6, అక్టోబర్ 2020, మంగళవారం

పరమాత్మ ప్రభేదములు :

 


పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు పర , వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారములను పేర్లతో అయిదు విధములగా అనుగ్రహించు చున్నాడు.


#పర_స్వరూపము: 


త్రిపాద్విభూతి అనబడు శ్రీవైకుంఠమునందున్న. దివ్యాలయమున దివ్య మహామణిమండపమున శేషశాయియైన నారాయణుడు పరతత్వము. 


ఆ వైకుంఠ ధామము కుముద , కుముదాక్ష , పుండరీక , వామన , శంఖుకర్ణ , సర్పనేత్ర , సుముఖ . సుప్రతిష్ఠాదులచే , దివ్యాయుధ , దివ్యభూషణ , దివ్యపరిజన , దివ్యపరిచ్ఛేదములతో కూడిన నగరపాలకులచే రక్షింపబడుచుండును. అందలి దివ్యాలయము చండ , ప్రచండ , భద్ర , సుభద్ర , జయ , విజయాది ద్వారపాలకుల చేత రక్షితమగు చుండును, త్రిపాద్విభూతి యందలి సింహాసనమునకు ధర్మాది అష్టపాదములుండును. అందలి నారాయణుడు దివ్యమంగళ విశిష్టుడును , చతుర్భుజుడును , శ్రీ భూనీళా సమేతుడును , శంఖ చక్రాది దివ్యాయుధములతో కూడియున్నవాడును , కిరీటాది దివ్య విభూషణము లతో నలంకరింపబడిన వాడును , నిత్యులగు అనంత , గరుడ , విష్వక్సేనాదుల చేత , సామగానము చేయుచున్న ముక్తుల చేత , అనుభవింపబడుచున్నవాడును , షాఢుణ్య , అనంత కళ్యాణ గుణములతో కూడియున్నవాడును , పరబ్రహ్మము , పరవాసుదేవుడు మొదలగు పదములతో చెప్పబడువాడును అయివుండును ".


జయ గోవింద!!

జయ శ్రీమన్నారాయణ!!

కామెంట్‌లు లేవు: