24, సెప్టెంబర్ 2020, గురువారం

🕉️దుర్గా దేవి మహిమ🕉️



🔸దుర్లభమైనది దుర్గ. దుర్గమమైనది దుర్గ. పరమార్ధదృష్టితో చూస్తే ఏది దుర్లభమో, ఏది దుర్గమమో,


 ఆ పరతత్త్వమే దుర్గ. దుర్గా అంటే పరతత్త్వస్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అంతేకాని త్రిశూలం పట్టుకుని రాక్షసులను సంహరించే ఒకానొక స్త్రీమూర్తి మాత్రమే కాదు.


  🔸దుర్గతులను తొలగించునది దుర్గ.


 దుర్గతులు చాలా ఉంటాయి. దుః శబ్దంతో వచ్చేవి దుఃఖం, దుష్టత్వం, దుర్మార్గం, దురాచారం, దురితం మొదలైనవి. సాధించడానికి మహాకష్టమైన దానికి దుస్సాధ్యం అని పేరు. ఇందులో ఏం వచ్చినా భయం వేస్తుంది. వీటన్నింటిని తొలగించే తల్లి కనుక దుర్గా.  


🔸దుర్గానామానికి ఉన్న శక్తిని చెప్తూ సప్తశతిలో "దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా" అంటారు.  


🔸రాక్షస శక్తులు, విఘ్నాలు, సంసారబంధాలు, చెడ్డ పనుల వల్ల కలిగే ఫలితాలు, శోకము, దుఃఖము, నరకము, యమదండన, జన్మ పరంపర, భయాలు, రోగాలు మొత్తం పదకొండు దుర్గతులు.


 వీటన్నింటిని తొలగించేది దుర్గ. ఒక్క నామం అన్నింటికి పెట్టు.  


🔸ఆ తల్లిని ఆశ్రయిస్తే ఇచ్చే ఫలం సంసార సముద్రం నుంచి దాటవేస్తుంది. అంత గొప్పగా ఎవరు దాటించలేరు.


 "సుతర సితరసే నమః" ఈవిడ దాటిస్తే సంపూర్ణంగా దాటిస్తుంది.  


🔸"నమః ప్రతరణాయచ ఉత్తారణాయచ" - ఆ దాటించడం ఒక ఉత్తమ స్థితి నుంచి మరొక ఉత్తమస్థితికి తీసుకువెళ్ళడం ప్రతరణ.


 ఉత్తరణం అంటే మళ్ళీ వెనక్కి రావల్సిన అవసరం లేకుండా మోక్షాన్ని ఇవ్వడం. 


అది దుర్గమ్మ అనుగ్రహం.


శ్రీ మాత్రే నమః

కామెంట్‌లు లేవు: