24, సెప్టెంబర్ 2020, గురువారం

**హిందూ ధర్మం** 47

 **దశిక రాము**




విద్య: జ్ఞానము కలిగి ఉండడం. అది నిజజీవితంలో ఉపయోగపడేదిగా ఉండాలి. విద్యా నమ్రతను, అణుకువను, వినయమును ఇవ్వాలి. అదే నిజమైన విద్య. మనస్మృతి ప్రకారం ధర్మానికి ఉన్న లక్షణం.


భూమి నుంచి దైవం వరకు, జడపదార్ధం నుంచి విశ్వచైతన్యం వరకు, స్థూలమైన విషయాల నుంచి సూక్ష్మ విషయాల వరకు, భౌతిక జ్ఞానం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం వరకు, సరైనా జ్ఞానాన్ని ఆర్జించడం, సమస్త విషయాయలపైన సరైన అవగాహన ఉండాలి, లేదా తెలుసుకోవాలి. తెలుసుకున్న జ్ఞానం కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు, నిజ జీవితంలో ఉపయోగపడాలి. అటువంటి జ్ఞానమే విద్యా. మరొక విధంగా చెప్పాలాంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం, మనసులో ఉన్న భావాన్ని అచ్చం అలాగే వ్యక్తపరచడం/పలకడం, ఏది మాట్లాడుతున్నామో, అచ్చంగా అదే చేయడం విద్యా అని, దానికి విరుద్ధంగా ఉండడం అవిద్యా అని అన్నారు ఆర్యసమాజ స్థాపకులు దయానంద సరస్వతీ. అంటే ఏ కర్మనైనా త్రికరణశుద్ధిగా చేయించగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది.


(ఆత్మ)తన గురించి తాను తెలుసుకోవడమే విద్య అన్నారు స్వామి చిన్మయానంద. విద్య అనేది జనంలో ఆస్తికతను పెంచాలి తప్ప నాస్తికతను పెంచకూడదు.


మనం ఏం చదువుకున్నామో అది మన జీవితంలో ఉపయోగపడాలి. ఈ రోజు గమనిస్తే, మనం చదివిన చదువుకి, చేసే పనికి ఎంతమాత్రం పోలిక ఉండదు. వేదం అంటుంది కేవలం చదవడమే కాదు, మీరు చదివిన చదువు మీకు మీ జీవితంలో ఉపయోగపడాలి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగపడాలి, మీరు నేర్చుకున్న విద్యతో కొత్త విషయాలను వెలుగులోకి తేవాలి అంటే ముందుగా మీరు నేర్చుకున్న విద్య మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. అది మీ మనసులోకి దట్టించకూడదు, మీకు మీరుగా స్వేచ్చగా తెలుసుకునేంత ఆసక్తిగా ఉండాలి. విద్య మీ సంస్కారాన్ని వృద్ధి చేయాలి, మీ జీవితాన్ని, మీ ద్వారా సమస్త సమాజాన్ని ఉద్ధరించాలి. మీలో స్వార్ధాన్ని తొలగించాలి. మీ ధృక్పదాన్ని మార్చాలి. నేను, నా కుటుంబం అనే భావన నుంచి సమస్త ప్రపంచం నా కుటుంబమే (వసుదైవ కుటుంబకం) అన్న భావన తీసుకురావాలి. విద్య దైవాన్ని దర్శింపజేయాలి. మీలో మీకు తెలియని రహస్యాలను తెలియజేయాలి. మీలో ఉన్న సమస్త శక్తిని బహిర్గతం చేయాలి. ఆత్మ తత్వాన్ని భోధించాలి. అదే నిజమైన విద్య.  


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

https://chat.whatsapp.com/HUn5S1ETDNTG580zg5F9PU


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95


*ధర్మము - సంస్కృతి* గ్రూప్

 ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: