండా తన ప్రజలను ,మదురై ని

కాపాడుతూ రాజ్యం చేసినందున , ఆమెను "మీనాక్షి" అనే పేరుతో ప్రజలంతా పిల్చుకోవడం మొదలుపెట్టారు. 

ఆ తరువాత శ్యామల అని పెట్టిన పేరు మీనాక్షి దేవిగా మారింది. మీనాక్షి స్త్రీయేయైనా ఎంతో దక్షతతో సమర్ధవంతంగా పురుషులకు సమానంగా , ప్రజా రంజకంగా రాజ్యపాలన చేసింది.

ఈ నాటికీ, తమిళనాడులో గృహిణి ఆధిక్యత వున్న ఇంటిని'మదురై' అని కీర్తించి చెప్తున్నారంటే, మీనాక్షి దేవి పరిపాలన ఎంత విశిష్టంగా వుండేదో అర్ధమవుతుంది.  

తల్లి తండ్రుల మరణానికి

ముందే, చాలా చిన్న వయసులోనే పాండ్యరాజ్యాన్నేలింది.

భూలోకంలోని రాజులెందరితోనో పోరాడి విజయం పొందింది.

దేవతలు కూడా మీనాక్షి శక్తిసామర్ధ్యాలకు తలవంచారు.

చివరికి దేవతల తరఫున

వచ్చిన ఈశ్వరుని కూడా మీనాక్షి ఎదిరించింది. శివుని చూడగానే ఆమె యొక్క మూడవ

స్ధనము మాయమైపోయింది.

మీనాక్షి సుందరేశ్వర రూపంలో వున్న పరమేశ్వరుడిని వరించింది.

తరువాత, మీనాక్షి సుందరేశ్వరుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 


మహారాజుగా సుందరేశ్వరుడు, మహారాణిగా మీనాక్షి అనుగ్రహించిన స్ధలమే మదురై.

ఈ సంఘటనలన్నీ దృశ్యాలు గాను అష్టశక్తి మండపంలో వర్ణచిత్రాలుగానూ చిత్రీకరించబడి వున్నాయి.

మదురై మీనాక్షి దేవాలయంలో 

ఆగమశాస్త్రముల ప్రకారం

అష్టకాలపూజలు జరుగుతాయి.

ప్రతి నెలా ఎన్నో రకాల ఉత్సవాలు

జరగడమే ఈ ఆలయ

ప్రత్యేకత. అందులో ముఖ్యంగా చెప్పబడేది చిత్తిర తిరువిళా. 

ఈ ఉత్సవం చైత్రమాసం శుక్లపక్షములోతొమ్మిది రోజులపాటు ఎంతో ఘనంగా జరుగుతుంది.

మొదటి రోజు ధ్వజారోహణ. 

తరువాత ప్రతి రోజూ 

మీనాక్షి, సుందరేశ్వరులను పలు వాహనాల మీద ఊరేగిస్తారు.

ఎనిమిదవ రోజు మీనాక్షీదేవి కి పట్టాభిషేకం. ఆ రోజు సాయంకాలం , అమ్మవారి సన్నిధిలోని ఉత్సవ విగ్రహానికి, పట్టు వస్త్రాలు ఆభరణాలు ధరింపచేస్తారు.

మహారాణులు ధరించే కిరీటాన్ని అలంకరిస్తారు. నివేదన చేసి పూజలు చేస్తారు. తరువాత , ఆలయ ధర్మ కర్తలు, అర్చకులు శివాచార్యులవారు 

సుందరేశ్వరుల సన్నిధికి

వెళతారు. 

స్వామి సన్నిధిలో ని నవరత్న ఖచితమైన రాజ దండాన్నిమేళ తాళాలతో , తీసుకుని వచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహం ముందు పెడతారు.

 ఇదే అమ్మ వారి పట్టాభిషేక మహోత్సవం. (ఆ రోజు నుండి, నాలుగు మాసాలు చైత్రం, వైశాఖం, 

జ్యేష్టం, ఆషాఢం మాసాలు మీనాక్షి దేవి పరిపాలనగా చెప్తారు.)

శ్రావణమాసం మూలా నక్షత్రం నాడు సుందరేశ్వరస్వామి పట్టాభిషేకం జరుపుతారు. 

అదే నెలలో తొమ్మిదవ రోజున మీనాక్షిసుందరేశ్వరుల

వివాహమహోత్సవాన్ని కన్నులపండువగా మహావైభవంగా జరుపుతారు.,

పంచాంగం

 


బలవంతుడిననో, ధనవంతుడిననో,

 నాకు యెదురు లేదు నరులందు ననబోకు

నాల్గు దినము లుండు నరుడు నీవు

మంచి పంచి బతుకు మదిలోన నిలిచేవు

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: ఓ మానవులారా! ఈ లోకంలో ఎవ్వరూ కూడా నేను చాలా బలవంతుడిననో, ధనవంతుడిననో, రాజకీయంగా, ఉద్యోగ పరంగా గొప్ప అధికార హోదా ఉందనో, మదమెక్కి, ఇతరులను హీనంగా తక్కువ చూపు చూస్తూ, కొవ్వెక్కిన మాటలాడుతూ ఉండకూడదు! ఈ భూమి మీద ఎవ్వరూ కూడా శాశ్వతంగా జీవించి ఉండిపోరు, అలాగే ఎప్పుడూ ఒకే విధంగా ఉండరు! ఒకరిని మించిన వారు ఒకరు వస్తూనే ఉంటారు, స్ధితులు, పరిస్థితులు మార్పుకు గురౌతూనే ఉంటాయి! మన డబ్బూ, పదవీ, అధికారం ఏ క్షణమైనా మన వదిలి పోవచ్చు! అలాగే ఎప్పుడు ఎవరము పోతామో ఎవరికీ తెలియదు! పోయేలోపు పదిమందితో మంచిగా ఉంటూ, మంచి పనులు చేస్తూ పోవాలి! మనం పోయాక మన కుటుంబానికి మంచి పేరుని, గౌరవాన్నీ ఇచ్చి పోవాలి! మనం మంచిగా పది మంది మనసులో నిలిచి పోవాలి! అంతే గానీ పదిమందిలో వెధవ అనిపించుకొని పోకూడదు! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(

27, నవంబర్ 2025, గురువారం

పక్షి ప్రకరణం*

 *పక్షి ప్రకరణం* 

               ➖➖➖✍️

 ```

శ్రీ TN శేషన్ గారు భారత దేశ ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆయన తన భార్యతో కలిసి పిక్నిక్ కోసం ఉత్తరప్రదేశ్‌లో ప్రయాణిస్తున్నారు. 


దారిలో పిచ్చుక గూళ్ళతో నిండి సందడిగా ఉన్న ఒక పెద్ద మామిడి తోటను వాళ్ళు చూశారు. 


వాటిని చూసి ముచ్చట పడిన శేషన్ గారి భార్య ఓ రెండు పిచ్చుక గూళ్ళను ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంది. 


ఆమె అడిగిందే తడవుగా, పొలాల్లో ఆవుల్ని మేపుతున్న ఒక బాలుడ్ని పోలీసుల ఎస్కార్ట్ పిలిచి, గూళ్ళను దించాలని డిమాండ్ చేశారు. 


పిచుక గూళ్ళను తీసినందుకు 10 రూపాయలు చెల్లిస్తామని ఆ పిల్లాడ్ని ఆశ పెట్టారు. 


కానీ ఆ బాలుడు అందుకు ససేమిరా అన్నాడు,

వారి ఆదేశాన్నినిరాకరించాడు. 


దీనితో మరి కొద్దిగా రేటు పెంచి 50 రూపాయలు ఇస్తామని శేషన్ బాలునితో అన్నారు.


శేషన్ పెద్ద అధికారి కావడంతో పోలీసులు బాలుడ్ని పిచ్చుక గూళ్ళు చెట్టు పైనుంచి దింపమని వత్తిడి చేయడం మొదలు పెట్టారు. ఒక దశలో వారి బలవంతపు ప్రయత్నం ఆదేశంలా మారిపోయింది. 


ఆ బాలుడు శేషన్, అతడి భార్యతో ఇలా అన్నాడు... “మీరు 50 రూపాయలే కాదు. ఎంత ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లోను పిచుక గూళ్ళను తీసి ఇవ్వలేను సాబ్ జీ! నాకు మీ పైసలు అక్కర్లేదు.” అంటూ ఎంతో ధీమాగా చెప్పాడు. 

అంతే కాకుండా “ఆ పిచుక గూళ్ళను తొలగిస్తే ఆ గూళ్ళ లోపల, పిచ్చుకల పిల్లలు ఉంటాయి, నేను మీకు ఆ గూళ్ళు ఇస్తే అందులో ఉన్న పిచుక పిల్లలు ఏమవుతాయి? అవెక్కడుంటాయి? అలాగే ఈ సాయంత్రం వాటి తల్లి పిచ్చుక తన పిల్లలకు ఆహారం తీసుకు వచ్చినప్పుడు తన పిల్లలు కనిపించకపోతే ఆ తల్లి ఎంతగా తల్లడిల్లిపోతుందో, ఏడుస్తుందో ఆలోచిస్తే నాకే కాదు మీలాంటి సదువుకున్న వాళ్లకు కూడా మాటలు రావు. ఇలాంటి పాపపు పనిచేసి ఇపుడు ఆ తల్లి పిచుకకు, 

ఇంటికెళ్లాక మా అమ్మకు నేను మొహం ఎలా చూపించగలను? ఆ పిచుక పిల్లల, తల్లి బాధ చూడటానికి నాకు గుండె ధైర్యం లేదు.”


ఇది విన్న శేషన్, అతని భార్య షాక్ అయ్యారు. 


‘నా స్థానం, హోదా, నా సర్వీసు, నా చదువు, నా IAS అన్నీ కూడా ఆ ఆవుల్ని కాస్తున్న బాలుని ముందు కరిగిపోయాయి’ అంటూ శేషన్ చెప్పారు. ‘నేను అతని ముందు ఈదురుగాలికి కొట్టుకుపోయే ఆవపిండిలా ఉన్నాను. ఆ బాలుడు నా కళ్ళు తెరిపించాడు. ఫలితంగా మా కోరికను వదులుకున్నాం. తిరిగి వచ్చిన తరువాత, ఈ సంఘటన మమ్మల్ని అపరాధభావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది.’ ‘విద్య యొక్క స్థానం, సాంఘికస్థితి మానవత్వం యొక్క కొలతకు ఎప్పుడూ గజ స్టిక్ (స్కేల్) కానే కాదు’ అనే చావులేని నిజాన్ని జీవితంలో మొదటిసారి, ఏ మహోన్నత గ్రంధాలు రిఫర్ చేయకుండా, ఏ మహాత్ముని బోధలు వల్లెవేయకుండా, సుదీర్ఘమైన జప ధ్యానాలూ చేయకుండా తెలుసుకున్నాను’ అన్నారు.


విజ్ఞానం అనేది ప్రకృతిని తెలుసుకునేందుకు, సమగ్రమైన, మానవ జాతికి, సమస్త ప్రకృతికీ ఉపయుక్తమైన సమాచారాన్ని సేకరించేందుకు, అంతరించని విలువలను తెలుసుకునేందుకు, ఆచరించేందుకు పనికొచ్చే ఒక జ్ఞాననేత్రం లాంటిది! 


ప్రక్కవాడి కొంప కూల్చకుండా, సాటివాడు కూడా సంతోషంగా ఉండేందుకు ఉపయోగపడినప్పుడే అలాంటి జ్ఞాననేత్రానికి ఒక విలువ ఉంటుందని ఆ బాలుడు నాకు ఆచరణలో నేర్పాడు" అని శేషన్ అన్నారు. 


ఆచరణ యోగ్యత లేని జ్ఞానం గురించి ఎంత చెప్పుకున్నా, అవి కేవలం మాటలుగానే మిగిలిపోతాయి. అలాంటి కార్యాచరణ లేని జ్ఞానంతో ఏమి చేసినా ఉపయోగం లేదని, తద్వారా ఏమీ సాధించలేమని పేర్కొన్నారు.✍️`

శివలింగ పూజా సంఖ్యా తత్ఫలం*

 *శివలింగ పూజా సంఖ్యా తత్ఫలం*                        


*శ్లో:ఏకలింగ తథా మోక్షం వ్యాధిరూపం ద్వయం భవేత్ ।।*                           


అర్థం:ఒకే ఒక లింగం ఉంటే అది మోక్షప్రదం అవుతుంది అంటే భక్తునికి శాశ్వత విమోక్షఫలాన్ని ఇస్తుంది.

రెండు లింగాలు ఉంటే అది వ్యాధిరూపం, అంటే శరీర లేదా మనసు సంబంధమైన వ్యాధులను కలిగిస్తుంది.  


*శ్లో:లింగత్రయం తథా కుర్యాత్ భోగమోక్షప్రదాయకమ్।।*


 అర్థం:మూడు లింగములు ఉంటే భక్తునికి భోగమును మరియు మోక్షమును రెండూ ప్రసాదిస్తాయి, అంటే ఈ లోకంలో సుఖ జీవనమూ, పరలోకంలో విమోక్షమూ లభిస్తాయి. 


 *శ్లో:చతుర్లిఙ్గత్తు యత్రైవ తత్ర శ్రీకీర్తిహానిదమ్ ।।*


 అర్థం:నాలుగు లింగాలు ఉంటే అది శ్రీహానికరమనే అర్ధం — ధన, కీర్తి, వైభవ హానిని కలిగిస్తుంది.    


 *శ్లో:పఞ్చలిఙ్గమితి శ్రేష్ఠం పఞ్చపాతకనాశనమ్।*


 అర్థం:ఐదు లింగములు అత్యంత శ్రేష్ఠమైనవి. అవి పంచమహాపాతకములు నశింపజేస్తాయి — అంటే అత్యంత దుష్కర్మాలను కూడా నాశనం చేస్తాయి.  


 *శ్లో:షష్ఠశ్చేమార్రణం కుర్యాత్ సప్తమం వైరనాశనమ్ ।।*


 అర్థం:ఆరు లింగములు అయితే మరణాన్ని కలిగిస్తాయి, అనగా ఆయుర్హానిని కలిగించే సూచనం.

ఏడు లింగములు ఉంటే వైరానాశనం, అంటే శత్రువులు నశిస్తారు.       


*శ్లో:అష్టమస్తు మహావ్యాధిరథవా శత్రువర్ధనమ్ ।*        


 అర్థం:ఎనిమిది లింగములు ఉంటే అది మహావ్యాధి (భారీ వ్యాధులు) లేదా శత్రువుల వృద్ధిని కలిగిస్తుంది.        


 *శ్లో:నవలింగ తథా చేష్టా శివలోకే మహీయతే ।*


అర్థం:తొమ్మిది లింగములు ఉంటే ఆ విధమైన పూజ శివలోక ప్రసాదానికి దారి తీస్తుంది, అంటే భక్తుడు శివలోకంలో మహిమతో కీర్తింపబడతాడు.                


 *నవరత్నలింగపూజాఫలం*    


 *చింత్యవిశ్వే*


*శ్లో :మరతకం పుష్టిదం ప్రోక్తం పద్మరాగం ధనార్థినాం।ఆయుష్యం ఋద్ధివైడూర్యం స్ఫటికం పుత్రవర్ధనం॥*

*శ్లో:స్థంభనం పుష్యరాగం స్యాద్రాష్ట్రవశ్యం ప్రవాలకం కర్షణం స్యత్తు వజ్రాఖ్యం మాణిక్యం సర్వసిద్ధిదం॥*

*శ్లో :ఇంద్రనీలంతు మోక్షార్థం రత్నజానాం ఫలం భవేత్॥*


 అర్థం:మరతకం (ఎమెరాల్డ్) — దీన్ని పూజిస్తే శరీరపుష్టి, ఆరోగ్యవృద్ధి వర్తిస్తుంది.

పద్మరాగం (రూబీ రకం) — ధనము, వైభవమును ఇస్తుంది.

వైడూర్యం (క్యాట్స్‌ఐ) — దీర్ఘాయుష్కుని చేస్తుంది, ఐశ్వర్యవృద్ధిని కలిగిస్తుంది.

స్ఫటికం (క్రిస్టల్) — పుత్రప్రాప్తి, సంతానవృద్ధి కలుగుతుంది.

పుష్యరాగం (టోపాజ్) — శత్రు స్థంభన, విఘ్ననివారణం కలుగుతుంది.

ప్రవాలకం (ముత్యపు రంగు రత్నం / కొరల్) — రాజ్యవశ్యము, ప్రజానుకూలత లభిస్తుంది.వజ్రం (డైమండ్) — ఆకర్షణశక్తి, మనోనిగ్రహం, సమస్త సిద్ధి లభిస్తుంది.

మాణిక్యం (రూబీ) — అన్ని సిద్ధులు ప్రసాదిస్తుంది.ఇంద్రనీలం (సఫైర్) — మోక్షప్రాప్తి కలుగుతుంది.                 


*రత్నలింగమానమ్*  


 *శ్లో :అంగుళ్యాది వితస్త్యంతం కుర్యాల్లింగం తు రత్నజమ్ ||*          


 అర్థం: రత్నాలతో తయారు చేయబడిన శివలింగాన్ని ఒక అంగుళం నుండి ఒక జాన (వితిస్తి - సుమారు 9 అంగుళాలు) కొలత వరకు చేయవచ్చు.                 

       

*శ్లో:ఆయామసదృశం నాహం శిరోవర్తనసంయుతమ్ । స్వప్రమాణేన కర్తవ్యం రత్నలింగస్య వీరకా ||* 


అర్థం: ఓ వీరకా! రత్నలింగం యొక్క చుట్టుకొలత (నాహం) దాని పొడవుకు (ఆయామము) సమానంగా ఉండాలి. అది పైభాగంలో వృత్తాకార ఆకారం (శిరోవర్తన) తో కూడి ఉండాలి. ఈ కొలతలను తమ సొంత ప్రమాణం (స్వప్రమాణం) ప్రకారం నిర్ణయించుకోవాలి.


            *సంకలనం*          

     *సింగరాజు బాలసుబ్రమణ్య శాస్త్రి శ్రీకాళహస్తి*

హనుమంతుడు అష్ట సిద్ధుల

  హనుమంతుడు అష్ట సిద్ధులను ఎప్పుడెప్పుడు ఉపయోగించాడు?

హనుమంతుడు తన అష్ట సిద్ధులను శ్రీరామ కార్యం కోసం, నిస్వార్థ సేవ కోసం మాత్రమే ఉపయోగించారు. ఈ సిద్ధులను ఆయనకు సీతామాత వరంగా ఇచ్చింది.


హనుమంతుడు అష్ట సిద్ధులను (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం) ఉపయోగించిన ముఖ్యమైన సందర్భాలు మరియు సిద్ధులు కింద ఇవ్వబడ్డాయి:


# సుందరకాండలో అష్ట సిద్ధుల ఉపయోగం


హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి లంకకు వెళ్ళిన సందర్భంలో, అనగా సుందరకాండలో, ఈ సిద్ధులను ప్రధానంగా ఉపయోగించారు.


| సిద్ధుల పేరు | ఆ సిద్ధి అర్థం | ఎప్పుడు ఉపయోగించారు? |


|---|---|---|


| 1. అణిమ | అత్యంత చిన్న అణువులా మారిపోయే శక్తి. | లంకలోకి ప్రవేశించేటప్పుడు: రాక్షస సైనికులకు కనపడకుండా, రహస్యంగా లంక నగరంలోకి ప్రవేశించడానికి హనుమంతుడు తన శరీరాన్ని చాలా చిన్నదిగా (అణువుగా) మార్చుకున్నారు. |


| 2. మహిమ | శరీరాన్ని అత్యంత పెద్దదిగా విస్తరించగల శక్తి. | లంకలో లంకిణిని ఎదుర్కొన్నప్పుడు మరియు సముద్రాన్ని దాటేటప్పుడు: అసాధ్యమైన సముద్రాన్ని దాటడానికి, అలాగే లంకిణిని (లంకా పట్టణ రక్షకురాలు) ఎదుర్కొన్న తరువాత, తన శక్తిని ప్రదర్శించడానికి తన రూపాన్ని మహత్తుగా (పెద్దదిగా) పెంచారు. |


| 3. లఘిమ | శరీరాన్ని అత్యంత తేలికగా మార్చుకోగల శక్తి. | సముద్రాన్ని దాటేటప్పుడు: భారీ పర్వతాల వలె ఉన్నప్పటికీ, వేగంగా, తేలికగా సముద్రం మీదుగా లంఘించడానికి ఈ శక్తిని ఉపయోగించారు. |


| 4. గరిమ | శరీరాన్ని అత్యంత బరువుగా మార్చుకోగల శక్తి. | లంకలో బంధించినప్పుడు: రావణుడి సభలో రాక్షసులు తనను కదపలేనంత బరువుగా మారడానికి ఈ శక్తిని ఉపయోగించారు. (మహాభారతంలో భీముడి గర్వాన్ని అణచడానికి కూడా ఉపయోగించారు). |


| 5. వశిత్వం | సకల జీవరాశులను మరియు ఇతరులను వశం చేసుకునే లేదా ప్రభావితం చేయగల శక్తి. | లంకా దహనం మరియు సభా సన్నివేశం: రావణుడి సభలో ఉన్నప్పుడు రాక్షసులను తన మాటలకు ప్రభావితం చేయడానికి, అలాగే లంక దహనం సమయంలో అగ్ని శక్తులను నియంత్రించడానికి ఈ శక్తిని ఉపయోగించారు. |


| 6. ఈశిత్వం | ప్రకృతిపై, దిక్పాలకులపై ఆధిపత్యాన్ని లేదా నియంత్రణను కలిగి ఉండే శక్తి. | యుద్ధంలో: వానర సైన్యాన్ని నైపుణ్యంగా నడిపించడానికి మరియు శత్రువులను శాసించడానికి ఈ అధికారాన్ని ఉపయోగించారు. |


| 7. ప్రాకామ్యం | తాను కోరుకున్నది సాధించగల శక్తి. | సీతాన్వేషణ మరియు సంజీవని: సీతాన్వేషణలో, అలాగే యుద్ధంలో సంజీవని పర్వతాన్ని తీసుకురావాలనే కోరికను సాధించడానికి ఉపయోగించారు. |


| 8. ప్రాప్తి | ఎక్కడైనా, ఏ వస్తువునైనా తక్షణమే పొందగల శక్తి. | సంజీవని పర్వతం కోసం: అత్యంత వేగంగా ఎక్కడైనా చేరుకోగలిగే శక్తిని ఉపయోగించి ద్రోణగిరి పర్వతాన్ని సులభంగా తెచ్చారు. |


# హనుమాన్ చాలీసాలో కూడా ఈ విషయాన్ని "అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా! ఆస వర దీన్హా జానకీ మాతా!!" అనే పంక్తి వివరిస్తుంది.

🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻

మహాభారతం

  🕉️. *🔔మహాభారతం చదువుతున్నప్పుడు ఒక అనుమానం కలుగుతుంది. కురువంశంలో కోడలిగా అడుగుపెట్టిన ఒక్క మహిళైనా సుఖ పడిందా?*


*🔔. సత్యవతీ* *ముందుగా సత్యవతీ దేవితో ప్రారంభిద్దాం. ఒక బెస్తవారింట పెరుగుతూ గంగా నదిని గడవేసి పడవ నడుపుతూ దాటించే శ్రామికురాలు. కురువంశ చక్రవర్తి అయినా శంతన మహారాజు ఆమెను వలచాడు. ఆమె తండ్రి దాశరాజు సత్యవతి కుమారులకే రాజ్యం సంక్రమించే షరతు మీదనే వివాహానికి అంగీకరించాడు. ఆమెకు ఇద్దరు కుమారులు కలిగారు. మొదటివాడు వివాహం కాకుండానే మరణించాడు. రెండవవాడు వివాహమైన కొంతకాలానికి మరణించాడు. ఎంత దుర్భరమైన పరిస్థితి?*


*నిజానికి సత్యవతి బెస్తవారింట పుట్టలేదు. ఆమె తండ్రి ఉపరిచరవసువు ఒక శాపగ్రస్త అప్సరస ద్వారా కన్న కుమార్తె ఆమె. కారణమేమైనా ఆమెను బెస్తవారింట పెంపకానికి ఇచ్చేశాడు. రాజకుమార్తెగా జీవించవలసిన ఆమె మత్స్యకారుల ఇంట్లో పెరిగింది. ఒక మహారాజు భార్య అయినప్పటికీ ఆమె జీవితంలో సుఖసంతోషాలు లేవు. కొడుకులిద్దరూ మరణించారు. ఏ స్త్రీకైనా అంతకన్నా పెద్ద కష్టం ఉంటుందా?*


*అయినప్పటికీ రాజ్యం కోసం కోడళ్లకు నియోగం ద్వారా సంతానం కలిగేలా చేసింది. ఆ సంతానంలో ఒకరు గుడ్డివాడు, మరి ఒకడు పాండు రోగంతో పుట్టాడు. సత్యవతీ దేవి జీవితంలో సుఖమన్నమాట ఉన్నదా?*


*🔔అంబిక, అంబాలిక*

*ఇక రెండవ తరంలోని కోడళ్ళు అంబిక, అంబాలిక. భర్త చిన్న వయసులోనే మరణించాడు. అత్తగారి ఆజ్ఞను అనుసరించి నియోగం ద్వారా పిల్లలను కనవలసి వచ్చింది. సంతానం అనుగ్రహించేది ఎవరో కూడా వారికి తెలియదు. వ్యాస మహర్షిని చూసి వారు భయపడటంలో ఆశ్చర్యమేమున్నది? కలిగిన సంతానమిద్దరూ వికలాంగులు.*


*🔔గాంధారి, కుంతి, మాద్రి.*

*మూడవ తరంలో ఆ ఇంటి అడుగుపెట్టిన కోడళ్ళు గాంధారి, కుంతి, మాద్రి.*

 *భర్త మరణానికి తానే కారణమని నమ్మిన మాద్రి చిన్న వయసులోనే సహగమనం చేసింది. తన పిల్లలను, సవతి పిల్లలను కుంతి పెంచవలసి వచ్చింది. హాయిగా పుట్టింట్లో ఉండి ఆమె పిల్లలను పెంచలేదు. తన అత్తవారింటనే ఉంది. అన్ని రకాల అవమానాలను భరించింది. చివరకు కొడుకులు బిచ్చమెత్తుకుని బతుకుతున్నా కూడా ఆమె చూడవలసి వచ్చింది. ఆ పైన కొన్నాళ్లు వారికి రాజ్యాధికారం ఉంది. ఆ తరువాత అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమె అంతఃపురంలో కాకుండా విదురుడింట ఉండవలసి వచ్చింది. కుంతి జీవితంలో సుఖం అన్న మాట ఉన్నదా?*


*గాంధారి మాత్రం ఏం సుఖపడింది?*

*తాను వివాహం చేసుకోబోయేది ఒక అంధుడని కూడా ఆమెకు తెలియదు. భర్తతో సమంగా ఆమె కూడా అంధత్వాన్ని అనుభవించింది. కుమారుల మరణాన్ని చూసింది. అల్లుడి చావును చూసింది. ఆమె పిల్లలను సరిగా పెంచలేదు అని ఈనాడు ఎవరైనా అనవచ్చు కానీ పెంపకానికీ, గుణగణాలకీ సంబంధం ఉన్నదా?*


*కుంతి గురించి చెప్పేటప్పుడు ఎంతసేపూ ఆమె కర్ణుడికి చేసిన అన్యాయం గురించే మాట్లాడుతారు.*

 *ఆమె తన చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడింది?*

 *వృష్ణివంశస్థుడు అయిన శూరసేనుడి కుమార్తెగా జన్మించిన ఆమె చిన్న వయసులోనే కుంతి భధ్రుడికి దత్తతగా వెళ్ళింది. దూర్వాసుడిచ్చిన వరాన్ని బాల్య చాపల్యంతో పరీక్షించపోయి కర్ణుడికి తల్లి అయింది. ఆమె పెంపకానికి వెళ్లకుండా సొంత తల్లిదండ్రుల దగ్గరే ఉంటే వారికి విషయం చెప్పుకోగలిగేదేమో. ఈ సంగతి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించి ఉంటారా?*


*నాలుగవ తరంలో ఆ ఇంట అడుగుపెట్టిన ద్రౌపది జీవితంలో కష్టాలను పడడమే కాక లెక్కపెట్టలేనన్ని అవమానాలను అనుభవించింది.*

*నిండు సభలో వస్త్రాపహరణం, పతిత అన్న తిట్లు, నా ఊళ్ళో కూర్చో అన్న సైగ. ఎంత అవమానం అయినప్పటికీ ఆమె ధృతరాష్ట్రుని తన భర్తల బంధవిముక్తిని కోరింది కానీ తన విషయంలో ఏమీ అడగలేదు. అయినా 12 ఏళ్లు అరణ్యంలో ఉండాల్సి వచ్చింది. 13వ ఏట దాసీవృత్తి చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా కీచకుడు వంటి వారు ఆమెను మోహించి నానారభస చేశారు. అన్నీ పూర్తి అయి కురుక్షేత్ర సంగ్రామంలో భర్తలు నెగ్గే సమయానికి ఆమె కుమారులను కోల్పోయింది.*


 *అర్జునుడికి మరో భార్య అయిన సుభద్రకు అదే పరిస్థితి. ఏకైక కుమారుడు మరణించాడు. అర్జునుడి మరో భార్య ఉలూపి కుమారుడు మరణించాడు. కౌరవుల భార్యలందరూ భర్తలను కోల్పోయి నిస్సహాయంగా మిగిలారు.*


*ఇక చివరగా చెప్పుకోవాల్సింది ఉత్తర గురించి.*


*ఆమెను అభిమన్యుడు వివాహం చేసుకున్నాడు. భర్త సమక్షంలో కొన్ని రోజులు మాత్రమే గడిచి ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మ దయవల్ల ఆమె కుమారుడు మిగిలాడు. అంతకుమించి ఆనందమన్నది ఆమెకు తెలియదు.*


*కురువంశం మొత్తానికి ఒకే ఒక్క ఆడపడుచు దుశ్శల.*

 *ఆమె గాంధారి, ధృతరాష్ట్రుల కుమార్తె. సైంధవునితో వివాహమైంది. అటువంటి పరమ దుర్మార్గుడుతో ఆమె కాపురం ఎలా ఉండి ఉంటుందో ఊహించవచ్చు. అతడు ద్రౌపదీ దేవిని ఎత్తుకొని పోయే ప్రయత్నం చేసాడు. భీమార్జునులు అతనిని బంధించి వెనక్కి తీసుకురాగా చెల్లెలు జీవితం సుఖంగా ఉండాలన్న కోరికతో ధర్మరాజు అతనిని క్షమించి వదిలిపెట్టాడు. కానీ తనకు జరిగిన అవమానం మరిచిపోని సైంధవుడు అభిమన్యుడి చావుకి పరోక్షంగా కారకుడు అయ్యాడు. అర్జునుడి చేతిలో మరణించాడు.*


*కురుక్షేత్ర సంగ్రామం తరువాత దుశ్శల కుమారుడు సురథుడు రాజయ్యాడు. అశ్వమేధ యాగం జరుగుతున్న సమయంలో అర్జునుడు సింధు దేశానికి రాగా సురథుడు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు దుశ్శల తన మనవడిని తీసుకుని రణ రంగానికి వచ్చి అర్జునునికి తన కష్టం చెప్పుకుంది. అర్జునుడు ఆ చిన్న పిల్లవాడిని సింధు రాజ్యానికి రాజుగా ప్రకటించాడు.* 


*దుశ్శల జీవితంలో సుఖం కానీ శాంతి కానీ ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా?*


*కురువంశంలో అడుగుపెట్టిన కోడళ్లు అయితేనేమి, ఆ ఇంటి పుట్టిన ఏకైక కుమార్తె దుశ్శల అయితే ఏమి సుఖము అన్నమాట ఎరుగరు.*


*ఇదంతా ఏదో కురువంశంలో మాత్రమే ఆడవాళ్లు కష్టపడ్డారని చెప్పడానికి కాదు.*


 *ఏ స్త్రీ అయినా కష్టం వచ్చినప్పుడు "నాకే ఇలా అయింది ఏమిటి?" అని దుఃఖించకుండా ఉండడానికి మాత్రమే.*


స్వస్తి

🔔🔔🔔🙏🙏🙏

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో 𝕝𝕝      *ఆగమోపః ప్రజా దేశః*

              *కాలః కర్మ చ జన్మ చ* l

              *ధ్యానం మంత్రోఽథ సంస్కారో* 

              *దశైతే గుణహేతవః* ll


తా𝕝𝕝 *ఆరాధించు దైవము, త్రాగునీరు, చుట్టూ ఉండే పరివారము, జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయుపని, పుట్టిన పుట్టుక, ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము - ఈ పదిన్ని వ్యక్తులలోని గుణములకు కారణములగుచున్నవి.....* 


✍️💐🌸🌹🙏

*నిద్ర లేకపోవడం

      *నిద్ర లేకపోవడం*

                ➖➖➖✍️```


"నిద్ర లేకపోవడం".. అనేది మీరు అనుకున్నదానికంటే చాలా ప్రమాదకరం: ఒక కొత్త పరిశోధన ప్రకారం, తగినంత నిద్ర లేనప్పుడు మెదడు దాని స్వంత కణాలు.. తినడం ప్రారంభిస్తుంది. మీరు తగినంత నిద్రపోకపోతే, మీరు ఊహించలేని పరిణామాలకు మీరు ఎదుర్కొంటరు.


నిద్ర లేమి మెదడులోని భాగాలను ఎక్కువగా ప్రేరేపించగలదు మరియు శాశ్వత మెదడు దెబ్బతినడానికి కూడా దారితీస్తుంది,

మెదడు స్వయంగా తినడం యొక్క లక్షణాలు?

తలనొప్పి..జ్వరం.. మెడగట్టి.. ఆకలి.. వాంతులు, మూర్ఛలు,

కోమా.  

ఒత్తిడి మరియు METABOLISM మెదడు కణాలను చంపడానికి మరియు మెదడు పరిమాణాన్ని కూడా తగ్గించడానికి కొన్ని కారణాలు. 


పౌష్టికాహారం కారణంగా మంచి నిద్రను పొందడం ద్వారా మనం మెదడు తినడం మానివేయవచ్చు.

నిద్ర మెరుగుపరచడానికి పడుకునే ముందు కొన్ని ఆహారాలు మరియు పానీయాలు తీసుకోవచ్చు.... 


అది... బాదం, కివి, చెర్రీ,

చేప, అక్రోట్లు, పాలు...

కాబట్టి ఈ గ్లోబలైజ్డ్ జీవితాల్లో నిద్రకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి.


అధిక కొవ్వు పదార్ధాలను పరిమితం చేయండి, హెవీ, స్పైసీ ఫుడ్స్ పట్ల జాగ్రత్త వహించండి, రాత్రి 8 గంటలకు ద్రవాలను తగ్గించండి. విశ్రాంతి తీసుకోవడానికి ధూమపానం చేయవద్దు.


నిద్ర ఆరోగ్యానికి అవసరం, గాఢ నిద్ర అనేది విశ్రాంతి అనుభూతి మరియు ఆరోగ్యంగా ఉండేందుకు అన్నింటికంటే చాలా అవసరం. సగటున 8 గంటల రాత్రి నిద్ర 1 నుండి 2 గంటల వరకు గాఢ నిద్ర ముఖ్యమైనది. పెద్దలు రాత్రి 7 నుండి 9 గంటల వరకు నిద్రపోవడం మంచిది. 


#మంచి నిద్ర లక్షణాలు:

రాత్రి పడుకోగానే 30 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో నిద్రపట్టడం.

రాత్రిలో ఒకసారి 5 నిమిషాల కంటే తక్కువ సమయం మేల్కొడం. మీరు బెడ్‌పై గడిపే మొత్తం సమయంలో 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోవడం. 

రాత్రిపూట 20 నిమిషాలలోపు మేల్కొని ఉండటం. కలలు రాకుండా నిద్రపోవడం సహజం, 

కానీ, మీరు కలలు కంటున్నట్లయితే, అది సాధారణంగా మీకు మంచి నిద్ర వస్తున్నట్లు సంకేతం. మనలో చాలామంది వివిధ కారణాల వల్ల రాత్రి సమయంలో మూడు నుండి నాలుగు సార్లు మేల్కొంటారు. ఇది సాధారణ నిద్రలో భాగమే. మెలటోనిన్ మరియు మెగ్నీషియం సహజ నిద్రను ప్రోత్సహించే మూలకాలు. 

మెలటోనిన్ ఒక హార్మోన్ మరియు మెగ్నీషియం విటమిన్.. చెర్రీస్, బెర్రీలు, గుడ్లు, పాలు, చేపలు మరియు గింజలలో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. 

గుమ్మడి గింజలు, బాదం, పాలకూర, జీడిపప్పు, వేరుశెనగల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. 


మంచి నిద్ర కోసం: గోధుమ లేదా ఓట్ మీల్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను పడుకునే ముందు తినండి. ఈ ఆహారాలు నిద్ర హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి.✍️

#ఇది కేవలం సేకరణ మాత్రమే!```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సంపూర్ణ మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*షష్టాశ్వాసం ప్రధమ భాగం*


*572 వ రోజు*


*ఆధ్యాత్మము ఆదిభౌతికము ఆది దైవతము*


ఇక ఆది భూతము, ఆది దైవతము, ఆధ్యాత్మము గురించి చెప్తున్నాను. మన శరీరంలోని పాదము, ఆపానము, జననేంద్రియము, చేతులు, నాలుక ఆధ్యాత్మము. అవి వరుసగా నడచుట, విసర్జించుట, సృష్టించుట, కార్యనిర్వహణ అనునవి అది భూతములు. వీటికి వరుసగా విష్ణువు, సూర్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు అది దేవతలు. అలాగే కళ్ళు, నాలుక, ముక్కు, చర్మము, చెవి ఆధ్యాత్మములు. వాటి గుణములైన దృష్టి, రుచి, వాసనా, స్పర్శ, శబ్ధములు అధిభూతములు. వాటికి వరుసగా సూర్యుడు, వరుణుడు, భూమి, వాయువు, ఆకాశము అదిదేవతలు. మనసు ఆధ్యాత్మము, మనసు విషయాలను గ్రహించడం స్పందించడం అనేవి అది భూతములు. మనసుకు అదిదేవత చంద్రుడు. ఇది వేదప్రమాణము. బుద్ధి ఆధ్యాత్మము విషయ పరిజ్ఞానము, శాస్త్రపరిజ్ఞానము దానికి అధిభూతములు. బుద్ధికి క్షేత్రజ్ఞుడు అదిదైవతము. అహంకారము ఆధ్యాత్మము. బుద్ధికి అభిమానము, స్వాతిశయము అధి భూతము. దానికి అదిదేవత బ్రహ్మము.


*ప్రకృతి పురుషుడు*


ఇంక ప్రకృతి పురుషుడు గురించి వివరిస్తాను. ప్రకృతి తన ఇష్టం వచ్చిన విధంగా త్రిగుణాల ఆధారంగా అనేక రకములైన వికృతులను ఒక ఆటగా పెంపొందిస్తూ ఉంటుంది. ఒక దీపము అనేక దీపములు వెలిగిస్తున్నట్లు ఈ ప్రకృతి అనేక రూపములను ఆవిష్కరిస్తుంది. సంతోషము, ఆనందము, ఆరోగ్యము, కోపరహితమైన స్వభావం, మంచి నడవడి, పరిశుభ్రత, ప్రకాశవంతంగా ఉండటం, మనసు స్థిరంగా ఉండటం, అహింస, నీతి నియమము, సిగ్గు, శ్రద్ధ, సత్యము, శుచి, ఆచారము, కరుణ, లోభరహిత నడవడి, కామవాంఛలు, ఇతరుల మీద చాడీలు చెప్పని గుణం సత్వ గుణాలు. తగవులాడుట, అహంకారము, గర్వము, కామవాంఛలు, కోపము, నిర్ధయ, మాత్సర్యము, భోగలాలసత, దుఃఖము ఇవి రజోగుణ లక్షణాలు. సదా ఏడుపు, అధికమైన మోహంతో ఉండటము, ఎప్పుడూ తింటూ ఉండటం, అనవసరమైన వాదనకు దిగడం, మూర్ఖత్వం, ఒకరితో ఒకరికి కలహాలు పెట్టడం ఇవి తమోగుణ లక్షణాలు. జీవాత్మ ఈ గుణములకు అతీతుడు కాని జీవుడు అనేక రూపములతో కళంకితుడౌతున్నాడు. జీవుడు చైతన్య మూర్తి ప్రకృతి చైతన్య రహితమైనది. జీవుడి ప్రకాశంతో ఎప్పుడూ వెలుగుతున్నా జీవుడు ప్రకృతికి వశవర్తియై ఉంటాడు. జీవాత్మ తన నిజ స్థితిని తాను తెలుసుకోలేదు. జీవాత్మ ప్రకృతికి లోనై త్రిగుణాత్మకమైన కర్మలను ఆచరిస్తూ ఉంటుంది. సత్వగుణ ప్రధాన కర్మలను ఆచరించి స్వర్గ లోక ప్రాప్తి పొందుతూ ఉంటుంది. రజోగుణ ప్రధాన కర్మలను ఆచరించి మానవజన్మ ఎత్తుతుంది. తమోగుణ ప్రధానకర్మలను ఆచరించి రౌరవాది నరకములను పొందుతుంది. తనను తాను తెలుసుకున్న జీవుడు ఈ త్రిగుణములలో చిక్కు కొనక అంతర్ముఖుడై అక్షర రూపమైన ప్రబ్రహ్మ పదమును పొందుతాడు అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.


*జీవుడు జీవాత్మ*


జనకుడు " మునివర్యా ! పురుషుడు చైతన్యవంతుడని ప్రకృతి జడమని చెప్పారు కదా దానిని వివరించండి " అని అడిగాడు. యాజ్ఞవల్క్యుడు " జనకమహారాజా ! సగుణము అగుణము కాదు. అగుణము సగుణము కాదు. త్రిగుణాత్మకము అవ్యక్త్యమైన ఈ ప్రకృతి చైతన్యవంతమైన జీవాత్మ స్థితి ఎలా పొందుతుంది. జీవాత్మ సహజ స్థితి తెలుసుకునే జ్ఞానం ప్రకృతకి లేదు. కాని పురుషుడికి ప్రకృతి దాని స్వభావము తెలుసు. కనుక ఈ ప్రకృతి అచేతనము. పురుషుడు చేతనత్వం కలవాడు. సదా ప్రకృతిలో విహరిస్తున్న పురుషుడికి దాని వికారములు అంటవు. ఇది ప్రకృతి పురుషుల సంబంధము. సదా నీటిలో ఉండే తామర రేకులకు నీరు అంటదు. అలాగే పురుషుడు ప్రకృతిలో లీనమై ఉన్నప్పటికీ ప్రకృతి వికారములు అంటవు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ చాముండా (సుంధ ) మాత ఆలయం

  🕉 మన గుడి : నెం 1307


⚜  రాజస్థాన్ : భిన్మల్


⚜  శ్రీ చాముండా (సుంధ ) మాత ఆలయం 



💠 పురాతన పుణ్యక్షేత్రం - సుంధ మాత ఆలయం సముద్ర మట్టానికి 1220 మీటర్ల ఎత్తులో ఆరావళి పర్వత శ్రేణులలోని సుంధ పర్వతం మీద, పురాతన గుహలలో, రాజస్థాన్‌లోని జలోర్ ఏర్పాటు భీన్మల్ సబ్ డివిజన్, రాణివాడ తహసిల్‌లోని చిన్న గ్రామం దంట్లవాస్ సమీపంలో ఉంది.

 

💠 ఇది సుమారు 900 సంవత్సరాల పురాతన దేవాలయం, ఇది దేవి చాముండా మాతకు అంకితం చేయబడింది మరియు భారతదేశం అంతటా మరియు ప్రత్యేకంగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్‌లలోని భక్తులచే సుంధ మాతగా పూజిస్తారు.


💠 సుంధ మాత ఆలయ ప్రాంగణం సహజ వాతావరణం, పచ్చని పర్వతం, వెనుక వైపు ఇసుక పర్వతాలు మరియు అనేక జలపాతాలతో చుట్టుముట్టబడి ఉంది, ఇది రాజస్థాన్‌లో ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారింది. 


💠 ఈ ప్రాంతం చాలా మంది ఋషులకు తపోభూమిగా నమ్ముతారు మరియు రిషి భరద్వాజ్ ఆశ్రమం కూడా ఇక్కడ ఉంది. హల్దిఘాటి యుద్ధం తర్వాత, మహారాణా ప్రతాప్ తన కష్టకాలంలో సుంధ మాతను ఆశ్రయించాడని కూడా చెబుతారు.


💠 సుంద మాత ఆలయం తెల్లని పాలరాయితోనిర్మించబడింది.

ఈ స్తంభాలు అబు దిల్వారా ఆలయ స్తంభాల కళను గుర్తుకు తెస్తాయి . 


💠 జానపద కథల ప్రకారం, సుంధ మాతను అఘటేశ్వరి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ దేవత తల పూజిస్తారు మరియు చాముండ తల్లి మొండెం కోర్టాలో మరియు కాళ్ళు సుందర్ల పాల్ - జలోర్‌లో 

స్థాపించబడిందని అంటారు.


💠 తల్లి చాముండ

చాముండ దేవత విగ్రహం ఒక పెద్ద 

రాయి కింద ఉంది. 

తల్లి చాముండ ముందు భూర్భువ స్వవేశ్వర శివలింగం స్థాపించబడింది. ప్రధాన ఆలయంలో శివుడు మరియు పార్వతి జంట విగ్రహం , గణేశ విగ్రహం చాలా పురాతనమైనవి మరియు అంతరించిపోయినవిగా పరిగణించబడతాయి


💠 సంవత్సరానికి రెండుసార్లు నవరాత్రుల సమయంలో ఇక్కడ తొమ్మిది రోజుల జాతర జరుగుతుంది మరియు భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడతారు. 

ప్రతి నెల శుక్ల పక్ష పౌర్ణమి నుండి పదమూడు వరకు ఆలయానికి ఎక్కువ మంది సందర్శకులు వస్తారు. హిందూ మాసమైన కార్తీక, బైశాఖ మరియు భాద్రపద సమయంలో కూడా జాతర జరుగుతుంది.


💠నవరాత్రి సమయంలో గుజరాత్ మరియు సమీప ప్రాంతాల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. ఆ సమయంలో పాలన్పూర్,దీసా మరియు ఇతర ప్రాంతాల నుండి గుజరాత్ రోడ్ల ద్వారా సాధారణ బస్సులు నడుస్తాయి .


💠 సుంధ మాత ఆలయం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మరియు ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి, గుజరాత్ మరియు రాజస్థాన్ నుండి మరియు పర్యాటకులు ఏడాది పొడవునా ఇక్కడకు వస్తారు. 

సందర్శకులకు ఆహ్లాదకరంగా ఉండటానికి సుంధ మాత ఆలయంలో వివిధ సమాజాలు అనేక ధర్మశాలలు మరియు ఫుడ్ కోర్ట్‌లను అభివృద్ధి చేస్తాయి.


💠 సుంధ మాత దర్శనం కోసం కొండపైకి చేరుకోవడానికి సుంధ మాత రోప్‌వే సమయాలు మరియు మెట్లు బాగా అభివృద్ధి చెందాయి. 

భక్తులు పైకి చేరుకోవడానికి దాదాపు 500 మెట్లు ఎక్కాలి. 


💠 సుంధ మాత భిన్మల్ నుండి కేవలం 20 కి.మీ, మౌంట్ అబూ నుండి 45 కి.మీ మరియు జలోర్ జిల్లా యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ అయిన జలోర్ నుండి 62 కి.మీ దూరంలో ఉంది. 


రచన

©️ Santosh Kumar

మంచి పురాణ గాధ ....

  మనలో చాలామంది కి తెలియని ఒక మంచి పురాణ గాధ ..మీకోసం..


చాలా మంచి పోస్టు . అందరూ చదవండి .


ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం

రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.

'14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,' అని ఎవరో గుర్తుచేశారు.

ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు.

నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,' అని అడిగారు.

''మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,'' అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. ''లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!'' అని పరిహాసంగా అడిగారట రాములవారు.

''అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,'' అని బదులిచ్చాడు లక్ష్మణుడు.

లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. ''తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!'' అన్నారట రాములవారు.

రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ''ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,'' అని వేడుకుందట ఊర్మిళ.

''కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,'' అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.

🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻

హిందూ ధర్మం

  🌹హిందూ ధర్మం 🌹


తనకంటే వైభవంగా విలసిల్లుతున్న నాగరికతల నుంచి జ్ఞానం తీసుకుని, తనలో కలుపుకుని, తన ఆలోచనలో భాగం చేసుకుందని స్పష్టం చేసింది. సోక్రటీస్‌కు ముందే గ్రీస్‌లో హిందువులు నివసించారని కొందరు పాశ్చాత్య చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గ్రీకులో సన్యాసానికి దగ్గరగా కొన్ని సంప్రదాయలుండటం గురించి Egypt మరియు Israel (1911) గ్రంధ రచయిత, Professor Sir Flinders Patrie (1853-1942) అంటారు- అ.పూ. 480 నాటికే పర్షియన్ సైన్యంలో ఎంతో పెద్ద సంఖ్యలో భారతీయ సేనలు ఉండటం, భారతదేశం మరియు గ్రీస్ మధ్య సంబంధాలు ఎంత వరకు వెళ్ళాయో చెప్తోంది. ఈజిప్ట్‌లోని Memphis అనే ప్రాంతంలో దొరికిన అ.పూ. 5 వ శతాబ్దానికి చెందిన భారతీయుల modeled heads, భారతీయులు వర్తకం కోసం అక్కడ నివసించారని చెప్తున్నాయి. అందువల్ల నూతనమైన పాశ్చాత్య ఆధ్యాత్మికతకు భారతీయతే మూలమని ఎటువంటి కష్టం లేకుండా తేల్చవచ్చు.

సోక్రటీస్ శిష్యుడైన ప్లాటో, తన గురువు రచనలే కాక, కొన్ని తాను కూడా గ్రంధస్థం చేశాడు. అవన్నీ హిందూ సిద్ధాంతాలకు, ఉపనిషద్ బోధనలకు దగ్గరగా ఉంటాయి. ప్లాటో కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మాడు. నిజానికి ఇది ప్లాటొ కంటే శతాబ్దం ముందే జీవించిన పైధాగోరస్, భారతదేశంలో గంగా తీరంలో చదువుకున్న తర్వాత, అక్కడ ప్రతిపాదించాడని జర్మన్ చరిత్రకారులు 17 వ శతాబ్దం లోనే అభిప్రాయం వ్యక్తం చేశారు (ఈ విషయం ఇంతకుపూర్వ భాగాల్లో చెప్పుకోవడం జరిగింది). ఈ విధంగా ఈ రోజు పాశ్చాత్య ప్రపంచం తమ ఆలోచనకు మూలపురుషులుగా కొలుస్తున్న ముగ్గురి మీద సనాతనధర్మం యొక్క ప్రభావం ఉంది. కాకపోతే ఆ తర్వాతి వారు ఉపనిషత్తులను పరిశీలించని కారణంగా, వారి ఆలోచన వక్రమార్గం పట్టి ప్రపంచ నాగరికతల నాశనానికి దారి తీసింది. ఇది ఆ తర్వాత కూడా కొనసాగింది. అ.పూ. 2 వ శతాబ్దానికి చెందిన అఘతా క్లోస్ అనే గ్రీకు రాజు, శ్రీ కృష్ణుడు, బలరాముడి ముద్రలున్న వెండి నాణేలను ముద్రించాడు. ఇది అక్కడి పురావస్తుశాలలో చూడవచ్చు.

గ్రీకు రాయబారి, మెగస్తనీస్, భారతదేశ సౌభగ్యాన్ని గురించి వివరంగా రాసి పెట్టాడు. గ్రీకు పతనమైన రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన తర్వాత కూడా వాళ్ళకు, మనకు మధ్య వ్యాపారలావాదేవీలు, వాణిజ్యం ఏమాత్రం తగ్గలేదు. రోమన్లు, అప్పట్లో బ్రహ్మాండమైన నౌకాబల సంపన్న దేశంగా ఉన్న భారతదేశం నుంచి చేసుకునే దిగుమతుల నిమిత్తం, ఏడాదికి 5 కోట్ల సెస్టర్సులు (50,00,000 డాలర్లు) ఖర్చు పెట్టేవారని ప్లీనీ (అ.శ. 1 వ శతాబ్ది) అంటాడు. ఆ తర్వాత అక్కడ అన్య మతవ్యాప్తి పెరిగింది. అన్యమతం లో కూడా ఎన్నో ఆదర్శాలను సనాతన ధర్మం, బౌద్ధ మతాల నుంచి తీసుకున్నారని ఎందరో అభిప్రాయపడ్డారు. భారతదేశ సంపదల గురించి ప్రస్తావిస్తూ బైబిల్ ( II క్రానికల్స్ 9:21.10) అంటుంది, "తార్షీష్ ఓడలు, బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు మాత్రమే కాకుండా ఆల్గం (చందనం) చెట్ల కొయ్య, రత్నాలు కూడా సమృద్ధిగా, ఓఫిర్ (బొంబాయి తీరంలో ఉన్న సోపారా) నుంచి తెచ్చి సాలమన్ రాజుకు ఇచ్చాయని చెబుతోంది". ఆఖరికి పరమత 'దైవ' గ్రంధాల్లో కూడా హిందూదేశ వైభవం ప్రస్తావించబడింది. అంటే అప్పట్లో ఆ గ్రంధకర్తల మీద మన దేశ ప్రభావం ఎంతగా ఉండేదో గమనించవచ్చు.🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

- ఓ సుజనా

 *2310*

*కం*

మంచిని తలువగ దోషము

లెంచగ నరుదెంచు జనుల లెక్కించకనే

మంచని యనిపించగ యో

చించక నెరవేర్చవలయు శీఘ్రము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మంచి పని చేయాలనే ఆలోచన మనస్సు కు కలిగిన చో అందులో దోషాలను ఎంచిచూపేవారిని లెక్క చేయకుండా మంచి అని మనకు అనిపిస్తే ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే చేయవలెను.

*సందేశం*:-- సాధారణంగా మంచి పని తలపెట్టినప్పుడు సహకరించేవారికంటే అందులో లోపాలు ఎత్తిచూపేవారే ఎక్కువగా ఉంటారు. మనమనస్సుకు మంచి అనిపిస్తే ఇంకేమీ ఆలోచించకుండా చేసేయాలి. శుభస్య శీఘ్రం అనే ఆర్యోక్తి కి ఇదే భావం.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఉదయాన్నే కాఫీ*

  

*మన ఆరోగ్యం…!


           *ఉదయాన్నే కాఫీ*

               ➖➖➖✍️


```

చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. 


అయితే ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసా? 


ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగడం లేదా రోజంతా ఎక్కువగా కాఫీ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం.


కాఫీలో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. 


వీటిని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 


కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకోండి...```



*కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలు:*


*నిద్రలేమి:```

కాఫీ తాగడం వల్ల నిద్రలేమి వస్తుంది. ఎందుకంటే కాఫీలో కెఫీన్‌ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా నిద్రలేమి సమస్య మరియు నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి.```


*అసిడిటీ సమస్య:```

కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఎవరైనా ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగితే, అది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.


కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది.


కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ వ్యాధి వస్తుంది. కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీ తాగేవారిలో కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు 35 శాతం ఎక్కువగా ఉన్నాయని ఒక పరిశోధనలో తేలింది.```


*రక్తపోటును పెంచుతుంది:```

అధిక రక్తపోటు ఫిర్యాదులు ఉన్నవారు కాఫీని త్రాగకూడదు. ఎందుకంటే కాఫీ తాగడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది.```


*గర్భిణీ స్త్రీలు త్రాగకూడదు:```

గర్భిణీ స్త్రీలు ఎక్కువగా కాఫీ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.```


*క్యాన్సర్ వచ్చే అవకాశాలు:```

కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతాయి. కాబట్టి కాఫీని ఎక్కువగా తీసుకోకూడదు. కాఫీ రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే త్రాగాలి.

```

*నరాలను బలహీనపరుస్తుంది:```

కాఫీలో కెఫీన్ అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది నరాలను బలహీనపరుస్తుంది. దీని కారణంగా కండరాలలో నొప్పి యొక్క ఫిర్యాదు ఉంది.```


*గుండెపోటు ప్రమాదం పెరిగింది:```

కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య మొదలవుతుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.✍️```

Dont..start our day .. with coffee... but, water.💦సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సుభాషితమ్

  💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో 𝕝𝕝    *సుసూక్ష్మేణాపి రంధ్రేణ* 

            *ప్రవిశ్యాభ్యంతరం రిపుః* l

            *నాశయేచ్చ శనైఃపశ్చాత్* 

            *ప్లవం సలిల పూరవత్* ll 


తా𝕝𝕝 *చిన్న భద్రతా లోపం ఉన్నా కూడా దేశంలోకి శత్రువులు చొరబడి ఇబ్బంది పెడతారు.... చిన్న చిల్లు ఉన్నా కూడా నిదానంగా పడవ నీట మునిగి పోతుంది కదా?*


ఆ.వె.

*సందునివ్వ చాలు శత్రువులకిలను*

*కూలిపోవు భద్ర కోట కూడ* l 

*చిన్నదైననేమి చిల్లొక్కటుండిన*

*పడవ నీట మునుగు పగిదిగాను* ll


✍️💐🌹🌸🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: పదునేడవ అధ్యాయము

శ్రద్ధాత్రయ విభాగయోగము:శ్రీ భగవానువాచ


విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ 

శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే (13)


దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ 

బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే (14)


అశాస్త్రీయంగా అన్నదానం, మంత్రాలు, దక్షిణ లేకుండా అశ్రద్ధతో ఆచరించే యజ్ఞాన్ని తామసయజ్ఞమని చెబుతారు

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం, పవిత్రంగా వుండడం. కల్లాకపటం లేకుండా ప్రవర్తించడం, బ్రహ్మచర్యదీక్షనూ, అహింసావ్రతాన్నీ అవలంబించడం –వీటిని శరీరంతో చేసే తపస్సని చెబుతారు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

ఎర్రి బాగులు నాన్న కథ!

  "ఆయన సింహం లాంటోడే "..

 ఎర్రి బాగులు నాన్న కథ! 


సింహం !

అడవికి రారాజు !

మగ సింహం ... సింహాల గుంపుకు {pride } రక్షకుడు . 

మిగతా గుంపుల సింహాల నుంచి తన కుటుంబాన్ని కాపాడుతుంది . 

సింహమంటే అడవిలో భయపడని జంతువుండదు .

సింహం ... ఠీవి , రాజసం,  డాబు,  దర్పం అన్నీ ఒక వయసు వరకే !

"వాడు కుక్క చావు చచ్చాడు "అంటారు .

 అంటే కుక్క..  చివరి రోజులు దయనీయంగా ఉంటాయని అర్థం .

మీకు తెలుసా ?

సింహం చివరి రోజులు ఇంతకన్నా దయనీయం .

జింక లాంటి  గడ్డిమేసే జంతువుల పని ఒక విధంగా హ్యాపీ . 

ముసలి  వయసు వచ్చినా ... లేవలేక పోయినా చుట్టూరా గడ్డి ఉంటుంది .

 కడుపు నింపు కోవచ్చు .

"ముసలి జింక పరుగెత్త లేదు . పులి,  సింహం లాంటి వాటికి ఆహారమయిపోతుంది!"  అనుకొంటున్నారా ?

ఆగండి.. ఆ పాయింట్ కొస్తా!


వృద్ధ సింహం !

పళ్ళు బలహీనం .. కండరాలు బలహీనం !

వేటాడ లేదు . 


ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు .

" నీ పని అయిపొయింది .. నువ్వు చేసేది ఏమీ లేదు .. పెత్తనం చాలు .. ఇక దయ చెయ్యి .. "అని ఆ గుంపులో నాయకత్వం కోసం తహతహ  లాడుతున్న యువ మగసింహాలు వృద్ధ సింహాన్ని బయటకు గెంటేస్తాయి .

నిన్నటి రాజసమే .. తన పెత్తనమే .. అంటే పురుషాధిక్యతే ..  నేడు తన పాలిట శాపం అయ్యింది . 

అధికారం పోయింది. 

కుటుంబం దూరం అయ్యింది . 

శరీరం సహకరించదు . 

వేటాడే శక్తి లేదు .

ఒంటరి జీవితం .

 నిన్నటి దాక జగమంత కుటుంబం .. నేడు ఏకాకి జీవితం .


"వృద్ధ జింక పైకి సింహాలు  పులులు  వచ్చి చంపుతాయి" అన్నారు కదా ?

అది హ్యాపీ ఎండింగ్ ! 

గొంతు కొరికి చంపడం వల్ల రెండు నిముషాల్లో ప్రాణం పోతుంది .


అడవికి రారాజు ..  సింహం చావు... ఎలా ఉంటుందో తెలుసా ?

వేటాడితే కానీ కడుపు నిండదు . 

వేటాడే ఓపిక లేదు .

 ఆకలి తో నీరసించి లేవ లేక పడుకొనుంటే...  హైనాలు  దాడి    చేస్తాయి .

 లైవ్ గా ...  పీక్కు  తింటాయి . 

ప్రాణం పోదు .. వెనుక నుంచి  హైనాలు .. కండరాల్ని పీక్కుని తింటున్నాయి . 

విపరీతమయిన నొప్పి...  బాధ .. 

నిన్నటి దాక తాను లేస్తే జంతువులు ఆమడ దూరం పారిపోయేవి . ఇప్పుడు బతికుండగానే పీక్కుని తింటున్నాయి .

భరించలేని టార్చర్ . ... వెనుక వైపు .. పక్క వైపు .. కండరాలు పోతున్నాయి . 

వెధవ ప్రాణం  పోదు .

 ప్రాణం పోవడం...  ఎంతటి బ్లెస్సింగ్ ! 

అరగంట ... గంట...  టార్చర్...  తరువాత .. చివరకు ఎండింగ్ . పెయిన్ ఫుల్ ఎండింగ్ . 

అడవికి రాజు లైఫ్ .. డెత్ ఇది . 


 రాజుల ప్రాణాలు ఇలాగే పోతాయేమో .. యుద్ధ భూమిలో  .. శత్రువుల చేతికి చిక్కితే .... అయ్యో పాపం !

జనాల సింపతికి కూడా నోచుకోకుండా పోయారు .. .. 

చేసిన పాపాలకు శిక్ష అనుకోవాలా ? 

 బూమిపైనే నరకం చవి చూసి అసువులు బాసిన వారెందరో  ! 

"ఒకే వైపే చూడు .. రెండో వైపు చూడకు" అని సమాజం .   


 .. పాపం... నాన్న   సింహంలాంటోడే !

తాగుబోతు .. పెళ్ళాన్ని కొట్టే టైపు..  నాన్నల గురించి కాదు . 

అలాంటి వారు శాడిస్ట్ లు .


పురుషాధిక్య సమాజానికి చెందిన.. సగటు నాన్న కథ .. వ్యధ ..  గుండెతో చదవండి . 


ఉద్యోగం .. వ్యాపారం .. సంపాదన . .. కుటుంబానికి తానే పెద్దదిక్కు .


బాధ కలిగితే అమ్మ ఏడుస్తుంది . 

ఎంతో కొంత మేర ఉపశమనం పొందుతుంది ...  కన్నబిడ్డల సానుభూతిని కూడా !


నాన్న  ఏడవడు. 

"ఏడ్చే మగాడ్ని నమ్మకూడదు " అంటుంది పురుషాధిక్య సమాజం   .

 బేలతనం చూపడం అంటే ఎంత నామోషీ !

అందుకే నాన్న ఏడవడు. 

బాధల్ని ఎవరికీ చెప్పుకోడు. 

"మగాడికి బాధలేంట్రా?" అంటుంది సమాజం . 

అందుకే కష్టాన్ని గుండెలో దాచుకొంటాడు . 

ఎర్రి గుండె .. 

ఎంతని భరిస్తుంది ?   

అందుకే ఎప్పుడో పుసిక్కున ఆగిపోతుంది . 

నాన్నలకే పక్షవాతమొస్తుంది .

అమ్మలకు రావాలని కాదు . 

నాన్నలకే ఎందుకొస్తుంది ?అని సమాజం అడగదు. తెలుసుకోదు . పవర్ ఉన్నోడికి సానుభూతి దక్కదు . 


"నాన్న ముక్కోపి .. అమ్మ ప్రేమకు ప్రతి రూపం"

 . సగటు కుటుంబం లో పిల్లల ఆలోచన ఇది .

 తాను ఎవరి కోసం కష్టపడుతున్నాడో వారి ప్రేమ కూడా పొందలేని దోర్భగ్యం ..నాన్నది ! 


అమ్మ అడిగితే ఇస్తుంది . 

నాన్న .. ఎవరూ అడగక పోయినా ఇస్తాడు .

నిన్నటి పురుషాధిక్య సమాజం లో అన్నీ తానై కుటుంబానికి సర్వం  సమకూర్చేవాడు . 

ఏడిస్తే    ఒంటి   నీరు వృధా అయిపోతుందని దాన్ని కూడా చెమట నీరుగా మార్చి ... రేయి పగలు ఖర్చు పెట్టి ... బతుకు బండికి ఇంధనం సమకూర్చిన వాడు నాన్న . 

అమ్మను కు ప్రేమ  దక్కింది.. కృతజ్ఞత చిక్కింది . 

మరి పిచ్చి నాన్నకో ?? 


నిన్నటి నాన్న లు ఎంతో కొంత అదృష్టవంతులు .

 వృద్ధాప్యం లో ఉమ్మడి కుటుంబం ఉండేది . 


మరి నేటి నాన్నలు ?


నేటి నాన్న { 50 - 70 }:


పాపం సింహం బతుకు . 


వృద్ధాప్యం మీదబడిన...

 1. అమ్మ వింటేజ్ కారు .

 2. నాన్న స్క్రాప్ .


పట్టణంలో..  అమెరికా లో..  కొడుకులు..  కూతుళ్లు ..

"ఇంట్లో అమ్మ ఉంటే ఎంత హాయి .

వంట పని .. ఇంటి పని .. పిల్లల పని .. ఇద్దరు ముగ్గురు పని మనుషులు...  ఉన్నటు లెక్క .. 

అమ్మకు ఆహ్వానం " 


ఫ్లైట్ ఎక్కి అమెరికా కు పోయిన నాన్న నెలలో తిరిగొస్తాడు . 

అమ్మ ఆరు నెలలయినా అక్కడ హ్యాపీ గా ఉండిపోతుంది .


తప్పు పిల్లలది కాదు .. నాన్నదే ..    పురుషాదిక్యదే!   !


పెళ్లయిన కొత్తలో పెళ్ళాం పై పెత్తనం చేసేవాడు .

    "తాను  చెప్పినట్టే వినాలి . తనకు సపర్యలు చెయ్యాలి .

ఆడది ..   తన ఇంటికొచ్చింది .. తనపై ఆధారపడి బతుకుతోంది .. తానే రాజు .. తానే మాస్టర్ "అని అనుకునేవాడు .

ప్రకృతి ధర్మమో ...  కాలం   తెచ్చిన మార్పో!

యాభై అరవై కి వచ్చేటప్పటికి పెళ్ళాం లేకుండా నిముషం కూడా బతక లేని స్థితికి వచ్చేస్తాడు .. నాన్న .


వంట పనితో ... ఇంటి పని తో ఇల్లే స్వర్గం గా బతికింది అమ్మ . 

బోర్ ఫీల్ కాకుండా బతికేస్తుంది ఆమ్మ. 

బోర్ అనేది ఆమె డిక్షనరీ లో లేదు . 

ఆమె పనికి రిటైర్మెంట్ లేదు . 

చేసినత కాలం చేసినంత పని . 

పురుషుడు ఎంతటి అమాయకుడు .. అరవై ఏళ్లకు ఊడి పోయే ఉద్యోగాన్ని చూసి ఎంత మురిసి పోయాడు...   మిడిసి పడ్డాడు ?!! 


 లాక్ డౌన్ కాలం లో అత్యంత సఫర్ అయినవాడు నాన్న . 

ఇది ఎవరూ అర్థం చేసుకోలేక పోయిన కోణం .


 రిటైర్ అయిన నాన్న బతుకు దయనీయం .

 నిన్నటి దాక ఆఫీస్ లో తన డాబు ...  దర్పం . 

రోజంతా బిజీ . 

ఇప్పుడు పట్టించుకొనే వారు లేరు .

 రోజు గడవదు . 

పెళ్లానికేమి.!. హ్యాపీగా కాలం గడిపేస్తుంది .

తనకు నిన్నటి రోజుల విలువ లేదు అని గ్రహించడమే పెద్ద మానసిక పోటు. 

చిన్న ఉద్యోగస్తుడైతే ఫరవాలేదు . 

పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయినవాళ్లు సంగతి ?

ఎంత చెట్టుకు అంత తుఫాను పోటు ! 


నిన్నటి దాక  అప్పోయింట్మెంట్ కోసం ఎంతో మంది ఎదురు చూసే వారు . ఇప్పుడు ఇంట్లో బోర్ కొట్టి ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు . ఒక్కో సారి బ్లాక్ చేస్తున్నారు . 


హత విధి!  పురుషాధిక్య నాన్న కు ఎంతటి సైకలాజికల్ దెబ్బ !


తప్పు నీదే ! 

అరవై దాటాక కూడా .. కండలు ఉడిగి..  ఆదాయం అడుగంటాక కూడా ఇంకా నీ పెత్తనం ఏంటి ముసలోడా ?

నిన్నటి దాక .. చేసావ్ . సరే ..

 పెళ్ళాం వెర్రి బాగులది .

ఇప్పుడు కూతురు ఇంటికి పోయి పెత్తనం చేస్తానంటే కుదురుతుందా ?

కూతురుకి నువ్వంటే అమిత ప్రేమ . 

కానీ ఆమెకో కుటుంబం ఉంది. ... నీలాగా కాకపోయినా ఎంతో కొంత పురుషాధిక్యత కలిగిన అల్లుడు ఉన్నాడు అక్కడ . పైగా కూతురికి జాబ్ .. అర్థం చేసుకోలేవు . ఇమడ లేవు . నెల తిరక్క ముందే ఇండియా కొచ్చేస్తావ్ .


కూతురు దగ్గరయినా నెల ఉంటావు .

 కొడుకు అయితే వారమే !

కొడుకు .. నీ ప్రతి రూపం మరి ...  బిజీ . 

కోడలు . వేరే ఇంటి బిడ్డ !


పోనీ ఒకటి చెప్పు !

కూతురో,  కొడుకో,  అల్లుడో,  కోడలో.. జాలి చూపితే సహిస్తావా ?

నరనరాల్లో పురుషాధిక్యత . 

dominant  నేచర్ ! 


ఏంటేంటి ?

నీ పెళ్ళాం నీ పై   ఆధార  పడి బతికిందా ?

బళ్ళు...  ఎప్ప్పుడో ఓడలయినాయి.. ఎర్రోడా ! 

 

ఇప్పుడు పెళ్ళాం లేకుండా నిముషం బతకలేవు .

 తిట్టడం కోసమయినా ఆమె ఉండాలి . 

మంచి నీళ్లు ఇవ్వడం మొదలు .. ప్లేట్ లో   అన్నం  పెట్టె దాక ఆమె ఉండాల్సిందే .

 అరే పిచ్చోడా .. ఆమెకు     ముట్లు  ఉడిగాక..   ఆమెకు నువ్వు .. నీకు తెలియకుండానే అమ్మ స్థానం ఇచ్చేసావ్ .

 అవును ఇప్పుడు నీ భార్య నీకు అమ్మ .

 వృద్ధాప్యం లో నువ్వు చంటి   పిల్లాడు  అయిపోయావు .


నీ నరనరాల్లో పురుషాధిక్యత...  నీకు తెలియకుండా ఎంత కరుడు కట్టుకొని పోయిదంటే..." నువ్వు లేకుండా నేను బతకలేను .. నువ్వు పొతే నేను నటుడు రంగనాథ్ అయిపోతాను" అని చెప్పలేని స్థితి నీది .

ఆమెకు   ఇదేమైనా కొత్తా?

ఎప్పుడో నీ కోసం .. తన పుట్టింటిని వదలి వచ్చింది .

 కొత్త ప్లేస్ లో కొత్త వాతావరణం లో ఇమిడి పోవడం ఆమెకు అప్పుడే అబ్బింది . 

ఇల్లే ఆమెకు ప్రపంచం . 

హ్యాపీ గా కూతురు ఇంట్లో కొడుకు ఇంట్లో సెటిల్  అయ్యిపోతుంది .

నువ్వు లేకుండా ఆమె బతకగలదు. 

ఆమె లేకుండా నువ్వు బతకలేవు .

ఇంకేమి పిండాకూడు మగపెత్తనం ? 

ముళ్ల కిరీటం ! 


 గతంలోనే బతకాలి అనేది నీ కోరిక . 

టైం ఫ్రీజ్ అయిపోవాలంటే ఎలా ముసలోడా ?

నీ సొంత ఇంట్లోనే ఉండాలి . పెళ్ళాం చేత సపర్యలు చేయించుకోవాలి . దాని పై పెత్తనం చెయ్యాలి ..అంటే ఎలా ?

కాలం మారింది . 

ఆమె మారింది .

 నీకు మాత్రం అడ్పాటేషన్ skills  రాదు . 

పురుషాధిక్యత రానివ్వదు. 


నువ్వు సింహం లాంటోడే .

 అలాగే పెత్తనం చేస్తూ బతికావ్ .

 ఇప్పుడు ముసలి సింహం లాగే నీ బతుకు . 

ఎమోషనల్ బ్రేక్ డౌన్ . 

కూతురు ఇంట్లో ఉండలేవు .. కొడుకు ఇంట్లో ఉండలేవు .. వృద్ధాశ్రమానికి పోలేవు .. అదొక నామోషీ ..

 ఇన్నాళ్లు నిన్ను అర్థం చేసుకొన్న నీ భార్య .. పాపం ఆమె మాత్రం ఎన్ని రోజులు భరిస్తుంది .?

కొడుకుతో కూతురితో బతకొద్దా? 

మనవళ్లు మానవరాండ్రు .. నీ దగ్గరికి వస్తే అయిదు నిమషాలు.. ఆమెతో అయితే రోజంతా గడుపుతారు . 

అందరికీ దూరం  అయ్యావు .

 గతాన్ని తిరిగి తేలేవు.. 

వర్తమానాన్ని ఒప్పుకోలేవు. 

ఏమి బతుకు రా సామీ !


అంతేలే .. నువ్వేమి చేయగలవు ?? 

కాలం మారింది . ఉమ్మడి కుటుంబాలు పోయాయి . 


అమెరికా లో ... ఆస్ట్రేలియా లో పిలల్లు .   వాళ్ళ  బతుకులు వాళ్ళు బతకొద్దా ?

ఊళ్ళో నుంచి ఉద్యోగం కోసం నువ్వు ఆ రోజుల్లో టౌన్ కు రాలేదా ?


 బాధ ను గుండెల్లో దాచుకోకయ్యా!

"అమ్మా.. తల్లీ.. పురుషాధిక్యత  ముళ్ల  కిరీటం .. నాన్నను అర్థం చేసుకున్నోరు లేరు ".. అని  చెప్పు ..

"  పురుషాధిక్యత వద్దు రా..  నా బంగారు తండ్రి" అని కొడుక్కి కూడా చెప్పు .. 

డీప్ స్టేట్ గాళ్ళు పురుషాధిక్యత పేరు చెప్పి పెళ్లిళ్లు కాకుండా యువజనం బ్రెయిన్ వాష్ చేస్తున్నారు .


 సింహం అడవికి రారాజే .


 తన దర్పం .. దాష్టీకాలకి అది...  ఇదే జన్మలో కష్టాలు అనుభవించి కుక్క చావు .. కాదు కాదు .. సింహం చావు చస్తుంది .

 సింహాన్ని అర్థం చేసుకొన్న సమాజం ... నాన్న ను అర్థం చేసుకోదు. పురుషాధిక్య నాన్న చచ్చిపోయాడు . 

మిగిలిన వాళ్ళు కూడా చచ్చి పోతారు . 

బాధ కరమయిన చివరి రోజులు అనుభవించి పోతారు . 

అర్థం చేసుకోండి తల్లులూ .. ఈ సింహం  బతుకొద్దు తండ్రులూ!


చివరిగా ఒక మాట !

అమ్మా.. కొంతమంది మహిళలు పురుషాధిక్యత కింద నలిగి పోయిన మాట వాస్తవం . 

మీ బతుకులో .. మీ భర్త తాగుబోతు .. తిరుగుపోతు అయివుండొచ్చు . వాడిని భరించల్లేక మీరు దూరం జరిగి హాయిగా బతుకుతుండవచ్చు . అక్కడి దాక మీకు హాట్స్ ఆఫ్ .

 కానీ సోషల్ మీడియా దొరికిందని మీకు    కాలక్షేపం   కోసమో .. ఫెమినిస్ట్ అని పేరు కోసమో ..

...  మొత్తం పురుష జాతి పై విషం చల్లుతూ పోస్ట్ లు పెట్టి యువత మనస్సు కకావికలం చెయ్యొద్దు ...

...  సమాజం అనే నౌకకు చిల్లి పెట్టొద్దు . 

మీ నాన్న మగాడే . మీ కొడుకు మగాడే .

స్త్రీ.. పురుషుడు కలిస్తేనే జీవితం . సమాజం .

పచ్చటి కాపురాల్లో నిప్పులు పొయ్యొద్దు .

ఐదు వారాల అద్భుత వ్రతం, ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం.

 శ్రీ మహాలక్ష్మీచే స్వయంగా చెప్పబడిన, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే ఐదు వారాల అద్భుత వ్రతం, ఈ మార్గశిర లక్ష్మీవార  వ్రతం.


* మార్గశిరమాసం గురువారము లక్ష్మీదేవి పూజ.. అప్పులూ.. కష్టాలు తీరుతాయి..! *


మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారం. విష్ణువుకు ఎంతో ఇష్టమైన మార్గశిరమాసం కొనసాగుతుంది. ఈ మాసంలో లక్ష్మీ దేవికి చేసే పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయన్నది పండితులు చెబుతున్నారు. 


మార్గశిర మాసం కేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. అద్భుత వ్రతంగా పేరు పొందిన మార్గశిర గురువారం లక్ష్మీవ్రతం, హనుమద్వ్రతం వంటి వ్రతాలనూ ఈ మాసంలో ఆచరిస్తారు.


మార్గశిర మాసంలో ప్రతి గురువారం వరలక్ష్మీ వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మాసంలో లక్ష్మీ పూజ చెయ్యడం శుభప్రదంగా భావిస్తారు. ఈ వ్రతం చేస్తే ఆర్థికంగా బలపడతారని పండితులు చెబుతున్నారు.


ఈ ఏడాది ( 2025) మార్గశిర మాసం మొదటి గురువారం నవంబర్​ 27 వ తేది వచ్చింది. గురువారంను లక్ష్మీవారమని కూడా అంటారు. మార్గశిర మాసంలో గురువారాలలో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలోనూ, ఈ పూజను ఆచరించడం సర్వ శ్రేష్టం. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద. ఆరోగ్య భాగ్యం చేకూరతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.


*🌴 మార్గశిర గురువారం లక్ష్మీవ్రతం 🌴*


ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారూ ఇళ్ళను గోమయం (ఆవుపేడ)తో అలికి, ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. 4 వర్ణాలవారు కలిసి ఒక చోట చేరి, లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా, వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో..


మహర్షి ! ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతుహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు.


గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది*. "లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు."


నారదుడు: మహనీయా!  ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి" అనగా.... పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు.


ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో *స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. 


విష్ణుమూర్తి కూడా ఆ వెనకాతలే పయనమై భూలోకానికి వచ్చి, ఒక ముసలి బ్రహ్మణ స్త్రీ రూపంలో ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వా ! ఈ రోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ . ఇల్లు గోమయంతో అలికి ముగ్గుపెట్టలేదేంటి? అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ,  అమ్మా ! ఆ వ్రతం ఏమిటి? ఏలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగగా మహలక్ష్మీ మందహాసంతో ఈ విధంగా పలికింది.


మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి, ఇల్లు గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో , బొమ్మలతో అందంగా తయారుచేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని, దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలతపాత్రను ఉంచి, పసుపునీటితో కడిగిన పోకచెక్క(వక్క)ను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని, కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్ర మీద పోయాలి. ఎరుపురంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి, ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదటపాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా, నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవెధ్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం.


*🌻 పఠించ వలసిన మంత్రాలు 🌻*


ఓంశ్రీమహాలక్ష్మ్యై నమః.. అనే లక్ష్మీ మంత్రం 108 సార్లు. 

ఓంశ్రీమహాలక్ష్మీవిద్మహే... విష్ణుపత్న్యైచాధీమహి ...తన్నోలక్ష్మీ ప్రచోదయాత్..లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని జపించండి.


లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది. 


రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిధి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచి పెట్టకపోతే మాత్రం లక్ష్మికటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని, పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి,  పసుపుకుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది.


ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి, పొయ్యి బూడిద తీయకపోయిన, ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మీ నిలువదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లువాకిలి చిమ్మదో, అంట్లుకడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండువైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలువదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది.


అదే విధంగా గురువారం ఉడకని పదార్ధాలు, నిషిద్ధ పదార్ధాలు తినే ఇంట, ఆశుభ్రప్రదేశాలలో తిరగడం, అత్తమామాలను దూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు. భోజనము ముందు, తరువాత కాళ్ళు, చేతులు, ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ, ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా, అసంధర్భంగా, గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీ ఉంటుంది. ఏ స్ర్తీ గురువారం దానధర్మాలు, పూజలు చేయదో, భర్తతో గోడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం, అమావాస్యా , సంక్రాంతి (ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది) తిధులలో నిషిద్ధ పదార్ధాలను తినే స్త్రీ యమపురికి (నరకానికి) పోతుంది.


జ్ఞానంతో స్త్రీ,  పైన చెప్పబడ్డ 3 తిథులలో నిషిద్ధ పదార్ధములను తినకుండా, నక్తం (ఒంటిపూట, ఒకపొద్దు) ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్రపౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది.

https://whatsapp.com/channel/0029Vb6FSig60eBmzyf6qs44



ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహా పాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర, దక్షిణం దిక్కులకు కూర్చుని(ముఖం పెట్టి) భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవంయందు, బ్రాహ్మణులయందు భక్తి విశ్వాసాలు లేనటువంటి , పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇళ్ళు స్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీ దేవి రాదు. నిత్యదరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది. అని లక్ష్మీ దేవి ఆ ముసలి బ్రాహ్మణస్త్రీకి వివరించి, ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసిరావడానికి బయలుదేరింది.


ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేదస్త్రీ ప్రతి రోజు ఇల్లును గోమయంతో అలికి , ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి , లక్ష్మీ దేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి, ధూపం వేసి, నైవేద్యాలు పెట్టి, పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మీ ఆమె ఇంట పాదాలు మోపింది


ఓ భక్తురాలా ! నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకో , ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీ దేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి "నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించేవరకు సకలసంపదలను అనుభవుస్తావు. మరణం తరువాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది. నా వ్రతం విడువకుండా చేయి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగభాగ్యాలు, ఐదుగురు కూమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది. అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు.

స్వస్తి.. మీ సురేష్