6, అక్టోబర్ 2020, మంగళవారం

శివామృతలహరి


శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||

శివనీయానతిలేక చీమయయినన్ చేజిక్కినన్ గుట్టునే

భవదీయాజ్ఞలులేక యగ్ని దహియింపం గల్గునే?మేఘుడున్

భువి వర్షింపగజాలునే?అనిలుడున్ పూరించునే వాయువుల్

శివశక్త్యాత్మక మీ ప్రపంచ మరయన్ శ్రీ సిద్ధలింగేశ్వరా !


భావం;

శివా! నీ అనుమతి లేకుండా చీమ, తన చేతికి చిక్కినా ఎవ్వరినీ కుట్టలేదు కదా?

నీ ఆజ్ఞ లేకుండా అగ్ని దహించి గలుగుతుందా? మేఘము భూమి మీద వర్షించగలుగుతుందా?

వాయుదేవుడు గాలిని పూరించ గలుగుతాడా?

నీ అనుజ్ఞ లేనిదే ఈ విశ్వంలో ఏ ఒక్క చిన్న పని కూడా సాధ్యం కాదు కదయ్యా!

లోతుగా పరిశీలించి చూస్తే 

ఈ ప్రపంచమంతా శివశక్తి తోనే నిండి ఉంది అని అర్థమవుతోంది స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: