6, అక్టోబర్ 2020, మంగళవారం

రోగములు గురించి సంపూర్ణ వివరణ -

  సాధారణంగా రోగములు ఆగంతక దోషములు అనియు నైసర్గిక దోషములు అని రెండు రకములు . ఆగంతక దోషములు అనగా ఆహారవిహారాదుల లోపముల వలన కలుగు రోగములు , నైసర్గిక దోషములు అనగా పూర్వజన్మలలో చేసిన పాపకర్మముల వలన కలుగు వ్యాధులు . ఈ రెండింటిలో ఆగంతక దోషములకు మందులు సేవించిన తప్పక తగ్గును. జన్మాన్తరముల యందు చేసిన దుష్కర్మల వలన వచ్చు వ్యాధులు కేవలము మందుల వలనే శమించవు. కావున సూర్యనమస్కారములు , రుద్రాభిషేకము , శివసహస్రనామ పారాయణము , గ్రహజపములు, దానములు, శాంతులు, పెద్దలను పూజించుట, అన్నదానము మొదలగునవి చేయుటచే కర్మ కొంతవరకు క్షీణించి ఆ వ్యాధులు చికిత్సకు సాధ్యపడగలవు.


               రోగములు సాధ్యములు , సాధ్యాసాధ్యములు , అసాధ్యములు అనియు మూడు విధములు . సాధ్యము అనగా సులభముగా వ్యాధి తగ్గుటయు , సాధ్యాసాధ్యం అనగా మిక్కిలి శ్రమ మీద వ్యాధి తగ్గుటయు , అసాధ్యం అనగా ఎన్ని శ్రమలు పడినను జీవించకపోవుటయు . కొన్ని రోగములు సులభసాధ్యం అయినప్పటికీ సకాలంలో చికిత్స అందకపోవడం వలన అవి అసాధ్యములుగా మారుచున్నవి.అసాధ్యరోగం అనగా మనుజుని తప్పక చంపునవి అని అర్ధం.


            జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మానవ దేహానికి 120 సంవత్సరములు పరమాయుర్ధాయం అని తెలియచున్నది.మనుష్యునకు బాల్యం, యవ్వన,కౌమారం, వార్ధక్యం అను నాలుగు అవస్థలు కలవు. అందు బాల్యం నందు జ్ఞానవిహీనంచే చేయు హింసాదికృత్యముల వలన కలుగు పాపములు, యవ్వనము నందు స్త్రీలోలత్వం వంటి విషయాల వలన కలుగు పాపములు , కౌమారము నందు డబ్బు మీద ఆశ చేతను,వాణిజ్యాది వ్యాపారముల యందు వంచించుట వలన కలుగు పాపములు , వృద్ధావస్థ యందు తీరని కోరికలగలవాడై లోభ , విచారముల వలన కలుగు పాపములు , మనుజుడు నాలుగు అవస్థల యందు తీరని ఆశామోహ బద్ధుడై అనేక పాపములు చేయుచున్నాడు. ఈ పాపకారణములే అకాల మృత్యువులకు కారణం అగుచున్నవి.


        మనుజునకు సంభవించు మృత్యువులు101 రకాలు . అందులో ఒకటి కాలమృత్యువు.మిగిలిన వందరకాలు అకాలమృత్యువులు. అకాల మృత్యువులు లలో స్త్రీలు, పరిపాలన చేయు రాజు , ఖడ్గములు, వృక్ష,జలాదుల వల్ల , సర్పదష్టాది క్రూరవిషములు ఇవియే అకాల మృత్యువులు అనబడును.అట్టి అకాల మృత్యువులు కూడా చికిత్స,జప,తపహోమాదులు,సూర్యనమస్కారం,అశ్వత్థ ప్రదిక్షణ, అన్నదానాదుల వల్ల తగ్గగలవు అని వేదాలలో ఉన్నది.


            అసాధ్య సన్నిపాతాది ఘోరరోగముల యందు కూడా రోగి ప్రాణములు పోయేంతవరకు కూడా చికిత్స చేయుచునే ఉండవలెను .చికిత్స చేయకుండా ఆపరాదు. కాలగతి ఎవ్వరికి తెలియదు.కావున కంఠము నందు ప్రాణం ఉన్నంతవరకు శాస్త్రబద్ధంగా చికిత్స చేయుచూ ఉండవలెను . వ్యాధులు గ్రహచార దోషముల వలన కూడా కలుగును అని జ్యోతిష్యశాస్త్రం తెలుపుచున్నది. కావున గ్రహశాంతులు చేయించి చికిత్స చేయుట ఉత్తమం.


             చికిత్సలు మూడు రకములుగా ఉండును. అందు మొదటిది శస్త్రములను ఉపయోగించి చేయునది. రెండొవది కషాయములను ఇచ్చుట . మూడు భస్మములను ఉపాయోగించి చికిత్స చేయుట . చికిత్స అనగా శరీరం నందు ఉద్రేకం చెందిన వాతపిత్తకఫాలను ఔషధముల సహాయంతో సమస్థితికి తెచ్చుటనే చికిత్స అందురు. చికిత్సకు నాలుగు అంగములు ఒకటి రోగి , రెండు ఉపచారం చేయువాడు , మూడు ఔషధములు , నాలుగు వైద్యుడు .


           రోగి తెలివి కలిగి భయపడకుండా ఉండటం, తనకున్న బాధలను వైద్యునికి చెప్పకలిగి ఉండటం , వైద్యుడు చెప్పిన విధంగా నడుచుకొనటం రోగి యొక్క విధి.


      పరిచారకుడు రోగి యొక్క అభిప్రాయమును మరియు అవసరమును గుర్తెరిగి మిగుల ప్రేమగలవాడై తగిన ఉపచారములు చేయుట పరిచారకుని విధి.


          ఔషధము మంచిప్రదేశము నందు పుట్టిన సారవంతములు అగు మూలికల చేత క్రమప్రకారం శుద్దులు చేసిన రస, విష, గంధకాదులతోడను , శాస్త్రప్రకారం ,సువాసనయు అందుండు శక్తి చెడకుండా తయారుచేసి సకాలంలో ఇచ్చుచుండవలెను.


               వైద్యుడు శుభ్రత కలవాడై , నిర్మల వస్త్రములను ధరించి భూతదయ కలిగి గురు, దైవభక్తి మనసంతా ఉంచుకొని నిర్మలహృదయుడై వ్యాధులపై సంపూర్ణ అవగాహన ఏర్పరుచుకొని ఔషధమును , పథ్యమును , అనుపానమును యుక్తానుభవముతో తెలుసుకుని వైద్యం చేయుట వైద్యుడి యొక్క విధి.


   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కామెంట్‌లు లేవు: