11, నవంబర్ 2020, బుధవారం

నారాయణాయ

🌺 *ఓం నమో నారాయణాయ* 

*101. వినుండు సకల జన్మంబు లందును ధర్మార్థాచరణ కారణం బయిన మానుషజన్మంబు దుర్లభం; బందుఁ బురుషత్వంబు దుర్గమం; బదియు శతవర్షపరిమితం బైన జీవితకాలంబున నియతంబై యుండు; నందు సగ మంధకారబంధురం బయి రాత్రి రూపంబున నిద్రాది వ్యవహారంబుల నిరర్థకంబయి చను; చిక్కిన పంచాశద్వత్సరంబు లందును బాల కైశోర కౌమారాది వయోవిశేషంబుల వింశతి హాయనంబులు గడచు; కడమ ముప్పది యబ్దంబులు నింద్రియంబుల చేతఁ బట్టుపడి దురవగాహంబు లయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబులను పాశంబులం గట్టుపడి విడివడ సమర్థుండు గాక ప్రాణంబులకంటె మధురాయమాన యైన తృష్ణకు లోనై భృత్య తస్కర వణిక్కర్మంబులఁ బ్రాణహాని యైన నంగీకరించి పరార్థంబుల నర్థించుచు, రహస్యసంభోగచాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికా లవిత్రంబు లయిన కళత్రంబులను, మహనీయ మంజుల మధురాలాపంబులు గలిగి వశులయిన శిశువులను, శీలవయోరూపధన్య లగు కన్యలను, వినయ వివేక విద్యాలంకారు లయిన కుమారులను, గామిత ఫలప్రదాతలగు భ్రాతలను, మమత్వ ప్రేమ దైన్య జనకు లయిన జననీజనకులను, సకల సౌజన్య సింధువు లయిన బంధువులను, ధన కనక వస్తు వాహన సుందరంబు లయిన మందిరంబులను, సుకరంబు లైన పశు భృత్య నికరంబులను, వంశపరంపరాయత్తంబు లయిన విత్తంబులను వర్జింపలేక, సంసారంబు నిర్జించు నుపాయంబుఁ గానక, తంతువర్గంబున నిర్గమద్వారశూన్యం బయిన మందిరంబుఁ జేరి చుట్టుపడి వెడలెడి పాటవంబు చాలక తగులుపడు కీటకంబు చందంబున గృహస్థుండు స్వయంకృతకర్మ బద్ధుండై శిశ్నోదరాది సుఖంబుల బ్రమత్తుండయి నిజకుటుంబపోషణ పారవశ్యంబున విరక్తిమార్గంబు దెలియనేరక, స్వకీయ పరకీయ భిన్నభావంబున నంధకారంబునం బ్రవేశించుం; గావునఁ గౌమార సమయంబున మనీషా గరిష్ఠుండై పరమ భాగవతధర్మంబు లనుష్ఠింప వలయు; దుఃఖంబులు వాంఛితంబులు గాక చేకుఱుభంగి సుఖంబులును గాలానుసారంబులై లబ్ధంబు లగుం; గావున వృథాప్రయాసంబున నాయుర్వ్యయంబు జేయం జనదు; హరిభజనంబున మోక్షంబు సిద్ధించు; విష్ణుండు సర్వభూతంబులకు నాత్మేశ్వరుండు ప్రియుండు; ముముక్షువైన దేహికి దేహావసానపర్యంతంబు నారాయణచరణారవింద సేవనంబు కర్తవ్యంబు.*

*భావము:-* ఇంకా వినండి. అన్ని జన్మలలోనూ ధర్మాలు ఆచరించగల మానవ జన్మ పొందడం చాలా కష్టం. అందులో పురుషుడుగా పుట్టడం ఇంకా కష్టం. మానవులకు ఆయుర్దాయం వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దానిలో సగం అంటే ఏభై సంవత్సరాలు చీకటి నిండిన రాత్రి కావటం వలన నిద్ర మున్నగు వాటితో గడచిపోతుంది. పసివాడిగా, బాలుడుగా ఇరవై సంవత్సరాలు వ్యయమౌతాయి. మిగిలిన ముప్పై సంవత్సరాలు ఇంద్రియసుఖాలకు మానవుడు వశమై పోయి ఉంటాడు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అనే, జీవుల పాలిటి భయంకర శత్రువులు ఆరింటిని అరిషడ్వర్గాలు అంటారు. ఈ అరిషడ్వర్గాల బంధాలలో చిక్కుకొని బయటకు రాలేక మానవుడు గింజుకుంటూ ఉంటాడు; జీవుడు తన ప్రాణం కంటె తియ్యగా అనిపించే ఆశ అనే పాశానికి దాసుడు అవుతాడు; ఈ కోరికల కారణంగా ఇతరుల ధనం ఆశిస్తూ ఉంటాడు; ఆ ధనం కోసం ఉద్యోగం, దొంగతనం, వ్యాపారం మున్నగు వృత్తులలో పడి ప్రాణం పోగొట్టుకోడానికి అయినా సిద్ధపడతాడు; అక్రమ సంబంధం, సౌఖ్యం పొందే చాతుర్యం, విశేషమైన అందాలు కోరుకుంటాడు; కాళ్లకు బంధాలు వేసే కట్టుకున్న భార్యలూ, జిలిబిలి పలుకులతో ఆనందింపజేస్తూ చెప్పిన మాట వినే తన శిశువులూ, మంచి నడతలు యౌవనం అందచందాలు కల కుమార్తెలూ, వినయ వివేకాలు కల విద్యావంతులు అయిన కొడుకులూ, కోరిన సహకారాలు అన్నీ అందించే సోదరులూ, ప్రేమానురాగలతో జాలిగోలిపే తల్లిదండ్రులూ, అన్నివిధాలా మంచిగా మెలిగే బంధువులూ, ఈ విధమైన రకరకాల బంధాలలో చిక్కుకుంటాడు. ఈ బంధాలను; డబ్బు, బంగారం, ఉపకరణాలు, వాహనాలు మొదలైన సౌకర్యాలను; పశువులు, సేవకులు మున్నగు సంపదలను; ఇంకా తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న ఆస్తులను వదలిపెట్టలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. సాలీడు గూటిలో చిక్కుకున్న చిన్న పురుగు ఎంత తన్నుకున్నా బయట పడలేదు. అలాగే ఈ సంసార పాశాలలో చిక్కుకున్న మానవుడు విడివడలేడు. తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు; కామం సౌఖ్యాదుల మత్తులో పడి, తన కుటుంబాన్ని పోషించడంలో నిమగ్నుడై ముక్తి మార్గాన్ని మరచిపోతాడు; తాను వేరు, మిగతా వారు వేరు అనే ద్వైత భావంతో చీకట్లో పడతాడు; అందుకనే, చిన్నప్పుడే కౌమార వయసునుండే బుద్ధిబలంతో పూర్తి భగవద్భక్తి, ధర్మాలను ఆచరించాలి. దుఃఖాలు కోరకుండానే వస్తాయి. అలాగే సుఖాలు కూడ ఆ సమయం వచ్చినప్పుడు అవే వస్తాయి. కనుక, మానవుడు వాటికోసం ఎంతో విలువైన తన జీవితకాలాన్ని వృథా చేసుకోకూడదు. విష్ణు భక్తి వలన మోక్షం లభిస్తుంది. సకల ప్రాణికోటికి శ్రీహరే ఆత్మీయుడు, పరమాత్మ, పరమేశ్వరుడు. ముక్తి కోరుకునే వాడికి జీవితాతం వరకు, ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించడం మాత్రమే చేయదగిన పని.:

 🌺*ఓం నమో నారాయణాయ* 🌺

*101. వినుండు సకల జన్మంబు లందును ధర్మార్థాచరణ కారణం బయిన మానుషజన్మంబు దుర్లభం; బందుఁ బురుషత్వంబు దుర్గమం; బదియు శతవర్షపరిమితం బైన జీవితకాలంబున నియతంబై యుండు; నందు సగ మంధకారబంధురం బయి రాత్రి రూపంబున నిద్రాది వ్యవహారంబుల నిరర్థకంబయి చను; చిక్కిన పంచాశద్వత్సరంబు లందును బాల కైశోర కౌమారాది వయోవిశేషంబుల వింశతి హాయనంబులు గడచు; కడమ ముప్పది యబ్దంబులు నింద్రియంబుల చేతఁ బట్టుపడి దురవగాహంబు లయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబులను పాశంబులం గట్టుపడి విడివడ సమర్థుండు గాక ప్రాణంబులకంటె మధురాయమాన యైన తృష్ణకు లోనై భృత్య తస్కర వణిక్కర్మంబులఁ బ్రాణహాని యైన నంగీకరించి పరార్థంబుల నర్థించుచు, రహస్యసంభోగచాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికా లవిత్రంబు లయిన కళత్రంబులను, మహనీయ మంజుల మధురాలాపంబులు గలిగి వశులయిన శిశువులను, శీలవయోరూపధన్య లగు కన్యలను, వినయ వివేక విద్యాలంకారు లయిన కుమారులను, గామిత ఫలప్రదాతలగు భ్రాతలను, మమత్వ ప్రేమ దైన్య జనకు లయిన జననీజనకులను, సకల సౌజన్య సింధువు లయిన బంధువులను, ధన కనక వస్తు వాహన సుందరంబు లయిన మందిరంబులను, సుకరంబు లైన పశు భృత్య నికరంబులను, వంశపరంపరాయత్తంబు లయిన విత్తంబులను వర్జింపలేక, సంసారంబు నిర్జించు నుపాయంబుఁ గానక, తంతువర్గంబున నిర్గమద్వారశూన్యం బయిన మందిరంబుఁ జేరి చుట్టుపడి వెడలెడి పాటవంబు చాలక తగులుపడు కీటకంబు చందంబున గృహస్థుండు స్వయంకృతకర్మ బద్ధుండై శిశ్నోదరాది సుఖంబుల బ్రమత్తుండయి నిజకుటుంబపోషణ పారవశ్యంబున విరక్తిమార్గంబు దెలియనేరక, స్వకీయ పరకీయ భిన్నభావంబున నంధకారంబునం బ్రవేశించుం; గావునఁ గౌమార సమయంబున మనీషా గరిష్ఠుండై పరమ భాగవతధర్మంబు లనుష్ఠింప వలయు; దుఃఖంబులు వాంఛితంబులు గాక చేకుఱుభంగి సుఖంబులును గాలానుసారంబులై లబ్ధంబు లగుం; గావున వృథాప్రయాసంబున నాయుర్వ్యయంబు జేయం జనదు; హరిభజనంబున మోక్షంబు సిద్ధించు; విష్ణుండు సర్వభూతంబులకు నాత్మేశ్వరుండు ప్రియుండు; ముముక్షువైన దేహికి దేహావసానపర్యంతంబు నారాయణచరణారవింద సేవనంబు కర్తవ్యంబు.*

*భావము:-* ఇంకా వినండి. అన్ని జన్మలలోనూ ధర్మాలు ఆచరించగల మానవ జన్మ పొందడం చాలా కష్టం. అందులో పురుషుడుగా పుట్టడం ఇంకా కష్టం. మానవులకు ఆయుర్దాయం వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దానిలో సగం అంటే ఏభై సంవత్సరాలు చీకటి నిండిన రాత్రి కావటం వలన నిద్ర మున్నగు వాటితో గడచిపోతుంది. పసివాడిగా, బాలుడుగా ఇరవై సంవత్సరాలు వ్యయమౌతాయి. మిగిలిన ముప్పై సంవత్సరాలు ఇంద్రియసుఖాలకు మానవుడు వశమై పోయి ఉంటాడు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అనే, జీవుల పాలిటి భయంకర శత్రువులు ఆరింటిని అరిషడ్వర్గాలు అంటారు. ఈ అరిషడ్వర్గాల బంధాలలో చిక్కుకొని బయటకు రాలేక మానవుడు గింజుకుంటూ ఉంటాడు; జీవుడు తన ప్రాణం కంటె తియ్యగా అనిపించే ఆశ అనే పాశానికి దాసుడు అవుతాడు; ఈ కోరికల కారణంగా ఇతరుల ధనం ఆశిస్తూ ఉంటాడు; ఆ ధనం కోసం ఉద్యోగం, దొంగతనం, వ్యాపారం మున్నగు వృత్తులలో పడి ప్రాణం పోగొట్టుకోడానికి అయినా సిద్ధపడతాడు; అక్రమ సంబంధం, సౌఖ్యం పొందే చాతుర్యం, విశేషమైన అందాలు కోరుకుంటాడు; కాళ్లకు బంధాలు వేసే కట్టుకున్న భార్యలూ, జిలిబిలి పలుకులతో ఆనందింపజేస్తూ చెప్పిన మాట వినే తన శిశువులూ, మంచి నడతలు యౌవనం అందచందాలు కల కుమార్తెలూ, వినయ వివేకాలు కల విద్యావంతులు అయిన కొడుకులూ, కోరిన సహకారాలు అన్నీ అందించే సోదరులూ, ప్రేమానురాగలతో జాలిగోలిపే తల్లిదండ్రులూ, అన్నివిధాలా మంచిగా మెలిగే బంధువులూ, ఈ విధమైన రకరకాల బంధాలలో చిక్కుకుంటాడు. ఈ బంధాలను; డబ్బు, బంగారం, ఉపకరణాలు, వాహనాలు మొదలైన సౌకర్యాలను; పశువులు, సేవకులు మున్నగు సంపదలను; ఇంకా తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న ఆస్తులను వదలిపెట్టలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. సాలీడు గూటిలో చిక్కుకున్న చిన్న పురుగు ఎంత తన్నుకున్నా బయట పడలేదు. అలాగే ఈ సంసార పాశాలలో చిక్కుకున్న మానవుడు విడివడలేడు. తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు; కామం సౌఖ్యాదుల మత్తులో పడి, తన కుటుంబాన్ని పోషించడంలో నిమగ్నుడై ముక్తి మార్గాన్ని మరచిపోతాడు; తాను వేరు, మిగతా వారు వేరు అనే ద్వైత భావంతో చీకట్లో పడతాడు; అందుకనే, చిన్నప్పుడే కౌమార వయసునుండే బుద్ధిబలంతో పూర్తి భగవద్భక్తి, ధర్మాలను ఆచరించాలి. దుఃఖాలు కోరకుండానే వస్తాయి. అలాగే సుఖాలు కూడ ఆ సమయం వచ్చినప్పుడు అవే వస్తాయి. కనుక, మానవుడు వాటికోసం ఎంతో విలువైన తన జీవితకాలాన్ని వృథా చేసుకోకూడదు. విష్ణు భక్తి వలన మోక్షం లభిస్తుంది. సకల ప్రాణికోటికి శ్రీహరే ఆత్మీయుడు, పరమాత్మ, పరమేశ్వరుడు. ముక్తి కోరుకునే వాడికి జీవితాతం వరకు, ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించడం మాత్రమే చేయదగిన పని.

కామెంట్‌లు లేవు: