6, అక్టోబర్ 2020, మంగళవారం

విశ్వనాధాష్టకం

 *ఓం నమః శివాయ:*

*శ్రీవ్యాసమహర్షి కృత శ్రీ విశ్వనాధాష్టకం* 

💫🌞🌎🌙🌟🚩

🕉ఓంశ్రీమాత్రేనమః🕉

అద్వైత చైతన్య జాగృతి

💫🌞🌏🌙🌟🚩

*శ్రీ వ్యాస కృత*

*శ్రీ విశ్వనాథాష్టకం*

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷


*1) గంగా తరంగ రమణీయ జటా కలాపం!*


*గౌరీ నిరంతర విభూషిత వామ భాగం!!*


*నారాయణ ప్రియ మనంగ మదాపహారం!*


*వారాణసీ పురపతిం భజ విశ్వనాథం!!*



*2) వాచామ గోచర మనేక గుణ స్వరూపం!*


*వాగీశ విష్ణు సురసేవిత పాద పీఠం!!*


*వామేణ విగ్రహ వరేణ కళత్రవంతం!*


*వారాణసీ పురపతిం భజ విశ్వనాథం!!*



*3)భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం!*


*వ్యాఘ్రాజినాం బరధరం జటిలం త్రినేత్రం!!*


*పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం!*


*వారాణసీ పురపతిం భజ విశ్వనాథం!!*



*4) సీతాంశు శోభిత కిరీట విరాజమానం!*


*ఫాలేక్షణానల విశేషిత పంచబాణం!!*


*నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం!*


*వారాణసీ పురపతిం భజ విశ్వనాథం!!*



*5)పంచాననం దురిత మత్త మతంగజానాం!*


*నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం!!*


*దావానలం మరణ శోక జరాటవీనాం!*


*వారాణసీ పురపతిం భజ విశ్వనాథం!!*



*6) తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం!*


*ఆనంద కంద మపిరాజిత మప్రమేయం!!*


*నాగాత్మకం సకల నిష్కళ మాత్మరూపం!*


*వారాణసీ పురపతిం భజ విశ్వనాథం!!*



*7) ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం!*


*ఉపేన చింత్య సునివార్య మనస్సమాధౌ!!*


*ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రవేశం!*


*వారాణసీ పురపతిం భజ విశ్వనాథం!!*



*8)రాగాధి దోష రహిత స్వజనానురాగం!*


*వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం!!*


*మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం!*


*వారాణసీ పురపతిం భజ విశ్వనాథం!!*



*9) వారాణసీ పురపతే స్థవనం శివస్య!*


*వ్యాసోత్త మష్టకమిదం పఠతా మనుష్య!!*


*విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం!*


*సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం!!*



*10) విశ్వనాథాష్టక మిదం యః పఠేః శివ సన్నిధౌ!*


*శివలోక మవాప్నోతి శివేన సహమోదతే!!*


🕉🌞🌎🌙🌟🚩


*‘విశ్వనాధాష్టకం:-’*

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

 

*8 శ్లోకాలతో వ్యాసమహర్షి కాశీలోని శ్రీ విశ్వనాథుని స్తుతించాడు,*



 *ఈశ్లోకాలకు యోగపరమైన చక్కని వివరణ*


*1) తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం!*

*ఆనందకందమపరాజిత మప్రమేయం!!*

 

  *నానాత్మకం సకల నిష్కల మాత్మరూపం!*

*వారాణశీ పురపతిం భజ! విశ్వనాధం!!*


*--అన్ని స్తోత్రాలలోకెల్లా ‘ప్రణవం’ వంటి ప్రార్ధనతో పరమగురువైన వ్యాసమహర్షి మనకీ -ప్రార్దన నందిస్తున్నారు. దీనికి --“ఈ విశ్వమంతానిండిన తేజోమయము, ఈకనిపించే స్థావర జంగమాత్మకమైన సృష్టిగా; దేవతల, ఆరాదనా మూర్తుల సగుణ రూపముగా; ఈసృష్టి ఎక్కడ నుండి దిగివస్తుందో అక్కడ అనంతాకాశము వలె తేజోమయమైన పరబ్రహ్మతత్వంగా- ’తానుతప్ప మరేమీలేని అనంతాత్మగా వెలిగేదీ; దానిలో ప్రవేశించిన వారికి పట్టరాని ఆనంద సముద్రమునకు మూలము; సర్వవిజయములకు విజయమైన ఆత్మవిజయము ప్రసాదించే అపరాజితము; అంతులేని ప్రేమస్వరూపమైన, అప్రమేయమైన పరతత్వం; అనేకమైన కళలతో దేవతలు,ఋషులు, అవతారమూర్తులు, జీవులుగా అవతరించే ‘సకలమూ’; సమాధిలో కళా, బిందు, నాదములు ఏకమైన ‘ నిష్కళం ‘; ఆత్మరూపమైన-- అట్టి విశ్వనాధుని వారణాశీ పురపతిని భజింపుము”-- అని అర్ధం.*



*శివ, విష్ణు సాంప్రదాయాల చిక్కులో పడి, ఇది శివుని స్తోత్రమని మాత్రమే భ్రమపడరాదు. క్షర, అక్షర పురుషులకు పరమైన పురుషోత్తముడైన పరతత్వమే ఈ విశ్వానికి ‘నాధుడు‘. ఆయనయే ఆత్మలో జ్యోతిగా, దీపకళికలా వెలిగేవాడు. సర్వాత్మలో ఆత్మయైన పరమాత్మను- హృదయమున ఎవరిని అంతర్యామిగా ధ్యానిస్తే ఆత్మసమాధికలిగి యోగసిద్ది ననుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుండో - అట్టివాడే వారణాశీ అనగా కాశీ పురపతి- కాశీ అను మాటకు ప్రకాశించునది అని అర్దము. ఆత్మయే నేను అన్న తెలివితో ప్రకాశించే వెలుగు. అన్నిటికీ ఈ (నేను) తాను అన్నదే అనుభూతికి ప్రధానము. దీనికి ప్రకాశ స్థానమే ‘కాశీ’. దానికి అనుష్టాన దైవమే వారణాశీపతియైన ‘విశ్వనాధుడు‘. అని రహస్య యోగార్దముతో సాధనకు మార్గాన్ని సూచిస్తూ గురుమూర్తిగా ఈ ప్రార్దనను అనుగ్రహించారు -’వ్యాసమహర్షి’.*




*2)రాగాది దోషరహితం స్వజనానురాగా!*

 *వైరాగ్య శాంతినిలయం గిరిజాసహాయం !!*

 

*మాదుర్య ధైర్య సుభగం గరళాభిరామం!*

*వారాణశీ పురపతిం భజ! విశ్వనాధం!!*


*రాగాది దోష రహితం -అనగా తన పర భేద (దోష ) రహితమైన - నిష్పక్షపాతమైన - ఆత్మ దృష్టితో ప్రకాశించే ప్రజ్ఞ. ’స్వజనానురాగ’ స్వ+జన -- తానే భగవంతుడని ఆత్మలో అనుభవించే ‘ఆత్మభావం ‘ తో సేవించే ఆత్మీయుడు- అనగా మనసుతో, ఆత్మతో తనను పరమాత్మగా భావించేవాడు-- స్వజనుడు. అట్టివారియందు వైరాగ్యంతో శాంతిని ప్రసాదించే మోక్షస్థితి. దానియొక్క అనుభవం అతిమధురంగా ప్రేమమయం. భార్యాపుత్రుల, బంధుమిత్రుల అభిమానంకై వెంపర్లాడే బానిసత్వం కాదని, ధీరుడుగా నిలబడే ఆత్మకి ధైర్య సుబగం. కామం క్రోధం అహంకారం స్వార్ధం అనే గుణాలతో చుట్టబడి ఉండిన ఈవిశాల విశ్వంలో ఉంటూ వేటికీ అంటకుండా ‘గుణములకు అంటని’ వాడు; ఆభరణములవలె విషమును కంఠమున ధరించినవాడు-- అట్టి విశ్వనాథుని పూజింపుము. ‘గరళమును కంఠమున ధరించుట’ అనగా యోగసాధనలో కుండలినీ శక్తి మేల్కొన్నపుడు ఏర్పడే కామక్రోధ ప

కామెంట్‌లు లేవు: