24, సెప్టెంబర్ 2020, గురువారం

జ్యోతిః లింగం.

 జ్యోతిః లింగం. యివి శక్తిని వివిధ రూపములలో నిక్షిప్తం చేసి ఆయా స్థలములలో జియెూలాజికల్గా భూగమనమునకు తద్వారా ప్రకృతి చైతన్య మునకు జీవ సృష్టికి ఆధారముగా యున్నవి. గుడి లింగం కాదు. గుడిలో యున్న లింగరూపంలో గల శక్తి నిక్షిప్తమై యున్నది. అది మన కంటికి స్వయం ప్రకాశం కాదు.మానవ నిర్మిత ములు కావు. ఎవరూ వాటిని లింగ రూపములను ఏసైన్నుతోను తయారు చేసినవి కావు.వాటి మూలకములయెక్క స్వభావం యిది అనివాటి వాట్స్ శక్తి అనంతమైన రేడియేషన్ సూత్ర ప్రకారం విభజించి దానిని పదార్ధ రూపంలో బంధించి దానిని చైతన్యపరచుటయే ప్రధాన లక్షణం. 12 రకాలైన లింగములు వాటి లక్షణము దేనికి దానిదే వరకే ఫార్ములా కాదు వివిధ కోణము లలో వివిధ పదార్ధలక్షణములతో సంయెూగముతో కూడిన సూత్రములు. అని యీ సృష్టి వున్నంత వరకూ ఎవరికీ అర్ధం కాదు భౌతికంగా.అందుకే వృధా ప్రయాసము మాని జీవి యెక్కి లక్ష్యం ఏమిటో సంపాదనతో కాలం గడుపుట మాని అది దేహరక్షణలో వక భాగము మాత్రమేయని తెలియుట ఙ్ఞానం. అర్జునుడుతోపాటు ఎంతోమంది సాధన చేసి శ్రీ శైలంలో తపస్సు చేసి మంత్ర శక్తి సంపాదించి శస్త్ర రూపంలో అర్హత సాధించారు. శ్రీ అనే పూర్ణ శక్తి ఆధారము నిరంతరంగా చలన శక్తి కలిగిన కొండ అని అది స్థిరంగా వుండును. దానిని తెలుసుకొనవలెనన్న సాధన చేయవలెను. దక్షిణ ప్రాంత వాసులకు వారు చేయు సాధనా శక్తి కి మూల బింధువు శ్రీ శైలం.శ్రీ అనగా పార్వతీ పరమేశ్వరుల మూల ప్రకృతి యైన మూల శక్తికి కేంద్రమని మన ఆరాధనలు సమస్తం అచ్చటనుండి మూల ముశక్తిలో కలియుటకై ఆధార భూతమని తెలియును. రాహు కేతు శక్తుల కలయిక యే శ్రీ యని దాని స్వరూపం పాశుపతమని ఆదిశంకరులు మెుదలగు ఎందరో మహానుభావులు బావులు ధర్మెోధ్దరణకే వారు అక్కడ తపస్సు చేసి మంత్ర రహస్యములను తెలియజేసిరి .సాధనకు శ్రీ శైలము వక మంచి ప్రదేశం. జ్యోతి లింగ రూపంలో కల ఉష శక్తిని తెలియుట జ్యోతి ఉష శాస్త్రమని నక్షత్రాలు గ్రహాల శక్తిని తెలియుట మన కోరికలకు కాదు. కర్మ ఫలములను అనుభవమునకే గాని అది కేవలం కోరికలు, అందునా అన్నీ శుభ ఫలములకు కాదని గ్రహించ వలెను. పాశుపతమని వున్నా ఎక్కడా మహాభారతంలో ప్రయెూగించినట్టు లేదు. ఎందుకనగా అంత శక్తి కలవాడు గావున అజేయుడు. శత్రువును భయపెట్టుటకు మరియు దాని శక్తని ప్రపంచమునకు మానవాళికి తెలియుట యే దాని ప్రయోజనం.జీవ వినాశమునకు ప్రయెూగించుటకు కాదని తెలియును. తెలుసుకుని ఆచరణలో పెట్టుటకు కర్మ ఫలమును ఆనందంగా అనుభవించుటచేత శక్తి లక్షణముగా తెలియును.

కామెంట్‌లు లేవు: