24, సెప్టెంబర్ 2020, గురువారం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు-2020,

 తిరుమ‌ల‌, 2020 సెప్టెంబ‌రు 24,



స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌ మలయప్ప


         శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా శ్రీవారి ఆలయంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు.


       సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

కామెంట్‌లు లేవు: