11, నవంబర్ 2020, బుధవారం

దగ్గు, జలుబు పడిశం, జ్వరం కు ఆయుర్వేద మందులు

 దగ్గు, జలుబు పడిశం, జ్వరం కు ఆయుర్వేద మందులు. 

ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో చాలామందికి సాధారణంగా దగ్గు, జలుబు పడిశం, జ్వరం వస్తూవుండటం సహజం. మనం డాక్టరు దగ్గరకు వెళితే ఒక పారసెటామోల్ టాబులెటు, ఒక అంటి బైటికి క్యాప్సూలు, ఒక కాఫ్ సీరపు వ్రాసి పంపిస్తాడు. నిజానికి ఈ మందులు మనకు రోగాన్ని తగ్గించటం అటుంచి వాటి వల్ల వచ్చే సైడు ఎఫెక్టులు చాలా ఉంటాయి. ఇప్పుడు మనకు అల్లోపతి మందులు సాంప్రదాయ మందులు ఆయుర్వేద, హోమియో , యునాని మందులు సాంప్రదాయేతర మందులుగా అయ్యాయి. నేను అందరికి చెప్పదల్చుకునేది ఏమనగా మనం సాధ్యమైనంత వరకు అల్లోపతి మందులకు దూరంగా ఉంటే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు. నా మాట మీకు కొంత కఠినంగా ఉండవచ్చు కానీ ఇది యదార్ధం. పారాసెటామోల్ మాత్రలు ఎక్కువగా తీసుకుంటే అవి జీర్ణాశయం మీద తదుపరి కిడ్నీల మీద ప్రభావం చూపి వాటి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇక అంటి బయటికులు ఇవి మన శరీరంలో వుండే బి కాంప్లెక్ విటిమినును పూర్తిగా మింగి కాళ్ళ తీపులుతో మొదలై తరువాత, జీర్ణాశయం మీద మరియు కిడ్నీల మీద దుషు ప్రభావం చూపుతాయి. మనిషి శరీరాన్ని బలహీన పరుస్తాయి. ఎక్కువగా వాడితే శరీరంలో రోగ నిరోధకత తగ్గుతుంది. ఇక దగ్గు తగ్గ్గటానికి ఇచ్చే కాఫ్ సీరపు. ప్రతి దానిలో కూడా వుండే రసాయనిక పదార్ధాలు శరీరాన్ని బలహీన పరచటమే కాకుండా నిద్ర మత్తుని కలిగిస్తాయి. అందుకే డాక్టర్లు కప్ సిరప్ త్రాగిన తరువాత డ్రైవింగ్ చేయవద్దని అంటారు. ఇవ్వని తెలుసుకుంటే మనకు అల్లోపతి మందులు సురక్షితం కాదని తెలుస్తుంది. 

ఇక ఆయుర్వేద మందుల విషయానికి వద్దాము. ముందుగా దగ్గు. దగ్గులో రెండు రకాలు వున్నాయి ఒకటి పొడి దగ్గు. ఈ దగ్గుకి సీతాఫలాది చూర్ణము చక్కటి మందు. ఈ మందు పొడి రూపంలో ఉంటుంది. ఈ పొడిని తేనెలో రంగరించుకొని తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. 

ఇక రెండో రకం దగ్గు శ్లేష్మంతో కూడుకొన్నది. ఈ దగ్గులో కంఠంలో శ్లేష్మం వుంది ముక్కు పూసుకొని జలుబుతో ఉంటుంది. దీనికి చక్కటి మందు (Talisadi Churna) తలిసాది చూర్ణం. ఈ మందు కూడా పొడి రూపంలో లభిస్తుంది. దీనిని కూడా తేనెలో రంగరించి సేవించిన శ్లేష్మంతో కూడిన దగ్గు, జ్వరంలో చక్కటి గుణం కనిపిస్తుంది. 

ఈ రెండు మందులు కూడా అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. పతంజలి, డాబర్, జాన్దు, బైద్యనాడు, మీరు ఏ కంపెనీ మందునైన కొనవచ్చును. పతంజలి మందులు కొంచం తక్కువ ధరకు లభిస్తాయి. 

ఇక పతంజలి వారి శ్వాసారి రస్ అనే మందు ద్రవ రూపంలోనూ, పొడి రూపంలోనూ లభిస్తుంది. ఇది ఒక మంచి కాఫ్ శిరుపులాగా పనిచేసి పడిశాన్ని తొందరగా వదిలిస్తుంది. 

పైన పేర్కొన్న మందులు ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవటం మంచిదని నా అభిప్రాయం. తక్కువ ఖర్చుతో మీరు దగ్గు, జలుబు, సాధారణ జ్వరాన్ని సత్వరంగా నివారించుకోవచ్చు. మరొక ఆయుర్వేద మందుతో మళ్ళి కలుద్దాము. 

మీ భార్గవ శర్మ. 

ఓం తత్సత్ 

సర్వే జానా సుఖినోభవందు. 

కామెంట్‌లు లేవు: