15, జులై 2025, మంగళవారం

సామెతల్లో ఆయుర్వేదం!

 సామెతల్లో ఆయుర్వేదం!15-07-2025

--------------------

.🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" ..అని ..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికిమూలికలతో తయారు చేసే లేహ్యం ,పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !

.

పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ...ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే "అశ్వగంధ" పెద్ద మందు !

.

త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !

.

"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు,కనీసం కందిపుల్ల" ...ఇవి పళ్ళుతోముకోవడానికన్నమాట

.

వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు ..

.

అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని ...సామెత ఏమంటే ...."కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "

.

పుండుమీదకు ఉమ్మెత్త ,నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ...సామెత ఇలా ..."పుండుమీదకు నూనెలేదంటే గారెలొండే పెండ్లామా అన్నట్లు"..."ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "...

.

వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది ...సామెత ...ఇలా ..."ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "

.

కరక్కాయ పువ్వు ,పిందె,పండు చాలా ఉపయోగకరమైనవి ...శ్వాస,కాస,ఉదర,క్రిమి,గుల్మ,హృద్రోగం ,గ్రహణి,కామిల,పాండు ..ఇన్ని రోగాలు హరిస్తుంది..అందుకే ..."మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి "..అని సామెత

.

ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది ..సామెత ఇదుగో ..."పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "...."ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి "

.

అలానే ...శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ..."కక్కిన బిడ్డ దక్కుతుంది " అని...

.

ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి !

.

పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ?

.

సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ?

.

అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది!

జాతి జీవనాడి నశిస్తుంది!


ఇంగ్లీష్ మీడియం మోజులో పడ్డ తెలుగు జాతికి....

తెలుగు అంతరించాక మాత్రమే తెలుగు విలువ తెలుస్తుంది.🕉️🕉️🕉️

దక్షిణాయన పుణ్యకాలం

 *దక్షిణాయన పుణ్యకాలం లో ఏమి చెయ్యాలి* ?


జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు.... అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి వుంటుంది. అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. శనిగ్రహం 2 1/2 సం పడు తుంది. రాహు, కేతువులకి 1 1/2 సం, రవికి నెల రోజులు... ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొన (మేషాది మీనరా శులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్త వుతుంది. 


సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని

సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని

సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని

 *సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని* 


ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి ‘జరగటం’, ‘ప్రవేశించటం’ అని చెప్పొచ్చు.


 *సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అ ని అర్ధం. ఇది జూలై 15 నుంచి 17 తేది వరకు జరుగుతూ వుంటుంది. సాధారణంగా జూలై 16వ తేదీనే!* 


 *ఈ కర్కాటక సంక్రమణాన్ని ‘దక్షణాయన’ మని అంటుంటారు. (మనకి సంవత్సరానికి అయన ములు రెండు. ఒకటి ఉత్తరాయనం, రెండవది దక్షిణాయనం) ఇక తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం, తర్వాత కన్యా రాశి ప్రవేశం (వినాయక చవితి వస్తుంది), తులారాశి ప్రవేశం (దసరాలు). ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలా న్ని సంక్రమణంగా చెప్తాం. (మకర సంక్రమణం (సంక్రాంతి)... మకరరాశి ప్రవేశం! కుంభరాశి ప్రవేశం (మహాశివరాత్రి)) అయితే సూర్యుని మకర సంక్రమణ మే ‘ఉత్తరాయన పుణ్యకాలం’.* 


ఏ తిథులతోను సంబంధం లేకుండాను, ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ-దక్షిణాయన మనేవి. *జనవరి 14న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ, జూలై 16న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ, వ్యవహరిస్తారు. ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.* 


సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు. *సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు* . అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. *దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.* 


దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రాఖీపూర్ణిమ, ఆదిపరాశక్తి మహిమలను చాటే దసరా, నరక బాధలు తొలగించిన దీపావళి, శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక, మార్గశిర మాసాలు, గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి. *దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి.* 


దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నృసింహ, మహిషాసుర మర్దని, దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని, లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.


సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే *మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు.* ఈరోజు పుణ్యనదీ స్నాన, దాన, జప, హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. మనందరము కూడా దక్షిణాయన సందర్భంగా మన ఆచార సంప్రదాయాలు పాటిద్దాం. భావి తరాలకు మన సంస్కృతిని తెలియజేద్దాం.

ఆదిలోనే హంసపాదు*

 *ఆదిలోనే హంసపాదు*

ఏదైనా పని మొదలు పెట్టిన వెంటనే విఘ్నాలు కలిగితే ఈ సామెతను వాడతారు. దేవాలయాలలో జరిగే ఉత్సవాల సమయంలో ఉత్సవ మూర్తులకు వివిధ వాహనాలపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. గ్రామోత్సవ సమయంలో వాహనాన్ని కొంతమంది భక్తులు తమ భుజంపై మోస్తూ ఉంటారు. గ్రామోత్సవం జరుగుతున్నంత సేపు వాహన బరువు మోత్తాన్ని తమ భుజంపై ఉంచడం చాలా కష్టం కాబట్టి కొంత వెసులు బాటు కోసం ఏర్పరచుకున్న పరికరాన్ని హంసపాదు అంటారు. హంసపాదు T, Y ఆకారానికి మధ్యస్తంగా ఉంటుంది. వాహనసేవ జరిగే సమయంలో వాహనాన్ని సరిగా నిలబెట్టేందుకు 4 నుంచి 8 హంసపాదులు అవసరమవుతాయి. ప్రారంభంలోనే అవాంతరం ఏర్పడితే ఈ సామెతను ఉపయోగిస్తారు.


అలాగే 

వ్రాసేటప్పుడు తప్పిపోయిన పదాన్ని చెప్పడానికి అక్కడ ఒక గుర్తు పెట్టి దానిని మరొక చోట లేదా పుట క్రిందనో చూపుతారు.

అంటే మొదట్లో నే అవాంతరం ఏర్పడినది అని తెలపడానికి ఈ సామెత వాడతారు.

ఇది సాధారణంగా తాటియాకు మీద ఘంటంతో వ్రాసేటప్పుడు గాని వ్రాసిన తరువాత గాని ఎక్కడ ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసినప్పుడు చెరిపి వేయడానికి గాని చేర్చడానికి గాని వీలుపడదు. అప్పుడు అంచపాదం గుర్తు పెట్టి ఆవతల వ్రాస్తారు.

ఈ వ్యవహారాలు నేడు ఇప్పటికీ దస్తావేజులు వ్రాసే వ్రాయసగాండ్రు చేస్తూ ఉండడం పరిపాటే.

మూల తాటియాకు ప్రతులల్లో కూడా ఉంటాయి.

ధనవంతుడు కడలికరణి

 *2173*

*కం*

ధనవంతుడు కడలికరణి

కనబడు దాహార్తిదీర్చ కర్మరహితుడౌ

ఘనగుణి కూపంపు చెలువ

జనులందరిదప్పిదీర్చ సరసుడు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనవంతుడు సముద్రం వలెకనబడిననూ దాహార్తి తీర్చడానికి పనికిరాడు. గొప్ప గుణవంతుడు నుయ్యి వలె జనులందరి దప్పిక నూ తీర్చగలడు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

జగద్గురువులూ చతురులే*

 *జగద్గురువులూ చతురులే*

    ఒకసారి విద్వాంసుడు శృంగేరీ 34వ పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీమహస్వామివారి దర్శనానికి శృంగేరీ వెళ్ళాడు. స్వామివారికి బిక్షావందనం చేసి...స్వామివారితో ఇలా అన్నాడట.

 "భగవద్గీతలో తాను నిష్టాతుడనని తనకెంతో ప్రావీణ్యం ఉన్నదని ఎన్నో దేవాలయాల్లో, సభల్లో భగవద్గీతమీద ప్రవచనాలు చేస్తానని, అందుకు తమరు కూడా శృంగేరీ పీఠ అనుబంధ శాఖల్లో తనకు అవకాశము ప్రసాదించవలసినదిగా స్వామివారిని ప్రార్ధించాడు.

 మహాస్వామివారు ఆ విద్వాంసుని గౌరవపూర్వక అభ్యర్ధనని విని సంతృప్తిగా తగిన ఏర్పాట్లను బెంగుళూరులో ప్రథమంగా చేయించారు.

 వారి మొదటిరోజు భగవద్గీత ప్రవచనానికి వందమంది వరకు శ్రోతలు హాజరయి ఆ ప్రవచనాన్ని విన్నారు.

 రెండోరోజు శ్రోతల సంఖ్య బాగా తగ్గింది. ముప్ఫయి మంది వరకు ఆశీనులై విన్నారు.

 మూడోరోజున కేవలం ఒక ఐదుగురు వరకే వచ్చారు. సమావేశ మందిరం వెల వెల బోయింది. ఈ విషయం జగద్గురువుల దరికి చేరింది.

ఆ విద్వాంసుడు శృంగేరీకి వెళ్ళాడు.

అదే రోజు రాత్రి స్వామివారి పూజానంతరం, ఆ పండితుడు జగద్గురువులతో " ఇదేం పట్టణమండీ! భగవద్గీత అంటే బొత్తిగా ఎవరికీ ఇష్టం లేనట్లు ఉంది" అని మిక్కిలి బాధతో స్వామివారికి వినమ్రపూర్వకంగా విన్నవించారు. 

అందుకు స్వామివారు చిరు దరహాసంతో తమ అమృత వాక్కుతో ఇలా అన్నారు " ఎందుకు తమరు అంతలా చింతిస్తారు! భగవద్గీతను శ్రీకృష్ణుడు ఈ విశ్వానికి తెలిసేలా చెప్పినప్పుడు విన్నది ఎంతమందో కాదు కదా! కేవలం అర్జునుడొక్కడేగా!" అని ఆయన్ని సముదాయించి పంపారట.

కామెంటు చేసెముందు

 కామెంటు చేసెముందు మీ పేరు ఫొను నెంబెరు తెలుపండి

కామకళ -- స్వరూపం _నిరూపణ🙏 నాల్గవ భాగం

 🙏కామకళ -- స్వరూపం _నిరూపణ🙏

                   నాల్గవ భాగం

       వికాసము పొందినటువంటి రక్త బిందువు వలన, ఆ బ్రహ్మమే అంకురముగా గల శబ్ద బ్రహ్మముగా ఆవిర్భవించింది. రక్త బిందువనగా మాయాశబలిత బ్రహ్మము(మాయచేత చలించు లేదా స్పందించు బ్రహ్మము ). ఆ బ్రహ్మమునుండి అనాహత శబ్దము పుట్టింది.అనాహతం అంటే ప్రతిధ్వని లేని ధ్వని. అనాహత మొట్టమొదట ఆవిర్భవించినది అనాహతం నుంచి ఆవిర్భావించినవి శబ్దాలే కనుక దానిని అనాహతం లేదా మ్రోగించని శబ్దం అని అంటారు. అదియే నాదబ్రహ్మ. ఆ నాదము వలన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి అనబడే పంచభూతాలతో కూడిన ప్రకృతి జనించినది. అకారాది హకారాంతము అంటే అ నుండి హ వరకు గల అక్షరాలు ఉత్పన్నమైనాయి. పంచభూతాలు రూపాలైనాయి. అక్షరాలు నామాలైనాయి.


       ఈశ్వరుడు అనేటటువంటి మాయా ప్రతిబింబశక్తి కారణమై, రజోగుణముతో ఉద్రిక్తము అయింది . అప్పుడు మహత్‌ అని ప్రసిద్ధమై, అందులో విక్షేపశక్తి (వ్యాపాక శక్తి) విజృంభించినది. ఆ విక్షేప శక్తి యొక్క ప్రతిబింబ రూపమే హిరణ్యగర్భుడయినది. ఇతడే దృశ్య-అదృశ్యమైన రూపము కలిగి, మహతత్త్వమునకు అభిమానిగా ఉన్నాడు.(సృష్టి మొత్తం ఒకే పురుషుడుగా ఉండుట) అందువలన ఆ హిరణ్యగర్భునికి మహత్‌, అహంకారము అని పేరు కలిగినది.


కామకళ నిరూపణ


మూలకూటత్రయ-కళేబరా - లలితా సహస్రనామంలోని నామము .

మూలస్య కుటత్రయమేవ కళేబరం (=స్థూలరూపం) యస్యాః సా 


మూల మంత్రం యొక్క మూడు విభాగాలు ఆమె శరీరాన్ని ఏర్పరుస్తాయి.అదే అమ్మవారి స్థూలరూపం అని గ్రహించండి 


మంత్రం యొక్క మూడు కూటాలు ఆమె భౌతిక లేదా సూక్ష్మ రూపాన్ని ఏర్పరుస్తాయి.


అసలు అర్థంలో మూల అనే పదానికి కామకళ అని పిలువబడే సూక్ష్మ శరీరం అని అర్ధం , మరియు విభజనలు కామకళ యొక్క భాగాలు. కామకళ లోని మొదటి భాగాన్ని ఊర్ధ్వ బిందువు అని , రెండవ భాగాన్ని రెండు సూర్య చంద్ర బిందువులని మరియు చివరి భాగాన్ని సార్ధకళ అని అంటారు .

త్రయ అంటే మూడు. పంచదశి మంత్రంలోని మూడు కూటాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. పంచదశికి 'కామకళ ' మూలమని మనం చూశాం. కాబట్టి, ఆమె భౌతిక మరియు సూక్ష్మ రూపాలు రెండూ 'కామకళ'ను సూచిస్తాయని ఇది సూచిస్తుంది. మూడు సూక్ష్మ రూపాలలో, మొదటి సూక్ష్మ రూపం పంచదశి మంత్రం, . రెండవ సూక్ష్మ రూపం , కామకళ రూపం ఇక్కడ చర్చించబడింది. క్లుప్తంగా చెప్పాలంటే, మూడు బిందువులు త్రికోణంగా కలిగిన హంస మరియు సోహం (హంస మంత్రం) కలయికను కామకళ అంటారు. ఇది లలితాంబిక యొక్క వాస్తవ భౌతిక రేఖాచిత్రం. ఇందులో ఉన్న బీజం 'ఈం '. ఈ బీజం చాలా శక్తివంతమైనది మరియు షోడశీ మంత్రంలో ఈ బీజాన్ని ఎలా ఉపయోగించాలో ఈ అంశం తెలుసుకొని శ్రీం బీజం చేర్చుకోవాలి . 


మంత్రాలు మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి - పురుష, స్త్రీ మరియు తటస్థ .


హుమ్ , వషట్ మరియు ఫట్‌తో ముగిసే మంత్రాలు పురుష మంత్రం.


స్వాహా మరియు వౌషట్ తో ముగిసేవి స్త్రీ దేవతా మంత్రాలు ;


నమః తో ముగియడం తటస్థ మంత్రాలు .


పురుష మరియు తటస్థ మంత్రాలను "మంత్రం" అని పిలుస్తారు మరియు స్త్రీ దేవతా మంత్రాలు " విద్య " అని పిలుస్తారు, అందుకే షోడశి మంత్రానికి శ్రీవిద్య అని పేరు.


జపం మూడు రకాలు:


1.వాచ్యం - వినబడేలా చేయబడింది


2. ఉపాంశు - గుసగుసల వలె జపించడం 


3. మానస – మానసికంగా చేస్తారు.

హ్రీం, శ్రీం సౌః వంటి బీజ మంత్రాలు అని పిలువబడే ఏక-అక్షర మంత్రాలు గుర్తుంచుకోవడానికి మరియు పఠించడానికి సులభమైనవి; అవి కూడా అత్యంత శక్తివంతమైనవి. ఒక చిన్న విత్తనంలో గంభీరమైన చెట్టు ఉన్నట్లుగా, ప్రతి బీజంలో అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సృజనాత్మక శక్తి ఉంటుందని గ్రహించండి . ఈ బీజాలలో పురాతనమైనది మరియు విస్తృతంగా తెలిసినది ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఉపనిషత్ చెబుతోంది.

ఓంను ప్రణవ మని పిలుస్తారు, 

ఓం అనేది విశ్వం యొక్క “ప్రాథమిక బీజం ”-ఈ ప్రపంచం మొత్తం, “ఓం తప్ప మరొకటి కాదు” అని ఒక పురాతన వచనం చెబుతోంది. ఇది అన్ని ఇతర మంత్రాలు ఉద్భవించే మూల మంత్రంగా కూడా పరిగణించబడుతుంది మరియు వేదాల యొక్క అనేక వేల శ్లోకాల యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. కఠోపనిషత్తు ప్రకారం, ఓం అనేది "వేదాలన్నీ సాధన చేసే పదం."


అందుకని, ఓం అనేది ధ్యాన బీజం ., ఓం "మనలోని అనంతమైన అనుభవాన్ని" వ్యక్తపరుస్తుంది . ఈ విధంగా, ఓం జపించడం అనేది మనలో ఉన్న దైవాన్ని తాకడానికి సులభమైన మార్గం.

ఓం అనేది వైదిక కామకళ 

                     సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

చమత్కారాలు

 సేకరణ 

_.🌹..(శుభోదయం)...🌹_ 

*_👌భాషా చమత్కారాలు🤗_*

-----------------------

*మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళాడు. "టిఫినేముంది?" అనడిగాడు.*

 

*"దోసై" అన్నాడు హోటల్ వాడు. "సరే వేసై" అన్నాడు శ్రీశ్రీ.*


*మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్ళి... "టిఫినేముంది?" అని అడిగాడు. "అట్లు" తప్ప మరేం లేవు సర్! అన్నాడు వాడు. "సరే అట్లే కానీ" అన్నాడు శ్రీశ్రీ.*


*ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు.* 


*ప్లాట్ ఫాం మీద ఓ పరిచయస్తుడు కనిపించి "ఊరికేనా?" అనడిగాడు.* 


*"లేదు ఊరికే..." అని బదులిచ్చాడు శ్రీశ్రీ.*


*ఒక ఊరిలో ఒక చోట ఒక బోర్డ్ పై "ఇక్కడ వేడి తేనీరు దొరుకును" అని వ్రాసి ఉండటంతో "అరే ! ఇక్కడ వేడితే కానీ నీరు దొరకదా?" అనడిగాడు.*


*ఓ ఇంటి ముందు "కుక్కలున్నవి జాగ్రత్త" అనే బోర్డ్ చూసి, ఆశ్చర్యం నటిస్తూ.. "అరే ఇంతకుముందు ఇక్కడ మనుషులుండే వారే...!!!" అనన్నాడు.*


*ఓ కుర్రాడు ఒక పద్యం వల్లె వేస్తున్నాడు "ఎవడు రాత్రి లోకకంఠకుడు," అని వల్లె వేయటం విని "ఒరే! మొద్దబ్బాయ్! అలాకాదురా ! అది _"ఎవడురా త్రిలోక కంటకుడు"_ అని సరి చేశాడు.*


*_"జమాల్ భాషా - తోక - మాల్ భాషా ఇట్లనెను"_ అనేది తప్పు. జమాల్ భాషాతో కమాల్ భాషా ఇట్లనెను అనేది రైటు.*


*ఓ హరిదాసు విశ్వనాథ సత్య నారాయణ గార్ని కలిసి ఓ హరికథ ఏర్పాటు చేయటానికి సహకరించమని అడిగాడు.* 


*_"మీ ఊరిలోనే చెప్ప కూడదటయ్యా!"_ అనన్నాడు సత్యనారాయణగారు.* 


*_"మా ఊరి వారు చెప్పిచ్చు కోరండి"_ అనన్నాడా హరిదాసు.* 


*_"అయితే మా ఊరి వారు చెప్పుచ్చు కుంటారే"_ అనన్నాడు సత్యనారాయణగారు*

--------------------

*"దోసె," ; "పూరీ"; " వడ" ; "సాంబారు" పదాలతో శివపార్వతుల కల్యాణం గురించిన పద్యం :*


_మత్తేభం._ 

*_జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యమొప్పారగన్!_* 

*_నడయాడెన్ ఘలుఘల్లనన్ హొయలు చిందంజాజి పూరీతి;పా_*

*_వడ యట్టిట్టుల చిందులాడి పడగా భవ్యాత్మ యైనట్టి యా_*

*_పడతిన్ బార్వతి బెండ్లియాడితివి సాంబా! రుద్ర! సర్వేశ్వరా!_*


_----స్వస్తి! 🙏----_

*‘ధర్మం’ అంటే ఏమిటి?*

 *‘ధర్మం’ అంటే ఏమిటి?*



ఇది చాల క్లిష్టమైన ప్రశ్న! వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న! ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి చాలా లోతువుంది. చాలా సంక్లిష్టత ఉంది. చాలా నిగూఢత ఉంది. చాలా విశాలత ఉంది.


‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’


ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి.


ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్ధము. 

(ధృ – ధారణే). 


ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.


ధర్మము – సామాన్యధర్మం, విశేషధర్మం అని రెండు రకాలు.


శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|

హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||


“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. 


అంటే…,


1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంఠిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి..

‘ఇది ధర్మం’.


2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కొనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు.    

‘ఇది ధర్మం’.


3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి.

‘ఇది ధర్మం’.


4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికొనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు.  

‘ఇది ధర్మం’.


5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. 

‘ఇది ధర్మం’.


6. చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాన్ని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. 

‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడినైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కింపురుషులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. 

కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి.‘ఇది ధర్మం’.


7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు. 

‘ఇది ధర్మం’.


8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం అవమానం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరొకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గొప్పదనాన్నీ పాతాళానికి త్రొక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. 

‘ఇది ధర్మం’.


9. మానవునికి ఆహారం ఎంత ముఖ్యమో, వివేకం కూడా అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. 

‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా, భిక్షమెత్తి అయినా చదువుకోవాలి!’ అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. 

‘ఇది ధర్మం’.


10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని పతనావస్థకు నెడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. “తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.”

సందేహాలు

 🔵 నిత్య జీవితంలో చాలామందికి ఏర్పడే సందేహాలు ,

▫▫▫▫▫▫▫▫▫▫▫▫▫

🔵1. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.

🔲2. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

🔴3. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.

🔷4. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగడం

5. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.


6. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.

7. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.

8. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.

9. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

10. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.


11. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.

12. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.

13. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.

14. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.

15. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.


16. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.

17. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.

18. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

19. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.

20. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


21. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.

22. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.

23. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.

24. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.

25. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.


26. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.

27. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.

28. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.

29. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.

30. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


31. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.

32. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

33. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.

34. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.

35. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.


36. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.

37. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.

38. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.

39. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.

40. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.


41. దిగంబరంగా నిద్రపోరాదు.

42. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.

43. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.

44. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.

45. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.


46. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.

47. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.

48. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.

49. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.

50. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.