14, సెప్టెంబర్ 2020, సోమవారం

పోత‌న త‌ల‌పులో ...(.52)


                 ****
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై."

               ****
ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను."
అంటూ,భీష్మ‌పితామ‌హుడు, శ్రీకృష్ణపరమాత్మను హృదయంలో పదిలపరచుకొని; వాసుదేవునిలో ఐక్యమైయ్యాడు.
🏵️పోత‌న‌ప‌ద్యం🏵️
  🏵️మోక్ష ప్రదం🏵️

కామెంట్‌లు లేవు: