6, అక్టోబర్ 2020, మంగళవారం

690. *ఓం కోశనాథాయై నమః.🙏*



అనుపమ! *కోశనాథ!* నిగమాంత సువేద్యవు, నీవె కల్గు దే


యనితర రీతి నన్నిట, ప్రియంబున మమ్ము రహింపఁ జేయు ని 


న్ననయము చిత్తమందు పరమార్థమునెంచి భజింతుమమ్మ ! వం


దనములు స్వీకరింపుమ. ముదంబున మా మదులందు వెల్గుమా.🙏


అమ్మ పాదములకు నమస్కరించుచు🙏

చింతా రామకృష్ణారావు.


అమ్మకు నమస్కరించుచు

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: